కీలకమైన భూసేకరణ బిల్లుకు బుధవారం రాజ్యసభలో ఆమోదం లభించింది. ఇకపై ఏర్పాటు కానున్న అన్ని ప్రత్యేక ఆర్థిక మండలాలకు ఇందులోని నిబంధనలు వర్తించనున్నాయి.
న్యూఢిల్లీ: కీలకమైన భూసేకరణ బిల్లుకు బుధవారం రాజ్యసభలో ఆమోదం లభించింది. ఇకపై ఏర్పాటు కానున్న అన్ని ప్రత్యేక ఆర్థిక మండలాలకు ఇందులోని నిబంధనలు వర్తించనున్నాయి. లోక్‌సభలో ఇటీవల ఆమోదం పొందిన ఈ బిల్లుపై రాజ్యసభలో జరిగిన ఓటింగులో 131 ఓట్లు అనుకూలంగా, 10 ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. విపక్షాలు ప్రతిపాదించిన నాలుగు అధికారిక సవరణలను కూడా రాజ్యసభ ఆమోదించింది. కొత్తగా చేర్చిన సవరణల ఆమోదం కోసం దీనిని తిరిగి లోక్‌సభకు పంపనున్నారు.