కీలక రెపో రేట్ లో కోత | RBI cut the short-term lending rate, or repo rate, by 25 basis points to 6.25% from 6.50% earlier | Sakshi
Sakshi News home page

కీలక రెపో రేట్ లో కోత

Published Tue, Oct 4 2016 2:42 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

కీలక రెపో రేట్ లో  కోత

కీలక రెపో రేట్ లో కోత

ముంబై:  రిజర్వుబ్యాంకు ఆఫ్‌ ఇండియా  2016-17 నాల్గవ ద్వైమాసిక పరపతి విధాన సమీక్షలో  కీలక వడ్డీరేట్లలోకోత పెట్టింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ తన  డెబ్యూ పాలసీ  సమీక్షలో లో కీలక  రెపో రేటులో కోత పెట్టారు. రెపో (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) 25  బేసిస్ పాయింట్లను తగ్గించారు.  ప్రస్తుతం ఉన్న 6.50 శాతంనుంచి  6.25 గా నిర్ణయించారు. ఆర్బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ కు తన మొట్టమొదటి పాలసీ రివ్యూలో మ్యాజిక్ చేశారు.  మంగళవారం ప్రకటించిన ద్రవ్యపరపతి విధానం సమీక్ష తో వడ్డీ రేట్లు  ఆరేళ్ల కనిష్ట  స్థాయికి  దిగి వచ్చాయి.

ఈ దఫా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అత్యున్నత స్థాయి కమిటీ- ఎంపీసీ  తొలిసారిగా కీలక వడ్డీ రేట్లను నిర్ణయం చేసింది. ఆరుగురు  సభ్యులు వడ్డీ రేట్ల కోతకు  ఆమోదం తెలిపారు.  కాగా ఆర్ బీఐ గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ కు  కూడా ఇది మొదటి పరపతి విధాన సమీక్ష కానుండటం విశేషం.  ప్రభుత్వం తరఫున కమిటీలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ చేతన్ ఘాటే, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ డెరైక్టర్ పామి దువా, ఐఐఎం- అహ్మదాబాద్‌లో ప్రొఫెసర్ రవీంద్ర హెచ్ ధోలాకియాతో పాటు కమిటీలో ఆర్‌బీఐ తరఫున ముగ్గురు నామినీలు కలిసి మొత్తం ఆరుగురు వ్యక్తులు కమిటీ సభ్యులుగా  ఉన్నసంగతి  తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement