సాధారణంగా ఒక్కనెల జీతం ఆలస్యమైతేనే ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడతారు.
చోడవరం(విశాఖపట్టణం జిల్లా): సాధారణంగా ఒక్కనెల జీతం ఆలస్యమైతేనే ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడతారు. మరి అలాంటిది ఏడాది నుంచి జీతం అందకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఈ సంఘటన విశాఖ జిల్లా చోడవరం మండలం కేంద్రంలో వెలుగుచూసింది.
చోడవరం మండల పంచాయతీలో పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ఏడాదిగా జీతాలు ఇవ్వడంలేదు. దీంతో ఆగ్రహించిన ఉద్యోగులు బుధవారం పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగారు. వెంటనే జీతాలు చెల్లించాలనీ వారు డిమాండ్ చేశారు. కార్మికుల ఆందోళనకు సీపీఐ మద్ధతు ప్రకటించింది.