
'శశికళను మేమే బహిష్కరిస్తున్నాం'
తమపై చర్యలు తీసుకునే అధికారం శశికళ నటరాజన్ కు లేదని సీనియర్ నాయకుడు మధుసూదనన్ అన్నారు.
చెన్నై: తమపై చర్యలు తీసుకునే అధికారం శశికళ నటరాజన్ కు లేదని అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన సీనియర్ నాయకుడు మధుసూదనన్ అన్నారు. శశికళను తామే పార్టీ బహిష్కస్తున్నామని చెప్పారు. పార్టీలో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పదవే లేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కొత్త ప్రధాన కార్యదర్శి పదవికి త్వరలో ఎన్నిక నిర్వహిస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి ఎవరో కేడర్ తేలుస్తుందని పేర్కొన్నారు.
పొయేస్ గార్డెన్ లోని 'అమ్మ' వేద నిలయం ప్రజల ఆస్తి అని చెప్పారు. వేద నిలయంలో తిష్టవేసిన వారిని వెళ్లగొట్టేందుకు 2 రోజుల్లో అక్కడకు వెళ్లనున్నట్టు మధుసూదన్ వెల్లడించారు. పన్నీర్ సెల్వం గూటికి చేరిన మధుసూదన్ ను ప్రిసీడియం చైర్మన్ పదవితో పాటు పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తున్నట్టు శశికళ అంతకుముందు ప్రకటించారు.