![ముఫ్తీ మహ్మద్ సయీద్(ఫైల్) - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/3/41425220833_625x300.jpg.webp?itok=4kQOn7Dp)
ముఫ్తీ మహ్మద్ సయీద్(ఫైల్)
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయీద్(79) తన నివాసంలో గురువారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన హుటాహుటిన రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విమానంలో ఢిల్లీకి తరలించారు.
జాతీయ వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్)లో ఆయనను చేర్చినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. జమ్మూకశ్మీర్ లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడంతో మార్చిలో ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు.