టాటా గ్రూపునకు ఊరట
న్యూఢిల్లీ: టాటా మిస్త్రీ వివాదంలో తంటాలు పడుతున్న టాటా గ్రూపునకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. టాటా గ్రూప్‌నకు చెందిన ఇండియన్ హోటల్స్ కు చెందిన ప్రతిష్ఠాత్మక తాజ్ మాన్సింగ్ హోటల్ వేలం ప్రక్రియలో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. తాజ్ మాన్సింగ్ హోటల్ వేలాన్ని అడ్డుకోవాలన్న ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సిఎల్). పిటీషన్ ను విచారించిన న్యాయమూర్తులు పీసీ ఘోష్, యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది.. ఎన్డీఎంసీ (న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ) పిటీషన్ ను తిరస్కరించిన కోర్టు అత్యద్భతమైన ఈ ప్రాచీన హోటెల్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. నడుస్తున్న హోటల్ కు సంబంధించి తాజా బుకింగ్స్ అడ్డుకోవడం కష్టమని, సంయమని పాటించాలని పేర్కొంది. తదుపరి వాదనల సందర్భంగా దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను జనవరి రెండో వారానికి వేసింది
కాగా ఢిల్లీలోని మాన్‌సింగ్ రోడ్డులో అత్యంత కీలకమైన ప్రాంతంలో ఇండియన్ హోటల్స్‌కు ఎన్‌డీఎంసీ 33 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ఈ గడువు 2011తో ముగిసింది. తదుపరి 9 సార్లు లీజును పొడిగించారు. ఈ వివాదంలో ఈ హెటెల్ వేలానికి ఎన్‌డీఎంసీ నిర్ణయించింది. అయితే దీన్ని నిలిపి వేయాలని కోరుతూ 2013 ఏప్రిల్‌లో ఢిల్లీ హైకోర్టులో ఇండియన్ హోటల్స్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు నవంబర్ 8న కొట్టివేసింది. దీనిపై ఇండియన్ హెటల్స్ సుప్రీంను ఆశ్రయించింది.