నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
Published Mon, Oct 28 2013 4:14 PM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM
రిజర్వు బ్యాంక్ త్రైమాసిక పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాలతో ముగిసాయి. సోమవారం నాటి మార్కెట్ లో ఆరంభంలో సెన్సెక్స్, నిఫ్టీలు సాధించిన లాభాలు మధ్యాహ్నాని కల్లా ఆవిరైపోయాయి. ఎఫ్ఎమ్ సీజీ, బ్యాంక్, మెటల్ రంగాల షేర్లు తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి.
సెన్సెక్స్ ఓ దశలో 20774 పాయింట్ల గరిష్టస్థాయిని నమోదు చేసుకుంది. మార్కెట్ చివర్లో 113 పాయింట్ల నష్టంతో 20570 పాయింట్ల వద్ద, నిఫ్టీ 44 పాయింట్లు కోల్పోయి 6101 వద్ద ముగిసాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ ను పోల్చితే రూపాయి ప్రారంభంలో సాధించిన లాభాలను నిలబెట్టుకోలేక 4 పైసలు కోల్పోయి 61.50 వద్ద ట్రేడ్ అవుతోంది.
జయప్రకాశ్ అసోసియేట్స్ అత్యధికంగా 5.58 శాతం కోల్పోగా, బ్యాంక్ ఆఫ్ బరోడా 4.25, ఐటీసీ 3.56, పీఎన్ బీ 3.37, డీఎల్ఎఫ్ 3.33 శాతం నష్టపోయాయి. లార్సెన్, హెచ్ డీఎఫ్ సీ, ఓఎన్ జీసీ, విప్రో, కొటాక్ మహేంద్ర కంపెనీలు స్వల్ప లాభాల్ని నమోదు చేసుకున్నాయి.
Advertisement