దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. చివరికి సెన్సెక్స్ 84 పాయింట్ల నష్టంతో 26519 వద్ద , నిఫ్టీ 29 పాయింట్ల నష్
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అంచనాలకు అనుగుణంగానుఏ అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును చేపట్టడంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య సాగాయి. ఫెడ్ వడ్డీ రేటును పావు శాతం పెంచడంతోపాటు ఇకపై రెండేళ్లపాటు ఏడాదికి కనీసం మూడుసార్లు రేట్లను పెంచే వీలున్నట్లు సంకేతమివ్వడంతో ఇన్వెస్టర్లు భారీ అమ్మకాలకు దిగారు. చివరికి సెన్సెక్స్ 84 పాయింట్ల నష్టంతో 26519 వద్ద , నిఫ్టీ 29 పాయింట్ల నష్టంతో 8,154 వద్ద స్థిరపడింది. ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్ స్వల్ప లాభాల్లోనూ, ఫార్మా,ఎఫ్‌ఎంసీజీ నష్టాల్లోనూ ముగిశాయి. టీసీఎస్ టాప్ విన్నర్ గా సన్ ఫార్మా టాటా మోటార్స్ టాప్ లూజర్స్ గా నిలిచాయి. ఎన్‌టీపీసీ, గ్రాసిమ్, అంబుజా, బాష్, అల్ట్రాటెక్, ఐటీసీ, ఇన్ఫ్రాటెల్ బలహీనంగానూ యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, ఓఎన్‌జీసీ, ఇండస్‌ఇండ్, ఎంఅండ్ఎం, బీవోబీ, హెచ్‌సీఎల్ టెక్, స్టేట్‌బ్యాంక్ లాభాల్లోనూ క్లోజ్ అయ్యాయి.
అటు డాలర్ మారకపు రేటులో రూపాయి 39 పైసలు నష్టపోయి రూ. 67.84 వద్ద ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్ లో పుత్తడి పది గ్రా. 552 క్షీణించి రూ.27,035 వద్ద బలహీనంగా ఉంది.