'ఏ పదవిపైనా వ్యామోహం లేదు' | Sharad Pawar out of race for CM's post, won't take any post of power | Sakshi
Sakshi News home page

'ఏ పదవిపైనా వ్యామోహం లేదు'

Published Sun, Oct 12 2014 8:38 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

'ఏ పదవిపైనా వ్యామోహం లేదు' - Sakshi

'ఏ పదవిపైనా వ్యామోహం లేదు'

ముంబై: తనకు ఎటువంటి పదవులు పైనా వ్యామోహం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. రాబోవు రెండు సంవత్సరాల్లో తనకు 75 సంవత్సరాలు నిండుతాయని.. ఇప్పటికే అనేక పదవులు చేసిన తనకు వాటిపై ఎటువంటి మమకారం లేదన్నారు. తాను ప్రజాజీవితంలో ఒక సలహాదారునిగా ఉండాలనుకుంటున్నానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

 

రాజకీయాల్లోకి 48వ సంవత్సరంలో అడుగుపెట్టిన తాను 25 ఏళ్లు వాటితోనే గడిపానన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల అనంతరం సీఎం బాధ్యతలు స్వీకరించాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన మీడియాతో పై విధంగా స్పందించారు.  గత సంవత్సరమే రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యానని.. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీ చేస్తున్నా.. అధికారాన్ని చేపట్టాడానికి తాను సిద్ధంగా లేనన్నారు. తమ పార్టీ అత్యధిక సీట్లు గెలవడంపైనే మాత్రమే దృష్టి పెట్టిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement