మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీహార్లోని ముంగేర్ జిల్లాలో ఆరుగురు మావోయిస్టులను అరెస్టు చేసి, భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ముందుగా అందిన సమాచారంతో పోలీసులు, సీఆర్పీఎఫ్ సిబ్బందితో కూడిన ఓ ప్రత్యేక బృందం భీంబంద్ అడవుల్లో కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించింది. అక్కడున్న ఆరుగురు మావోయిస్టులను అరెస్టు చేసి ఆయుధాలు, 200 బుల్లెట్లు, 50 డిటొనేటర్లు, ఒక ఇన్సాస్ రైఫిల్ స్వాధీనం చేసుకున్నట్లు డీఐజీ సుధాంశు కుమార్ తెలిపారు.
పేలుడు పదార్థాల తయారీకి సంబంధించిన సామగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. గతనెలలో కూడా పొరుగున ఉన్న జముయ్ జిల్లాలో భద్రతా దళాలు నిర్వహించిన సోదాలలో 70 హేండ్ గ్రెనేడ్లు, 25 మందుపాతరలు, ఇతర పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు జిల్లాలు మావోయిస్టులకు గట్టి పట్టున్న జిల్లాలు.
ఆరుగురు మావోయిస్టుల అరెస్టు
Published Tue, Feb 4 2014 5:02 PM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement