ఫేస్‌బుక్‌లో 15 లక్షల ఎస్‌ఎంబీలు | SMB 15 million in Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో 15 లక్షల ఎస్‌ఎంబీలు

Published Thu, Apr 30 2015 12:46 AM | Last Updated on Fri, Jul 27 2018 12:33 PM

SMB 15 million in Facebook

న్యూఢిల్లీ : భారత్‌లో సుమారు 15 లక్షల చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలు వినియోగదారులతో అనుసంధానం కావడానికి సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకుంటున్నాయి.  ఈ విషయాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు వంద కోట్ల మంది యూజర్లున్నారని ఫేస్‌బుక్ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఫేస్‌బుక్ ప్లాట్‌ఫారమ్‌పై 4 కోట్ల యాక్టివ్ చిన్న వ్యాపార సంస్థల పేజీలున్నాయి.

వీటిల్లో భారత వాటా 15 లక్షలని, ఈ సంఖ్య ప్రతీ ఏడాది 70 శాతానికి పైగా వృద్ధి సాధిస్తోందని పేర్కొన్నారు. యువజనుల్లో ఎక్కువమంది,  వినియోగదారుల్లో కొంతమంది తాము కొనుగోలు చేయాలనుకుంటున్న ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సైట్ల ద్వారా సేకరిస్తున్నారని వివరించారు. దీంతో పలు కంపెనీలు ఈ డిజిటల్ మాధ్యమానికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. 

ఫేస్‌బుక్‌కు అమెరికా తర్వాత ఇండియానే అతి పెద్ద మార్కెట్. చిన్న, మథ్య తరగతి వ్యాపార సంస్థల కోసం ఫేస్‌బుక్ ఈ ఏడాది యాడ్స్ మేనేజర్ యాప్‌ను, బిల్టి క్రియేటివ్ అండ్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్ ఫర్ స్మాల్ బిజినెస్ మార్కెటీర్స్ ను ప్రారంభించామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement