
మధుకోడాపై అభియోగాలు నమోదుచేయండి
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణానికి సంబంధించి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా, మరో ఎనిమిదిమందిపై అభియోగాలు నమోదుచేయాల్సిందిగా ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీరిపై అభియోగాలు ఈనెల 31లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. ఈ విచారణలో బొగ్గుశాఖ కార్యదర్శి హెచ్సీ గుప్తా జార్ఖండ్ మాజీ ప్రధాన కార్యదర్శి ఏకే బసును కూడా చేర్చాలని స్పష్టం చేసింది. దేశంలో సంచనలం సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో గతంలోనే మధుకోడాకు కూడా భాగస్వామ్యం ఉందని ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.