లాలూ ప్రసాద్కు బెయిల్ మంజూరు
పశువుల దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్కు ఊరట లభించింది. సుప్రీంకోర్టు శుక్రవారం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్పై ఎలాంటి ఆంక్షలు తీసుకోవాలన్నది మాత్రం దిగువ కోర్టు నిర్ణయం తీసుకుంటుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం బెయిలు తీర్పును వెలువరించింది.
1996లో బీహార్ ముఖ్యమంత్రిగా లాలూ ఉన్న సమయమంలో చోటు చేసుకున్న పశువుల దాణా కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ కుంభకోణంలో లాలు ప్రసాద్, జగన్నాధ్ మిశ్రాలతోపాటు పలువురు బ్యూరోక్రాట్ల నిందితులపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ క్రమంలో ఈ ఏడాది అక్టోబర్ 3వ లాలు, జగన్నాధ్ మిశ్రాలతోపాటు పలువురు ఉన్నతాధికారులకు రాంచీ ప్రత్యేక సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్లోని బిర్సాముండా జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయంవిదితమే.