దోషులుగా తేలిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించాలని ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ కేంద్రం వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే నేరారోపణలతో కస్టడీలో ఉన్నవారు ఎన్నికల్లో పోటీకి అర్హులన్న తీర్పును పునఃసమీక్షించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది.
కింది కోర్టులో దోషులుగా నిర్ధారితులైన ప్రజాప్రతినిధులు.. దానిపై ఉన్నతస్థాయి కోర్టులో చేసుకున్న అప్పీలు పెండింగ్‌లో ఉన్నట్లయితే వారిని అనర్హులను చేయరాదని చెప్తున్న ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 8(4).. న్యాయవిరుద్ధమైనదని పేర్కొంటూ అత్యున్నత న్యాయస్థానం గతంలో కొట్టివేసింది. ప్రజాప్రతినిధులు దోషులుగా నిర్ధారితులైన తేదీ నుంచే వారు అనర్హులుగా మారతారని జస్టిస్ ఎ.కె.పట్నాయక్, జస్టిస్ ఎస్.జె.ముఖోపాధ్యాయలతో కూడిన ధర్మాసనం స్పష్టంచేసింది.
'అనర్హత'పై కేంద్రం అభ్యర్థనను తోసిపుచ్చిన సుప్రీం
Published Wed, Sep 4 2013 5:16 PM | Last Updated on Thu, Sep 27 2018 8:42 PM
Advertisement
Advertisement