
'ప్రభుత్వ ప్రకటన ఉద్దేశం సరిగా లేదు'
హైదరాబాద్: తెలంగాణ మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ ప్రకటన ఉద్దేశం సరిగా లేదని సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జీతాల పెంపుదల రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు వర్తింజేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్మికుల సమ్మెలో ఉన్న కార్మికులను తొలగిస్తామనడం ఏకపక్షం, దారుణమని ఆయన అన్నారు. అందుకు తాము అంగీకరించమంటూ తమ్మినేని స్పష్టం చేశారు. కాగా, తెలంగాణ మున్సిపల్ కార్మికులు గత కొన్ని రోజులుగా తమ జీతాలు పెంచాలంటూ సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.