'సీమాంధ్రలో ఉద్యమాలు తగ్గుముఖం'
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు, ఆందోళనలు తగ్గుముఖం పట్టాయి అని రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ అన్నారు. అసెంబ్లీకి తీర్మానం పంపే విషయంపై కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో మాట్లాడిన తర్వాత స్పందిస్తానని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 2014 కు ముందే తెలంగాణ ప్రకియ పూర్తవుతుందన్నారు.
రాష్ట్ర విభజనకు అనుకూలమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లేఖ ఇచ్చి.. ఆతర్వాత తెలంగాణ అంశంపై యూటర్న్ తీసుకోవడంతో విశ్వసనీయ కోల్పోయాడు అని దిగ్విజయ్ అన్నాడు. సీఎం కిరణ్ తొలగిస్తామనే వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. వచ్చే శీతాకాలపు పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని దిగ్విజయ్ స్పష్టం చేశారు.