ట్విట్టర్ నిజంగా అమ్మేస్తున్నారా..? | Twitter on sale rumours surface again | Sakshi
Sakshi News home page

ట్విట్టర్ నిజంగా అమ్మేస్తున్నారా..?

Published Wed, Sep 7 2016 2:12 PM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

ట్విట్టర్ నిజంగా అమ్మేస్తున్నారా..? - Sakshi

ట్విట్టర్ నిజంగా అమ్మేస్తున్నారా..?

న్యూయార్క్ : సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కోల్పోతున్న తన ప్రాభవాన్ని తిరిగి సంపాదించుకోవాలని ఎంతలా తాపత్రయపడుతున్నా ట్విట్టర్ అమ్మక వార్తలు మాత్రం ఆగడం లేదు. ఈ సోషల్ మీడియా దిగ్గజాన్ని విక్రయిస్తున్నారంటూ మళ్లీ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ కమ్యూనికేషన్ కంపెనీల డైరెక్టర్స్ గురువారం శాన్ఫ్రాన్సిస్కోలో భేటీ కాబోతున్నారని, ఆ భేటీలో ట్విట్టర్ భవితవ్యంపై చర్చించనున్నారని తెలుస్తోంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఎక్కువగా పేరొందిన ట్విట్టర్ను స్వాధీన పరుచుకోవాలని చాలా కంపెనీలే ప్లాన్స్ వేస్తున్నాయట. టెక్ దిగ్గజాలు గూగుల్, యాపిల్ ఈ కంపెనీ కొనుగోలుపై బాగా ఆసక్తి చూపుతున్నట్టు గత నెల నుంచి రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. 
 
గూగుల్, యాపిల్తో పాటు మీడియా మొగల్ రూపెర్ట్ ముర్డోచ్లు ఈ కంపెనీని కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యాయని రిపోర్టు నివేదించింది. ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు కూడా ఈ సంస్థను చేజిక్కించుకుని ట్విట్టర్ సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నాయని రీ/కోడ్ తెలిపింది. ఓ స్వతంత్ర సంస్థగా ట్విట్టర్ భవిష్యత్తును నిర్ణయించడానికి రైట్ ఆప్షన్లను పరిగణలోకి తీసుకోవాల్సినవసరం ఉందని ఇటీవలే కంపెనీ సహ వ్యవస్థాపకుడు , బోర్డు మెంబర్ ఇవాన్ విలియమ్స్ చెప్పారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ విక్రయం రూమర్లు మళ్లీ జోరందుకుని కంపెనీ షేర్లు దాదాపు 9 శాతం ఎగిశాయి. ట్విట్టర్లో ప్రస్తుతం 3,860 ఉద్యోగులున్నారు. ఈ కొనుగోలు 18 బిలయన్ డాలర్లకు జరుగవచ్చని భోగట్టా.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement