దేశమంతా నరేంద్ర మోడీ పేరు జపిస్తుంటే బీహార్ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ జై కొట్టారు.
పాట్నా: దేశమంతా నరేంద్ర మోడీ పేరు జపిస్తుంటే బీహార్ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు నితీష్ కుమార్ జై కొట్టారు. బీజేపీ ఎమ్మెల్యేలు విజయ్ కుమార్ మిశ్రా, రాణా గంగేశ్వర్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేశారు. స్పీకర్ ఉదయ నారాయణ్ చౌదరీని కలిసి తమ రాజీనామా సమర్పించారు.
దర్బంగా జిల్లాలోని జాలే నియోజకవర్గం నుంచి మిశ్రా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సమస్తిపూర్ జిల్లా లోని మొహియుద్దినగర్ నియోజకవర్గానికి గంగేశ్వర్ ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. వీరి రాజీనామాతో 237 స్థానాలున్న బీహార్ అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య 88కి తగ్గింది. జేడీ(యూ)కు మద్దతించేందుకే ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.