రాత్రి వేళల్లోనూ ఆగాల్సిందే! | VAC mod traffic activation willbe implimented soon | Sakshi
Sakshi News home page

రాత్రి వేళల్లోనూ ఆగాల్సిందే!

Published Tue, Sep 12 2017 5:50 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

రాత్రి వేళల్లోనూ ఆగాల్సిందే! - Sakshi

రాత్రి వేళల్లోనూ ఆగాల్సిందే!

- ట్రాఫిక్‌ సిగ్నల్స్‌కు వీఏసీ మోడ్‌ యాక్టివేషన్‌
- జంక్షన్లలో జరిగే ప్రమాదాలు నిరోధించేందుకే..
- వాహనాలను బట్టి పనిచేస్తున్న సిగ్నలింగ్‌ వ్యవస్థ


సాక్షి, హైదరాబాద్‌: 
రాత్రి వేళల్లో నిర్మానుష్యంగా ఉండే రోడ్లు వాహనచోదకుల్లో ‘వేగాన్ని’పెంచుతున్నాయి. దీని కితోడు ఆ సమయాల్లో జంక్షన్స్‌లో ఉండే ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ సైతం కేవలం ‘బ్లింకింగ్‌’మినహా పూర్తి స్థాయిలో పని చేయకపోవడంతో దూసుకువచ్చేస్తున్నారు. జంక్షన్‌కు అన్ని వైపుల ఉన్న మార్గాల నుంచి వచ్చే వాహనచోదకులది ఇదే ధోరణి అవు తుండటంతో ప్రమాదాలు చోటు చేసుకుంటు న్నాయి. దీనికి పరిష్కారంగా నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు కీలక మార్పు చేర్పులు చేశారు. రాత్రివేళల్లో సిగ్న ల్స్‌కు వెహికిల్‌ యాక్టివేటెడ్‌ కం ట్రోల్‌ (వీఏసీ) మోడ్‌ యాక్టి వేట్‌ చేయడంతో పాటు కొన్ని జంక్షన్లను మూసేస్తు న్నారు. ఈ చర్యలు ఫలితా లనిచ్చాయని, జంక్షన్లలో రాత్రి వేళల్లో జరిగే ప్రమా దాలు గణనీయంగా తగ్గాయని ఉన్నతాధికారులు చెప్తున్నారు.

దేశ వ్యాప్తంగా అదే ‘సీన్‌’...
కేంద్ర అధీనంలోని మినిస్ట్రీ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ హైవేస్‌ (ఎంఓఆర్‌టీహెచ్‌) ఇటీవల 2016కు సంబంధించి రోడ్డు ప్రమాదాల గణాంకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం దేశ వ్యాప్తంగా చోటు చేసుకున్న మొత్తం రోడ్డు ప్రమా దాల్లో 37 శాతం జంక్షన్లలోనే జరిగాయి. హైదరాబాద్‌ లోనూ ప్రమాదాలకు నిలయంగా మారిన ప్రాంతాల్లో (బ్లాక్‌స్పాట్స్‌) అత్యధికం జంక్షన్లలోనే ఉంటున్నాయి. ఈ ప్రమాదాల్లోనూ రాత్రి వేళల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న నగర ట్రాఫిక్‌ పోలీసులు సిగ్నలింగ్‌ వ్యవస్థలో కీలక మార్పులు తీసుకువచ్చారు.

జంక్షన్ల మూసివేతకు నిర్ణయం...
రాత్రి వేళల్లో జంక్షన్ల వద్ద జరుగుతున్న ప్రమాదాలను నిరోధించడానికి ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఆయా సమయాల్లో జంక్షన్ల మూసివేత అంశానికీ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉదాహరణకు సచివాలయం సమీపంలో ఉన్న తెలుగుతల్లి చౌరస్తాను తీసుకుంటే... అటు ట్యాంక్‌బండ్, ఇటు ఇక్బాల్‌ మీనార్‌ వైపు నుంచి వచ్చే రెండు మార్గాలూ ప్రధాన రహదారులు. ఆదర్శ్‌నగర్, ఎన్టీఆర్‌ మార్గ్‌ నుంచి వచ్చే మార్గాలు ఆస్థాయిలో ప్రధానమైనవి కాదు. రాత్రి 11 గంటల తర్వాత ఆ చౌరస్తాను పోలీసులు మూసే స్తున్నారు. ఫలితంగా అక్కడ జరిగే ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. దీన్ని దృష్టిలో పెట్టుకున్న పోలీసుల ఇలాంటి ప్రయోగానికి అనువుగా ఉన్న ఇతర జంక్షన్లను పరిశీలిస్తున్నారు.

సమయం వృథా కాకుండా...
నగరంలో సాధారణంగా ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ ఎక్కువగా ఉంటుంది. అవసరమైన సందర్భాల్లో మాన్యువల్‌ మోడ్‌లో ఆపరేట్‌ చేస్తారు. రాత్రివేళల్లో మాన్యువల్‌ మోడ్‌ సాధ్యంకాదు. అలాగని ఆటోమేటిక్‌ మోడ్‌లో పనిచేస్తే వాహనాల రద్దీ లేని చోట సమయం వృథా అవుతుంది. అందుకే ట్రాఫిక్‌ విభాగం అధికారులు రాత్రి వేళల్లో వీఏసీ మోడ్‌ను వినియోగిస్తున్నారు.

వీఏసీ అంటే..
ఓ జంక్షన్‌లోని ఆయా మార్గాల్లో ఉన్న వాహనాల రద్దీని బట్టి రెడ్, గ్రీన్‌ లైట్లు వెలిగే సమయాన్ని ఇదే నిర్దేశించు కుంటుంది. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ పక్కనే ఉండే వర్చువల్‌ లూప్‌ కెమెరాలు జంక్షన్‌లోని ప్రతి మార్గాన్నీ ఫోకస్‌ చేసి ఉంటా యి. దీని నుంచి వెలువడే ప్రత్యేక తరంగాలు రహదారిని కొన్ని లూప్స్‌గా విభజించి పరిశీలి స్తుంటాయి. అన్ని రూట్లలోనూ ఉన్న కెమెరాలు ట్రాఫిక్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ రూమ్‌లో (టీ–సీసీసీ) ఉన్న సర్వర్‌తో అనుసంధానించి ఉంటాయి. ఫలితంగా ఆయా రహదారుల్లోని సిగ్నల్స్‌ వద్ద ఆగిఉన్న వాహనాలను ఈ కెమెరాల ద్వారా కంప్యూటర్‌ అధ్యయనం చేస్తుంది. ఎక్కువ వాహనాలున్న వైపు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తూ... తక్కువ వాహనాలున్న వైపు రెడ్‌ సిగ్నల్‌ ఇస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement