రాహుల్ ను 'షెహజాదే' అనడం మానుకుంటాను: మోడీ
వారసత్వ రాజకీయాలకు ముగింపు పలికితే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని షెహజాదే(యువరాజు) అని తాను అనడం మానుకుంటానని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. తాను రాహుల్ ను షెహజాదే అనడం కాంగ్రెస్ నాయకులకు ఇబ్బందికి గురిచేస్తోంది. నాయకులకు నిద్ర కూడ పట్టడం లేదు అని బీహార్ లో పాట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన హుంకార్ ర్యాలీలో మోడీ అన్నారు.
గత మూడేళ్లలో బీహార్ లో ఓ సభలో పాల్గొనడం ఇదే తొలిసారి అని అన్నాడు. వారసత్వ రాజకీయాలతో ప్రజలు విసిగెత్తారని ఆయన అన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనం పడటానికి వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలన, కులం, మతం, అవకాశవాదం కారణమన్నారు.