గ్రహాంతరవాసులను కనుగొనే అతిపెద్ద టెలీస్కోప్ ను చైనా ప్రారంభించింది.
బీజింగ్: ఏలియన్ల(గ్రహాంతర జీవుల) జాడ కోసం ఏళ్లుగా కొనసాగుతోన్న పరిశోధనల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 30 ఫుట్ బాల్ మైదానాల సైజులో నిర్మించిన భారీ టెలీస్కోప్ సహాయంతో అంతరిక్షంలోని ఇతర జీవజాతుల ఆనవాళ్లు పసిగట్టేందుకు మార్గం సుగమమైంది. చైనా తాజాగా రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద టెలిస్కోప్ తో మానవుడి అన్వేషణ కొత్త మలుపు తిరగనుంది. దాదాపు 4,450 ప్యానల్స్ ను ఉపయోగించి తయారుచేసిన ఈ భారీ టెలిస్కోప్ ను చైనా సైంటిస్టులు ఉదయం 10.47 నిమిషాల నుంచి వాడకంలోకి తెచ్చారు. నైరుతి చైనాలోని గుయ్జోయూ ప్రావిన్సులో గల కార్ట్స్ వ్యాలీలో దీనిని ఏర్పాటు చేశారు. గత ఏడాది సెప్టెంబర్ లో ప్రారంభమైన ఈ భారీ టెలీస్కోప్ నిర్మాణంలో 300 మందికి పైగా బిల్డర్లు, సైంటిస్టులు పాలుపంచుకున్నారు.