రైతు నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులో ఈనెల 16న ప్రకృతిసేద్యంలో పండ్లతోటలు, పాలీహౌస్‌ల్లో కూరగాయల సాగుపై రైతులకు శిక్షణ ఇస్తారు. పండ్ల తోటలు, పాలీహౌస్‌ల్లో కూరగాయల సాగుపై హైదరాబాద్‌కు చెందిన ప్రకృతి వ్యవసాయదారు హరిబాబు, చీమకుర్తికి చెందిన శ్రీధర్ బాబు, ఉద్యానశాఖ అధికారి రాజా కృష్ణారెడ్డి, హేమంత్ రైతులకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పొంద దలచిన రైతులు ముందుగా పేర్ల నమోదుకు 97053 83666, 0863 – 2286255 నంబర్లలో సంప్రదించవచ్చు.