అవగాహన లేని దర్యాప్తు | Kommineni Srinivasa Rao interview with Former CS Ramakanth reddy | Sakshi
Sakshi News home page

అవగాహన లేని దర్యాప్తు

Published Wed, Mar 1 2017 1:58 AM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM

అవగాహన లేని దర్యాప్తు

అవగాహన లేని దర్యాప్తు

జగన్‌ కేసులో సీబీఐ తీరుపై మాజీ ఐఏఎస్‌ అధికారి రమాకాంత్‌ రెడ్డి
(మనసులో మాట)
కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే దర్యాప్తు సంస్థ సీబీఐకి రాష్ట్రానికి సంబం ధించిన విషయాలపై అసలు అవగాహన లేదని జగన్‌ కేసు దర్యాప్తు జరిగిన తీరు చూస్తే తనకు అర్థమైందని అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌ రెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులపై దర్యాప్తు చేసిన సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ) వీవీ లక్ష్మీనారాయణకు రాష్ట్ర సెక్రటేరియట్, కేబినెట్‌ నిబంధనలు ఏమాత్రం తెలియవని ఆయన తేల్చిచెప్పారు. వైఎస్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన మరణానంతరం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన పరిణా మాలపై రమాకాంత్‌ రెడ్డి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఎలా నడిచింది?
ఆయన గొప్పమానవతావాది. అంతకుముందు ఆయన ఎలా ఉండేవారో నాకు తెలియదు. 25 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి రాటుదేలిపోయారేమో. దాంట్లో కూడా ఒక హ్యూమన్‌ ఎలిమెంట్‌ వాతావరణాన్ని ఆయన సృష్టిం చారు. ఎన్నోసార్లు ఆయనతో చర్చలు జరిపాం. ఆయన చెప్పిందానికి ఎన్నో సార్లు నో అని చెప్పాం. పొలైట్‌గా నో అని ఎన్నిసార్లైనా చెప్పడానికి ఆయన వద్ద మాకు స్వతంత్రం లభించింది. మేం నో అని చెప్పినా ఆయన ఎప్పుడూ బాధపడలేదు. అహా అలాగా అనేసి ఊరుకునేవారు. ఏంటండీ నాలుగైదు  సార్లు నా మాటకు నో  చెబుతున్నారు అనే మాట ఆయన నుంచి రాలేదు. కసురుకోవడం అస్సలు లేదు. ఓపిగ్గా వినేవారు. ఆ తర్వాత సీఎస్‌ గారూ ఇలా చేస్తే బాగుంటుంది కదా అనేవారు. ఆయన అభిప్రాయం అదీ అని అప్పుడు మాకు అర్థమయ్యేది. ఆయన చెప్పిందాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి మన నిబంధనల్లో వీలవుతుందా అని అప్పుడు మేం పరి శీలించేవాళ్లం. తర్వాత వీలయితే వీలవుతుందని కాకుంటే కాదని చెప్పేవాళ్లం.

మీ ఇద్దరి కాంబినేషన్లో విజయవంతమైన కార్యక్రమాలు ఉంటే చెబుతారా?
ముఖ్యంగా చెప్పాల్సి వస్తే 108. కర్నాటకలో దేవిశెట్టి అని ఒక డాక్టరు ఉండే వారు. ఆయనే మొట్టమొదటిసారిగా ప్రజలకు గుండె ఆపరేషన్లు చేయడం మొదలెట్టారు. అయితే పాల సొసైటీలో సభ్యులకు మాత్రమే ఆయన ఆప రేషన్లు చేసేవారు. మిగతావారికి చేసేవారు కాదు. ఒకరోజు కర్నాటకలో ఇలా ఉచిత గుండె ఆపరేషన్లను కర్నాటకలో చేస్తున్నారట. కనుక్కోండి అని వైఎస్‌ నాకు చెప్పారు. నేను నేరుగా దేవిశెట్టి గారికే ఫోన్‌ చేసి హైదరా బాద్‌కు రాగలరా, వైఎస్‌ కలవాలంటున్నారు, మీ పని పట్ల ఆయనకు ఆసక్తి ఉంది అని అడిగితే వచ్చారు. హైదరాబాద్‌లో ఒక ప్రజెంటేషన్‌ కూడా ఇచ్చారు. వైఎస్‌కి అది పూర్తిగా నచ్చలేదు. మీరు కేవలం పాల సొసైటీలో సభ్యులకు మాత్రమే చేస్తున్నారు. మా రాష్ట్ర ప్రజలందరికీ అంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అందరికీ మేలు కలిగేలా మీరు చేయగలరా అని దేవి శెట్టిని వైఎస్‌ అడిగారు. అది చాలా చాలా పెద్ద కార్యక్రమం సర్‌ నేను చేయ లేను అన్నారాయన. ఆయనను పంపించిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాల యంలో నేను, ఆరోగ్య శాఖ కార్యదర్శి, సిఎంఒలో ఉండే జన్నత్‌ హుస్సేన్‌ తదితరులం కూర్చుని ఎనిమిది నెలలపాటు కసరత్తు చేశాం. రూపాయి ఖర్చు లేకుండా ప్రజలు హైదరాబాద్‌ వచ్చి వారికి ఇష్టమైన ఆసుపత్రిని ఎంచుకుని ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ లేదా బైపాస్‌ సర్జరీ చేసుకుని రూపాయి కట్ట కుండా సంతోషంగా బయటకు వెళ్లిపోయే సందర్భం అది. అలాంటి సంద ర్భాలెన్నో నేను చూశాను. విన్నాను. చాలా మంది ప్రజాప్రతినిదులు నావ ద్దకు వచ్చి చెప్పారు. మేము సంతోషంగా ఉన్నామన్నారు వాళ్లు. కిరణ్‌ అని సీఎం ఓఎస్డీగా ఉండేవారు. ఆయనే కార్యక్రమాన్ని చూసేవారు.

ఇతర కార్యక్రమాల్లో మీ పాత్ర ఉందా?
బీసీలకు స్కాలర్‌షిప్‌ ఇవ్వడం. ఫీజు రీయింబర్స్‌మెంట్‌. వైఎస్‌ ఒకరోజు నాతోనే చర్చించారు. పేదపిల్లలు ఫీజు కట్టడంలో ఇబ్బంది పడుతున్నారు. మనం ఏదైనా చేయలేమా అని. అలా ఈ పథకం పుట్టింది. మొదట్లో చాలా ఇబ్బంది కలిగింది. అయినా ధైర్యంగా ముందుకెళ్లాం. ఇప్పటికీ చాలామంది నన్ను కలిసినప్పుడు చెబుతుంటారు. ఆరోజు ఆ స్కీమ్‌ పుణ్యమా అని మేం మెడిసన్‌ పూర్తి చేసుకున్నాం, ఇంజనీరింగ్‌ పూర్తి చేశాం. లేకుంటే చేసేవాళ్లం కాదని చెబుతారు.
జగన్‌ మీద కొంతమంది ఆరోపణలు చేస్తుంటారు. ఆయన ఎప్పుడైనా  ‘‘నేను ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడు, ప్రభుత్వ ప్రధాన కార్య దర్శిగా పనిచేసినప్పుడు సచివాలయంలో గాని, అసెంబ్లీలో గాని, ముఖ్య మంత్రి క్యాంప్‌కార్యాలయంలోగాని జరిగిన ఏ ఒక్క సమావేశానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాలేదు. ఎంపీ కాకముందు, అయిన తర్వాత కూడా జగన్‌ మా సమావేశాలకు ఆయన ఎన్నడూ రాలేదు. ఈ విషయం కచ్చితంగా చెప్ప గలను. ముఖ్యమంత్రి కుమారుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఎంపీగా ఫలానా వాళ్లకు అది ఇవ్వండి అని గాని, ఇవ్వొద్దు అని గాని, నాకు ఇది కావాలని గాని, ఫలానా కంపెనీకి అది కావాలని గాని ఆయన నాకు ఎప్పుడూ ఎలాంటి లేఖ రాయలేదు. ఒక్కరోజు కూడా ఆయన నాకు ఫోన్‌చేయలేదు. నేను జగన్‌ను ఎప్పుడు కలిశానంటే.. వైఎస్‌రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత నా హృదయపూర్వక సానుభూతి తెలియజేయడానికి వెళ్లి కలిశాను. అంతకు ముందెప్పుడూ కలవడం జరగలేదు.

తర్వాత జగన్‌పై కేసులు పెట్టినప్పుడు పరిణామాల గురించి చెబుతారా?
జగన్‌పై కేసులు పెట్టినప్పుడు సీబీఐ వాళ్లు నన్ను రెండుసార్లు దిల్‌కుషా గెస్ట్‌ హౌస్‌కు పిలిచారు. అప్పుడు సీబీఐ జాయింట్‌డైరెక్టర్‌గా లక్ష్మినారాయణ ఉండేవారు. ‘మీరడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి నన్ను పిలిపించారు, సంతోషం. నాకు తెలిసింది చెబుతాను అయితే, ఫలానా వ్యక్తులను కూడా మీరు పిలిపించి మాట్లాడుతారా’ అని ఆయనను అడిగితే, ‘నేను పిలవడం లేదండి. వారిని ప్రశ్నించడానికి హైకోర్టు నాకు అంతటి పరిధి విధించలేదు’ అని జవాబిచ్చారు. ‘మీరు ఇన్వెస్టిగేటింగ్‌ ఆఫీసర్‌. ఫలానా వాళ్లను ఇంటరా గేట్‌చేయొచ్చు. ఫలానా వాళ్లను ప్రశ్నలు అడగొచ్చు. ఫలానా వాళ్ల ఇళ్లు, ఆఫీ సులను రెయిడ్‌చేసినా, అక్కడి నుంచి కాగితాలు తెచ్చుకోవచ్చు. ఫలానా ఆఫీసును రెయిడ్‌చేస్తే మీ దర్యాప్తుకు ఉపయోగపడతాయనుకుంటే మీరు ఆ పని చేయవచ్చు. హైకోర్టు మిమ్మల్ని ఫలానా ఆఫీసుకు వెళ్లమని చెబు తుందా?‘ అని అడిగాను. దానికి ఆయన, ‘అబ్బో వద్దండి... అదంతా కది లిస్తే చాలా ఇబ్బంది అవుతుంది’ అన్నారు. ‘అలాగైతే మీ ఇన్వెస్టిగేషన్‌మీద నాకు నమ్మకం లేదండి’ అన్నాను. ‘నేను ఈ మాట చెబుతున్నాను, ఇది రికార్డు అవుతుందని నాకు తెలుసు’ అని చెప్పాను.
రెండోదికూడా అడిగాను. మీరు విదేశాలకు వెళతారా, వెళితే అక్కడ సమాచారం ఉందని అంటున్నారు కదా. అక్కడికి వెళ్లి సమాచారం తెచ్చు కుంటారా అని అడిగాను. లేదండీ లెటర్స్‌ రొగేటరీ పంపిస్తాము. వాళ్లు సమాచారం పంపుతారు అన్నారాయన. వాళ్లెందుకు పట్టించుకుంటారు? మీరు అనుమతి తీసుకుని ఆ దేశాలకు వెళ్లాలి. అక్కడి సెంట్రల్‌ బ్యాంకుకు వెళ్లి సంప్రదించాలి. కాగితాలు ఉన్నాయా,  డొల్లకంపెనీలు ఉన్నాయా, సూట్‌ కేస్‌ కంపెనీలు అంటారు కదా, అలాంటివి ఉన్నాయా అని వారిని అడగాలి. అలాగే ఎవరికీ చెందని డబ్బులు, ఎవరికో చెందిన డబ్బులు మనదేశానికి వచ్చాయా అని కూడా మీరు కనిపెట్టాలి కదండి. కనిపెట్టకపోతే ఎలా అని సీబీఐ జేడీని నేను అడిగాను. అబ్బే లేదండి లెటర్లు మాత్రమే రాస్తాము, వారు సమాధానం ఇస్తే సరి లేకపోతే లేదు అన్నారు. అందుకే మీ దర్యాప్తు మీద నాకు నమ్మకం లేదు అని చెప్పాను. అప్పుడాయన నవ్వేశారు.

మిమ్మల్ని ఎందుకు పిలిపించారు, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారా?
కేబినెట్‌ నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్‌గురించి ప్రశ్నించడానికి లక్ష్మీ నారాయణ నన్ను దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లోని తన ఏసీ గదిలో కూర్చోబెట్టారు. 48 ఫైళ్లు నా ముందుంచారు. ‘మీరు సంతకం చేశారు, ఇలా నోట్‌ వచ్చిన ప్పుడు మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు’ అని అడిగారు. అప్పుడు నాకు తెలిసిందేమిటంటే.. రాష్ట్రంలో జరిగే సెక్ర టేరియట్‌ రూల్స్, పద్ధతులు సీబీఐ వాళ్లకు తెలియవు. బేసిక్‌గా అది ఒక ప్రాబ్లమ్‌. కేబినెట్‌ సమావేశం అంటే ఏమిటి? ఏ పరిస్థితుల్లో కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తారు.. ఒక కేబినెట్‌కు ఒక సబ్జెక్టు ఎందుకు పంపిస్తాం.. కేబినెట్‌ పరిధి ఏమిటి.. ముఖ్యమంత్రికి గల అధికారా లేమిటి కేబినెట్‌లో నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి అనే విష యాలు సీబీఐకి నిజంగా తెలియదు. వాళ్లకు (సీబీఐ) భారత ప్రభుత్వ రూల్సే తెలుసు కానీ రాష్ట్ర ప్రభుత్వ రూల్స్‌ తెలియవు. అసెంబ్లీ నిబంధనలు తెలియవు. స్పీకర్‌కు, ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలేమిటో తెలియవు. మాలాంటి కార్యదర్శులకు ఉన్న అధికారులు, విధులు, బాధ్యతలు ఏమిటో వారికి తెలియవు. అవి తెలి యజెప్పడానికి నాకు ఒకరోజు పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్గం ఎలా పని చేస్తుందో సీబీఐకి తెలియజెప్పే పనిని సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో పనిచేసే ఓ మహిళా అధికారికి అప్పగించాం. ఆమె సహాయం కూడా తీసుకుని నేను చెప్పాను. నాకు బేసిక్‌గా తెలిసింది ఏమిటంటే.. అసలు  రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, విధానాలను కూడా అర్థం చేసుకోకుండా సీబీఐ వాళ్లు విచారణ మొదలుపెట్టారు.

మరి ఆలాంటి కేసులు చెల్లుతాయా? మీకది రాజకీయ కేసు అనిపించిందా?
నేను ఆరోజే ఆయనతో (లక్ష్మీనారాయణ) చెప్పాను. నేను చెప్పిన పేర్లు ఉన్నవారిని (మంత్రులు) మీరు పిలవలేదు కదా. విదేశాలకు కూడా మీరు వెళ్లడం లేదు కదా.  ఈ కేసులు నిలుస్తాయని నిజంగా మీకు నమ్మకం ఉందా.. అని అడిగితే... సమాధానం ఏమీ చెప్పకుండా నవ్వేశారాయన.  

కాంగ్రెస్‌ అధిష్టానం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే చేసి ఉంటారంటారా?
తెలీదు కాని ఆయన నవ్వేశారు అంతే.

మరి ఒక సీఎం కుమారుడిని అన్ని నెలలు జైల్లో పెట్టడం సబబేనా?
అంతిమంగా తీర్పు ఎలా వచ్చినా ముందుగా అరెస్టు చేస్తారు కదా. అది ఒక సమస్య. న్యాయస్థానం ముందుగానే జోక్యం చేసుకుని బెయిల్‌ ఇచ్చిం దనుకోండి. అది ఒక సమస్య. పదేళ్ల తర్వాత నిర్దోషిగా బయట కొచ్చే కేసు లను కూడా మనం చూస్తుంటాం. అప్పుడు నిజంగా బాధేస్తుంది. ఇంత కాలం తర్వాత నిర్దోషిగా బయటపడ్డారు. మరి ఇన్నాళ్లు నిర్బంధంగా కారా గారంలో పెట్టినప్పుడు వారి స్వాతంత్య్రాన్ని హరించినట్లే కదా.

సరే. అనుమతులిచ్చిన అథారిటీని ఎలా పిలుస్తారు?
మీరు విచారణకు ఎవరిని పిలుస్తారు.. అని లక్ష్షీ్మ నారాయణను అడిగాను. అనుమతులు ఇచ్చింది ఎవరు కేబినెట్‌. దానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహి స్తారు. పిలవడానికి ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు లేరు. కాబట్టి కేబినెట్‌లోని మంత్రులందరినీ పిలిచి అడుగుతారా రూల్‌ ఏమిటంటే.. కేబినెట్‌లో ఏదైనా నిర్ణయం తీసుకుంటే మేము (కార్యదర్శులం) రీజన్స్‌ (కారణాలు) రాయన క్కరలేదు. కేబినెట్‌ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది అనేది కూడా రాయ నక్కరలేదు. మీకు ఆశ్చర్యం అనిపించ వచ్చు గానీ.. అది మా రూల్‌లో ఉంది. కేబినెట్‌లో ఫలానా నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో రికార్డు చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మీరు ఎవరిని పిలిచి అడుగుతారు అని జేడీతో అన్నాను. అప్పుడు పనిచేసిన మంత్రులను పిలిచి అడిగితే వాళ్లేమం టారు.. అది సమిష్టి బాధ్యత అని చెబుతారు. మరి ఎవరిని అడుగుతారు? అనుమతులు ఇచ్చిన అథారిటీని అడగాలి. ఆ అథారిటీని ఎలా పిలుస్తారు? కాబట్టి మీ విచారణపై నాకు పెద్దగా నమ్మకం లేదు అని చెప్పేశాను.

అలాంటప్పుడు బీపీ ఆచార్య వంటి ఐఏఎస్‌లను పనిగట్టుకుని నిర్బంధించారే?
‘‘జగన్‌పై పెట్టిన కేసుల విషయంలో అప్పటి ఐఏఎస్‌ అధికారులను అరెస్టు చేయాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే వాళ్లు ఎక్కడికీ పారిపోరు కదా! మీరు ముందుజాగ్రత్తగా వారి పాస్‌పోర్టు తీసుకున్నా వారు ప్రభుత్వంలోనే పనిచేస్తారు కదా. ఎక్కడికీ పోలేరు.

దీంట్లో కూడా ఏదైనా కక్షసాధింపు లాంటిది ఉందా?
కక్షసాధింపు ఉందని నేను భావించడం లేదు. ఏదో బ్రహ్మాండం బద్దలవు తుంది అనే ఉద్దేశంతో అరెస్టు చేశారేమో తెలియదు. ఆ తర్వాత బ్రహ్మాండం బద్దలు కాలేదు అని నేను అనుకుంటున్నాను’’

(రమాకాంత్‌ రెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఇక్కడ క్లిక్‌ చేయండి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement