manasulo maata
-
జ్ఞాపకం
-
జగన్‌తోనే మైనార్టీలకు సంక్షేమ ఫలాలు
సాక్షి, కర్నూలు : ‘నాకు డబ్బు సంపాదించాలన్న వ్యామోహం లేదు. సేవ చేయాలనే తలంపుతోనే రాజకీయాల్లోకి వచ్చా. కర్నూలు నగర ప్రజల సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లో చేరాను. ఇక్కడి సమస్యలపై తొమ్మిదేళ్లు అవగాహన పెంచుకున్నాను. నగర ప్రజల అవసరాలేంటి, వారికేం కావాలో ఇప్పుడు నాకు పూర్తిగా తెలుసు. అవన్నీ నా మదిలో ఉన్నాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి చేరిన నేను ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలి.. వాటిని ఎలా పరిష్కారించాలనేది క్షేత్ర స్థాయికి వెళ్లి అవగాహన పెంచుకున్నాను. కర్నూలు అసెంబ్లీ సీటు గెలిచి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా ఇస్తా’ అంటున్నారు వైఎస్సార్సీపీ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్‌ఖాన్. ‘సాక్షి’తో తన అంతరంగాన్ని పంచుకున్నారు. ‘మైనార్టీ వర్గానికి చెందిన నాలాంటి వ్యక్తికి సీటు రావడమే తొలి విజయం. నేను ప్రాథమిక విద్యాభ్యాసాన్ని కర్నూలు మాంటిస్సోరి, ఇంటర్మీడియెట్ ఉస్మానియాలో, సివిల్ ఇంజినీరింగ్ హైదరాబాద్‌లోని ఎంజే కాలేజీలో పూర్తి చేశా. తరువాత అమెరికా వెళ్లాను. డెట్రాయిట్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశాను. అక్కడే సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించి నిర్వహించాను. 2011లో కర్నూలు తిరిగొచ్చా. మా నాన్నను వైఎస్సార్ సీపీలో చేర్పించాలని ఓదార్పు యాత్రలో భాగంగా తెర్నేకల్‌కు వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశాను. అప్పుడే రాజకీయాల్లోకి రావాలని జగనన్న కోరితే కాదనలేకపోయా. అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయా. పార్టీలో సామాన్య కార్యకర్తగా నా ప్రస్థానం ప్రారంభమైంది. నా సేవలను గుర్తించిన వైఎస్ జగన్ కర్నూలు అసెంబ్లీ సీటిచ్చారు. ఇదే నా తొలి విజయం. వైఎస్ హయాంలోనే మైనార్టీల సంక్షేమం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మైనార్టీలకు ఆరాధ్య దైవం. ఆయన ముస్లిం, మైనార్టీల్లో వెనుకబడిన పేద కుటుంబాలను ఆదుకునేందుకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ,, పేద మహిళల పెళ్లిళ్లకు ప్రోత్సాహం వంటి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. వీటితో ఎంతోమంది పేద ముస్లింలు బాగుపడ్డారు. ఆయన మరణం తరువాత మైనార్టీలను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయితేనే ముస్లింలకు మళ్లీ సంక్షేమ ఫలాలు అందుతాయి. నవరత్నాల వల్ల ముస్లింల అభివృద్ధి మళ్లీ పట్టాలెక్కుతుంది. కర్నూలు నగరంలో ఎక్కువగా ముస్లింలు ఉన్నారు. అందులో పేదల శాతం ఎక్కువ. ఇక్కడ వారికి ఉద్యోగ అవకాశాలు లేవు. ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. అలా వెళ్లేవారికి ఇక్కడే ఉద్యోగావకాశాలు కల్పించాలన్నదే నా ధ్యేయం. కర్నూలు–నంద్యాల మధ్య పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్ సీపీ సానుకూలంగా ఉంది. అదే జరిగితే కర్నూలు జిల్లా నిరుద్యోగులకు ఎంతో ఉపయోగం కలుగుతుంది. వారిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు కర్నూలు నగరం విభిన్న కులాల సమాహారం. ఇక్కడ ముస్లింలు, ఆర్యవైశ్యులు, రెడ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీలతోపాటు రాజస్థానీయులు జీవిస్తున్నారు. బడా వ్యాపారవేత్త టీజీ వెంకటేష్ కుటుంబం వారిని ఇబ్బంది పెడుతోంది. అన్ని వ్యాపారాలు వాళ్లే చేయాలనుకుంటున్నారు. వాళ్లు రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారు. జీవనం కోసం కష్టపడే వారిని నష్టాలకు గురి చేస్తూ అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు. అలాంటి నాయకులపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. వారి పాలనను ప్రజలు కోరుకోవడం లేదు. వారికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. విజయానికి ఢోకా లేదు కర్నూలు నగరంలో వైఎస్సార్ సీపీకి కార్యకర్తల బలం అధికంగా ఉంది. టీజీ కుటుంబం డబ్బుతో ఓట్లను కొనుగోలు చేయాలని చూస్తోంది. మా పార్టీలో అమ్ముడుపోయే కార్యకర్తలు లేరు. కొందరు రాజకీయమంటే వ్యాపారంగా చూస్తున్నారు. అది తప్పు. రాజకీయమంటే పేదలకు సేవ చేయడం. సంపాదన కోసం మాత్రం కాదు. కర్నూలును స్మార్ట్ సిటీగా మారుస్తా కర్నూలు నగరంలో దాదాపు 6 లక్షల జనాభా ఉంది. ఇక్కడి ప్రజలకు మంచి నీళ్లు అందడం లేదు. ఫిబ్రవరి నుంచే నీటి ఎద్దడి ఉంటోంది. దీని కోసం రెండో సమ్మర్ స్టోరేజి ట్యాంకు కట్టేందుకు వైఎస్ హయాంలో నిధులిచ్చినా వెనక్కిపోయాయి. హంద్రీ, తుంగభద్ర నదుల రక్షణ గోడ నిర్మాణానికి పెద్దాయన నిధులిచ్చినా తరువాత వచ్చిన పాలకులు కట్టలేకపోయారు. నగరంలో ఎక్కడా డ్రెయినేజీలు లేవు. ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది. ఇన్నర్, అవుటర్ రింగ్‌రోడ్ల నిర్మాణం చేపట్టాలి. నగరాన్ని దోమల బెడద నుంచి కాపాడాల్సి ఉంది. యువతకు ఉద్యోగాలు కావాలి. వీటన్నింటినీ సాధించి కర్నూలు నగరాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి సాయంతో స్మార్ట్ సిటీగా మారుస్తా. ఐదేళ్ల టీడీపీ పాలనలో స్మార్ట్ సిటీ అంటూ హడావుడి చేసి అభివృద్ధి చేయలేకపోయారు. గ్రూపు రాజకీయాలు, వర్గ విభేదాలతో కర్నూలు అభివృద్ధి కుంటుపడింది . -
విశ్వసనీయతకు ప్రతిరూపం జగన్
సాక్షి, అనంతతపురం : గ్రూప్–1 అధికారిగా పనిచేస్తున్న ఆయనకు జీవితం సాఫీగా సాగిపోయేది. రూ.1.80 లక్షల దాకా జీతం. తనకు ఇంతటి అవకాశమిచ్చిన సమాజానికి ఏదైనా చేయాలనే లక్ష్యంతో అప్పుడప్పుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో సేవాతత్పరతను చాటుకునేవారు. అయితే ఏదో అసంతృప్తి. సమాజానికి ఇంకా ఏదో చేయాలనే ఆకాంక్ష ఆయనను కుదురుగా ఉండనీయలేదు. రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మరింత దగ్గరగా ఉండి సేవచేయొచ్చని భావించారు. కుటుంబసభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులతో చర్చించి ఉద్యోగానికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనే గ్రూప్–1 అధికారి తలారి రంగయ్య. అనంతపురం పార్లమెంటు వైఎస్సార్సీపీ అభ్యర్థి. జిల్లావాసులకు ఆయన పీడీ రంగయ్యగా సుపరిచితుడు. పీడీ ఇంటిపేరు కాకపోయినా జిల్లాలో డీఆర్డీఏ పీడీగా పని చేసినంత కాలం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి విశేషకృషి చేశారు. దీంతో ఆయన పీడీ రంగయ్యగానే ఎక్కువ గుర్తింపు పొందారు. ఇంకా 13 ఏళ్ల సర్వీస్ ఉన్నా గ్రూప్–1 ఉద్యోగాన్ని వదులుకుని రాజకీయాల్లోకి రావడానికి కారణాలేంటి? ఆయనకు స్ఫూర్తిగా నిలిచిందెవరు? అన్న అంశాల్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. తలారి రంగయ్య అంతరంగం ఆయన మాటల్లోనే.. ప్రజాసేవ చేయాలనే ఆకాంక్ష జగన్‌తోనే సాధించగలను ‘‘వైఎస్ జగన్మోహన్రెడ్డి మనసు చూశా. వయసు చూశా. ఆయనకు పొద్దు వస్తోంది. చంద్రబాబుకు పొద్దు తిరిగింది. వైఎస్ జగన్ వెంట నడిస్తే మరో 40 ఏళ్ల భవిష్యత్తు ఉంటుంది. ఇన్నేళ్లుగా నేను అనుకున్నది సాధించే వీలుంటుంది. అదే చంద్రబాబు కీలకమైన ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి సాధించిందేమీ లేదు. రాజధాని నిర్మించలేదు. పోలవరం పూర్తిచేయలేదు. ప్రత్యేకహోదా తీసుకురాలేకపోయారు. ఆంధ్రపదేశ్ ఏర్పడినప్పటి నుంచి విడిపోయే దాకా రూ.96 వేల కోట్ల అప్పులుంటే ఈరోజు రూ. 2.50 లక్షల కోట్లకు చేరింది. ఈ నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. అదంతా అభివృద్ధి కోసమే ఖర్చుపెట్టామని ఆర్థికమంత్రి చెపుతున్నారు. మరి ఎక్కడ అభివృద్ధి చేశారో అర్థంకావడం లేదు. ఇవి ప్రమాదకరమైన ధోరణులు. వీటిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. సమాజం గురించి బాధ్యతగా ఆలోచించేవారు ఈ ప్రమాదకర ధోరణుల్ని గుర్తించి ప్రశ్నించాలి. వారిలో నేనొకడిని. కష్టాలతో కాపురం చేశా.. నేను చిన్నప్పటి నుంచి కష్టాలు, ఇబ్బందులతో కలిసి కాపురం చేశాను. బడుగు, బలహీన వర్గాల కష్టాలు ఎలాగుంటాయో తెలుసు. ఆర్థికంగా టీడీపీ అభ్యర్థి జేసీ కుటుంబంతో నేను సరితూగకపోయినా జగనన్న వెంట ఉన్న జనబలం నాకుంది. కరవుతో అల్లాడుతున్న అనంతపురం జిల్లా ఇక్కట్లపై పార్టీతో కలిసి నా శక్తివంచన లేకుండా జాతీయ స్థాయిలో పోరాడతాను. ఎంపీగా గెలిస్తే జిల్లాను సస్యశ్యామలంగా మార్చేందుకు నా శాయశక్తులా కృషిచేస్తాను. జిల్లాలోని బడుగు, బలహీన వర్గాల సమస్యల్ని అతి దగ్గర నుంచి చూసిన నేను వారికి అన్ని విధాలా సాయపడాలనే దృఢసంకల్పంతో ఉన్నాను. వారి సంక్షేమం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ తరఫున పార్లమెంటులో పోరాడతాను. ఇది మార్పునకు నాంది విశ్వసనీయత, విలువలు, వ్యవస్థలో మార్పు అనే పదాలు వైఎస్ జగన్ నోట ఎçప్పుడూ వస్తుంటాయి. అందులో భాగంగానే రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేస్తూ అట్టడుగు వర్గాల వారిని ఆదరించారు. ఎంపీ టికెట్లు రావాలంటే చిన్న విషయమా.? అందులోనూ ఇలాంటి జిల్లాల్లో బీసీ కులాలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వాలంటే మాటలా.? ఇతర పార్టీలు ఎప్పుడైనా ఈ విధంగా ఇచ్చాయా.? కనీసం ఆలోచనైనా చేశాయా.? వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్పునకు నాంది పలుకుతున్నారనేందుకు ఎంపీ, ఎమ్మెల్యేల సీట్లు కేటాయింపే నిదర్శనం. బీసీలంతా జగన్‌కు మద్దతుగా ఉన్నారు అత్యంత సామాన్యుడిని, బలహీన వర్గానికి చెందిన నాకు వైఎస్ జగన్మోహన్రెడ్డి టిక్కెట్ ఇచ్చారు. బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలంతా వైఎస్ జగన్‌కు మద్దతు చెబుతున్నారు. కచ్చితంగా విజయం సాధించి వైఎస్ జగన్‌కు గిఫ్ట్‌గా ఇస్తాం. బీసీ డిక్లరేషన్‌తో తన చిత్తశుద్ధి చాటుకున్నారు పార్లమెంటు, అసెంబ్లీ సీట్ల కేటాయింపులో బడుగు, బలహీన, అట్టడుగు వర్గాలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాధాన్యతనిచ్చారు. ఆయన ఎప్పుడూ చెప్పే ‘విశ్వసనీయత’ అనే పదానికి సీట్ల కేటాయింపుతో విలువ పెంచారు. పాలన, పదవులు, రాజ్యాధికారంలో బడుగు, బలహీనులకు సమాన అవకాశాలు ఇవ్వాలని 150 ఏళ్ల కిందటే జ్యోతిరావు పూలే చెప్పారు. ఆయన ఆలోచనల్ని తర్వాతి తరాల్లో అంబేడ్కర్, జగ్జీవన్‌రామ్, పెరియార్ తదితరులు పునరుద్ఘాటించారు. ఆ సిద్ధాంతాలను ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీలు అవలంభించలేదు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించి బీసీల పట్ల తన చిత్తశుద్ధి చాటుకున్నారు. తాము అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు, పనుల్లో సగం బడుగు, బలహీన వర్గాలకు ఇస్తానని ప్రకటించారు. అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు పదవుల్లోకి రావాలని కోరుకున్నారు. 41 అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇచ్చారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆరు ఎంపీ సీట్లు ఉంటే అందులో మూడు బీసీలకు కేటాయించారు. అంతకంటే ఏం కావాలి. బీసీలు చట్టసభల్లోకి రావాలనే లక్ష్యంతోనే మాలాంటి సామాన్యులకు సీట్లు కేటాయించారు. -
ఆయన పోరాటం నన్ను కదిలించింది
సాక్షి, అమరావతి : నాకు వైఎస్సార్ అంటే ప్రాణం. మా ఆదివాసీల పట్ల ఆయన చూపిన ఆదరణ, అప్యాయతను ఎప్పటికీ మర్చిపోలేం. మాకోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేశారు. పక్కా ఇళ్లు, పింఛన్లు, మోడల్ కాలనీలు, తాగునీటి పథకాలు, లక్షల ఎకరాల భూ పంపిణీతో పాటు విద్య, వైద్య సదుపాయాలు కల్పించారు. ఆరోగ్యశ్రీ పథకంతో పేద గిరిజనులకు కార్పొరేట్ వైద్యం అందింది. ఇప్పుడు ఆ రాజన్న రాజ్యం స్థాపన కోసం ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటం నన్ను కదిలించింది. అందుకే వైఎస్సార్‌సీపీతోనే రాష్ట్రాభివృద్ధి, గిరిజనులకు న్యాయం జరుగుతుందని భావించి ఆ పార్టీలో చేరాను. ఎమ్మెల్యేగా పనిచేసిన మా నాన్నను చిన్నప్పటి దగ్గర్నుంచి చూసిన నాకు ఎప్పటికైనా ఆయనలా ప్రజాసేవ చేయాలని అనుకునేదాన్ని. జగనన్నతో నా కల నిజమైంది. నాకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నిత్యం ఆదివాసీలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలన్నీ పరిష్కరిస్తాను’ అని పాడేరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సాక్షితో తన మనసులో మాటను బయటపెట్టారు. వైఎస్ మరణం.. గిరిజనులకు శాపం వైఎస్ హయాంలో నేను ట్రైఫాడ్ వైస్ చైర్‌పర్సన్‌గా పనిచేశాను. మా తండ్రి దివంగత కొట్టగుల్లి చిట్టినాయుడు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయనకు ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషిచేశారు. పాడేరులో ఆర్టీసీ డిపో, కాంప్లెక్స్ ఏర్పాటు, 50 పడకల ఆస్పత్రి, ప్రభుత్వ పాలిటెక్నిక్, డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు శ్రమించారు. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్ళు గడిచినా మా గిరిజనులకు పూర్తి స్థాయిలో సంక్షేమం అందలేదు. వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో మాత్రమే అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేరువయ్యాయి. ఆయన మరణాంతరం ఆదివాసీల సంక్షేమాన్ని టీడీపీ పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. కనీసం ఒక పూట కూడా పోషకాహారం అందక అత్యంత దయనీయ స్థితిలో ఆదివాసీలు జీవిస్తున్నారు. రవాణా సదుపాయాలు లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రులకు వెళ్ళలేక దేవుడి మీద భారం వేస్తున్నారు. నేను వైఎస్సార్సీపీలో చేరినప్పటి నుంచి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని మారుమూల గ్రామాల్లో విస్తృతంగా పర్యటించాను. ప్రధానంగా విద్య, వైద్యం, సురక్షిత తాగునీరు, రోడ్లు, అటవీ, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడం వంటి సమస్యలు గుర్తించాను. స్వలాభం కోసమే గిడ్డి ఈశ్వరీ పార్టీ ఫిరాయింపు ఐదేళ్ళ పాలనలో టీడీపీ ప్రభుత్వం ఆదివాసీలపై పూర్తి నిర్లక్ష్యం చూపింది. గిరిజనులంతా జగనన్న వెంట ఉన్నారనే కక్షతో ముఖ్యమంత్రి చంద్రబాబు మా సంక్షేమాన్ని విస్మరించారు. ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఆదివాసీల్ని అడవికి నుంచి దూరం చేయాలనే ఉద్దేశంతో బాక్సైట్ తవ్వకాలకు పూనుకున్నారు. జీవో 97తో ఆదివాసీల్ని భయభ్రాంతులకు గురి చేశారు. ఆదివాసీలతో కలిసి వైఎస్సార్సీపీ పోరాటం వల్ల బాక్సైట్ తవ్వకాలకు అడ్డుకట్టపడింది. మా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన స్వలాభం కోసం టీడీపీలోకి ఫిరాయించారు. తనకు అనుకూలమైన వారికి సబ్సిడీ రుణాలు, ట్రైకార్ పథకం ద్వారా వాహనాలు కేటాయించుకున్నారు. దీంతో టీడీపీ పట్ల, స్థానిక అభ్యర్ధి పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. జగనన్నతోనే ...రాజన్న రాజ్యం ఆదివాసీలు తమకు మేలు చేసిన వారిని ఎన్నటికీ మర్చిపోరు. వైఎస్సార్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇంకా వారి మనస్సులో అలాగే ఉన్నాయి. జగనన్న సీఎం అయితేనే మళ్ళీ రాజన్న రాజ్యం వస్తుందని ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం జగనన్న చేస్తున్న పోరాటానికి గిరిజనులంతా ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నారు. మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, టీడీపీపై వ్యతిరేకత కూడా నాకు కలిసి వస్తుందని నమ్ముతున్నాను. పార్టీ శ్రేణులు, గిరిజనులంతా పాడేరు ఎమ్మెల్యే స్థానాన్ని వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి గిఫ్ట్‌గా ఇవ్వాలని శ్రమిస్తున్నాం. టీడీపీ పాలనతో పాడేరు నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు. స్థానిక ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి నమ్మకద్రోహాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్ళీ ఇబ్బందులు పడేందుకు ఇక్కడి ప్రజలు సిద్దంగా లేరు. వారి జీవితాల్లో మార్పునకు ఇదే సరైన అవకాశం. నియోజకవర్గ ప్రజలు విజ్ఞతతో ఓటు వేసి మార్పునకు పట్టం కడతారని గట్టి నమ్మకముంది. -
‘సొంత తమ్ముడి మతిభ్రమించడానికి చంద్రబాబే కారణం’
జూనియర్ ఎన్టీఆర్ మామ వైఎస్సార్సీపీ నాయకులు నార్నె శ్రీనివాసరావు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. సభల్లో సమావేశాల్లో తరుచూ తమ్ముళ్లూ, తమ్ముళ్లూ అంటూ సంభోదించే చంద్రబాబు తన సొంత తమ్ముడు ఎక్కడున్నాడో, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుగు ప్రజలకు చెప్పగలడా అని సాక్షి టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సవాలు విసిరారు. చంద్రబాబు తమ్ముడు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా? చంద్రబాబు సోదరుడు రామ్మూర్తినాయుడు 1994లో రాజకీయాల్లోకి వచ్చి ఎన్టీఆర్ దగ్గర టికెట్ కోసం పోరాడితే, చంద్రబాబు ఇవ్వొద్దని అడ్డుకున్నారు. అప్పుడు లక్ష్మీ పార్వతి దగ్గరుండి రామ్మూర్తినాయుడికి టికెట్ ఇప్పించి పంపిస్తేనే ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అదే రామ్మూర్తి నాయుడికి మరోసారి చంద్రబాబు మోసం చేసి టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్‌గా నిలబడి స్వల్ప ఓట్లతో ఓడిపోయారు. రామ్మూర్తి నాయుడు, చంద్రబాబు సెట్అవ్వకముందు కష్టపడి ఖర్చుల కోసం అతనికి డబ్బులు పంపించేవారు. అన్నను ఎంతగానో ప్రేమిస్తే, టికెట్ విషయంలో చేసిన మోసాన్ని జీర్ణించుకోలేక రామ్మూర్తి నాయుడు మతిస్థిమితం కోల్పోయారు. రామ్మూర్తి నాయుడు ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నారో ఆంధ్రప్రదేశ్‌లో ఎవరికీ తెలియదు. ఈ రోజు గొలుసులు, తాళ్లతో కట్టేసి అతన్ని ఒక రూములో బంధించి పెడుతున్నారు. దమ్ముంటే సొంత తమ్ముడిని బయటికి తీసుకువచ్చి చూపించమనండి. అన్న మీద గుడ్డి నమ్మకంతో అన్నీ చేసిన తర్వాత మోసం చేయడంతో మతిస్థిమితం లేకుండా అయిపోయారు. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇటీవల ఎన్నికల అఫిడవిట్లో కూడా కోట్లకొద్ది ఆస్తులున్నట్టు పేర్కొన్నాడు. అలాంటింది సొంత తమ్ముడిని తీసుకెళ్లి ఓ ఆసుపత్రిలో చికిత్స చేపించలేడా. చంద్రబాబు ఒక మర్రి చెట్టులాంటివాడు. అతను ఎదుగుతాడు. మర్రిచెట్టు కింద గడ్డిపోచను కూడా మొలవనివ్వడు. చంద్రబాబు ఎదుగుదల కోసం దేనికైనా సిద్ధపడుతాడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబునాయుడుది కాదు. హరిక్రిష్ణ పెట్టిన భిక్షవల్లే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. హరిక్రిష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వర్లు పక్కనుండి తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడితే ఆ తర్వాత వారు ఎక్కడున్నారు. చంద్రబాబు నాయుడు వలస వచ్చినవాడు. చంద్రబాబు లేకపోతే తెలుగుదేశం పార్టీ బాగుండేది. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వలసొచ్చి ఈ రోజు అదే కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టాలని చూస్తున్నాడు. అతని ఎదుగుదల కోసం ఎన్ని అబద్ధాలైనా చెబుతాడు. దేనికైనా సిద్ధపడుతాడు. మనుషులని వాడుకుని, వదిలేయడం అతని నైజం. మోహన్ బాబు నోరు తెరిస్తే.. నిన్నకాక మొన్న పిల్లలతో కలిసి మోహన్ బాబు రోడ్డుపైకి వచ్చారు. టీడీపీ వాళ్లు మోహన్ బాబును బెదిరిస్తున్నారు. చంద్రబాబుది, మోహన్ బుబుది పక్క పక్క ఊర్లే. రామారావు దగ్గర చంద్రబాబు, లక్ష్మీ పార్వతి ఉన్నప్పుడు మోహన్ బాబు పక్కనే ఉన్నారు. ఆ సమయంలో ఏమేం జరిగిందో మొత్తం మోహన్ బాబుకు తెలుసు. ఒక వేళ మోహన్ బాబు నోరు తెరిస్తే బాబు తల ఎక్కడ పెట్టుకోవాలో కూడా దిక్కుతోచని పరిస్థితిలోకి వెళతాడు. చంద్రబాబువి అన్నీ దొంగ ట్రిక్కులు హరిక్రిష్ణకు అన్యాయం చేసాడని అందరూ అనే సరికి.. హరిక్రిష్ణ కూతురు సుహాసికి న్యాయం చేస్తున్నానని చెప్పి, ఆమెను తీసుకొచ్చి ఓడిపోయే కూకట్పల్లి సీటిచ్చారు. రాజమండ్రిలో నివసిస్తున్న అమ్మాయిని తీసుకొచ్చి హైదరాబాద్‌లో పోటికి నిలుచోబెట్టడం ఏంటి? మంచి చేయాలనుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోనే టికెట్ ఇచ్చేవాడు కదా. ఇవ్వన్నీ దొంగ ట్రిక్కులు. ఇటువంటివి చంద్రబాబు దగ్గర చాలా చూశా. 1998లోనే హ్యాండిచ్చాడు.. 1998లోనే చంద్రబాబు నాయుడు నన్ను పిలిచి చిలుకలూరి పేట టికెట్ ఇస్తా అని చెప్పాడు. దీంతో అక్కడే రెండేళ్ల పాటూ ఉండి దాదాపు కోటి రూపాయలు ఖర్చు కూడా చేశా. చివరి నిమిషంలో టికెట్ వేరే వ్యక్తికి ఇచ్చాడు. బంధువులను ఎవరినీ ఎదగనివ్వడు. నాతోపాటూ మరో 300 మందికి రాజ్యసభ సీటిస్తా అని హామీ ఇచ్చాడు. చంద్రబాబును ఎన్నో ఏళ్లుగా పక్కనుంచే చూశా. కుల పిచ్చి, గజ్జి ఉంది చంద్రబాబునాయుడుకే. వైఎస్ జగన్ చేసేదే చెబుతారు. అమలు చెయ్యలేనివి అస్సలు చెప్పరు. చంద్రబాబు అన్ని చెబుతాడు. ఏమీ చేయడు. పాలనలో తండ్రిని మించిన తనయుడు వైఎస్ జగన్ అవుతారు. కేవలం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికే పార్టీలోకి వచ్చా. దీని తర్వాత రాజకీయాల్లో కొనసాగను. -
ఐవైఆర్ కృష్ణరావుతో మన్సులో మాట
-
మనసులో మాట ఆర్ కృష్ణయ్య
-
వైఎస్ఆర్సీపీ నేత ఆనం రాంనారాయణ రెడ్డితో మనసులో మాట
-
జగన్ వెంటే సకల జనులూ
మనసులో మాట మనకోసం ఎంత వీలైతే అంత సహాయం చేస్తానంటున్న లీడర్ పక్షానే నిలుద్దామన్న ప్రగాఢ కోరిక కాపు సమాజంలో ఉందని టాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ అంటున్నారు. ముద్రగడ ఒక్కరు జగన్‌ను వ్యతిరేకించడం అంటే కాపు సమాజం మొత్తం వ్యతిరేకిస్తోందని కాదనీ, జగన్ చంద్రబాబులా అబద్దాలు చెప్పే ఉంటే ఈ నాలుగేళ్లు తానే అధికారంలో ఉండేవారన్నారు. 16 సీట్లలో మాకు బలం ఉందనుకుంటే అగ్రతాంబూలం జగన్‌కే ఇస్తామని గోదావరి జిల్లాల కాపు సమాజం చెబుతోందని, ఈసారి బాబుకు కాపులు ఓట్లేయడం కల్లోమాటేనని చెప్పారు. కాపులే కాదు.. అన్ని కుల వృత్తుల వారు జగన్‌కే ఓటేస్తారు అని పండు ముదుసళ్లు సైతం చెబుతున్నారు. జనం నాడి అలాగే ఉందంటున్న పృథ్వీరాజ్ అభి్రప్రాయం ఆయన మాటల్లోనే... థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అనే పేరు మీకు ఎలా వచ్చింది? కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఖడ్గం సినిమాలో పాత్ర అది. ఆ సినిమాలో నా పాత్రకు మొదట్లో డైలాగ్ సరిగా రాకపోవడంతో మొత్తం తిరిగి రాశారు. దాన్ని పలికే క్రమంలో ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అమ్మా ఇక్కడ’ అన్నాను. నా డైలాగ్ విరుపు చూసి ప్రొడక్షన్ వాళ్లు ఒకటే నవ్వడం చూశారాయన. వాళ్లు నవ్వుతున్నారంటే ఇక్కడేదో మ్యాజిక్ ఉంది. ఆ డైలాగ్ నువ్వు ఇలాగే చెప్పు. దాని డబ్బింగ్ కూడా నేను దగ్గరుండి ఇలాగే చెప్పిస్తాను అనేశారు. ‘ఆ లైట్ ఏంటి? ఏం మాకు తెలీదా.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’ అనే మేనరిజంను తెలుగు సమాజంలో అందరూ తమ సొంతం చేసుకున్నారు. అంత పాపులర్ అయింది. పరిశ్రమలో నన్ను నిలబెట్టి బతుకునిచ్చినవారు ప్రభాకరరెడ్డి, రావుగోపాలరావు కాగా, ఉన్నదున్నట్లుగా మాట్లాడుతూ, నెత్తిమీద కొండ పడి ఈ క్షణంలో నువ్వు చచ్చిపోతావు అని చెప్పినా సరే.. రైట్ రాజా అంటూ ధీమాగా ఉండే వ్యక్తి పోసాని కృష్ణమురళి. బెసకడు, భయపడడు. తన చదువు, రాజకీయాలు, సినిమాలు తప్ప మరి దేంట్లోనూ జోక్యం చేసుకోడు. జనసేన భవిష్యత్తు ఎలా ఉంటుంది? జనసేన భవిష్యత్తు గురించి నేను చెప్పలేను కానీ వైఎస్సార్ సీపీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. మండువేసవిలో రోహిణీ కార్తె సమయంలో ప్రజాసంకల్పయాత్ర 175వ రోజున వైఎస్ జగన్‌ని పాదయాత్ర సందర్భంగా కలిశాను. కొన్ని వేల కిలోమీటర్లు దూరం అలుపు లేకుండా నడుస్తూ జగన్ వెళుతుంటే పండు వృద్ధులు కలిసి నిన్ను చూసి వైఎస్ రాజశేఖరరెడ్డిని చూసినట్లే ఉంది. ఇక మేం చనిపోయినా చాలు అంటూ ఆయనతో మాట్లాడటాన్ని నేను స్వయంగా పాదయాత్రలో చూశాను. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ఎవరిని కలిసినా అందరూ అంటున్న మాట ఒకటే. ఈసారి సీఎం జగనే. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వ వైఫల్యమే ఇన్ని లక్షలమందితో పాదయాత్ర. జగన్ పాదయాత్రకు వస్తున్న జనం ఎవరో మొబిలైజ్ చేస్తే వచ్చినవారు కాదు. బాహుబలి సినిమా తీస్తున్నాం.. భారీగా జనం కావాలి అంటే ఒక అయిదువేల మందినైనా తీసుకొస్తాం. కానీ పాదయాత్ర అలాంటిది కాదు. కొన్ని లక్షల మంది హృదయాల్లోనుంచి వస్తున్న ఆవేదన, బాధ ప్రతిరూపమే అది. రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల మా అక్క డాక్టర్ అయింది అని చెబుతున్నారు జనం. పాదయాత్రలో ఒక మహిళ నాతోనే అంది. అన్నా ఇప్పుడు మేం తెలుగుదేశం పార్టీ వాళ్లం అని రుజువులు చూపిస్తున్నప్పటికీ మాకు ముక్కి ముక్కి 35 వేల రూపాయలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇస్తున్నారు. ఇతరుల మాట చెప్పడానికే లేదు అంటూ సొంతపార్టీ వాళ్లే టీడీపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఏపీ పల్లెల్లో చంద్రబాబు ప్రభుత్వంపై మామూలు వ్యతిరేకత లేదు. నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి ఇప్పుడు ధర్మపోరాటాల పేరిట అధర్మపోరాటాలు చేస్తున్నారు. కానీ నాలుగేళ్ల పాటు ప్రత్యేక హోదా కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే. వైఎస్ జగన్‌తో మీకు పరిచయం ఎలా కలిగింది? 2014లో దూరం నుంచి ఆయన్ని చూసి నమస్కారం పెట్టాను. ఇప్పుడు పాదయాత్రలో నేరుగా కలిశాను. ఇప్పుడు బంధం మరింతగా పెరిగింది. పాదయాత్రలో కొన్ని లక్షలమందిలో ఆయన్ని చూస్తున్నాను. జనంతో ఆయన మాట్లాడటం, ఆ విధానం చూసి ఈయన ఇంత సింపుల్‌గా ఉన్నాడే అనిపించేది. లోటస్‌పాండ్‌లో ఇంటిలో కూర్చోబెట్టి, మజ్జిగ తాగుదువుగానీ రా అన్నా అని పిలిచాడు. అంతే.. ఓపిక ఉన్నంతవరకు నా ప్రయాణం జగన్‌తోటే అని నిర్ణయించుకున్నాను. వైఎస్సార్ లేనిలోటు జగన్ తీరుస్తున్నాడంటూ ఒక నాటకం కూడా రూపొందించాం. దాన్ని ఏపీలో ప్రదర్శిస్తాం. చంద్రబాబుపై మీ అభిప్రాయం? చంద్రబాబుది అపర చాణక్యుడి కోవ. ఒక మనిషిపై వ్యతిరేక అభిప్రాయాన్ని ఎప్పుడూ బయటకు చెప్పకుండానే లోపల సెగ పెడుతుంటాడు. బాబు గురించి ఇదే నాకు తెలుసు. పైగా కేంద్రంతో నాలుగేళ్లు అంట కాగి ఇప్పుడు మాత్రం కేంద్రంపై ధర్మపోరాటం అంటే కుదురుతుందా. జనం అసలు నమ్ముతారా? బాబును, జగన్‌ని, పవన్‌ని... కాపు సమాజం ఎలా చూస్తోంది? తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను మొత్తంగా తిరిగేశాను. మనకోసం ఎంత వీలైతే అంత సహాయం చేస్తాను అంటున్న నాయకుడి పక్షానే నిలుద్దామన్న ప్రగాఢమైన కోరిక కాపు సమాజంలో ఉంది. ముద్రగడ ఒక్కరు జగన్‌ను వ్యతిరేకించడం అంటే కాపు సమాజం మొత్తం వ్యతిరేకిస్తోందని కాదు. అయితే జగన్ బాబులాగా అబద్ధాలు చెప్పే ఉంటే 2014 నుంచి ఇంతవరకు నాలుగేళ్లు ఆయనే అధికారంలో ఉండేవారు. 16 సీట్లలో మాకు బలం ఉందనుకుంటే అగ్రతాంబూలం జగన్‌కే ఇస్తామని కాపు సమాజం చెబుతోంది. ఇక బాబుపట్ల జనం పైకి నవ్వుతున్నా లోపల మాత్రం ఇప్పటికే నిర్ణయానికి వచ్చేశారు. ఈసారి బాబుకు కాపులు ఓట్లేయడం కల్లోమాటే. కాపులే కాదు ఎస్సీలు, బీసీలు, అన్ని కులవృత్తుల వారు జగన్‌కే ఓటేస్తామని పండు ముదుసళ్లు చెబుతున్నారు. జనం నాడి అలాగే ఉంది. (ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://bit.ly/2P1uanX https://bit.ly/2P1erFD -
నటుటు పృధ్వీతో మనసులో మాట
-
విజ్ఞాన్ సంస్థల అధినేత లావు రత్తయ్యతో మనసులోమాట
-
జనాకర్షణలో జగన్ ముందంజ
జనాకర్షణలో, జనాభిప్రాయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ముందంజలో ఉన్నారని, రాజకీయంగా ఆయన పరిస్థితి ప్రస్తుతం పుంజుకుందని సీనియర్ రాజకీయనేత, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య స్పష్టం చేశారు. అదేసమయంలో పాలన విషయంలో చంద్రబాబునాయుడికి పాస్ మార్కులు ఇవ్వొచ్చని, అయితే ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా బాబు మళ్లీ ప్రభుత్వంలోకి వస్తాడా అనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్, చంద్రబాబు పాలన రెండు పద్ధతుల్లో నడుస్తోంది కానీ వారి పాలన, వారి వ్యవహారం అందరికంటే ముందు ప్రజలకు నచ్చాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేస్తున్న భారీ అప్పు వాంఛనీయం కాదని, దాన్ని తిరిగి చెల్లించడం కష్టమని, ప్రజలకు ఇది భారమంటున్న రోశయ్య అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... సుదీర్ఘ రాజకీయ అనుభవం మీది. ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగానే ఉంది. కాని జరుగుతున్న పరిణామాలు జీర్ణం కావటం లేదు. ఎందుకంటే మా రోజుల్లో ఒక నాయకుడు ఆయనను అనుసరించేవారు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు అలాకాదు కదా. నాయకుల సంఖ్య ఎక్కువ అయిపోయింది. బాగా పెరిగిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో పాలన ఎలా ఉంటుందనుకుంటున్నారు? మా కాంగ్రెస్ వాళ్లు చెబుతున్నారు కదా అంత ప్రజారంజకంగా లేదని. నేను ఇప్పుడు రాజకీయాల్లో చురుగ్గా లేకపోయినా ఆ భావజాలం ప్రభావం కొంత ఉంది. యనమల రామకృష్ణుడు తీరు కానీ, చంద్రబాబు అప్పులు చేస్తున్న వైనంపై మీ అభిప్రాయం? అవగాహన లేకుండా ఆర్థికమంత్రి, ముఖ్యమంత్రి ప్రభుత్వాన్ని నడపటం కష్టం. ఆర్థిక నిర్వహణకు సరైన అవగాహన ఉండాలి. తెలంగాణలో లక్ష కోట్లు, ఏపీలో లక్షా పాతిక కోట్ల రూపాయల అప్పు పోగుపడింది కదా? కాలం మారింది. విలువలు మారుతున్నాయి. అప్పుచేయడం గొప్పే. అప్పు అందరికీ పుట్టదు. కానీ నాకు అప్పు పుట్టింది అనుకునే వారున్నారు. ఇది చాలా ప్రమాదం. ఎందుకంటే ఈ భారీ అప్పులను తీర్చడం కష్టం. మళ్లీ ప్రజలనుంచే రాబట్టాలి. చంద్రబాబు ప్రభుత్వం రూ. 2 వేల కోట్ల విలువైన బాండ్లను 10.37 శాతం వడ్డీకి తీసుకుంది కదా? అది మంచి పద్థతి కాదు. వాంఛనీయం కాదు. రాష్ట్రానికి ఇది నష్టమే. ఫిరాయింపుదార్లకు మంత్రిపదవులు ఇవ్వడం సరైందేనా? నువ్వు వస్తే నీకు మంత్రి పదవి ఇస్తా అని ప్రలోభ పెట్టడం సరైంది కాదు. కానీ అవి కూడా జరుగుతున్నాయి. స్పీకర్ సాక్షాత్తూ ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేయవచ్చా? పాలాభిషేకం చేసిన విషయం నాకు తెలీదు. కానీ పార్టీ సమావేశాలకు మామూలు రోజుల్లో అయితే వెళ్లవచ్చు. కానీ ఇదివరకు అలా స్పీకర్లు ఎవరూ వెళ్లేవారు కాదు. వ్యక్తుల స్థాయిలో ఎవరైనా వెళ్లిన సందర్భాలున్నాయి. ఏపీలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకునే స్థితి ఉందా? సీట్ల విషయంలో చెప్పలేను కానీ ఈసారి ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకునే అవకాశం అయితే ఉంది. కొంత మెరుగవుతుంది చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా? చూడాలి. ఎన్నికల్లో ఎవరెవరు ఏ పాత్ర వహిస్తారో, ఎవరు పోటీ చేస్తారో చూస్తే గాని చెప్పలేం. ప్రభుత్వ వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో ఏమేరకు ఉంటుంది? అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ఏదోమేరకు ప్రజా వ్యతిరేకత ఉంటుంది. బాబు పాలనకు మీరెన్ని మార్కులు ఇస్తారు? పాస్ మార్కులు ఇవ్వొచ్చు. అంటే 30 శాతం మార్కులు వేయవచ్చు. అయితే మళ్లీ ప్రభుత్వంలోకి వస్తాడా అనేది ఇప్పటికిప్పుడే చెప్పలేం కదా. వైఎస్ జగన్‌కు ఎన్ని మార్కులు వేస్తారు? జగన్ పరిస్థితి బాగానే ఉంది. ఎన్ని మార్కులు అని చెప్పలేను కానీ అతడి భవిష్యత్తు మాత్రం ముందంజలోనే ఉంది. వైఎస్‌తో మీకున్న అనుబంధం ఏమిటి? రాజశేఖరరెడ్డి చాలా మంచి స్నేహితుడు. నేను దేనిపైనైనా విభేదిస్తే అందరిముందరా లేక ప్రెస్ ముందర చెప్పేవాడిని కాదు. విడిగా కలిసి తనతో మాట్లాడేవాడిని. ఆయన వాటిని చక్కగా రిసీవ్ చేసుకునేవారు. అలిపిరి ఘటనలో చంద్రబాబు గాయంపై మీరు అప్పట్లో వ్యంగ్యాస్త్రాలు సందించారు కదా? అవును. ఒక చేతికి కట్టుకోవలిసింది మరోచేతికి కట్టు కట్టించుకున్నాడు. ఆ విషయం మీలాంటి స్నేహితుడు ఒకరు చెబితే దాన్ని మనసులో పెట్టుకుని విమర్శ చేశాను. ‘ఇంతమంది డాక్టర్లు ఉన్నారు ఆయనకు సరైన వైద్యం చేసేవాళ్లు కనబడటం లేదు’ అని విమర్శించాను. తర్వాత బాబు అర్థం చేసుకుని ఆ కట్టే లేకుండా తీయించుకున్నాడు. చంద్రబాబు కొండెత్తమంటాడు అనే విమర్శ కూడా చేశారు కదా మీరు? హామీలు ఇచ్చేటప్పుడు అంతులేకుండా భారంతో కూడిన హామీలు ఇచ్చేవాడు. వాటిని పూర్తి చేయాలంటే మీరంతా తలా ఒక చేయి వేసి ఎత్తితే కదా అనే సందర్భంలో ‘కొండెత్తు’ అనే మాట వాడాను. విభజన చేసి కూడా రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ మునిగిపోవడంపై మీ అభిప్రాయం? సకాలంలో నిర్ణయం తీసుకోకపోవడం. ఏ నిర్ణయంలో అయినా సరే ఆలస్యంగా నిర్ణయం చేశారు. రాష్ట్రం వైపు నుంచి విభజనకు సంబంధించిన సమాచారం కూడా సకాలంలో ఇవ్వలేదు. అలా నష్టం జరిగింది. అయితే ఢిల్లీలో అత్యున్నత స్థాయిలో తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఇక్కడ కూర్చొని మనం తేల్చలేం. విభజనతో మునిగిపోతాం అని మా వంతుగా చెప్పాల్సింది చెప్పాం. కాని సోనియా తన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాని పరిస్థితి వస్తుందని మీరెన్నడైనా ఊహించారా? ఊహించలేదు. కానీ పరిస్థితులు అలా దారితీశాయి. అయితే కాంగ్రెస్ ఏపీలో కోలుకోవడానికి మళ్లీ అవకాశముంది. ఏ పార్టీ అయినా నిండా మునగదు కదా. కేసీఆర్, చంద్రబాబు ఇద్దరి పాలన ఎలా ఉంది? రెండూ రెండు పద్ధతులు. వారి పాలన నాకు బాగుండటం కాదు. వారి పాలన, వారి వ్యవహారం అంతిమంగా ప్రజలకు బాగుండాలి కదా. (ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) http:// bit. do/ exZiv http:// bit. do/ exZiH -
మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్యతో మనసులో మాట
-
చుక్కా రామయ్యతో మనసులో మాట
-
రాజధానికోసం ఇంత వెంపర్లాటా?
ప్రపంచంలోనే ఉత్తమ రాజధాని అంటూ పదే పదే బాకాలూదడం చాలా తప్పని హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య పేర్కొన్నారు. రాజ్యాంగం విధించిన 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లను అదనంగా కల్పిం చటం అసాధ్యమని, ఆరునెలల్లో పలానావారికి రిజర్వేషన్లు ఇచ్చేస్తామని ప్రకటించడం బోగస్ అని ఆక్షేపిం చారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారనీ, ఓటుహక్కును సరిగా వినియోగించే సామర్థ్యం వారికుందని, ఎవరిని దింపాలో, ఎవరిని గెలిపించాలో కూడా వారికి బాగా తెలుసంటున్న పద్మనాభయ్య అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... మీ బాల్య జ్ఞాపకాల గురించి చెబుతారా? కృష్ణాజిల్లా కౌతులం అనే పెద్ద గ్రామంలో పుట్టాను. సంపన్న కుటుంబంలోనే పుట్టాను. అతి సామాన్యమైన బీద కుటుంబంలో పెరిగాను. కారణం ఊహ తెలిసేసరికి మా ఆస్తి మొత్తం పోయింది. అందుకే నాది కష్టమైన బాల్యం. గుడివాడ కాలేజీలో చది వాను. తర్వాత ఆంధ్రయూనివర్శిటీకి వెళ్లాను. యూనివర్సిటీలో ఐఏఎస్‌కు ఎంపికైన అభ్యర్థిని ఊరేగిస్తుంటే చూశాను. ఆ స్ఫూర్తితోనే నేనూ ఐఏఎస్ చదివి అదృష్టపశాత్తూ పాస్ అయ్యాను. ఒక రాష్ట్రం 70 వేల కోట్లు కావాలి అంటే ఇచ్చేస్తారా? విభజన సమయంలో భారీ సహాయం చేస్తామని కేంద్రప్రభుత్వమే ఒప్పుకుంది కదా. పలానా సహా యాలు చేస్తాం అని విభజన చట్టంలో స్పష్టంగా రాశారు. 13వ షెడ్యూల్లో విద్యాసంస్థలు ఇన్ని పెడతాం అని చెప్పారు. వాటిని ఇవ్వాలి కదా. ఇప్పటికే 11 విద్యాసంస్థలను ఇచ్చారు కదా? పదేళ్లలో అన్ని విద్యా సంస్థలనూ పెడతామని కేంద్రం చెప్పింది. ఇప్పటికి నాలుగేళ్లయింది. ఒక్క సంస్థకు కూడా బిల్డింగ్ లేదు. అన్నీ తాత్కాలికంగా నడుస్తున్నాయి. ఇప్పటికి వీటన్నిటికీ కలిపి 500 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఈ లెక్కన మొత్తం రావాలంటే 30 ఏళ్లు పడుతుంది. అంటే అంతవరకు మనం వేచి ఉండాలా? పదేళ్లలో అన్నీ ఇస్తామన్నప్పుడు సంవత్సరానికి ఎంతవుతుందో లెక్కలు వేసి అదైనా ఇవ్వాలి కదా? స్టీల్ ప్లాంట్, పోర్టులు, మెట్రో, రైల్వే జోన్, వైజాగ్–చెన్నై కారిడార్ వంటి వాటికి ఫీజిబులిటీ ఉందా లేదా అని ఆరు నెలల్లో తేల్చివేసి మరో ఆరునెలల్లోగా నిర్ణయం తీసుకుంటామని చెప్పిన కేంద్రం ఇంతవరకు ఏం చేసింది? విజయవాడ మెట్రో లాభదాయకం కాదని 2017లో అంటే మూడేళ్ల తర్వాత చెబితే ఎవరిది తప్పు? ఎందువల్ల కేంద్రం సహాయం చేయలేకపోతోంది? 14వ ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేక హోదాను రద్దు చేయాలని చెప్పిందట. కేంద్రం దీన్ని ముందుకు తీసుకొచ్చింది. కాని అది తప్పు. నిజంగానే తప్పు ప్రకటన. దాన్ని ఇంకా చర్చకు పెట్టడం దేనికి? పోలవరం గురించి మీ అభిప్రాయం? పోలవరం విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా మంచి పని చేసింది. కొన్ని మండలాలను ఏపీలో కలి పారు. మొత్తం నిధులు ఇస్తామని చెప్పారు. ఏ ప్రాజెక్టునైనా నీతిమంతంగా పూర్తి చేయడం వాంఛనీయం. ఎవరు చేపట్టినా అవినీతికి దూరంగా ఉంటేనే మేలు జరుగుతుంది. ఆ నీతి తప్పే అవకాశం ఉన్నప్పుడు కేంద్రం చేపట్టినా, రాష్ట్రం చేపట్టినా ఫలితం ఒకటే. కేసీఆర్, బాబులపై మీ అభిప్రాయం? మొత్తం మీద చూస్తే తెలంగాణలో పాలన బాగుంది. ఒకకోణంలో కేసీఆర్ చాలా సమర్థుడు. ఆయన కేబి నెట్ కూడా సమర్థులతో నిండి ఉంది. కానీ అమరావతికి కానీ, విజ యవాడకు ఇంతవరకు నేను విభజన తర్వాత వెళ్లలేదు కాబట్టి అక్కడ ఏం జరుగుతోంది అనేది నేను చెప్పలేను. రాజధానికి 50 వేల ఎకరాలు అవసరమా? రాజధాని విషయంలో బాబు వాదనతో నేను ఏకీభవించలేను. ప్రపంచంలోనే ఉత్తమ రాజధానిని కట్టాలంటే డబ్బు అవసరం. నీవద్ద డబ్బులుంటే కట్టవచ్చు. పదేళ్లు రాజధానిలో పరిశ్రమలు వచ్చి నిర్మాణాలు జరిగితే అప్పుడు రాజధాని నిర్మాణం గురించి ఆలోచించవచ్చు. ఇంకా ఇతర సమస్యలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ పక్కనబెట్టి ఉత్తమ రాజధాని అంటూ పదే పదే ప్రచారానికి దిగటం చాలా తప్పు. తెలుగు రాష్ట్రాల్లో ఫిరాయింపులపై మీ అభిప్రాయం? ఫిరాయింపుల వ్యతిరేక చట్టం ఈ దేశంలో ఉందా అని సందేహం వేస్తోంది. లేదసులు. ఆంధ్రలో ఎన్నికైన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? తెలంగాణలో ఎన్నికైన టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య ఎంత? ఇప్పుడు ఈ పార్టీల్లో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? ఏమయ్యారు ఇప్పుడు? ఆంద్రాలో 23 మంది, తెలంగాణలో 25 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలోకి జంప్ అయితే ఇంతవరకు వారిపై ఏ నిర్ణయాలూ తీసుకోలేదు. మొత్తం రుణమాఫీ చేస్తామనడం మోసం కాదా? ఇలాంటి హామీలు ఇవ్వడమే తప్పు. నిరుద్యోగులకు భృతి కల్పిస్తామని తాజాగా ప్రకటించారు. నాలుగేళ్లయ్యాక ఎన్నికల నేపధ్యంలో ఇస్తున్నారనే ఆరోపణ సహజంగానే వస్తుంది మరి. పైగా నిరుద్యోగులను ఆదుకోవడం అంటే దానికి కూడా నిర్ణీత గడువు ఉండాలి. సంవత్సరమో, రెండేళ్లో భృతి ఇస్తాం కానీ ఆ లోపలన మీరు ఏదైనా పని, ఉద్యోగం చూసుకోవాలి అని షరతు ఉండాలి. వరుసబెట్టి మాఫీలు చేస్తామనటం ఏమిటి? రిజర్వేషన్లపై నేతల అడ్డగోలు ప్రకటనలు సరైనవేనా? ఏ రిజర్వేషన్ అయినా రాజ్యాంగంలో విధించిన 50 శాతం పరిమితికి మించినట్లయితే అది రిజర్వేషన్ కాదు. జనాభాలో మెజారిటీ రిజర్వేషన్ పరిధిలోకి రావడం అనేది అర్థరహితం. 50 శాతం రిజర్వేషన్ అనేది అత్యంత హేతుపూర్వక నిర్ణయం. తమిళనాడులో బ్రిటిష్ కాలం నుంచి పరిమితికి మించిన రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి వాటిని ఇప్పుడూ కొనసాగిస్తున్నారు. అది అక్కడికే పరిమితం. అన్ని చోట్లా ఆ పరిమితిని మించి ఇవ్వాలి అంటే అది కుదిరే పని కాదు. ఆరునెలల్లో పలానావారికి రిజర్వేషన్లు ఇస్తాం అనే ప్రకటనలు బోగస్. అలా జరిగే అవకాశమే లేదు. ఇలాంటి ప్రకటనలకు బదులుగా, సమాజాన్ని మొత్తంగా డివైడ్ చేసి జనాభా ప్రకారం నూటికి నూరు శాతం రిజర్వేషన్లు అందరికీ ఇచ్చేస్తే గొడవే లేదు కదా. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీరిచ్చే సందేశం? సందేశం కాదు కానీ, ప్రజలు తమ ఓటు హక్కును సరిగా వినియోగించుకోవాలి. మీ ఓటు విలువైనది. మన ప్రజలు చాలా తెలివైన వారు. అంతటి శక్తిమంతురాలైన ఇందిరాగాంధీనే వారు ఏకంగా దింపేశారు. మళ్లీ ఆమెను అలా సెలెక్ట్ చేసుకున్నారు. దేశం ఎలా నడుస్తోందీ, ఏం జరుగుతోందీ ప్రజలకు తెలుసు. వారు సరైన నిర్ణయమే తీసుకుంటారు. (ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://bit.ly/2Ojb5K9 https://bit.ly/2OQman6 -
డాక్టర్ ప్రేమ్‌సాగర్‌రెడ్డి తో మనసులో మాట
-
దొరకని దొంగ చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంలో చంద్రబాబు నమ్మకద్రోహి అనే అభిప్రాయం బలపడిపోయిందని, 2019 ఎన్నికల్లో ఏపీలో వైఎస్సార్సీపీ చేతిలో టీడీపీ తుడిచి పెట్టుకుపోవడం నూటికి రెండువందల శాతం ఖాయమని టీడీపీ మాజీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు తేల్చి చెప్పారు. ఆంధ్ర ప్రజల హృదయాల్లో చంద్రబాబుకు స్థానం లేకుండా పోయిందని, ఎన్టీఆర్ తాను చనిపోయేముందు బాబు మోసగాడు, నమ్మొద్దు అని ఎలాగయితే చెప్పారో అది ఇవ్వాళ కూడా ఏపీలో నిజం కాబోతోందని స్పష్టం చేశారు. దేశ రాజకీయాల్లోనే దొరకని దొంగ చంద్రబాబే అంటున్న నరసింహులు అభిప్రాయం ఆయన మాటల్లోనే... తెలంగాణకు బాబు మద్దతు నేపథ్యం ఏమిటి? 2004లో 2009లో టీడీపీ ఎన్నికల్లో ఓడిపోయింది. 2009 నాటికి తెలంగాణ ఉద్యమం బలం పుంజు కుంది. దాన్ని గ్రహించే బాబు తెలంగాణ ట్రంప్ కార్డు తీశారు. తెలంగాణపై మీరు తీర్మానం పెట్టండి నేను సపోర్టు చేస్తాను. తీర్మానం చేసే దమ్ము మీకుందా అని బాబు కాంగ్రెస్ నాయకత్వానికి సవాల్ చేశాడు. బాబు ఇలా దమ్ముందా అని ఎప్పుడైతే సవాల్ చేశాడో సోనియాగాంధీ అదే అదునుగా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన ఇప్పించేసింది. కానీ లోపల మాత్రం తెలంగాణ రాదని బాబుకు బలంగా ఉండేది. మనమెన్ని సవాళ్లు చేసినా వాళ్లు తెలంగాణ ఇవ్వడం జరిగేది కాదని బాబు నమ్మకం. తెలంగాణ ఎక్కడొస్తుంది, కానీ మనం పార్టీపరంగా తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిం చాలి అని బాబు చెబుతుండేవాడు. కానీ సోనియా అక్కడ ప్రకటించగానే ఒక్కసారిగా బాబు యూటర్న్ తీసుకున్నాడు. ఇదెలా ఇస్తారు మధ్యరాత్రి ఎలా ఇస్తారు అంటూ రివర్స్ అయ్యాడు కాబట్టే తెలంగాణ ఉద్యమం మొత్తంగా బాబు వ్యతిరేక ఉద్యమంగా మారిపోయింది. టీడీపీ వ్యతిరేక ఉద్యమమే తెలం గాణ ఉద్యమం అయిపోయింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వమని టీడీపీ డిమాండ్ చేసినా జనం నమ్మలేదు. బాబు వైఖరి గమనించే టీడీపీ ప్రభుత్వంలో గతంలో పనిచేసిన ఏ ఒక్క మంత్రి కానీ, ఎమ్మేల్యే కానీ, నాయకులు కాని తెలంగాణ ఉద్యమకాలంలో బాబు దరిదాపుల్లోకి కూడా ఎవరూ పోలేదు. బాబే స్వయంగా నాతో చెప్పాడు. తెలంగాణలో ఏ ఒక్క టీడీపీ నేతా నావద్దకు రాలేదు చూశావా నర్సింహులూ అని బాధపడ్డాడు బాబు. దానికి నేను ఒకే మాట చెప్పా. ‘బయట మిమ్మల్ని ఎవరూ నమ్మలేదండి’ అనేశాను. ఆత్మను అమ్ముకుని బతికే దొంగ బాబు. తనను నమ్మకండి అని ఎన్టీఆరే చివరిదశలో లోకానికి చెప్పారు. అందుకే బాబు ముందు డేర్‌గా అనేశాను. మిమ్మల్ని ఎవరూ నమ్మటం లేదు. ఒకవేళ నమ్మటం అంటూ జరిగితే వారి గొంతు కోసేంతవరకు మీరు ఊరుకోరు అని కూడా అనేశాను. బాబు మాట ఇస్తే నిలబడతాడు అనే విశ్వసనీయతను నా విషయంలో కూడా కోల్పోయాడు. నా విషయంలో బాబు చేసిందానికి నష్టం నాకు కాదు, బాబు విశ్వసనీయతే గంగలో కలిసింది. ఓటుకు కోట్లు కేసులో బాబు పాత్ర? బాబులో ఏమూలైనా విశ్వసనీయత అనేది ఉండి ఉంటే ఓటుకు కోట్లు కేసుతో అది పూర్తిగా పోయింది. ఎన్నికల్లో గెలిచిన తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రయత్నిస్తారా, డబ్బులతో కొంటారా, ఇంత అన్యాయమా అని బాబును సామాన్యుడి నుంచి మేధావుల దాకా అందరూ ఏవగించుకున్నారు. ఆ ఘటనలో టీడీపీ పరువు మొత్తం పోయింది. ఏంపీలు, ఎమ్మెల్యేలు, కేడర్, ప్రజలు బాబు నిర్వాకంపై దుమ్మెత్తి పోశారు. అంత నిరనస, వ్యతిరేకత వచ్చింది కాబట్టే దొంగలాగా ఎవరికీ చెప్పకుండా చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయాడు. తెలంగాణలో ఏ ఒక్కరికీ అంటే నాయకులకూ, కేడరుకు, ప్రజలకు చెప్పకుండా అమరావతికి పారిపోయాడు. పైగా మోదీ దగ్గరకు పరుగెత్తాడు. తిరుపతి లడ్డు, శాలువా పట్టుకెళ్లి కప్పి కాపాడు అంటూ మోదీ కాళ్లమీద పడ్డాడు. బ్రహ్మదేవుడు కూడా నిన్నిక కాపాడలేడు బాబూ అని కేసీఆర్ ఎప్పుడయితే దేవరకొండలో ప్రకటించాడో అప్పుడే బాబులో భయం పట్టుకుంది. రక్షకుడు మోదీనే అని ఢిల్లీ పరుగెత్తాడు. ఆ తర్వాత తప్పయిపోయిందని కేసీఆర్ ముందు సాగిలబడితే అప్పుడు కేసీఆర్ క్షమించాడు. ఇదీ బాబు బతుకు. ఓటుకు కోట్లు కేసుతో నా జీవితంలో రెండు రాత్రులు నిద్రపోలేదు అని బాబు పార్టీ అంతర్గత సమావేశంలో చెప్పిన మాటలు మీడియాలోనూ వచ్చేశాయి. బాబును చివరిదాకా మీరు సమర్థిస్తూ వచ్చారే? దొంగయినా, లంగయనా ఒక పార్టీలో ఉన్నప్పుడు నాయకుడిని ఎంతో కొంత కాపాడాలి కదా. అందుకే ప్రెస్ కాన్ఫరెన్సులు బంద్ చేశాను. ఇక రేవంత్ కేసు విషయంలో బాబునే నేరుగా అడిగేశాను. తప్పో రైటో కానివ్వండి. ఆ వాయిస్ మీదే కదా.. మా అభ్యర్థి గెలవాలి. అందుకే అలా మాట్లాడాను. తప్పేముంది, ఆ వాయిస్ నాదే అని చెప్పి ఉంటే బాగుం డేది కదా అని అడిగాను. ‘నాదే అని చెబితే వేరే పరిణామాలు ఉంటాయి నరసింహులూ’ అన్నాడు బాబు. తప్పు రేవంత్ రెడ్డిది మాత్రమే అయితే బాబు మరుక్షణంలో రేవంత్‌ను సస్పెండ్ చేసేవాడు. కానీ ఈయన కూడా దాంట్లో భాగస్వామి కాబట్టి కిమ్మనకుండా ఉండిపోయాడు. ఆ తర్వాత తెలంగాణ కాబోయే సీఎంగా రేవంత్‌ని పైకి లేపాడు బాబు. మా పార్టీ మొత్తానికి అదే మెసేజ్ వెళ్లిపోయింది. రేవంత్ ఓటుకు కోట్లకేసులో ఎక్కడ అప్రూవర్ అయిపోతాడేమో అనే భయంతో బాబు రేవంత్‌కి లొంగిపోయాడు. రేవంత్ స్టీఫెన్సన్ ముందర డబ్బు పేరుస్తూ మా బాస్ అనే మాట ప్రస్తావించాడు కదా. ఎవరండీ ఆ బాస్. బాబు కాదా. ఈరోజుకీ లోకేశ్ పొద్దున నిద్రలేచింది మొదలు పదిసార్లు రేవంత్ రెడ్డికి పోన్ చేస్తాడు. ఇక బాబు ఏదో ఒక సందర్భంలో రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్నాడు ఇప్పటికీ. ఈ కేసును పైకి తీస్తే ఏమవుతుందో, రేవంత్ ఏం మాట్లాడతాడో అనే భయం ఇప్పటికీ బాబును వెంటాడుతోంది. ఈసారి ఏపీలో గెలుపు ఎవరిదని భావిస్తున్నారు? ఆంధ్రప్రజలకు నిజంగా ఏమాత్రం అలోచన ఉన్నా, చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలి. ఊర్లలోకి రానీయవద్దు. నాలుగేళ్లు బీజేపీ పార్టీతో అంట కాగిన బాబు ఇప్పుడు ప్రత్యేక హోదా రాకపోవడానికి కారణం బీజేపీ అంటున్నాడు. ప్రత్యేకహోదా వద్దు అన్న బాబుకు ఇవాళ ప్రత్యేకహోదా గురించి మాట్లాడే హక్కే లేదు. పైగా బాబు సీఎంగా ఉన్నంత వరకు ఏపీకి ప్రత్యేకహోదా రాదు. ఏపీ ప్రజలే తమ భవిష్యత్తును నిర్ణయించుకోవాలి. ప్రత్యేకహోదా తీసుకొచ్చే దమ్ము వైఎస్ జగన్‌కి మాత్రమే ఉంది. (ఇంటర్వూ్య పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://bit.ly/2AdOL2a https://bit.ly/2Oa7hLU -
మోత్కుపల్లి నర్సింహూలుతో మనసులో మాట
-
విరసం నేత వరవరరావుతో మనసులో మాట
-
సీఎంకు రెండు క్యాంప్ ఆఫీసులు ఉండవు
-
ఏపీ మాజీ సీఎస్ అజయ్ కల్లంతో మనసులో మాట
-
అన్యాయమైపోతోంది అబద్ధాల బాబే!
♦ మనసులో మాట అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్ని నిజంగా మల్చడంలో చంద్రబాబు నిష్ణాతుడని, పచ్చి నిజాన్ని కూడా అబద్ధం చేయదల్చుకుని ఇప్పుడు బాబే అన్యాయమైపోతున్నాడని కేంద్రమాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు పేర్కొన్నారు. ప్రత్యేకహోదా వద్దని ప్రత్యేక ప్యాకేజీనే ముద్దని బాబే ఒప్పుకుని ఇప్పుడు అన్యాయం అంటే కుదరదని, వాస్తవానికి ప్యాకేజీలో భాగంగా ఇస్తామని చెప్పిన మొత్తం కంటే రూ.70 వేల కోట్ల అదనపు సహాయం కేంద్రం ఇప్పటికే మంజూరు చేసిందన్నారు. తాను చేసిన తప్పుల్ని ఎక్కడ బయటపెడతారో, వాటిని ప్రజలు ఎక్కడ నమ్ముతారో అనే అభద్రతా భావానికి గురై ‘నన్ను ఏదో చేయాలని చూస్తున్నారు, కేసులు పెట్టబోతున్నారు, ఏమేమో చేయబోతున్నారు’ అని చంద్రబాబు తానే ముందుగా చెబితే అది డిఫెన్సులో పడటమేనన్నారు. చంద్రబాబు చెబితే మోదీకి వ్యతి రేకంగా ఓట్లు పడేటంత సీన్ లేదంటున్న కృష్ణంరాజు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... సినిమా, రాజకీయం వీటిలో మీకు బాగా నచ్చేది? తొలినుంచి సినిమా అంటే ఆసక్తి ఎక్కువ. నేను సినిమాల్లోకి వచ్చి ఇప్పటికీ 50 ఏళ్లయింది. వాస్తవానికి మా కుటుంబం పూర్తిగా రాజకీయ కుటుంబం. నాన్న స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. మా మామయ్య మూర్తి గతంలో మంత్రిగా పనిచేశారు. అంతకంటే ఎక్కువగా భూదానోద్యమ సమయంలో ఆయన తన 800 ఎకరాల భూమిని ఉద్యమానికి ఇచ్చేశారు. నన్ను సినిమాల్లోకి ప్రోత్సహించింది కూడా ఆయనే. మోదీని నమ్మకద్రోహి, మోసగాడంటున్న బాబు వచ్చే ఎన్నికల్లో తాను గెలవడంటున్నారు కదా? పచ్చకామెర్లు ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనబడుతుంది మరి. అబద్దాలు చెప్పేవాడికి ఎవరు ఏం చెప్పినా అబద్ధంలాగే కనిపిస్తుంది. చంద్రబాబు తెలి వితేటలు ఏమిటంటే అబద్ధం చెప్పి నిజాన్ని కూడా అబద్ధం చేయదల్చుకుని ఇప్పుడు అన్యాయమైపోయాడు. అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్ని నిజం చేద్దామని సమయమంతా దానికే వృథా చేసి, దానిమీదే మనసు పెట్టి అన్యాయమైపోబోతున్నాడు. నాలుగేళ్లు కలిసివుండి ఇప్పుడు తిట్టుకుంటే ఎలా? మోదీ బాబును ఎక్కడ మోసం చేశారో ఒక్క పాయింట్ చెప్పండి. మోదీ మోసం చేయడమేమిటి? హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ కావాలని ముందుగా ఒప్పుకువు, ఇప్పుడు హోదా అంటే ఎలా? బాబును అలా మోదీ ఒప్పించి ఉంటారేమో కదా? అలా ఒప్పించి ఉంటే ఇప్పుడు ఎందుకు బాబు ఒప్పుకోవడం లేదు? ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి కేంద్రం నుంచి అన్నిరకాలుగా సమకూరుస్తున్నారు కదా. నిజానికి ప్యాకేజీలో భాగంగా ఇస్తామని చెప్పిన మొత్తం కంటే రూ.70 వేల కోట్ల అదనపు సహాయం ఇప్పటికే మంజూరు చేశారు. అమరావతిని శాంక్షన్ చేశారు. గుజరాత్‌లోని డోలెరా తరహా పారిశ్రామిక కారిడార్లను మన ఏపీకే మూడు ఇచ్చారు. బాబు దాడి చేస్తున్నా మోదీ స్పందించలేదే? నేను బాధపడుతున్నది ఇదే. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు దాన్ని ఒక మంచి పనికి, మంచి విషయాలకి ఉపయోగించకుండా అనవసరమైన విషయాలపైకి ఎందుకు మళ్లిస్తున్నాడు? నిజాల్ని దాచి ఉంచేటప్పుడు బయటపడేది చివరకు అబ ద్ధాలు, అబద్ధాల కోర్లే కదా! ఎయిర్ ఆసియా ఉదంతంలో ఆ కాల్స్ ఎలా బయటికొచ్చాయి? ఓటుకు కోట్లు కేసులో వీడియోలు ఎలా బయటకు వచ్చాయి? ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది? అలాగే దీంట్లోనూ వచ్చాయి. ఆరున్నర మిలియన్ డాలర్ల కుంభకోణం.. అంటే 3,600 కోట్ల కుంభకోణం ఎయిర్ ఆసియాలో జరిగిందని కదా చెబుతున్నది. ఈ కుంభకోణంలో చాలాచోట్ల చేతులు మారాయి. అశోక్ గజపతిరాజుకు ఏమీ తెలీదు. నువ్వు అలా చేయి అని ఆయనకు చెప్పారట. మీ చానల్లోనే చూశాను. బాబు భయపడుతుంటే.. అరెస్టులు, కేసులు ఏవీ ఉండవు అనేలా బీజేపీ తీరు ఉంది. ఏది నిజం? తాను చేసిన తప్పులు ఎక్కడ బయటపెడతారో, వాటిని చూసి ప్రజలు ఎక్కడ నమ్ముతారో.. దాన్ని నమ్మితే మనకు ఇబ్బంది అనే అభద్రతా భావానికి చంద్రబాబు గురై ‘నన్ను ఏదో చేయాలని చూస్తున్నారు, కేసులు పెట్టబోతున్నారు, ఏమేమో చేయబోతున్నారు’ అని తానే ముందుగా చెబితే అది డిఫెన్సులో పడటం కాదా? బాబును ఇరుకున పెట్టే కేసులు ఏవి? బాబు ఇంతకు ముందే 23 కేసుల్లో స్టే తెచ్చుకున్నారు. వీటిపై ఎప్పటికైనా విచారణ తప్పదు కదా? తెలుగుదేశం కాంగ్రెస్‌తో కలుస్తుందా? అదే జరుగుతుందని ఓపెన్‌గానే చెబుతున్నాను. నేరుగా అప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు కలుస్తానని బాబు చెప్పవచ్చు. బాబు తరహా రాజకీయాల్లో ఏదయినా జరగొచ్చు. మామూలు రాజకీయాల కంటే చంద్రబాబు రాజకీయాలు చాలా తేడాగా ఉంటాయి. ప్రత్యేక హోదాపై మీ స్పందన? ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం అనేది ఏపీకి ఓవరాల్‌గా చూస్తే అన్యాయమనే చెప్పాలి. కానీ ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం తన పరిధుల మేరకు ఏపీకి అన్ని రకాల సహాయం చేస్తున్నారు. ఏదీ ఎక్కడా తగ్గించలేదు. కానీ నాలుగేళ్లుగా మోసం చేస్తున్నారని బాబు అంటున్నారు. కానీ కేంద్రం ఇచ్చిన దానికి, రాష్ట్రం ఖర్చుచేసిందానికి అన్నింటికీ కాగి తాలు, లెక్కలు ఉన్నాయి కదా. పెట్టిన ఖర్చులకు లెక్కలు సమర్పించకుండా సహాయం చేయలేదంటే ఎలా? వైఎస్సార్‌పై, వైఎస్ జగన్ పాదయాత్రపై మీ వ్యాఖ్య ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్ రాజశేఖరరెడ్డి చాలా మంచి మిత్రుడు. ఇక వైఎస్ జగన్ పాదయాత్రపై జనం బాగా వస్తున్నారు. బ్రహ్మాండంగా అభినందిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా జనంలోనే తిరిగి, ధైర్యమిచ్చి ఓట్లు గెల్చుకున్నారు. ఆ తండ్రి వారసత్వం ఇప్పుడు ఎలా వస్తుంది అనేది చూడాల్సిందే. అమరావతికోసం అన్ని వేల ఎకరాలు అవసరమా? రాజధానికయితే అక్కరలేదు. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం తీసుకున్నట్లయితే అభివృద్ధి అంతా ఒకచోటే కేంద్రీకృతమవుతుంది. మళ్లీ అదొక సమస్య. చివరిగా తెలుగు ప్రజలకు మీరిచ్చే సందేశం? మోదీని నమ్మండి. అన్యాయం చేశారన్న మాట అబద్ధం. ఆ ప్రచారాన్ని నమ్మవద్దు. చేయాలని ఉంది, ఇంకా చేస్తున్నారు, చేయబోతున్నారు. ముందు ముందు ఈ విషయం బోధపడుతుంది. వచ్చే ఆరునెలల్లో మోదీ చాలా గొప్పవారు అని మీరే చెబుతారు. ఆ రకంగా పనులు జరుగుతాయి కూడా. ఇది నా సవాల్. -
రెబల్ స్టార్ కృష్ణంరాజుతో మనసులో మాట
-
ఇప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ ఔట్
♦ మనసులో మాట ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీకి పరాజయం తప్పదని మాజీ యాక్టింగ్ చీఫ్ జస్టిస్, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్‌గా పనిచేసిన జస్టిస్ ఈశ్వరయ్య తేల్చిచెప్పారు. ఏపీలో పాలన సామాజిక న్యాయానికి దూరమైంది కాబట్టే ముస్లింలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అర్చకులతో పాటు కమ్మ సామాజిక వర్గం కూడా తీవ్ర అసంతృప్తితో చంద్రబాబు ప్రభుత్వానికి దూరమయ్యారని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో చేసిన రహస్య సర్వే ప్రకారం, ఏపీలో చంద్రబాబును ఇప్పటికే నూటికి 55 శాతం మంది వ్యతిరేకిస్తున్నట్లు తేలిందన్నారు. ఈ సర్వే ప్రకారం ఈ రోజు ఎన్నికలు పెట్టినా కూడా చంద్రబాబు గెలవలేరంటున్న జస్టిస్ ఈశ్వరయ్య అభిప్రాయం ఆయన మాటల్లోనే... న్యాయవాద వృత్తికి ఎలా వచ్చారు? ఎలాంటి మౌలిక వసతులూ లేనటువంటి చిన్న కుగ్రామంలో పుట్టాను. అక్కడినుంచి నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లి అఆలూ, ఇఈలూ నేర్చుకున్నాను. నాన్న రైతు. పదోతరగతి వరకూ వలిగుండ మండలం నెమలికాలువ గ్రామంలోని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నాను. పెద్దనాన్న చనిపోవడంతో బీఎస్సీ పరీక్ష రాయలేకపోయాను. తర్వాత లా పూర్తిచేసి ఆ వృత్తిలోనే కొనసాగాను. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో అబ్కారీ కేసులన్నీ నాకే వచ్చాయి. జడ్జీలు కూడా ఇతనయితే నిజం చెబుతాడు అనే నమ్మకంతో నాకే కేసుల ఆర్డర్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉండేవారు. ఒక్క క్లయింట్ వద్ద కూడా ఫీజు అడిగేవాడిని కాదు. వాళ్లు ఇచ్చినంత తీసుకునేవాడిని. న్యాయవ్యవస్థపై రాజకీయ బ్రోకరిజం పాత్ర ఎంత? ఇప్పుడయితే పూర్తిగా వ్యాపారమయం అయిపోయింది కానీ నిజంగానే లా అనేది ఒక విశిష్టమైన వృత్తి. కాంగ్రెస్ ప్రభుత్వంలో చెన్నారెడ్డి హయాంలో ప్రభుత్వ ప్లీడర్ అయ్యాను. ప్రభుత్వ ప్రయోజనాలను పూర్తిగా కాపాడాను. తర్వాత కొలీజియం ఏకగ్రీవంగా సిఫార్సు చేస్తే జడ్జిగా అయ్యాను. బయట ప్రచారం చేసుకుంటున్నట్లుగా నేను జడ్జి కావడానికి చంద్రబాబు ప్రమేయం కానీ ఆయన సమ్మతి కానీ అణుమాత్రం లేదు. కానీ బాబు రాజకీయ బ్రోకర్‌గా అవతారమెత్తి ఏపీలో న్యాయమూర్తులు కానున్న వారికి వ్యతిరేకంగా అభిప్రాయం రాసి పంపిన చరిత్ర అయితే ఉంది. కానీ బాబు అభిప్రాయాన్ని కొలీజియం తోసిపుచ్చి వారినే న్యాయమూర్తులుగా సిఫార్సు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాజకీయ బ్రోకరిజం బలంగా ఉన్న ఏపీలో ఏం జరుగుతోందో కొలీజియంకు బాగా తెలుసు. బీసీల్లో టీడీపీపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది కదా? ఎందుకంటే ఆనాటి టీడీపీ ఇప్పుడు చచ్చిపోయింది. ఎన్టీరామారావు స్థాపించిన టీడీపీ బీసీలకు నిజం గానే పట్టం కట్టింది. దేవేందర్ గౌడ్, తలసాని యాదవ్, యనమల రామకృష్ణుడు, నరసింహులు ఇలా ఇప్పుడున్న బీసీ ప్రముఖ నేతలందరూ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి తీసుకొచ్చిన వారే. ఎన్టీఆర్ వల్లే లక్షలాది మంది బీసీలు టీడీపీ కార్యకర్తలుగా ఎదిగారు. న్యాయవ్యవస్థపై బాబుకు అంత పట్టు ఉందా? బాబుపై ఉన్న కేసులన్నీ మరుగున ఉన్నాయంటే కారణం ఉండాలి కదా. బాబు అడ్డంగా దొరికిన ఓటుకు నోటు కేసును కూడా హైకోర్టు విచారణ జరగకుండా కొట్టివేసిందంటే జనం అనుకుం టారా లేదా? పైగా ఏసీబీచే విచారణ చేయించమని అడిగితే దీంట్లో విచారించడానికి ఏముంది అని అడ్డుకున్నారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని హైకోర్టు ఆదేశంపై స్టే విధించాల్సి వచ్చింది. బాబు అక్రమాస్తుల కేసుపై కూడా విచారణ దీర్ఘకాలంగా పెండింగులో ఉంది. ఓటుకు కోట్లు కేసుపై మీ అభిప్రాయం? ఆ కేసును విచారించిన సిట్టింగ్ జడ్జిలలో నేనూ ఒకరిని. కానీ సంచలనం కలిగించిన ఈ కేసులో కూడా విచారణ ఇంత పెండింగ్ జరుగుతోందంటే ప్రశ్నించాల్సిందే. కేసుల విచారణ నంబర్ల వారీగా సీరి యల్ పద్ధతిలో జరిగితే న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటుంది. న్యాయాన్ని కొంటుంటే, విచారణ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తుంటే న్యాయవ్యవస్థను ఎలా నమ్ముతారు? విచారణకు సిబ్బంది లేదంటే నమ్మేయడమేనా? అమెరికా తదితర దేశాల్లో చూస్తే అక్కడ న్యాయవ్యవస్థల్లో ఏరకమైన మేనేజ్మెంట్ వ్యవహారాలకూ తావుండదు. జస్టిస్ చలమేశ్వర్‌తోపాటు నలుగురు సీనియర్ న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో కేసులు విచారణ సూత్రబద్ధంగా, సహజ రీతిలో జరగటం లేదని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. సీనియర్ న్యాయమూర్తుల విషయంలోనే పక్షపాతం ప్రదర్శిస్తున్నారని వారన్నారు. సుప్రీంకోర్టులో అత్యంత నిజాయితీ, నిబద్ధత కలిగిన న్యాయమూర్తులు ఆ నలుగురూ. వారే ముందుకొచ్చి తమ బాధ వ్యక్తం చేశారంటే మన న్యాయవ్యవస్థకు జవాబుదారీతనం ఎంత అవసరమో అర్థమవుతుంది. అందుకే న్యాయవ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన జరగాలి. బాబు కేసుపై విచారణ చేయాలని హైకోర్టు జడ్జి తీర్పు చెబితే, సుప్రీంకోర్టులో మరోరకంగా వచ్చింది కదా? కోర్టుల్లో తీర్పులు, ఆదేశాలు అనేవి న్యాయమూర్తుల అంతర్గత నాణ్యత, స్వచ్ఛత ప్రాతిపదికనే వస్తుం టాయి. అందుకే జడ్జీలకు స్వచ్ఛమైన హృదయం, మనస్సు ఉండాలి. కలుషిత మనస్సు ఉండరాదు. కానీ వాళ్లూ ఈ సమాజం నుంచే వచ్చారు కదా. ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా. తప్పుడు ఆదేశాలు, తీర్పులు ఇస్తున్నారంటే అది ఆ జడ్జీల్లోని లోపమే కాని మొత్తం వ్యవస్థ లోపం కాదు కదా. జడ్జీల్లో ఆ అంతర్గత స్వచ్ఛత, పవిత్రత లేనందువల్లే న్యాయస్థానంలో కులం, మతం, పార్టీలు అన్నీ దూరిపోయాయి. అందుకే జడ్జీలకు కూడా అంతరాత్మను ప్రశ్నించే ఆధ్యాత్మిక విద్య అవసరమని నా ఉద్దేశం. ఏ కర్మ మనం చేస్తే ఆ కర్మను మనం తప్పించుకోలేం అనే భయం ఉంటే ఎవరూ తప్పు చేయరు, సాహసించరు కూడా. చంద్రబాబు, కేసీఆర్ పాలనపై మీ అభిప్రాయం? ఎన్ని లోపాలున్నా, కేసీఆర్ పాలనలో గొప్పగా చెప్పుకోవలసింది మిషన్ భగీరథ, విద్యుత్తు వంటి అనేక పథకాల ద్వారా ప్రజాప్రయోజనాలను చాలావరకు కాపాడుతున్నారు. అందుకే టీఆర్ఎస్ పాలన కుటుంబ పాలన అని విమర్శలు వస్తున్నా, ప్రజలు దాన్ని ఆమోదిస్తున్నారు. కానీ ఏపీలో పాలన సామాజిక న్యాయానికి దూరమైంది కాబట్టే ముస్లింలు, ఎస్టీలు, బీసీలు, అర్చకులు ఇలా సకల సామాజిక వర్గాలూ టీడీపీ ప్రభుత్వానికి దూరమయ్యారు. మోదీ ప్రభుత్వం కేంద్ర స్థాయిలో చేసిన సర్వేలో ఏపీలో చంద్రబాబును ఇప్పటికే నూటికి 55 శాతం మంది వ్యతిరేకిస్తున్నారని తేలింది కూడా. ఈ రోజు ఎన్నికలు పెట్టినా కూడా చంద్రబాబు గెలవడని ఆ రహస్య సర్వే నివేదిక తేల్చిచెప్పేసింది. -
జస్టిస్ ఈశ్వరయ్యతో మనసులో మాట
-
మాజీ ఐపీఎస్ అధికారి ఇక్బాల్‌తో మనసులో మాట
-
కేసీఆర్‌తో పడకే కోదండరాం రాజకీయాల్లోకి వచ్చారా?
మనసులో మాట తెలంగాణ ప్రభుత్వాధినేత కేసీఆర్‌పై వ్యక్తిగత ద్వేషం, వ్యతిరేకత ఏ కోశానా తనకు లేదని ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకపోవడంతోనే ఆయనతో విభేదించవలసి వచ్చిం దని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ స్పష్టం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ ఆర్థిక నమూనా ఉండేదో ఆ నమూనానే ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారని, కాంట్రాక్టర్లకు లాభాలు తెచ్చిపెట్టే తరహా ప్రాజెక్టులపై తప్ప సాధారణ ప్రజలకు ఉపయోగపడే విధానాలను అమలు చేయడం లేదని విమర్శించారు. పౌరులుగా ప్రశ్నించే హక్కును ఉపయోగించుకుంటున్నందుకే తమలాంటివాళ్లను ప్రభుత్వ వ్యతిరేకులుగా ముద్రిస్తున్నారంటున్న కోదండరామ్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... రాజకీయనేతగా అవతారమెత్తారు. మీ అభిప్రాయం? తీవ్ర ఉద్రిక్తతలు, ఉద్వేగాల మధ్య నడిచిన ఉద్యమంలో పనిచేసిన అనుభవం నుంచి రాజకీయ పార్టీ నేతగా మారడానికి తీవ్రమైన మానసిక అంతర్మథనం, సన్నిహితుల ఒత్తిడి కారణం. అయితే జేఏ సీలో ఇంతవరకు పనిచేస్తున్నాం కాబట్టి రాజకీయాల్లోకి దిగడం ఇప్పుడేం కొత్తగా అనిపించడం లేదు. కేసీఆర్‌తో పడకే రాజకీయాల్లోకి వచ్చారా? వ్యక్తులపై అసమ్మతితో నిర్ణయాలు తీసుకుంటే మనం నిలబడలేం. ఒక్కమాటలో చెప్పాలంటే గత నాలుగేళ్ల మా అనుభవం నుంచి మేం ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రభుత్వానికి విధాన రూపకల్పనలో తగు సలహాలు ఇవ్వాలనుకున్నాం. ఉద్యమంలో అనేక విషయాలు తెలిశాయి కాబట్టి తెలంగాణ వస్తే ఏం మార్పులు సాధించాలి అని జనం ఆకాంక్షలను అర్థం చేసుకున్నాం కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని తెలిసిన విషయాలను ప్రభుత్వానికి చెప్పాలి అనుకున్నాం. కానీ ప్రభుత్వం అలాంటి సలహాలను మెల్లమెల్లగా పక్కనపెడుతూ వచ్చింది. కేసీఆర్‌కూ, మీకూ మధ్య తగాదా ఎందుకొచ్చింది? ఘర్షణలో వ్యక్తిగతమైనది ఏదీ లేదు. ఉద్యమకాలంలో ఏదయినా విభేదాలుంటే భిన్నాభిప్రాయాలు వచ్చి ఉండవచ్చు. కానీ వాటిని పక్కనబెట్టి కలిసి పనిచేశాం కాబట్టే తెలంగాణ సాధించగలిగాం. గత ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ టిక్కెట్లు కొంతమందికి ఇప్పించారా? మీపై ఇదీ ఒక ఆరోపణ మరి? మేం ఏ పార్టీకీ, ఎవరికీ ఫోన్ చేయలేదు. జేఏసీ నుంచి కొంతమంది మిత్రులు రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నారు. పలానా వ్యక్తి జేఏసీలో పనిచేసిండు అని ధ్రువీకరించాలి కదా. జేఏసీ అధినేతగా మీరు చెబితే మంచిది కదా అని కొందరు అడిగితే నిజమేనండీ ఆయన జేఏసీలో పనిచేశారు. ఈయన ఉద్యమంలో ఉపయోగపడ్డాడు అని చెప్పాం అంతే. కేవలం కాంగ్రెస్‌కే కాదు టీఆర్ఎస్కు కూడా ఇదే చెప్పాం. మీపై కాంగ్రెస్‌వాది అని ఎందుకు ముద్ర వేశారు? టీజేఏసీలోంచి ఏ పార్టీలోకి వెళ్లి పోటీ చేయాలనుకున్నా వారందరికీ మేం సపోర్టు చేశాం. పలానావారు మా సంస్థకు చెందినవారే, క్రియాశీలకంగా ఉద్యమంలో పనిచేసినవారే అని ఆయా పార్టీల వారికి చెప్పాం. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఇలా ఏ పార్టీలోకి మావాళ్లు అడిగినా అందరికీ సపోర్టు చేశాం. వీళ్లు పలానా సమయంలో, పలానా స్థాయిలో ఉద్యమానికి తోడ్పాటునందిం చారు. మీకూ ఉపయోగపడతారు అని సిఫార్సు చేశాం. వారి బలాబలాలు ఇవీ. మీరు ఉపయోగించుకుంటే మంచిదే అన్నాం. టీజేఏసీనే ఎత్తేయాలని కేసీఆర్ చెప్పలేదా? తెలంగాణ సాకారమయ్యాక ఇక చేసేదేమీ లేదు అనే అభిప్రాయం అయితే ఉండింది. కానీ జేఏసీలో మేమందరం మాట్లాడుకున్నాం. తెలంగాణను కిందో మీదో పడి సాధిస్తాం.కానీ అనేక రంగాల్లో తెలంగాణ ప్రజలకు కలగాల్సిన ప్రయోజనాలు ఏమిటి, అవన్నీ ప్రజలకు దక్కేలా చూడాలని అనుకున్నాం. అలాంటి పాత్రను మేం పోషించాలని, ఆ బాధ్యతను మర్చిపోకూడదని భావించాం. పైగా మా గురువు జయశంకర్ గారు తెలంగాణ వచ్చేదాకా రాష్ట్ర సాధన కోసం పనిచేయాలి, వచ్చాక రాష్ట్ర అభివృద్ధికోసం పనిచేయాలని స్పష్టంగా చెప్పారు. రాజకీయాల్లోకి వెళ్లేవారు వెళతారు. జేఏసీగా ఉండి పనిచేయాలనుకునేవాళ్లు చేస్తారు, చేయాలి అని తలిచాం. కేసీఆర్ ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రభుత్వంలో ఉన్నవారు నిన్నా మొన్నటి వరకు కలిసి పనిచేసిన వాళ్లే కదా. ప్రజల సమస్యలను పదింటిని తీసుకుని వెళ్లి చెబితే వాటిలో నాలుగైదు సమస్యలను పరిష్కరించినా ఆమేరకు ఉపయోగమే కదా అనుకున్నాం. ప్రధానంగా విభజనకు సంబంధించిన ఉద్యోగాల్లో క్లాస్ 4 ఉద్యోగులను మినహాయించాలని చెప్పాం. ఎట్టిపరిస్థితుల్లోనూ వారిని పంపకాల్లోకి నెట్టవద్దన్నాం. చిన్న స్థాయి ఉద్యోగుల కుటుంబాలు ఇక్కడే ఉంటాయి. వాళ్లను తీసుకుపోయి వేరే ప్రాంతంలో నియమిస్తే వాళ్లు తట్టుకోలేరు. నిలబడలేరు. కిందిస్థాయిలో ఉన్నవారి వేర్లు స్థానికంగా ఉంటాయి. వాళ్లు వాటిని తెంచుకుని ఎక్కడికో వెళ్లలేరు అని చెప్పాం. పైగా వీరి జీతాలు తక్కువ. అక్కడొక ఇల్లు, ఇక్కడొక ఇల్లు అంటే చాలా కష్టం. కాబట్టి వారిని బదిలీ చేయొద్దని గట్టిగా చెప్పాం. రెండోది.. ప్రభుత్వ రంగ సంస్థల విభజన పట్ల నిశిత దృష్టి పెట్టాలి. వీటి విభజనలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని సూచించాం. విద్యారంగానికి సంబంధించిన సంస్కరణలు ఏం చేయాలో కూడా చెప్పాం. అన్నీ మేమే చెబితే బాగుండదని రకరకాల వేదికలను బలోపేతం చేసి వాటి ద్వారా కూడా చెప్పించాం. మా సూచనల్లో వేటిపట్లా ప్రభుత్వం స్పందించలేదు. తర్వాత్తర్వాత అర్థమైనదేమంటే తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న అభివృద్ధి పంథానే సరైంది కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏ ఆర్థిక నమూనా ఉండేదో దాన్నే ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారు. ప్రభుత్వం కొన్ని ప్రాజెక్టుల పట్లే దృష్టి పెట్టింది. వీటివల్ల ఎక్కువగా లాభపడేది కాంట్రాక్టర్లే కాని ప్రజలు కాదు. ఇవన్నీ గమనించాకే మనం పోవలసిన మార్గం ఇది కాదు అని మాట్లాడాం. పాలకుడిగా కేసీఆర్‌కి ఎన్ని మార్కులిస్తారు? ప్రశ్న ఒకటి అయితే సమాధానం ఒకటి చెపితే దానికి సున్నా మార్కులు తప్పితే ఏమన్నా వస్తాయా? ఉద్యమ ఆకాంక్షల వెలుగులో తెలంగాణలో పనులు జరగలేదని ప్రశ్నిస్తే సమాధానమే లేదు. అందరికీ బతుకుదెరువు చూపించాలి అన్నాం. ఇదే ఉద్యమ ఆకాంక్ష. ఇది ఉద్యమ ఆకాంక్షలను గుర్తిస్తున్న ప్రభుత్వం కాదు. ద్వేషంతో ఇలా అనడంలేదు. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రిని పల్లెత్తు మాట అనలేదు మేం. వారు ముఖ్యమంత్రిగా, మేం పౌరులుగా ఉంటుం డటం వల్ల తలెత్తుతున్న సమస్యలే ఇవి. (ఇంటర్వ్యూ పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
త్రిపురనేని హనుమాన్ చౌదరితో 'మనసులో మాట'
-
చంద్రబాబు గెలుపు కలలోమాటే
ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక హోదా విషయంలో ప్రజల్లో రగులుతున్న ఆగ్రహం చంద్రబాబుకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని సీపీఎం పొలిట్‌బ్యూరో సబ్యులు బీవీ రాఘవులు స్పష్టం చేశారు. హోదా సంజీవని కాదన్న చంద్రబాబు ఇప్పుడు ప్రజల్లో మార్పు గమనించి ప్లేటు ఫిరాయించి మళ్లీ హోదా నినాదాన్ని ఎత్తుకున్నా జనం నమ్మే స్థితిలో లేరన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పాలనకంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో అతిచెడ్డ అభివృద్ధి నమూనాకు బాబు పాలన గుర్తుగా మిగిలిపోనుందని, పట్టిసీమ మొదలుకొని పోలవరం ప్రాజెక్టు వరకు ముడుపులతో అవినీతి రాజ్యమేలుతోందని, పట్టిసీమలో అవినీతిపై కాగ్ సర్టిఫై చేయడమే దీనికి తార్కాణమని అన్నారు. నాలుగేళ్లు నరేంద్ర మోదీకి, బీజేపీకి పాదసేవ చేసి ఇప్పుడు వారికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చంద్రబాబు అంటే ఎవరైనా నమ్మవచ్చు కానీ వామపక్షాలు అలా మోసపోవడానికి సిద్ధంగా లేవన్నారు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలిచే అవకాశాలు అసలు కనిపించడం లేదంటున్న బీవీ రాఘవులు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏమిటీ బాధ, ఇబ్బంది అని ఎప్పుడైనా అనిపించిందా? మొదట్లో రాజకీయాల్లో లోతుపాతులు తక్కువగా తెలిసేవి. ఆదర్శం ఎక్కువగా ఉన్న రోజుల్లో ఏమిటి రాజకీయాలు ఇలా ఉన్నాయి అనిపించింది కానీ ఇప్పుడు వాటిని అర్థం చేసుకోగలుగుతున్నాను. మనం చూస్తున్న వాస్తవాలు, వైరుధ్యాలు ఈ సమాజంలో ఉన్నవే. వాటిని ఎలా పెకిలించుకుని పోవడం, సర్దుకునిపోవడం లేక వేరు చేసుకోవడం అనేవి మనం నేర్చుకోవాలి తప్ప మనకు మనం నిరాశా నిస్పహలకు గురికావాల్సిన అవసరం లేదు. నిరాశకు గురయితే పరిష్కారం దొరకదు కదా. మనం ఆ వైరుధ్యాల్లో చురుగ్గా జోక్యం చేసుకోవడం ద్వారా, దాన్ని మార్చడానికి ప్రయత్నం చేయడం ద్వారా మార్పునకు కారణమవుతాం. మోదీ, చంద్రబాబు మధ్య ఏం జరిగి ఉందంటారు? నాలుగేళ్ల పాటు బీజేపీకి, మోదీకి వీరసేవ చేసిన చంద్రబాబు ఇప్పుడు వీరావేశాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్లిద్దరి మధ్యా ఏమీ జరగలేదు. ప్రజల్లో మార్పు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కి ఒక్క ముక్కంటే ముక్క కూడా పడని తర్వాత ప్రజల్లో నాలుగేళ్లుగా పేరుకుపోయిన ఆగ్రహం బద్ధలైపోయింది. నాలుగేళ్లు చంద్రబాబు చూపిన ఆశలిక నెరవేరవని తెలియడంతో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఏపీలో ప్రజలు ఎంతగా దహించుకుపోతున్నారంటే, వామపక్షాల బలం ఇప్పుడు తక్కువ. కానీ వామపక్షాలు బంద్‌కు పిలుపునిస్తే జనజీవితం స్తంభించిపోయింది. ఆ ప్రజాగ్రహాన్ని తట్టుకుని నిలబడాలంటే బాబుకు ప్లేట్ ఫిరాయించక తప్పని పరిస్థితి. ఏపీలో 23 మంది, తెలంగాణలో 25 మంది ఎమ్మెల్యేలను ఫిరాయింపు చేశారు కదా? ఫిరాయింపు చేసినవాడు తన పదవికి రాజీనామా చేయడం కాదు. ఫిరాయించిన మరుక్షణం వారి పదవులు రద్దయిపోవాలని, అదే పరిష్కారమని తొలినుంచీ మా వాదన. ఈ నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం? ఈ నాలుగేళ్లూ చంద్రబాబు అధికారంలో లేకుంటే ఏపీ బాగుపడేది. ఈ నాలుగేళ్లూ రాజధాని చుట్టూ తిరిగాడు. కానీ, రాజధానే కనిపించడం లేదు. పరిశ్రమలన్నారు. భాగస్వామ్య సదస్సులన్నారు ఒక్క రూపాయి పెట్టుబడులు వచ్చింది లేదు. లేదూ బీజేపీ మతతత్వాన్ని అడ్డుకునే ప్రయత్నమైనా చేశాడా అంటే ఆ పార్టీకే నాలుగేళ్లు సేవ చేసి దానికి కొమ్ములు తెచ్చేశాడు. బీజేపీకి బలం కల్పించినవాడిగానే మిగిలిపోయాడు. ప్రత్యేక హోదా వద్దన్న బాబు.. ఇప్పుడెందుకు కావాలంటున్నారు? ఇప్పుడు ప్రజలు ప్రత్యేక హోదా గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న నేపథ్యంలో వారి ఆగ్రహాన్ని తట్టుకోవాలంటే హోదా జపం చేయాల్సిందే మరి. ప్రజాగ్రహాన్ని తప్పకుండా చవిచూడాల్సి వస్తుంది. దాన్ని తట్టుకోవాలంటే నేను ఎన్డీయే నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చాను కదా. విమర్శిస్తున్నాను కదా? అని చెప్పుకోవాలి మరి. గతంలో చంద్రబాబు ఎనిమిదేళ్ల పాలనకు, ఇప్పటి నాలుగేళ్ల పాలనకు తేడా ఏమిటి? ఉమ్మడి రాష్ట్రంలోనూ బాబు అభివృద్ధి నమూనా గొప్పగా ఏమీ లేదు. ఇప్పుడయితే అతి చెత్త నమూనాకు ఆయన పాలన గుర్తుగా ఉంది. రాజధాని, నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమల విషయంలోనే కాదు అన్నిటికంటే మించి రాష్ట్ర విభజనలోనూ బాబు నాటకాలాడాడు. అన్యాయంగా విభజన చేశారు అని ఇప్పుడంటున్నాడు. ఆ అన్యాయపు విభజనలో ఈయన పాత్ర లేదా? ఇప్పుడు మొసలి కన్నీళ్లు పెడితే ఏం లాభం? పోలవరం ప్రాజెక్టుపై మీ అభిప్రాయం? రాజధాని, ప్రత్యేక హోదా విషయంలో మేం ఆనాడు చెప్పినవి ఏరకంగా ఇప్పుడు వాస్తవం అవుతున్నాయో పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ అదే జరుగుతోంది. 900 మెగావాట్ల విద్యుత్తు విషయం పక్కనపెట్టి మీరు ప్రాజెక్టు నిర్మించండి. అప్పుడు ప్రాజెక్టు ఇంత ఎత్తుకు కట్టాల్సిన పని లేదని మేం గతంలోనే చెప్పాం. కేవలం సాగునీటి కోసమే అయితే ఇంత ఎత్తు ప్రాజెక్టు అవసరం లేదు. పైగా ఇంత పెద్ద ప్రాజెక్టు వ్యవహారం కచ్చితంగా ముడుపులతో ముడిపడి ఉంటుంది. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నుంచి బాబు ఎందుకు తీసుకున్నట్లు? మేమయితే తొందరగా పూర్తి చేస్తాం అని చెప్పి కేంద్రం నుంచి తీసుకున్నాడు. బీజేపీ తన చెప్పుచేతల్లో ఉంటుందని, తమ మధ్య బంధం శాశ్వతంగా ఉంటుందని అనుకుని ఉండవచ్చు. లేకపోతే కేంద్రం కాంట్రాక్టర్లకు ఇస్తే ముడుపులన్నీ వారికే పోతాయి తప్ప నా వాటా ఏమిటి అనుకుని ఉండవచ్చు కూడా. పైగా పోలవరాన్ని 2018లో, 19లో కట్టేస్తామంటున్నారు. భారతదేశంలో ఏ ప్రాజెక్టు కూడా 30 ఏళ్లకు లోపల పూర్తయిన చరిత్ర లేదు. పదిహేనేళ్లకు లోపల ఎస్కలేషన్ పూర్తయిన చరిత్ర లేదు. పట్టిసీమలో అవినీతి జరిగిందని కాగ్ నివేదించింది. మీ అభిప్రాయం? ముడుపులకు అధికారిక ముద్ర వేసేశారని ఆనాడే మేం చెప్పాం. కాకపోతే కాగ్ దాన్ని ఇప్పుడు బయటపెట్టిందంతే. ఆ అవినీతిని సర్టిఫై చేసింది. బాబు పాలన అంటేనే అవినీతి. ఇప్పుడు అది ఇంకా ఎక్కువైంది. మరింత స్వేచ్ఛగా దోచుకోవడానికి బాబు అవకాశమిస్తున్నట్లు కనబడుతోంది. ప్రజలే కాదు టీడీపీ వాళ్లు కూడా ఇదే చెబుతున్నారు. ఏపీలో ఎన్నికలు జరిగితే ఎవరి పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతారా? ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ప్రభుత్వంపై పెరుగుతున్న అసంతృప్తి స్పష్టంగా కనబడుతోంది. అది ఓట్ల రూపంలో మారేకొద్దీ ఇతరత్రా అంశాలు వస్తాయి. పాలించే పార్టీల వద్ద డబ్బుకు కొదవలేదు కాబట్టి డబ్బుతో కొనాలని ప్రయత్నిస్తారు. కులం కార్డు ఉపయోగిస్తారు. అఖిల భారత స్థాయిలో ఒక వాతావరణం తీసుకొచ్చి దానిలో భాగస్వాములమయ్యాం అని చెప్పి అలా ప్రభావితం చేసే ప్రయత్నాలు చేస్తారు. వైఎస్ జగన్‌పై, ఆయన పాదయాత్రపై మీ అభిప్రాయం? ప్రత్యేక హోదా అంశంపై జనం బాబుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వైఎస్ జగన్ తొలినుంచి హోదాను కోరుకుంటున్నారు. కానీ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడే చెప్పలేం కదా. పాదయాత్ర ఎప్పటికీ మంచిదే. జనంని దగ్గరగా చూస్తారు. వారి సమస్యలు వింటారు. ఆ రకంగా ఎవరు పాదయాత్ర చేసినా మంచిదే. కానీ కేవలం పాదయాత్ర మాత్రమే ఎన్నికల్లో అధికారంలోకి తెస్తుందని ఇప్పుడే చెప్పలేం కదా. బాబు బీజేపీకి దూరమయ్యారు కాబట్టి మళ్లీ వామపక్షాలతో కలిసే అవకాశముందా? ఆ అధ్యాయం ముగిసిపోయింది. నాలుగేళ్ల పాటు బీజేపీకి పాదసేవ చేసి ఇవ్వాళ నేను పోరాడుతున్నాను అని చెబితే ఎవరయినా కొంతమంది మోసపోవచ్చు కానీ వామపక్షంగా మేం అలా మోసపోవడానికి సిద్ధంగా లేం. చంద్రబాబు, కేసీర్కి ఈ ఎన్నికల్లో ఎలాంటి అవకాశముంది? ఏపీ, తెలంగాణల్లో ప్రజాస్వామ్యానికి, ఉద్యమాలకు, ప్రజాభిప్రాయానికి ఏమాత్రం విలువనిచ్చే పాలన జరగడం లేదు. కేసీఆర్ ప్రజాస్వామ్యం విషయంలో కాస్త సర్దుబాటు చేసుకుంటే, మారితే తనకు ప్రయోజనం ఉంటుందేమో కానీ బాబుకు మాత్రం పరిస్థితి ఏమాత్రం అనుకూలంగా లేదు. తెలంగాణ విషయంలో అంత స్పష్టంగా చెప్పలేను కానీ ఏపీలో మాత్రం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. (ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://bit.ly/2HskLlP / https://bit.ly/2HH54Vj -
బీవీ రాఘవులుతో మనసులో మాట
-
సురవరం సుధాకర్ రెడ్డితో మనసులో మాట
-
గొల్లపూడి మారుతిరావుతో మనసులో మాట
-
సుబ్బరామిరెడ్డితో మనసులో మాట
-
కిషన్ రెడ్డితో మనసులో మాట
-
వైఎస్ విజయమ్మతో మనసులోమాట
-
అమ్ముడుపోతే ఏం చేయగలం?
మనసులోమాట పాలకుల దిగజారుడుతనం, ప్యాకేజీలకు, ప్రలోభాలకు లోబడి అమ్ముడు పోవడానికి సిద్ధమయ్యే వారి క్షీణ రాజకీయాలే ఫిరాయింపులకు ముఖ్యకారణమని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఆధారాలు చూపలేం కాని పార్టీలు మారిన వారిలో ఏ ఎంపీకి, ఏ ఎమ్మెల్యేకి ఏం ప్యాకేజి ఇచ్చారో బయట ఎవరినడిగినా చెబుతారని.. ఏ పార్టీ తరపున, ఏ ఐడియాలజీతో గెలుస్తున్నామో కూడా అర్థం లేకుండా పోయిందన్నారు. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే వారికి అమ్ముడుపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ఫిరాయింపుల నిరోధక చట్టం ఇంత నిర్వీర్యమైపోతే భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని భయమేస్తుందని చెప్పారు. ప్రజలు దేన్నయినా సహిస్తారు కానీ పాలకుల అహంకారాన్ని, అమానవీయ దృక్పథాన్ని సహించరంటున్న ఉత్తమ్ కుమార్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... రాజకీయాల్లోకి రాకముందు మీ హోదాల గురించి చెబుతారా? నేను 16 సంవత్సరాల వయస్సులోనే పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సైనిక శిక్షణ పొందాను. భారతీయ వాయుసేనలో పైలట్ ఆఫీసర్‌గా క్లాస్ వన్ గెజిటెడ్ ఆఫీసర్‌గా చేరాను. అధునాతన టెక్నాలజీ కలిగిన విమాన పైలట్‌గా పనిచేయడంతో పూర్తి సంతృప్తి పొందాను. బోర్డర్ సమీపంలో ఫ్లైయింగ్ చేస్తున్నప్పుడు విమానం గాల్లోనే పేలిపోయింది. అది సింగిల్ పైలట్ విమానం. విమానంలో నేను కూర్చుని ఉండగానే పేలిపోయింది. అయితే యుద్ధవిమానంలో ఎజెక్షన్ అనే బటన్ ఉంటుంది. దాన్ని నొక్కితే విమానం నుంచి సీట్‌తో సహా పైలట్‌ను బయటకు షూట్ చేస్తుంది. దాంతో పారాచూట్ సాయంతో సమీపంలోని అడవుల్లో పడ్డాను. తర్వాత రష్యన్ వైమానిక నిపుణులు వచ్చి చూశారు. ఇలాంటి ప్రమాద ఘటనల్లో పది లక్షల్లో ఒకరు కూడా బతికి బయటపడటం కష్టం. నీకు ఇది బోనస్ జీవితం అనుకో అన్నారు వారు. ఆ ప్రమాదంలో నా వెన్నెముక విరిగింది. మోకాలు ఫ్రాక్చర్ అయింది. ఆసుపత్రిలో ఉండి కోలుకోవడానికి 6 నెలలు పట్టింది. ఆ తర్వాత కూడా కొంత కాలం పైలట్ గానే పనిచేశాను. అయితే మళ్లీ ఇలాంటి ప్రమాదంలో చిక్కుకుంటే వెన్నెముక పూర్తిగా డామేజ్ అవుతుంది కాబట్టి, పైలట్ బాధ్యతల నుంచి కొంతకాలం రెస్ట్ తీసుకోవాలని రష్యన్ నిపుణులు సూచించారు. దాంతో ఎయిర్ చీఫ్ మార్షల్ నాటి భారత రాష్ట్రపతి వెంకట్రామన్‌ను సంప్రదించి పీస్ పోస్టింగ్ –రిస్క్ లేని ఉద్యోగం–లో భాగంగా ఆయన వద్ద ఉద్యోగం ఇప్పించారు. తర్వాత నా మిలిటరీ హోదాను ఐఏఎస్ హోదాకు మార్చి రాష్ట్రపతి వద్ద శాశ్వత ఉద్యోగిగా మార్చారు. ఎంపీలు కూడా ఫిరాయించడానికి ప్రాతిపదిక ఏంటి? ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సర్పంచ్ ఎవరైనా కావచ్చు మరోపార్టీకి అమ్ముడుపోతే, అమ్ముడు పోదల్చుకుంటే మనం ఏం చేయగలం? సుఖేందర్ గుప్తా ఎందుకు అమ్ముడు పోయారు అంటే ఏం చెప్తాం. ఒకటి మాత్రం నిజం. తెలంగాణలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది కేసీఆరే. కొత్త రాష్ట్రంలో రాజకీయాలు ఇంతగా దిగజారుతాయని మేం ఊహించలేదు. ఏ ఎంపీకి, ఏ ఎమ్మెల్యేకి ఏం ప్యాకేజి ఇచ్చారో బయట ఎవరినడిగినా చెబుతారు. గుప్తాకు, ఆయన కుటుంబానికి కూడా ప్యాకేజీలు వచ్చాయి. కావాలంటే ఆ టెండర్ కాపీలు మీకు పంపుతాను. ఇంతస్థాయిలో పార్టీ మార్పిడి కార్యక్రమం జరగడానికి రెండే రెండు కారణాలు. కేసీఆర్ దిగజారుడు రాజకీయాలు, అమ్ముడుపోవడానికి సిద్ధమైన వారి రాజకీయాలు. కానీ అన్నిపరిణామాలను ప్రజలు చూస్తున్నారు. తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారని నా నమ్మకం. పార్టీ మారితే రాజీనామా చేస్తే బాగుండేది కదా? ఫిరాయింపుల నిరోధక చట్టం ఈ దేశంలో అమలే కాకుంటే, భవిష్యత్తులో ఏం జరుగబోతుంది అనేది భయపెడుతోంది. తెలంగాణా టీడీపీ 15 ఎమ్మెల్యే స్థానాల్లో గెలిస్తే, వారిలో 12 మంది పార్టీనుంచి ఫిరాయిస్తే ఇక ప్రజాస్వామ్యానికి ఏమి అర్థమున్నట్లు? పార్టీ సింబల్‌కి ఏమి అర్థం? ఏ పార్టీ తరఫున, ఏ ఐడియాలజీతో గెలుస్తున్నామో కూడా అర్థం లేకుండా పోయింది. ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పరిస్తే దానికి అమ్ముడుపోతున్నారు. 24 గంటల విద్యుత్ క్రెడిట్ కేసీఆర్‌దా లేక కాంగ్రెస్‌దా? రెండో ప్రపంచయుద్ధ కాలంలో గోబెల్స్ అనే మంత్రి.. జర్మనీ గెలవబోతోంది అంటూ ఎప్పుడూ ఒకే ప్రచారం చేసేవాడు. ఆ ప్రచారాన్ని హిట్లర్ అంతటివాడు కూడా చచ్చేంతవరకు నమ్మాడు. అలాగే కేసీఆర్ తప్పుడు ప్రచారంతో, మీడియాలో వందలకోట్లు ప్రకటనలకు తగిలేసి వాస్తవాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దేశంలో 27 రాష్ట్రాల్లో విద్యుత్ మిగులు ఉంది కాబట్టి 24 గంటలేమిటి ఇంకా ఎక్కువే ఇవ్వవచ్చు. ఎరువుల కోసం రూ. 4 వేలు ఇస్తే, రైతులంతా సంతృప్తి చెందుతారా? స్వాంతంత్య్రానంతరం ఒక రాష్ట్రంలో ఎక్కువమంది రైతుల ఆత్మహత్యలు జరిగింది కేసీఆర్ పాలిస్తున్న తెలంగాణలోనే అని గుర్తుంచుకోవాలి. మిర్చిపంటకు మంచి ధర కావాలని ఖమ్మం రైతులు వీధుల్లోకొస్తే వాళ్ల కాళ్లు చేతులకు సంకెళ్లు వేసి మరీ జైల్లో కుక్కించిన దుర్మార్గ పాలన కేసీఆర్‌ది. రైతులను సంకెళ్లతో రోడ్డు మీద నడిపించారు. కేసులు పెట్టారు. రైతులను నాలుగేళ్లుగా నిర్లక్ష్యం చేసి వాళ్లు వాతపెట్టడానికి సిద్ధపడుతున్నారని తెలిసి ఇప్పుడు రైతులను ఉద్ధరిస్తున్నట్లు జిమ్మిక్కులకు సిద్ధమవుతున్నాడు కేసీఆర్. మిషన్ భగీరథ పూర్తి చేసి నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు నీళ్లు ఇస్తున్నారు కదా? మిషన్ భగీరథలో ఆరు శాతం కమీషన్ గ్యారంటీ. అందుకే అది కమీషన్ భగీరథ. నీళ్లివ్వకపోతే ఓట్లు అడగనన్నారు కదా. అయితే దళితులకు మూడెకరాలు భూమి ఇస్తానన్నారు. ఇవ్వలేదు. గిరిజనులకు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్ అన్నారు. చేయలేదు. ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇవ్వలేదు. మరి వీళ్లెవరినీ ఓట్లడగొద్దు. తెలంగాణ ప్రభుత్వంపై ఒక నిశ్శబ్ద విప్లవం జరగనుంది చూస్తూ ఉండండి. ప్రజలు సహించని విషయం ఏమిటంటే అహంకారం. తెలంగాణను పాలిస్తున్న వాళ్లు కళ్లు నెత్తికెక్కి, చిన్నా, పెద్దా, మంచీ చెడూ, డిగ్నిటీ ఏమీ లేకుండా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి కొడుకు నియోజకవర్గంలో దళితులను తీసుకుపోయి పోలీస్ టార్చర్ చేస్తే కనీసం దానిమీద చర్యలుండవు. అంటే ఇంత అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. జగ్జీవన్ రాం బిడ్డ మీరా కుమార్ తెలంగాణకు వచ్చి వారిని చూసి కంట తడిపెడితే వీళ్లు హేళన చేస్తూ మాట్లాడతారు. ఉస్మానియాలో బీసీ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే కనీస పరామర్శ కూడా ఉండదు. కామారెడ్డిలో బీసీకి చెందిన వీఆర్ఎను ఇసుక ట్రాక్టర్ కింద తొక్కించి చంపితే వీళ్లు పట్టించుకోరు. ఇదా వీరి పాలన. ఇంత అమానవీయం, ఇంత అహంకారం ఎన్నడైనా చూశామా.. వీళ్లను ప్రజలు తరిమి తరిమి కొడతారు చూస్తూ ఉండండి. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్రపై మీ అభిప్రాయం? ఆయన చాలా కష్టపడి పనిచేస్తున్నారు. పాదయాత్ర చేస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడిగా ఆయనకు మా శుభాకాంక్షలు. -
పోలవరంపై ఏకపక్ష ధోరణి తప్పు
♦ మనసులో మాట రాజధాని పేరిట అమరావతిలో తాత్కాలిక భవనాలు నిర్మించడం తప్పితే ఏమీ జరగకపోవడం చూస్తే తమబోటి వారికి ఏమీ అర్థం కావడం లేదని సీనియర్ పాత్రికేయులు పొత్తూరి వెంకటేశ్వరరావు అన్నారు. అందుబాటులో ఉన్న వసతులను కనీసంగా కూడా ఉపయోగించుకోకుండా, గుంటూరు, విజయవాడ, తెనాలి వంటి ప్రాంతాలను ఏకకాలంలో అభివృద్ధి చేయకుండా మూడుపంటలు పండే రైతుల భూములను తీసుకోవడంలో ఏ ప్రయోజనం ఉందో ఎవరికీ బోధపడటం లేదన్నారు. అమరావతి ప్రజలు తమ ఎదుట ఏం జరుగుతోంది అని చూస్తారు తప్ప వేల కోట్లు అప్పు తెస్తున్నారా లేదా అన్నది పట్టించుకోరన్నారు. పోలవరం వంటి భారీ ప్రాజెక్టు విషయంలో కూడా ప్రతిపక్షాన్ని కలుపుకోకుండా, అసెంబ్లీలో చర్చించకుండా, పబ్లిక్ డిబేట్‌కు అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం సాధించేది ఏమీ లేదని, ఇంత పెద్ద అంశంలోనూ ఉమ్మడి అవగాహన లేకపోతే ఎలా అంటున్న పొత్తూరి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... నాటికీ, నేటికీ జర్నలిజం విలువల్లో తేడా ఏమిటి? అన్ని వృత్తులకు లాగే జర్నలిజం కూడా పరిణామానికి లోనవుతోంది. కానీ జర్నలిజం సూత్రబద్ధత విషయంలో ఏమీ తేడా రాలేదు. ఆనాడు జర్నలిజంలో వేటినైతే ధ్యేయాలుగా పెట్టుకున్నారో అవేమీ మారలేదు. నిజం చెప్పడం.. ప్రజలకు వాస్తవాల్ని తెలియజేయడం.. అది ఇప్పటికీ ఉంది. మార్పు టెక్నాలజీ పరంగానే వచ్చింది. ప్రజలకు సమాచారాన్ని త్వరగా అందించే ప్రక్రియను వేగవంతం చేయడంలో మార్పు వచ్చింది. ప్రజలకు నిజం చెప్పడం మన బాధ్యత అని నేననుకుంటాను. నేను ఆచరణలో అదే చేశాను. ఆ విషయంలో మేము రాజీపడవలసిన అవసరం రాలేదు. జర్నలిజం ఒక వృత్తా లేక వ్యాపకమా? చాలా మంచి ప్రశ్న. మోటుగా చెప్పాలంటే జర్నలిజం అనేది ఒక పిచ్చి అండి. బయట మనకు ఇంకో పెద్ద ఉద్యోగం ఆఫర్ ఉన్నా కూడా, వద్దు నాకు జర్నలిజం కావాలి అని చెప్పి దీంట్లోకి వస్తాం. మనలో చాలామందిమి అలాంటివాళ్లమే. డబ్బుల కోసం జర్నలిజంలోకి వచ్చిన కాలం కాదు మనది. ఎందుకంటే జీతాలు చాలా తక్కువ. అప్పట్లో జర్నలిస్టులకు జీతం ఎంతంటే సబ్ ఎడిటర్‌కి కేవలం వంద రూపాయలు. ఇప్పుడంటే పరిస్థితులు మారాయి గానీ, అప్పట్లో డబ్బులంటే అంత ఆసక్తి ఉండేది కాదు. ఈ వృత్తిలో నేను ఉండాలి. దీంట్లోనే పనిచేయాలి అనే ఆసక్తి లేకుంటే జర్నలిజంలో ఎవరూ ఉండలేరు. ప్రభుత్వాలపై పోరాటం అంటే గతంలో పెద్ద ఉత్సాహంగా ఉండేది. మరి ఇప్పుడో? నేను రామ్‌నాథ్ గోయెంగా పత్రికలో పనిచేసినప్పుడు ఆయన ఒకటే చెప్పారు. నువ్వు ఎడిటర్‌గా ఉన్నంత కాలం పత్రిక పాలసీ అనేది నీదే కానీ యజమానిగా నాది కాదు. నా పాలసీ ఏది అని నీవు ఆలోచించవద్దు. నీ సొంత పాలసీని రూపొందించుకో. దాన్నే అమలు చేయి. ఎందుకంటే పత్రిక సంపాదకుడివి నీవు అన్నారు. నేను పత్రికలో నా సొంత పాలసీనే అమలు చేయగలిగాను. ఆ విషయంలో నేను చాలా అదృష్టవంతుడిని. చంద్రబాబు, కేసీఆర్ పాలన ఎలా ఉంది? కేసీఆర్‌కి తెలంగాణ సిద్ధాన్నం. అంటే రెడీమేడ్ భోజనం. తెలంగాణలో మంచి వనరులు చాలా ఉన్నాయి. మనది సంపన్న రాష్ట్రం అని కేసీఆరే అన్నారు. చాలా నిజం. సంపన్నం అంటే హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయమే మన ఆదాయం. ఆంధ్రలో పరిస్థితి పూర్తిగా విరుద్ధం. ఉన్న వనరులతోనే సరిపెట్టుకోవాలి. అమరావతి రాజధాని గురించి మీరెలా చూస్తున్నారు? అమరావతి రాజధాని కావాలని కోరుకునేవారిలో నేనూ ఒకడిని. అయితే.. అమరావతి అంటే ఏమిటి? అమరేశ్వరాలయం ఉన్న ఊరు అని కాదు. ఆ చుట్టుపక్కల ఊర్లన్నీ కలిపి అమరావతి అని నా ఉద్దేశం. గుంటూరు, విజయవాడ, తెనాలి, అమరావతి ఈ మొత్తం ప్రాంతం కలిపి రాజధానిగా అభివృద్ధి కావాలి. అంతే తప్ప హైదరాబాద్‌లో లాగా ఒక సచివాలయం కట్టి అక్కడే అభివృద్ధిని కేంద్రీకృతం చేయడమని కాదు. మరి అమరావతిలో మీరనుకున్నట్లే జరుగుతోందా? ఇప్పుడేమీ జరగటం లేదు. ఎందుకనేది నాకూ అర్థం కావటం లేదు కానీ, డబ్బులేకపోవడమే కారణం అనుకుంటాను. కేంద్రం రూ. 2,500 కోట్లు ఇచ్చిందని అంటున్నారు కానీ ఏమూలకు సరిపోతుంది? తాత్కాలికమైనవైనా సరే నాలుగైదు భవనాలు కట్టారు. నేను వెళ్లి చూశాను కూడా. ప్రధానంగా రోడ్లు, మౌలిక వసతుల కోసమే చాలా ఖర్చు అవుతుంది. కానీ డబ్బు లేదు. అలాగని రాజధాని పేరుతో అక్కడ జరుగుతున్నదంతా నేను ఆమోదించడం లేదు. నా అభిప్రాయాలు నాకున్నాయి. అందుబాటులో ఉన్న వసతులను ఉపయోగించుకోవడం మంచిది. ఉన్న చోట మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోవాలి. అంటే గుంటూరులో మిర్చి యార్డ్ ఉంది. విశాలమైన ఆ ప్రాంతంలో కొన్ని ప్రభుత్వ భవనాలు కట్టుకోవచ్చు. ఇక అక్కడే పొగాకు రీసెర్చ్ కేంద్రం ఉంది. దాదాపు 60 ఎకరాల స్థలం ఉంది. అక్కడా కొన్ని కట్టుకోవచ్చు. ఇలా చేయడానికి బదులు మూడు పంటలు పండే రైతుల భూములను తీసుకోవడం దేనికి? అమరావతిలో ప్రభుత్వం ఇప్పుడు చేస్తున్నది కరెక్టేనా? ఇలా చేస్తే బాగుంటుంది అని నేను అంటున్నానంటే, ఇప్పుడు చేస్తున్న విధానం సరికాదనే కదా అర్థం. అమరావతి పేరిట జరుగుతున్న పరిణామాలు, పనుల పట్ల నేను సంతోషంగా అయితే లేను. మన అభిప్రాయాలు ఏవైనా అమరావతి ఆలోచనలు పూర్తిగా చంద్రబాబువి. అలాగే వెళుతున్నారు. ఉన్న వసతులు పక్కనబెట్టి, వేలకోట్లు అప్పు తెచ్చి కడితే నమ్ముతారా? జనం నమ్మటం కోసం రాజధాని కడతారా? ఒకవేళ అలా చేసినా జనం నమ్మరు. అమరావతిలో ఆన్ ది స్పాట్లో ఉన్నవారు, అక్కడే పుట్టి పెరిగిన వారు. మా ఎదుట ఏం జరుగుతోంది అన్నదే చూస్తారు. మంచి భవంతులు, వసతులు వచ్చాయనుకోండి. జనం సంతోషపడతారు. కానీ ఇంతవరకు అలాంటివి ఏవీ జరగలేదే? పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేస్తా అని బాబు అంటున్నారే? కేంద్రం మొత్తంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టి ఉండాల్సింది. అలా చేపట్టలేదు. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత చేపట్టింది. కొంత ఖర్చు పెట్టి పనులు ప్రారంభించారు. అలా చేసిన ఖర్చులయినా పూర్తిగా కేంద్రం ఇచ్చేసి ఉంటే బాగుండేది. ఫిరాయింపులను మీరెలా అర్థం చేసుకుంటున్నారు? ఎవరు చేసినా, చేయించినా ఫిరాయింపులు తప్పు. చట్టం ఉన్నా లేకున్నా నైతికంగా తప్పే. ఏపీలో, తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను సమర్థించలేను. పార్టీ మారాలనుకుంటే రాజకీయ భేదాభిప్రాయాలు ఉన్నాయని చెప్పి రాజీనామా చేసి, తర్వాత మీకు ఇష్టమైన పార్టీలలో చేరండి. తప్పులేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? పోలవరం ఇంత వివాదాస్పదం ఎందుకవుతోంది? ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి కావాలంటే ప్రభుత్వాధినేత సంకల్పం చాలా గట్టిదై ఉండాలి. చేతిలో చిల్లిగవ్వ లేకున్నా ప్రకాశంపంతులు ప్రోత్సాహంతో ప్రకాశం బ్యారేజి నిర్మించడానికి నాటి సీఎం నీలం సంజీవరెడ్డి ఇలాంటి సంకల్ప బలంతోనే పూనుకున్నారు. అప్పట్లో ఆ ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ. 10 కోట్లు అవసరం. పైసా లేకున్నా ప్రారంభించారు. పాలకుడిలో అలాంటి దృఢసంకల్పం ఉండాలి. పైగా పోలవరం వంటి భారీ ప్రాజెక్టు విషయంలో పబ్లిక్ డిబేట్ కలికానికి కూడా కనిపించడం లేదు. ఇదేదో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రానికి మధ్య గొడవలాగే ఉంది తప్పిస్తే ప్రజలను కలుపుకోవడం అనే ప్రసక్తే లేకుండాపోయింది. ఇంత భారీ ప్రాజెక్టును అసెంబ్లీలో ప్రభుత్వం, ప్రతిపక్షాన్ని కలుపుకుని ఎలా సాధించాలో చర్చించాలి. కానీ, ఒక్కసారైనా అలాంటిది ఏపీ అసెంబ్లీలో జరిగిందా? ఇంత పెద్ద సమస్యలో కూడా ఉమ్మడి అవగాహన తీసుకురాకుంటే ఎలా? పోలవరం ప్రాజెక్టు ప్రభుత్వానిదో, అధికార పార్టీదో కాదు కదా! ప్రలోభపెట్టి ఎమ్మెల్యేలను కొంటున్నప్పుడు ఉమ్మడి అవగాహన ఎలాసాధ్యం? ఏ ప్రలోభం లేకుండానే, ప్రలోభానికి గురికాకుండానే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అలా ఫిరాయిస్తున్నారంటే నేను నమ్మను. ఏదో ఒక బలమైన ఆకర్షణ లేకుండా ఫిరాయింపులు అనేవి జరగనే జరగవు. (పొత్తూరి వెంకటేశ్వరరావుతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/i5jYgU / https://goo.gl/eCYuDn -
ఏబీకే ప్రసాద్‌తో మనసులో మాట
-
మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో మనసులో మాట
-
వైఎస్ జగన్ అలా ఎన్నడూ చేయలేదు!
వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటెలిజెన్స్ విభాగానికి ఒక్కసారి కూడా ఫోన్ కాల్ చేయలేదని, సచివాలయంలో, ప్రభుత్వ సమావేశాల్లో ఆయన కనిపించడం నాకు తెలిసినంతవరకు ఎన్నడూ జరగలేదని ఉమ్మడి రాష్ట్ర డీజీపీ కె. అరవిందరావు తేల్చి చెప్పారు. అలాగే వైఎస్ఆర్ కూడా చట్టానికి వ్యతిరేకంగా ఫలానా పని చేసిపెట్టాలని నిఘా అధికారులకు ఎన్నడూ చెప్పలేదని స్పష్టం చేశారు. సొహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ వంటి ఘటనల్లో సీబీఐ అతిగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. పోలీసు శాఖ అధికార పక్షానికి కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉందని కానీ పూర్తి అనుకూలత ప్రదర్శిస్తే పోలీసు ఉద్యోగాలు పోవడం ఖాయమన్నారు. ఓటుకు కోట్లు కేసులో ఎఫ్ఐఆర్లో చేర్చిన పేర్లను చార్జిషీటులో పోలీసులు నమోదు చేయకపోతే ప్రైవేట్ కేసు పెట్టవచ్చన్నారు. హిందూమతం గురించి చదువుకున్నవారు ఎవరూ అసహనం చూపడానికి వీల్లేదని, నిజానికి మనవాళ్లు భగవద్గీత, ఉపనిషత్తులు చదవనందువల్లే ఈ మతఛాందస వాదం పుట్టుకొస్తోందంటున్న అరవిందరావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... కర్కశమైన లాఠీ నుంచి పూర్తి విరుద్ధమైన ఆధ్యాత్మికత వైపు ఎలా వెళ్లిపోయారు? నాది ఆధ్యాత్మికం కాదండి. ఇది కూడా పోలీసు జాబే అనుకుంటున్నా. ప్రపంచం నుంచి దూరంగా వెళ్లిపోయి భగవంతుడు, సాధన అనే ధోరణిలో ఉండటమే ఆధ్యాత్మికత అనుకుంటాం. నా ఉద్దేశంలో భగవద్గీత, ఉపనిషత్తులు చదివినవారు ఎవరూ సన్యాసి కారు. కానీ భగవద్గీత చెప్పినవాడు ఒక సోల్జర్ కాగా దాన్ని విన్నవాడు కూడా సోల్జరే. విన్న తర్వాత నా ధర్మమేమిటి అని తెలుసుకుని యుద్ధం చేశాడు. అందుకే ప్రపంచం గురించి మనగురించి ఒక పెద్ద చిత్రణనిస్తుంది భగవద్గీత. ఆధ్యాత్మికత కూడా పోలీసు జాబే అని ఎందుకన్నానంటే ఉదాహరణకు దేశం ఉంది, మన దేశంలో ఒక సంస్కృతి ఉంది. ఈ సంస్కృతి దేశరక్షణకు అవసరం. దేశరక్షణ, సమగ్రత అనేవి కేవలం పోలీసులపైనో, ఆర్మీపైనో ఆధారపడి ఉండవు. సంస్కృతి బలంగా లేకపోతే దేశ సమగ్రత కూడా బలంగా ఉండదు. అందుకే నేను వాల్మీకి రామాయణం కూడా ఇంగ్లిష్‌లో చెబుతున్నాను. దేశంలో మత అసహనం, గోరక్షణ పేరిట దాడులు పెరగడంపై మీ వ్యాఖ్య? మత అసహనం చాలా తప్పు. హిందూమతాన్ని చదువుకున్నవారు ఎవరూ అసహనం చూపడానికి వీల్లేదు. మన తత్వంలో అసహనం అనే మాటేలేదు. నీవు దేవుడిని ఏ రూపంలోనైనా పూజించు అనే సిద్ధాంతం ఇదొకటే. నిజానికి మనవాళ్లు భగవద్గీత, ఉపనిషత్తులు చదవనందువల్లే ఈ మతఛాందస వాదం అనేది వస్తోంది. అవి చదివినవారు దాని జోలికి పోరు. ఈ మధ్య కంచ ఐలయ్య పుస్తకంతో పెద్దవివాదం పుట్టుకొచ్చింది కదా? ఐలయ్య కూడా కాస్త గీత దాటారు. ఆయన స్కాలర్. అలాంటప్పుడు వర్ణానికి, కులానికి మధ్య ఉన్న భేదాన్ని తాను తెలుసుకోవాలి కదా. శ్రీకృష్ణుడి నిర్వచనం ప్రకారం కంచ ఐలయ్య కూడా ఒక ద్విజుడు. అంటే బ్రాహ్మణుడు మాత్రమే కాదు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మూడూ కలిపి ద్విజులు అని అర్థం. సేవలు చేసే వారు తప్ప మిగతా అందరూ ద్విజులే అని గీతార్థం. కాని ద్విజ వర్గంలో ఉండాల్సిన వారంతా తాము శూద్రులమని ఆపాదించుకుంటున్నారు. ఇదే పొరపాటు. అంతే తప్ప ఒక చిన్న కమ్యూనిటీని పట్టుకుని దేశాన్ని దోచుకుంటున్నారని అనడం పొరపాటు. వ్యాపారం లేకుండా ఏ సమాజమూ లేదు. బిజినెస్ లేకపోతే సమాజమే నిలవదు. వైఎస్ రాజశేఖరరెడ్డితో మీ పరిచయం ఎలా ఉండేది? మొదట్లో నేను ఆశ్చర్యపోయాను. అదనపు డీజీ ఇంటెలిజెన్స్‌గా నన్ను ఆయన నియమించినప్పుడు సర్ప్రైజ్ అయ్యాను. అంతకుముందు కడప జిల్లాలో ఎస్పీగా ఉన్నప్పుడు ఆయనతో సన్నిహితంగా ఉండేవాడిని. ఆయన అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ తన గౌరవానికి లోటు లేకుండా చేసేవాడిని. బహుశా అదే మనస్సులో ఉన్నట్లుంది. సీఎం అయ్యాక ఉన్నత పదవి ఇచ్చిన తర్వాత కూడా ఆయనతో మంచి సంబంధాలే ఉండేవి. ఆయన నన్ను పూర్తిగా విశ్వసించేవారు.. అలా విశ్వసించడం అంటే మనకు ఇక తిరుగులేనట్లే. వృత్తిగతంగానే కాదు వ్యక్తిగతంగా కూడా ఎవరైతే వ్యక్తులపై నమ్మకం ఉంచుతారో వారు గొప్ప మనుషులన్నమాట. సీబీఐ, పోలీసు శాఖ కాస్త పక్షపాతంతో వ్యవహరిస్తుంటాయి కదా? సీబీఐలో నేను ఎప్పుడూ పనిచేయలేదు కాబట్టి నేను చెప్పలేను. సొహ్రాబుద్దీన్ ఎన్ కౌంటర్ ఘటనలో నాపై కేసు విషయంలోనే నేను కొంత ఫీలయ్యాను. ఎందుకంటే ఆ చనిపోయిన వాడేం మహాత్ముడు కాదు. వ్యాపార వర్గాలను బెదిరించి కొల్లగొట్టడంలో రాటుదేలినవాడు. వాడు ఎలాంటి స్థితిలో చచ్చాడో మనకు తెలీదు. ఆ కేసు ఆధారంగా అప్పటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీని పదవినుంచి దింపేయాలని భావించారేమో! కానీ సీబీఐ అందరినీ పట్టుకుని వేధించడం కాస్త అతి చర్య అనిపించింది. ఏపీలో, తెలంగాణలో పోలీసులు అధికారపార్టీ చెప్పిందే చేస్తున్నారని విమర్శలు..! రూలింగ్ పార్టీకి పోలీస్ శాఖ అంతో ఇంతో కాస్త అనుకూలంగానే ఉంటుంది. పూర్తిగా అయితే ఉండదు. అయితే పోలీసులపై నిందమోపడం ప్రతిపక్షం విధి. కొంత అనుకూలత ఉంటుందని నేను ఒప్పుకుంటాను. కానీ పూర్తిగా అధికారపార్టీకి అనుకూలంగా ఉండదు. అలా చేస్తే పోలీసు ఉద్యోగమే పోతుంది. పోలీసులు కొన్ని సందర్భాల్లో అధికారపార్టీ ఆదేశాలకు ప్రభావితం కావచ్చు. అలాగని సీఎం ఏది చెబితే దాన్ని పోలీసులు చేయాలని రూల్ ఏమీ లేదు. వైఎస్ఆర్తో సాన్నిహిత్యం ఉండేదికదా, ఆయన వైఖరి ఎలా ఉండేది? వైఎస్ రాజశేఖరరెడ్డి నాకు ఇలాంటివి చేయమని ఎప్పుడూ చెప్పలేదండి. చట్టానికి వ్యతిరేకంగా ఫలానా పని చేసిపెట్టమని ఆయన ఎన్నడైనా చెప్పినట్లు నాకు గుర్తు లేదు. క్రమ విరుద్ధంగా ఆయన నాకు ఏదీ చెప్పలేదనే నేను అనుకుంటున్నాను. వైఎస్ జగన్ మీకు కానీ, సచివాలయానికి కానీ ఎన్నడైనా ఫోన్ చేసేవారా? అస్సలు లేదండీ. జీరో. ఒక్కసారి కూడా నాకు ఫోన్ చేయలేదు. శాంతిభద్రతలకు సంబంధించి వైఎస్ జగన్ నాకు చెప్పిందంటూ ఏమీ లేదు. ఇక ప్రభుత్వ వ్యవహారాల్లో ఆయన ప్రమేయం గురించి నాకు ఏమీ తెలీదు. ఆయన తొలినుంచి బిజినెస్ పనుల్లో ఉండేవారు కాబట్టి ఈ అంశంలో ఆయన పాత్ర గురించి నాకు తెలీదు. సచివాలయంలో, ప్రభుత్వ సమావేశాల్లో వైఎస్ జగన్ కనబడటం నాకు తెలిసి ఎప్పడూ లేదు. చాలావరకు ఆయన బెంగళూరులో ఉండేవారు. హైదరాబాద్‌లో ఆయన దాదాపు లేనే లేరు కదా. ముద్రగడ పద్మనాభం కదిలితేనే నేరమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఆయన పాదయాత్ర చేస్తేనే అడ్డుకోవడం సరైందేనా? రాష్ట్రం విడిపోయింది కదా.. నాకు వివరాలు పూర్తిగా తెలీవు. పైగా హైదరాబాద్‌లో ఉంటున్నందున ఏపీ వార్తలు పేపర్లలో రావ డం తక్కువే. కానీ అలాంటి నిర్ణయాలు ఆ నిర్దిష్ట అధికారి వ్యక్తిగత నిర్ణయం మేరకే జరుగుతుంటాయి. అయితే ఆయన కదలడం వల్ల, పాదయాత్ర చేయడం వల్ల లక్షలా దిమంది కదిలి వస్తారా? మనకయితే తెలీదు. వైఎస్ జగన్‌ని విమానాశ్రయం రన్‌వే పైనే ఆపివేసిన ఘటన కూడా ఆ అధికారి వ్యక్తిగత అంచనాప్రకారమే జరిగి ఉంటుంది. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు పేరు పెట్టి, చార్జిషీట్లో చేర్చకపోవడంపై మీ వ్యాఖ్య? ఆ కేసు వివరాలు నాకు తెలీదు. కానీ అకడెమిక్‌గా చెప్పాలంటే, పోలీసులు అలా చేయకపోతే, ప్రైవేట్ వాళ్లు కేసు వేసుకోవచ్చు. పోలీసు కేసుకు ఎంత చట్టపరమైన చెల్లుబాటు ఉంటుందో ప్రైవేటు కేసుకు కూడా అంతే చెల్లుబాటు ఉంటుంది. కాబట్టి పోలీ సులు పేరు చేర్చలేదంటే పెద్దగా ఫీల్ కానక్కరలేదు. తెలుగు ప్రజలకు మీ సందేశం? తెలుగు ప్రజలం కాబట్టి, తెలుగు భాషను కూడా మనం నిలుపుకోవాలి. భాష ద్వారానే మన సంస్కృతి నిలుస్తుంది. అభినందించాల్సిన ముఖ్యవిషయం ఏమిటంటే రెండు రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలందరూ కలిసే ఉన్నారు. దానికి రెండువైపులప్రభుత్వాలనూ అభినందించాలి. ప్రజలనూ అభినందించాలి. ఇలాంటి సామరస్య వాతావరణం ఇంకా కొనసాగాలన్నదే నా ఆశ. -
మాజీ డీజీపీ అరవిందరావుతో మనసులో మాట
-
ప్రజలకోసమే పాదయాత్ర
పాదయాత్రలు సీఎం కావడం కోసం చేయరనీ, జనం సమస్యలను నేరుగా తెలుసుకోవడమే వాటి ఉద్దేశమని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వంపై వ్యతిరేకత ఏపీ ప్రజల్లో తీవ్ర స్థాయిలో ఉందన్నారు. కేంద్రం చేపట్టనిదే పోలవరం ప్రాజెక్టు పూర్తి కావటం కల్లోమాటే అన్నారు. అభివృద్ధిని కాదు.. చంద్రబాబు ప్రభుత్వ దోపిడీని అడ్డుకుంటున్నామని, సాక్ష్యాధారాలతో సహా ఆయన అవినీతిని కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆదరణ చూరగొని వైఎస్సార్ సీపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందంటున్న వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయం ఆయన మాటల్లోనే... మీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ పాదయాత్ర ఎలా జరుగుతోంది? పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ప్రజలకు దగ్గరగా వెళ్లి వారి కష్టాలను చూడటమే. మనం కారులోనో, మరే వాహనం లోనో వెళ్లి కలిస్తే వాళ్లు మనదగ్గరకు వచ్చి సమస్యలను చెప్పుకోవలసి ఉంటుంది. అదే పాదయాత్ర అయితే, నడిచిపోయేటప్పుడు ఆ గ్రామాల్లో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సుఖంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, బాధల్లో ఉన్నారా, వారి ఇబ్బందులేమిటి? అని నేరుగా కలిసి తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టే రాజకీయ నేతలు పాదయాత్ర చేస్తుంటారు వైఎస్ఆర్, చంద్రబాబుతో పోలిస్తే వైఎస్ జగన్ పాదయాత్ర గురించి మీ అభిప్రాయం? లోగడ జరిగిన పాదయాత్రల కంటే జగన్ పాదయాత్ర తప్పకుండా భిన్నంగా ఉంటోంది. పాదయాత్ర కంటే ముందే జగన్ ఉమ్మడి రాష్ట్రంలో ఓదార్పు యాత్ర చేశారు. అప్పట్లో ప్రతి గ్రామాన్ని ఆయన సందర్శించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదరికాన్ని జగన్ చూసినట్లుగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మరే నేత కూడా చూడలేదు. ఇది అతిశయోక్తి కాదు. పేదలు, బడుగు, బలహీనవర్గాలకు చెందిన ప్రతి గుడిసెలోకి వెళ్లారాయన. వాళ్ల కష్టాలు చూశాడు కాబట్టే పాదయాత్రలో మరోసారి వారందరినీ కలుసుకుని ఉన్న సమస్యలను అధికారంలోకి వచ్చాక ఎలా పరిష్కరిద్దాం అని చెబుతున్నారు. ఆ గ్రామానికే పరిమితమై ఉన్న సమస్యలు పాదయాత్ర ద్వారా వెలికి వస్తున్నాయి. పాదయాత్ర ఉద్దేశం అదే. ఉపఎన్నికల్లో 15 స్థానాలు గెలిచీ, శాసనసభ ఎన్నికల్లో ఎలా దెబ్బతిన్నారు? ఎన్నికలైన రెండు రోజులకే విశ్లేషించుకున్నాం. మనం పొరపాట్లు చేశామా లేక ప్రత్యర్థి జనాలను మభ్యపెట్టినందుకు ఇలా జరిగిందా, ఇంకేవైనా కారణాలు ప్రభావం చూపాయా అని చర్చించుకున్నాం. ప్రధానంగా రుణమాఫీ. అది సాధ్యం కాదనుకున్నప్పటికీ ఎంతో కొంత చేద్దాం, ప్రకటిద్దాం అనుకున్నాం. వారంరోజులపాటు వాదనలు జరిగాయి. కానీ వైఎస్ జగన్ ససేమిరా అంగీకరించలేదు. ఎందుకంటే అప్పటికే రాష్ట్రం విడిపోయింది. ఈ పరిస్థితుల్లో మనకు రుణమాఫీ చేసే శక్తి లేదు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఏదైనా సహకరించే అవకాశం ఉంటే అప్పుడు చూడవచ్చు కానీ తప్పుడు వాగ్దానాలు చేయకూడదు అన్నదే జగన్ అభిప్రాయం. ఇక రెండోది. కాంపెయిన్ ప్రారంభించాక 45 రోజుల్లో మోదీ ప్రభం జనం దేశవ్యాప్తంగా ప్రభావం కలిగించింది. దాని ప్రభావం ఏపీలో నగర ప్రాంత నియోజక వర్గాల్లో బాగా పనిచేసింది. దాన్ని ఏమాత్రం గుర్తించలేకపోయాం. ఎంతమేరకు ప్రభావం వేసిందంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు పట్టణ ప్రాంత నియోజకవర్గాలు 75 ఉండగా, వాటిలో మేం 27 స్థానాలు మాత్రమే గెలవగలిగాం. ఇక మూడోది పవన్ కల్యాణ్ ఫ్యాక్టర్. అది ఎలా పనిచేసిందన్నది అందరికీ తెలుసు. పాత అనుభవాల నేపథ్యంలో ఈసారి ఎన్నికలను ఎలా ఎదుర్కొనబోతున్నారు? ఏ హామీలిచ్చి బాబు అధికారంలోకి వచ్చారో, వాటిలో ఏ ఒక్క హామీ కూడా అమలుకాలేదు. రుణమాఫీ కాక రైతులు నానా ఇబ్బంది పడుతున్నారు. పండినపంటకు గిట్టుబాటు ధర లేక, మళ్లీ రుణాలు అందక తీవ్ర అగచాట్లు పడుతున్నారు. 2004కు ముందు రాష్ట్రంలో ఏ పరిస్థితులు ఉండేవో అవే ఇప్పుడు పునరావృతం అవుతున్నాయి. 2004కి ముందు నాలుగేళ్లపాటు కరువు విలయతాండవం చేసింది. రైతులు మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటున్న తరుణం. ఈరోజు రైతులు అదే పరిస్థితుల్లో ఉన్నారు. కరువు వల్ల పంటలు పండింది లేదు. పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు. రాష్ట్రంలో 80 శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది కదా? మహిళలు, రైతులు, యువకులు ఎవరిలో సంతృప్తి ఉందో వెళ్లి చూస్తే స్పష్టమవుతుంది. అధికారంలోకి వస్తే ఉద్యోగాలిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కానీ జరిగిందేమిటి? పాదయాత్రలో ప్రతి గ్రామం నుంచి వాళ్లే వచ్చి చెబుతున్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అంశమని టీడీపీ, బీజేపీ నేతలు అంటున్నారే? బీజేపీకీ, బాబుకు ప్రత్యేక హోదా ఒక ముగిసిన అంశం కావచ్చు కానీ, 5 కోట్ల ఏపీ ప్రజల దృష్టిలో, మా దృష్టిలో ప్రత్యేక హోదా ఎప్పటికైనా సాధించాల్సిందే. ప్రత్యేక హోదా లేనిదే రాష్ట్రం అభివృద్ధి చెందదు. అదే లేకపోతే విభజన చట్టానికి ఇక అర్థమే లేదు. ఎన్నికష్టాలు వచ్చినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని బాబు అంటున్నారు కదా? పోలవరం ఎవరి ప్రాజెక్టు? అది రాష్ట్ర ప్రాజెక్టా లేక కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టా? విభజన చట్టం ప్రకారం కేంద్రం చేయాల్సిన ప్రాజెక్టును మీరు తీసుకోవడం ఏమిటి? ఆ కాంట్రాక్టరును మార్పించడం కోసం మళ్లీ కేంద్రం చుట్టూ తిరగటం ఏమిటి? ఎందుకు చేస్తున్నారు ఇదంతా? పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలంటే కేంద్రం దాన్ని తీసుకోవలసిందే. లేదా కేంద్రం పూనుకుని రాష్ట్ర ప్రభుత్వం చేత చేయించాల్సిందే. ప్రాజెక్టుల నిర్వహణలో వైఎస్సార్, చంద్రబాబు మధ్య తేడా ఏమిటి? గత మూడున్నరేళ్లుగా బాబు ఎన్ని ప్రాజెక్టులు చేపట్టారు? రాష్ట్రంలో సాగుతున్న ప్రాజెక్టులన్నీ గతంలో వైఎస్సార్ చేపట్టినవే. అన్ని అనుమతులూ తీసుకొచ్చి మరీ వాటికి ఒక రూపం ఇచ్చారాయన. మరి బాబు చేసిందేమిటి? పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టి పూర్తి చేశారని చెబుతున్నారు. ఎవరు తవ్విన కాలువలనుంచి దానికి నీళ్లు వచ్చాయో చెబుతారా? వైఎస్సార్ ప్రాజెక్టులు పూర్తి చేయకుండా కాంట్రాక్టర్లకు ప్రయోజనాలు కల్పించడం కోసం కాలువలను తవ్విస్తున్నారు అని గతంలో బాబు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ అభియోగాలన్నింటికీ ప్రాజెక్టు సైట్లోనే చర్చలు పెట్టి వైఎస్ సమాధానం చెప్పారు. ఇంజనీర్ల సమక్షంలో, అఖిల పక్షాన్ని పిలిచి మరీ వివరణ ఇచ్చారు. ఇప్పుడు అఖిల పక్షం కాదు కదా ప్రధాన ప్రతిపక్షాన్నే ఉనికిలో లేకుండా చేయాలంటున్నారు. కేవలం రెండేళ్ల కోసం 1,600 కోట్లు ఖర్చుపెట్టి పట్టిసీమ ప్రాజెక్టును కట్టారు. పోలవరం పూర్తయితే అది ఎందుకు పనికొస్తుంది? కమీషన్ల కోసం కాకపోతే ఈ డ్రామాలన్నీ ఎందుకు? పైపులేసి, మోటర్లు పెట్టి దాన్ని నదుల అనుసంధానం అంటారా? వైఎస్సార్సీపీ అభివృద్ధికి అడ్డుపడుతోందా? అభివృద్ధికి కాదు... బాబు చేస్తున్న దోపిడీకి అడ్డుపడుతున్నాం. మేమంతా కేంద్రానికి రిపోర్టు చేసి ఏ పని కూడా కాకుండా చేస్తున్నామట. పేదలకు అందాల్సిన జాతీయ నిధులు వారికి అందలేదని మా దృష్టికి వచ్చిన అంశాలను కేంద్రం దృష్టికి తీసుకుపోయాం. ఎక్కడెక్కడ ఎంత అవినీతి జరి గిందో ఉదాహరణలతో సహా వివరించాం. దీనిపై విచారణ చేసి చర్యలు తీసుకోండి అని చెప్పాం తప్పితే ఆ పథకాలనే ఆపేయమని ఎక్కడా చెప్పలేదు. చెప్పిన అబద్ధమే పదిసార్లు చెబితే జనం నమ్ముతారు అనే దాన్ని తండ్రీ కొడుకులు ఇద్దరూ పట్టుకుని సాగదీస్తున్నారు. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడుగా లోకేశ్ కూడా తయారయ్యాడు. వచ్చే ఎన్నికల్లో మీ విజయావకాశాలు ఏమేరకున్నాయి? ప్రజలు ఈ సారి ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతు ఇస్తారు. గత ఎన్నికల్లో కేవలం 1.7 శాతం తేడాతో అంటే 5 లక్షల 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోయాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచే అభ్యర్థులనే రంగంలోకి దింపుతాం. ప్రభుత్వంపై ప్రజల వ్యతిరేకత ఎంత తీవ్రస్థాయిలో ఉందంటే చంద్రబాబు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు కాలేదు. పాలన పక్కన బెట్టేశారు. కుటుంబ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అభివృద్ధిని వదిలేశారు. ఇదే మాకు అవకాశం. ఈసారి గెలుస్తాం కూడా. (వైవీ సుబ్బారెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/cguUK3 https://goo.gl/ZqEKtC -
వైవీ సుబ్బారెడ్డితో మనసులో మాట
-
జగన్ పాదయాత్రపై ప్రముఖ పాత్రికేయుల మనసులో మాట
-
బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో మనసులో మాట
-
ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మనసులోమాట
-
ఆళ్ల రామకృష్ణారెడ్డితో మనసులో మాట
-
పొన్నం ప్రభాకర్‌తో మనసులో మాట
-
మల్లాది విష్ణుతో మనసులో మాట
-
తమ్మారెడ్డి భరద్వాజతో మనసులో మాట
-
దగ్గుబాటి సురేశ్‌తో మనసులో మాట
-
ఒంటరితనమే డ్రగ్స్‌కు కారణం
► కొమ్మినేని శ్రీనివాసరావుతో యండమూరి వీరేంద్రనాథ్ సినీరంగం సునాయాసంగా డ్రగ్స్‌కు లోనవుతోందంటే చేతినిండా డబ్బులు, ఒంట రితనం, వెసులుబాటే కారణమని ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాధ్ పేర్కొన్నారు. నలభై రోజులు కుటుంబాలకు దూరమై ఒంటరితనంతో గడిపే వాతావరణంలోనే అందరూ కలిసి కూర్చుని తినడం, తాగడం షూటింగు లొకేషన్లలో సహజమని ఆ అలవాటే వ్యసనంగా మారుతుందని చెప్పారు. ఒక చోట సాన్నిహిత్యంతో గడపవలసి వచ్చే చోట ఏ ఒక్కడికి వైరస్ ఉన్నా పక్కవారికి వెంటనే పాకిపోతుందని, ఒకసారి తాగండి, తీసుకోండి అన్నప్పుడు ఊ అన్నారంటే అదే అలవాటైపోతుందన్నారు. రాజకీయ వ్యవస్థ పునాదే సరైంది కాదు కాబట్టే మన దేశంలో అవినీతి పెరుగుతూంటుందన్న యండమూరి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... నవలారంగంలో ట్రెండ్ సృష్టించిన మీరు నవలా రచనలోకి ఎలా వచ్చారు? ప్రతి 20 ఏళ్లకీ ట్రెండ్ మారుతుంది. తెలుగు నవల పాపులర్ అవుతున్న తొలి రోజుల్లో కొడవటిగంటి కుటుంబరావు, గోపీచంద్ వంటివారు రెండో ప్రపంచ యుద్ధం, సామాన్యుడు, కమ్యూనిస్టు ప్రభుత్వం, అసమర్థుని జీవయాత్ర వంటి సంఘర్షణల నేపథ్యంలో ఒక ట్రెండ్ సృష్టించారు. అమ్మా యిలు చదువుకోవడం, ఇంటర్మీడియెట్ పాస్ కావడం, ఆ తర్వాత పెళ్లి చేసుకునే దశ వచ్చిన సమయంలో కోడూరి కౌసల్యాదేవి, యద్దనపూడి సులోచనా రాణి వంటివారు ఇంకో ట్రెండ్ సృష్టించారు. ఒక స్త్రీ తన కలల రాజకుమారుడిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండటం.. అదొక పాతికేళ్లు నడిచింది. ఆ తర్వాత ఇంకో విధమైన ట్రెండ్.. ఆర్థర్ హెయిలీ, ఇర్వింగ్ వాలెస్ టైప్‌లో సబ్జెక్ట్ తీసుకుంటే ఒక పరిశోధన చేసి దానిపై ఏదైనా రాయడం మొదలైంది. ఇప్పుడు నవలలు రాస్తే చదివేవారు ఎవరూ లేరు. దాదాపు 15 ఏళ్లనుంచి నవలా రచన అనే ట్రెండే లేదు. నవలారంగంలోకి రావడానికి ప్రేరణ ఎవరు? అమ్మా, నాన్న రెండు కుటుంబాల్లోనుంచి సాహిత్యపరమైన పునాది ఉంది. నేను జీన్స్ థియరీని నమ్మను కానీ ఆ ఇంటి వాతావర ణంలో నేను కూడా రాయడం మొదలెట్టాను. ఎందుకు రాశానంటే నాన్నే కారణం. నాకు కొన్ని ఆత్మన్యూనతా లక్షణాలు ఉండేవి. ఈ కాంప్లెక్సులనుంచి బయటపడాలంటే నీ లోపల మనిషితో మాట్లాడరా అని నాన్న చెప్పాడు. ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటుంది. నీలోనూ కళ ఉంటుంది దాన్ని గుర్తించు అని నాన్న అనేసరికి నాలో నాకు రచయిత కనిపించాడు. అలా కథలు రాసే క్రమంలో నాలోని న్యూనతా లక్షణాలు తగ్గిపోయాయి. క్షుద్ర శక్తుల్ని మీరు నమ్ముతారా? నేను మొత్తం 70 నవలలు రాశాను. వాటిలో క్షుద్రశక్తిమీద రాసింది మూడే. జనాలకు అలాంటివి ఇంట్రెస్టు కాబట్టి చాలా పాపులర్ అయ్యాయి. ఏ నవల రాసినా ఆ నవలలో ఒక ప్రత్యేక సబ్జెక్టు తీసుకునేవాడిని. ఇక తులసీ దళం రాసినప్పుడు బాణామతిపై రాయాలనిపించింది. అందుకు ప్రేరణ నా ఆదర్శ దైవం విశ్వనాథ సత్యనారాయణ. ఆయన బాణామతి అనే నవల రాశారు. అది అంత పాపులర్ కాలేదు. ఆ పుస్తకానికి సెంటిమెంట్ జోడించి కమర్షియల్ ఎలిమెంటుతో బాగా రాయవచ్చేమో అనిపించింది. ఆంధ్రభూమి పత్రికలో ఎనిమిది వారాల తర్వాత ఆ సీరియల్‌ని నిలిపివేయాలనుకున్నాం. మొదట్లో అది సక్సెస్ కాలేదు. ఆ పాపకు చేతబడి మొదలైనప్పట్నుంచే హిట్టయింది. తర్వాత సంపాదకుడు, నేను కొనసాగించాం. వాస్తవానికి 26 వారాలు అనుకున్నది 104 వారాల పాటు రాశాను. టాలీవుడ్లో డ్రగ్స్ సంక్షోభం, గొడవ గురించి మీరేమంటారు? సినీరంగంలో వెసులుబాటు ఎక్కువ ఉంటుంది. డబ్బులు ఎక్కువగా ఉంటాయి. పైగా సినిమా వాళ్లకు ఒంటరితనం ఎక్కువ. షూటింగు కోసం ఊటీ వంటి ప్రాంతాలకు వెళితే దాదాపు 40 రోజులు ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది. పెళ్లాం బిడ్డలు ఉండరు. ఆడా, మగా కలిసి కూర్చుని వెళ్లడం, వరండాల్లో కూర్చుని కలిసి డ్రింక్ తాగడం.. షూటింగ్ లొకేషన్లలో అలవాటు. అందులో ఏ ఒక్కడికి వైరస్ ఉన్నా.. పక్కవారికి వెంటనే పాకిపోతుంది. ఒకసారే కదా తాగండి అంటారు. అదే అలవాటైపోతుంది. రాజకీయ నేతల సైకాలజీని స్టడీ చేస్తుంటారా? ఇండియాకు క్రికెట్ ప్లేయర్ కావడం సులభమేమో కానీ రాజకీయ నాయకుడిగా కావడం చాలా కష్టం. రాజకీయ నాయకుడు అవాలంటే మొట్టమొదట లౌక్యం ఉండాలి. జ్ఞాపక శక్తి, ధారణ శక్తి ఉండాలి. మొహం మీద చిరునవ్వు ఉండాలి. తనకన్నా పైవాళ్లను మంచి చేసుకునే నేర్పు ఉండాలి. అన్నింట్లో వెసులుబాటు చేసుకుంటూ పైకి ఎగబాకే తత్వం కూడా ఉండాలి. పైవాణ్ణి నొక్కేసి తాను పైకి వెళ్లి తర్వాత తన కిందివాళ్లను పైకి తీసుకొచ్చే తెలివి కూడా ఉండాలి. మీ సరస్వతీ విద్యాకేంద్రం గురించి చెబుతారా? నా ఆస్తి మొత్తం సరస్వతీ కేంద్రానికి రాసి ఇచ్చేశాను. కారణం చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. మా నాన్న కూడా అడుక్కుతినేవాడు. వాళ్ల నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో ఈయన వారాలు చేసుకుని బతికాడు. నాన్న పుట్టింది అమలాపురం దగ్గరయితే ఉద్యోగాలు చేసింది రాయలసీమలో. చదువుకోసం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగాను. బీదతనం నుంచే వచ్చాను కాబట్టి సంపాదించిన తర్వాత తిరిగి ఇచ్చేయాలనే ఉద్దేశంతో సరస్వతీ విద్యా పీఠం పెట్టి గిరిజన విద్యార్థులకు ఉచి తంగా విద్య, డొనేషన్లు ఇస్తున్నాను కాబట్టి మా ఇంట్లో మినీ సినిమా ధియేటర్లు, బెంజ్ కార్లు వంటివి లేవు. బాల్యం ఆ అనుభూతుల గురించి చెబుతారా? నేను చాలా పూర్ స్టూడెంటుని. బాగా చదివేవాడిని కాదు. ఆరో క్లాసు, ఏడో క్లాసు అన్నీ ఫెయిలవుతూ వచ్చాను. అమ్మ వాళ్ల నాన్న డిప్యూటీ తహసీల్దార్. నేను ఆయన దగ్గరే పెరిగాను. ఈయనేమో చాలా గారాబం చేసేవాడు. ఇది యువతకు పనికివస్తుందేమో అని చెబుతున్నాను. ఏడో తరగతి ఫెయిలయ్యాక నాన్న వద్దకు వెళ్లాను. అక్కడికెళ్లాకే మొత్తంగా మారిపోయాను. వందల పద్యాలు బట్టీయం వేయించాడు. 23వ లెక్క రివర్స్‌లో చదివించేవాడు. కుటుంబంలో తండ్రి తల్చుకుంటే మనిషి ఎంత మారగలడో చెప్పడానికి నేనే ఉదాహరణ. తాతయ్య వద్ద ఉన్నప్పుడు వరుసగా ఫెయిల్ అవుతూ వచ్చిన నేను నాన్న వద్దకు వచ్చాక చార్టర్డ్ అకౌటెంట్ అయాను. ఆయన వల్లే నాలుగేళ్ల సీఏ కోర్సును మూడేళ్లలో పూర్తి చేశాను. పేదరికం అనేది గొప్పతనానికి అడ్డుకాదు. సెలూన్‌కి కూడా వెళ్లను. ఇప్పటికీ నా హెయిర్‌కట్ నేనే చేసుకుంటాను. దాన్నీ మా నాన్నే నేర్పాడు. భవబంధాలు తెంచుకుని గడిపే పరిస్థితి సాధ్యమా? ఇప్పుడు నేను చేస్తోంది అదే కదా. అందరూ నా పిల్లలే అన్నట్లు ఉంటున్నా. సరస్వతీ విద్యాపీఠం లక్ష్యమే అది. బీద విద్యార్థుల పట్ల, ప్రపంచం పట్ల ప్రేమ ఉండాలి. భవబంధాలు తెంచుకోవాలి. నా అన్నది మానేసి మన అన్నదాంట్లోకి రావాలి. డబ్బులు అనేక మార్గాల నుంచి వస్తుంటాయి వాటిని ఇచ్చేస్తుంటాను. అందుకే నావద్ద ఇప్పుడు డబ్బు అనేదే లేదు. సినిమా ఫీల్డులో అరుదుగానే పనిచేస్తున్నాను. అలా వచ్చే డబ్బులు కూడా ఉండవు. ఎంతో సౌకర్యంగా ఉన్నాను. ఇంకేమి కావాలి నాకు. ఇలాంటి ఆలోచన వస్తే భవబంధాలు పోతాయి. కాపీనం–పీనాసితనం–పోతుంది. (యండమూరితో ఇంటర్వ్యూ పూర్తి కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
వెన్నుపోటు చంద్రబాబుకే చెల్లు
♦ మనసులో మాట ► కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు సొంతమామను నిలువునా ముఖ్యమంత్రి పదవినుంచి తన్ని తగిలేయడం జగజ్జంత్రీలకే సాధ్యపడుతుంది కానీ మామూలు మనుషులకు సాధ్యపడదని, చంద్రబాబు ఆ కోవలో వాడే కాబట్టి సులభంగా రామారావు గోచీ లాగిపడేశాడని మాజీ ముఖ్యమంత్రి, నాదెండ్ల భాస్కరరావు పేర్కొన్నారు. రామారావును వెన్నుపోటు పొడిచిన ఘనత బాబుదే కానీ తనది కాదన్నారు. ఓటుకు కోట్లు కేసులో బాబు అడ్డంగా దొరికిపోయారని, ఈ కేసు మొత్తానికి బాబే బాధ్యుడని, నేనే లాయర్‌గా ఉండి. ఇలాంటి కేసులో ఎవరైనా ఇరుక్కుని ఉంటే వెంటనే అరెస్టు చేయమని చెప్పేవాడినని నాదెండ్ల పేర్కొన్నారు. ఏ ఇబ్బంది వచ్చినా ఎవర్నో ఒకర్ని పట్టేసి తాత్కాలికంగా తప్పుకునే సామర్థ్యం ఉంది కాబట్టే బాబు జగజ్జంత్రీలకు జగజ్జంత్రి అని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కేసీఆర్‌కు 70 మార్కులు పడితే, ఏపీలో బాబు పాలనకు జీరో మార్కులే పడతాయన్నారు. బడుగు బలహీనవర్గాల్లో వైఎస్సార్సీపీ అద్యక్షుడు జగన్ పట్ల మోజు ఉందని, వచ్చే ఎన్నికల్లో తానే గెలుస్తారని చెబుతున్న నాదెండ్ల భాస్కరరావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... ♦ రాజకీయాల్లో మీరు సక్సెస్ అయ్యారా, ఫెయిలయ్యారా? ఫెయిలయినట్లే లెక్క. ఒక పార్టీని పెట్టి రాష్ట్రానికి ఎన్నో చేయాలనే భావాలతో ముందుకు వచ్చిన మనిషిని నేను. కానీ బ్రేక్ పడింది. దానికి కారణం నేను కావచ్చు. స్నేహితులు కావచ్చు. నన్ను అభిమానించే వారు కావచ్చు.. ♦ పార్టీ పెట్టింది ఎన్టీ రామారావు కదా, ఆయనలేనిదే మీరెక్కడున్నారు? ఎన్టీఆర్ పార్టీ పెట్టడమేమిటి? చాలా విచిత్రంగా ఉందిది. ఇలా పార్టీ పెట్టాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చిందని అప్పట్లోనే ఎన్టీఆర్‌ని పత్రికలవారు అడిగారు. నా ఆలోచనేంటి.. అంతా నాదెండ్ల భాస్కరరావు మెదడులో పుట్టింది అన్నారాయన. అవునా కాదా? ఆరోజు కాంగ్రెస్ మీద జనాలకు ఉన్న ద్వేషాన్ని అలా టర్న్ చేశారు అంతే. ఆరోజు పార్టీకి చేసిందంతా నేను. కథానాయకుడిని నేను. ఆయన కథానాయకుడు కావడమేంటి? తొందరపడి కథానాయకుడి పాత్ర ఆయనకు ఇచ్చాను. ఎన్టీఆర్ క్రెడిట్ పొందడానికి కారణం ప్రజలు. ప్రజలకు సినిమా మోజు ఎక్కువ. ఆ మోజుతో జనం అటుగా మొగ్గారు. దానికి మీ మీడియా వాళ్లు మరికాస్త సెగపెట్టారు. ♦ ఏదేమైనా ఎన్టీఆర్ గ్లామర్ ముందు మీరు ఎలా నిలబడగలుగుతారు? ఒకటి చెప్పండి. ఎన్టీఆర్ నా ఇంటికి వచ్చాడా, నేను ఎన్టీఆర్ ఇంటికెళ్లానా? ఇక్కడే తేలిపోతుంది వ్యవహారం. కానీ జనం గ్లామర్‌నే చూశారు. తానేమో రాముడు, కృష్ణుడు, భీముడు అంటూ పాత్రల్లో నటించాడు. జనంకి అవే గుర్తుంటాయి కానీ, జక్కా గాడిని నేనెలా గుర్తుంటాను? నా వద్ద ఉన్నవారు ఆరోజు ఎన్టీఆర్‌ని పార్టీ ప్రెసిడెంటుగా ఒప్పుకోలేదు. మేమే అందరినీ ఒప్పించి తననే ప్రెసిడెంటుగా ప్రకటించాం. ♦ ఎన్టీఆర్‌ని పడగొట్టడంలో బాబు సక్సెస్ అయ్యాడు.. మీరు ఫెయిలయ్యారు కదా? బాబుకు అనుకూలత ఏమిటంటే. రామారావు ఇంట్లో తిన్నాడు. ఇంట్లో వాసాలు లెక్కెట్టాడు. దగ్గరున్నోడికి గోసి లాగడం ఈజీ. దూరంగా ఉన్నవాడిని గోసి ఎలా లాగగలుగుతాను. నా గోచినే వాళ్లు లాగేశారు. నేనెట్లా లాగుతాను. ఇంట్లో తిన్నవాడికి తిన్న వాసాలు లెక్కపెట్టడం తేలిక. రామారావును వెన్నుపోటు పొడిచిందే బాబు. నేనెప్పుడూ వెన్నుపోటు పొడవలేదు. ♦ ఎన్టీరామారావు పాలనపై మీ అభిప్రాయం? ఎన్టీరామారావు పాలనేంటి? చేసిందంతా నేనయితే. ఎన్టీరామారావు పరిపాలకుడు అంటే ఎంత తప్పు. రాయలసీమ రైతు కెనాల్ అని పేరు పెడతాం అని ప్రతిపాదించారు. కానీ ఎన్టీఆర్ దానికి తెలుగు గంగ అని పేరెట్టారు. దానికీ దీనికీ తేడా అర్థమయిందా? ఇంకొక విషయం తెలుగు గంగ కాలువ తవ్వడానికి 12 వందల కోట్లు అవుతుందా.. ఒక పదివేల తట్టలు, పదివేల పారలు కొనేసేయి. నా అభిమానులు వస్తారు. కాలువ తవ్విపడేస్తారు అనేవాడు ఎన్టీఆర్. ఇదీ ఆయన అడ్మినిస్ట్రేషన్. ♦ విభజన సమయంలో బాబు తెలంగాణకు అనుకూలంగా లెటర్ ఇచ్చేశారు కదా? లెటర్ ఏమిటి? చిదంబరం వద్ద రెండు ఉత్తరాలు ఇచ్చి వచ్చాడు. రహస్యంగా కలిసి తెలంగాణ ఇచ్చేయండి అని చెప్పేశాడు బాబు. కానీ ఏపీ శాసనసభలో విభజనకు అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ కూడా మాట్లాడలేదు. అంతకుముందు అసెంబ్లీలో మీ కాంగ్రెస్ పార్టీ వల్ల ఏం జరగదు. నాకివ్వండి విభజన ఎలా చేయాలో చేసి చూపిస్తా అని బాబు నేరుగా అడిగేశారు. తీరా ఏపీ అసెంబ్లీలో విభజన తీర్మానంపై స్పీకర్ రెండు మూడు సార్లు పిలిస్తే బాబు రాకుండా దాక్కునేశాడు. ఇదేం రాజకీయం! ♦ కేసీఆర్‌కు, చంద్రబాబుకు పాలనలో ఎన్ని మార్కులిస్తారు? కేసీఆర్‌కు పాలనలో 70 మార్కులు వస్తే, బాబు పాలనకు జీరోనే. బాబు పాలన గురించి మాట్లాడేటంత తెలివి తక్కువ ఇంటలెక్చువల్ని కాదు నేను. ♦ పోలవరం ప్రాజెక్టు గురించి చాలా చేసేస్తున్నానని బాబు చెబుతున్నారే? పోలవరమా.. దాన్ని బాబు కట్టేదేమిటి? రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టు అది. దాన్ని మేం తీసుకుంటాం. మా సూపర్వైజ్ కింద చేపడతాం అన్నారు. కేంద్రమే తీసుకుంటే టీడీపీ కాంట్రాక్టర్లు మునిగిపోతారు కదా. మరి ఇంట్లో సంసారం కూడా నడవాలిగా. మీరేం కట్టొద్దు. మాకు డబ్బులు ఇవ్వండి మేమే కట్టుకుంటాం అని బాబు కేంద్రాన్ని అడిగారంటేనే ఇది ఎవరి మేలుకోసమో అర్థమవుతుంది. కేంద్రం పంపే డబ్బుతో కాంట్రాక్టర్లను గుప్పెట్లో పెట్టుకోవచ్చు కదా. ♦ పింఛన్లు ఇస్తున్నా.. రుణమాఫీ చేసేస్తున్నా.. అంటున్నారే బాబు? అన్నీ మీ పేపర్లలో వస్తాయంతే. రాష్ట్రంలో ఏదో ఒక ఊరికి బాబును రమ్మనండి. నేనూవస్తాను. ఏ ఊళ్లో మాఫీలు చేసాడో, ఇంకా ఏమేం చేశాడో అక్కడే తేలిపోతుంది. పది మంది రైతుల్ని పిలిపిద్దాం. ఎక్కువమందిని పిలిపిస్తే కచ్చితంగా మనల్ని జనం కొట్టేస్తారు. మీకు ఏయే మేళ్లు చేశారో చెప్పండి అని అడుగుదాం. అక్కడే తేలిపోతుంది. ♦ ఓటుకు కోట్లు కేసులో బాబు పరిస్థితి ఏంటి? బాబు అడ్డంగా దొరికిపోయాడు. ప్రత్యక్షంగా అతడే ఈ కేసు మొత్తానికి బాధ్యుడు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది కదా. నేనే లాయర్‌గా ఉండి అలాంటి కేసులో ఎవరైనా ఇరుక్కుని ఉంటే వెంటనే అరెస్టు చేయమని చెప్పేవాడిని. ♦ బ్రహ్మ దేవుడు కూడా బాబును కాపాడలేడన్న కేసీఆర్ తర్వాత చప్పబడిపోయాడు కదా? అవును మరి. తర్వాత ఇద్దరూ ఫ్రెండ్సయ్యారు. హైదరాబాద్ వదిలిపెట్టి పోకపోతే కేసు పెడతాను అన్నాడు కేసీఆర్. బాబు వెళ్లిపోయాడు. రాజీ కుదిరిపోయింది. బాబు ఎప్పటికప్పడు ఎవర్నో ఒకరిని పట్టేసి తప్పుకుంటున్నారు. అందుకే బాబు జగజ్జంత్రీ. ♦ తెలంగాణలో విపక్షం, ఆంధ్రాలో విపక్షం వీటి పనితీరు ఎలా ఉంది? తెలంగాణలో విపక్షం సమర్థంగా పనిచేయడం లేదు. అదే ఆంధ్రాలో విపక్షం బాగా పనిచేస్తోంది. ప్రతిపక్ష నేతగా జగన్ బాగా పేరుకొచ్చాడు. జనంలో కూడా జగన్ పట్ల మోజు ఉంది. ఒక చాన్స్ ఇద్దాం అనే భావం ఏర్పడిందని స్వయంగా తెలుసుకున్నాను. ♦ వచ్చే ఎన్నికల్లో ఏపీలో, తెలంగాణలో గెలుపెవరిదంటారు? పబ్లిక్‌లో జగన్ పట్ల సానుభూతి ఉంది. వచ్చే ఎన్నికల్లో అతడు గెలుస్తాడని నాకు నమ్మకం. గెలవాలి కూడా. ఏపీలో గెలిచే అవకాశం జగన్‌కే ఉంది. తెలంగాణలో మాత్రం పరిస్థితి అటూఇటూగా ఉంది కానీ తెలంగాణ ఫీలింగ్ మాత్రం జనంలో ఇప్పటికీ ఉంది. ఇక ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి జీరోనే. (నాదెండ్లతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/Lf2mV3 https://goo.gl/sNDbJz -
లోకేశ్ చెప్పి మరీ కొట్టించాడు!
కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ మంత్రి, కాపు నేత ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ సమస్యపై ఇంట్లో ఆమరణదీక్ష నిర్వహిస్తుండగా తమపై దాడి చేసి కొట్టాల్సిందిగా చంద్రబాబు కుమారుడు లోకేశ్ బాబు పోలీసులను ప్రోత్సహించారని మాజీమంత్రి, కాపు నేత ముద్రగడ ఆరోపణ సంచలన ఆరోపణలు చేశారు. లోకేశ్ ఫోన్లోనే నన్ను తిట్టి ‘వాడిని కొట్టారా లేదా.. వాడిని ఇంట్లోంచి బయటకు లాగేయండి, లాగేశారా లేదా.. నాకు సమాధానం కావాలి. వాడిని కొట్టారా లేదా చెప్పాలి నాకు’ అని పోలీసులను బెదిరించి మరీ మా కుటుంబాన్ని కొట్టించాడని ముద్రగడ ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారే తర్వాత తనకు ఈ విషయం చెప్పారు కాబట్టి నమ్ముతున్నానన్నారు. బాబు పాలనలో మట్టిని అమ్మేస్తున్నారు, ఇసుకను అమ్మేస్తున్నారు. గాలిని కూడా అమ్మేస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం మర్చిపోయారు. ఇది ఊరికే పోదంటున్న ముద్రగడ పద్మనాభం అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... రాజకీయాలు 40 ఏళ్లకు ముందు, ఇప్పుడు ఎలా ఉంటున్నాయి? అప్పుడు నిస్వార్థ సేవ. ఇప్పుడు పూర్తిగా స్వార్థంతో కూడుకున్న సేవ. అప్పుడు అన్ని కులాల్లోనూ నిజాయితీ ఉండేది. కులాలకు అతీతంగా ఎంఎల్యేలు, ఎంపీలకు ప్రజాసేవే లక్ష్యంగా తప్ప రెండో ఆలోచన ఉండేది కాదు. ఈరోజు కుటుంబం, వారితో ఉన్న ఫాలోయర్లకే ప్రాధాన్యం. ప్రజలకు సేవ చేయాల్సిన ఆలోచన చాలా తగ్గిపోయింది. ప్రజలకు నాయకులపై ప్రేమ ఉన్నంత కాలం నేను గెలిచాను. వారి ప్రేమను నేను మర్చిపోలేనండి. మొన్న తుని సభలో ఇదే చెప్పాను. నన్ను కన్నది తల్లిదండ్రులు. పెంచింది పత్తిపాటి నియోజకవర్గ ప్రజానీకం అని చెప్పుకున్నాను. ఎన్టీ రామారావును పదవినుంచి దింపినప్పుడు మీరెలా ఫీలయ్యారు? చాలా అన్యాయం. నాదెండ్ల చేసిన పనిని వెన్నుపోటు అన్నారు. మరి దీన్నేమంటారు. ఇదికూడా వెన్నుపోటే కదా. అప్పట్లో పార్టీ మీటింగుల్లో నేను, లాల్ జాన్ భాషా పక్కపక్కనే కూర్చునేవాళ్లం. చంద్రబాబు రాగానే రామారావుకు దండ వేసేవారు. అన్నా..! కాళ్లు లాగేసి, జోడుతో కొట్టేసి, సీఎం కుర్చీలో కూర్చొని పైగా దండేసేసి ఏం షో చేస్తున్నాడన్నా అని భాషా నాతో ఎన్నోసార్లు చెప్పేవారు. టీడీపీలో చాలామందికి ఇదే ఫీలింగ్ ఉండేది. నాదెండ్ల ఎన్టీఆర్‌ని అవమానించలేదు. కాని బాబు తన మామను వైస్రాయ్ హోటల్లో చెప్పులతో కొట్టించాడు. మీరు కాపు ఉద్యమం మళ్లీ మొదలు పెట్టడానికి ప్రేరణ ఏది? 2014 తర్వాత నేను ప్రశాంతంగా ఉన్నాను. మా నాయకులు వచ్చి కలిశారు. చంద్రబాబు పాదయాత్రలో, ఎన్నికల సమయంలో కాపులకు బీసీ ప్రతిపత్తి ఇస్తాను, సంవత్సరానికి వెయ్యి కోట్లు ఇస్తాను.. అంటూ వాగ్దానాలు చేశారు. కానీ ఏమీ చేయలేదు. కాపుల హక్కుల కోసం ఉద్యమిద్దాం అని మావాళ్లు చెప్పారు. అందుకే మొదటి ఉత్తరాన్ని 26–07–2015న సీఎంకి పోస్ట్ చేశాను. ఆ ఉత్తరానికి బాబు సమాధానం పంపి ఉంటే ఏమీ జరిగేది కాదు. మీ వాళ్లను పంపించండి మాట్లాడుదాం అని చెప్పినా బావుండేది. దాంతో చివరగా తుని మీటిం గుకు పిలుపునిచ్చాను. తునిలో ఆ రైలు దగ్ధం ఎలా జరిగింది? అది ఎలా జరిగిందో అందరికీ తెలుసు. అలా తగలబెట్టే స్వభావం నాదో, బాబుదో ఆయన చరిత్ర చూస్తేనే తెలిసిపోతుంది. 1984లో నాదెండ్ల కుట్ర వల్ల రామారావుకు అధికారం పోయినప్పుడు పర్వతనేని ఉపేంద్ర, బాబు ఇద్దరూ ఎన్టీఆర్ స్టూడియోలో కూర్చుని.. ఇళ్లు తగలబెట్టండి, ఆఫీసులు తగలబెట్టండి, బ్యాంకులు తగలబెట్టండి అంటూ పార్టీ కార్యకర్తలకు రాత్రంతా ఫోన్లు చేసి రెచ్చగొట్టారు. తుని ఘటనకూడా అలాంటిదే అంటారా? తుని రైలు దహనంపై మాపై కేసు పెట్టారు. ఇంతవరకు హియరింగ్ లేదు. విచారణకు పిలవరు. విచారిస్తే ఎవరు చేశారో తేలిపోతుంది కదా. కానీ చేయరు. ఇలాంటివి ఒకటా రెండా.. ఎన్నో మరి. పరిటాల రవిని చంపేస్తారని బాబుకు ముందే తెలుసు. ఆయనపై యాక్షన్ జరుగుతుందని, చంపుతారని తెలిసినప్పుడు పక్కనబెట్టి దాయాలి కదా.. చేయలేదు. రవి హత్య జరిగిన రోజు బాబు అన్ని జిల్లాల్లో పార్టీ మీటింగు పెట్టారు. అక్కడ రవిని చంపడం, ఇక్కడ జిల్లాల్లో ఉన్న పార్టీ కేడర్‌ను రెచ్చగొట్టి ఆఫీసులను, బస్సులను, కార్లను తగలబెట్టండి అని పురమాయించింది కూడా బాబే. అప్పుడు నేను టీడీపీలో ఉన్నాను జరిగింది సమస్తం నాకు తెలుసు. సర్వమూ తగలబెట్టండి అని పార్టీ ఆఫీసునుంచే నాకు కాల్ వచ్చింది కూడా. కానీ నేను ఆ పని చేయనని చెప్పాను. తుని రైలును టీడీపీ వాళ్లే తగలబెట్టారని మీరు చెప్పారు. ఇది నిజమేనా? పక్కా. పక్కాగా తగలబెట్టింది వాళ్లే. ఎదురు రాయి వేయడం, డొంక తిరుగుడు నాకు అలవాటు లేదు. వెనకనుంచి పొడిచేయడం, ముంచేయడం నాకు తెలీదు. ఒక విష యం.. ఇంతమంది పోలీసులు ఉన్నారు కదా. నేను ఇప్పుడు పాదయాత్ర చేస్తానంటే వేలమంది పోలీసులు పహరా కాస్తున్నారు. మరి అదే పోలీసులను రైల్వే ట్రాక్ మీద ఎందుకు పెట్టలేదు. సభకు అంతమంది జనం వస్తారని వాళ్లకు తెలీదా.. పోనీ ముందు జాగ్రత్తగా ట్రైన్‌ను పక్క స్టేషన్ నుంచి వదలొద్దని చెప్పారా.. అదీ లేదు. ఇవన్నీ ఎందుకు చేయలేదు అంటే అంతా బాబు కుట్రలో భాగం. ప్రతిపక్షనేత, సీమ గూండాలే తుని ఘటనకు కారణమని బాబు ప్రకటించేశారు గదా? ఏం జరిగినా ఎదుటివాళ్లమీద తోసేయడం బాబుకు మొదట్నుంచి అలవాటు. కాపు రిజర్వేషన్ సమస్యపై నా తొలి ఉత్తరానికి బాబు సమాధానం చెప్పి ఈ సమస్య పరిష్కారం కోసం రెండు మూడేళ్లు పడుతుంది వేచి ఉండండి అని చెప్పి ఉంటే ఇవేవీ జరిగేవి కావు కదా. తుని ఘటన తర్వాత మీ ఇంటిపై దాడి ఎందుకు, ఎలా జరిగింది? సీఎం బాబు కుమారుడే మా కుటుంబంపైకి పోలీసులను ఉసికొల్పాడు. లోకేశ్ అలా ఒత్తిడి చేశాడని తర్వాత ఒక పెద్ద ఆఫీసరే నాకు చెప్పారు. లోకేశ్ ఫోన్లోనే నన్ను బూతులు తిట్టి ‘లం... కొడుకుని కొట్టారా లేదా.. కొట్టారా లేదా.. వాడిని ఇంట్లోంచి బయటకు లాగేయండి, లాగేశారా లేదా.. నాకు సమాధానం కావాలి. లం.. కొడుకుని కొట్టారా లేదా చెప్పాలి నాకు’ అని పోలీసులను బెదిరించి మరీ మా కుటుం బాన్ని కొట్టించాడు. లోకేశ్ ఆ విధంగా బెదిరించిన తర్వాతే పోలీసులు మా ఇంటిపైకి దాడి చేసి కొట్టారు. ఇది లోకేశ్ ఒక్కడి పని కాదు. బాబుకు తెలియకుండా జరిగింది కాదిది. కుటుంబ సభ్యులతో సహా అందరినీ అవమానిస్తే అవమాన భారంతో ముద్రగడ కుంగిపోతాడు. మనకు తలనొప్పి పోతుంది అనుకున్నారు తండ్రీ కొడుకూ.. ఈ దెబ్బతో నేను ఇక బయటకు రాడు అని భావించారు. కానీ బంతిని ఎంత గట్టిగా కిందికి కొడితే అంత బలంగా పైకి లేస్తుంది. నిజమే కొట్టాడు, కొట్టించాడు. ఫనిష్మెంట్ ఇవ్వడానికి దేవుడున్నాడు. వైఎస్సార్, బాబు పాలనపై మీ వ్యాఖ్య? వైఎస్ రాజశేఖరరెడ్డి దానకర్ణుడి కోవకు చెందినవాడు. ప్రజలకు ఏ కార్యక్రమం కావాలంటే దాన్ని చేసి ప్రజల కష్టాల్లో పాలు పంచుకునే మహా వ్యక్తిగా వైఎస్‌ను పోల్చవచ్చు. బాబు అంటారా.. 18, 20 గంటలు మీటింగులు నిర్వహించినట్లుగా నటిస్తాడు. కానీ ఔట్ పుట్ ఏమీ ఉండదు. మాట్లాడేదంతా సొల్లు. చెప్పిందే చెప్పి.. చెప్పిందే చెప్పి.. ఏదో కష్టపడిపోతున్నానని ప్రజలకు చూపించడానికి తప్ప తన ప్రసంగాల్లో ఔట్పుట్ ఏమీ ఉండదు. చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉందనుకుంటున్నారు? అట్టర్ ఫెయిల్. అన్నీ పచ్చి అబద్దాలు. బాబుకు అబద్ధాల చక్రవర్తి అని బిరుదిచ్చినా సరిపోదు. జనం ఏమనుకుంటున్నారు? రాష్ట్రంలో మట్టిని, ఇసుకను అమ్మేస్తున్నారు. గాలిని కూడా అమ్మేస్తున్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడం మర్చిపోయారు. ఇది ఊరికే పోదు. పైగా ‘‘బాబు మమ్మల్ని పురుగులను చూసినట్లు చూస్తున్నాడు. అందుకే తుని మీటింగ్ సక్సెస్ కావాలి. ఎంత ఫండ్ కావాలి చెప్పండి. పంపిస్తాం. తుని సభ lతప్పక విజయవంతం కావాల’’ని టీడీపీ ఎమ్మెల్యేలే చాలామంది నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు. బాబు వ్యవహారంతో టీడీపీ ఎమ్మెల్యేలే రగిలిపోతున్నారు. ‘సీఎం ఇంటికి కిలోమీటర్ ముందే మా వాహనాలు ఆపేస్తున్నారు. ఘోరంగా అవమానిస్తున్నా’రని టీడీపీ మంత్రులు సైతం కుమిలిపోతున్నారు. 45 ఏళ్లకు పైగా నా రాజకీయ జీవితంలో నా కొడుకును, కోడలిని పోలీసులు దారుణంగా కొట్టడం, తిట్టడం చూసి తట్టుకోలేకపోతున్నాను. ఫలితం అనుభవిస్తారు. శిక్షను అనుభవించక తప్పదు. (ముద్రగడతో ఇంటర్వూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/CY6Dlb https://goo.gl/Fw8Gvg -
ముద్రగడ పద్మనాభంతో మనసులోమాట
-
ఆర్.నారాయణ మూర్తితో మనసులో మాట
-
దుబారాకు మారుపేరు బాబు
కొమ్మినేని శ్రీనివాసరావుతో సీనియర్ నేత డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలు అన్నింటినీ నెరవేర్చడం ఏ పార్టీకి అయినా అసాధ్యమే కానీ చంద్రబాబు ఇచ్చిన మాటలకు, చేస్తున్న పనులకు పొంతనే లేదని సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పష్టం చేస్తున్నారు. వరదలు వచ్చే సమయంలో అంతర్వేదిలో కలిసే గోదావరి నీళ్లను రోజుకు కోటి రూపాయలు ఖర్చుచేసి నీళ్లను లిఫ్టు చేసి కృష్ణా బ్యారేజీకి తీసుకొచ్చి అక్కడినుంచి మళ్లీ సముద్రంలో కలుపుతున్న దిక్కుమాలిన పనికి పట్టిసీమ అని, నదుల అనుసంధానమని చెప్పుకోవడం కంటే దిక్కుమాలిన పనన మరొకటి ఉండదని ఎద్దేవా చేశారు. డబ్బులు లేవని చెప్పి స్కూలు పిల్లల వద్ద కూడా రాజధాని ఇటుకకు పది రూపాయలు వసూలు చేసిన ముఖ్యమంత్రి తన అతిధి గృహాలకు, అధికార నివాసాలకు కోట్లు ఖర్చుపెట్టడం ఏమిటి? ఈ దుబారా ఖర్చులకు డబ్బులెక్కడి నుంచి వస్తున్నాయంటున్న దగ్గుబాటి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. చంద్రబాబు ఎన్నికల హామీలు నెరవేరుస్తున్నారా ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చడం ఎవరికైనా సాధ్యం కాదు. కానీ చంద్రబాబు చెప్పినదానికి, చేస్తున్నదానికి చాలా వ్యత్యాసం ఉంది. రెండేళ్లలో పట్టిసీమను పూర్తిగా తీసేస్తామని అసెంబ్లీలోనే చెప్పిన పెద్దమనుషులు దానిపై రూ.1,800 కోట్లు ఖర్చు పెట్టారు. అది అవసరమే లేదని మొన్న కాగ్ చెప్పింది. కృష్ణా, గోదావరి నదులకు వరదలు వచ్చే సమయంలో అంతర్వేదిలో కలిసే గోదావరి నీళ్లను తెచ్చి కృష్ణా బ్యారేజీకి తీసుకొచ్చి అక్కడినుంచి మళ్లీ సముద్రంలో కలుపుతాం. ఇదీ కార్యక్రమం. ఇలా తెచ్చిన నీళ్లను లిఫ్టు చేయడానికి రోజుకు కోటి రూపాయలు ఖర్చుపెడుతున్నారు. అదే పులిచింతలకు ప్రభుత్వం వంద కోట్లు ఇస్తే 45 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవచ్చు. ఆ నీళ్లు మన కళ్లముందు కనబడుతున్నాయి. వాటిని చక్కగా నిల్వ చేసుకోవచ్చు. కానీ 3 టీఎంసీల నీరు నిల్వ ఉండే కృష్ణా బ్యారేజీ వద్ద రోజుకు కోటి ఖర్చుపెట్టి 60 టీఎంసీల నీటిని లిఫ్టు చేసి పోస్తామంటారు. కృష్ణా, గోదావరి పుష్కరాల పేరుతో చెరొక 1,500 కోట్లు ఖర్చుపెట్టారు. ఇక రాజధాని. ఇటుకల పేరు చెప్పి స్కూలుకెళ్లే చిన్న పిల్లల దగ్గర నుంచి వసూలు చేశారు. అదే సమయంలో ఏపీ సీఎం హైదరాబాద్‌లో ఒక బ్లాక్ ఆధునీకరణ అనే మిషతో 20 కోట్లు ఖర్చు పెట్టించాడు. స్పెషల్ ఫ్లైట్లలో తిరిగావు, గెస్ట్ హౌస్‌లు వేసుకున్నావు. నీకోసం ఒక బస్సును 5 కోట్లు ఖర్చు పెట్టి కొన్నావు. తాత్కాలిక నివాసానికి అయిదారు కోట్లు ఖర్చు చేశావు. కోట్ల రూపాయలు పెట్టి రెంట్ హౌస్‌లు తీసుకుంటారు. డబ్బులేదు, ఆర్థిక పరిస్థితి బాగా లేదు, ఇటుకకు డబ్బులివ్వండి, రాజధాని నిర్మాణానికి స్కూలు పిల్లలు కూడా డబ్బులివ్వండి అంటూ చెబుతూనే మనసున్నవాళ్లం అయితే తాత్కాలిక నిర్మాణాలకు ఇన్ని వందల కోట్లు తగలెడతామా? డబ్బుల్లేవు అంటూనే ఈ దుబారా ఖర్చులకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పైగా ఉద్యోగులందరూ అమరావతి రావాల్సిందే అన్నావు.. అదే హైదరాబాద్‌లో బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకున్నావు. నీకొక న్యాయం, జనంకు ఒక న్యాయం. వైఎస్‌కి, చంద్రబాబుకి పాలనాపరంగా తేడా ఏమిటి? నా పరిశీలన మేరకు వైఎస్ చాలా చురుకైన మనిషి, ఒక నిర్ణయం తీసుకోవడంలో దాన్ని అవగాహన చేసుకోవటంలో సొంత అభిప్రాయాలు ఉండవు. పదిమందిని అడుగుతారు. సలహాలు తీసుకుంటారు, తర్వాత నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకోవడంలో వైఎస్ వ్యవహారం చాలా షార్ప్. ఎక్కువ చర్చలు ఉండవు. వెంటనే అమలు చేస్తారు కూడా. కాని చంద్రబాబు వ్యవహారం నాన్చుడే. సాగదీస్తుంటారు. పొద్దున మీటింగ్, సాయంత్రం మీటింగ్, ఒక రోజు మీటింగ్, రెండు రోజుల మీటింగ్. ఇంత సుదీర్ఘ చర్చలు జరిగి తీరా అమలు విషయం వచ్చేసరికి, మళ్లీ మామూలే. ఇవ్వాళ చెప్పిన కార్యక్రమం గురించిన వార్త పేపర్లో వస్తే ఇక అది అయిపోయిందనే అనుకుంటారు. మళ్లీ రేపటినుంచి కొత్త కార్యక్రమాలు. మళ్లీ దాన్ని వండటం తర్వాత ప్రకటన. ప్రకటన వచ్చేసిందంటే అది అయిపోయినట్లేనని ఊహించేసుకుంటారు. వ్యక్తులుగా వారిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి? చంద్రబాబు తననీడను తాను చూసి భయపడతారు. బయటకు కనబడినంత ఇదిగా ఉండడు. పైగా పార్టీ కోసం ఎక్కువగా శ్రమించినవాడిని రాజకీయంగా ఎలా నిలుపుకోవాలి అనే విషయం చంద్రబాబుకు తెలియదు. అదే వైఎస్ విషయంలో అయితే మనల్ని నమ్ముకున్నవాళ్లకు ఎంత మేలు, ఎప్పట్లోగా చేయగలం, చేయాలి అని స్పీడుగా టైమ్ కేటాయించుకుంటారు. ఆ స్పీడులో చాలామందికి సహాయాలు చేస్తుంటారు. బాబు విషయంలో అయితే ఇక్కడ ఒకరికి మేలు చేస్తే వాడేమనుకుంటాడో, వీడేమనుకుంటాడో అనే మీమాంస ప్రబలి సమస్యను కోల్డ్ స్టోరేజ్‌లో పడేస్తుంటాడు. చంద్రబాబు తెలంగాణ ఏర్పాటుకు లేఖ ఇచ్చి ఏపీలో వ్యతిరేకించడం తెలివైన పనా? దాన్నే దిక్కుమాలిన తెలివి అంటారు. లోపలేమో లెటర్ ఇచ్చావు. ఏపీలో పోరాటం చేస్తానంటావు. అసెంబ్లీ ఎన్నికల్లో తెరాసతో కలిసి పోటీ చేశాడు. పొత్తులో భాగంగా గులాబీ కండువా వేసుకున్నాడు. ఏపీకి వచ్చి అన్యాయం చేశారంటూ గగ్గోలు పెడతాడు. కాంగ్రెస్ దగా చేసిందనేది రోజూ గుణపాఠమే అనుకోండి. కానీ నువ్వు చేసిన పనిని ఇతరులపైకి నెట్టి దోషుల్ని చేయడం దారుణం కదా. పోలవరం కాంట్రాక్టు పనుల్లో మతలబు ఉందా? అర్హత లేని కంపెనీకి పోలవరం కాంట్రాక్టు ఇచ్చారు. కాంట్రాక్టు ఇచ్చిన తర్వాత చంద్రబాబు కూడా దాన్ని పోషించారు. డబ్బుల్లేని కంపెనీ, అప్పుల పాలైపోయిన కంపెనీ రెండేళ్లపాటు ప్రాజెక్టును కట్టకున్నా చూస్తూ ఊరకున్నారు. కేంద్రం డబ్బులిస్తానని చెప్పింది కాబట్టి మళ్లీ అంచనా వేసి మరో కంపెనీకి అవకాశం ఇచ్చి ఉంటే పోలవరం పనులు కొలిక్కి వచ్చేవి. అసలు కంపెనీ నిర్మాణ పనులు చేపట్టదు. సబ్ కాంట్రాక్టులు ఇవ్వడం, వాళ్లు పనులు పక్కనపెట్టడం. ఇవన్నీ కేంద్రం పరిశీలనలోకి వెళ్లే అంశాలు. పోలవరం కాంట్రాక్టు వ్యవహారంపై ఎంక్వయిరీ చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అవినీతి మామూలు రూపంలో లేదు. కాగ్ పోలవరంపైన కూడా మాట్లాడుతుంది. అప్పుడు ఉంటుంది తమాషా. ఫిరాయింపుదార్లకు పదవులివ్వడంపై పురందేశ్వరి లేఖ ఇచ్చారు కదా.. 1982 మే 28న రెండో మహానాడులో టీడీపీ ఒక తీర్మానం చేసింది. పార్టీలోకి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల వాళ్లు గెలిచి టీడీపీలోకి రావాలనుకుంటే వారి పదవులను వదిలేసుకుని రావాలని తీర్మానం చేశాం. అలాంటి విలువలతో ప్రారంభమైన పార్టీ ఇది. ఇవ్వాళ స్పీకర్లే అడ్డదిడ్డంగా చేయడం గంపగుత్తగా ప్రతిపక్షం ఎమ్మెల్యేలను లాగేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరానిది. ఫిరాయింపుదార్లను చేర్చుకోవడం అభివృద్ధిలో భాగం అని బాబు అంటున్నారే? ఎప్పుడైనా బలం లేనటువంటి వాళ్లు చేసే పనులు ఇలాగే ఉంటాయి. ఇంతకాలం పార్టీకి పనిచేసిన వాళ్లను పక్కనపెట్టేసి ఇతర పార్టీలనుంచి వచ్చిన వాళ్లకు పదవులివ్వడం అంటే అది బలహీనతే కదా.. వీక్ అయినవాళ్లే ఏదో ఒక రకంగా బలపడాలని చూస్తుంటారు గదా. ఫిరాయింపులతోటే బలపడదాం అనే దిక్కుమాలిన ఆలోచనలు బాబుకే వస్తాయని ముందే చెప్పాను మరి. రాజధాని పేరుతో జరుగుతున్న వ్యవహారాలపై మీ అభిప్రాయం? రాజధానిని పాలనా రాజధానిగా పెట్టుకుంటే సరిపోతుంది. బ్రహ్మాండమైన రాజధాని కట్టాలి అనుకోవడం తప్పు కాదు. కాని ఇది సాధ్యమా, సాధ్యం కాదా అని ఆలోచించుకోవాలి. హైదరాబాద్ అనేది సాఫ్ట్ వేర్ పరిశ్రమ వచ్చాకే ఇంత గుర్తింపు పొందింది. అంతకుముందు అమానుల్లా ఖాన్ కట్టిన బిల్డింగే హైదరాబాద్ ఐకాన్‌గా ఉండేది. అలా 30 ఏళ్లు అదే నగర చిహ్నంగా ఉండిపోయింది. అంతర్జాతీయంగా ఉపయోగపడే మానవవనరులు ఇక్కడ ఉన్నాయి కాబట్టే సాప్ట్ వేర్ పరిశ్రమ ఇక్కడికి తరలి వచ్చింది. అది చంద్రబాబు గొప్పతనం కాదు. మరొకరి గొప్పతనం కాదు. నగరం ఏర్పడాలంటే వందలాది పరిశ్రమలు, విద్యా కేంద్రాలు, లక్షలాదిమందికి ఉద్యోగాలు ఇవన్నీ కల్పించాలి. అప్పుడే అది మహానగరం అవుతుంది. అమరావతిలో ఉన్నఫళాన ఉద్యోగాలు రావు. ఇక మెట్రో రైలు ఎక్కడినుంచి వస్తుంది? 50 ఏళ్ల తర్వాత హైదరాబాద్‌లో ఒక రింగురోడ్డు చూశాం. అమరావతిలో రింగ్ రోడ్డు అంటున్నారు. ఎలా సాధ్యం? మీలాం టివాళ్లు, మాలాంటివాళ్లు జాకీలెత్తుతా ఉంటే అంటే ప్రచారం చేస్తూ ఊదర గొడుతూ ఉంటే ప్రపంచ స్థాయి రాజధానిని ఊహల్లో కట్టేస్తాం మరి. అమరావతిలో ఉన్నవారు గగ్గోలు పెడుతున్నారు. కొనేవారు లేరు, అమ్మేవారు లేరు అక్కడ. ఈపాటికి అక్కడి ఐదు వేల ఎకరాల్లో శాశ్వత భవనాలే నిర్మించుకుని ఉండవచ్చు. కానీ తాత్కాలిక అసెంబ్లీ ఏమిటి, తాత్కాలిక భవనాలేంటి. ఇదే చిన్న స్థాయి ఉద్దేశాలు అంటే.. ఏపీ ప్రభుత్వ పాలన ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏమిటి? మూడు పువ్వులు ఆరు కాయలు లాగా బ్రహ్మాండంగా ఉందని చెబుతున్నారు కదా. కానీ ఆ ప్రచారాన్ని ప్రజలు అంగీకరిస్తారా లేదా అనేది ఎన్నికల్లోనే చూద్దాం. (దగ్గుబాటితోఇంటర్వ్యూ రెండో భాగం పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/9zdtiL https://goo.gl/xRn4X5 (దగ్గుబాటితో ఇంటర్వ్యూ మొదటి భాగం పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/PYhkkj https://goo.gl/eBKHq8 -
పోలవరం ప్రాజెక్టు ఎవరి స్వప్నం?
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో సీనియర్ నేత డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోలవరం తన కలల ప్రాజెక్టు అని చంద్రబాబు చెబుతున్నది పచ్చి అబద్ధం అని, నాటి ప్రధాని దేవేగౌడ ఈ ప్రాజెక్టుకు అత్యంత సుముఖంగా ఉన్నప్పటికీ ఆయన కోరిన ప్రకారం ప్రాజెక్టు అంచనాలు, మార్పులు గురించి వివరాలు పంపించకుండా తాత్సారం చేసింది చంద్రబాబేనని సీనియర్ రాజకీయ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు తేల్చి చెప్పారు. ప్రధానితో మీటింగులో ఎర్రన్నాయుడు కూడా ఉన్నారని, తర్వాత తొమ్మిదేళ్లు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నా పోలవరం వివరాలు కేంద్రానికి పంపలేదని దీన్ని బట్టి పోలవరం ఎవరి కలో తెలుస్తోందని ఎద్దేవా చేశారు. నేను నిప్పు, నిజాయితీ.. రాజకీయాల్లో నేను తప్పే చేయను అని బాబు చెప్పిన స్వోత్కర్ష ఓటుకు కోట్లు కేసులో మునిగిపోయిందని, ఆ నీతి నిజాయితీ దెబ్బకే అన్నీ వదులుకుని హైదరాబాద్ నుంచి పారిపోయారని హేళన చేశారు. ఎన్టీఆర్ మరో ఆరు నెలలు బతికి ఉంటే రాష్ట్ర చరిత్ర, బాబు చరిత్ర కూడా తేలిపోయేదంటున్న దగ్గుబాటి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు కదా. ఎలా ఫీలవుతున్నారు? రాజకీయాలకు దూరంగా ఉండటం ఏదో గొప్ప అని నేను భావించడం లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడూ బాగానే అనిపించింది. లేనప్పుడు కూడా బాగానే అనిపిస్తోంది. రాజకీయాల్లోంచి నేను సంతృప్తిగా.. అంటే ఏ మచ్చా లేకుండా, అన్ని పనులూ నిర్వహించి మంచి అనిపించుకుని బయటకి వచ్చాను అనే తృప్తితోటే నేను జీవిస్తున్నాను. మిమ్మల్ని బాగా బాధ పెట్టిన సన్నివేశం ఏది? రామారావుగారిని పదవి నుంచి దించేసిన తర్వాత, ఏది ఎలా ఉన్నా నేనుచేసిన పని కరెక్టు కాదు. ఆయన ఒక ఉన్నతమైన శక్తి. జాతికి ప్రతీక ఆయన. ఎన్ని రకాలుగా ఆయన తప్పు చేసి ఉన్నా, నాకు అవి ఇష్టం లేకపోయినా నేను అటువంటి దానిలో భాగస్వామ్యం కావడం అనేది నా జీవితంలోనే అసహ్యకరమైన విషయంగా భావిస్తున్నాను. ఎన్టీరామారావుకు పార్టీ పెట్టమని మీరు ఎప్పుడూ చెప్పలేదా? ఎన్టీ రామారావుకు పార్టీ పెట్టాలని ఎవరన్నా చెప్పడమంటే అంతకంటే హాస్యాస్పదమైన అంశం ఉండదు. అంతకంటే అబద్ధం కూడా ఉండదు. పార్టీ పెట్టాలని ఎన్టీఆర్‌కి తానే సలహా ఇచ్చానని బాబు మొన్ననే అన్నారే? బాబు రోజూ చెప్పేవన్నీ నిజాలేనా? ప్రతి రోజూ ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే కదా. పార్టీని నేను పెట్టమన్నాను అని చెప్పడం అంటేనే పచ్చి అబద్ధం. 1982 మార్చి 29న హైదరాబాద్‌లో రామకృష్ణా సినీ స్టూడియోలో తాను పార్టీ పెడుతున్నట్లుగా ఎన్టీఆర్ ప్రకటించారు. ఏప్రిల్ 11న తొలి మహానాడును నిర్వహించారు. మహానాడు పూర్తయ్యాక బాబును నేను స్వయంగా కలిసి పార్టీలోకి వచ్చి ఆర్గనైజేషన్ వ్యవహారాలు చూసుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుం దని ఆహ్వానించాను. దానికి ఆయన కాదన్నారు. మీకు పార్టీ పెట్టేంత ఇది ఉందా అనేశారు. పార్టీ నడపడానికి ఖర్చులు ఎలా వస్తాయి. ఆయన డబ్బులు తీయరు అనేశారు. రామారావు డబ్బులు పెట్టరు అనేదే చంద్రబాబుకు మొదటి నుంచి ఉన్న అభిప్రాయం. బాబు అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్నారు. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయలేం అనేది వారి విశ్వాసం. దాన్నే బాబు వ్యక్తం చేశారు. లేటుగా టీడీపీలోకి వచ్చిన బాబు ముందుకెళ్లిపోయారు.. మీరేమో వెనుకబడిపోయారు? పార్టీలోకి తను ఎలా వచ్చాడో అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి అధికారం కోల్పోయాక అక్కడ ఉండలేక వెంటనే టీడీపీలో చేరిపోయాడు. రాజకీయాల్లోకి మాది ఒకరకమైన ఎంట్రీ. బాబుది మరొక రకమైన ఎంట్రీ. తనకు అప్పటికే అధికారం ఏమిటో తెలుసు. ఏం చేయాలో తెలుసు. మేమేమో వ్యవస్థను బాగు చేయాలి అనే సంకల్పంతో పార్టీలోకి వచ్చాము. జయప్రకాష్ నారాయణ్ ఉద్యమంలో భాగమై డబ్బుల్లేకుండా రాజకీయాలు చేయొచ్చు అని నమ్మి వచ్చినవాళ్లం. కానీ బాబుకు రాజకీయమే జీవనం. దాని కోసం ఏదైనా చేయగలడు. ఎలాంటి సాహసానికైనా పూనుకోగలడు. ఏమైనా చేయగలడు అంటే అడ్డగోలు పనులు కూడా చేస్తాడనా? ఎందుకు చేయడు? మహానాడు, మినీమహానాడు అంటూ రకరకాలుగా సభలు పెట్టేవారు. ప్రతి సంవత్సరం మహానాడు పెట్టడం ఏమిటి, డబ్బు దండగ, దుబారా అనేది మా అభిప్రాయం. కానీ తాను మహానాడులు, మినీమహానాడులు పెట్టడానికి ఉత్సాహం చూపేవాడు. కాంగ్రెస్‌లో ఒక పని తీరు ఉండేది. నాయకులు వస్తారు. మీటింగు పెడతారు. దానికయ్యే ఖర్చులకు అందరూ ఊరిమీద పడతారు. డబ్బులు కలెక్ట్ చేస్తారు. డేరాలు కట్టడం, భోజనాలు పెట్టడం ఇలాంటివాటికే కాకుండా అదనంగా కూడా వసూలు చేస్తారు. టీడీపీలో కూడా ఇలా మహానాడులు, మినీనాడులు పేరు చెప్పేది. ఊరుమీద పడేది. ఇదేమిటన్నది 1987వరకు నాకు అర్థం కాలేదు. ఆ ఏడాది రామారావు గారు అలా విజయవాడలో జరిపిన మహానాడు కోసం వసూలు చేసిన మొత్తం తన ముందు హుండీలో వేయండి అది ఎవరికీ ఇవ్వవద్దు, నా స్వాధీనంలో ఉంచుకుంటాను అని ప్రకటించారు. అందరూ హుండీలో వేశారు. లెక్కిస్తే మహానాడు ఖర్చులు పోను 60 లక్షల రూపాయలు మిగిలింది. అంటే అంతకుముందు మహానాడుల సందర్భంగా మిగిలిన డబ్బుకు లెక్కా జమా లేదు. ఆ 60 లక్షలు పెట్టి గండిపేటలో పార్టీ ఆఫీసు కొన్నారు. మరి అంతకుముందు వసూలు చేసిన డబ్బులు ఏమైనట్లు? డబ్బుతో ముడిపడిన రాజకీయాలు అలా ఉంటాయి అని చెప్పడానికే ఇదంతా ఉదాహరణగా చెప్పాను. అంతకుముందంతా బాబే మహానాడులను నిర్వహించారా? సందేహమేముంది. వందశాతం కరెక్ట్ అది. 1989లో మహానాడును హైదరాబాదులో నేను స్వయంగా నిర్వహించి దాంట్లో 35 లక్షలు మిగిల్చి ఆ మొత్తాన్ని రామారావు గారికి ఇచ్చాను. మహానాడుకు నా ఆధ్వర్యంలో పెట్టిన ఖర్చు 15 లక్షలు. దాతలిచ్చిన దాన్ని పేర్లతో సహా తెలిపి ఆయన ముందు పెట్టాను. పోలవరం నిజంగా చంద్రబాబు కలేనా? పోలవరానికి సంబంధించిన ముఖ్యమైన విషయం ఉంది. దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టుపై ఒక సమావేశం జరిగింది. వడ్డే వీరభద్రరావు అనే టీడీపీ ఎమ్మెల్యే ఆ సమావేశానికి హాజరయ్యారు. జలవనరుల మంత్రి, ప్లానింగ్ శాఖ మంత్రి, ప్లానింగ్ కమిషన్ చైర్మన్ మధుదండావతే, ఎర్రన్నాయుడు, ఇంకా ప్లానింగ్, ఫైనాన్స్ శాఖ కార్యదర్శులతో ప్రధాని మీటింగ్ పెట్టారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంచనాలు, వాటిలో మార్పుల గురించిన వివరాలు పంపించమని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని (బాబు సీఎం) అడుగుతున్నాం కానీ ప్రభుత్వం నుంచి మాకు ఇంతవరకు ఎలాంటి స్పందనా అందలేదు. మీరు వెంటనే ఆ వివరాలు పంపిస్తే ప్రాజెక్టు మంజూరు చేయడానికి నేను సుముఖంగా ఉన్నాను అని ఆరోజు ప్రధాని దేవేగౌడ స్వయంగా ప్రకటన ఇచ్చారు. ఆ నాటి మీటింగులో ఎర్రన్నాయుడు కూడా ఉన్నారు. ఆ తర్వాత తొమ్మిదేళ్లు బాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు చెప్పండి పోలవరం ఎవరి కలో? లోకేశ్‌ను ఎమ్మెల్సీ చేయడం, మంత్రి పదవి ఇవ్వడంపై మీ అభిప్రాయం? దాంట్లో ఏముందండీ, అది మన సొంత వ్యవహారం కదా. ఎన్టీఆర్ పుత్రులకు పదవి ఇవ్వడం వారసత్వమైనప్పుడు లోకేశ్‌ది వారసత్వం కాదా? ఎన్టీ రామారావు దగ్గర నుంచి మేం తీసేసుకోవచ్చు. కానీ మా దగ్గర నుంచి ఇంకొకరు తీసేసుకోకూడదు. అదీ విషయం. బాబు మాట మాట్లాడితే నేను నిప్పు, నిజాయితీ... అంటుంటారు కదా? ఓటుకు కోట్లు కేసు మాటేంటి? ఆ తర్వాతే కదా హైదరాబాద్ నుంచి పారిపోయింది? (దగ్గుబాటితో ఇంటర్వూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/PYhkkj https://goo.gl/eBKHq8 -
ఫిరాయింపులను సమర్థించం!
కొమ్మినేని శ్రీనివాసరావుతో ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ, బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు మనసులో మాట దేశంలో కానీ, ప్రపంచంలో కానీ రాజధాని నిర్మాణం అంశానికి పెద్దగా ప్రాధాన్యత లేదని, రాజధాని నిర్మాణం చాలా సింపుల్‌గానూ, సహజక్రమంలో సాగవలసిన పరిణామం అని ఏపీ బీజేపీ సీనియర్ నేత, ఏపీ శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు చెబుతున్నారు. రాజధాని కాని, రాష్ట్ర అబివృద్ధి కానీ చర్చల మీద చర్చలతో కాకుండా ప్రజల కోణంలో జరగాల్సిన ప్రక్రియ అని, దీనిపై ప్రజలకు అంతిమంగా ఒక అంచనా తప్పకుండా ఉంటుందంటున్నారు. పాలకులుగా మనం చెబుతున్న అభివృద్ధి గురించి అంతిమంగా నిర్ణయించాల్సింది ప్రజలే అన్నారు. ఫిరాయింపుదార్లకు పదవులు కట్టెబెట్టడాన్ని ప్రజలు సహించరని, వారు అన్నీ గమనిస్తూనే ఉంటారని అంటున్న సోము వీర్రాజు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే. చంద్రబాబు వద్దంటేనే ఏపీ బీజేపీ అధ్యక్ష ఎన్నిక ఆగిపోయిందంటున్నారు..? అది అవాస్తవం. మా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఎత్తుగడలు, రాజకీయ పోకడలు గమనించినప్పుడు ఎవరో దీన్ని నిలుపుదల చేశారన్నది అవాస్తవం. కొన్ని సందర్భాల్లో రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా ఎలా వ్యవహరించాలో అలా ముందుకు వెళుతుంటాం. అంతేకానీ ఒకరి ప్రభావానికి గురై బీజేపీలో ఏదీ జరగదు. బాబు ప్రభుత్వం లోపాలను వెంకయ్య ఒక్కసారన్నా విమర్శించారా? వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. నేను ఇక్కడ ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను. ఇక్కడ ప్రజలకు సంబంధించిన అనేక విషయాలు మేం మాట్లాడాలి. వారు అక్కడి నుంచి అనేక నిధులు తీసుకువచ్చి ఏపీ అభివృద్ధికోసం ప్రయత్నం చేస్తుటారు. ఇక్కడ ఏం చేయాలో సూచిస్తూ వెంకయ్య ముందుకెళుతున్నారు. ఏపీలో ప్రభుత్వానికి మీరు ఎన్ని మార్కులు వేస్తారు? రాష్ట్ర ప్రభుత్వానికి నేను మార్కులు వేయను. మిత్రపక్షంలో ఉన్నాం. ఈ రాష్ట్రానికి మేము ఏం నిధులు తీసుకొచ్చాం, ఈ రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేస్తున్నాం అనే విషయాలను మేము స్పష్టంగా చెబుతాం. ఏపీ అభివృద్ధి విషయంలో ప్రధాని నరేంద్రమోదీ, వెంకయ్య నాయుడులకు నూటికి నూరుమార్కులూ వేస్తాను. చంద్రబాబు పాలన తీరు ఎలా ఉందనుకుంటున్నారు? మిత్రపక్షంగా ఉన్నాం. అయినా సరే ఇసుక అమ్మకాల విషయంలో ఇది బాగా లేదు అని ఏపీ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పాం. ప్రభుత్వంతోనే ఉంటాం. జిల్లాల పెంపుదల వంటి అంశాలపై ప్రభుత్వానికి మా సలహాలను ఇస్తూనే ఉంటాం. పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచారు కదా? కుడి ఎడమ కాలువల విస్తరణ పనులకు వ్యయం అంచనాను బాబు ప్రభుత్వం పెంచింది. కానీ కేంద్రమంత్రి పోలవరం అంచనా వ్యయం 16 వేల కోట్టేనని ఇప్పుడు కూడా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ అంచనాలు వేసి ఇచ్చినప్పటికీ దాన్ని అంతి మంగా అంచనా వేసే పూర్తి యంత్రాగం కేంద్రంలో వాటర్ కమిషన్ రూపంలో ఉంది. రాజధానికి అన్ని వేల ఎకరాలు తీసుకోవటంపై మీ అభిప్రాయం? భారతదేశంలో కానీ ప్రపంచంలో కాని రాజధాని అనే అంశానికి పెద్దగా ప్రాధాన్యత లేదు. ఎన్ని ఎకరాలు అనే అంశంలోకి నేను వెళ్లను. రాష్ట్రాలు విడిపోయింతర్వాత ఉదాహరణకు ఇప్పుడు నయా రాయపూర్ ఉంది. రాజధానికి 5 వేల ఎకరాలు తీసుకున్నారు. దాంట్లో హౌసింగ్ బోర్డు నిర్మాణం చేసింది. కాంగ్రెస్ పార్టీ చాలా కాలం క్రితం గుజరాత్లో గాంధీ నగర్ వద్ద అన్ని కాంప్లెక్స్‌లను ఒకే చోట ఉండేలా నిర్మించింది. చత్తీస్‌గఢ్, జార్కండ్, హిమాచల్ ప్రదేశ్ ఇలా రాష్ట్రాలు విడిపోయాయి. వీటికి రాజధాని నిర్మించుకోవడం ఒక సహజ ప్రక్రియ. దానికోసం అక్కడెక్కడా పెద్దగా చర్చల్లేవు. రాజధానిని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారంటున్నారు. మీరు ఏకీభవిస్తారా? రాష్ట్ర ప్రభుత్వానికి రాజధానిమీద కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. నేను కొన్ని ప్రాంతాల్లో జరిగిన రాజధాని నిర్మాణం గురించి చెబుతున్నాను. రాజధాని అనేది సహజంగా జరిగిపోవాలి. ఏపీ రాజధాని విషయంలో చేస్తున్నది సరైనది కాదనే మీ అభిప్రాయమా? నా ఉద్దేశం అది కాదు. నా అభిప్రాయం చెప్పాను. రాజధానికి 35 వేలు, 50 వేల ఎకరాలు కావాలని బాబు అభిప్రాయపడుతున్నారు. కానీ దేశంలో కొత్త రాజధానుల నిర్మాణం వెనుక నేపథ్యాన్ని నేను చెప్పదలిచాను. రాజధాని నిర్మాణం చాలా సింపుల్‌గానూ, సహజక్రమంలో సాగవలసిన పరిణామం అన్నదే నా ఉద్దేశం. చంద్రబాబు 600 వాగ్దానాలు చేశారు. ఉద్యోగాలు అన్నారు కానీ లోకేశ్‌కి ఉద్యోగం ఇచ్చారు. మీరేం ప్రశ్నించరా? దేశంలో చాలామంది కుమారులకు పదవులిచ్చారు. మా పార్టీలో కూడా అది జరుగుతోంది. అయితే ఈ ‘సన్ స్ట్రోక్’ గురించి ప్రజలు తీవ్రంగానే ఆలోచిస్తున్నారు. ప్రజలు గుర్తిస్తారు కూడా. ఏపీలో ఫిరాయింపులపై మీ అభిప్రాయం? ఈ విషయంపై వెంకయ్య నాయుడు ఇప్పటికే చాలా స్పష్టంగాచెప్పారు. మావరకు వస్తే ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వాన్నే వదులుకున్నాం కానీ ఫిరాయింపుల జోలికి వెళ్లలేదు. ఎవరైనా ఇలా పార్టీలు మారితే ముందుగా వారి నుంచి రాజీనామాలు తీసుకుని తర్వాతే వారిని చేర్చుకుంటాం అని కర్ణాటకలో మా వాళ్లు చెప్పేశారు. ఇదే స్ఫూర్తితో పురంధేశ్వరి ఢిల్లీకి ఉత్తరం రాశారు. ఫిరాయింపుదార్లకు పదవులివ్వడం చంద్రబాబుకు డ్యామేజి కాదా? ఆయనకు డ్యామేజి మాట ఏమో కానీ బీజేపీకి నష్టం జరగకుండా చూసుకోవాలన్నదే మా ప్రాధాన్యత. టీడీపీ, బీజేపీ మధ్య 2019లో కూడా పొత్తు కొనసాగుతుందా? దేనికైనా ఆనాడు ఉన్న పరిస్థితిని బట్టే ముందుకెళతాం. పవన్ కల్యాణ్‌ను మీరే బీజేపీవైపుకు తెచ్చారని అంటారు. కానీ ఆయన చంద్రబాబును వదిలిపెట్టి బీజేపీపైన, వెంకయ్యనాయుడితో సహా నేతలందరిపైనా ఇప్పుడు విరుచుకుపడుతున్నారు? దేశవ్యాప్తంగా బలోపేతమైన పార్టీగా మేం అలా ఆవేశపూరితంగా మాట్లాడలేం. ఎన్నికల నాటికే ఇవన్నీ ఒక కొలిక్కి వస్తాయని నా అభిప్రాయం. ఇప్పుడు కాస్త దూరంగా ఉన్నంతమాత్రాన రేపు కలవలేరని చెప్పలేం కదా. రాజకీయాల్లో దూరాలూ, దగ్గరతనాలూ ఉండవు. విధానాలూ, సిద్ధాంతాలూ బట్టే పొత్తులూ, విడిపోవడాలూ ఉంటాయి. కాపుల రిజర్వేషన్‌పై, ముద్రగడ ఉద్యమంపై మీ అభిప్రాయం? కాపుల రిజర్వేషన్‌పై టీడీపీ ఎన్నికల మ్యానిపెస్టోలో వాగ్దానం చేసింది కాబట్టి దాన్ని అమలు చేయాలనే బీజేపీ డిమాండ్ చేస్తోంది. ముద్రగడ కూడా దాన్నే కోరుతున్నారు. చంద్రబాబు దీనిపై కమిషన్ వేసారు కదా. అదేదో త్వరగా పూర్తి చేయాలనే మేం చెబుతున్నాం కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమిస్తే తన కుటుంబాన్ని ఘోరంగా అవమానించారని ముద్రగడ అంటున్నారు. మీ వైఖరి ఏంటి? కాపులు అనే సెక్షన్‌ని ప్రభుత్వం సరిగా అర్థం చేసుకోవాలి. నేను వ్యక్తులను గురించి చెప్పడం లేదు. వాళ్ల ఆలోచనను, శక్తిని, ఆవేదనను కూడా ప్రభుత్వం సరిగా అర్థం చేసుకోవాలి. కాపుల సమస్యను పరిష్కరించే లక్ష్యం చంద్రబాబు ప్రభుత్వానికి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఒక్క ఓటు తేడాతో వాజ్‌పేయి ప్రభుత్వాన్నే వదులుకున్నాం కానీ ఫిరాయింపుల జోలికి వెళ్లలేదు. ఆనాడూ ఈనాడూ ఫిరాయింపులపై మా వైఖరి మారలేదు. ఎవరైనా ఇలా పార్టీలు మారితే ముందుగా వారి నుంచి రాజీనామాలు తీసుకుని తర్వాతే వారిని చేర్చుకుంటాం అని కర్ణాటకలో మా పార్టీ వాళ్లు చెప్పి పాటిస్తున్నారు. ఇదే స్ఫూర్తితో పురంధేశ్వరి ఢిల్లీకి ఉత్తరం రాశారు. ఫిరాయింపులను ప్రజలు సహించరని మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి. (సోము వీర్రాజుతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) https://goo.gl/Dny4Zc https://goo.gl/doY7jp -
అధికార పక్షానిదే అక్కడ ఇష్టారాజ్యం!
కొమ్మినేని శ్రీనివాసరావుతో ప్రముఖ నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్.కె. రోజా రాజకీయాల్లోకి ఆర్టిస్టులే కాదు ఎవరైనా రావచ్చని, కానీ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వారికి మద్దతుగా ఉండాలి తప్ప ఆ సమయంలో మనం బిజీగా ఉన్నాం అని చెప్పి తప్పించుకుంటే జనం నమ్మకం కోల్పోతామని ప్రముఖ నటి, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజా చెప్పారు. ఆర్టిస్టుగా, ఎమ్మెల్యేగా, ఒకరి భార్యగా తనకున్న గౌరవాన్ని దెబ్బతీసి చట్టసభలోనే భయంకరమైన నిందలేసిన వారికి సారీ చేప్పేంత తప్పు తాను చేయలేదని స్పష్టం చేశారు. 20 మంది ఎమ్మె ల్యేలు వెళ్లిపోయారంటే జగన్ నాయకత్వ లోపం అంటున్న వారికి.. తెలంగాణలో టీడీపీ ఎమ్మె ల్యేలంతా వరసపెట్టి టీఆర్ఎస్లో చేరితే అది చంద్రబాబు నాయకత్వ లోపంగా కనిపించడం లేదా అని ప్రశ్నించారు? మామకు వెన్నుపోటు పొడిచాక బాబు సొంత పార్టీ పెట్టుకుని ఉంటే తన బలమేమిటో, తన ఫేస్ వాల్యూ ఏమిటో తెలిసేదని, అలాగే బాబు కుమారుడు ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కూడా తన ఫేస్ వ్యాల్యూ ఏంటో తెలిసేది అంటున్న రోజా అభిప్రాయాలు ఆమె మాటల్లోనే.. రాజకీయాల్లోకి మీరు ఎలా వచ్చారు? ఆ ఆసక్తి ఎలా కలిగింది? ప్రస్తుత ఎంపీ ఎన్. శివప్రసాద్ గారే నన్ను సినిమాల్లోకి తీసుకు వచ్చారు. 1999 ఎన్ని కల్లో గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని ఆయనకు టీడీపీవాళ్లు ప్రామిస్ చేశారట. అందుకని తన నియోజకవర్గంలో రెండు రోజులు వచ్చి నేను ప్రచారం చేయాలని ఆయన మా నాన్నను వచ్చి అడిగారు. సినిమాల్లో తొలి అవకాశం ఆయనే ఇచ్చారు కదా తప్పకుండా వెళ్లు అని నాన్న చెప్పారు. అలా రెండు రోజులు వెళ్లి వాళ్లు సమస్యలపై రాసి ఇచ్చినది తీసుకుని మాట్లాడాను. నా ప్రసంగాలను విన్న చంద్రబాబు ఈ అమ్మాయి బాగా మాట్లాడుతోంది. రాష్ట్రం మొత్తంలో పర్యటించి ప్రసంగిస్తుం దేమో కనుక్కోమని చెప్పారట. సీఎంగా ఉన్న వ్యక్తి ప్రశంసించారంటే.. పడిపోనివాళ్లు ఉంటారా? అలా 26 రోజులపాటు ప్రచారం చేశాను. స్థానిక ఎన్నికల నుంచి ఎంపీ ఎన్నికల వరకు అన్నింట్లో పాల్గొని పని చేశాను. 1999లో పార్టీ గెలిచాక కూడా అయిదేళ్లపాటు నేను మహా నాడు వంటి కార్యక్రమాల్లో తప్ప పార్టీ పనుల్లో జోక్యం చేసుకోలేదు. 2004లో టీడీపీ తరపున పోటీ చేయాలని అడిగారు. నా భర్త వద్దం టున్నా బలవంతంగా ఒప్పించారు. వాయల్పాడు సీటు అడిగితే, చివరి నిమిషంలో చంద్రబాబు నగరిలో పోటీ చేయమని చెప్పారు. ఎలాంటి మద్దతూ లేక ఓడిపోయాను. తర్వాత అయిదేళ్లు కష్టపడి నగరిలో బలమైన పునాదిని నిర్మించుకోగలిగాను. కానీ 2009లో అక్కడ నాకు సీటు ఇవ్వకుండా ఒక రోజు ముందు చంద్రగిరి సీటు ఇచ్చారు. అక్కడా ఓడిపోయాను. పదేళ్లు కష్టపడిన ఒక అమ్మాయిని కాపాడదాం అనే ఆలోచన కూడా బాబుకు లేదు. రోడ్డుమీద నిలబెట్టి చివరకు నా రాజకీయ కెరీర్‌నే నాశనం చేశారు. కులం ప్రాతిపదికనే నన్ను చూశారని అర్థమైంది. మరి వైఎస్ రాజశేఖరరెడ్డిని కలిశారు కదా? చిత్తూరు జిల్లాకు బెల్ కంపెనీ, విమానా శ్రయం తీసుకొచ్చారు. మన జిల్లాకు ఇంత పెద్ద ప్రాజెక్టులు సాధించారన్న భావనతో మర్యాదపూర్వకంగా వెళ్లి వైఎస్ఆర్ని కలి శాను. టీడీపీ వాళ్లు చాలా మంది ఆయన వద్దకు వెళ్లి పనులు చేయించుకుని వచ్చారు కూడా. నేనలాంటివి చేయలేదు. అభినందించడానికి ఒక బొకే ఇవ్వడానికి వెళ్లగానే దాన్ని పెద్ద సీన్ చేసేసి, పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఏమో జరుగుతోందని పుకార్లు వ్యాపింపచేశారు. అప్పుడు నాకు ఆలోచన వచ్చింది. నన్ను అవమానించి, ప్రతి ఎన్ని కల్లోనూ నన్ను ఓడించి, టీడీపీలో నా పొజిషన్ ఏంటో తెలీని స్థితికి తెచ్చిపడేశారు. ఇక నేనెందుకు ఉండాలి. వెళ్లిపోతాను అని ప్రకటించాను. వైఎస్సార్‌ను కలిసిన తర్వాత మీ పార్టీలో గొడవ అయింది. తర్వాత కాంగ్రెస్‌లో చేరారా? లేదండీ. రాయలసీమకు మంచిచేసి, ఎంతోమందికి ఉపాధి కలిగించే ప్రాజెక్టులు తీసుకువచ్చినందుకు అభినందించాలని ఆయన్ని కలిశాను. ఆ తర్వాత సంవత్సరం వరకు నేను ఏ పార్టీలో కూడా చేరలేదు. వైఎస్ మరణించిన తర్వాత కూడా కిరణ్ కుమార్‌రెడ్డి, పెద్దిరెడ్డి, బొత్స అందరూ రమ్మన్నారు. ఆయనంటే గౌరవంతో వచ్చాను కానీ అధికారం కోసం ఆయన్ని కలవలేదని చెప్పి చెన్నైలోనే ఉండిపోయాను. ఒక సంవత్సరం తర్వాత జగన్ పిలిచారు. మీలాంటి వారు పార్టీకి అవసరం. జీవితాంతం మీకు తోడుగా ఉంటాం పార్టీలోకి రండి అని పిలిచారు. అప్పుడు చెన్నై నుంచి నెల్లూరు సభలో పాల్గొన్నాను. పదేళ్ల పాటు టీడీపీలో చంద్రబాబుతో సమానంగా నేను జిల్లాల్లో తిరిగితే, అష్టకష్టాలు పడితే నాకు ఏ గుర్తింపూ లేదు. కాని ఏ పనీ చేయకపోయినా జగన్ నాకు పిలిచి మరీ సీటు ఇచ్చారు. గెలిపించారు. నాకు రాజకీయంగా గౌరవాన్నిచ్చారు. గెలిచినప్పుడే నాపై టీడీపీవాళ్లు అన్ని మాట్లాడారు. గెలవకపోయి ఉంటే ఇంకెన్ని మాట్లాడేవారు. అంతటి గౌరవం జగన్ కల్పించారు కాబట్టే ఆయనకు నేను జీవి తాంతం రుణపడి ఉండాలి. మహిళల సమస్యలపై మహిళల వాయిస్‌ని అసెంబ్లీలో వినిపించాలి అని నేను ఏదయితే కల కన్నానో దాన్ని సాకారం చేసినందుకు నిజంగానే ఆయనకు రుణపడి ఉంటాను. అసెంబ్లీలో మీరు సస్పెండయ్యారు. సీనియర్లను కూడా కించపర్చారట కదా? నేను అని ఉంటాను, అని ఉండొచ్చు అని మాత్రమే అంటున్నారు. కానీ బుచ్చయ్య చౌదరి, కాల్వ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, బొండా ఉమా, దేవినేని ఉమా, పీతల సుజాత, అనిత తదితరులు ఆన్ రికార్డులో నాపై దుర్భాషలాడుతున్నప్పటికీ దిక్కు లేదు. సారీ చెప్పడమూ లేదు. నిన్నగాక మొన్న బాబు ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఈ అలగా జనం అని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీలో ఎస్టీ, బీసీలున్నారు. ఈ అలగా జనం అని వారిని ఉద్దేశించి అన్నారు. ఈ సైకోలు, ఈ దొంగల పార్టీ, మీకు మెంటలా, ఎందుకు నవ్వుతున్నారు, మెంటలాసుపత్రికి పంపిస్తానని ఒక సీఎం అంటుంటే, వారి నుంచి సభాపతి ఇంతవరకు ఒక క్షమాపణ కూడా చెప్పించలేదు. ఒక ప్రతిపక్ష నాయకుడిని చూసి అచ్చెన్నాయుడు నీవు మగాడివా, మగతనం ఉందా అని దూషిస్తే.. సభా సాంప్రదాయాలేంటి, అంతకుముందు సభలో ఇలాంటివి జరి గాయా.. స్పీకర్‌ను ఉద్దేశించి అధ్యక్షా అంటూ తమ అభిప్రాయం చెప్పా ల్సిన వారు మమ్మల్ని చూసి తిట్టడమేంటి? సంవత్సరం సస్పెండ్ చేసినా రోజా మారలేదని బీజేపీ ఎమ్మెల్యే విష్ణు అన్నారే? అదే నాకూ ఆశ్చర్యమండీ. జగన్ పారిపోయాడు, సవాల్ స్వీకరించలేదు అని అందరూ అరుస్తూంటే నేను ముందు మైక్ ఇవ్వండి అన్నాను. పది నిమిషాలు మైక్ ఇస్తే ఆయన సవాల్ స్వీకరిస్తారా లేదా అనేది తెలుస్తుంది. అసెంబ్లీలో అడుగుపెట్టింది మొదలు ఈ రోజు వరకు ఆధారం లేకుండా ఏ ఒక్కమాటా జగన్ మాట్లాడలేదు. తాను మాట్లాడిన ప్రతి మాటా కరెక్టేనని ఆయన రుజువు చేçస్తు న్నారు. అధికార పక్షం వాళ్లవి తప్పులు అని నిర్ధారించారు. అలాగే మంత్రి ప్రత్తి పాటి పుల్లారావు అగ్రిగోల్డ్ వ్యవహారంలో తప్పు చేశాడని అరోపణలు వస్తున్నప్పుడు, 127 మంది బాధితులు ఆత్మహత్య చేసుకున్న ప్పుడు కనీసం జాలి, దయ చూపరు. ఫిరాయింపులపై మీ అభిప్రాయం? తెలంగాణలో టీఆర్ఎస్లో చేరిన టీడీపీవాళ్లకు సిగ్గూ శరమూ ఉంటే రిజైన్ చేసి పోవా లని చెబుతారు. ఇక్కడేమో సిగ్గూ, ఎగ్గూ లేకుండా వైఎస్సార్సీపీ వారిని తమ పార్టీలోకి లాగేసుకోవడమే కాకుండా మామీద ఎదురుదాడి చేస్తారు. అంటే ఆనాడు వైస్రాయ్ హోటల్లో స్టార్ట్ చేసి, రాజకీయాలను ఎంత భ్రష్టు పట్టించాలో అంత పట్టించారు. 20 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోయారంటే జగన్ నాయకత్వ లోపం అంటారు. మరి తెలం గాణలో టీడీపీ ఎమ్మెల్యేలంతా వరసపెట్టి టీఆర్ఎస్లో చేరితే బాబు నాయకత్వ లోపం కాదా? జగన్ దమ్మున్న నాయకుడు కాబట్టే కాంగ్రెస్‌కు రిజైన్ చేసి బయటకు వచ్చాడు. ఆయన ఎవరినీ వెన్నుపోటు పొడవలేదు. సొంతపార్టీ పెట్టి, సొంత ఎజెండాతో ప్రజ ల్లోకి వెళ్లి, 67 స్థానాలు గెల్చుకున్నాడు. మామకు వెన్నుపోటు పొడిచాక బాబు సొంత పార్టీ పెట్టుకుని ఉంటే తన బలమేమిటో, తన ఫేస్ వ్యాల్యూ ఏమిటో తెలిసేది. లోకేష్ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే తన ఫేస్ వ్యాల్యూ ఏమిటో కూడా తెలిసేది. మరి చంద్రబాబు సక్సెస్ అయ్యారు కదా? గోద్రా ఘటన జరిగినప్పుడు మోదీ సీఎంగా పనికిరాడు. ఇలాంటివాడు నా రాష్ట్రానికి వస్తే ఉరి తీస్తానన్నాడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు. అసెంబ్లీలో అవన్నీ రికార్డు అయ్యాయి కూడా. అదే చంద్రబాబు ఇవ్వాళ అధికారం కోసం మోదీ కాళ్లు పట్టు్ట కున్నాడు. అలా అధికారంకోసం కాళ్లు పట్టుకోవడానికి, వెన్నుపోట్లు పొడవడానికి, అబద్ధపు వాగ్దానాలు చేయడానికి చంద్రబాబులా జగన్ దిగజారిపోలేదు. (రోజాతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పొత్తు ధర్మాన్ని బాబు పాటించడం లేదు
కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ మంత్రి, బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ మూడేళ్ల పాలన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్‌లో అఖండ మెజారిటీతో పార్టీని గెలిపించగా చంద్రబాబుకు పాస్ మార్కులు మాత్రమే పడుతున్నాయని మాజీ మంత్రి, ఏపీ బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ అంటున్నారు. ఏపీలో పొత్తుధర్మాన్ని ఏకపక్షంగా తామే పాటిస్తున్నా మని, బాబు ఈ విషయంలో వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని అభిప్రాయపడ్డారు. పైగా ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తేనే శత్రుభావంతో చర్యలు తీసుకుంటున్నారని వాపో యారు. పనులు కాలేదు కాబట్టి పార్టీ మారుతున్నామనేవారు ముందుగా పదవికి రాజీనామా చేసి వెళ్లాలన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాన్నే వదులుకుందని ఫిరా యింపులకు పాల్పడలేదని అంటున్న కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. ఓటమి ఎరుగని స్థితి నుంచి అనూహ్యంగా ఓడిపోయారు.. ఎలా ఫీలవుతున్నారు? అది కాంగ్రెస్ పార్టీ ఓటమి తప్ప నా వ్యక్తిగత ఓటమి కాదనుకుంటున్నాను. 2014లో అది తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలు ఆ రోజు విభజనను పూర్తిగా వ్యతిరేకించారు. ఒక సెంటిమెంట్ ప్రజల్లో వచ్చినందుకే ఓడిపోయాం. మామూలు పరిస్థితుల్లో అయితే ఓడిపోయేవాడిని కాదు. 1994లో 26 మందిమి గెలిస్తే అత్యధిక మెజారిటీ నాదే. కిరణ్‌కుమార్ రెడ్డితో మీకు ఎక్కడ తేడా వచ్చింది? ఆయనతో నేనేం తేడాగా వ్యవహరించలేదు. కాని నన్ను సీఎం కావడానికి సిద్ధంగా ఉండాలని అధిష్టానం పిలిచిన క్షణం నుంచి ఆయనే నాతో తేడాగా వ్యవహరించ సాగారు. బాగా కోపం పెంచుకున్నారు. మంత్రిగా ఉండి నేను ఏ పనులు చెప్పినా చేయొ ద్దని జిల్లాలో అధికారులను ఆదేశించారు. వేధింపు అంటే అదే. వైఎస్ జగన్‌కు 145 మంది ఎమ్మెల్యేల మద్దతున్నా అధిష్టానం వినలేదే? వైఎస్ఆర్పై అభిమానం వల్లే జగన్ సీఎం కావాలని కోరుకున్నాం. కానీ అధిష్టానం తన అధికారాన్ని ప్రదర్శించుకోవడానికే మా అందరి అభి ప్రాయాలను తోసి పుచ్చింది. మీరు మంత్రిగా ఉన్న కాలంలో జగన్ ఎప్పుడైనా మీకు ఫోన్ చేశారా? ఎప్పుడూ లేదు. ఏరోజు తను నాకు కాల్ చేయలేదు. ఆయన మీద కేసులు పెట్టడం సరైందేనా? ప్రభుత్వం పెట్టిన కేసు కాదు. కోర్టు ఆదేశం ప్రకారం నడిచిన కేసు అది. ఇకపోతే అది కోర్టు ముందు ఉంది. నేను, మీరు, బొత్స సత్యనారాయణ ఇలా ఎవరు మాట్లాడినా దాన్ని కోర్టే నిర్ణయించాల్సి ఉంది. టీడీపీ, బీజేపీ సంబంధాలు ఇప్పుడెలా ఉన్నాయి? క్షేత్రస్థాయిలో అయితే బాగాలేవు. బీజేపీ కార్యకర్తలను వాళ్లు ప్రతిపక్షంలాగానే చూస్తున్నారు తప్ప, పొత్తులో ఉన్న పార్టీగా అయితే చూడటం లేదు. ఉదాహరణకు ప్రతిదీ జన్మభూమి కమిటీల ద్వారానే జరు గుతోంది. ఎవరికన్నా ఒక పెన్షన్ ఇప్పిం చాలన్నా, ఇల్లు, స్థలం కావాలన్నా బీజేపీ కార్యకర్త ఇప్పించే పరిస్థితిలో లేడు. మండల స్థాయి ఆఫీసుకు బీజేపీ కార్యకర్త వెళితే ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇవన్నీ మేం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాం. వారి సలహాతో సమన్వయ కమిటీ వేశారు. ఒకసారి భేటీ అయ్యారు. తర్వాత కూర్చో లేదు. పరిస్థితిలో మార్పు లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఎలా ఉంది? చంద్రబాబు ప్రభుత్వానికి పాస్ మార్కులే వచ్చాయి. ముఖ్యమంత్రే స్వయంగా చెబు తున్నారు. మీరు కరెక్టుగా ఉండకపోతే బాగుండదని చంద్రబాబే కార్యకర్తలను హెచ్చ రిస్తున్నారు కదా. అలాంటివి కరెక్టు చేసుకుంటే బాగుంటుంది. ప్రధాని మోదీకి, చంద్రబాబుకు ఎన్ని మార్కులు వేస్తారు? నేను వేయటం కాదు. ప్రజలే వేశారు. మోదీ మూడేళ పాలన తర్వాత ఎవ్వరూ ఊహిం చనంత మెజారిటీతో యూపీలో ప్రజలు గెలిపించారు. 300 పైగా సీట్లు వస్తాయని ఎవరూ ఊహించలేదు. మోదీ పనితీరుకు ఈ ఒక్కటీ చాలు. కాబట్టి ఆయనకు వంద శాతం మార్కులు వేయవచ్చు. ఇక చంద్రబాబుకయితే పాస్ మార్కులే వస్తున్నాయి. పొత్తు ధర్మం మీరు పాటిస్తున్నారా? చంద్రబాబు కూడా పాటిస్తున్నారా? మేమే పాటిస్తున్నాం.. బాబు పాటించడం లేదు. ఆయన వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. మా జిల్లా అధికారులున్నారు. కన్నా లక్ష్మీనారాయణ చెబితే పని చేయొద్దు అని బాబు వారికి చెప్పారు. ఇదే ట్రీట్మెంట్ అంటే. బాబు చెప్పారు కాబట్టే అధికారులు మేం చేస్తే ఫోన్లు కూడా ఎత్తడంలేదు. పాలనాపరంగా చంద్రబాబు వ్యవహారంపై మీ అభిప్రాయం? కక్ష సాధింపు చర్యలపైనే ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. బాబు ప్రభుత్వంలో ఉన్నారు. చాలామంది పాలనకు సంబంధించి అనేక ప్రశ్నలు లేవనెత్తి ఉంటారు. వాళ్లను కూడా ఆయన వ్యతిరేకుల్లా భావించి చర్య తీసుకుంటున్నారు. అవేంటో మీకు తెలియనివి కావు. నేను చెప్పాల్సిన పనీ లేదు. జనాలకు అన్నీ తెలుసు. విపక్షం నుంచి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు కదా? వాజ్‌పేయి ఒక్క ఓటు తేడాతో ఓటమికి కూడా సిద్ధమయ్యారు. బీజేపీకి సంబంధించి ఒక్కరినికూడా మేం ఫిరాయించలేదు. మా విధానం కాదు. ఫిరాయించాలంటే ముందుగా రాజీనామా చేసి తర్వాత పార్టీ మారండి అనేదే మా విధానం.. ఎమ్మెల్యేగా ఉండగా ఏ ప్రలోభం లేకుండా పార్టీ మారతారా? నైతికంగా అయితే రాజీనామా చేసి వెళ్లాలి. లేదా రాజీనామా చేయిం చిన తర్వాతే తీసుకోవాలి. ప్రలోభాలు అంటే ఎమ్మెల్యేలు తమకు పనులు కావటం లేదు. ప్రభుత్వంలో ఉంటే ప్రజలకు మేం మరింతగా సేవ చేయ వచ్చు అని అంటున్నారు. దానిపై మన వ్యాఖ్యలు ఎందుకు? వైఎస్ఆర్ మరణం తర్వాత పరిణామాలపై మీ అభిప్రాయం? ఆంధ్రప్రదేశ్‌కు చాలా నష్టం జరిగింది. వ్యక్తిగత నష్టం అలా ఉంచండి. అభివృద్ది విషయంలో ఏపీ చాలా నష్టపోయింది. చెప్పలేను. 2009లో వైఎస్ రాజశేఖరరెడ్డి స్వయంగా అన్నారు. 2014లో ఏపీ పరిస్థితి ఎలా ఉంటుందనేది మనం చెప్పలేం. కానీ ఈ అయిదేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయ గలం అన్నారాయన. ఆయన ఉంటే అలానే జరిగి ఉండేది. వైఎస్ఆర్, బాబు పాలనలో తేడా చెప్పండి? రాజశేఖరరెడ్డి కులాన్ని, వర్గాన్ని చూసి సహా యం చేసే వ్యక్తి కాదు. ఎవరొచ్చినా సహా యపడాలనేది ఆయన కోర్ వాల్యూగా ఉండేది. కాని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పొత్తులో ఉన్న మాకే సహకరించడం లేదంటే ఇతరుల విషయంలో ఎలా ఉంటుందో ఆలోచించండి. బాలకృష్ణ ఇంట్లో కాల్పుల ఘటనలో... వైఎస్సార్ సాయం చేశారా? సీఎంగా వైఎస్సార్ తల్చుకుని ఉంటే బాలకృష్ణపై కేసు పెట్టేవారు కదా.. పెట్టలేదంటేనే సహజంగా వైఎస్సార్ సహకరించినట్లే కదా. ఆ ఎథిక్స్ ఆ రోజుల్లో ఉండేవి. కాపులతో చంద్రబాబు ప్రభుత్వం తీరు ఎలా ఉంటోంది? అధికారానికి రాకముందు కాపులుంటున్న వీధివీధిలో తిరిగి చంద్రబాబు లెక్కలేనన్ని వాగ్దానాలు చేశారు. ఇప్పుడు వాటినే నెరవేర్చమని వారు నిలదీస్తున్నారు. వాగ్దానాలు అమలు చేయలేకపోతున్నారు అంతేకాని క్షేత్రస్థాయిలో కాపులపై వేధింపులు జరుగు తున్నాయన్నది కరెక్టు కాదనుకుంటాను. బాబు అబద్దాలకోరు అని జగన్, రఘువీరారెడ్డి చేస్తున్న ఆరోపణలపై మీ వ్యాఖ్య? ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అలా అనక తప్పదు. కానీ వైఎస్ఆర్ ప్రతిపక్షంలో ఉన్న ప్పుడు కూడా చంద్రబాబు గాలి పోగేసి మాట్లాడేవారని మేం చెప్పేవాళ్లం. (కన్నా లక్ష్మినారాయణతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
కాపులకు బాబు నమ్మకద్రోహం..!
కొమ్మినేని శ్రీనివాసరావుతో వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గత 35 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పాలనాపరంగా ఇంతటి దుస్థితిని ఎన్నడూ చూడలేదని మాజీమంత్రి, వైస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అంటున్నారు. తెల్లవారితే చాలు దోపిడీ, దోపిడీ ఆంటూ సంపాదనే లక్ష్యంగా పనిచేస్తున్న చంద్రబాబు సకల వ్యవస్థలను తోసిరాజంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన జరగటం లేదని దోపిడీ పునాది గల సామాజిక వర్గాల పాలన కులం ప్రాతిపదికన జరుగుతోందని, సంపన్న జిల్లాల్లో కూడా అభి వృద్ధి ఆగిపోయిందని పేర్కొన్నారు. ముద్రగడ నిరసన దీక్షకు పూనుకుంటే ఆయన సామాజిక వర్గాన్నే హౌస్ అరెస్ట్ చేయడం ఎన్నడూ జరగలేదన్నారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత బలంగా ఉందంటే 2004, 2009లో వైఎస్సార్ సృష్టించిన ప్రభంజనం 2019లో మళ్లీ జరు గుతుందంటున్న బొత్స సత్యనారాయణ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... రాష్ట్ర విభజనపై పార్టీకి వ్యతిరేకంగా తీర్మానానికి కిరణ్ మిమ్మల్ని ఎలా ఒప్పించారు? సమైక్యాంధ్రకు అనుకూలంగా చెప్పకపోతే మీ మీడియా వాళ్లు మమ్మల్నందరినీ నక్కల కింద కుక్కల కింద జమకట్టి తిడుతున్నారు కదా. అలా పార్టీకి వ్యతిరేకంగా తీర్మానం అయినా చేస్తే కాస్త వేడి తగ్గుతుందనుకున్నాము. తీర్మానానికి అనుకూలత తెలిపాం. వైఎస్ జగన్‌కు అనుకూలంగా 145 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేస్తే రోశయ్యను ఎందుకు సీఎంని చేశారు? సీనియర్, పెద్దమనిషి అనే అభిప్రాయంతోనే ఆయన్ని సీఎంని చేశారు. వైఎస్ జగన్‌ను కూడా ఒప్పి చేయించారు. కానీ ఆయన్నే మారుద్దామనుకున్నప్పుడు ఇంకో పెద్దమని షిని తీసుకువచ్చి ఉంటే ఈ గందరగోళాలు జరిగేవి కావు. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్‌పై కేసులు పెట్టడంపై మీ అభిప్రాయం? జగన్‌పై కేసులు ఎందుకు పెట్టారన్నది నాకు తెలీదు. కానీ కేబినెట్లో ఏమని నిర్ణయించుకున్నామో.. అవి సమష్టి నిర్ణయాలు. కేబినెట్ వెన కాల ఏవైనా జరిగితే వాటికి మాకు సంబంధం లేదు కానీ మంత్రి వర్గంలో ఎలాంటి నిర్ణయం జరిగినా మేమంతా కట్టుబడి ఉండాల్సిందే. కేబినెట్లో తీసుకున్న నిర్ణయంతో మీకు సంబంధం లేదా అంటే కచ్చి తంగా ఉంది అనే అంటాను. నాకు సంబంధం లేదు. నన్ను బుల్డోజ్ చేశారు అనుకుంటే ఆరోజే నువ్వు మంత్రివర్గం నుంచి తప్పుకుని బయటకు రావాలి. ఆరోజు ఎందుకు మాట్లాడలేదు అన్నదే పాయింట్. అధిష్టానం జగన్‌పై పెట్టిన కేసులు నిలవవని రమాకాంత్‌రెడ్డి ఈమధ్యే చెప్పారు కదా? నేను మంత్రిగా ఉన్నప్పుడు నాతో ఎవరూ ఈ విషయాలు మాట్లాడలేదు. మిగతా వాళ్లతో ఏం మాట్లాడారో నాకు తెలీదు. రమాకాంత్‌రెడ్డి మాట్లాడింది నేను చదివాను. సీబీఐకి బిజనెస్ రూల్స్ గురించి తెలీదన్నారు. ఆ విషయాలపై సీబీఐ ఒకసారి మా ఇంటికి వచ్చి నన్ను విచారించింది. జేడీ లక్ష్మీనారాయణ రాలేదు కానీ తన కింద ఉన్న ఎస్పీ కేడర్ ఆఫీసర్, తదితరులు వచ్చారు. నాలుగైదు గంటలు మాట్లాడి ఫైనల్‌గా ఫైల్స్ చూపెట్టమన్నారు. చూపించాను. అప్పుడే చెప్పాను. ‘సర్.. సెక్రటేరియట్‌కి కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని మీరు ముందు తెలుసుకోండి. అది తెలుసుకుంటే ఈ సమస్యే ఉండదు. సెక్రటరీ చెప్పింది విని మంత్రిగా డిఫర్ అవుతామా లేక సంతకం చేస్తే డిక్రీ అవుతామా.. కార్యదర్శి, మంత్రి.. ఇద్దరూ భిన్నాభిప్రాయం ప్రకటించాక సెక్రటరీ ఏ నిర్ణయం తీసుకోవచ్చు. దానిపై మంత్రి బాధ్యత ఏమిటి? ఆ విషయం సీఎం వరకు వెళితే ఆయన బాధ్యత ఏమిటి? కేబినెట్లో ఆమోదించిన తర్వాత ఎందుకు నిర్ణయం తీసుకున్నాము అని నోట్ రాస్తారా లేదా. నిర్ణయానికి కారణాలు రాస్తారా, రాయరా? అనే అంశాలను ముందుగా తెలుసుకోండి’ అని సీబీఐ వాళ్లకి చెప్పాను. రాఘవేంద్రరావు అని నాదగ్గర పర్సనల్ సెక్రటరీ ఉండేవారు. ఆయన్ని పిలిపించి సెక్రటేరియట్ రూల్స్ అన్నీ ఆయన ద్వారా సీబీఐకి చెప్పించాను కూడా. మరి జగన్‌పై ఇలాంటి కేసులు పెట్టారు.. నిలుస్తాయంటారా? ఇవేవీ నిలబడవు. అందరికీ తెలిసిన విషయమే ఇది. నిలబడవనే తేలుతోంది. జగన్ తొందరపడి పార్టీ పెట్టకపోయి ఉంటే ఈ గొడవలన్నీ వచ్చి ఉండేవి కావు కదా? నాన్న తాలూకు ప్రభావం, పలుకుబడి ఉన్నాయి. పైగా అనివార్య పరిస్థితి ముందు కొచ్చింది కాబట్టే పెట్టారు. కోఆర్డినేట్ చేసే మధ్యవర్తులు కూడా సరిగ్గా వ్యవహరిం చలేదు. జరుగుతున్న వాస్తవాలను చెప్పి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. సీనియర్ల పట్ల జగన్ ఎలా ఉంటారు? ఈ విషయంపై ఆరోపణలు ఉన్నాయి కదా? సీనియర్ల పట్ల ఆయన ఎలా ఉంటారు అనేది ముఖ్యం కాదు. పార్టీ పట్ల మన మైండ్ సెట్ మార్చుకోవాలి. ఆయన పార్టీ ప్రెసిడెంట్, మనం కార్యకర్తలం. ఆయన వద్దకు వెళ్లినప్పుడు మన మైండ్‌సెట్ మార్చుకోవాలి. ఎవరు కలిసినా జగన్ అన్నా అనే పిలుస్తారు. పార్టీ అధ్యక్షుడి మాటలు మనం వినాలా లేక మన మాటలు ఆయన వినాలా? మేము చెప్పాము, ఆయన వినలేదు అని సమావేశం ముగిసిన తర్వాత అంటే ఏం బాగుంటుంది? నాలాంటోళ్లు అభిప్రాయాలు చెబుతారు. పది చోట్ల నుంచి వస్తాయి. వాటిని ఆలోచించి డిసైడ్ చేయాల్సింది అధ్యక్షుడే కదా.. ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో ఆయన చేసింది ఇదే. వైఎస్సార్సీపీ పరిస్థితి ఇప్పుడెలా ఉందంటారు? పార్టీ పరిస్థితి ఎలా ఉందని మనం చెప్పడం కాదు. ప్రజలే చెబుతారు. చెబుతున్నారు కూడా. మొత్తం చేస్తోంది తెలుగుదేశమే కదా.. తొమ్మిదేళ్లు గతంలో సీఎంగా పనిచేసిన చంద్రబాబేనా ఈ చంద్రబాబు అని నాకే అనుమానం వస్తోంది. ఆ చంద్రబాబు మాయమై కొత్త చంద్రబాబు వచ్చాడా.. అంత తేడా వచ్చింది ఆయనలో ఇప్పుడు. మరి శాశ్వతంగా అధికారంలో ఉంటానని బాబు చెబుతున్నారు కదా? అంత సీన్ లేదు లెండి. చెప్పిన మాటను చేస్తేనే రాజకీయాల్లో విలువ. చెప్పినదానికన్నా ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తే, మేలు చేకూ రిస్తే ఇంకా ఎక్కువ విలువ ఉంటుంది. అంతేగానీ తెల్లవారి లేస్తే ఒకే సింగిల్ పాయింట్ ఫార్ములా లాగా దోపిడీ, దోపిడీ , దోపిడీ అని చేసు కుంటూపోతే విలువ ఎక్కడుంటుంది? ఉత్తరాంధ్రలో వైఎస్సార్సీపీ పరిస్థితి ఎలా ఉంది? చిన్న చిన్న విషయాల్లో కూడా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవడం, దోపిడీ. ప్రభుత్వం నడుస్తున్న తీరు చూస్తే 2004, 2009 ఎన్నికల్లో వైఎస్ఆర్ ఉత్తరాంధ్రలో తీసుకొచ్చిన ప్రభంజనం 2019లో వైఎస్సార్సీపీ మళ్లీ సృష్టిస్తుంది. పవన్ కల్యాణ్ వల్ల మీ పార్టీ అవకాశాలు దెబ్బతింటాయంటున్నారే? రాజకీయాల్లో ఏదీ కాదనలేం. కానీ ఎవరు వచ్చినా, ఏం చేసినా.. మనం మనగలగ డానికి మనలో ఆత్మ విశ్వాసం ఉండాలి. ఎవరో వస్తారు అంటే వస్తారు. వాళ్లని ఆప డానికి మన వ్యూహాలు మనకు ఉంటాయి కదా. అలా వస్తున్న వాళ్లు ఒక వ్యూహం పన్నితే మనం ఇంకా ఎక్కువ వ్యూహాలు వేసుకోవాలి. అదే రాజకీయం అంటే. గతంలో కాపులు పవన్‌కు సపోర్ట్ చేసినందుకే బాబుకు మేలు జరిగిందంటున్నారు? ఆరోజు తెలుగుదేశం పార్టీ గెలవడానికి చాలా కారణాలున్నాయి. బీజేపీతో పొత్తు, సెలబ్రిటీగా పవన్ వచ్చి ప్రచారం చేస్తే టీడీపీ గెలిచింది తప్ప వ్యక్తితో కాదు. రేపు ఏం జరుగుతుంది, జరగనుంది అని ఇప్పుడే మనం ఊహించలేం. ఏది అడ్డొచ్చినా అన్ని టినీ అధిగమించే ప్రయత్నం చేయాలి తప్ప ఒకరు కలుస్తారు, కలవరు అనేది ముఖ్యం కాదు. ఎవరైనా కలిస్తే అది బోనస్. కాపు సామాజిక వర్గం ఎలా ఆలోచిస్తోంది? కాపు సామాజిక వర్గం పూర్తిగా మోసపోయింది. చంద్రబాబు మాటలగారడీలో పడి మోసపోయింది. మంత్రి పదవులు ఇచ్చాం. కార్పొరేషన్ పెట్టాం, వెయ్యి కోట్లు ఇచ్చాం అని చెప్పడం కాదు. కార్పొరేషన్ పెట్టి ఇంతవరకూ ఎంత ఖర్చుపెట్టావు? ఎంతమంది కాపులకు లబ్ధి చేకూరింది? ఇదీ ముఖ్యం. మీవద్ద పదవులు తీసుకున్న మంత్రులు వారి సామాజిక వర్గానికి ఏం మేలు చేశారు? పదవులు తీసుకుని అనుభవిస్తూ మీ వర్గానికి ఇబ్బంది వచ్చినప్పుడు కనిపించకుండాపోతే ఎలా? ప్రత్యేకించి ముద్రగడ పట్ల వ్యవహరించిన తీరుపై కాపులు ఏమనుకుంటున్నారు? అవమానం కాదా.. దీక్షకు పూనుకుంటే ముద్రగడనే కాదు ఆయన వర్గం మొత్తాన్ని హౌస్ అరెస్టు చేస్తారు. రాష్ట్రంలో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. దీనికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపుల్లో కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో పాలన ఎలా ఉందనుకుంటున్నారు? ఇవ్వాళ రాష్ట్రంలో పరిపాలన రాజ్యాంగం ద్వారా జరగలేదు. దోపిడీ సామాజిక వర్గ పాలన జరుగుతోంది. కులం పేరిట పాలన. గత 35 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఎప్పడూ ఇలాంటి కులం ప్రాతిపదికన జరిగే పాలనను చూడలేదు. చివరకు రాష్ట్రంలోని సంపన్న జిల్లాల్లో కూడా అభివద్ధి పూర్తిగా స్తంభించిపోయింది. గెలవగానే ఆ జిల్లాలకు ఏమి స్తానో చూడండని చంద్రబాబు జాబితాలు పట్టుకుని మరీ చెప్పారు. ఆ జాబితాలను ముందు పెట్టుకుని చూస్తే ఏ జిల్లాలో ఏం జరిగిందో తెలిసిపోతుంది. (బొత్స సత్యనారాయణతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకుల్లో చూడండి) -
అనుమానంతోనే ఆ కేసులు..!
కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య (మనసులో మాట) అక్రమాస్తులు తదితర అంశాలపై సీబీఐ పెట్టిన కేసులు ఏవీ నిలబడవని మాజీమంత్రి, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అంటున్నారు. కేవలం అనుమానాలు ఆధారంగా మాపై ఆరోపణలు చేశారని, వైఎస్ జగన్‌తోపాటు కొందరిపై కేసులు కూడా పెట్టించారనీ, కానీ అవేవీ నిలవవని చెప్పారు. క్యాంప్ ఆఫీసులో వైఎస్సార్‌ని కలిసిన సందర్భంలో రెండుసార్లు జగన్ తారసపడ్డారు తప్పితే ఏదైనా పని విషయంలో కూడా ఆయన నాకు ఎన్నడూ ఫోన్ చేయలేదం టున్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఫోన్ చేయడమూ తప్పే, కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడమూ తప్పే.. అన్నారు. వైఎస్ మరణానికి ముందు, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఘటనలపై పొన్నాల అభిప్రాయాలు ఆయన మాటల్లోనే.. జీవితంలో బాగా సంతోషం కలిగించిన సందర్భం? ఒక లక్ష్యంతో నేను అమెరికాలో ఉద్యోగం మాని దేశానికి తిరిగి వచ్చాను. గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగులకు, నైపుణ్యం లేని వారికి ఉద్యోగావకాశాలు కల్పిస్తే బాగుం టుంది అని ఉండేది. ముఖ్యంగా ఫౌల్ట్రీ రంగంలో అవకాశాల కల్పన. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో ఫౌల్ట్రీ ప్రారంభించాం. ఆరోజుల్లో దేశంలో అయిదారు లక్షల మంది ఈ రంగంలో పనిచేసేవారు. మావంటి వారి కృషి వల్లే ఈ రోజు దేశంలో పది కోట్లమంది ప్రజలు పౌల్ట్రీ రంగంలో అవకాశాలు పొందుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డితో మీ అనుబంధం గురించి చెబుతారా? 1978లో ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అప్పట్లో హోమంత్రిగా ఉన్న ప్రభాకరరెడ్డి ద్వారా వైఎస్‌తో పరిచయం కలిగింది. మా మామగారితో తనకున్న పరిచయం వల్ల ఆయన నన్నూ దగ్గరకు తీసుకున్నారు. తర్వాత వైఎస్సార్ మంత్రి అయ్యారు. 1985లో పీసీసీ అధ్యక్షుడిగా ఉండగా నాకు ఎమ్మెల్యే సీటు ఇప్పించారు. అప్పుడే శ్రీశైలం ఘటన జరిగింది. శ్రీశైలం ఘటన అంటే? 1985లో అనుకుంటాను. వైఎస్ తన కుటుంబంతోపాటు శ్రీశైలం వెళుతూ మమ్మల్ని ఆహ్వానించారు. ఫ్యామిలీస్‌తో వెళ్లాం. దర్శనం చేసు కున్నాక, లుంగీ, పైన బనియన్ కట్టుకుని ఉన్న ఒక వ్యక్తి మావద్దకు వచ్చి వైఎస్ కాళ్లకు దండం పెట్టాడు. మీరెప్పటికైనా ముఖ్యమంత్రి కావాలి సర్ అని వైఎస్‌ని ఉద్దేశించి చెప్పాడు. వైఎస్ నవ్వి ముందుకు నడుస్తూ, ‘‘అలాంటి అవకాశం మనకు వస్తే ఈ రాష్ట్రంలో 50 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ఏర్పాట్లు చేయగలుగు తామా’’ అన్నారు. సీఎం కాగానే సాగునీరు కల్పించాలి అని అంటున్నారంటే రాయల సీమలో నీటి కష్టం ఆయనపై ఎక్కువ ప్రభావం వేసిందనుకున్నాను. దాదాపు 20 ఏళ్ల తర్వాత 2004లో సీఎం కాగానే జలయజ్ఞం, 86 ప్రాజెక్టులు, శాశ్వత ప్రాతిపదికన గోదావరి–కృష్ణ జలాలను వాడుకునేటటువంటి మహోన్నత యజ్ఞం ప్రారంభించారు. ప్రపంచంలోనే విశిష్టమైన ఆ ఘటనలో అవకాశం దక్కడం నా అదృష్టం. జలయజ్ఞం నేపథ్యం ఏమిటి? జలయజ్ఞం అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? కర్నూలులో జరిగిన ఒక మీటింగులో వైఎస్ నన్ను మాట్లాడమన్నారు. అప్పుడు నేను సాగునీటి కల్పన గురించి మాట్లాడాను. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా మనం ఇంత గొప్ప ప్రాజెక్టును చేపడుతున్నాము. భావితరాల కోసం, రైతాంగాన్ని ఆదుకోవడం కోసం శాశ్వత ప్రాతిపదికన దీన్ని తీసుకువస్తున్నాం. వ్యవసాయ అభివృద్ధి కోసం దీన్ని ఒక యజ్ఞంలా చేయాలి చేద్దాం అని మాట్లాడాను. వెంటనే వైఎస్ తన స్పీచ్ మొదలెట్టి ఇది జలయజ్ఞం అని పేరుపెట్టేశారు. అలాగే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. నెహ్రూ అప్పట్లో ఈ ప్రాజెక్టును ఆధునిక దేవాలయమని పిలిచారు. కాని 50 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఇదే ప్రాజెక్టు తరగని బంగారు గనిలా మారింది. ఎందుకంటే ఒక కారుకు 9 వేల కోట్ల రూపాయల పంటను అందిస్తోంది. అంటే సమాజానికి, దేశానికి, ప్రాంతానికి ఎంత సంపదను ఇది సృష్టించి ఇస్తోందో చూసినట్లయితే ఇది ఆధునిక దేవాలయంతోపాటు తరగని బంగారు గనిలా తయా రైంది. మామూలు బంగారు గని అయితే బంగారు తోడేశాక కొంతకాలానికి వట్టిపో తుంది. కాని ఇది తరగని గనిలాగా ప్రతి ఏటా, ప్రతి కారుకూ వేల కోట్ల సంపద నిస్తోంది. కాబట్టే ఇది తరగని బంగారు గని అని వైఎస్ చెప్పారు. 145 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చినా అధిష్టానం జగన్‌కి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? అధిష్టానానికి మా అభిప్రాయాలు చెబుతూనే చివరి నిర్ణయం తీసుకునే అధికారం వారికే ఇవ్వడం రివాజు. జగన్‌కి మద్దతు తెలిపాం. సంతకాలు పెట్టాం. కానీ అధిష్టానం ఎందుకో మరోలా ఆలోచించింది. ఆ విషయం తెలిసినప్పుడు బాధపడ్డాం. జగన్నే సీఎంగా చేసి ఉంటే చరిత్ర మరోలా ఉండేది కదా? అవకాశాలు కల్పించి ఉంటే ఆయనకు ఇక ఆకాశమే హద్దు కదా. కేసీఆర్ దీక్ష బూటకం అని చాలామంది అంటున్నారే? ఆ దీక్ష బూటకం అని నేనే చెప్పాను. 750 కేలరీల ద్రవాహారాన్ని తీసుకుని దీక్షలో ఉన్నాడాయన. లక్ష్యసాధన కోసం కేసీఆర్ ఏం చేసినా మేం కాదనలేదు. నాకు తెలిసి ప్రాణానికి ఏమాత్రం ముప్పులేని దీక్షనే కేసీఆర్ చేశారు. కానీ ఆయన ప్రాణానికి ముప్పు వస్తుందేమో అని చిదంబరం తదితరులు అనుకున్నారు. ఆయన ద్రవాహారం తీసుకున్నా రన్నది నిజం. కానీ ఆ దీక్ష ఉద్యమానికి తోడ్పడింది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే జగన్‌పై ఏ కేసులూ ఉండేవి కాదు కదా? మంత్రులుగా మామీద కూడా కేసులు పెట్టారు కదా మరి. పైగా పలానా డాక్యు మెంట్లో పలానా తప్పు ఉంది ఇదెలా వచ్చింది అంటూ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్షీ్మ నారాయణే మమ్మల్ని పిలిపించి వివరణలను అడిగారు. మేం చెప్పాం. వాళ్లు అనుమా నాలు వ్యక్తం చేస్తే, వాస్తవాలు చెప్పాం. సీబీఐ పెట్టిన కేసులపై మీ అభిప్రాయం? అవి నిలబడవు. నాపై చార్జిషీట్ పెట్టలేదు. అనుమానాలు ఆధారంగా మాపై ఆరోపిం చారు. అందుకే మా కేసులు నిలవవు అని అప్పుడే తెలుసు. ఇక జగన్‌పై కూడా ఇలాగే కేసులు పెట్టి ఉంటారనుకుంటున్నాను. కోర్టులోనే అవి తేలాలి. మిమ్మల్ని కలవడానికి జగన్ ఎప్పుడైనా సచివాలయానికి వచ్చారా? ఆయనతో మాట్లాడటమే రెండు మూడు సందర్భాల్లో జరిగింది. అది కూడా సెక్రటే రియట్‌లో కాదు. క్యాంప్ ఆఫీసులో ముఖ్య మంత్రిని కలిసిన సందర్భంలో రెండుసార్లు జగన్ తారసపడ్డారు. ఏదైనా పని విష యంలో కూడా ఆయన నాకు ఎన్నడూ ఫోన్ చేయలేదు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో జరిగిన ఫిరాయింపులపై మీరేమంటారు? ఫిరాయింపులు జరగకూడదు. ఎవరు చేసినా, ఎవరు చేయించినా తప్పు తప్పే..! ఓటుకు కోట్లు కేసుపై మీ అభిప్రాయం? ఫోన్ చేసిన వారిదీ తప్పు. ఫోన్ ట్యాపింగ్ చేయించినవారిదీ తప్పు. ఇప్పుడు ఎవరి అవసరాలకు అనుగుణంగా వారు సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయ అవసరాలకు చేసే పనులు, కక్షపూరితంగా చేసే పనులు అన్నిపార్టీల్లో ఉన్నాయి. ఒక్క కాంగ్రెస్ పార్టీనే ఎందుకు వేలెత్తి చూపుతారు? అయితే ఇలాంటి పనులు మంచివి కాదనే నా అభిప్రాయం. (పొన్నాల లక్ష్మయ్యతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఇక్కడ క్లిక్ చేయండి) -
అవగాహన లేని దర్యాప్తు
జగన్ కేసులో సీబీఐ తీరుపై మాజీ ఐఏఎస్ అధికారి రమాకాంత్ రెడ్డి (మనసులో మాట) కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే దర్యాప్తు సంస్థ సీబీఐకి రాష్ట్రానికి సంబం ధించిన విషయాలపై అసలు అవగాహన లేదని జగన్ కేసు దర్యాప్తు జరిగిన తీరు చూస్తే తనకు అర్థమైందని అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమోదు చేసిన కేసులపై దర్యాప్తు చేసిన సీబీఐ జాయింట్ డైరెక్టర్ (జేడీ) వీవీ లక్ష్మీనారాయణకు రాష్ట్ర సెక్రటేరియట్, కేబినెట్ నిబంధనలు ఏమాత్రం తెలియవని ఆయన తేల్చిచెప్పారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన మరణానంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన పరిణా మాలపై రమాకాంత్ రెడ్డి అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఎలా నడిచింది? ఆయన గొప్పమానవతావాది. అంతకుముందు ఆయన ఎలా ఉండేవారో నాకు తెలియదు. 25 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి రాటుదేలిపోయారేమో. దాంట్లో కూడా ఒక హ్యూమన్ ఎలిమెంట్ వాతావరణాన్ని ఆయన సృష్టిం చారు. ఎన్నోసార్లు ఆయనతో చర్చలు జరిపాం. ఆయన చెప్పిందానికి ఎన్నో సార్లు నో అని చెప్పాం. పొలైట్‌గా నో అని ఎన్నిసార్లైనా చెప్పడానికి ఆయన వద్ద మాకు స్వతంత్రం లభించింది. మేం నో అని చెప్పినా ఆయన ఎప్పుడూ బాధపడలేదు. అహా అలాగా అనేసి ఊరుకునేవారు. ఏంటండీ నాలుగైదు సార్లు నా మాటకు నో చెబుతున్నారు అనే మాట ఆయన నుంచి రాలేదు. కసురుకోవడం అస్సలు లేదు. ఓపిగ్గా వినేవారు. ఆ తర్వాత సీఎస్ గారూ ఇలా చేస్తే బాగుంటుంది కదా అనేవారు. ఆయన అభిప్రాయం అదీ అని అప్పుడు మాకు అర్థమయ్యేది. ఆయన చెప్పిందాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి మన నిబంధనల్లో వీలవుతుందా అని అప్పుడు మేం పరి శీలించేవాళ్లం. తర్వాత వీలయితే వీలవుతుందని కాకుంటే కాదని చెప్పేవాళ్లం. మీ ఇద్దరి కాంబినేషన్లో విజయవంతమైన కార్యక్రమాలు ఉంటే చెబుతారా? ముఖ్యంగా చెప్పాల్సి వస్తే 108. కర్నాటకలో దేవిశెట్టి అని ఒక డాక్టరు ఉండే వారు. ఆయనే మొట్టమొదటిసారిగా ప్రజలకు గుండె ఆపరేషన్లు చేయడం మొదలెట్టారు. అయితే పాల సొసైటీలో సభ్యులకు మాత్రమే ఆయన ఆప రేషన్లు చేసేవారు. మిగతావారికి చేసేవారు కాదు. ఒకరోజు కర్నాటకలో ఇలా ఉచిత గుండె ఆపరేషన్లను కర్నాటకలో చేస్తున్నారట. కనుక్కోండి అని వైఎస్ నాకు చెప్పారు. నేను నేరుగా దేవిశెట్టి గారికే ఫోన్ చేసి హైదరా బాద్‌కు రాగలరా, వైఎస్ కలవాలంటున్నారు, మీ పని పట్ల ఆయనకు ఆసక్తి ఉంది అని అడిగితే వచ్చారు. హైదరాబాద్‌లో ఒక ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వైఎస్‌కి అది పూర్తిగా నచ్చలేదు. మీరు కేవలం పాల సొసైటీలో సభ్యులకు మాత్రమే చేస్తున్నారు. మా రాష్ట్ర ప్రజలందరికీ అంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న అందరికీ మేలు కలిగేలా మీరు చేయగలరా అని దేవి శెట్టిని వైఎస్ అడిగారు. అది చాలా చాలా పెద్ద కార్యక్రమం సర్ నేను చేయ లేను అన్నారాయన. ఆయనను పంపించిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాల యంలో నేను, ఆరోగ్య శాఖ కార్యదర్శి, సిఎంఒలో ఉండే జన్నత్ హుస్సేన్ తదితరులం కూర్చుని ఎనిమిది నెలలపాటు కసరత్తు చేశాం. రూపాయి ఖర్చు లేకుండా ప్రజలు హైదరాబాద్ వచ్చి వారికి ఇష్టమైన ఆసుపత్రిని ఎంచుకుని ఓపెన్ హార్ట్ సర్జరీ లేదా బైపాస్ సర్జరీ చేసుకుని రూపాయి కట్ట కుండా సంతోషంగా బయటకు వెళ్లిపోయే సందర్భం అది. అలాంటి సంద ర్భాలెన్నో నేను చూశాను. విన్నాను. చాలా మంది ప్రజాప్రతినిదులు నావ ద్దకు వచ్చి చెప్పారు. మేము సంతోషంగా ఉన్నామన్నారు వాళ్లు. కిరణ్ అని సీఎం ఓఎస్డీగా ఉండేవారు. ఆయనే కార్యక్రమాన్ని చూసేవారు. ఇతర కార్యక్రమాల్లో మీ పాత్ర ఉందా? బీసీలకు స్కాలర్షిప్ ఇవ్వడం. ఫీజు రీయింబర్స్మెంట్. వైఎస్ ఒకరోజు నాతోనే చర్చించారు. పేదపిల్లలు ఫీజు కట్టడంలో ఇబ్బంది పడుతున్నారు. మనం ఏదైనా చేయలేమా అని. అలా ఈ పథకం పుట్టింది. మొదట్లో చాలా ఇబ్బంది కలిగింది. అయినా ధైర్యంగా ముందుకెళ్లాం. ఇప్పటికీ చాలామంది నన్ను కలిసినప్పుడు చెబుతుంటారు. ఆరోజు ఆ స్కీమ్ పుణ్యమా అని మేం మెడిసన్ పూర్తి చేసుకున్నాం, ఇంజనీరింగ్ పూర్తి చేశాం. లేకుంటే చేసేవాళ్లం కాదని చెబుతారు. జగన్ మీద కొంతమంది ఆరోపణలు చేస్తుంటారు. ఆయన ఎప్పుడైనా ‘‘నేను ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసినప్పుడు, ప్రభుత్వ ప్రధాన కార్య దర్శిగా పనిచేసినప్పుడు సచివాలయంలో గాని, అసెంబ్లీలో గాని, ముఖ్య మంత్రి క్యాంప్కార్యాలయంలోగాని జరిగిన ఏ ఒక్క సమావేశానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాలేదు. ఎంపీ కాకముందు, అయిన తర్వాత కూడా జగన్ మా సమావేశాలకు ఆయన ఎన్నడూ రాలేదు. ఈ విషయం కచ్చితంగా చెప్ప గలను. ముఖ్యమంత్రి కుమారుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఎంపీగా ఫలానా వాళ్లకు అది ఇవ్వండి అని గాని, ఇవ్వొద్దు అని గాని, నాకు ఇది కావాలని గాని, ఫలానా కంపెనీకి అది కావాలని గాని ఆయన నాకు ఎప్పుడూ ఎలాంటి లేఖ రాయలేదు. ఒక్కరోజు కూడా ఆయన నాకు ఫోన్చేయలేదు. నేను జగన్‌ను ఎప్పుడు కలిశానంటే.. వైఎస్‌రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత నా హృదయపూర్వక సానుభూతి తెలియజేయడానికి వెళ్లి కలిశాను. అంతకు ముందెప్పుడూ కలవడం జరగలేదు. తర్వాత జగన్‌పై కేసులు పెట్టినప్పుడు పరిణామాల గురించి చెబుతారా? జగన్‌పై కేసులు పెట్టినప్పుడు సీబీఐ వాళ్లు నన్ను రెండుసార్లు దిల్కుషా గెస్ట్ హౌస్‌కు పిలిచారు. అప్పుడు సీబీఐ జాయింట్‌డైరెక్టర్‌గా లక్ష్మినారాయణ ఉండేవారు. ‘మీరడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి నన్ను పిలిపించారు, సంతోషం. నాకు తెలిసింది చెబుతాను అయితే, ఫలానా వ్యక్తులను కూడా మీరు పిలిపించి మాట్లాడుతారా’ అని ఆయనను అడిగితే, ‘నేను పిలవడం లేదండి. వారిని ప్రశ్నించడానికి హైకోర్టు నాకు అంతటి పరిధి విధించలేదు’ అని జవాబిచ్చారు. ‘మీరు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఫలానా వాళ్లను ఇంటరా గేట్చేయొచ్చు. ఫలానా వాళ్లను ప్రశ్నలు అడగొచ్చు. ఫలానా వాళ్ల ఇళ్లు, ఆఫీ సులను రెయిడ్చేసినా, అక్కడి నుంచి కాగితాలు తెచ్చుకోవచ్చు. ఫలానా ఆఫీసును రెయిడ్చేస్తే మీ దర్యాప్తుకు ఉపయోగపడతాయనుకుంటే మీరు ఆ పని చేయవచ్చు. హైకోర్టు మిమ్మల్ని ఫలానా ఆఫీసుకు వెళ్లమని చెబు తుందా?‘ అని అడిగాను. దానికి ఆయన, ‘అబ్బో వద్దండి... అదంతా కది లిస్తే చాలా ఇబ్బంది అవుతుంది’ అన్నారు. ‘అలాగైతే మీ ఇన్వెస్టిగేషన్మీద నాకు నమ్మకం లేదండి’ అన్నాను. ‘నేను ఈ మాట చెబుతున్నాను, ఇది రికార్డు అవుతుందని నాకు తెలుసు’ అని చెప్పాను. రెండోదికూడా అడిగాను. మీరు విదేశాలకు వెళతారా, వెళితే అక్కడ సమాచారం ఉందని అంటున్నారు కదా. అక్కడికి వెళ్లి సమాచారం తెచ్చు కుంటారా అని అడిగాను. లేదండీ లెటర్స్ రొగేటరీ పంపిస్తాము. వాళ్లు సమాచారం పంపుతారు అన్నారాయన. వాళ్లెందుకు పట్టించుకుంటారు? మీరు అనుమతి తీసుకుని ఆ దేశాలకు వెళ్లాలి. అక్కడి సెంట్రల్ బ్యాంకుకు వెళ్లి సంప్రదించాలి. కాగితాలు ఉన్నాయా, డొల్లకంపెనీలు ఉన్నాయా, సూట్ కేస్ కంపెనీలు అంటారు కదా, అలాంటివి ఉన్నాయా అని వారిని అడగాలి. అలాగే ఎవరికీ చెందని డబ్బులు, ఎవరికో చెందిన డబ్బులు మనదేశానికి వచ్చాయా అని కూడా మీరు కనిపెట్టాలి కదండి. కనిపెట్టకపోతే ఎలా అని సీబీఐ జేడీని నేను అడిగాను. అబ్బే లేదండి లెటర్లు మాత్రమే రాస్తాము, వారు సమాధానం ఇస్తే సరి లేకపోతే లేదు అన్నారు. అందుకే మీ దర్యాప్తు మీద నాకు నమ్మకం లేదు అని చెప్పాను. అప్పుడాయన నవ్వేశారు. మిమ్మల్ని ఎందుకు పిలిపించారు, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారా? కేబినెట్ నిర్ణయాలకు సంబంధించిన ఫైల్స్గురించి ప్రశ్నించడానికి లక్ష్మీ నారాయణ నన్ను దిల్కుషా గెస్ట్‌హౌస్‌లోని తన ఏసీ గదిలో కూర్చోబెట్టారు. 48 ఫైళ్లు నా ముందుంచారు. ‘మీరు సంతకం చేశారు, ఇలా నోట్ వచ్చిన ప్పుడు మీరు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు’ అని అడిగారు. అప్పుడు నాకు తెలిసిందేమిటంటే.. రాష్ట్రంలో జరిగే సెక్ర టేరియట్ రూల్స్, పద్ధతులు సీబీఐ వాళ్లకు తెలియవు. బేసిక్‌గా అది ఒక ప్రాబ్లమ్. కేబినెట్ సమావేశం అంటే ఏమిటి? ఏ పరిస్థితుల్లో కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు.. ఒక కేబినెట్‌కు ఒక సబ్జెక్టు ఎందుకు పంపిస్తాం.. కేబినెట్ పరిధి ఏమిటి.. ముఖ్యమంత్రికి గల అధికారా లేమిటి కేబినెట్లో నిర్ణయాలు ఎందుకు తీసుకోవాలి అనే విష యాలు సీబీఐకి నిజంగా తెలియదు. వాళ్లకు (సీబీఐ) భారత ప్రభుత్వ రూల్సే తెలుసు కానీ రాష్ట్ర ప్రభుత్వ రూల్స్ తెలియవు. అసెంబ్లీ నిబంధనలు తెలియవు. స్పీకర్‌కు, ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలేమిటో తెలియవు. మాలాంటి కార్యదర్శులకు ఉన్న అధికారులు, విధులు, బాధ్యతలు ఏమిటో వారికి తెలియవు. అవి తెలి యజెప్పడానికి నాకు ఒకరోజు పట్టింది. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రివర్గం ఎలా పని చేస్తుందో సీబీఐకి తెలియజెప్పే పనిని సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో పనిచేసే ఓ మహిళా అధికారికి అప్పగించాం. ఆమె సహాయం కూడా తీసుకుని నేను చెప్పాను. నాకు బేసిక్‌గా తెలిసింది ఏమిటంటే.. అసలు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు, విధానాలను కూడా అర్థం చేసుకోకుండా సీబీఐ వాళ్లు విచారణ మొదలుపెట్టారు. మరి ఆలాంటి కేసులు చెల్లుతాయా? మీకది రాజకీయ కేసు అనిపించిందా? నేను ఆరోజే ఆయనతో (లక్ష్మీనారాయణ) చెప్పాను. నేను చెప్పిన పేర్లు ఉన్నవారిని (మంత్రులు) మీరు పిలవలేదు కదా. విదేశాలకు కూడా మీరు వెళ్లడం లేదు కదా. ఈ కేసులు నిలుస్తాయని నిజంగా మీకు నమ్మకం ఉందా.. అని అడిగితే... సమాధానం ఏమీ చెప్పకుండా నవ్వేశారాయన. కాంగ్రెస్ అధిష్టానం నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే చేసి ఉంటారంటారా? తెలీదు కాని ఆయన నవ్వేశారు అంతే. మరి ఒక సీఎం కుమారుడిని అన్ని నెలలు జైల్లో పెట్టడం సబబేనా? అంతిమంగా తీర్పు ఎలా వచ్చినా ముందుగా అరెస్టు చేస్తారు కదా. అది ఒక సమస్య. న్యాయస్థానం ముందుగానే జోక్యం చేసుకుని బెయిల్ ఇచ్చిం దనుకోండి. అది ఒక సమస్య. పదేళ్ల తర్వాత నిర్దోషిగా బయట కొచ్చే కేసు లను కూడా మనం చూస్తుంటాం. అప్పుడు నిజంగా బాధేస్తుంది. ఇంత కాలం తర్వాత నిర్దోషిగా బయటపడ్డారు. మరి ఇన్నాళ్లు నిర్బంధంగా కారా గారంలో పెట్టినప్పుడు వారి స్వాతంత్య్రాన్ని హరించినట్లే కదా. సరే. అనుమతులిచ్చిన అథారిటీని ఎలా పిలుస్తారు? మీరు విచారణకు ఎవరిని పిలుస్తారు.. అని లక్ష్షీ్మ నారాయణను అడిగాను. అనుమతులు ఇచ్చింది ఎవరు కేబినెట్. దానికి ముఖ్యమంత్రి అధ్యక్షత వహి స్తారు. పిలవడానికి ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు లేరు. కాబట్టి కేబినెట్లోని మంత్రులందరినీ పిలిచి అడుగుతారా రూల్ ఏమిటంటే.. కేబినెట్లో ఏదైనా నిర్ణయం తీసుకుంటే మేము (కార్యదర్శులం) రీజన్స్ (కారణాలు) రాయన క్కరలేదు. కేబినెట్ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది అనేది కూడా రాయ నక్కరలేదు. మీకు ఆశ్చర్యం అనిపించ వచ్చు గానీ.. అది మా రూల్‌లో ఉంది. కేబినెట్లో ఫలానా నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారో రికార్డు చేయాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మీరు ఎవరిని పిలిచి అడుగుతారు అని జేడీతో అన్నాను. అప్పుడు పనిచేసిన మంత్రులను పిలిచి అడిగితే వాళ్లేమం టారు.. అది సమిష్టి బాధ్యత అని చెబుతారు. మరి ఎవరిని అడుగుతారు? అనుమతులు ఇచ్చిన అథారిటీని అడగాలి. ఆ అథారిటీని ఎలా పిలుస్తారు? కాబట్టి మీ విచారణపై నాకు పెద్దగా నమ్మకం లేదు అని చెప్పేశాను. అలాంటప్పుడు బీపీ ఆచార్య వంటి ఐఏఎస్‌లను పనిగట్టుకుని నిర్బంధించారే? ‘‘జగన్‌పై పెట్టిన కేసుల విషయంలో అప్పటి ఐఏఎస్ అధికారులను అరెస్టు చేయాల్సిన అవసరం లేదేమో. ఎందుకంటే వాళ్లు ఎక్కడికీ పారిపోరు కదా! మీరు ముందుజాగ్రత్తగా వారి పాస్‌పోర్టు తీసుకున్నా వారు ప్రభుత్వంలోనే పనిచేస్తారు కదా. ఎక్కడికీ పోలేరు. దీంట్లో కూడా ఏదైనా కక్షసాధింపు లాంటిది ఉందా? కక్షసాధింపు ఉందని నేను భావించడం లేదు. ఏదో బ్రహ్మాండం బద్దలవు తుంది అనే ఉద్దేశంతో అరెస్టు చేశారేమో తెలియదు. ఆ తర్వాత బ్రహ్మాండం బద్దలు కాలేదు అని నేను అనుకుంటున్నాను’’ (రమాకాంత్ రెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠం ఇక్కడ క్లిక్ చేయండి) -
మాజీ సీఎస్ రమాకాంత్ రెడ్డితో మనసులో మాట
-
మురళీధర్‌రావుతో మానసులో మాట
-
పాట తోడుగా సాగిన ప్రజాయుద్ధ నౌక
కొమ్మినేని శ్రీనివాసరావుతో ప్రజా గాయకుడు గద్దర్ అజ్ఞాతంలో ఉన్నప్పుడు పులివెందులకు వెళ్లి వైఎస్ రాజారెడ్డికి వ్యతిరేకంగా పాట పాడితే వైఎస్ పిలిపించుకుని చాయ్ ఇచ్చి మరీ బాగున్నావా అన్నారు. నన్నూ, నా పాటనూ చాలా ఇష్టపడ్డారు. తర్వాత అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు కొట్లాడి మరీ నాకు రక్షణ కల్పించారు. గద్దర్ ప్రజల గాయకుడు. పేదల కష్టాల గురించి పాటలు రాస్తాడు. గద్దర్ ఒక మాన్యుమెంట్ లాంటి వాడు. ఆయన్ని మనం కాపాడుకోవాలి అన్నారు. రాజ్యాన్ని వ్యతిరేకించినందుకు చంద్రబాబు హయాంలో పోలీసులు నా గుండెలో తూటాలు దింపి ప్రాణం తీయాలని చూస్తే...అవసరమైన సమయంలో నాకు రక్షణ కల్పించిన వాడు వైఎస్ రాజశేఖరరెడ్డి అని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. ప్రజలకోసం పోరాడే నిజమైన దేశభక్తులం కాబట్టే ఈ దేశం ఎవరిదని ప్రశ్నిస్తూ, ఈ దేశం దుక్కులు దున్నే రైతుదీ, మొక్కలు నాటే రైతుదీ అని పాట గట్టి పాడామని గద్దర్ అంటున్నారు. ఇంతవరకు ఓటు ఎవరికీ వేయకున్నా రాజ్యాంగాన్ని మన పాలకులు 25 శాతం మేరకైనా అమలు చేస్తే అదే పదివేలు అంటున్న గద్దర్ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... మీ పాటనై వస్తున్నాను అనే పదం ఎలా కనిపెట్టారు. ఆ పాట అద్భుతంగా ఉంటుంది? పాటలు ఎలా వస్తాయి. మాటల్లో బావా వస్తివా అంటాం దానికి కాస్త రాగం పెడితే.. బావా వచ్చితీవా ఆ..ఆ. అంటే పాటవుతుంది. నేను ఎక్కడికి పోయినా అన్నా పాట పాడే.. పాట పాడే అన్నప్పుడు పాట వస్తుంది. జనం నన్ను చూడంగానే పాట. ఎక్కడికి పో... పెళ్లికి పో.. పోలీసు స్టేషన్‌కు పో.. ఎక్కడికి పోయినా పాట. అందుకే మీ పాటనై వస్తున్నాను.. మీ పాదాలకు వందనం అని ట్యూన్ చేసుకున్నాను. మీ జీవితం నేర్పిన అనుభవం, మీ జీవితం నేర్పిన పాఠం ఏమిటి? ప్రజలకు సేవ చేయాలన్న అక్షరం, గొంతు, కలం. మనమంతా కలం సైనికులం. కలం నిరాయుధులం. ఆయుధం పట్టుకోం. బ్రెయిన్‌తో డీల్ చేసేవాళ్లం కాబట్టి వేమన, పోతన, అన్నమాచార్య, రవిదాస్, సంత్లు వాళ్లూ వీళ్లూ ఈ భారత సమాజంలో ప్రజల వద్దకు వెళ్లి ప్రజల జీవన విధానాన్ని ఒక రాగంలో, ఒక గానంలో ఆత్మతో ఆత్మ మాట్లాడుకోవడం.. అలాంటి వాళ్లు ప్రజల్లో సజీవంగా ఉంటారనే ఒక అనుభవం నాకు వచ్చింది. అలాంటి ఆదరణే నేను ప్రజలనుంచి పొందగలిగాను. గాయకుడిగా మీ పరిణామక్రమం? నా చిన్నప్పుడే మా అమ్మ జానపద పాటలు పాడేది. మా అమ్మ, నాన్న.. మా కుటుంబం నిజాం రాష్ట్రం నుంచి ఔరంగాబాద్‌కు వలస వెళ్లింది. అక్కడ మిళింద్ విద్యాలయాన్ని కట్టినప్పుడు నాన్న అక్కడే అంబేద్కర్‌ని కలిశాడు. నాన్నకు మరాఠీ బాగావచ్చు. అమ్మ కూడా అక్కడే పనిచేసింది. పిల్లలు చదువు కోవాలనే ప్రభావం నాన్నకు అంబేద్కర్ నుంచే పడింది. దాంతో చిన్నప్పుడే మా గోడల మీద రాసేవారు.. జ్ఞానమొక్కటి మిగిలిపోవును.. అక్షరం నేర్చుకో, చదువుకో అనేవారు. అదే నామీద ప్రభావం వేసింది. నేను మెదక్ జిల్లా తూప్రాన్‌లోనే పుట్టాను. మా అమ్మ మరాఠీలో మంచి పాట పాడేది. నేను దాన్ని తెలుగులో అల్లుకుని పాడుకునేవాడిని. నా గొంతు మా అమ్మ గొంతులోంచే పుట్టింది. ఇప్పటికీ మీరు నక్సలైటు సిద్ధాంతాన్ని నమ్ముతున్నారా? సమాజంలో జరుగుతున్న దోపిడి పోవాలనేదే నా సిద్ధాంతం. మానవతావాదం కాదు నాది. అందుకే.. ‘దుక్కులు దున్నిన రైతు సేతులకు బేడీలెందుకురోరన్నా.. మొక్కలు నాటిన కూలీలనెందుకు జైల్లో బెట్టిండ్రోరన్నా.. మాటలు రానీ మూగజీ విపై లాఠిదెబ్బలేలా నాయన.. ఈ ధర్మ యుద్ధములో మీరేవైపో మీరె దేల్చుకుండో నాయన..’ అంటూ పాడాను. మీపై కాల్పులు ఎందుకు జరిగాయి? ఆరోజు ఏం జరిగిందో మీకు గుర్తుందా? ఎన్కౌంటర్ అయినవారి మృతదేహాలను స్వాధీనం చేయమని అడిగాం. అది నేరుగా రాజ్య యంత్రాంగంతో ప్రత్యక్ష ఘర్షణగా మారింది. మరి రాజ్యం ఊరుకోదు కదా. 1997 ఏప్రిల్ 6. నాపై కాల్పులు జరిగి ఇరవై ఏళ్లు అయిపోతోంది. ఎందుకు కాల్చారంటే.. బయటికి వచ్చాక ఒకవైపు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. రెండోవైపు ఎన్ కౌంటర్లు.. మరోవైపు ఎవరిదో ఉరిశిక్ష రద్దు చేయాలి అనే పోరాటం.. అనేక రకాలుగా నేను తిరుగుతున్నాను. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ ప్రారంభంలో 1997 మార్చి 8 నాడు ఒక తీర్మానం జరిగింది. ఏప్రిల్ 6న నాపై దాడి జరిగింది. తెలంగాణ ఉద్యమాన్ని నేను ప్రోత్సహిస్తున్నాననే అనుమానమే నాపై దాడికి కారణం. చంద్రబాబుకు, ఎన్టీఆర్‌కి తేడా ఏమిటి? నేను రాజకీయాలను ప్రస్తావించదలచుకోలేదు. కానీ.. పాలసీలు, అధికారం విషయం పక్కన బెడితే ఎన్టీఆర్ మాస్ లీడర్. చంద్రబాబు పక్కా రాజకీయ నాయ కుడు. బాబుది హైటెక్ సిటీ పాలన. కానీ నేనేమంటానంటే భారతదేశంలో లక్షా 20 వేల గ్రామాలున్నాయి. గ్రామ పునాదిగా ఎకానమీని తీసుకుంటే ఏ పాలకుడి పాల నైనా మంచిగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ వచ్చింది. మీరు ఇప్పుడెలా ఫీలవుతున్నారు? మేం ప్రజా కళాకారులుగా అడవిలో ఉన్నప్పుడు ఒక దుప్పిని వేటాడాం. ఆ గూడెంలో ఒక చెల్లి, ఇతరులు ఉన్నారు. మాంసం అందరికి తలొక పాలు వేసి ఆ చెల్లెకు మాత్రం రెండు పాళ్లు వేశాం. అడవిలో పద్ధతి తెలీదు నాకు. అందుకే మా దళనాయకు డిని అడిగాను. అందరికీ తలొక పాలే కదా. ఆ చెల్లికి మాత్రం రెండుపాళ్లు ఇచ్చారు. ఆమె గూడేనికి పెద్దా అని అడిగాను. కాదు గద్దరన్నా.. ఆ చెల్లె కడుపుతోటి ఉంది. లోపలున్న బిడ్డకు ఒక పాలు, తల్లికి ఒక పాలు ఇచ్చామన్నా అన్నాడు దళ నేత. అలాగే తెలం గాణలో కూడా త్యాగాలు చేసిన, ప్రాణాలిచ్చిన వారికి చెందవలసింది ఇస్తేనే ఆ త్యాగాల తెలంగాణ ధన్యమవుతుంది. ఇప్పటికే మాకు నీళ్లు రాలా, మాకు కొలువులు రాలా, మాకు ఇవి రాలా, అవి రాలా అని ఉద్యమాలు మొదలవుతున్నాయి. వైఎస్ రాజశేఖరరెడ్డితో కూడా మీకు సంబంధాలున్నాయి కదా? వైఎస్సార్‌ది ఒక ప్రత్యేకత. ఎమర్జెన్సీ కాలంలో అజ్ఞాతంలో ఉంటూ కడపకు పోయి పులివెందుల ప్రాంతంలో వైఎస్ తండ్రి రాజారెడ్డిపై పాటలు గట్టి ప్రచారం చేస్తున్నప్పుడు మాకు వ్యతిరేకంగా పాటలు పాడతావా అని నా చేతులు కట్టేసి పట్టుకుపోయారు. ఎవరు నువ్వు అని ఇడిగితే ఇంజనీరింగ్ చదివినా, ప్రజలను ఆర్గనైజ్ చేస్తా అన్నాను. కడపలో నువ్వేం ఆర్గనైజ్ చేస్తావురా బాబు అన్నాడు రాజారెడ్డి. ఈలోపు వైఎస్సార్‌కి తెలిసింది. వెంటనే తనవద్దకు రప్పించుకున్నాడు. తాగేందుకు చాయ్ ఇచ్చాడు. బాగున్నావా అనడిగాడు. చాలా ఇష్టపడ్డాడు. అది పాత మాట. కానీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఒక ఉత్తరువు తెచ్చాడు. గద్దర్ ప్రజల గాయకుడు. పేదల కష్టాల గురించి పాటలు రాస్తాడు. ఆయన ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆయన భార్య వచ్చి కలిసి మాట్లాడింది. గద్దర్ ఒక మాన్యుమెంట్ లాంటివాడు. ఆయన్ని మనం కాపాడుకోవాలి అన్నారు వైఎస్ఆర్. ఆ మాట చాలు కదా. అప్పుడే నాకు రక్షణ వచ్చింది. మిగతా ఎవరి పాలనలోనూ నాకు రక్షణ ఇవ్వ లేదు. అసెంబ్లీలో వైఎస్సార్ నాగురించి కొట్లాడిన తర్వాతే నాకు రక్షణ వచ్చింది. ముఖ్యమంత్రి అయ్యాక కూడా అనేకసార్లు కలిశాను. అక్కడ సూరీడు చాయ్ ఇవ్వబోతే ‘నువ్వివ్వకు లక్షలాది మంది ప్రజలను కదిలించినవాడు. నేనే ఇస్తాను’ అని వైఎస్ స్వయంగా నాకు టీ ఇచ్చారు. నా పాట లంటే ఆయనకి చాలా ఇష్టం. ‘రక్తమిచ్చినా రాయలసీమకు ఏమిస్తవురో రామన్నా..’ ఈ పాట చాలా ఇష్టం ఆయనకు. పదే పదే పాడించుకునేవారు. పోలీసులు ఎవరినో పట్టుకున్నారు.. కాల్చేసే ప్రమాదముందని నేను క్యాంప్ ఆఫీసుకు గోసీ గొంగడేసుకుని వెళితే ఏంటని అడిగారు. మీ పోలీసులు ఎవరినో పట్టుకున్నారట. కాల్చేస్తారట, మీరు కాస్త చూడాలి అంటే అలా చేయవద్దంటూ అప్పటికప్పుడే సంబంధిత వ్యక్తులకు ఆదేశా లిచ్చారు. ఎన్టీరామారావును, చంద్రబాబునాయుడిని కూడా చాలాసార్లు కలిసాను. కానీ వీరందరిలో వైఎస్ఆర్ది ఒక ప్రత్యేకత. ఇంతకూ మీ రాజకీయ లక్ష్యం ఏమిటి? నేను విప్లవోద్యమంలో జీవించాను. నా పాటలు విని లక్షలాది ప్రజలు పోరా టంలోకి వచ్చారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా.. పోరు తెలంగా ణమా.. పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా. భూతల్లి బిడ్డలు, చిగురించే కొమ్మలు.. చిదిమేసిన పువ్వులు.. త్యాగాల గుర్తులు.. మా భూములు మాకేనని మర్ల బడ్డ గానమా.. తిరగబడ్డ రాగమా. ఇదీ నా లక్ష్యం. మీద్వారా, సాక్షి ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కేసీఆర్‌కి విజ్ఞప్తి చేస్తున్నాను. పౌరహక్కుల ఉద్యమం, పాటల ఉద్యమం, సాహిత్య ఉద్యమం పట్ల ఆయన చాలా సానుకూలంగా ఉండాలి. ఎన్కౌంటర్లు చేశారు. చిన్న చిన్న విషయాల్లో, మీటింగులు పెట్టే దగ్గర అందరికీ అవకాశమివ్వండి. ఏముంది క్కడ. ఎన్ని మీటింగులు పెట్టలేదు అందరం కలిసి. ఎవరైనా ఒక్క ఇందిరా పార్కు దగ్గర మీటింగు పెట్టగానే ప్రభుత్వం వచ్చేస్తుందా. గ్రామాల్లో కేసీఆర్ అంటే ఇప్పటికీ కొన్ని నమ్మకాలున్నాయి. ఆ నమ్మకాలు కోల్పోయేలా వ్యవహరించవద్దు. (గద్దర్‌తో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకులో చూడండి) https://www.youtube.com/watch?v=uxjMKWL2ooM -
దేవుడు కూడా ‘బాబు’ను కాపాడలేడు
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి జగన్‌ని కాంగ్రెస్ పార్టీ వారెంత దారుణమైన హింసకు గురిచేశారు? వాళ్ల నాన్నే తాము అధికారంలోకి రావడానికి కారణం అనే విషయాన్ని పక్కన బెట్టి.. అకారణంగా, అక్రమంగా తనపై ఆరోపణలు చేసి, ఒకరోజైనా కనీసం సచివాలయానికి రాని, ఏ ఒక్క ఐఏఎస్ అధికారితో కూడా మాట్లాడి ఉండని వ్యక్తిపై, కనీసం హైదరాబాద్‌కు కూడా అతి తక్కువసార్లు మాత్రమే వచ్చిన వ్యక్తిపైన అవినీతిపరుడని ముద్ర వేసి జైలుకు పంపించడం దారుణం. సర్వేల పేరుతో 80 శాతం మంది ప్రజల మద్దతు ఉందని చెప్పుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును వచ్చే ఎన్నికల్లో దేవుడు కూడా కాపాడలేడని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, టీటీడీ ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్, ఉమ్మడి రాష్ట్ర శాసనసభ మాజీ సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి చెబుతున్నారు. తిరుపతి సభలో మోదీ సమక్షంలో 15 ఏళ్లపాటు ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసి, ఎన్నికలు ముగిసిన 3నెలల్లోపే హోదా వల్ల వచ్చే మేలు ఏదీ లేదని మాట మార్చిన మొదటి వ్యక్తి చంద్రబాబు అని భూమన దుయ్యబట్టారు. ఏపీకి ఎక్కడో అన్యాయం జరుగుతోందని పసిగట్టి, హోదాపై తీవ్రంగా అధ్యయనం చేసి ప్రజలను చైతన్య పరిచిన మొదటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని, ఆయన కృషి వల్లే ప్రత్యేక హోదా నేడు ప్రజల డిమాండుగా మారిందన్నారు. ఐదేళ్ల పాలనలో స్వర్ణయుగాన్ని తలపించిన వైఎస్సార్ పాలన మళ్లీ రావాలంటే జగన్‌ని ఆశీర్వదించి, మద్దతు తెలపాలంటూ భూమన కరుణాకర్‌రెడ్డి ‘మనసులో మాట’లో చెప్పిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... మీ రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైంది? నేను 11 ఏళ్ల ప్రాయంలోనే ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ ఉద్యమంలో పాల్గొని, పట్టాలమీద రాసిన గుర్తులు ఇంకా నా మనస్సులో ఉన్నాయి. అంత చిన్న వయసులోనే అలాంటి చైతన్యం నాలో ఉన్నందుకు నా కుటుంబ రాజకీయ నేపథ్యమే కారణం. మా అన్న భూమన్ నాకు ప్రేరణ. తర్వాత 1972లో జరిగిన జై ఆంధ్ర ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నాను. చిన్న వయసులోనే నన్ను 3 రోజులపాటు పోలీసు స్టేషన్లో నిర్బంధించారు కూడా. తర్వాతి రోజుల్లో వైఎస్ రాజారెడ్డితో సంబంధాలు ఎలా ఏర్పడ్డాయి? 1975లో ఎమర్జెన్సీ కాలంలో భారతదేశంలోనే అతి చిన్న వయసులో నిర్బంధంలోకి తీసుకున్న వ్యక్తిని నేనే. అతి పెద్దవాడు మొరార్జీ దేశాయ్ అనుకోండి. ఎమర్జెన్సీ ప్రారంభం నుంచి ముగిసే వరకు నేను జైల్లోనే ఉన్నాను. రాజారెడ్డి, జార్జిరెడ్డి కూడా మాతోపాటు అప్పట్లో జైల్లో ఉండేవారు. ఆవిధంగా ఆ కుటుంబంతో నాకు సంబంధం ఏర్పడింది. తర్వాత 1982లో విప్లవ రాజకీయాల నుంచి బయటికి వచ్చాను. రాజారెడ్డితో పూర్వ సంబంధాలు తర్వాత పెద్ద ఎత్తున బలపడుతూ వచ్చాయి. రాజశేఖరరెడ్డితో సంబంధం కూడా ఆయన తండ్రి ద్వారానే ఏర్పడింది. వచ్చే ఎన్నికలపై మీ అంచనా ఏది? చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా వైఎస్సార్సీపీకి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నాను. నూటికి నూరు శాతం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడాన్ని ఎవరూ ఆపలేరు. మీ పార్టీకి బలమైన శత్రువు రూపంలో బాబు ఉన్నారు కదా, ఎలా ఎదుర్కొంటారు? ఆ బలమైన శత్రువు అనేక తప్పుడు ప్రమాణాలు చేసి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా జగన్‌కి ఆయనకు మధ్య తేడా కేవలం రెండు శాతం కూడా లేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ రెండున్నరేళ్ల పాలనా కాలంలో చంద్రబాబు అధికారంలో ఉండి దిగని మెట్టు అంటూ లేదు. ఎన్ని రకాల ప్రమాణాలు తాను చేశాడో వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేకపోయాడు. పైగా జగన్‌మీద ఎన్ని ఆరోపణలు చేయాలో అన్నీ చేసేశారు. ఇన్ని ఆరోపణలు చేసినా, ఇంతమందితో లాలూచీ పడినా వారికీ మాకూ మధ్య వచ్చిన తేడా అతి స్వల్పం. వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలనపై మీ అభిప్రాయం చెప్పండి? బహుశా భారత రాజకీయాల్లో రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలనను స్వర్ణయుగం అని చెప్పొచ్చు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపున అభివృద్ధి కార్యక్రమాలు రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో ఒక చిరస్మరణీయమైన మహానుభావుడుగా మిగిలిపోవడానికి అవి ఆయన కోరుకుని చేసినవి కావు. ప్రజలకు ఏదో చెయ్యాలనే తపనే తప్ప అధికారం కోసమని రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి కాదాయన. చంద్రబాబు నిరంతరం అధికారం కోసమనే తపనపడేటటువంటి వ్యక్తి. జగన్‌కు 145 మంది ఎమ్మెల్యేల మద్దతున్నా అధిష్టానం ఎందుకు పరిగణంచలేదు? కాంగ్రెస్ పార్టీ ఒక నియంతృత్వ పోకడలతో నడిచే పార్టీ. ఏకస్వామ్యం మీద నడిచే వ్యక్తి. నియంతృత్వపు ఆలోచనల గొడుగు కింద వెలుగుతున్న పార్టీ. ఇతరులను నాయకులుగా వారు అంగీకరించే పరిస్థితి లేదు. వారికి కట్టుబానిసలుగా ఉండాలని కోరుకుంటారు. కట్టుబానిసగా ఉండటానికి అంగీకరించే స్వభావం ఈయనది కాదు. కనుక వాళ్లు ఆయనను అంగీకరించలేదు. జగన్ టెన్ జన్‌పథ్ అధికారానికి లొంగడు అని వాళ్లు గుర్తించారు. అలా లొంగేటటువంటి స్వభావం జగన్‌ది కాదు. టీడీపీవాళ్లు జగన్ మీద చేస్తున్న వ్యక్తిగత విమర్శలు ఎంతవరకు వాస్తవం? అవి పచ్చి అబద్ధాలు. జగన్ వ్యక్తిత్వాన్ని తట్టుకోలేక చేస్తున్న అతి నీచపు ఆరోపణలవి. జగన్‌ని నేను చిన్నతనం నుంచే చూశాను. పెద్దల పట్ల చాలా గౌరవం ఉన్న వ్యక్తి. చాలా సంస్కారం ఉన్న మనిషి. డ్రైవర్ని కూడా అన్నా అని సంబోధించగలిగేతత్వం ఉన్న మనిషి. తనవద్ద పనిచేసేవాళ్లను, తనకంటే పెద్దవాళ్లను అన్నా అని సంబోధించడం తన అలవాటు. చంద్రబాబు బీజేపీకి ఇంకా దగ్గరవుతాడా దూరమవుతాడా? బీజేపీతో ఉన్నా మరెవరితో ఉన్నా చంద్రబాబును దేవుడు కూడా ఇక కాపాడలేడు. పెద్దనోట్ల రద్దు తర్వాత ఏపీలో ఎలాంటి వాతావరణం ఉంది? ఏపీలోనే కాదు. మొత్తం దేశంలోనే ఒక అల్లకల్లోలం ఏర్పడింది. ఎమర్జెన్సీ కాలంలో ప్రజలు ఏరకంగా ఫీలయ్యారో, అలాగే ఈరోజు పెద్ద నోట్ల రద్దు వల్ల కింది స్థాయిలో మారుమూల పల్లెటూరు ప్రజలు పడుతున్న బాధలు వర్ణనాతీతం. ప్రజలు నిరంతరం బాధపడుతూంటే, వారు సంతోషంగా ఉన్నా... ప్రతి పక్షాలే ఊరికే గొడవ చేస్తున్నాయంటున్న బీజేపీ వాళ్లకు నిజంగానే జోహార్. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఏపీకి ఎంతవరకు మేలు చేస్తాయి? అధికారంలోకి రాగానే పదేళ్లపాటు ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని మోదీ భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్పిన చోటు తిరుపతి. పదేళ్లు ఏమూలకూ సరిపోవు. 15ఏళ్లపాటు హోదా ఇవ్వాలి అని అదే సభలోనే బాబు మోదీని గట్టిగా నిలదీశారు. ప్రత్యేక హోదా ఇస్తే ఇన్ని ప్రయోజనాలు వస్తాయని కూడా ఆ సభలోనే మాట్లాడారు. కాని 3నెలల లోపే ప్రత్యేక హోదా వల్ల వచ్చే ప్రయోజనం ఏదీ లేదని మాట మార్చిన మొదటి వ్యక్తి బాబు. దాన్ని జాగ్రత్తగా గమనించిన తొలి వ్యక్తి వైఎస్ జగన్. ఏపీకి ఎక్కడో అన్యాయం జరగబోతోందని పసిగట్టి హోదాపై తీవ్రంగా అధ్యయనం చేసి ఎన్నో అంశాలు తెలుసుకుని ప్రజలను చైతన్యపరిచారాయన. ప్రత్యేక హోదా మా ఆకాంక్ష అని ప్రజలు చాటేలా చేసింది వైఎస్ జగన్. ఆ డిమాండ్ ఇప్పుడు మా పార్టీది కాదు. ప్రజల డిమాండ్‌గా మారిపోయింది. ఏపీ జనాభాలో 80 శాతం మంది మమ్మల్నే బలపరుస్తున్నారని బాబు చెప్పారు కదా? కేవలం 8 శాతం మంది మాత్రమే బలపరుస్తున్నారు అని చెప్పబోయి పొరపాటున 80 శాతం మంది అని బాబు అన్నట్లున్నారు. వాస్తవానికి ఆ 8 శాతం మంది బాబు పాలన పట్ల చాలా సానుకూలంగా ఉంటారు. ఏపీ ప్రజలకు మీరిచ్చే సందేశం? సందేశం ఇచ్చేంత పెద్దవాడిని కాదు కానీ, రాజకీయాల్లో విలువలు పతనమవుతున్న దశలో ప్రజలకు మేలు చేయాలని తపనపడుతున్న వైఎస్ జగన్‌కు మీరు అనుకూలంగా, సానుకూలంగా మద్దతిస్తే వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన మళ్లీ మనం చూసే అవకాశం వస్తుంది. దానికోసం ఎదురుచూడండి, మాకు మద్దతివ్వండి అని ప్రజలకు విన్నవించుకుంటున్నాను. -
ఆ అన్న భరణమే ఈ చెల్లి జీవితం
మనసులో మాట: కొమ్మినేని శ్రీనివాసరావుతో మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజకీయాలంటే అసలు ఓనమాలు కూడా తెలియకున్నప్పటికీ, అనూహ్యమైన పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చానంటున్న మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి.. మహిళలు రాజకీయాల్లో ఎక్కడా వెనుకంజలో లేరు అంటున్నారు. చేవెళ్ల చెల్లెలిపై వైఎస్. రాజశేఖరరెడ్డి చూపిన అభి మానమే ఇంత స్థాయికి తీసుకొచ్చిందని కృతజ్ఞత చెబుతూనే, ఓదార్పు యాత్రను అధిష్టానం వ్యతిరేకించడంలో అందరి తప్పూ ఉండవచ్చంటున్నారు. వైఎస్సార్ ఉన్నప్పుడే తెలంగాణ విషయం చర్చల్లో ఉండి, తప్పకుండా ఇస్తారని మా అందరికీ తెలిసినప్పటికీ రెండేళ్లకు ముందే నిర్ణయం ప్రకటించి ఉంటే రెండు రాష్ట్రాల్లోనూ పరిస్థితి అనుకూలంగా ఉండేదని అంటున్న సబితా ఇంద్రారెడ్డి అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... రాజకీయాల మీద ఆసక్తి ఎలా కలిగింది? పెళ్లి తర్వాతే రాజకీయాలు అంటే ఏమిటో తెలిసింది. అంతకుముందు సర్పంచ్ అంటే ఏమిటో కూడా తెలీదు. రాజకీయాలకు సంబంధంలేని కుటుంబం మాది. ఆయనతో జీవితం మొదలైన తర్వాతే రాజకీయం అంటే ఇదీ అని తెలిసింది. మీ భర్త ఉన్నట్లుండి ప్రమాదంలో పోయాక మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఆయన స్థానంలో రాజకీయాల్లోకి రావాలనికానీ, వస్తాననికానీ అనుకోలేదు. పైగా ఆయన పోయిన షాక్‌లో ఉన్నాను. ఎవరొచ్చి అడిగినా రానని చెప్పేదాన్ని. టీడీపీ నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండి చనిపోయారు కాబట్టి దాన్ని వదిలి పెట్టడం బాగోదనుకున్నాను. ఈ నేపథ్యంలో రాజశేఖరరెడ్డి అన్న నన్ను పలకరించడానికి ఇంటికి వచ్చారు. ‘అమ్మా రాజకీయాలు అనేవి తర్వాతి సంగతి. కానీ ఇంద్రారెడ్డి కొన్ని రోజులే అయినా, నాకు దగ్గరగా వచ్చాడు. నా కుడిభుజం కోల్పోయినట్లుగా ఉంది. నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఒక సొంత చెల్లెలుగా నీ బాగోగులు చూసుకుంటాను’ అన్నారు. భగవంతుడు ఒక విధంగా అన్యాయం చేసి మరొక రకంగా న్యాయం చేస్తున్నాడని అనుకున్నాను. టీడీపీ చీలిపోయినప్పుడు ఇంద్రారెడ్డి ఏవిధంగా ఆలోచించారు? పార్టీలో తీవ్ర పరిణామాలు జరుగుతున్నారుు ఏం చేయాలని ఆయన ఇంటికొచ్చి నాకు చెప్పారు. చంద్రబాబువైపు వెళితే హోంమంత్రి పదవి అలాగే ఉంటుంది. ఎన్టీఆర్ వైపు వస్తే పదవి పోతుంది అని చెప్పారు. ఆ రోజు ఇంట్లో ఉన్నవాళ్ల మంతా పదవి పోయినా పర్వాలేదు ఎన్టీఆర్‌వైపే ఉండాలని చెప్పాం. తర్వాత ఎన్టీఆర్ వైపే ఉండిపోయారు. ఎన్టీఆర్ మరణించిన తర్వాత కూడా లక్ష్మీపార్వతికే మద్దతుగా నిలిచారు. తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని నడిపించారు. ఆపై కాంగ్రెస్‌లోకి వెళ్లారు. వైఎస్సార్ పాదయాత్ర ఘట్టంపై మీ వ్యాఖ్య ఏమిటి? వైఎస్సార్ అన్న పాదయాత్ర చేయాలని నిర్ణయించుకుని నన్ను పిలిపించుకుని తాండూరు నుంచి యాత్ర మొదలెట్టాలనుకుంటున్నానమ్మా అని చెప్పారు. కర్నాటక సరిహద్దులో ఉంటుంది తాండూరు. నేను సరే అన్నాను. ‘కానీ మీరు తాండూరు నుంచే యాత్ర మొదలెడతారు కాబట్టి ముందుగా చేవెళ్లలో ఒక బహిరంగసభ పెడతాను అక్కడ మాట్లాడి తర్వాత తాండూరు నుంచి మొదలెట్టండ’ని కోరాను. సరేనన్నారు. కొద్ది రోజుల తర్వాత ‘మీ ఊరునుంచే యాత్ర మొదలెడతా నమ్మా’ అన్నారు. నేను వ్యతిరేకించాను. ‘పాదయాత్రను మీరు తాండూరునుంచే మొద లెట్టండి చేవెళ్లలో బహిరంగ సభ పెడతాను’ అన్నాను. చేవెళ్లనుంచి పాదయాత్రకు మీరెందుకు వద్దన్నారు? సమాజంలో ఒక ముద్ర అయితే ఉంది కదా. భర్త చనిపోయినవారు అని, అమంగళం అని సెంటిమెంట్‌తో ఆలోచించాను. ‘నువ్వు అలా అన్నావు కదా. ఇక్కడి నుంచి మొదలెడతాను’ అనేశారాయన. అది ఆయన గొప్పతనం. అంత సుదీర్ఘయాత్ర కదా. మంచి జరిగితే సరే. కానీ చెడు జరిగితే ఇక జీవితాంతం మమ్మల్ని మేం క్షమించుకోలేం కదా. పైగా సమాజంలో మళ్లీ మరొక ముద్ర వేస్తారు. ‘అలా అంటు న్నావు కాబట్టి ఇక్కడ్నుంచే మొదలెడతాను’ అనగానే ఇక నాకు టెన్షన్ మొదలయింది. సెంటిమెంటుతో మీరు వద్దన్నా ఆయన వినక పోవడం అపూర్వం కదా? పాదయాత్ర మొదలైనప్పటినుంచి నేనయితే ఇంట్లో కూర్చునే టెన్షన్ పడ్డాను. మధ్యలో రాజమండ్రిలో అన్న జబ్బుపడ్డారనగానే కంగారు మరింత పెరిగింది. పాద యాత్ర పూర్తయేంతవరకు నాకు ఆందోళనగానే ఉండింది. తర్వాత కరీంనగర్లో కలిసి నప్పుడు.. వద్దంటున్నా వినకుండా మా ఊరినుంచే మొదలెట్టారు కదా అన్నాను. అవన్నీ మామూలే కదా, ఏం కాదు అని కొట్టిపడేశారాయన. మీకు మంత్రి పదవి ఎలా వచ్చింది? నేను అసలు ఊహించలేదు. తాండూరు ఎమ్మెల్యే నారాయణరావు మాకంటే సీని యర్ కాబట్టి వస్తే ఆయనకే పదవిరావాలి అనుకున్నాను. రాత్రి భోజనం చేసి పడు కుంటే పదకొండున్నరకు కాల్ వచ్చింది. మరుసటి రోజు ప్రమాణ స్వీకారానికి రావమ్మా అని పిలుపు. ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. అదే అన్న గొప్ప తనం. ఊహించని పరిణామం అది. చేవెళ్ల చెల్లెలికి మరచిపోని తీపి గుర్తు అన్నమాట. తర్వాత పల్లెబాట పథకాన్ని కూడా చేవెళ్లనుంచే మొదలెడతానని చెప్పారు. ఇదొకటే కాదు ఏ కొత్త కార్యక్రమం చేప ట్టినా అన్న చేవెళ్లనుంచే మొదలెట్టేవారు. దురదృష్టమో ఏమో కాని రచ్చబండ కార్యక్రమాన్ని అన్న చేవెళ్ల నుంచి మొదలెట్టలేదు. అలా జరిగి ఉంటే రాజశేఖర రెడ్డి అన్న బతికి ఉండేవారేమో అనిపిస్తుంది. జగన్‌కి పదవి ఇవ్వాలని మీరు కోరితే.. రోశయ్యకు ఎలా పట్టం కట్టారు? వైఎస్సార్ మీద అభిమానంతోనే ఆరోజు జగన్‌కి అధికారం ఇవ్వాలని మేం భావించాం. కాని అధిష్టానం చివరగా ఏం నిర్ణయించినా కట్టుబడాల్సిందే. రోశయ్య సీఎం అయ్యాక కొన్నిరోజులు ఓపిక పట్టి సర్దుకుపోవాల్సిందిగా జగన్ ని మేం కోరాం. ఓదార్పు యాత్రను అడ్డుకోవడంలో తప్పు ఎవరిది? అన్ని కోణాల్లోంచి చూస్తే అందరిదీ తప్పే అనిపిస్తుంది. అధిష్టానం జగన్ ని పిలి చిన సందర్భంలో కూడా నేనూ, రఘువీరారెడ్డి జగన్‌ని కలిసి అభ్యర్థించాం. ఓదార్పు యాత్ర అంటున్నారు కదా. కొన్ని రోజులు ఓపిక పట్టు, అందరం చర్చించి చేద్దాం అని కూడా గంటసేపు జగన్ కి నచ్చచెప్పడానికి ప్రయత్నించాం. హోంమంత్రిగా ఉద్యమాన్ని నియంత్రిం చాల్సి వచ్చినప్పుడు మీ ఫీలింగ్స్ ఏమిటి? తెలంగాణకు పూర్తి మద్దతుగా ఉన్న ఇంద్రారెడ్డి భార్యగా ఉద్యమాన్ని అదుపు చేయాల్సి రావడం చాలా బాధనిపించింది. పదవికి రాజీనామా చేయాలని కూడా అని పించింది. కానీ మహిళలకు చిన్న చిన్న పద వులు ఇస్తున్నారు. పెద్ద పదవులు ఇస్తే ఇలాగే వాళ్లు నిలబెట్టుకోలేరు అని ఆరోపిస్తారు. మహిళా లోకంమీదే నిందవేసే ప్రయత్నం చేస్తారు. సులభంగా వ్యాఖ్యలు చేస్తారు కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ రాజీనామా చేయవద్దని అనుకున్నాను. 15 ఏళ్లకు ముందు, ఇప్పుడు మీలో చాలా తేడా కనపడుతోంది. ఈ రాజకీయ పరిణతిని ఎలా సాధించారు? మనిషి నిరంతర విద్యార్థి. రాజకీయాల్లో అడుగడుగునా నేర్చుకోవడానికి అవ కాశం ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ చేయాలనే తపన తనంతట తాను వచ్చేస్తుంది. రాజకీయాలు అంటే పనిష్మెంట్ అని నేను ఒక సందర్భంలో వ్యాఖ్యానిస్తే నా భర్త ఇంద్రారెడ్డి వ్యతిరేకించారు. రాజకీయాల్లో ఉన్న తృప్తి నీకు అర్థం కాదన్నారు. అది ఇప్పుడు నాకు అర్థమవుతోంది. అందుకే ఆయన మాటలు ఎప్పుడూ గుర్తు చేసుకుంటుంటాను. రాజకీయాల్లో వేసే ప్రతి అడుగులోను ఎంతో కొంత నేర్చు కుంటూ ఉంటాము. (సబితతో ఇంటర్వ్యూ పూర్తి పాఠం కింది లింకులో చూడండి) https://www.youtube.com/watch?v=U2aNqP2vaMQ -
సబితతో ‘మనసులో మాట’
-
ఓటుకు కోట్లు కేసులో రాజీ లేదు
కొమ్మినేని శ్రీనివాసరావుతో నిజామాబాద్ ఎంపీ కవిత మనసులో మాట పాలన ప్రజల వద్దకు వెళ్లాలి అంతే కాని ప్రజలు నావద్దకు రావడం ఏమిట న్నది కేసీఆర్ సిద్ధాంతం. ప్రజల బాధలు తీరిపోవడం కిందిస్థాయిలో జరిగి పోవాలి. అంతేకానీ, సమస్యల పరిష్కారం కోసం అక్కడి నుంచి ఖర్చులు పెట్టుకుని సీఎంని కలవడానికి హైదరాబాద్‌కు రావలసిన పనిలేదనే ఉద్దే శంతోటే చిన్న జిల్లాలను ఆయన ఏర్పాటు చేశారు. రాజకీయాల్లో పదవులు, వారసత్వాలు శాశ్వతం కావని, ప్రజలకు ఏం చేశామన్నదే వాళ్లు మనల్ని గుర్తుపెట్టుకునేందుకు గీటురాయి అని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అంటున్నారు. తెలంగాణలో దొరల పాలన, కుటుంబ పాలన సాగుతోందంటున్నవారు నెహ్రూలు, గాంధీల నుంచి బాబుల దాకా సాగుతున్న చరిత్రను చూసి మాట్లాడాలని ఆమె ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసు లీగల్ వ్యవహారం. దాని పద్ధతిలో అది నడుస్తూనే ఉంటుంది కానీ ఎప్పుడు తేలు తుందో చెప్పలేమన్నారు. చంద్రబాబు ఎందుకు హైదరాబాద్ వదలి వెళ్లారన్నది వారి సమస్యే కానీ టీఆర్ఎస్ సమస్య కాదన్నారు. అన్ని ఫిరాయింపులూ ఒకటి కాదని, తెలంగాణలో బలమైన శక్తిగా టీఆర్ఎస్ నిలబడాలనే భిన్న వర్గాల నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని సమర్థించుకున్నారు. తెలంగాణ నేపథ్యం తెలియనివాళ్లలాగా విమర్శ చేస్తున్న కోదండరామ్ వైఖరి పట్ల ఉద్యమకారులుగా బాధపడుతున్నామే తప్ప ఆయనతో శత్రుత్వం లేదని, టీఆర్ఎస్కు ఆయన సహజమిత్రుడన్నారు. ఏపీతో రాజకీయంగా కానీ, అభివృద్ధి విషయంలో కానీ ఏ పరిస్థితుల్లోనూ పోల్చుకోకూడదని ఎంపీ కవిత మనసులో మాటలో చెప్పిన అభిప్రాయాలు ఆమె మాటల్లోనే... సాక్షి పాఠకుల తరపున స్వాగతమండీ. మీ చిన్న నాటి అనుభవాలు చెప్పండి? ఈ ప్రోగ్రాంకు నన్ను ఆహ్వానించినందుకు మీకు, సాక్షి టీవీ వారికి మనఃపూర్వక కృతజ్ఞతలు. చాలా తక్కువమంది అదృష్ట జాతకుల్లో నేనొకరిని అని చెప్పవచ్చు. బాల్యం నుంచి మహిళల వ్యక్తిత్వాన్ని ప్రోత్సహించే కుటుంబంలో పుట్టాను. నేనూ, అన్న... తొలినుంచి స్వతంత్ర వ్యక్తిత్వంతో పెరిగాం. మీకు బాగా సంతోషం కలిగించిన ఘటన ఏది? పెద్దకొడుకు పుట్టినప్పుడు ఆ సన్నివేశం అలా గుర్తుండిపోయింది. ఆ అనుభవం తొలిసారి కదా. అదొక సుందర క్షణం. బాగా బాధ కలిగించిన సన్నివేశం ఏది? నాన్నమ్మ అంటే చాలా ఇష్టం. తనకు గుండెపోటు వచ్చింది. చాలా బాధేసింది. తర్వాత నాన్న దీక్ష చేసినప్పుడు కూడా భయంకరమైన హింస. ఒకవైపు ఉద్యమంలో చిన్న వయసు పిల్లలు చనిపోవడం, నాన్న అరెస్టు కావడం, ఉద్యమం ఏమవుతుందో తెలీదు. అలాంటి సమయం శత్రువులకు కూడా రాకూడదు. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర? 2006 డిసెంబర్లో కేసీఆర్ తొలిసారి రాజీనామా చేసిన రోజే నేను తొలిసారిగా బయటకు వచ్చాను. అప్పుడే తెలంగాణ పల్లెల్లో పేదరికం చూసి చాలా ప్రభావితం అయ్యాను. మాకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అన్ని రకాలుగా చదువుకుని మనం ఇంట్లో కూర్చుంటే ఎలా? మనమే ఏదో ఒకటి చేయాలి అనే ఉత్తేజం వచ్చింది. కేసీఆర్ పాలనపై మీ అభిప్రాయం? అయనలోని అంకితభావం నాకు నచ్చుతుంది. ప్రజలకు తాననుకున్నది చేయాల నుకోవడం, అమలు చేయడంలో నిబద్ధత వల్లే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, కొంత జాప్యం జరిగినా కమిట్మెంట్ వల్లే 90 శాతం పనులు ఆయన చేయగలిగారు. తెలంగాణ వచ్చాక 3 సంవత్సరాలకు నిరం తర కరెంటు ఇస్తానని చెప్పారు. కరెంటు వంటి క్లిష్టతరమైన విషయాన్ని అర్థం చేసు కుని, మూడే మూడు నెలల్లో 24 గంటల కరెంటు ఇచ్చారు. బ్రహ్మదేవుడు కూడా బాబును కాపాడలేడన్న కేసీఆరే రాజీపడ్డారా? కాంప్రమైజ్ అని నేననుకోను. ఒక వేళ నిజంగా అంత సీరియస్ టాక్ ఉంటే దాన్ని మేం పెద్ద విజయం కిందే భావిస్తాం కదా. కొన్ని కేసులు లీగల్ ఇష్యూలుగా మనం ప్రారంభించేంత వరకే మన చేతిలోఉంటాయి. చేసింతర్వాత లీగల్ వ్యవహారాలు ఎలా సాగుతుంటాయో మీకు తెలుసు. మనం తొందరపెట్టినంత మాత్రాన కొన్ని కేసులు పరిష్కారం కావు. తొందర పెట్టనంత మాత్రాన పరిష్కారం కాకుండా ఉండవు. లీగల్ క్రమంలో కేసు ఎప్పుడు తేలుతుందో తెలీదు కదా. ఆ కేసులో ఇబ్బందిలో ఉన్నది మా ప్రత్యర్థే కదా.. వాళ్లను రక్షించుకుని మేం సాధించేదేముంది? పైగా అలాంటి తెరవెనుక చర్యలు కేసీఆర్ ఎప్పుడూ చేయరు. బాబు ఎందుకు హైదరాబాద్ వదలి వెళ్లారన్నది ఆయన సమస్య. నిజానికి ఆయన అక్కడికి వెళ్లటం అనేది మంచిది. అక్కడ ప్రజలకు దగ్గరగా పాలన ఉంటుంది. అక్కడే ఉంటే పాలన మరింత వేగంగా జరుగుతుంది. ఫిరాయింపులు అనైతికమా కాదా? సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది మరి? తెరాస ఎన్నికల్లో గెలిచాక పెట్టిన తొలి ప్రెస్ మీటింగులోనే ఇవ్వాళ్టినుంచి మేం ఫక్తు రాజకీయ పార్టీగా ఉంటాంమని కేసీఆర్ చెప్పారు. ఎందుకంటే, తెలంగాణలో ఒక బలమైన రాజకీయ శక్తి అవసరం ఉంది. అది తెరాసే కావాలి. తెలంగాణలో ఒక శక్తి బలంగా ఎదిగి అభివృద్ధి చెందితే చూడలేని శక్తులు కూడా ఉన్నాయి. రాష్ట్రం ఇలాగే ఉండాలి. వీళ్లు అల్లాడుతూనే ఉండాలి. మేం రాజ్యం ఇలాగే చేస్తూనే ఉండాలి అనే కాంక్ష చాలామందికి ఉంది. ఇలాంటి వారందరినీ మేం అదుపు చేస్తూ బలమైన పార్టీగా ఎదిగితేనే రేపు తెలంగాణ ప్రయోజనాలకు శ్రీరామరక్షగా ఉంటుంది. అక్కడ చంద్రబాబూ ఇక్కడ కేసీఆర్ కూడా అదే పని చేశారు. తేడా ఏమిటి? మేం బాబుతో పోల్చుకోదల్చుకోలేదు. మా పోలిక ఎప్పుడూ అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంతో ఉండాలనుకుంటాను. ఏపీతో రాజకీయంగా కాని, అభివృద్ధి విషయంలో కానీ ఏ పరిస్థితుల్లోనూ పోల్చుకూకూడ దని భావిస్తున్నా. మనం ఇద్దరం కూడా ఇంకా బాగున్న వారితో పోటీ పడితే రెండు రాష్ట్రాలుగా ఇద్దరమూ ఎదుగుతామని నా ఆలోచన. బాబు పాలన ఇప్పుడెలా ఉంది? నాన్న ఒక సభలో ఇలా చెప్పారు. మాటలు చెప్పే సమయం కాదు పని చేయవలసిన సమయం ఇదని. మేం అలాగే పని చేసుకుపోతు న్నాము. ప్రజలు ఫలితాలు చూస్తారు. ఆ దృష్టితోనే బాబుమీద వ్యాఖ్యానించన వసరం లేదు కానీ ఏపీ ఒక రాష్టంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోదండరామ్, కేసీఆర్ ఇప్పుడెందుకు దూరంగా ఉంటున్నారు? ప్రాథమికంగా కోదండరామ్ టీఆర్ఎస్ పార్టీ మనిషి కాదు. కేసీఆరే స్వయంగా ఆయనను తీసుకొచ్చి జేఏసీకి చైర్మన్‌గా చేశారు. ఉద్యమంలో కలిసి పనిచేశాం. ప్రభుత్వం వచ్చాక కలిసి పనిచేయాలా వద్దా అనేది ఆయా వ్యక్తులు, సంస్థల నిర్ణయాల పైనే ఆధారపడి ఉంటుంది. మావైపు నుంచి పార్టీలో కాని, ప్రభుత్వంలో కాని కోదండ రామ్‌పై ఎవరికీ వ్యతిరేకత లేదు. తెలంగాణను చాలాకాలంగా నిర్లక్ష్యం చేసారు. రైతుల భూములకు నీళ్లు లేవు. వసతులు లేవు. కరెంటు, మోటార్లు, బోర్లు ఏవీ లేవు. దీర్ఘ కాలంగా జమ అవుతున్న కష్టాలు అని కూడా తెలుసు. తెలిసి కూడా ఈ రెండేళ్లలో ఏమీ చేయలేదని ఏమాత్రం అవగాహన కూడా లేని వారిలాగా కేవలం రాజకీయ విమర్శ చేస్తున్నట్లనిపించడంతో ఉద్యమకా రులంతా బాధపడ్డారు. ఇదేంటి తెలంగాణ నేపథ్యం తెలియని వాళ్లలాగా మాట్లాడు తున్నారు అనే తప్ప మరొకటి ఏం లేదు. కేసీఆర్ కోదండరామ్‌కు ఎందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదు? అపాయింట్మెంట్ ఇవ్వడం ఇవ్వకపోవడం కాదు సమస్య. ప్రభుత్వం సమస్య లను పరిష్కరిస్తుందా లేదా అనేది తొలి ప్రశ్న. కోదండరామ్ సర్ చెప్పిన వంద విష యాల్లో మేం ఎన్ని చేయగలమో అవన్నీ చేస్తున్నాం. అందులో అనుమానమే లేదు. కానీ వారు కూడా ఒక రాజకీయనేతగా విమర్శ చేస్తే వారి స్థాయిని తగ్గించుకోవడమే అవు తుంది తప్ప మరొకటి కాదు. కోదండరామ్‌తో మాకు వైరం ఏముంటుంది. ఆయన మాకు సహజ మిత్రులు. కాదని వారనుకుంటే మేమేం చేయలేం. చివరగా.. తెలంగాణ ప్రజలకు మీరిచ్చే సందేశం? తెలంగాణ ప్రజలకు సాక్షి టీవీ ద్వారా నేను చేసే అభ్యర్థన ఏమిటంటే, కేసీఆర్ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ అహర్నిశలు తెలంగాణ కోసం పనిచేస్తున్న వ్యక్తి, సంస్థ. మనమనుకుంటున్న పనులన్నీ సజావుగా సాగుతున్నాయి. కొంత ఆలస్యం అవు తున్నా, అది మన అలసత్వం కాదు. సాంకేతికంగా సమస్యలు ఉండవచ్చు. కాని తెలం గాణ ప్రజలకోసం పనిచేసే పార్టీగా ఇంతవరకు మీరెలా ఆదరించారో ఇకముందు కూడా మీరు కేసీఆర్‌తో, టీఆర్ఎస్తో నిలబడాలని కోరుకుంటున్నాను. (కవితతో ఇంటర్య్వూ పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడండి) https://www.youtube.com/watch?v=oD1t-sowVuU -
ఫిరాయింపులు అప్రజాస్వామికం..!
మనసులో మాట కొమ్మినేని శ్రీనివాసరావుతో టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ 'పాలనలో లోపాలను ఎత్తిచూపే వారివల్లే అభివృద్ధికి ఆటంకం కలుగు తోందనీ ఆరోపించడం తప్పు. మాకు అన్నీ తెలుసు కదా మీరెవరు చెప్పడా నికి అని పాలకులు ప్రశ్నించడమే నా దృష్టిలో చాలా ప్రమాదకరమైన ధోరణి. ప్రభుత్వం తనను ప్రశ్నిస్తున్న సంస్థల పట్ల సహనంతో ఉండాలి. వారు చెప్పే అభిప్రాయాలు తప్పయితే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు.' ఒక పార్టీ తనను తాను బలోపేతం చేసుకోవడానికి ప్రజాస్వామ్యంలో ఉన్న పద్ధతి ప్రజలకు దగ్గర కావడమే.. కానీ, ఇంకో పార్టీ లోని రాజకీయ నాయకుడిని కొనేసి తెచ్చుకుంటే నేను బలపడతాను అంటే అది ప్రజాస్వామ్య పద్దతి కాదని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరామ్ అంటున్నారు. పార్టీ విసిరే పైసలకు ఇటు వచ్చినోడు మరో పార్టీ ఇంకో ఆకర్షణ చూపితే మరోవైపుకు పోడని చెప్పలేమని, ప్రభుత్వాన్ని పడ గొట్టడానికి జరిగే ప్రయత్నాన్ని రాజకీయంగా ఎదుర్కొంటేనే ప్రజాస్వామ్యం బలపడు తుందని స్పష్టం చేశారు. పైసలిచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కోవాలని చూడటం ఎంత తప్పో, అవతలివాళ్లు కూడా పైసలిచ్చి ఓట్లు వేయించుకోవాలని చూడటం అంతే తప్పు అనీ, తప్పుకు అదే తప్పు చేయడం పరిష్కారం కాదన్నారు. ఓటుకు కోట్లు కేసును తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం ప్రజల్లో ఉందన్నారు. ప్రజాస్వామ్య విలువల విషయంలో రాజీ పడబోమని, ఎంతటి కొండను ఢీకొనవలసి వచ్చినా ఢీకొంటామని తేల్చి చెబుతున్న తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండ రామ్ ‘మనసులో మాట’లో చెప్పిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... బంగారు తెలంగాణ అనేది మీ నినాదం కాదా? బంగారు తెలంగాణ అంటే కొంతమంది దృష్టిలో కేవలం కొంత ఉత్పత్తి పెరిగితే చాలు. ఒక రోడ్డేమయినా బాగుపడగానే బంగారు తెలంగాణ అయిపోయిందని కొంద రనుకుంటారు. ప్రతి మనిషీ అత్మగౌరవంతో జీవిస్తూ, సామాజిక న్యాయం పొంద గలిగినప్పుడు అసలైన తెలంగాణ ఏర్పడుతుందని నేను భావిస్తున్నా. ప్రస్తుతం పాలనలో ఎక్కడ తేడా వచ్చింది? వ్యవసాయం పట్ల నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలామంది వృత్తులను నమ్ముకుని బతుకుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సరళీకరణ విధానాల ప్రభావం కారణంగా ఈ రంగాలను విస్మరించారు. ఇవాళ తెలంగాణలో వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాటిని నమ్ముకుని బ్రతు కుతున్న వారికి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. ఇది జరగటం లేదు. విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి రావాలి. అన్నిటి కంటే ముఖ్యంగా చిన్న, సూక్ష్మ పరిశ్రమలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ఉపాధి కల్పన చేయాలి. ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పని చేయడం లేదంటారా? ప్రాధాన్యతల విషయంలో తేడా ఉంది. ఇప్పుడు చెరువులు పునరుద్ధరిస్తున్నారు. ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు అది ప్రజా వ్యతిరేక విధానమని చెప్పగలమా? ప్రభుత్వం చేసే పనులు ప్రజానుకూలమైనవే. కానీ ప్రాధాన్యతలు భిన్నంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సాగిన అభివృద్ధి నమూనా ఇప్పుడు పనికి రాదు. ప్రజలు కేంద్రంగా ప్రత్యామ్నాయంగా ఇంకో అభివృద్ధి నమూనాను తీసుకోవాలి. ఇదే మా భావన. ప్రజలకు అన్నీ చేస్తున్నామంటున్నారు కదా? ఎక్కడ చేస్తున్నారు? నీళ్లు వస్తే వ్యవసాయంలో అన్నీ పరిష్కారమైపోతాయనే ఆలోచనలో ఉన్నారు. నీళ్లు వస్తే తెలంగాణ సమాజం ఇవ్వాళ ఎదుర్కొంటున్న సమ స్యల్లో ముఖ్యమైన సమస్య పరిష్కారం అయిపోతుంది. కాని అదొకటే కాదు. చిన్న, సన్నకారు రైతులు నిరంతరం మార్కెట్ దోపిడీకి గురవుతున్నారు. ఆ దోపిడీ నుంచి రైతుకు రక్షణ కలిగించాలి కదా. మల్లన్నసాగర్‌కు మీరే వెళ్లి ఆందోళన చేస్తే. ప్రభుత్వం దీన్ని ఎలా డీల్ చేయాలి? ఇప్పటికీ మల్లన్న సాగర్ విషయంలో డీపీఆర్ అనేది రెడీ కాలేదు కదా. డీపీఆర్ లేకుండా ఎట్ల గడతారు? మేం దీన్నే నిలదీశాం. ప్రభుత్వాలు తప్పు చేసేది ఇక్కడే మరి. చట్టం చెప్పిన సూత్రాల ప్రకారం నడచుకోవాలి కదా. మేం అధికారంలో ఉన్నాం. అన్నీ కరెక్టుగా చేస్తాం మాకు వదిలివేయొచ్చు కదా అంటే ఇక చట్టమెందుకు? రాజ్యాం గమెందుకు? ఎన్నికలే ఎందుకు? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రధాన లోపం ఏదంటే భూసేకరణ విషయంలో చట్టం కల్పించిన హక్కులన్నింటినీ విస్మరిస్తున్నారు. అసైన్డ్ భూములు కలవారిని బెదిరించి భూమి తీసుకోవడం ఏమేరకు సమంజసం? ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారేంటి? ప్రజల తరపున గళం విప్పడం, వారికోసం పనిచేయడమే అనవసరం... వీరివల్లే అభివృద్ధికి ఆటంకం కలుగుతోంది. మాకు అన్నీ తెలుసు కదా మీరెవరు చెప్పడానికి అనే ప్రశ్నలే నా దృష్టిలో చాలా ప్రమాదకరమైన ధోరణి. ప్రభుత్వం ఇలాంటి సంస్థల పట్ల సహనంతో ఉండాలి. వారు చెప్పే అభిప్రాయాలు తప్పయితే ప్రభుత్వానికి వచ్చే నష్టమేమీ లేదు. ప్రభుత్వ గౌరవం ఇంకా పెరుగుతుంది. వారు చెప్పేది వాస్తవమే అయితే ప్రభుత్వానికి పడిపోయే కిరీటాలు ఏవీ లేవు. ప్రజాస్వామిక వ్యవస్థలో సలహాలు వినడం అవసరం. ప్రజాస్వామిక దేశాల్లో ప్రభుత్వానికి చెట్టుకున్నంత, భూమికున్నంత, రాయికున్నంత సహనం ఉండాలి. తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయినట్లా, ఫెయిల్ అయినట్లా? టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న తప్పిందం ఏమిటంటే. పాత అభివృద్ధి విధానాల్లో చాలావాటిని మనం కొనసాగిస్తున్నాం. వాటిని వదిలిపెట్టాలి. ఉదాహరణకు కార్పొరేట్ విద్య ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థలను పర్మిషన్ లేకున్నా, గ్రౌండ్ లేకున్నా, ల్యాబ్ లేకున్నా అడగరు. బతుకుదెరువు కోసం చిన్న కాలేజీ పెట్టుకుంటే నాలుగైదుసార్లు తనిఖీ చేస్తారు. ఎందుకీ వ్యత్యాసం? అలాగే ఒక పెద్ద కంపెనీని తెలంగాణకు ఆకర్షించటం చాలా అవసరం. కానీ ఇక్కడున్న చిన్న, సూక్ష్మ పరిశ్రమల సంగతి? వీళ్లేమో తమకు 200 గజాల జాగా ఇస్తే.. షెడ్డు కట్టుకుని మనగలమని అంటున్నారు. ఇలాంటి వర్గాల అవసరాలను, ప్రయోజనాలను టీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరిస్తోంది. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి చేరడం లేదా? ప్రాధాన్యతల విషయంలో ప్రభుత్వం కచ్చితంగా విఫలమవుతోంది. వివిధ వర్గాల ప్రయోజనాలను గుర్తించడంలో, పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. నిర్ణయాలు చేసేటప్పుడు పార్టీ యంత్రాంగం, ప్రభుత్వ యంత్రా ంగం సమిష్టిగా భాగస్వామ్యం వహించటం చాలా అవసరం. అలా భాగస్వామ్యం లేనప్పుడు కూడా సమస్యలు వస్తాయి. మంత్రికి చెబితే కూడా పనులు కాకపోతే ఎట్లా? ఇది మంచి పరిణామం కాదు. అంటే సగటు మనిషి ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభు త్వానికి చేరటం లేదు. చేరుకున్నా ఒక పరిష్కారం అనేది రావటం లేదు. ఆ లింకే తెగిపోయింది. పరిష్కారానికి అవకాశం కూడా కనబడక పోయేసరికి ప్రజల ఆవేదన మరింత తీవ్రంగా ఉంటోంది. ఇవ్వాళ మల్లన్నసాగర్ ప్రజల సమస్య ఇదే. వారి ఆవేదన చెప్పుకోవాలి కదా. వినాలి కదా.. ప్రజలకు చెప్పుకోవడానికి దారులు మూసేశారు. ఫిరాయింపులపై మీ స్పందన ఏమిటి? అనైతిక రాజకీయాలకు మారుపేరే ఫిరాయింపులు. ఒక పార్టీ తనను తాను బలోపేతం చేసుకోవడానికి ప్రజాస్వా మ్యంలో ఉన్న పద్ధతి ప్రజలకు దగ్గర కావ డమే. ఇంకొక రకమైన రాజకీయాలకు స్థానం లేకుండా చేయాలి. అదే సరైన పద్ధతి. కానీ ఇంకో పార్టీ లోని రాజకీయనాయకుడిని తెచ్చుకుంటే నేను బలపడతాను అంటే, పైసలకు ఇటు వచ్చినోడు, ఇంకా ఆకర్షణ చూపితే ఇంకోవైపుకు పోడని చెప్ప గలమా? అలా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జరిగిన ప్రయత్నాన్ని రాజకీయంగానే ఎదుర్కొని ఉంటే, కచ్చితంగా ఇంకాస్త ఎక్కువ మద్దతు వచ్చేది. మేం కూడా మద్దతుగా నిలిచేవాళ్లం. ఎన్టీరామారావును 1984లో బర్తరప్ చేసినప్పుడు ఎంత పెద్ద ప్రతిస్పందన వచ్చిందో తెలుసుకదా. అప్పట్లో మేము పౌరహక్కుల సంఘంలో ఉండి అలాంటి పద్ధతులను కూడా విమర్శిస్తూ కరపత్రాలు వేశాం. అది కరెక్టు పద్ధతి అంటాను. అప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది. ఓటుకు నోటు కేసు పోన్ ట్యాపింగ్ కేసుపై మీ అభిప్రాయం? తెలంగాణలో పైసలిచ్చి ఎమ్మెల్యేలను కొనుక్కోవాలని చూడటం ఎంత తప్పో, అవతలివాళ్లు కూడా పైసలిచ్చి ఓట్లు వేయించుకోవాలని చూడటం అంతే తప్పు కదా. నువ్వు ఒక తప్పును విమర్శిస్తూ, నువ్వు అదే తప్పును చేస్తే తేడా ఏముంది. నువ్వు ఒక కొత్త ప్రతిపాదనతో ముందుకు రావాలి. ఓటుకు కోట్లు కేసులో రాజీపడ్డట్టుగా లోప ల్లోపల ఏదయినా ఉందేమో. కేసును సీరియస్‌గా పట్టించుకోవడం లేదనే అభి ప్రాయం అయితే ఉంది కానీ నేను దానిపై వ్యాఖ్యానించలేను. (కోదండరామ్‌తో ఇంటర్వూ్య పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడండి) https://www.youtube.com/watch?v=8XDbVBEP8Wg -
సకల వ్యవస్థలూ పతనమయ్యాయి!
కొమ్మినేని శ్రీనివాసరావుతో ఉమ్మడి రాష్ట్ర మాజీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి మనసులో మాట చంద్రబాబునాయుడు నిజంగా రాజనీతిజ్ఞతను ప్రదర్శించుకోవాలంటే ఫిరాంపుదారుల చేత రాజీనామా చేయించాలి. తెలుగుదేశం పార్టీపై అభిమానంతో చేరుతున్నట్లయితే ముందుగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, మళ్లీ పోటీ చేసి గెలవాలని ఆయన చెప్పాలి. స్పీకర్ల వ్యవస్థ అని కాదు. మొత్తంగా రాజకీయ వ్యవస్థే ప్రమాణాలు కోల్పోతోంది. స్పీకర్ల వ్యవస్థ పతనం మొత్తం రాజకీయ వ్యవస్థ పతనంలో భాగంగానే చూడాలని ఉమ్మడి రాష్ట్ర శాసనసభ మాజీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి అన్నారు. మొత్తం వ్యవస్థే తన ప్రమాణాలు కోల్పోతోందని. కేవలం హైదరాబాదుకూ, ఏపీకే పరిమితం కాకుండా. ఢిల్లీలోనూ ఇలాగే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ అంత ప్రజాస్వామికవాదిని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని, సభాపతి విధుల్లో తానెన్నడూ జోక్యం చేసుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాణం పోసిన రాజశేఖర రెడ్డి కుటుంబం కాంగ్రెస్‌కు దూరం కావడం బాధాకరమంటున్న మాజీ స్పీకర్ కె.ఆర్. సురేష్ రెడ్డి ‘మనసులో మాట’లో చెప్పిన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... మీ బాల్యం ఎలా సాగింది? పాఠశాల చదువు హైదరాబాద్‌లోనే జరిగింది. చిన్నప్పటినుంచి నేటివరకు రెండు ప్రపంచాల్లో బతుకుతూ వస్తున్నాను. ఒకవైపు నగరజీవితం, మరోవైపు పల్లె జీవితం. మీ కుటుంబ వ్యవహారాలు, వివాహ జీవితం? నా లవ్ స్టోరీ నా భార్య పుట్టిన క్షణం నుంచే స్టార్ట్ అయింది. మేనరికం మాది. నా భార్యపేరు పద్మజ. ఆమె పుట్టిన రెండో నిమిషంలోనే నీ భర్త సురేష్ రెడ్డి అని చెప్పేశా రట. ఇంకేముంది.. డిక్లేర్ అయింది. అలా చిన్నప్పుడే లవ్‌స్టోరీ మొదలైపోయింది. రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? మా నాన్న, తాత కూడా రాజకీయాల్లో ఉండేవారు. తాతయ్య చౌటుపల్లి హనుమంతరెడ్డి స్వాతంత్ర సమరయోధులు. నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉండేవారు. ఆంధ్రప్రదేశ్ ఏకీకరణ ప్రకటనను జవహర్లాల్ నెహ్రూ మొదటిసారిగా నిజామాబాద్‌లోనే ప్రకటించారు. తాత జిల్లా పరిషత్ చైర్మన్ గా, ఎమ్మెల్సీగా, నాన్న సమితి అధ్యక్షులుగా పనిచేశారు. ఆ వారసత్వంలో భాగంగా 4సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. స్పీకరుగా ఉన్నప్పుడు మీకు సంతృప్తి కలిగించిన సన్నివేశం ఏది? ఒక్కమాటలో చెప్పాలంటే శాసనసభకు విజిబిలిటీ తీసుకొచ్చాను. గ్రామీణుల నుంచి అమెరికాలో ఉండేవారి వరకూ శాసనసభ వ్యవహారాలను చూడాలి అనే ఆసక్తి కలిగించాను. సభలో చర్చ జరగాలి. డిబేట్ కావచ్చు.. అల్లరి కావచ్చు.. ఏదైనా కానీ.. హౌస్‌లో ఏదో ఒకటి జరుగుతూనే ఉండాలి. దాంతో అప్పుడ ప్పుడూ డిబేట్‌తో పరిష్కారాలు వస్తాయి. అల్లరితో కూడా పరిష్కారాలు వస్తాయి. వైఎస్సార్, చంద్రబాబుపై మీ అభిప్రాయం? వైఎస్సార్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొద్దిగా మాట్లాడి ఎక్కువ సమయం తన పార్టీ సభ్యులకు ఇచ్చేవారు. బాబు ఎక్కువ సమయం ఆయన మాట్లాడి, తర్వాత మిగ తావారికి ఇచ్చేవారు. స్పీకర్ల స్వతంత్రతపై మీ అనుభవం? అయిదేళ్లు సభాపతిగా పనిచేశాను. ఈ మొత్తం కాలంలో వైఎస్సార్ మూడుసార్లు మాత్రమే నా వద్దకొచ్చారు. ‘‘సభ గురించి కాదు. సభలో ఈ కార్యక్రమాలు జరుపు కుంటాం అధ్యక్షా అనుమతి ఇవ్వండి’’ అని అడగడానికి వచ్చారు. మరెన్నడూ కూడా ఆయన నా విధుల్లో జోక్యం చేసుకోలేదు. ఒకసారి జలయజ్ఞంపై ప్రదర్శన, ఇంకోసారి శాసనసభ 50 ఏళ్ల ఉత్సవాలు జరుపుకోవడం మీదా, అంతకుముందు రాష్ట్రపతిని శాసనసభకు మొదటిసారి ఆహ్వానించడానికి సంబంధించి ఈ మూడుసార్లు మాత్రమే వైఎస్ నాతో నేరుగా సంప్రదించారు. ఆయన నిజమైన ప్రజాస్వామికవాది. పార్టీనే విలీనం చేసుకుంటున్నా, డబ్బులిచ్చి కొనుక్కున్నా స్పీకర్లు స్పందించడం లేదు? ఒక ఎమ్మెల్యే తన పార్టీకి రాజీనామా చేసి మరో పార్టీలో చేరి మంత్రి అయ్యాడు. అది కచ్చితంగా కేసే అవుతుంది. దానిగురించి ఆలోచించాల్సిన పనే లేదు. పార్టీనే విలీనం చేశారంటే కచ్చితంగా కేసుపెట్టాల్సిన విషయం. స్పీకర్ల వ్యవస్థ ప్రమాణాలు ఏమవుతున్నాయి? ఇదంతా కూడా ఒక చిన్న ప్రతిఫలనం. స్పీకర్ల వ్యవస్థ అని కాదు. మొత్తంగా రాజకీయ వ్యవస్థే ప్రమాణాలు కోల్పోతోంది. ఇది కేవలం హైదరాబాదుకే పరిమితం కాదు. ఢిల్లీలోనూ ఇదే జరుగుతోంది. ఢిల్లీలోనూ ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తి మరొక పార్టీలో చేరాడు. అక్కడా చర్యలు లేవు.హైదరాబాదుకు ఆదర్శం ఢిల్లీ. ఢిల్లీకి మరొకటి ఆదర్శం. ఎమ్మెల్యేలను పశువుల్లాగా కొంటున్నారన్న చంద్రబాబే ఇప్పుడా పని చేశారు కదా? బాబు నిజంగా రాజనీతిజ్ఞతను ప్రదర్శించుకోవాలంటే ఫిరాయింపుదారుల చేత రాజీనామా చేయించాలి. టీడీపీపై అభిమానంతో చేరుతున్నట్లయితే ముందు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేసి మళ్లీ గెలవాలి అని ఆయన చెప్పాలి. ఓటుకు కోట్లు కేసులో పట్టుబడ్డాక కూడా దాన్ని ఒక తార్కిక ముగింపుకు తీసుకెళ్లకుండా అలాగే ఆపుతున్నారు. వైస్ కుటుంబంమీద కాంగ్రెస్ పార్టీ కక్ష పూని, కేసు పెట్టిందా? కాంగ్రెస్ పార్టీకి వైఎస్సార్ ఉమ్మడి ఏపీలో ప్రాణం పోశారు. అలాంటి మనిషి కుటుంబం ఈరోజు ఇబ్బందికరమైన వాతావర ణంలో ఉందంటే బాధగానే ఉంది. కానీ దానికి కారణం కమ్యూనికేషన్ గ్యాపే కాని కాంగ్రెస్ అధిష్టానం కాదు. హైకమాండ్‌కి రాష్ట్రానికి మధ్య రాయబారాలు నడిపే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యదర్శులు మొత్తం వ్యవహారాన్ని సరిగా మ్యానేజ్ చేయలేకపోయారనన్నదే నా ఫీలింగ్. వైఎస్ చనిపోన తర్వాత జగన్ ని ఏ విధంగా ప్రోత్సహించాలి, ఏవిధంగా ఆయనకు విశ్వాసం కల్పిం చాలి అనే విషయంలోనూ సరిగా వ్యవహరించలేదు. మరోవైపు పార్టీని వీడకముందు జగన్ తీసుకున్న చర్యలను సరైన స్ఫూర్తిలో హైకమాండ్ ముందుకు తీసుకెళ్లలేకపో యారు. దీంతో గ్యాప్ ఎక్కువైన మాట వాస్తవమే. జగన్‌కి రాజకీయంగా కొంత అన్యాయం జరిగిన మాట వాస్తవమే. ఎన్టీఆర్, బాబు, వైఎస్సార్, కిరణ్‌కుమార్ రెడ్డిపై మీ అభిప్రాయం? ఎన్టీఆర్ అత్యంత ఆకర్షణీయమైన మనిషి. సినిమా రంగంలోంచి వచ్చారు. మంచి మనిషి. ఏదైనా ప్రాంతాన్ని చూసిన తర్వాత వెంటనే దానిపై నిర్ణయం ప్రకటించేవారు. ఇక బాబు. అన్ని వివరాలను తను సమగ్రంగా చూసేవారు. అంతా సరిగా ఉందంటేనే ఒకే అనేవారు. అలా ముందు జాగ్రత్త పడేవారు. తర్వాత వైఎస్సార్.. ప్రజల్లో 20 లేదా 30 ఏళ్లు మెలిగారు కాబట్టి ఏ గుండె ఏం కోరుకుంటోంది అనే సమాచారం వారి చేతుల్లో ఉండేది. మంచిమనసుతో వచ్చాడు కాబట్టే రాష్ట్రానికి రెవెన్యూ కూడా బాగా పెరిగింది. సంక్షేమానికి, అభివృద్ధికి ఆరోగ్యానికి, విద్యకు ఇలా ఉమ్మడి ఏపీని ఎంత డైనమిక్ స్టేట్‌గా మల్చారంటే.. నేను 20 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జిల్లాలకు అన్ని నిధులు ప్రకటించడం ఎప్పుడూ చూడలేదు. ముఖ్యంగా ఆయన ప్రారంభించిన జలయజ్ఞం ఒక గేమ్ చేంజర్. ఆనాటి స్పీకర్ రామకృష్ణుడు ఎన్టీఆర్‌కు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు కదా? ఆ విషయంపై రామకృష్ణుడిని మీరు అడిగితే తప్పనిసరిగా ఇప్పుడు బాధపడతారని నా అభిప్రాయం. ఒక సీఎం ఉన్నట్లుండి పదవి కోల్పోయిన సంక్షోభ పరిస్థితుల్లో సభను రక్షించేవాడు సభాపతే. నిన్నటిదాకా సీఎంగా ఉన్న వ్యక్తిని మీరు మాట్లాడటానికి లేదని సభాపతి అన్నారంటే అది తర్వాతయినా పశ్చాత్తాపపడాల్సిన విషయమే. (కె.ఆర్. సురేష్ రెడ్డితో ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని కింది లింకులో చూడండి) https://www.youtube.com/watch?v=fYydXz83IEM -
ప్రత్యేకహోదా ద్రోహులు ఆ ఇద్దరే!
కొమ్మినేని శ్రీనివాసరావుతో సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ మనసులో మాట 'ఆంధ్ర ప్రజానీకాన్ని పట్టపగలే మోసం చేసిన ఘటన ఏదైనా ఉందంటే అది ప్రత్యేకహోదానే. అధికారంలోకి రాగానే హోదా ఇచ్చేస్తామని చెప్పి 13 జిల్లాల్లో తిరిగి సన్మానాలు చేయించుకున్న వెంకయ్య, 15 ఏళ్లు హోదా సాధిస్తానన్న చంద్రబాబు చివరకు సన్మానాలే సిగ్గుపడే స్థాయిలో ప్రచార యావలో మునిగి ప్రజలను నిండా ముంచేశారు.' వామపక్ష ఉద్యమనేతగా పదునైన భాష, పరుషమైన వ్యాఖ్యలతో తనదైన శైలిలో రాజకీయాలు చేసే సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ అధికారంలో లేనప్పుడు ఒకలా, అధికారం వచ్చిన ప్పుడు మరొకలా మాట్లాడటం మొదట్నుంచి చంద్రబాబు నైజమ న్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర ప్రజలను నిండా ముంచింది అటు వెంకయ్య, ఇటు బాబేనన్నారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితేనే నిర్భందిస్తున్నారనీ, మాట తప్పిన తర్వాత కేంద్రమంత్రైనా, సీఎంనయినా కడిగి పారేసే హక్కు ప్రజల కుందంటున్న నారాయణ మనసులోని మాట ఆయన మాటల్లోనే... మీ రాజకీయ ప్రస్థానం ఎలా ఆరంభమైంది? మాది చిత్తూరు జిల్లా. పూర్తిగా రాజకీయేతర కుటుంబంలోనే పుట్టి పెరిగాను. మదనపల్లిలో బీటీ కాలేజీలో పీయూసీ చదివాను. ఆయుర్వేదిక్ మెడిసిన్ చేయమని మా డాక్టర్ సలహా ఇస్తే నాన్న నన్ను గుంటూరుకు పంపించారు. అక్కడ యూనియన్లలో తిరగడం, ఏఐఎస్‌ఎఫ్‌తో పరిచయం, ఎస్ఎఫ్ కార్యదర్శిగా, జిల్లాకార్యదర్శిగా అయ్యాను. తర్వాత పార్టీ ఆదేశానుసారం చిత్తూరుకు వచ్చేశాను. ఎన్టీరామారావు, రాజశేఖరరెడ్డిపై మీ అభిప్రాయం? రామారావు రాజకీయేతర రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. లాభనష్టాలతో పనిలేకుండా భావోద్వేగంతో నిర్ణయం తీసుకునేవాడు. అది తప్పు కావచ్చు రైటు కావచ్చు. కరణాల వ్యవస్థను ఎన్టీఆర్ కాకపోతే మరె వరైనా రద్దు చేసేవారా? ఎవరికైనా సాధ్యం అయ్యేదా? ఇక రాజశేఖర రెడ్డి.. రాజకీయాల్లో ఉండతగిన వ్యక్తి. సాక్షి టీవీ కోసం ఇలా చెప్పడం లేదు. వ్యక్తిత్వంలో, స్పందనల్లో, సంబంధాల్లో, రాజకీయ భాషలో ఆయన నిఖార్సైన వ్యక్తి. సహాయ పడే తత్వం. అందరితో మాట్లాడి పనులు చేసుకునే విషయంలో వైఎస్సార్‌ను బాగా ఇష్టపడతాను. గత రెండున్నరేళ్ల బాబు పాలనపై మీ వ్యాఖ్య? మాటలెక్కువ చేతలు తక్కువ. మైకు పట్టుకుంటే విసుగు కలిగిస్తూ, గంటల తరబడి మాట్లాడతాడు. లోపల సరుకుంటే రెండు మాటలు చాలు. సరుకు లేనప్పుడు ఎక్కువ చెప్పు కోవాలి. రకరకాల పద్ధతుల్లో బుకాయించాలి. మొత్తం రుణాలు మాఫీ చేసేశానంటున్నాడు. కదా? మాఫీ కాలేదు. కాకపోగా రైతులపై వడ్డీలు కూడా వసూలు చేసే పరిస్థితి వచ్చింది. ఒకేసారి రుణాలు మాఫీలు చేయాలని కొట్లాడితే నాలుగు దఫాలుగా మాఫీ చేస్తానని పెట్టాడు. ఎన్నికల ప్రణాళికలో మొదట చెప్పింది టీడీపీయే. ఇచ్చిన హామీని అమలు చేయలేదు. రాజధాని సమస్యపై మీ వ్యాఖ్య ఏమిటి? 30 వేల ఎకరాలు సేకరించినట్లు చెప్పినప్పడు మేం వ్యతిరే కించాం. అన్ని వేల ఎకరాలు నీకెందుకు అని ప్రశ్నించాం. బిల్డర్ల అభివృద్ధికి ఈ భూములను ఇవ్వడాన్ని ఒప్పుకోమన్నాం. రెండు లేక మూడువేల ఎకరాలకు మించి తీసుకుంటే కుదరదన్నాం. రెండేళ్లలోపే హైదరాబాద్ వదిలి వెళ్లవలసిన అవసరం ఏంటి? నా ఉద్దేశంలో ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తరలి పోయి ఉండాలి. ఎంత ముందుగా వెళ్లితే అంత మంచిని నా భావన. కానీ బాబు వెళ్లలేదు. ఇక్కడే పదిహేనేళ్లపాటు తిష్ట వేసుకుని కూర్చో వాలనుకున్నాడు. తర్వాత అనేక ఇబ్బందులు వచ్చాయి. చివరకు తప్పనిసరై వెళ్లిపోవాల్సి వచ్చింది. మీరు గుర్తించిన ఇబ్బందులు ఏమిటి? ఒకటి అడ్మినిస్ట్రేషన్ సమస్య. ఇక్కడ కూర్చుని అక్కడ పాలన చేస్తే పట్టు రాదు. అభివృద్ధి కాదు. పని చేయలేడు. రెండోది ఓటుకు కోట్లు కేసు గొడవ. నోటీసులు, కేసులు.. అంటూ ముఖ్యమంత్రి వెంట పోలీసులు పడుతూంటే ఎంత భయశనంగా ఉంటుంది? విపక్ష ఎమ్మెల్యేలను బాబు లాగేసుకున్నారు కదా..? ఇలాంటి పనులు బాబు అధికారంలోకి రాకముందే మొదలు పెట్టాడు. జేసీ దివాకర్ రెడ్డివంటి వారికి ఎంపీ సీటు ఇచ్చాడంటేనే అర్థమవుతుంది కదా. తర్వాత అవసరమైన ఎమ్మెల్యేల బలం ఉండి కూడా, ప్రతిపక్షమే ఉండకూడదనే పద్ధతుల్లో రకరకాలుగా ఫిరాయింపులకు దిగాడు. ప్రత్యేక హోదా పరిణామాలపై మీ వ్యాఖ్య? పట్టపగలే ఆంధ్ర ప్రజానీకాన్ని మోసం చేసిన ఘటన ఏదైనా ఉందంటే అది ప్రత్యేక హోదానే. రాజ్యసభ చర్చలో వెంకయ్య నేరుగా పాల్గొన్నాడు. సాంకేతిక కారణాలతో దాన్ని బిల్లులో పెట్టలేదు. వెంకయ్య ఒత్తిడి పెడితే నాటి ప్రధాని 5ఏళ్లపాటు హోదా ప్రకటించారు. వెంటనే వెంకయ్య లేచి మాకు పదేళ్లు కావాల న్నాడు. బయటికి వచ్చి మేము అధికారంలోకి రాబోతున్నాం. రాగానే హోదా ఇచ్చేస్తాం అని కూడా మీసాలు తిప్పాడు. ఇక్కడేమో 13 జిల్లాల్లో తిరిగి వెంకయ్య మనకు దేవుడు అని బేజీపీ వాళ్లు ప్రచారం చేసుకు న్నారు. ఊరేగించారు. వెంకయ్యకే పేరు వచ్చే స్తోందే అని దుగ్ధతో తాను 15 ఏళ్ల హోదా తెచ్చేస్తానని బాబు ప్రకటించేశారు. ఇప్పుడైతే హోదా అనేది సంజీవని మూలికా.. అదొక మేక లింగాల వంటింది అనే మాట చెబుతారు. ఆరోజు హోదా పేరుతో సన్మానం మీద సన్మానం చేయించుకున్నోళ్లు, ఇప్పుడు మాత్రం ప్రత్యేక ప్యాకేజీ తెస్తున్నామంటూ మరొక సన్మానం చేయించుకుంటున్నారు. అంటే సన్మానాలే అవమానపడే పరిస్థితి వచ్చేసింది. హోదానడిగితే కేసులు పెడతామంటున్నారే? ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితేనే మూసేస్తున్నారు. అందరూ కలిసి అనుకుని, ఆమోదించిన ప్రత్యేక హోదాను అడిగితే కూడా మమ్మల్ని జైల్లో పెడుతున్నారు. చివరకు వెంకయ్య సన్మానం చేసుకోవాలంటే అర్థరాత్రి కమ్యూనిస్టులను లోపల పడేశారు. రెండు రాష్ట్రాల ప్రజలకు మీ సందేశం? రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజానీకం ప్రజావ్యతిరేక విధానాలపైన మరింతగా పోరాడాల్సి ఉంది. పాలకవర్గాలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ, హక్కుల్ని హరిస్తున్నాయి. వీటన్నింటిపై అప్రతిహ తంగా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులకు ఉంది. కలసి రమ్మని కోరుతున్నాం. -
రోశయ్యతో మనసులో మాట