‘నోట్ల’ రద్దుతో నల్లడబ్బు చిత్తు? | new currency will reduce some black money | Sakshi
Sakshi News home page

‘నోట్ల’ రద్దుతో నల్లడబ్బు చిత్తు?

Published Thu, Nov 10 2016 1:06 AM | Last Updated on Wed, Apr 3 2019 5:16 PM

‘నోట్ల’ రద్దుతో నల్లడబ్బు చిత్తు? - Sakshi

‘నోట్ల’ రద్దుతో నల్లడబ్బు చిత్తు?

కొత్త కోణం
పెద్ద నోట్లను రద్దు చేస్తారనే ప్రచారం గత తొమ్మిది నెలలుగా సాగుతున్నది. దీంతో వ్యాపార, వాణిజ్య వర్గాలు, రియల్టర్లు, కాంట్రాక్టర్లు, రాజకీయవేత్తలు తదితర అక్రమార్జనా పరులంతా ముందే నల్ల సొత్తును వేరే రూపాల్లోకి మార్చుకున్నారని పరిశీలకులు అంటున్నారు. విదేశాల్లోని నల్ల ధనాన్ని వెనక్కి తీసుకొస్తామన్న బీజేపీ... ఆ వాగ్దానాన్ని అమలు చేయకపోవడం వల్ల వచ్చే నిరసనను పక్కదోవ పట్టించడానికే ఈ పెద్ద నోట్ల రద్దు విన్యాసానికి పాల్పడిందని పరిశీలకుల భావన.
 
ఐదు వందల నోట్లు, వెయ్యి నోట్లు మంగళవారం అర్ధరాత్రి నుంచి చెత్త కాగి తాలతో సమానం. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రాత్రి  సగర్వంగా ఈ విషయాన్ని ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక అత్యంత సంచలనాన్ని కలిగించిన వార్త ఇది. పెద్ద నోట్ల రద్దుకు ప్రభుత్వం మూడు ముఖ్య కారణాలను చూపుతోంది. ఒకటి, నల్లధనాన్ని కట్టడి చేయడం. రెండు, దొంగనోట్ల చలామణిని అడ్డుకోవడం. ఇక చివరిది, ఉగ్రవాదులకు అందుతున్న ఆర్థిక సాయాన్ని నిరోధించడం. పెద్ద నోట్ల రద్దు దొంగనోట్ల చలామణిని, టైజం వ్యాప్తిని అరికట్టేందుకు కొంత ఉపయోగ పడవచ్చు. కానీ అది ఉగ్రవాదానికి శాశ్వత పరిష్కారం కాదు.

దొంగనోట్లను ముద్రించే ఆలోచన, టెక్నాలజీ ఉన్నంత వరకు ఇటువంటి ప్రక్రియ ఆగదు. అధునాతన సాంకేతికతతో ఎక్కువ భద్రతా ప్రమాణాలుగల కొత్త నోట్ల జారీ వల్ల దొంగ నోట్ల ముద్రణకు  కొంత ఎక్కువ సమయం పడుతుందేమో కానీ, అసాధ్యం కాదనేది స్పష్టమే. ఉగ్రవాదులకు అందే నిధులకు దొంగనోట్లు ఒక మార్గం మాత్రమే. వివిధ ఇతర పద్ధతుల్లో కూడా అందుతున్నాయి. అందువల్ల ఈ నోట్ల రద్దు వల్ల ఉగ్రవాదులకు లభించే ఆర్థిక సాయం ఉధృతి తగ్గడం మాత్రమే జరుగుతుంది. కాబట్టి ఈ చర్యతో ఉగ్రవాదం ఆగిపోతుందనేది అర్ధ సత్యం మాత్రమే. దీర్ఘకాలంలో సైతం కొత్త నోట్ల గుట్టును వాళ్లు ఛేదిం చరని అనుకోలేం. పైగా ఉగ్రవాదాన్ని వివిధ దే శాలు పెంచి పోషిస్తున్నాయి.
 
ముందే సర్దుకున్న నల్లధనం వీరులు
ఖరీదైన నోట్ల రద్దుకు సంబంధించి అతి ముఖ్య అంశం నల్లధనాన్ని సమూ లంగా నిర్మూలించడమే. నల్లధనం పోగుపడటానికి ప్రధాన కారణం పన్నుల ఎగవేత. పన్నులు చెల్లించడం ఇష్టం లేనివాళ్ళు, లెక్కలేనంత డబ్బుని రకర కాల పద్ధతుల్లో, ముఖ్యంగా చట్టవ్యతిరేక పద్ధతిలో సంపాదించిన వాళ్లు ఆ అక్రమార్జనను నల్లడబ్బుగా దాచేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా  పుంజుకున్న తర్వాత ఇది మరింత పెరిగింది. గత ముప్ఫయ్ ఏళ్లుగా ఆర్థిక సరళీకరణ, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌లు ఆర్థిక రంగంలో ప్రధాన పాత్ర పోషిస్తుండటంతో డబ్బు కొంత మంది చేతుల్లో కుప్పలుపడిపోతోంది. ఇలా పోగుబడ్డ నల్లడబ్బు అకస్మాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేస్తే  బయటకు వస్తుం దనీ, లేదంటే పనికి రాకుండా పోతుందనీ ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఆచరణలో అది జరుగుతుందా? అసలు ఇది నిజంగా హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమేనా? సామాన్యులందరినీ అది ఆశ్చర్యపరిచింది నిజమే. కానీ ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేస్తారనే ప్రచారం గత తొమ్మిది నెలలుగా సాగున్నది.

అంతకు ముందు ఇన్‌కం డిక్లరేషన్ స్కీంను ప్రవేశ పెట్టారు. ఆ పథకం కిందనే రూ. 65 వేల కోట్లకు పైగా నల్లధనం బయట పడింది. అంటే ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయనున్నదని వ్యాపార, వాణిజ్య వర్గాలు, రియల్టర్లు, కాంట్రాక్టర్లు, రాజకీయ వేత్తలు ముందే గ్రహిం చారు. అందువల్లనే భారీ నల్లధనం వీరులంతా నగదు రూపంలోని తమ నల్ల ధనాన్ని వేరే రూపాల్లోకి మార్చుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నల్లడబ్బులో ఎక్కువ భాగాన్ని హవాలా మార్గాల గుండా సరిహద్దులు దాటించేసి ఉంటారు. లేదా బులియన్ (బంగారు, వెండి) మార్కెట్‌లోకి మళ్లించేసి ఉంటారు.  కొందరు భూములు కొనుగోలు చేస్తే, మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలను ప్రారంభించారు. లెక్కలేనంత డబ్బుని సంపా దించిన అక్రమార్జనాపరులు అమాయకులు అనుకోవడం పొరపాటు. బడా బడా నల్లధనం చోరులు ఈ ప్రకటనతో హతాశులయ్యారంటే నమ్మలేం.
 
నిజానికి ఈ చర్య వల్ల తక్షణం చిక్కుల్లో పడినది చిన్న వ్యాపారస్తులు, చోటా మోటా కాంట్రాక్టర్లు, చిన్న ప్రభుత్వోద్యోగులు. వారంతా బ్యాంకుల ముందు క్యూల్లో పడిగాపులు పడుతూ చేయని నేరానికి శిక్షను అనుభవిం చాలి. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేద ప్రజలు విస్తృతంగా వాడు కలో ఉన్న ఐదు వందల నోట్ల రద్దు వల్ల కొన్ని వారాలైనా తిప్పలు పడక తప్పదు. ఇక దిగువ తరగతి పౌరులైతే రోజువారీ కార్యక్రమాలకు, కొను గోళ్లకు చేతిలో డబ్బున్నా అది చెల్లక నానా తిప్పలూ పడ్డారు, పడ తారు. దేశ ప్రయోజనాలు, దేశ భద్రతల కోసం చేపట్టిన ఈ చర్య వల్ల కలిగే తాత్కాలిక ఇబ్బందుల్ని సంయమనంతో భరించాలని ప్రధాని మోదీయే స్వయంగా పిలుపునిచ్చారు. ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యాలు ఈ చర్యల వల్ల నెరవేరితే తాత్కాలికంగా వచ్చే ఇబ్బందులను భరించడం కష్టమేమీ కాదు. సాధారణ ప్రజానీకం ఎప్పుడూ అవినీతిని అరికట్టాలని కోరుకుంటారు. కానీ ఆశిస్తున్న ఫలితాలు లభిస్తాయా అనేదే ప్రశ్నార్థకంగా ఉంది.
 
‘రద్దు’ కొత్తా కాదు, నల్లధనం ఆగిందీ లేదు
ఇలా నోట్లను రద్దు చేయడం కొత్తేమీ కాదు. స్వాతంత్య్రానికి ముందూ, వచ్చాక కూడా ఎక్కువ విలువైన నోట్లను రద్దు చేశారు. అప్పుడూ ఇలాంటి కారణాలనే చెప్పారు. ఆ లక్ష్యాలను సాధించగలిగారా? లేదు. నల్లధనం పెరు గుతూనే పోయి, ప్రభుత్వాలు అదుపు చేయలేనిదిగా మారింది. గతంలో 1946లో, 1978లో కొన్ని పెద్ద నోట్లను రద్దు చేశారు. 1946లో వెయ్యి, పది వేల రూపాయల నోట్లనూ, 1978లో వెయ్యి, ఐదు వేలు, పది వేల నోట్లనూ రద్దు చేశారు. అయినా నల్లధనం రద్దు కాలేదు. పైగా గతంలో ఎన్నడూ లేని విధంగా పోగుపడింది. 2006 నాటికి స్విస్ బ్యాంకుల్లోని భారతీయుల నల్ల డబ్బు రూ. 96,80,200 కోట్లని అంచనా. నేటి మన ప్రధాని 1978 నాటి మాటలనే తిరిగి చెబుతున్నారు. ఇప్పుడు మరో మారు పెద్ద నోట్లను రద్దు చేసినా... మళ్లీ మళ్లీ నల్లడబ్బు పుడుతూనే ఉంటుంది.

పెద్ద నోట్ల రద్దు నల్ల ధనాన్ని అరికట్టలేరని చరిత్ర చెబుతోంది. విదేశీ బ్యాంకుల్లోని ఉన్నదానితో సహా మొత్తం నల్ల డబ్బుని వెలికితీస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. కానీ అది ఇంతవరకు జరగలేదు. విదేశాల్లోని నల్లధనాన్ని రాబట్టడానికి ఏ ప్రయత్నం చేశారంటే ఎక్కడా సమాధానం లేదు. అది జరు గుతుందన్న నమ్మకం ప్రజలకు అంతకన్నా లేదు. ఆ వాగ్దానం అమలును వెనక్కు నెట్టి, నోట్ల రద్దుతో స్వదేశంలోని నల్లధన నిర్మూలనకు పూనుకున్నట్టు ప్రకటించడంలో అంతరార్థం ఏమిటో ప్రజలే ఆలోచించాలి.
 
నల్లధనాన్ని అరికట్టాలనుకోవడం ఉన్నతాశయమే. ఆచరణ సాధ్యంకాని విషయమేం కాదు. కానీ, నల్లధనాన్ని అరికట్టడాన్ని ఆచరణలో చేసి చూపిన ప్రభుత్వం ఇంతవరకు లేదు. ఎందుకంటే ఈ దేశంలో సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమై ఉన్నది. మన రాజ్యాంగంలో సోషలిజం అనే లక్ష్యాన్ని చేర్చుకున్నప్పటికీ, నిలువుదోపిడీ చేస్తున్న పెట్టుబడిదారీ విధానం అమలులో ఉన్నది. 1990 తర్వాత వచ్చిన ఆర్థిక సంస్కరణలు పారిశ్రామిక వేత్తలకు, కాంట్రాక్టర్లకు, రాజకీయ నాయకులకు మరింతగా దేశసంపదను దోచుకొనే అవకాశాన్ని క ల్పించాయి. 1990 వరకు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు దోపిడీలో నేరుగా కనిపించేవారు. ఆ తర్వాత ఎటువంటి పెట్టుబడి పెట్టే అవసరం లేకుండా, పరిశ్రమల స్థాపన కూడా లేకుండా వందల కోట్లు సంపా దించే వ్యవస్థ ఉనికిలోనికి వచ్చింది.
 
రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలుగా, వ్యాపారవేత్తలు రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తారు. రాజ కీయవేత్తలు, వ్యాపారవేత్తల మధ్య ఒక అక్రమ సంబంధం ఏర్పడింది. దానితో బడ్జెట్ రూపంలో ఉన్న ప్రజా ధనాన్ని గనులు, అడవులు, ఖనిజాలు, సహజవనరులను రాజకీయ నాయ కుల అండదండలతో స్వాధీనం చేసుకొని మన కళ్ల ముందే వేల కోట్లకు అధిపతులైన వారు ఉన్నారు. దీనినే క్రోనీ క్యాపిటలిజం (ఆశ్రీత పెట్టుబడి దారీ విధానం)అంటున్నారు. ప్రభుత్వాలు చేపట్టే రోడ్లు, భవనాలు, నౌకా శ్రయాలు, విమానాశ్రయాల నిర్మాణంలో కాంట్రాక్టర్లు, రాజకీయ నాయ కులు, ప్రభుత్వోద్యోగులు సగానికి సగం డబ్బును వాటాల రూపంలో పంచు కుంటున్నారు. ఇటువంటి పద్ధతుల్లో వచ్చిన డబ్బును లెక్కలలో చూపలేరని అందరికీ తెలుసు. ఒకవేళ చూపినా, భారీగా పన్నులు చెల్లించాల్సి వస్తుంది. పన్ను చెల్లించని డబ్బంతా నల్లధనంగా మారిపోతుంది. నేడు పెద్ద నోట్లను రద్దు చేశాక, విడుదలయ్యే కొత్త నోట్లను మళ్లీ దాచేయరని నమ్మకం ఏమిటి? పైగా దాచుకోడానికి అనువుగా 2,000 రూపాయల నోట్లను ప్రవేశ పెడు తున్నారు.
 
రద్దు రాజకీయ గారడీ
బీజేపీ ఎన్నికల ప్రణాళికలో విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తానని చెప్పడం మనందరికీ గుర్తుంది. ఆ వాగ్దానాన్ని అమలు చేయకపోవడం వల్ల వచ్చే నిరసనను పక్కదోవ పట్టించడానికి ఇటువంటి విన్యాసాలకు పాల్పడు తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. విదేశాల్లో ఉన్న డబ్బుకు మరింత చట్టబద్ధత కల్పించడానికి ఎఫ్‌డీఐల పేరుతో విదేశాల్లోని భారతీయ పెట్టుబడి దారులు దాచుకున్న డబ్బుకు స్వాగతం పలుకుతూ కేంద్రం చట్టాలు చేసింది. ఇక్కడ పన్నులను ఎగ్గొట్టి నల్లధనాన్ని విదేశాల్లో దాచుకొని, మళ్లీ అదే డబ్బుని ఎఫ్‌డీఐ పేరుతో దొడ్డిదారిన ఆహ్వానించడానికి ప్రయత్నిస్తున్న ప్రభు త్వాలు నల్లధనం నిర్మూలన గురించి మాట్లాడటం హాస్యాస్పదం.
 
త్వరలో జరగనున్న  ఉత్తరప్రదేశ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన చర్యే ఇది అనే విమర్శ కూడా వ్యక్తం అవుతోంది. ప్రత్యర్థుల ఆధీనంలో ఉన్న నల్లడబ్బుని నిర్వీర్యం చేసి, బీజేపీ తనకు అనుకూలంగా పరిస్థితిని మార్చు కునే ప్రయత్నం చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా ఆ పార్టీకి లాభం చేకూర్చు తుందేమోకానీ, నల్లడబ్బును అరికట్టడానికి ఏమాత్రం ఉపకరించదు. సంప దను పోగేసుకునే అవకాశం ఉన్నంత కాలం... రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తల కుమ్మక్కుతో ప్రజాధనాన్ని, సహజ వనరు లను యథేచ్ఛగా దోచుకుంటున్నంత కాలం నల్లధనాన్ని నిర్మూలించడం సాధ్యం కాదు. అనేక పద్ధతుల్లో, రూపాల్లో మళ్లీ మళ్లీ నల్లధనం పుట్టుకొ స్తూనే ఉంటుంది.
 


మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు  మొబైల్ : 97055 66213

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement