Nikesha Patel
-
పవన్‌తో తొలి సినిమా.. తర్వాత కెరీర్ ఖతం.. ఈ హీరోయిన్ ఎవరంటే?
హీరోయిన్గా తొలి సినిమా అనగానే సదరు బ్యూటీస్ బోలెడన్ని ఆశలు పెట్టేసుకుంటారు. ఒకవేళ స్టార్ హీరో మూవీ అయితే అదృష్టమంటే తమదే అని ఫిక్సయిపోతారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే అనుకుంది. ఏకంగా పవన్ కల్యాణ్ సినిమాతో హీరోయిన్గా కెరీర్ ప్రారంభించింది. కానీ ఏం లాభం.. మూవీ డిజాస్టర్ కా బాప్ అయింది. మరి ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?యూకేలో సెటిలైన గుజరాతీ ఫ్యామిలీలో 1990లో పుట్టింది నికీషా పటేల్. టీనేజీలో ఉన్నప్పుడే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. మిస్ ఇండియా యూకే విజేతగా నిలిచింది. 15 ఏళ్లకే బీబీసీలోని పలు షోల్లోనూ పాల్గొంది. యాక్టర్ అవుదామని చెప్పి బాలీవుడ్‌లోకి వచ్చింది. ఛాన్స్ వచ్చినట్లే వచ్చి ఓ సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత తెలుగులో పవన్ 'కొమరం పులి' మూవీలో అవకాశమొచ్చింది.(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 'పుష్ప' విలన్ జాలిరెడ్డి)తొలి సినిమా హిట్ అయితే హీరోయిన్ గా సెటిలైపోవచ్చని నికీషా పటేల్ అనుకుంది. కానీ ఇది కాస్త డిజాస్టర్ అయిపోవడంతో తర్వాత కెరీర్ ఖేల్ ఖతం అయిపోయింది. 'ఓం 3డి', అరకు రోడ్డులో, గుంటూరు టాకీస్ 2.0 లాంటి సినిమాల్లో నటించింది. తమిళ, కన్నడలోనూ పలు చిత్రాల్లో నటించింది. ఇవేవి అయ్యే పనుల్లా కనిపించలేదు. దీంతో అయిందేదో అయిందని 2019 తర్వాత పూర్తిగా యాక్టింగ్ పక్కనబెట్టేసింది.34 ఏళ్ల నికీషా పటేల్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి యూకేలోనే ఉంటోంది. అప్పుడప్పుడు హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉన్నంతలో నెటిజన్లని ఎంటర్టైన్ చేస్తోంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8లో ఎలిమినేషన్.. ఈసారి వేటు ఎవరిపై?) View this post on Instagram A post shared by nikesha patel (@nikesha.patel) -
అతడితో పెళ్లి.. స్పందించిన 'కొమురం పులి' హీరోయిన్
కొమురం పులి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన భామ నిఖీషా పటేల్. ఈ సినిమా నిరాశపచడంతో తెలుగులో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసినా సరైన సక్సెస్ రాలేదు. దీంతో సినిమాలకు గుడ్‌బై చెప్పేసి విదేశాల్లో సెటిల్ అయింది ఈ ముద్దుగుమ్మ.ప్రస్తుతం ఈమె చేతిలో ఒక్క సినిమా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఇటీవల రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ తనకు నచ్చలేదంటూ వార్తల్లో నిలిచింది. రీసెంట్గా ఓ విదేశియుడితో ప్రేమలో ఉన్నానంటూ వెల్లడించింది. అంతేకాకుండా దీపావళి సందర్భంగా ఓ వ్యక్తితో క్లోజ్‌గా దిగిన ఫోటోను సైతం షేర్ చేయడంతో నిఖీషా పటేల్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ పలు వార్తలు షికార్లు చేశాయి. అయితే తాజాగా ఓ ఫోటోను డిలీట్ చేసిన ఆమె తన పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. ఇది ఫేక్ న్యూస్ అంటూ క్లారిటీ ఇచ్చింది. -
దీపావళి సందర్భంగా కాబోయే భర్తను పరిచయం చేసిన హీరోయిన్
తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన హీరోయిన్ నిఖీషా పటేల్ 2010లో వచ్చిన కొమురం పులి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచడంతో ఆమెకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. కొమురం పులి తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆమెకు అవి ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. దీంతో ఆమె ఆఫర్లు కరువయ్యాయి. ఫలితంగా ఆమె తెలుగు తెరకు దూరమైంది. కొమురం పులి మూవీతో వచ్చిన గుర్తింపుతో ఆమెకు తమిళ, కన్నడ పరిశ్రమ నుంచి పిలుపు వచ్చింది. అక్క వరుస సినిమాలు చేసింది. అయితే ఏమైందో ఏమో అకస్మాత్తుగా ఆమె సినిమాలకు బై చెప్పేసింది. చదవండి: నన్ను అల అనడంతో మేకప్ రూంకి వెళ్లి ఏడ్చా: నటి ప్రగతి ప్రస్తుతం నిఖీషా విదేశాల్లో ఉంటుంది. ఈ క్రమంలో తరచూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటుంది. తాను ఓ విదేశీయుడితో ప్రేమలో ఉన్నానని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తాజాగా వెల్లడించింది. దీంతో బాయ్‌ఫ్రెండ్ ఎవరని, అతడి చూపించాలంటూ ఫ్యాన్స్ నుంచి సందేశాలు రావడంతో తన ప్రియుడిని చూపింది నిఖీషా పటేల్. దీపావళి పండగ సందర్భంగా తన కాబోయే భర్త, బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కి దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి మహేశ్? ఈసారి భార్య పేరు మీదుగా..! View this post on Instagram A post shared by nikesha patel (@nikesha.patel) -
ఏ మెగాస్టార్ గురించి అడుగుతున్నారు?: కొమరం పులి హీరోయిన్
తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటించిన హీరోయిన్ నిఖీషా పటేల్ 2010లో వచ్చిన కొమరం పులి సినిమాతో టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిరాశపర్చడంతో నిఖీషాకు తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. ఫలితంగా కొమరం పులి తర్వాత ఆమె మళ్లీ తెలుగు సినిమాలో కనిపించనేలేదు. తాజాగా ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో సంభాషించింది. నెటిజన్లు అడిగే పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. మహేశ్‌బాబు గురించి చెప్పండి అని అడగ్గా ఫెయిర్ అండ్ లవ్లీ అని సింగిల్ లైన్లో జవాబిచ్చింది. ప్రభాస్ గురించి ఏదైనా చెప్పండి అంటే అతడు తనకు మంచి ఫ్రెండ్ అని, కాకపోతే చాలా పొడుగ్గా ఉంటాడంది. రజనీకాంత్ గురించి ఒక్క ముక్కలో చెప్పమంటే కింగ్ అని ఆన్సరిచ్చింది. ఫేవరెట్ యాక్టర్ ఎవరంటే మాత్రం ఎప్పటికీ ధనుషే అని బదులిచ్చింది. పవన్ కల్యాణ్ గడ్డం అంటే ఇష్టమన్న నిఖీషా.. మెగాస్టార్ గురించి చెప్పండి అంటే మాత్రం ఇండస్ట్రీలో చాలామంది మెగాస్టార్లు ఉన్నారు. ఇంతకీ మీరు ఏ మెగాస్టార్ గురించి అడుగుతున్నారు? అని అడిగింది. Good friend! Humble but too tall for me https://t.co/QamG4DJcBx — Nikesha Patel (@NikeshaPatel) April 17, 2022 ఆమె ఆన్సర్ విని ఆశ్చర్యపోయిన కొందరు 'మెగాస్టార్ ఎవరో తెలీదా? పవన్‌తో సినిమా చేశావు, ఆయన బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి అన్న విషయం తెలియదంటే నమ్మశక్యంగా లేదు', 'ఇందుకే నీకు సినిమా అవకాశాలు రావడంలేదు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. 'సల్మాన్ ఖాన్, మమ్ముట్టిని కూడా మెగాస్టార్ అంటారు. కాబట్టే ఆమె అలా అడిగింది' అని మరికొందరు సదరు హీరోయిన్ను వెనకేసుకొస్తున్నారు. ఇక పెళ్లెప్పుడు అన్న ప్రశ్నకు నిఖీషా వరుడు దొరికేశాడని, అతడు యూకేలో ఉంటున్నాడని చెప్పింది. త్వరలోనే పెళ్లి చేసుకుంటామని గుడ్‌న్యూస్ పంచుకుంది. Which mega star there so many? https://t.co/RYGkM6dQk0 — Nikesha Patel (@NikeshaPatel) April 17, 2022 Fair and lovely ! https://t.co/Yj26wBE8PB — Nikesha Patel (@NikeshaPatel) April 17, 2022 Soon! Found him! Uk https://t.co/milyEyEY6Z — Nikesha Patel (@NikeshaPatel) April 17, 2022 His new beard! His best look so far!!!! @PawanKalyan https://t.co/yth5JODYbA — Nikesha Patel (@NikeshaPatel) April 17, 2022 చదవండి: కేజీఎఫ్ 2 దూకుడుకు దద్దరిల్లుతున్న బాక్సాఫీస్ -
నికిషా పటేల్ లేటెస్ట్ ఫోటోలు
-
‘పావలా కల్యాణ్’ అంటూ ట్వీట్ చేసిన హీరోయిన్
సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తించారు. పవన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ రికార్డ్ స్థాయిలో ట్వీట్లు చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా పవన్‌కు విషెస్ తెలుపుతూ ట్వీట్ చేశారు. కొంతమంది నెగెటివ్ హ్యాష్ ట్యాగ్‌లను కూడా గట్టిగానే ట్రెండ్ చేశారు. దీంతో ఓ హీరోయిన్ ఇబ్బందుల పాలయ్యారు. పవన్ కెరీర్లో భారీ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిన సినిమా కొమరం పులి. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా నటించిన నికీషా పటేల్, పవన్‌కు శుభాకాంక్షలు తెలిపే క్రమంలో ఓ పొరపాటు చేశారు. హ్యాపీ బర్త్‌డే పవన్ కల్యాణ్ (#HappyBirthdayPawanKalyan) అనే హ్యాష్ ట్యాగ్‌కు పోటిగా.., హ్యాపీ బర్త్‌డే పావలా కల్యాణ్ (#HappyBirthdayPawalaKalyan) అనే హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండింగ్‌లో ఉండటంతో నికీషా పొరపాటున పావలా కల్యాణ్ అనే హ్యాష్ ట్యాగ్‌తో విషెస్‌ను ట్వీట్ చేశారు. దీంతో ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. కొద్దిసేపటికి జరిగిన పొరపాటును గమనించిన ఈ భామ ఆ ట్వీట్‌ను డిలీట్ చేసిన మరోసారి సరైన హ్యాష్ ట్యాగ్‌లతో ట్వీట్ చేశారు. కానీ అప్పటికే నికీషా చేసిన పావలా కల్యాణ్ ట్వీట్ వైరల్ అయ్యింది. దీంతో అభిమానులను శాంతింప చేసేందుకు క్షమాపణ కూడా కోరారు. (ఇది చదవండి: మాట తప్పిన పవన్ కల్యాణ్) -
నికీషా లక్ష్యం ఏంటో తెలుసా?
మంచి స్థానం కోసం పోరాడుతున్న హీరోయిన్లలో నటి నికీషా పటేల్ ఒకరు. చాలా కాలంగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం అంటూ పలు భాషల్లో నటిస్తూ మంచి సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. అందుకే ఏ పుట్టలో ఏ పాము ఉంటుందోనన్న సామెతలా వచ్చిన అవకాశాలన్నీ అంగీకరించేస్తున్నారు. అంతే కాదు అందాలారబోత విషయంలోనూ హద్దులు చెరిపేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. ఈ ఏడాది నికీషా నటించి అరడజను చిత్రాలు తెరపైకి రానున్నాయి. అందులో ఒకటి బిగ్‌బాస్ ఫేమ్ ఆరవ్తో నటిస్తున్న మార్కెట్ రాజా ఎంబీబీఎస్. చరణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఆ చిత్ర నాయికల్లో ఒకరైన నికీషాపటేల్ మాట్లాడుతూ. ‘ఇటీవలే ఈ చిత్రంలోని పాటల చిత్రీకరణ పూర్తి అయ్యింది. పాటలు చాలా బాగా వచ్చాయి, చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాతో పాటు ఎళిల్ దర్శకత్వంలో ఆయిరం జన్మంగళ్ చిత్రంలోనూ, కస్తూరిరాజా దర్శకత్వంలో భారీ అంచనాలు నెలకొన్న పాండిముని చిత్రంలోనూ, నటుడు శ్రీకాంత్‌కు జంటగా ఒక చిత్రంలోనూ, అదే విధంగా నటుడు నందాతో కలిసి మరో చిత్రంలో నటిస్తున్నాను. ఈ ఏడాది నేను నటించిన ఆరు చిత్రాలు రిలీజ్ అవుతుండటం చాలా సంతోషంగా ఉంది’ అన్నారు. -
జీవీతో నికిషాపటేల్
సినిమా: జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో కలిసి నటించడం సంతోషంగా ఉందని నటి నికిషాపటేల్ పేర్కొంది. టాలీవుడ్లో పులి చిత్రం ద్వారా పరిచయమైన ఈ గుజరాతీ బ్యూటీ ఆ తరువాత కోలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. కరైయోరం వంటి త్రిభాషా చిత్రంలోనూ నటించి బహుభాషా నటిగా పేరు తెచ్చుకుంది. గ్లామర్ పాత్రల్లో నటించడానికి వెనుకాడని ఈ అమ్మడికి ఎందుకనో పెద్దగా స్టార్డమ్ అందలేదు. సరైన కథా చిత్రాలు అమరకపోవడం కారణం కావచ్చు. ఆ మధ్య తమిళంలో అరవిందస్వామి కథానాయకుడిగా నటించిన భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్రంలో అతిథిగా మెరిసినా ప్రేక్షకుల్లో మంచి పేరునే తెచ్చుకుంది. కాగా తాజాగా ఎళిల్ దర్శకత్వంలో జీవీ.ప్రకాశ్‌కుమార్ హీరోగా నటిస్తున్న చిత్రంలో నికిషాపటేల్ ఆయనతో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుంది. దర్శకుడు ఎళిల్ చిత్రాల్లో హీరోతో పాటు హీరోయిన్లకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి ఈ చిత్రం తరువాత కోలీవుడ్ దృష్టి నికీషాపటేల్‌పై పడుతుందని భావించవచ్చు. దీని గురించి ఈ సంచలన నటి మాట్లాడుతూ ఈ చిత్రంలో తాను ఐటీ కంపెనీలో పని చేసే యువతిగా నటిస్తున్నానని చెప్పారు. చిత్రంలో వినోదానికి తన పాత్రనే కేంద్ర బిందువుగా ఉంటుందని అన్నారు. తొలిరోజే తాను యోగా చేసే సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. ఆ సన్నివేశాల్లో జీవీ కూడా నటించారని తెలిపారు. ఆయన కోలీవుడ్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటున్న స్టార్ నటుడిగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన కామెడీ టైమింగ్ సూపర్ అని అన్నారు. ఇక దర్శకుడు ఎళిల్ చిత్రాలకు కుటుంబ సమేతంగా చూసే అభిమానులున్నారని, ఆయనతో చాలా సార్లు కథా చర్చల్లో పాల్గొన్నానని చెప్పారు. అయితే ఇప్పటికి ఎళిల్ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చిందని అన్నారు. ఆయన చాలా ప్రశాంతంగా కనిపించినా, ఎంతో శ్రమజీవి అని పేర్కొన్నారు. ఈ చిత్ర యూనిట్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని నటి నికిషా పటేల్ అన్నారు. -
శ్రీశాంత్ నాతో సహజీవనం చేశాడు : హీరోయిన్
మరి తన సంగతేంటి అని క్రికెటర్ శ్రీశాంత్‌పై మండి పడుతోంది నికీషాపటేల్. ఈ అమ్మడి కథేంటో చూద్దాం. ఈ పంజాబీ బ్యూటీ దక్షిణాదిలో తొలిసారిగా తెలుగులో పవన్‌కల్యాణ్‌తో కొమరం పులి చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కోలీవుడ్‌కు ఎన్నమో ఏదో చిత్రంతో దిగుమతై ఇక్కడ చాలా చిత్రాలు చేసింది. అయినా స్టార్ ఇమేజ్‌కు ఇంకా ఎదగలేదు. మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్న నికీషాపటేల్‌పై వదంతులు చాలానే ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి క్రికెటర్ శ్రీశాంత్‌తో చెట్టాపట్టాల్ అన్నది ఒకటి. క్రికెట్ రంగంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొని, కొంతకాలం ఆ క్రీడకు దూరమైన శ్రీశాంత్ నటుడిగా రంగప్రవేశం చేశాడు. ఈయనతో నటి నికీషాపటేల్ ప్రేమ వ్యవహారం మీడియాల్లో పెద్ద ఎత్తున షికారు చేసింది. వీరిద్దరూ ప్రేమలో పడి సహజీవనం చేశారనే ప్రచారం చాలా కాలం క్రితమే హోరెత్తింది. అయితే దీని గురించి అప్పట్లో ఈ సంచలన జంట నోరు మెదపలేదు. కొంతకాలం క్రితం భువనేశ్వరి అనే యువతిని శ్రీశాంత్ వివాహం చేసుకున్నాడు. ఇది జరిగిన చాలా కాలం తరువాత ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశాంత్ తాను భువనేశ్వరిని ఏడేళ్లుగా ప్రేమించి పెళ్లిచేసుకున్నానని చెప్పాడు. ఆయన భేటీని చూసిన నికీషాపటేల్ ఆగ్రహానికి గురైంది. దీంతో శ్రీశాంత్‌తో ఉన్న తన బంధాన్ని బట్టబయలు చేసింది. దీని గురించి నికీషాపటేల్ మాట్లాడుతూ వేరే అమ్మాయిని ఏడేళ్లుగా ప్రేమిస్తూ వచ్చిన శ్రీశాంత్ తనతో ఒక ఏడాది సహజీవనం చేసిన సంగతి గురించి ఏం చెబుతాడని ప్రశ్నించింది. అంతే కాదు తాను శ్రీశాంత్‌తో బ్రేకప్ చేసుకున్న తరువాత ఏడేళ్లుగా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్నానని చెప్పింది. అయితే శ్రీశాంత్ నిజాన్ని దాచడం మాత్రం తాను సహించలేకపోతున్నానని నికీషా పటేల్ అంటోంది. -
ఇక అంతా యాక్షనే !
తమిళసినిమా: ఇకపై అంతా యాక్షనే అంటోంది నటి నికీషాపటేల్. 2010లో పులి చిత్రంతో పవన్‌కల్యాణ్‌కు జంటగా టాలీవుడ్‌కు దిగుమతి అయిన గుజరాతీ బ్యూటీ నికీషాపటేల్. అది నిజంగా లక్కీచాన్సే అయినా చిత్రం నిరాశపరచంతో అమ్మడిని అక్కడ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కోలీవుడ్‌పై లుక్కేసింది. ఇక్కడ తలైవన్ చిత్రంతో పరిచయమైంది. ఈ చిత్రం నికీషాకు బ్రేక్ ఇవ్వలేదు. అయితే కొన్ని అవకాశాలను మాత్రం రాబట్టుకుంది. ఎన్నమో ఏదో, కరైయోరం, నాథన్, 7 నాట్కళ్ వంటి చిత్రాలతో కోలీవుడ్‌లో గుర్తింపు తెచ్చికున్న నికీషాపటేల్ మధ్యలో మలయాళం, కన్నడం భాషల్లోనూ మెరిసింది. అయితే ఎక్కడ పోగుట్టుకుంటే అక్కడే వెతుక్కోవాలన్న సామెతలా తాజాగా టాలీవుడ్ నాయకిగా రాణించడానికి తీవ్రంగా ఖుషి చేస్తోంది. తన ప్రయత్నం ఫలించి ఒక తెలుగు చిత్రం తలుపు తట్టింది. ఈ చిత్రంలో తన తడాఖా చూపిస్తానంటోంది భామ. దీని గురించి నికీషాపటేల్ మాట్లాడుతూ నవ దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రంలో తాను యాక్షన్ హీరోయిన్గా నటించనున్నానని చెప్పింది. తాను నిజజీవితంలో బాక్సింగ్ క్రీడాకారిణినని, యాక్షన్ కథ పాత్రల్లో నటించాలన్నది చిరకాల కోరిక అని తెలిపింది. అది ఈ చిత్రంతో నెరవేరనుండడం సంతోషంగా ఉందని అంది. ఈ పాత్రలో రఫ్ ఆడిస్తానని చెప్పింది. అంతే కాదు యాక్షన్ హీరోయిన్గా రాణించాలని ఆశ పడుతున్న నికీషాపటేల్ ఇకపై యాక్షన్ కథా చిత్రాలనే కమిట్ అవుతానని పేర్కొంది. ఈ చిత్రంలో ముకుల్ దేవ్ విలన్‌గా నటిస్తున్నారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని నికీషాపటేల్ అంటోంది. ఈ చిత్రం అయినా ఈ అమ్మడి కెరీర్‌ను మలుపు తిప్పుతుందేమో చూద్దాం. -
శ్రీకాంత్‌తో నికిషాపటేల్
నటి నికిషాపటేల్ నటుడు శ్రీకాంత్‌తో రొమాన్స్ చేస్తోంది. శ్రీకాంత్‌కు నటుడిగా చిన్న గ్యాప్ వచ్చింది.అదే విధంగా నికిషాపటేల్కు పెద్దగా అవకాశాలు లేవు.కాగా ఈ జంట తాజాగా ఒక హిందీ చిత్రానికి సీక్వెల్‌గా తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కతున్న చిత్రంలో నటిస్తున్నారు. విశేషం ఏమిటంటే ప్రముఖ హిందీ దర్శక నిర్మాత కేసీ.బొకాడియా 1985లో రూపొందించిన చిత్రం తెరి మెహర్బెనియన్. జాకీష్రాఫ్, పూనం దిల్లాన్ జంటగా నటించిన ఈ చిత్రంలో ఒక జాగిలం కూడా ముఖ్యపాత్రను పోషించింది. 32 ఏళ్ల తరువాత ఆ చిత్రానికి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. అదీ తమిళ, తెలుగు భాషల్లో. ఈ చిత్రం గురించి నటుడు శ్రీకాంత్ తెలుపుతూ ఈ చిత్ర షూటింగ్‌ను ఇప్పటికే చెన్నై, హైదరాబాద్‌లలో 20 శాతం పూర్తి చేశామని తెలిపారు. మర్డర్ మిస్టరీతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కుతోందని తెలిపారు. నికిషాపటేల్ తెలుపుతూ మెరి మెహర్మెనియన్ చిత్రానికి ఇది సీక్వెల్ అయినా, ఆ చిత్రానికి తాము నటిస్తున్న చిత్రానికి సంబంధం ఉండదని అన్నారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో తన పాత్ర శ్రీకాంత్ పాత్రకు సమానంగా ఉంటుందని చెప్పారు. సాధారణంగా బొకాడియా చిత్రాల్లో హీరోహీరోయిన్ల మధ్య మంచి రొమాన్స్ సన్నివేశాలు ఉంటాయన్న విషయం తెలిసిందేనన్నారు. అలాంటివి ఈ చిత్రంలోనూ ఉంటాయని తెలిపారు. ఇందులో శ్రీకాంత్‌కు తనకు మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరిస్తుందని నికిషాపటేల్ పేర్కొంది. -
‘నన్నింకా గ్లామర్ డాల్‌గానే చూస్తున్నారు’
చెన్నై: కోలీవుడ్‌లో తననింకా గ్లామర్ డాల్‌గానే చూస్తున్నారని హీరోయిన్ నికీషా పటేల్ వాపోతోంది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన కొమరం పులి చిత్రంతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ ఉత్తరాది భామ ఆ చిత్రం పెద్దగా ఆడక పోవడంతో చాలా నిరాశకు గురైందనే చెప్పాలి. అయితే ఆ తరువాత కోలీవుడ్‌లో అడుగుపెట్టి నారదన్, కడయోరం లాంటి కొన్ని చిత్రాలలో నటించినా ఆ చిత్రాలు ఆమెకు ఏమాత్రం కలిసి రాలేదనే చెప్పారు. అప్పటి నుంచి గోల్డెన్ ఛాన్స్‌కోసం నికీషా పటేల్ పోరాడుతూనే ఉంది. గత ఏడాది ఒకటి రెండు చిత్రాలలో నికిషా నటించినప్పటికీ ఆ చిత్రాలు ఏవీ విడుదల కాలేదు. తాజాగా 7 నాట్కళ్ అనే తమిళ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. ఆ సినిమాపైనే గంపెడు ఆశలు పెట్టుకున్న నికీషా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఆశాభావంతో ఉంది. ‘నిజమే, ఈ ఏడాది నేను నటించిన ఒక్క చిత్రం తెరపైకి రాలేదు. అలాగని ఖాళీగా కూర్చున్నానని అనుకోరాదు. తమిళం, తెలుగు చిత్రాలతో బిజీగానే ఉన్నాను. శక్తి పి.వాసుకు జంటగా నటించిన 7 నాట్కళ్ చిత్రం త్వరలో విడుదలకు సిద్దం అవుతోంది. ఇందులో శక్తి పి.వాసు చాలా డిఫరెంట్‌గా కనిసిస్తారు. క్రైం థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రంలో నాకు, శక్తి పీ.వాసులకు మధ్య మంచి రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయి. ఇకపోతే కోలీవుడ్‌లో నన్నింకా గ్లామరస్ నటిగానే చూస్తున్నారు. అయితే తెలుగులో కొన్ని నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంటున్నాను. ఇక్కడ గ్లామర్ ఇమేజ్ను బ్రేక్ చేయాలని ఆశపడుతున్నాను. ప్రస్తుతం మాలీవుడ్ తరహాలో కోలీవుడ్‌లో కూడా చాలా రియలిస్టిక్ కథా చిత్రాలు వస్తున్నాయి. ఇక తెలుగులో షరా మామూలుగానే కమర్షియల్ కథా చిత్రాలే అధికంగా వస్తున్నాయి.’ అని పేర్కొంది. నికీషా పటేల్ ప్రస్తుతం మలయాళ చిత్రం 100 డిగ్రీ సెల్సియస్ తమిళ రీమేక్‌లోనూ, ఓ తెలుగు చిత్రంలో పాటు ఒక ద్విభాషా చిత్రంలోనూ నటిస్తున్నట్లు చెప్పింది. -
హవ్వా! రాజమౌళి ఎవరా!!
...అంటున్నది నికిషా పటేల్ కాదు, ఓ తెలుగు నటుడంట! ‘బాహుబలి’తో రాజమౌళి పేరు ఒక్క తెలుగులో ఏం ఖర్మ... తమిళ, మలయాళం, హిందీలతో పాటు విదేశాల్లో కూడా వీర విహారం చేస్తోంది. అలాంటిది ఆయన పేరు, ‘బాహుబలి’కి దర్శకుడు ఆయనే అనేది ఓ తెలుగు నటుడికి తెలీదంటే ఆశ్చర్యమే. కానీ, పవన్‌కల్యాణ్ ‘కొమరం పులి’ ఫేమ్ నికిషా పటేల్ చెబుతున్న మాటలను బట్టి నమ్మక తప్పదు. ఓ తెలుగు నటుణ్ణి ‘బాహుబలి’ చూశావా? అని నికిషా పటేల్ అడిగితే... ‘‘దానికి దర్శకుడు ఎవరు? ఎవరు దర్శకత్వం వహించారు?’’ అని సదరు నటుడు ఎదురు ప్రశ్నించాడట. ‘‘అతడు అంత నిర్లక్ష్యంగా, మూర్ఖంగా ఎలా ఉన్నాడో! అతణ్ణి చూస్తే అసహ్యంగా ఉంది. అతడి పేరు చెప్పడానికి సిగ్గేస్తోంది’’ అని నికిష ట్వీట్ చేశారు. ఆ నటుడు ఎవరంటారు? అది మాత్రం చెప్పనంటే చెప్పనంటున్నారు నికిష. -
పవన్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు
నటిని కదా అని నోటికొచ్చినట్లు మాట్లాడకూడదు. అందులోనూ సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు ఏ విషయమైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి. అలాంటి వారి ప్రతిచర్యను సాధారణ ప్రజలు గమనిస్తుంటారన్నది గుర్తెరగాలి. నటి నికిషాపటేల్ ఇలాంటి విషయాలేవీ పట్టించుకున్నట్లు లేదు. ఏదో ఒక వివాదాంశంతో వార్తల్లోకెక్కి ప్రచారం పొందాలన్న తాపత్రయంతో, స్వప్రయోజనం కోసం తహతహలాడుతున్నట్లుంది ఆమె వాలకం చూస్తుంటే. ఇంతకీ నికిషాపటేల్ ఏమందనేగా మీ ఆసక్తి. అదేమిటో చూద్దాం.ఇంగ్లాండ్‌లో పుట్టి పెరిగిన గుజరాతీ అమ్మాయి నికిషాపటేల్. బాలీవుడ్లో నాయకి కావాలన్న ఆశతో వచ్చి టాలీవుడ్లో కొమరం పులి చిత్రం ద్వారా కథానాయకిగా రంగప్రవేశం చేసింది. అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో కోలీవుడ్‌కు మకాం మార్చింది. ఇక్కడ కొన్ని చిత్రాలలో నటించినా తగిన గుర్తింపు కోసం ఇంకా పోరాడుతూనే ఉంది. ప్రస్తుతం నటుడు శక్తికి జంటగా 7 నాట్కళ్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ బాలీవుడ్లో హీరోయిన్ కావాలని ఆశించిన తనను దర్శకుడు ఎస్జే.సూర్య ఒత్తిడి చేసి మరీ టాలీవుడ్లో పవన్‌కల్యాణ్‌కు జంటగా కొమరం పులి చిత్రంతో పరిచయం చేశారని చెప్పింది. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించక పోవడంతో తనకు కొత్తగా అవకాశాలు రాలేదంది. అలా చాలా ఏళ్లే ఎదురు చూసిన తరువాత ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయని పేర్కొంది. చాలా మంది పెళ్లి గురించి అడుగుతున్నారనీ, ఆడమగ కలిసి జీవించడానికి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని అంది. నా వరకూ వివాహ బంధంపై నమ్మకం లేదని చెప్పింది. నేనెవరినైనా ఇష్టపడితే అతనితో పెళ్లి చేసుకోకుండానే కలిసి సహజీవనం చేస్తానంది. ఇంకా చెప్పాలంటే 2030 తరువాత దేశంలోనే ఈ వివాహ సంప్రదాయమే ఉండదని అంది. ఆడామగా కలిసి జీవించే సంస్కృతే ఉంటుందని, అది మనం చూడబోతున్నాం అని పేర్కొంది. అయినా పెళ్లి చేసుకున్న వారందరూ కలిసే జీవిస్తున్నారా? అంటూ ప్రశ్నించింది. తాను ఒక సారి ప్రేమలో ఓడి పోయానని, అప్పట్లో అందమైన అబ్బాయిలకు ప్రాధాన్యం ఇచ్చానని చెప్పింది. ఇప్పుడు అందాన్ని మించి విషయాన్ని చూసే పరిపక్వత పొందానని చెప్పుకొచ్చింది. -
ఆ రోడ్డులో ఏం జరిగింది?
సాయిరామ్ శంకర్, నికిషా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘అరకు రోడ్లో’. వాసుదేవ్ దర్శకత్వంలో మేకా బాలసుబ్రమణ్యం, బి.భాస్కర్, వేగిరాజు ప్రసాదరాజు, నక్కా రామేశ్వరిలు నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ మొదటివారంలో పాటల్ని, అదే నెలలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ - ‘‘యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. అరకు రోడ్లో ఏం జరిగింది? అనేది ఉత్కంఠ కలిగిస్తుంది. అరకు రోడ్డులో ఎన్ని మలుపులు ఉన్నాయో సినిమా కూడా అన్ని మలుపులు తిరుగుతుంది’’ అన్నారు. కమల్ కామరాజు, అభిమన్యు సింగ్, కోవై సరళ, పృథ్వీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: చీకటి జగదీశ్, సంగీతం: రాహుల్ రాజ్, వాసుదేవ్. -
నికీషా కోరిక తీరేనా?
నారదన్ చిత్ర విజయం ఆ చిత్ర కథానాయకుడి కంటే, నాయకికి చాలా అవసరం. ఎందుకంటే ఆమె ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుందట. ఇంతకీ అంతగా ఆశలు పెట్టుకున్న ఆ అమ్మడు ఎవరనుకుంటున్నారు. ఇంకెవరు నటి నికీషా పటేల్. ఈ ఉత్తరాది భామ సినీ ఎంట్రీ గ్రాండ్‌గానే జరిగింది. టాలీవుడ్లో పవర్‌స్టార్‌గా వెలుగొందుతున్న పవన్‌కల్యాణ్‌కు జంటగా పులి చిత్రంతో దక్షిణాదికి దిగుమతి అయిన గుజరాతీ బ్యూటీ నికీషా పటేల్. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో నికీషా పటేల్‌ను అక్కడ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో అమ్మడు కోలీవుడ్‌పై దృష్టి సారించింది. ఇక్కడ ఎన్నమో ఏదో చిత్రంతో రంగప్రవేశం చేసింది.ఆ చిత్రం నికీషా కేరీర్‌కు ఏమాత్రం ప్లస్ అవ్వలేదు.ఈ సారి కన్నడ చిత్రపరిశ్రమపై కన్నేసింది. అక్కడ కరైయోరం అనే త్రిభాషా చిత్రంలో నటించింది. అందులో గ్లామర్ పరంగా హద్దులు దాటి నటించింది. వ్రతం చెడ్డా ఫలితం దక్కలేదన్న సంధాన ఆ త్రిభాషా చిత్రం కూడా నికీషాకు విజయానిఅందించలేకపోయింది. అదిరే అందం, అభినయంలోనూ మంచి పాత్ర లభిస్తే నిరూపించుకోవాలని ఉబలాట పడుతున్న నటి నికీషా. అలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్న నికీషా మూడు భాషల్లోనూ బ్రేక్ కోసం పడిగాపులు పడుతోంది. మరో విషయం ఏమిటంటే ఎన్నమో ఏదో చిత్రంలో ఈ అమ్మడితో పాటు నటించిన నటి రకుల్ ప్రీతిసింగ్‌కు ఇక్కడ అదే పరిస్థితి ఉన్నా, టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్గా దుమ్మురేపుతోంది.అందుకే అంటారు దేనికైనా అదృష్టం ఉండాలని. దానికోసమే నికీషా అర్రులు చాచి ఎదురు చూస్తోంది. తాజాగా ఈ జాణ నటించిన నారదన్ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. నకుల్ కథానాయకుడిగా నటించిన ఇందులో మరో హీరోయిన్ ఉన్నా నికీషా పటేల్ పాత్రకే ప్రాముఖ్యత ఉంటుందట.ఈ చిత్రం తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని నికీషా వ్యక్తం చేస్తోంది. మరో రెండు రోజులు ఆగితే గానీ ఈ బ్యూటీ ఆశ ఏ మేరకు నెరవేరిందో తెలుస్తుంది. -
రోడ్లో ఏం జరిగింది?
యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు, ఎంటర్టైన్మెంట్ - వీటన్నిటి కలగలుపుగా ‘అరకు రోడ్లో’. రామ్ శంకర్, నికీషా పటేల్ జంటగా వాసుదేవ్ దర్శ కత్వంలో మేకా బాల సుబ్రమణ్యం, సురేశ్ వర్మ ఇందుకూరి, నక్కా రామేశ్వరి ఈ చిత్రాన్ని నిర్మిస్తు న్నారు. ఈ చిత్రం టీజర్‌ను దర్శకుడు పూరీ జగ న్నాథ్ తనయుడు ఆకాష్ పూరి విడుదల చేశారు. హీరో రామ్ శంకర్ మాట్లాడుతూ- ‘‘ఇదొక యాక్షన్- థ్రిల్లర్. రెండో షెడ్యూల్ జరుపు తున్నాం’’ అన్నారు. ‘‘మంచి వినోదం ఉన్న ఈ చిత్రానికి వైజాగ్, పాడేరుల్లో షూటింగ్ జరిపాం’’ అని దర్శకుడు పేర్కొన్నారు. కోవై సరళ, కెమేరా మన్ జగదీశ్ చీకటి తదితరులు పాల్గొన్నారు. -
త్రిషతోనే నా పెళ్లి....
చెన్నై : త్రిష ఎప్పుడూ సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. ఆ మధ్య నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌మణియన్‌తో ప్రేమ, ఆ తర్వాత ఎంగేజ్మెంట్ ...బ్రేకప్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు నటి చార్మీ, నికీషా పటేల్‌తో కలిసి ఆమె స్నేహమంటే ఇదేరా అన్నంత జోష్‌లో తుళ్లిపోతూ మరోసారి సంచలనం సృష్టించింది. స్వేచ్ఛా విహంగంగా జీవించే ఈ ముగ్గురు 'రమ్' అనే చిత్రంలో నటిస్తున్నారు. అప్పటి నుంచి వీరి మధ్య స్నేహం పొంగి పొర్లుతోంది. ఇటీవల ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ట్విట్టర్లో జరిపిన ముచ్చట్లు అభిమానుల్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. వారు ముగ్గురు అదిరే దుస్తులు ధరించి ఓ కార్యక్రమంలో పాల్గొన్న సెల్పీ ఫోటోలను నటి త్రిష తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలను చూసిన నికీషా పటేల్ ...త్రిషను పొగడ్తలతో ముంచేస్తూ తన ట్విట్టర్లో పేర్కొంది. ఇక నటి ఛార్మీ అయితే త్రిషతోనే నా పెళ్లి, ఆమెతోనే డేటింగ్ చేస్తా అంటూ రెచ్చిపోయింది. ఇవన్నీ అభిమానుల్ని పిచ్చపిచ్చగా ఎంటర్ టెయిన్ చేస్తున్నాయి. -
బంపర్ ఆఫర్ కొట్టేసింది!
-
విజయ్ వసంత్‌కు జోడీగా..
విజయ్‌వసంత్‌తో జోడీ కట్టడానికి రెడీ అవుతున్నారు నటి నికీషా పటేల్. తెలుగులో పవన్‌కళ్యాణ్ సరసన పులి చిత్రం ద్వారా పరిచయమైంది ఈ నికీషా అనంతరం ‘ఓం’ చిత్రాల్లో నటించి తమిళ చిత్రరంగ ప్రవేశం చేశారు. ఇక్కడ ఎన్నమో ఏదో చిత్రంతో పరిచయమైన నికిషా పటేల్‌కు పలు అవకాశాలు తలుపు తడుతున్నాయి. కన్నడంలోను కథానాయికిగా రాణిస్తున్న ఈ ముద్దుగుమ్మకు తమిళంలో తాజాగా విజయ్‌వసంత్‌తో జోడీ కట్టే అవకాశం వచ్చింది. వీరిద్దరు కలిసి శిఖండిగా తెరపైకి రానున్నారు. ఇంతకుముందు విజయ్ వసంత్ హీరోగా ఎన్నమో నడక్కుదు వంటి విజయవంతమైన చిత్రాల్ని రూపొందించిన రాజపాండి ఈ శిఖండి చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. వి.రికార్డ్స్ పతాకంపై వి.వినోద్ నిర్మించనున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ ఇది విద్య ప్రయోజనాలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందన్నారు. విద్య అవశ్యకత గురించి తెలుపుతూ ఇంతకుముందు పలు చిత్రాలు వచ్చినా అలాంటి వాటికి భిన్నంగా ఈ శిఖండి చిత్రం ఉంటుందన్నారు. ఆరు నెలలు విద్యాధికులతోను, సామాజిక స్పృహ ఉన్న పాత్రికేయ మిత్రులతోను, సుదీర్ఘంగా చర్చించి ఈ చిత్ర కథను తయారు చేసినట్లు తె లిపారు. విద్య, విద్యా సంస్థలు ఎలా ఉండాలన్న విషయాలను తనదైన శైలిలో ఈ చిత్రం ద్వారా చెప్పదలుచుకున్నానని అన్నారు. చిత్రంలో ప్రముఖ దర్శక, నటుడు సముద్రకని ఒక కీలక పాత్రలో నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెప్పారు. చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని దర్శకుడు రాజపాండి వెల్లడించారు. -
సెక్సీ ‘నిషా’
‘నువ్వొకటంటే... నేను నాలుగంటా’ అనేంతగా ఉంటుంది సాధారణంగా దక్షిణాది తారల మధ్య సామరస్యం! కానీ ఈ మధ్య ఎందుకో గానీ ఒకరికొకరికి మధ్య దోస్తీ పెరిగిపోతోంది. ఒకరి చిత్రాలు ఒకరు సోషల్ సైట్లలో పోస్ట్ చేసుకోవడం... కలసి ఎంజాయ్ చేసిన మూమెంట్స్‌ను షేర్ చేసుకోవడం... కామనైపోయింది. ఇప్పుడు స్వీటీ త్రిషా, నికిషా పటేల్‌ల వంతు. ‘త్రిషా గొప్ప మానవతావాది’ అంటూ ఓ ఇంటర్వ్యూలో నికిషా కితాబిస్తే... ‘థ్యాంక్స్ మై సెక్సీ నిక్స్... కిస్’ అంటూ రీట్వీట్ చేసింది త్రిషా. విషయమేంటంటే... ఇద్దరూ కలిసి ఎంఎస్ రాజు చిత్రం ‘రమ్’లో చేయడం. -
నిలదొక్కుకుంటున్న నికీషా
నటి నికీషా దక్షిణాదిలో కథా నాయికిగా నిలదొక్కుకుంటున్నారు. నటనకు భాషాభేదాలు లేవన్న విషయాన్ని ఈ బ్యూటీ మరోసారి నిరూపించారు. ఎక్కడో యు.కె (యునెటెడ్ కింగ్డమ్)లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ అక్కడ బీబీసీతో సహా ఇతర ఛానళ్లలో మోడల్‌గా పని చేశారు. ఆ తరువాత నటిగా బాలీవుడ్ రంగప్రవేశం చేసిన ఈమెను ప్రస్తుతం ఆదరిస్తోంది మాత్రం దక్షిణాది సినీ పరిశ్రమనే. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం అంటూ నాలుగు భాషల్లోనూ కథానాయికిగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ అమ్మడు దక్షిణాదిలో తొలుత తెలుగులో పవన్‌కల్యాణ్ సరసన పులి చిత్రంలో నటించినా ఆ చిత్రం ఆశించిన విజయం సాధించలేదు. అలాగే తమిళంలోను మంచి విజయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కన్నడం, మలయాళం భాషల్లో నికీషా పటేల్ విజయాల ఖాతాను తెరిచారు. కన్నడంలో తొలి చిత్రం నరసింహాతోనే విజయం రుచి చూశారు. ఈ చిత్రం సిమ్మా అవార్డును కూడా అందించింది. మలయాళంలో ప్రముఖ నటుడు మమ్ముట్టి వంటి స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం తమిళంలో అమిలి తుమిలి, ఎన్నమో ఏదో వంటి చిత్రాలు నిరాశ పరచినా ప్రస్తుతం నటిస్తున్న నారదన్ చిత్రంపై ఆశలు పెట్టుకున్నారు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. దీంతోపాటు కొత్తగా మరో మూడు అవకాశాలు నికీషా తలుపు తట్టాయట. ఈ చిత్రాల వివరాలను త్వరలోనే వెల్లడిస్తానంటున్నారు. కన్నడంలో ఈ ముద్దుగుమ్మ నటించిన నమస్తే మేడమ్ ఈ నెల 24న తెరపైకి రానుంది. ఇది తెలుగు చిత్రం మిస్సమ్మకు రీమేక్. ప్రస్తుతం ఆలోన్ అనే మరో కన్నడ చిత్రంలో నటిస్తున్నారు. మొత్తం మీద నాలుగు భాషల్లో నటిస్తూ నికీషా బిజీ కథానాయకిగా వెలుగొందుతున్నారన్నమాట. -
ఫైట్స్ చేశా
నేను ఫైట్స్ చేశానంటున్నారు నటి నికీషా పటేల్. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరితో ఎందుకు ఫైట్స్ చేశారన్నదేగా మీ సందేహం. ‘‘ఎవరితోనో ఎందుకు ఫైట్స్ చేస్తాను, అంతా సినిమా కోసమే’’ నంటున్నదీ ఉత్తరాది భామ. సినిమాలో పోరాట దృశ్యాల్లో నటించానంటున్న నికీషా ప్రస్తుతం మంచి జోష్‌లో ఉన్నారు. ఆమె ఒక నాయకిగా నటించిన ఎన్నమో ఏదో చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో తన నటనకు పలువురి నుంచి ప్రశంసలు వస్తున్నాయంటూ సంతోషం వ్యక్తం చేస్తున్న ఈ అమ్మడి చేతిలో మరో మూడు, నాలుగు తమిళ చిత్రాలున్నాయట. వాటిలో ఒకటి రంభ ఊర్వశి మేనక (రమ్). ఈ చిత్రం గురించి నికీషా తెలుపుతూ రంభ ఊర్వశి మేనక చిత్రంలో నటి త్రిష, ఇషా చావ్లాతో కలిసి నటిస్తున్నానని చెప్పారు. ఇది మిస్టరీ థ్రిల్లర్ కథా చిత్రం అని తెలిపారు. ఇందులో తాను ఫైటింగ్ సన్నివేశాల్లోనూ నటించానని పేర్కొన్నారు. స్టంట్ మాస్టర్ విజయన్ కాంబినేషన్లో తాను నటిస్తున్న రెండో చిత్రం రంభ ఊర్వశి మేనక అని చెప్పారు. ఈ చిత్రంలోని పోరాట దృశ్యాలు, అలరిస్తాయన్నారు. దీంతోపాటు నారదన్ అనే మరో చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. ఇందులో నకుల్‌కు జంటగా నటనకు అవకాశం ఉన్న పాత్ర చేస్తున్నట్లు తెలిపారు. మెమొరీలాస్ అయిన యువతి పాత్రను పోషిస్తున్నట్లు తెలిపారు. వాటితో పాటు వారు ఫాంటసీ కథా చిత్రంలో నటించనున్నట్లు నికీషా వెల్లడించారు. -
వీరికి దారేదీ..?