'40 సార్లు గుండు గీశారు'
తన తలకు కనీసం నలభై సార్లు గుండు కొట్టారని దక్షిణాది నటుడు అభినయ్ వడ్డి వెల్లడించారు. ప్రముఖ భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజం చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తున్న అభినయ్ బుధవారం చెన్నైలో విలేకర్లతో మాట్లాడారు. ప్రముఖ భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజం జీవిత కథ ఆధారంగా తమిళ, ఇంగ్లీషు భాషలలో నిర్మితమవుతున్న 'రామానుజన్' చిత్రానికి సంబంధించిన విశేషాలను అభియన్ ఈ సందర్బంగా వెల్లడించారు. ఆ చిత్రంలోని ముఖ్యపాత్ర కోసం గుండుతో కనిపించాల్సి ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు తనకు ముందే చెప్పారని తెలిపారు. అందుకు తాను మనస్పూర్తిగా అంగీకరించానని తెలిపారు. దాంతో అన్ని సార్లు గుండు గీస్తారని చెప్పారు.
తమిళనాడు కుంభకోణంలో చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో భాగంగా క్షరకుడు ఎల్లప్పుడు తనతో ఉండేవాడని ఆయన గుర్తు చేసుకున్నారు. చిత్ర షూటింగ్లో భాగంగా లండన్ వెళ్లినప్పుడు విగ్ పెట్టుకుని తిరగాలని తెగ అరాటపడ్డానని అయితే తన తలకు జుట్టు కొద్దికొద్దిగా వస్తున్న క్రమంలో విగ్ తన తలకు అతకలేదన్నారు. దాంతో విగ్గు పెట్టుకునేందుకు గుండె గీయించుకోవలసి వచ్చిందని షూటింగ్ నాటి విశేషాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. కర్పూర సినిమా నిర్మిస్తున్న ఆ చిత్రంలో బామా, సుహాసిని మణిరత్నం, నిళగళ రవి, శరత్ బాబు, విజయ్, అబ్బాస్, ఢిల్లీ గణేష్, వై.జీ మహేంద్రలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.