అత్యాచార యత్నం.. ఆత్మహత్య
వైఎస్సార్ కడప: ఓ యువకుడు బలవంతం చేయడంతో అవమానం తట్టుకోలేక యువతి ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్న ఘటన జిల్లాలోని ఆదినిమ్మాయపల్లెలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఈ నెల 24వ తేదీన ఆదినిమ్మాయపల్లెకు చెందిన సుప్రజ(20) అనే యువతి ఇంట్లో ఉండగా ఎవరూ లేని సమయంలో మిట్టపల్లెకు చెందిన పాశం భాస్కర్ బాబు అనే యువకుడు ఆమెపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు యువకుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించారు. అయితే అప్పటి నుండి అవమాన భారంతో కుమిలిపోతున్న యువతి బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. కాగా, యువతి మృతికి కారణమైన నిందితుని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.