agricultural land registration
-
Farmer Suicide: సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగులమందు తాగి...
చింతకాని/జనగామ /లింగాల/గద్వాల రూరల్: వ్యవసాయ భూమి విషయంలో తనకు అన్యాయం జరిగిందనే ఆవేదనతో ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా, మరో ముగ్గురు రైతులు ఆత్మహత్యకు యతి్నంచారు. నాలుగు జిల్లాల పరిధిలో సోమవారం ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగులమందు తాగి... ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన బోజెడ్ల ప్రభాకర్ (45) కుటుంబానికి 7.10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గ్రామంలోని చెరువు శిఖం పక్కనే ఉన్న తన భూమిలో ప్రభాకర్ గత వేసవిలో రూ.8 లక్షలు వెచి్చంచి మట్టి తోలించాడు. అయితే చెరువు శిఖంలో మట్టి పోశారంటూ గ్రామానికి చెందిన మత్స్య సొసైటీ సభ్యులు నాలుగు రోజుల క్రితం రెండు జేసీబీలు, రెండు బుల్డోజర్లతో ప్రభాకర్ పొలంలోని మట్టిని తొలగించారు. దీనిపై తహసీల్దార్, ఎస్సై, ఇరిగేషన్ అధికారులకు ప్రభాకర్ ఫిర్యాదు చేయగా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు భూమిని పరిశీలించి మట్టి తొలగించొద్దని సొసైటీ సభ్యులకు చెప్పారు. అయినా వారు దౌర్జన్యంగా మట్టి తొలగించగా, గ్రీవెన్స్‌లో కలెక్టర్, సీపీని కలిసి తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసేందుకు తన తండ్రితో కలిసి ప్రభాకర్ సోమవారం ఖమ్మం కలెక్టరేట్‌కు వెళ్లాడు. అక్కడ కలెక్టర్ కలవకపోవడంతో మనస్తాపానికి గురైన ప్రభాకర్.. భోజనం చేసి వస్తానంటూ తండ్రితో చెప్పి ఖమ్మంలోని గొల్లగూడెం – కొత్తగూడెం మార్గంలో గల చెరుకూరి గార్డెన్ వద్దకు పురుగుల మందు డబ్బాతో చేరుకున్నాడు. తనకు జరిగిన అన్యాయాన్ని సెల్ఫీ వీడియో ద్వారా వివరిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లగా అప్పటికే మృతి చెందాడు. గ్రామంలోని కొందరు కాంగ్రెస్, టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే తన పొలాన్ని నాశనం చేశారని వివరిస్తూ తాను ఆత్మహత్య చేసుకునే ముందు తీసిన వీడియోను సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కకు పంపించాలని, తన కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభాకర్ కోరాడు. గోలీలు మింగి...కిరోసిన్ డబ్బాతో... ⇒జనగామ జిల్లా నర్మెట మండల కేంద్రానికి చెందిన అక్కాచెల్లెళ్లు దేవులపల్లి జ్యోతి, స్వప్నల పేరిట తాత లక్ష్మయ్య 1.04 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేయించి గార్డియన్‌గా ఉన్నాడు. ఆ విషయం అక్కాచెల్లెళ్లకు తెలియదు.2014లో లక్ష్మయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. జ్యోతి, స్వప్నలకు పెళ్లిళ్లు కూడా అయ్యాయి. ట్రంకు పెట్టె సర్దుతుండగా, భూమి విషయం తెలిసింది. వెంటనే జ్యోతి గ్రామానికి చెందిన సదరు వ్యక్తిని భూమి విషయం అడగ్గా, మాటామాటా పెరిగి ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. న్యాయం కోసం జ్యోతి గతంలో నర్మెట పీఎస్‌కు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేయగా, పోలీసులు నచ్చచెప్పి ఇంటికి పంపించారు. ఆ తర్వాత జ్యోతి కోర్టును ఆశ్రయించింది. కేసు నడుస్తోంది. భూమి వస్తుందో రాదో అన్న ఆవేదనతో జ్యోతి కొన్ని మందుగోలీలు మింగి సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు వచి్చంది. ప్రజావాణి ప్రారంభమయ్యే క్రమంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు యతి్నంచగా, పోలీసులు అడ్డుకున్నారు. చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ఇతరుల పేరిట పట్టా చేశారని... ∙నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలకు చెందిన మహిళారైతు గాలేటి జయమ్మకు గ్రామ శివారులో 1.37 ఎకరాల భూమి వారసత్వంగా దక్కాల్సి ఉంది. ఆ భూమిని పదేళ్ల కిందట అధికారులు ఇతరుల పేరిట పట్టా చేశారు. అప్పటి నుంచి అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. దీంతో ఆందోళనకు గురైన జయమ్మ సోమవారం పెట్రోల్‌తో లింగాల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఒంటిపై పోసుకునేందుకు ప్రయతి్నంచింది. గమనించిన చుట్టుపక్కల వారు అడ్డుకున్నారు. నేతలు భూమి కబ్జా చేశారని... ∙జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన రైతు పరుశరాముడికి అదే గ్రామ శివారులో ఐదు ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని గ్రామనేతలు కబ్జా చేశారు. దీనిపై పరుశరాముడు పలుమార్లు రెవెన్యూ అధికారులతో పాటు కలెక్టరేట్లో కూడా ఫిర్యాదు చేశాడు. కానీ సమస్య పరిష్కారం కాలేదు. సోమవారం గద్వాల కలెక్టరేట్లో కలెక్టర్ బీఎం.సంతోష్ ఆ«ధ్వర్యంలో ఫిర్యాదుల దినోత్సవం కొనసాగుతుండగానే పరుశరాముడు తన వెంట తీసుకొచ్చిన పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం రైతు పరిస్ధితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. -
రూటు మారినా.. జర్నీ అదే!
సాక్షి, హైదరాబాద్: ధరణి దరఖాస్తుల పరిష్కార రూటు మారింది. గతంలో ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారానికి ఏ దరఖాస్తు వచ్చినా, ఆ దరఖాస్తు కేవలం కలెక్టర్ లాగిన్‌లో మాత్రమే కనిపించేది. కలెక్టర్ వేలిముద్రతో తన లాగిన్‌ను ఓపెన్ చేసి సదరు దరఖాస్తును కిందిస్థాయికి పంపాల్సి వచ్చేది. కానీ తాజాగా ధరణి పోర్టల్‌లో ఓ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ధరణి కింద ఏ దరఖాస్తు వచ్చినా అది తహసీల్దార్‌కు కనిపించేలా, తహసీల్దార్ ఆ దరఖాస్తును పరిశీలించి నిర్ణయం కోసం పైఅధికారులకు పంపేలా లాగిన్ లభించింది. ప్రయోజనం లేదంటున్న తహసీల్దార్లు దరఖాస్తు పరిష్కారం చేసే రూటు మారింది కానీ ఆ పరిష్కారం కోసం సదరు దరఖాస్తు చేయాల్సిన ప్రయాణం (జర్నీ) మాత్రం మారలేదని, అలాంటప్పుడు రూటు మార్చడం వల్ల ఒనగూరే ప్రయోజనం కూడా ఏమీ లేదని తహసీల్దార్లు చెబుతున్నారు. ⇒ ప్రస్తుతమున్న విధానంలో ధరణి దరఖాస్తులను తహసీల్దార్ ఓపెన్ చేసినా..ఆన్లైన్, ఆఫ్‌లైన్ రికార్డులను ఆర్డీఓ, జేసీ,కలెక్టర్లకు నాలుగు స్థాయిల్లో పంపాలని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఆన్లైన్లో, ప్రింట్లు తీసి ఆఫ్‌లైన్‌లో పంపాల్సి వస్తోందని వాపోతున్నారు. ⇒ఇలా కాకుండా ఆన్లైన్లో దరఖాస్తు పరిశీలించిన తర్వాత ఆన్లైన్లోనే రిమార్క్స్ పంపితే సరిపోతుందని, ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లతో కూడిన ఆఫ్‌లైన్ రికార్డును నిక్షిప్తం చేసి సదరు దరఖాస్తులకు పరిష్కారం చూపెడితే బాగుంటుందని వారంటున్నారు. ⇒నాలుగుసార్లు ఆన్లైన్లో, నాలుగుసార్లు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చక్కర్లు కొట్టిన తర్వాత పరిష్కారానికి ప్రత్యేక ఫైల్‌పెట్టి మళ్లీ ఆన్లైన్లో పరిష్కరించాల్సి వస్తుందని, ఈ పద్ధతిలో మార్పు తీసుకురావడంపై ఉన్నతస్థాయిలో సమీక్ష జరగాల్సి ఉందని వారంటున్నారు. ⇒ ఆ మార్పు జరిగినప్పుడే ధరణి దరఖాస్తులను వేగంగా పరిష్కరించే వెసులుబాటు ఉంటుందని చెబుతున్నారు. మూడు వారికి... రెండు వీరికి.. ధరణి దరఖాస్తుల పరిష్కారంలో భాగంగా క్షేత్రస్థాయిలో ఉండే తహసీల్దార్లు, ఆర్డీఓలకు ప్రస్తుతం చాలా తక్కువ అధికారాలున్నాయి. జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ), గ్రీవెన్స్ ల్యాండ్మ్యాటర్స్ (కులం, ఆధార్‌కార్డుల్లో తప్పులు నమోదు, పేర్లలో అక్షర దోషాలు సవరించడం) లాంటి అధికారాలు తహసీల్దార్లకు ఉండగా, కోర్టు కేసుల సమాచారం, పాస్‌బుక్ లేకుండా నాలా, సంస్థాగత పాస్బుక్కులిచ్చే అధికారాలు మాత్రం ఆర్డీఓలకు ఉన్నాయి.ఈ అధికారాలు మినహా అన్ని అంశాల్లో నిర్ణయాలు తీసుకునే బాధ్యతలు ఇప్పటికీ కలెక్టర్లకు ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా వికేంద్రీకరణ వీలున్నంత త్వరగా జరగాలని, క్షేత్రస్థాయిలో పరిష్కారం కాగలిగిన దరఖాస్తులను అక్కడే పరిష్కరించే అధికారాలు సదరు సిబ్బందికి కలి్పంచినప్పుడే ధరణి దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ వేగంగా ముందుకు సాగుతుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. నేడు వీడియో కాన్ఫరెన్స్‌లు ధరణి దరఖాస్తుల పురోగతిపై రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్‌మిత్తల్ శనివారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ నుంచి నిర్వహించనున్న ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు సిరిసిల్ల, భూపాలపల్లి, జగిత్యాల, మహబూబ్‌నగర్, మంచిర్యాల, వికారాబాద్, వనపర్తి, వరంగల్, ములుగు, నిర్మల్ జిల్లాలు, 12 నుంచి ఒంటి గంట వరకు మిగిలిన జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని సీఎంఆర్ఓ పీడీ వి. లచి్చరెడ్డి విడుదల చేసిన షెడ్యూల్లో పేర్కొన్నారు. -
ధరణి.. ఫుల్ చేంజ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల క్రయవిక్రయాల్లో కీలకమైన ‘ధరణి’పోర్టల్‌ను పునర్నిర్మించే ప్రక్రియలో భాగంగా పలు కీలక సిఫారసులు రూపొందుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో అమల్లో ఉన్న రికార్డ్ ఆఫ్ రైట్స్ చట్టం–2020ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందేనని ధరణి పునర్నిర్మాణ కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చట్టంలో 12 సెక్షన్లు పొందుపరచగా దాదాపు అన్ని సెక్షన్లలో పెద్ద ఎత్తున సవరణలను ప్రతిపాదించాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఈ మార్పులను ప్రస్తుత చట్టంలోనే చేస్తారా? లేక చట్టాన్నే మారుస్తారా? అనే దానిపై నిర్ణయాధికారం ప్రభుత్వానికే వదిలేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.కోదండరెడ్డి, భూచట్టాల నిపుణుడు ఎం.సునీల్‌కుమార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్, రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి.మధుసూదన్ల నేతృత్వంలోని కమిటీ ఈ మేరకు నివేదికను రూపొందించే పనిలో నిమగ్నమైంది. వాస్తవానికి క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తి చేసుకుని కమిటీ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే భాగస్వామ్య పక్షాలతో చర్చలు ముగిసేలోపే లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మధ్యంతర నివేదికను ఇవ్వాలని కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కోడ్ ముగిసిన వెంటనే ఈ నివేదికలోని సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం తాత్కాలిక చర్యలకు పూనుకుంటుందని, అనంతరం ధరణి కమిటీ ఇచ్చే పూర్తి స్థాయి నివేదికలోని సిఫారసుల మేరకు ధరణి పునర్నిర్మాణానికి అడుగులు పడతాయనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. సవరణ లేదా కొత్త చట్టం అనివార్యం!ధరణి పోర్టల్ పేరు మారాలన్నా, వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల నిర్వహణ, సమస్యల పరిష్కారంలో అధికార వికేంద్రీకరణ జరగాలన్నా చట్ట సవరణలు చేయడం లేదా కొత్త చట్టం అమల్లోకి తేవడం అనివార్యమని కమిటీ సిఫారసు చేయనుంది. అదే విధంగా ప్రస్తుతానికి ధరణి సమస్యల పరిష్కార ప్రక్రియ ఎక్కువగా కలెక్టర్ల చేతిలో ఉంది. తాజాగా జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం ఈ అధికారాలు కొన్ని అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు కట్టబెట్టినా వీటికి చట్టబద్ధత కలగాలంటే మాత్రం ఆర్వోఆర్ చట్టంలో మార్పులు తప్పనిసరిగా చేయాలని కమిటీ భావిస్తోంది. దీంతో పాటు రాష్ట్రంలో భూరికార్డుల నిర్వహణ ఎవరు చేపట్టాలి? రిజిస్ట్రేషన్లను ధరణి చట్టం ప్రకారం చేయాలా? స్టాంపుల చట్టం ప్రకారం చేయాలా? ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అధికారం ఎమ్మార్వోలకే ఉంచాలా? మళ్లీ సబ్ రిజి్రస్టార్లకు అప్పగించాలా? లేదా డిప్యూటీ తహసీల్దార్లకు కట్టబెట్టాలా? అన్న దానిపై కమిటీ నిశితంగా అధ్యయనం చేస్తున్నట్టు సమాచారం. కాగా తహసీల్దార్ల నుంచి ఈ అధికారాలను తప్పించాలనే యోచనలో కమిటీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక భూ రికార్డుల నిర్వహణ (ధరణి పోర్టల్) బాధ్యతలను ప్రైవేట్ కంపెనీకి కాకుండా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) లేదా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)లకు అప్పగించాలని కూడా కమిటీ సిఫారసు చేయనున్నట్టు సమాచారం. పార్ట్–బీపై ప్రత్యేకంగా.. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రాష్ట్రంలోని దాదాపు 18 లక్షల ఎకరాల వ్యవసాయ భూములను పార్ట్–బీ (నిషేధిత జాబితా)లో చేర్చారు. వీటికి సంబంధించి ఇప్పటివరకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వలేదు. ఈ పాసు పుస్తకాల కోసం రైతులు కాళ్లరిగేలా రెవెన్యూ కార్యాలయాలు, కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతున్నారు. కాగా ఇందులో 5 లక్షల ఎకరాలకు కనీసం ఎటువంటి కారణాలు చూపెట్టకుండానే పార్ట్–బీ ఆపాదించినట్టు తెలుస్తోంది. మిగిలిన వాటిలో కొన్నిటికి కోర్టు కేసులుండగా, కొన్నింటిని చిన్నచిన్న ఫిర్యాదుల ఆధారంగా పార్ట్–బీలో చేర్చారు. ఈ నేపథ్యంలో పార్ట్–బీ భూముల పరిష్కారానికి సంబంధించి కూడా మధ్యంతర నివేదికలో పలు సిఫారసులు పొందుపర్చనున్నారు. దరఖాస్తుల పరిష్కారం ఆగిందా?ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యల పరిష్కారం ఓ నిరంతర ప్రక్రియ. అయితే అధికార వికేంద్రీకరణ లేని కారణంగా రాష్ట్రంలో 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో పడిపోయాయి. వీటిని పరిష్కరించేందుకు పునరి్నర్మాణ కమిటీ చొరవతో ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. గడువు ముగిసినా మరోమారు పొడిగించింది. కానీ ఈలోపు ఎన్నికల కోడ్ రావడంతో స్పెషల్ డ్రైవ్‌ను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ సాకుతో ధరణి సాధారణ కార్యకలాపాలను కూడా నిలిపివేశారని, తహసీల్దార్ల స్థాయిలో తప్ప మిగిలిన ఏ స్థాయిలోనూ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించడం లేదని తెలుస్తోంది. ముఖ్యంగా టీఎం–33 కింద పెండింగ్‌లో ఉన్న లక్షకు పైగా దరఖాస్తుల్లో స్పెషల్ డ్రైవ్‌లో 20 వేల వరకు పరిష్కరించినా మిగిలిన వాటి జోలికి వెళ్లడం లేదని సమాచారం. ఇక జిల్లాల కలెక్టర్లు, సీసీఎల్ఏ స్థాయిలో ఏ దరఖాస్తును పరిష్కరించడం లేదని తెలుస్తోంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పి తప్పించుకుంటున్నారని, వాస్తవానికి ధరణి పోర్టల్ ద్వారా దరఖాస్తులు పరిష్కరించడానికి కోడ్ అడ్డంకి కాదని, స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు మాత్రమే కోడ్ అడ్డంకి అని చెపుతున్నా ఉన్నత స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు విని్పస్తున్నాయి. మొత్తం మీద స్పెషల్ డ్రైవ్ చేపట్టే నాటికి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులతో పాటు కొత్తగా వచి్చన మరో 50 వేలకు పైగా దరఖాస్తులు కలిపి మొత్తం 3 లక్షల దరఖాస్తులకు గాను ఇప్పటివరకు లక్షకు పైగా దరఖాస్తులు మాత్రమే పరిష్కారమైనట్లు సమాచారం. -
17 వరకు ధరణి స్పెషల్ డ్రైవ్
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూమి సమస్యలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల దరఖాస్తులను ధరణి పోర్టల్ ద్వారా పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌ను మరో వారం రోజుల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ నెల 17వ తేదీ వరకు డ్రైవ్‌ను కొనసాగించాలంటూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) నవీన్ మిత్తల్ సోమవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించగా, ఇంకా మిగిలిపోయిన దరఖాస్తులను క్లియర్ చేయడమే లక్ష్యంగా జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీసీఎల్ఏ సూచించారు. ఇది ఫస్ట్ ఎయిడ్ మాత్రమే: కోదండరెడ్డి, సునీల్ ధరణి పోర్టల్ విషయంలో తాము ఇప్పటివరకు ఫస్ట్ ఎయిడ్ (ప్రాథమిక చికిత్స) మాత్రమే ఇస్తున్నామని, అసలు ట్రీట్మెంట్ను ఇంకా ప్రారంభించలేదని ధరణి పోర్టల్ పునర్నిర్మాణ కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి, భూమి సునీల్ తెలిపారు. సోమవారం సచివాలయంలోని మీడియా పాయింట్లో వారు విలేకరులతో మాట్లాడారు. గతంలో పేరుకుపోయిన దరఖాస్తుల పరిష్కారం కోసమే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, ఈ డ్రైవ్‌ను ప్రభుత్వం మరో వారం రోజులు పొడిగించిందని చెప్పారు. అయితే ధరణి దరఖాస్తుల స్వీకరణ, పరిష్కారం నిరంతరం జరగాల్సిందేనన్నారు. గతంలో కలెక్టర్లు మాత్రమే ఈ దరఖాస్తులను పరిష్కరించేవారని, ఇప్పుడు తహశీల్దార్, ఆర్డీవోల స్థాయిలో అధికార వికేంద్రీకరణ జరపడమే కాకుండా, పరిష్కారానికి నిర్దేశిత టైంలైన్ విధించామని తెలిపారు. ధరణి పోర్టల్ విషయంలో సమూల మార్పులు తీసుకువస్తున్నామని, చట్టాలు, వ్యవస్థ, సాంకేతికతలో మార్పులు తీసుకు వచ్చేందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్న అవకాశాల పరిధిలో సమస్యలు పరిష్కరించాలనే ఉద్దేశంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. ధరణి పోర్టల్‌కు సంబంధించి దీర్ఘకాలిక పరిష్కారంపై ప్రభుత్వానికి నివేదికలిస్తామని, ఆ మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని అన్నా రు. ప్రస్తుతం చేపడుతున్నవి తాత్కాలిక చర్య లు మాత్రమేనని, 2, 3 నెలల్లో శాశ్వత పరిష్కారాలు సిఫారసు చేస్తామని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ను అడ్డుపెట్టుకుని మాజీ ఎంపీ సంతోశ్ అనేక అక్రమాలకు పాల్పడ్డారని, నిషేధిత జాబితాలోని భూములను కూడా రాత్రికి రాత్రి బదలాయించుకున్నారని కోదండరెడ్డి ఆరోపించారు. -
‘ధరణి’ పరిష్కారం 'పేపర్‌పైనే'!
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న వ్యవసాయ భూముల సమస్యలకు పరిష్కారం కాగితాలకే పరిమితం అవుతోంది. ఈ నెల 1 నుంచి 9వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్‌లో 76 వేలకుపైగా దరఖాస్తులను పరిష్కరించినట్టు ప్రభుత్వం చెప్తున్నా.. ఆ వివరాలేవీ పోర్టల్‌లో అప్డేట్ కాలేదు. అంతేకాదు పోర్టల్‌లోని సమస్యలన్నీ పరిష్కరిస్తామంటూ పెట్టుకున్న గడువు కూడా ముగిసింది. అయినా ఇంకా పెద్ద సంఖ్యలో పెండింగ్ దరఖాస్తులు మిగిలిపోయాయి. దీనితో డ్రైవ్‌ను పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నా క్షేత్రస్థాయి అధికారుల్లో మాత్రం గందరగోళం కనిపిస్తోంది. ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న ప్రైవేట్ కంపెనీ అవసరమైన లాగిన్లు ఇవ్వకపోవడంతోనే దరఖాస్తుల పరిష్కార వివరాలను ఆన్లైన్లో నమోదు చేయలేకపోతున్నట్టు రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. దీనితో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ధరణి’ స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం నెరవేరలేదన్న భావనలో రెవెన్యూ వర్గాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో గందరగోళం రాష్ట్రవ్యాప్తంగా ధరణి పోర్టల్‌లో పరిష్కారం కోసం వచ్చిన 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా 76,382 దరఖాస్తులను రెవెన్యూ యంత్రాంగం వివిధ స్థాయిల్లో పరిష్కరించింది. తహసీల్దార్, ఆర్డీవో, జేసీ, కలెక్టర్, సీసీఎల్ఏ స్థాయిల్లో ఆయా దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. కానీ ఆన్లైన్లో అప్డేట్ కాలేదు. ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో సమస్యల పరిష్కారానికి కేవలం కలెక్టర్లు, సీసీఎల్ఏ వద్ద మాత్రమే డిజిటల్‌తోపాటు అధీకృత లాగిన్లు ఉన్నాయి. తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్లకు లాగిన్లు లేవు. గతంలో తహసీల్దార్లకు డిజిటల్ లాగిన్లు ఇచ్చినా.. దరఖాస్తులను పరిష్కరించినట్టుగా పేర్కొని అప్డేట్ చేసే అదీకృత లాగిన్లు లేవు. అ«దీకృత లాగిన్లు ఇచ్చేందుకు మరో 10–20 రోజుల సమయం పడుతుందని ‘ధరణి’ నిర్వహణ కంపెనీ చెప్తున్నట్టు తెలిసింది. గడువు ముగిసిపోయినా.. స్పెషల్ డ్రైవ్ ప్రారంభానికి ముందే.. అన్నిస్థాయిల్లో అదీకృత లాగిన్లు ఇవ్వాలని పోర్టల్ నిర్వహణ కంపెనీని కోరినట్టు రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. కానీ కంపెనీ ఇప్పటివరకు ఆ లాగిన్లు ఇవ్వలేదని.. పరిష్కారమైన దరఖాస్తుల్లోని భూముల వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేసే వీలు లేకుండా పోయిందని అంటున్నాయి. స్పెషల్ డ్రైవ్ కోసం ప్రభుత్వం పెట్టిన గడువు కూడా ముగిసింది. దరఖాస్తులు ఇంకా భారీగా పెండింగ్‌లో ఉండటంతో డ్రైవ్‌ను పొడగించాలని సర్కారు భావిస్తోంది. ఈ నేపథ్యంలో అన్నిస్థాయిల్లో లాగిన్లు వచ్చేదాకా పరిష్కారమైన దరఖాస్తుల వివరాలన్నీ కలెక్టర్ల లాగిన్లకు పంపి అక్కడి నుంచి ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడి మధ్య ఉన్న కలెక్టర్ల పరిధిలో ఈ ప్రక్రియ కష్టమని స్పష్టం చేస్తున్నాయి. స్పెషల్ డ్రైవ్‌కు అభ్యంతరం చెప్పినా..? వాస్తవానికి ధరణి పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టవద్దనే చర్చ ఉన్నతస్థాయిలో జరిగినట్టు తెలిసింది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వద్ద జరిగిన చర్చల సందర్భంగా.. రెవెన్యూ శాఖలోని ముఖ్య అధికారి ఒకరు స్పెషల్ డ్రైవ్ నిర్వహణకు అభ్యంతరం చెప్పారని, ఎన్నికల కోడ్ వస్తే ఆపేయాల్సి వస్తుందని సూచించారని సమాచారం. ఎన్నికల కోడ్‌కు, ధరణి సమస్యల పరిష్కారానికి ఎలాంటి సంబంధం ఉండదని.. 2017లో ప్రారంభమైన ఈ ప్రక్రియకు ఎన్నికల కోడ్‌తో ముడిపెట్టాల్సిన అవసరం లేదని ధరణి కమిటీలోని ఓ సభ్యుడు చెప్పడంతో స్పెషల్‌డ్రైవ్ ప్రకటన జరిగిందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం కోసం విధివిధానాలు రూపొందించే సమయంలోనూ ఇలాంటి సమస్య వచ్చిందని తెలిసింది. రాష్ట్రంలో రెగ్యులర్ సీసీఎల్ఏను నియమిస్తేనే ధరణి సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారం సాధ్యమవుతుందని సీఎంతో జరిగిన చర్చల సందర్భంగా ధరణి కమిటీలోని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నట్టు రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ‘ధరణి’పై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్నిస్థాయిల్లో లాగిన్లను ధరణి పోర్టల్ నిర్వహణ కంపెనీ ఎప్పటికి సమకూరుస్తుంది? స్పెషల్ డ్రైవ్ ఉద్దేశం ఏ మేరకు నెరవేరుతుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
‘ధరణి’ అధికారాల బదలాయింపు!
సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు కలెక్టర్లకు మాత్రమే ‘ధరణి’దరఖాస్తుల పరిష్కార అధికారాలుండగా, వికేంద్రీకరణ ద్వారా తహసీల్దార్లు, ఆర్డీఓలు, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ)కు కొన్ని అధికారాలు కట్టబెట్టనున్నారు. ధరణి పోర్టల్ పునర్నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ సూచన మేరకు రైతు సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాల బదలాయింపు కసరత్తు చురుగ్గా సాగుతోంది. ఏ అధికారికి ఏ దరఖాస్తు పరిష్కరించే అధికారం ఇవ్వాలన్న దానిపై రెవెన్యూశాఖ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ♦ ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం 35 మాడ్యూళ్లు అందుబాటులో ఉన్నాయి. ♦ తాజా లెక్కల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 2.45 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో రెండు మాడ్యూళ్లలో మాత్రమే 1.5 లక్షల దరఖాస్తులున్నాయని ధరణి కమిటీ గుర్తించింది. ♦ టీఎం 14 (గ్రీవెన్సెస్ ఆన్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్) మాడ్యూల్లో 40,435 దరఖాస్తులు, టీఎం 33 (మాడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్) మాడ్యూల్లో 1.05 లక్షల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ♦ మిగిలిన 33 మాడ్యూళ్లలో ఉన్న దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారాల బదలాయింపునకు కసరత్తు జరుగుతుండగా, ముఖ్యమైన టీఎం 14, 33 మాడ్యూళ్లలో ఏ దరఖాస్తులు ఎవరు పరిష్కరించాలన్న దానిపై ధరణి కమిటీతో పాటు రెవెన్యూశాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. అవసరమైతేనే సీసీఎల్ఏకు ♦ ధరణి మాడ్యూళ్ల (టీఎం14, టీఎం33)లోని దరఖాస్తులను తహసీల్దార్, ఆర్డీఓ, అదనపు కలెక్టర్, కలెక్టర్‌తో పాటు సీసీఎల్ఏలకు అధికారాలు కల్పిస్తూ వికేంద్రీకరణ కసరత్తు జరుగుతోంది. ♦ టీఎం14లో ఆధార్ తప్పులు, ఆధార్ అందుబాటులో లేకపోవడం, తండ్రి, భర్త పేరులో తప్పులు, ఫొటో మిస్ కావడం, జెండర్, కులం తప్పుగా నమోదు కావడం, సర్వే నంబర్ మిస్సింగ్, తహసీల్దార్ల డిజిటల్ సంతకాలు లేకపోవడంలాంటి సమస్యలున్నాయి. వీటిలో సర్వేనంబరు మిస్సింగ్ మినహా ఇతర సమస్యల పరిష్కార అధికారాలు తహసీల్దార్లకు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ♦ సర్వేనంబరు మిస్సింగ్ దరఖాస్తుల పరి ష్కారం ఆర్డీఓలకు అప్పగించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఇక, టీఎం 33లో భాగమైన పాసుపుస్తకాల్లోని తప్పుల సవరణ, నోషనల్ ఖాతా (ప్రభుత్వ భూమి ఉండే ఖాతా) నుంచి పట్టాభూమిగా మార్పు, పాసు పుస్తకంలోని పేరుమార్పు, మిస్సింగ్ సర్వేనంబరు, భూమి వర్గీకరణ, భూమి స్వభావం, భూమి రకం, భూమి అనుభవదారుని పేరు లాంటి సమస్యలను పరిష్కరించే అధికారాన్ని తహసీల్దార్లు, ఆర్డీఓల సి ఫారసులతో కలెక్టర్లకు అప్పగించనున్నారు. ♦ నోషనల్ ఖాతామార్పు అధికారం విషయంలో అవసరమైతే సీసీఎల్ఏ అనుమతి తీసు కునేలా మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. మిగిలిన మాడ్యూళ్లలో కొన్నింటిని అద నపు కలెక్టర్లు (రెవెన్యూ)కు అప్పగించనున్నారు. ఈ మేరకు ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల సమస్యలను పరిష్కరించే అధికారాలను వికేంద్రీకరించే ప్రక్రియ త్వరలోనే ఓ కొలిక్కి వస్తుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. -
నిరుపేదలకు భూమి
సాక్షి, అమరావతి: సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో నిరుపేదలకు వైఎస్ జగన్ ప్రభుత్వం వ్యవసాయ భూములు పంపిణీ చేయనుంది. 23 జిల్లాల్లో 54 వేల ఎకరాలను అర్హులైన పేదలకు పంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లో అర్హులైన సుమారు 47 వేల మంది లబ్దిదారులను ఎంపిక చేసింది. ఆయా జిల్లాల అసైన్మెంట్ కమిటీల ఆమోదం కూడా దాదాపు పూర్తయింది. భూమి లభ్యతను బట్టి ఒక్కో లబ్ధిదారునికి ఒకటి నుంచి ఒకటిన్నర ఎకరం వరకు భూమి ఇవ్వనున్నారు. గ్రామాల్లో నిరుపేదలకు వ్యవసాయ భూములు ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ ఏడాది కిందటే కసరత్తు మొదలుపెట్టారు. అన్ని జిల్లాల్లో పేదలకు ఇవ్వడానికి అందుబాటులో ఉన్న భూమి, అర్హులైన లబ్దిదారుల వివరాలతో నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ల పరిశీలన తర్వాత 23 జిల్లాల్లోనే భూమి అందుబాటులో ఉన్నట్లు తేలింది. వైఎస్సార్, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఆశాజనకంగా భూమి అందుబాటులో ఉండగా, మరో 8 జిల్లాల్లో వెయ్యి నుంచి 4 వేల ఎకరాల లోపు భూమి లభ్యత ఉన్నట్లు నిర్ధారణ అయింది. మరో 9 జిల్లాల్లో వెయ్యి నుంచి 2 వేల ఎకరాల భూమి ఉండగా, 4 జిల్లాల్లో వెయ్యి ఎకరాల లోపు భూమి అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్లు నివేదికలు ఇచ్చారు. విశాఖ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో భూమి అందుబాటులో లేదు. దీంతో భూమి లభ్యత ఉన్న 23 జిల్లాల్లో గుర్తించిన భూమిని సర్వే చేసి, డిమార్కేషన్ చేయించారు. అసైన్మెంట్ కమిటీల అనుమతులు కూడా లభించాయి. త్వరలో మంత్రివర్గం భూ పంపిణీకి ఆమోదముద్ర వేసే అవకాశం ఉంది. వైఎస్సార్ జిల్లాలో 8,916 ఎకరాలు అత్యధికంగా వైఎస్సార్ జిల్లాలో 8,916 ఎకరాలను పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత శ్రీ సత్యసాయి జిల్లాలో 7,476, కర్నూలు 4,092, నంద్యాల 3,678, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు 3,711, కాకినాడ 2,935, చిత్తూరు 2,866, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2,565 ఎకరాలను పంపిణీ చేయనున్నారు. భూ పంపిణీలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూసేందుకు ఇళ్ల పట్టాల పంపిణీ మాదిరిగా ఆన్లైన్ సేవా యాప్‌ను వినియోగించనున్నారు. ఈ యాప్ ద్వారానే అర్హులకు పట్టాలు జెనరేట్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. తొలుత లబ్దిదారుల పేర్లను వెబ్‌ల్యాండ్‌లో మ్యుటేషన్ చేస్తారు. భూ పంపిణీ కోసం ప్రత్యేకంగా మ్యుటేషన్ చేసే అధికారాన్ని ఆర్డీఓలకు ఇచ్చారు. మామూలుగా అయితే ఈ లాగిన్ జేసీల వద్ద ఉంటుంది. ఆర్డీఓలు మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేశాక, ఆ వివరాల ఆధారంగా వీఆర్ఓలు తమ గ్రామాల పరిధిలోని లబ్దిదారుల వ్యక్తిగత వివరాలను యాప్‌లో అప్లోడ్ చేస్తారు. చివరిగా అవి తహశీల్దార్ లాగిన్లోకి వెళ్లాక ఆయన పరిశీలించి అనుమతిస్తారు. అప్పుడు లబ్ధిదారుని పేరుపై వ్యవసాయ భూమి పట్టా జెనరేట్ అవుతుంది. దీంతో లబ్దిదారుల వివరాలన్నీ వెబ్‌ల్యాండ్‌లో, ఆన్లైన్ యాప్‌లోనూ ఉంటాయి. వాటిని మార్చడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. 2013లో చివరి సారిగా భూ పంపిణీ రాష్ట్రంలో చివరిసారిగా 2013లో భూ పంపిణీ జరిగింది. తక్కువ భూమి అయినా పేదలకివ్వడం అదే చివరిసారి. ఆ తర్వాత భూ పంపిణీ గురించి ఎవరూ పట్టించుకోలేదు. పేదలు మాత్రం తమ జీవనోపాధికి కొంత భూమి ఇవ్వాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరుతూనే ఉన్నారు. అలాంటి దరఖాస్తులు తహశీల్దార్, ఆర్డీఓ, కలెక్టరేట్లలో ఎప్పటి నుంచో మూలనపడి ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎవరూ అడగకుండానే నిరుపేదలకు మేలు చేయాలనే సంకల్పంతో భూ పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. పేదల అభ్యున్నతి దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేస్తోంది. కూలినాలి చేసుకుని కష్టంగా బతుకు బండి లాగుతున్న వారిని, కౌలుకు తీసుకుని ఆరుగాలం శ్రమిస్తున్న వారిని భూ యజమానులుగా చేయనుంది. తద్వారా ‘ఈ భూమి మాదే’ అని అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు గర్వంగా చెప్పుకునేలా చేయాలని తాపత్రయ పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 54 వేల ఎకరాల భూ పంపిణీకి వేగంగా చర్యలు తీసుకుంటోంది. పట్టాపైనే పూర్తి వివరాల నమోదు పట్టాలపై గతంలో మాదిరి కాకుండా లబ్దిదారుని పూర్తి వివరాలు నమోదు చేయనున్నారు. వీటితోపాటు భూమికి సంబంధించిన సర్వే నంబర్ (లేదా ఎల్పీఎం నంబర్), విస్తీర్ణం, ఖాతా నంబర్, భూమి స్వభావాన్ని కూడా ముద్రించనున్నారు. సర్వే నంబరు వారీగా భూమిని గుణించి మొత్తం విస్తీర్ణాన్ని పట్టాపై కనిపించేలా ఏర్పాటు చేస్తున్నారు. పట్టాపై లబ్దిదారుడు, భూమికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయడం వల్ల ఆ భూమిని భవిష్యత్తులో మరొకరికి బదలాయించే అవకాశం ఉండదని రెవెన్యూ అధికారులు భావిస్తున్నారు. ఆధార్ నంబర్ కూడా పట్టాపై నమోదు చేయడం ద్వారా మరోసారి భూమి కోసం సంబంధిత లబ్ధిదారు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. -
‘ధరణి’తో సమస్యలు పెరిగాయి
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూ సమస్యల పరిష్కారం, నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన మేర ఫలితాలు ఇవ్వడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో రైతుల సమస్యలు పెరిగాయని, ఎక్కడికి పోయి వీటిని పరిష్కరించుకోవాలో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొందని పేర్కొంది. పొరపాట్లను సరిచేసుకునే ఆప్షన్లు లేక ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెప్పింది. బ్రోకర్లకే లబ్ధి అనేలా ధరణి పోర్టల్ తయారైందని.. ఇన్నేళ్లయినా సమస్యలు పరిష్కరించకపోవడం ప్రజల హక్కులను కాలరాయడమే అవుతుందని సర్కార్‌ను మందలించింది. ధరణి పోర్టల్‌లో తలెత్తుతున్న సమస్యలపై దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ)ను కోర్టుకు పిలిపించి వివరణ తీసుకున్నారు. సీసీఎల్ఏ నవీన్ మిత్తల్ వ్యక్తిగతంగా హైకోర్టుకు హాజరై 4 వారాల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జస్టిస్ కె.లక్ష్మణ్ ఆర్డర్ కాపీలో ధరణిలోని పలు సమస్యలను ప్రస్తావించారు. ధరణిలో హైకోర్టు పేర్కొన్న ప్రధాన సమస్యలు 1. డేటా సవరణ కోసం పెట్టుకున్న ఆన్లైన్ అర్జీలను పరిష్కరించకపోవడం 2. నిర్ణీత సమయంలో ఈ–పట్టాదార్ పాస్ పుస్తకాలను జారీ చేయకపోవడం 3. సర్వే కోసం ఎఫ్–లైన్ దరఖాస్తులు పెట్టుకున్నా పట్టించుకోకపోవడం.. కాలవ్యవధి పాటించకపోవడం 4. వేలంలో కొనుగోలు చేసిన వారికి బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు జారీ చేసిన కొనుగోలు డాక్యుమెంట్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడం 5. ఏ కారణాలు చెప్పకుండా ఆన్లైన్/ఎఫ్–లైన్ దరఖాస్తులను తిరస్కరించడం 6. సెక్షన్ 7కు లిమిటేషన్ పీరియడ్ వివరంగా చెప్పలేదు. ఎప్పటినుంచి న్యాయస్థానం డిక్రీలు పరిగణనలోకి తీసుకుని మార్పు చేస్తారో చెప్పలేదు. 7. అమ్మకం, కొనుగోలు లావాదేవీలను సకాలంలో పూర్తి చేయడానికి ధరణిలో అప్లోడ్ చేసిన జనరల్, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీలను పట్టించుకోకపోవడం. 8. ఆర్వోఆర్ చట్టం సెక్షన్ 7లో పేర్కొన్న ‘కోర్టు డిక్రీ’ అనే దానిలో స్పష్టత లేదు. 9. కోర్టు కేసులు, స్టే, ఇంజెంక్షన్ ఆదేశాల్లో వివాదం ఉన్న భూమి మాత్రమే కాకుండా.. సదరు సర్వే నంబర్లోని భూములన్నింటినీ నిషేధిత జాబితాలో పెడుతున్నారు. 10. కొత్త ఆర్వోఆర్ యాక్ట్ రాకముందు పాత ఆర్వోఆర్ చట్టం–1971లోని సెక్షన్ 5(బీ), 5(5), 9 కింద రెవెన్యూ అధికారులు జారీ చేసిన ఆదేశాలపై అప్పీల్ లేదా రివిజన్‌కు అవకాశం కల్పించే ప్రొవిజన్లు లేవు. దీంతో కొత్త చట్టం రాకముందు అధికారులిచ్చిన ఆదేశాలను సవాల్ చేయడానికి తెలంగాణ జనరల్ క్లాజెస్ చట్టం–1891 కింద అప్పీల్‌కు అవకాశం ఇవ్వాలని కొందరు పిటిషన్లు వేస్తున్నారు. 11. పాత ఆర్వోఆర్ చట్టం ప్రకారం రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఆదేశాలపై అప్పీళ్లు, రివిజన్ పిటిషన్లను కొత్త ఆర్వోఆర్ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక ట్రిబ్యునళ్లకు పంపాల్సి ఉంటుంది. అలాంటి అప్పీళ్లను ఇప్పటికీ ప్రత్యేక ట్రిబ్యునళ్లకు పంపలేదు. 12. అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్‌కు మారిన భూమి మాత్రమే కాకుండా మొత్తం ఆ సర్వే నంబర్‌ను ‘నాలా’ జాబితాలో చూపిస్తున్నారు. 13. రీసర్వే సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్)లో నమోదైన భూమిలో కొంత భాగాన్ని మార్చడానికి ఎటువంటి ఆప్షన్ అందుబాటులో లేదు. 14. పొరపాటున ఏదైనా సర్వే నంబర్ నిషేధిత జాబితాలో చేరినా.. ప్రభుత్వ భూమి అని నమోదైనా దానిని మార్చడానికి ఆప్షన్ అందుబాటులో లేదు. 15. మ్యుటేషన్ చేయాలని కోరుతున్న వ్యక్తికి ఉన్న టైటిల్‌ను తనిఖీ చేయడం అధికారులకు కష్టమైన పనిగా మారింది. మ్యుటేషన్ చేయాలని కోరుతున్న భూమి లింక్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేసేలా ఆప్షన్ ఉండాలి. 16. ఉమ్మడిగా కొనుగోలు చేసిన భూమి లేదా ఉమ్మడి పట్టాదారుల మధ్య ఉన్న భూమిని హక్కుదారుల మధ్య విభజించడానికి ఎలాంటి ఆప్షన్ లేదు. 17. చనిపోయిన విక్రయదారు వారసుల నుంచి పట్టా పొందే వీలు లేదు. 18. మిస్సింగ్ సర్వే నంబర్లు మళ్లీ చేర్చడానికి, తప్పుడు ఎంట్రీలు మార్చే ఆప్షన్ లేదు. 19. భూ యజమాని నుంచి ప్రభుత్వం భూమి సేకరించిన తర్వాత ఆ భూమిని డిలీట్ చేయడానికి ఆప్షన్ ఇవ్వలేదు. 20. అలాగే ప్రభుత్వం అసైన్ చేసిన భూముల వివరాలు కూడా ధరణిలో కనిపించడం లేదు. ► ఇవికాక కోర్టు దృష్టికి రాని ఎన్నో సమస్యలు ఉన్నాయని న్యాయమూర్తి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ధరణికి నేటితో ఏడాది.. సీఎం కేసీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల లావాదేవీల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ నేటితో ఏడాది పూర్తి చేసుకుంటోంది. గతేడాది అక్టోబర్ 29న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడు చింతలపల్లి గ్రామంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పోర్టల్ ప్రారంభమైంది. అయితే పోర్టల్ ద్వారా ఆన్లైన్లో అధికారిక కార్యకలాపాలు మాత్రం నవంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ఏడాదిలో మొత్తం 10.45 లక్షలకు పైగా ధరణి ద్వారా వ్యవసాయ భూముల లావాదేవీలు జరిగాయని లెక్కలు చెబుతున్నాయి. ఇందులో భూముల రిజిస్ట్రేషన్లు 75 శాతం ఉండగా, 25 శాతం మేర మ్యుటేషన్లు, పంపకాలు, వారసత్వ హక్కులు, వ్యవసాయేతర భూములుగా మార్చే కార్యకలాపాలు జరిగాయని ధరణి పోర్టల్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం దరఖాస్తుల్లో ఇప్పటివరకు 96 శాతం దరఖాస్తులు పరిష్కారం కాగా, 4 శాతం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. మొత్తమ్మీద ఈ ఏడాది జరిగిన ధరణి పోర్టల్ లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి రూ.750 కోట్ల ఆదాయం వచ్చినట్లు సీసీఎల్ఏ వర్గాలు చెబుతున్నాయి. కొంచెం ఇష్టం.. ఇంకొంచెం కష్టం అవినీతికి, ఆలస్యానికి తావు లేకుండా వ్యవసాయ భూముల క్రయవిక్రయాల లావాదేవీలను పారదర్శకంగా జరపాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ద్వారా మిశ్రమ ఫలితాలు వస్తున్నాయని క్షేత్రస్థాయి పరిస్థితులు చెబుతున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా, వీలున్నంత త్వరగా లావాదేవీలు పూర్తి చేయడం, ఈ లావాదేవీల ద్వారా రైతు ఇంటికే నేరుగా హక్కు పత్రాలు పంపే విషయంలో ధరణి సమర్థంగానే పనిచేస్తోందనే అభిప్రాయం ఉంది. చదవండి: (కర్నూలు జిల్లా 'మిర్చి' రైతులకు మంచిరోజులు..) అయితే సమన్వయ లోపం, సాంకేతిక సమస్యల కారణంగా రైతాంగం ధరణి పోర్టల్ ద్వారా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. దరఖాస్తుల పరిష్కారానికి చాలా సమయం తీసుకుంటోంది. దరఖాస్తుల పరిష్కారానికి ఏర్పాటు చేసిన మూడంచెల వ్యవస్థ, కలెక్టర్ల పని ఒత్తిడి లాంటి అంశాల కారణంగా ఎడతెగని జాప్యం జరుగుతుండటం, ధరణి పోర్టల్ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి స్పెషల్ డ్రైవ్‌లు చేపట్టకపోవడం వల్ల ఆలస్యం జరుగుతోందని రైతులు చెబుతున్నారు. పోర్టల్ ద్వారా సమస్యలను పరిష్కరించే అధికారం కలెక్టర్లకే కట్టబెట్టడం ప్రధాన సమస్యగా మారిందని చెప్పొచ్చు. మొత్తం మీద పారదర్శకతను తీసుకొచ్చే క్రమంలో ధరణి వ్యవస్థ ప్రస్తుతానికి బాలారిష్టాలను దాటే దశలో ఉందని, దీనిపై ప్రభుత్వం మరింత దృష్టి సారించి పనిచేస్తే వీలున్నంత త్వరలోనే వ్యవసాయ భూముల లావాదేవీలు మరింత పారదర్శకంగా నిర్వహించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త చట్టానికీ ఏడాది కాగా, గతంలో ఉన్న చట్టానికి మార్పులు చేసుకుని భూ హక్కులు, పాసుపుస్తకాల చట్టం–2020 (ఆర్వోఆర్) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టం కూడా ఏడాది పూర్తి చేసుకుంది. ఈ చట్టాన్ని 2020 అక్టోబర్ 29 నుంచి అమల్లోకి తెస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ అదే ఏడాది అక్టోబర్ 28న నోటిఫికేషన్ జారీ చేశారు. అంతకుముందు సెప్టెంబర్ 9న ఈ చట్టానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. సీఎం అభినందనలు ధరణి పోర్టల్ సేవలను ఏడాది కాలంగా విజయవంతంగా అమలు చేస్తున్న సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలోని అధికారుల బృందం, అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం కేసీఆర్ అభినందించారు. ధరణి పోర్టల్ అందిస్తున్న పారదర్శక, అవాంతరాలు లేని సేవల కారణంగా ప్రజలు, ముఖ్యంగా వ్యవసాయదారులు, రైతులు ఎంతో ప్రయోజనం పొందారని గురువారం ఓ ప్రకటనలో ఆయన హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ధరణి మరిన్ని విజయాలు సాధిస్తుందని సీఎం కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, ధరణిని విజయవంతంగా అమలు చేస్తున్నందుకు గాను రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్లు, తహశీల్దార్లను సీఎస్ సోమేశ్ కుమార్ మరొక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. -
Telangana: దారిలోకి ‘ధరణి’
♦ రాష్ట్రంలోని వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల లావాదేవీల కోసం గత ఏడాది నవంబర్‌లో ప్రారంభమైన ధరణి పోర్టల్ 8 నెలల తర్వాత రైతులకు వీలైనన్ని ఎక్కువ సేవలు అందించే స్థాయికి చేరింది. ♦ గత వారంలో పెండింగ్ మ్యుటేషన్లు, పాస్‌పుస్తకాలు లేని భూములకు నాలా, కోర్టు కేసులున్న సర్వే నంబర్ల నుంచి ఏ కేసులు లేని భూముల తొలగింపు, లాక్డౌన్ కాలంలో బుక్ చేసుకున్న స్లాట్ల రీషెడ్యూల్ లాంటి ఆప్షన్లను అందుబాటులోకి తేవడం విశేషం. ♦ భూముల విస్తీర్ణం, పేర్ల నమోదులో తప్పుల సవరణ వినతులకు పరిష్కారం దొరకడంతో లక్షలాది మంది రైతులకు ఊరట కలుగుతుందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ♦ పెండింగ్ మ్యుటేషన్ల (ధరణి కంటే ముందు జరిగిన రిజిస్ట్రేషన్లకు సంబంధించి) కింద 1,21,643 దరఖాస్తులు రాగా, 1,21,167 దరఖాస్తులను పరిష్కరించారు. మొత్తం 29 రకాల సేవలు అందిస్తున్న ధరణి పోర్టల్ సాక్షి, హైదరాబాద్: ధరణి బాలారిష్టాలను దాటు తోంది. రాష్ట్రంలోని వ్యవసాయ భూముల రిజి స్ట్రేషన్ల లావాదేవీల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తెచ్చిన ఈ పోర్టల్ దారిన పడుతోంది. సీసీ ఎల్ఏ వర్గాల నిర్లక్ష్యం, సాంకేతిక టీంను సమ కూర్చుకోవడంలో వైఫల్యం లాంటి కారణాలతో ధరణి అంటేనే అటు రైతులకు, ఇటు రెవెన్యూ వర్గా లకు విసుగు పుట్టేది. కనీసం పాస్‌పుస్తకంలో పేరు మార్చుకునేందుకు, భూమి తక్కువ పడితే ఉన్నంత మేరకు భూమిని నమోదు చేసుకునేందుకు తహసీ ల్దార్ కార్యాలయాల చుట్టూ రైతులు ప్రదక్షిణాలు చేయాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడు క్రమంగా అందు బాటులోకి వస్తున్న ఆప్షన్లు ధరణి పోర్టల్ ప్రయో జనాన్ని నెరవేరుస్తున్నాయనే అభిప్రాయం రెవెన్యూ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే, పూర్తి స్థాయిలో ఈ ఆప్షన్లకు సంబంధించిన సాంకేతిక సహకారం తక్షణమే సమకూరేలా చూడాలని, బ్యాకెండ్ సమాచారాన్ని అటు కలెక్టర్లకు గానీ, ఇటు తమకు గానీ అందుబాటులోకి తెస్తే మరింత ప్రయోజనం ఉంటుందని తహశీల్దార్లు చెబుతున్నారు. వివాదాల పరిష్కారానికి ఆప్షన్లు తాజాగా పలు రకాల భూ సమస్యలు, వివాదాల పరిష్కారానికి కూడా కొన్ని ఆప్షన్లు ధరణి పోర్టల్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూము లుగా చూపడం, డూప్లికేట్ పాస్ పుస్తకానికి దర ఖాస్తు చేసినా రాకపోవడం, జీపీఏ రిజిస్ట్రేషన్లలో సాంకేతిక సమస్యలు, పేర్లు, భూవిస్తీర్ణం నమోదులో తప్పుల సవరణ, కొన్ని సర్వే నంబర్లు నమోదు కాకపోవడం, రద్దు చేసుకున్న స్లాట్లకు చెల్లించిన రుసుము తిరిగి రైతులకు అందకపోవడం లాంటి సమస్యల పరిష్కారానికి ఆప్షన్లు వచ్చాయి. 8 నెలలు... ఆరు లక్షలు గత నవంబర్ 2న ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ ఏడాది జూలై 2 వరకు అంటే 8 నెలల కాలంలో మొత్తం 6 లక్షల లావాదేవీలు జరిగాయి. ఇందులో 4.5 లక్షలు రిజిస్ట్రేషన్లు/మ్యుటేషన్లు కాగా, 36 వేలకు పైగా వారసత్వం, 2,039 భాగపంపకాలు, 16,705 నాలా దరఖాస్తులు పరిష్కారమైనట్లు ధరణి పోర్టల్ గణాంకాలు వెల్లడించాయి. ఆప్షన్లు వచ్చినా....! ధరణిలో ఇటీవలి కాలంలో అనేక ఆప్షన్లు అందుబాటులోకి వచ్చినా కొన్నింటి విషయంలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయని రెవెన్యూ వర్గాలు చెప్పాయి. ఉదాహరణకు భూవిస్తీర్ణం తప్పు పడితే సరిచేసుకునేందుకు ఆప్షన్ ఇచ్చారు కానీ, ఆ విస్తీర్ణం సరిచేసే అధికారం అటు రెవెన్యూ వర్గాలకు కానీ, ఇటు కలెక్టర్‌కు కానీ ఇవ్వడం లేదన్నాయి. ఇంతవరకు నమోదుకాని సర్వే నంబర్లను ధరణిలో నమోదు చేయడం, ప్రభుత్వ భూములు, భూసేకరణ జరిపిన భూముల సర్వే నంబర్లలో మిగిలిన పట్టా భూములకు లావాదేవీలు లాంటి సమస్యలను బ్యాకెండ్‌లో మార్చాల్సి ఉందని తహశీల్దార్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ఆప్షన్లు అందుబాటులోకి తెచ్చిన తర్వాత వెంటనే సంబంధిత సాంకేతిక సమస్యలను కూడా ఓ కొలిక్కి తేవాలని వారన్నారు. ధరణిలో అందుబాటులో ఉన్న సేవలివీ... 1) స్లాట్ బుకింగ్ 2) అమ్మకం, గిఫ్ట్ రిజిస్ట్రేషన్ 3) మ్యుటేషన్ 4) వారసత్వం 5) భాగపంపకాలు 6) నాలా 7) పాస్‌బుక్ లేకుండా నాలా 8) మార్టిగేజ్ రిజిస్ట్రేషన్ 9) లీజు దరఖాస్తు 10) ధరణి పోర్టల్ కంటే ముందు జరిగిన జీపీఏ లావాదేవీలు 11) ఆ తర్వాతి జీపీఏ లావాదేవీలు 12) జీపీఏ రిజిస్ట్రేషన్ 13) డెవలపర్ జీపీఏ రిజిస్ట్రేషన్ 14) పలు భూసమస్యలపై వినతులు, 15) నిషేధిత భూముల కేటగిరీలో పొరపాటున నమోదైన సర్వే నంబర్ల తొలగింపు 16) భూసేకరణ వినతులు 17) స్లాట్ రద్దు చేసుకునే అవకాశం 18) స్లాట్ రీషెడ్యూల్ 19) రిజిస్టర్డ్ డాక్యుమెంట్ల ధ్రువీకరణ 20) ఎన్ఆర్ఐ పోర్టల్ 21) ఆధార్ ధ్రువీకరణ కాని భూములకు పాస్‌పుస్తకాలు 22) ఫర్మ్‌లు, కంపెనీల భూములకు పాస్‌పుస్తకాలు 23) సెమీ అర్బన్ భూములకు పాస్ పుస్తకాలు 24) కోర్టు తీర్పుల ఆధారంగా పాస్‌పుస్తకాలు 25) డూప్లికేట్ పాస్‌పుస్తకాలు 26) కోర్టుకేసుల్లోని భూములపై లావాదేవీల నిలిపివేత దరఖాస్తులు 27) పెండింగ్ నాలా దరఖాస్తులు 28) సాంకేతిక సమస్యలకు సంబంధించిన వినతులు, 29) భూవివరాల గోప్యత (గమనిక: ఈ సేవలకు సంబంధించి పలు ఆప్షన్లు ఉంటాయి. భూవివాదం, అవసరాన్ని బట్టి ఆయా సేవలకు సంబంధించిన ఆప్షన్లను ఎంచుకుని ధరణి పోర్టల్ ద్వారా మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.) -
ఈ బిల్లుతో అవినీతి అంతం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా బదలాయించేందుకు అధికారులకున్న విచక్షణాధికారాల రద్దుతో అవినీతికి, అవకతవకలకు ఆస్కారం తగ్గి పూర్తి పారదర్శకత సాధ్యమవుతుందని శాసనసభా వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ధరణి ద్వారా ఆన్లైన్ విధానంలో వ్యవసాయేతర భూముల బదలాయింపు దరఖాస్తు చేసుకునేలా నాలా చట్టాన్ని సవరించామని.. దీని ద్వారా రైతుకు, బిల్డ ర్కు ప్రయోజనం కలుగుతుందన్నారు. మంగళవారం తెలంగాణ అగ్రికల్చర్ ల్యాండ్ సవరణ బిల్లు (కన్వర్షన్ నా న్ అగ్రికల్చర్ ల్యాండ్)– 2020, ఇండియన్ స్టాంప్ (తెలం గాణ సవరణ) బిల్లు– 2020ను శాసనసభలో ప్రశాంత్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. పాత చట్టంలో వ్య వసాయ భూమిని వ్యవసాయేతరగా మార్చే ప్రక్రియలో ఆర్డీఓకు కొన్ని విచక్షణాధికారాలు ఉండేవని, ఈ క్రమంలో కొంత అవినీతికి ఆస్కారం ఏర్పడిందన్నారు. ఈ సవరణ బిల్లుతో ఆర్డీఓ ఆ అధికారాన్ని కోల్పోతారని, ధరణి ద్వా రా ఆన్లైన్లో సత్వరమే ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నా రు. ఇప్పటికే ఎవరైనా వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించుకుంటున్న వారు మూడు నెలల్లోగా దరఖాస్తు చేసుకుంటే ప్రస్తుతం విధిస్తున్న 50% జరిమానా ఉండదని వివరించారు. ఇక భూముల ప్రాథమిక విలువ నిర్ధారణకు సంబంధించి సబ్ రిజిస్ట్రార్లకు 47ఏ కింద విచక్షణాధికారాలను తొలగిస్తూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టానికి సవరణ చేసినట్టు తెలిపారు. ఈ బిల్లు ద్వారా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌తోపాటు డాక్యుమెంట్లకు ఒకేరోజు పొందే అవకాశం ఉంటుందని వెల్లడించారు. సక్రమంగా ఉన్నాయో లేదో చూడాలి: అధికార పక్ష సభ్యులు గొంగిడి సునీత, మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో పాటు కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత భట్టి విక్రమార్క, ఎంఐఎం సభ్యుడు జాఫర్ హుస్సేన్ ఈ బిల్లులను స్వాగతించారు. చర్చ సందర్భంగా ఎల్ఆర్ఎస్ విషయాన్ని భట్టి లేవనెత్తే ప్రయత్నం చేయగా.. దీన్ని స్పీకర్, అధికార పక్ష సభ్యులు అడ్డుకున్నారు. ‘సవరణ బిల్లు’పై చర్చ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. ధరణిలో పొందుపరిచిన భూముల వివరాలు సక్రమంగా లేకుంటే, వ్యవసాయ భూముల బదలాయింపు ప్రక్రియతో మరో కొత్త సమస్య వస్తుందన్నారు. ధరణిలో పొందుపరిచిన భూములన్నీ సక్రమంగా ఉన్నా యో లేదో ముందు చూడాలని.. లేదంటే గందరగోళం నెలకొంటుందన్నారు. దీనిపై స్పష్టత ఇస్తేనే బిల్లుకు మద్దతిస్తామని తెలిపారు. దీనికి మంత్రి స్పందిస్తూ.. ఇప్పటికే 1.48 కోట్ల ఎకరాల పట్టా భూముల వివరాలు ధరణిలో రికార్డయ్యాయని.. కోర్డుల్లో ఉన్నవి, ఇతర పంచాయితీల్లో ఉన్న భూములను వదిలేసి 95శాతం భూముల వివరాలను పొందుపరిచామని తెలిపారు. చదవండి: బుల్లెట్లా పంటలు -
చంద్రబాబు చీకటి జీవో
-
చంద్రబాబు చీకటి జీవో
రైతుల భూవిక్రయ హక్కులను కొల్లగొట్టే యత్నం భూముల రిజిస్ట్రేషన్‌కు ఎమ్మార్వో నివేదిక తప్పనిసరి దేశంలో ఎక్కడాలేని నిబంధనలతో జీవో వెల్లువెత్తిన ప్రజాగ్రహంతో వెనక్కు తగ్గిన సర్కారు జీవోనుంచి వ్యవసాయ భూములకు మినహాయింపు జీవో మొత్తం రద్దు చేయాలని ప్రజల డిమాండ్ సాక్షి, హైదరాబాద్: గుట్టుచప్పుడు కాకుండా చంద్రబాబు ప్రభుత్వం చీకటి జీవో జారీ చేసిం ది. ఈ జీవో ద్వారా రైతుల భూ విక్రయ హక్కులను కొల్లగొట్టాలని ప్రయత్నిస్తోంది. విక్రయిం చిన భూములను హక్కుదారులు నేరుగా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లి.. కొన్నవారికి రిజిస్ట్రేషన్ చేయించే హక్కును ప్రభుత్వం లాగేసుకుంది. హక్కుదారుల పేరులో ఉన్న హక్కును నల్ల జీవో(398 జీవో)తో ప్రభుత్వం కాలరాసింది. వ్యవసాయు భూముల విక్రయ రిజిస్ట్రేషన్లకు రెవెన్యూ అధికారుల సబ్ డివిజన్ నివేదిక ను తప్పనిసరి చేస్తూ శుక్రవారం ప్రభుత్వం నల్లజీవో జారీ చేసిన విషయం విదితమే. వుండల రెవెన్యూ అధికారి నుంచి సబ్ డివిజన్ నివేదికతో కూడిన ధ్రువీకరణ పత్రం సవుర్పిస్తేనే వ్యవసాయు భూముల విక్రయ రిజిస్ట్రేషన్లు చేయూలని, లేని పక్షంలో రిజిస్ట్రేషన్ చేసేందుకు తిరస్కరించాలని జీవోలో పేర్కొన్నారు. తద్వారా ప్రభుత్వానికి లేని హక్కులను జీవో జారీ ద్వారా సొంతం చేసుకొంది. చట్టంలో లేని అధికారాలనూ కైవసం చేసుకుంది. ‘‘శుక్రవారం జారీ చేసిన నల్ల జీవో ప్రకారం భూముల రిజిస్ట్రేషన్‌కు యజమనుల పట్టాదారు పాసుపుస్తకాలు, టైటిల్‌డీడ్స్ ఉంటే సరిపోదు. చట్టంలో లేని నిబంధనలను జీవో ద్వారా పెట్టడం ఎలా సాధ్యం? చట్టంలో లేని నిబంధనలు విధించాలంటే.. చట్టాన్ని సవరించడం మినహా ప్రభుత్వానికి మరో మార్గం లేదు’’ రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. అధికారులకు ధ్రువీకరణ ఎలా సాధ్యం? ‘‘సర్వే నంబర్ల వారీగా మండల రెవెన్యూ అధికారి ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటే.. సమగ్ర సమాచారం ఎమ్మార్వోకు ఎలా తెలుస్తుంది? రికార్డులు పరిశీలించి, అందులో ఉన్న వివరాల మేరకు ధ్రువీకరణపత్రం ఇవ్వాలి. రికార్డు కోసం మళ్లీ ప్రభుత్వ పోర్టల్ ‘వెబ్‌ల్యాండ్’ మీద అధారపడాలి. వెబ్‌ల్యాండ్‌లో అన్ని వివరాలను పరిశీ లించిన తర్వాతే రిజిస్ట్రేషన్ అధికారులు రిజిస్ట్రేషన్ చేస్తారు. రెవెన్యూ అధికారులు కొత్తగా చేసేదేమీ ఉండదు. కేవలం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తికావడంలో తీవ్ర జాప్యం చేయడానికే తప్ప.. మరే విధంగానూ ఈ జీవో ఉపయోగపడదు. దీనిపై ప్రభుత్వం ఏదో కుట్ర చేస్తోందని అర్థం’’ అని రైతు నేతలు మండిపడుతున్నారు. వెనక్కి తగ్గిన ప్రభుత్వం నల్ల జీవోపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో చంద్రబాబు ప్రభుత్వం కాస్తంత వెనక్కి తగ్గింది. ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాలకు భయపడిన ప్రభుత్వం..‘భూముల రిజిస్ట్రేషన్‌కు సబ్ డివిజన్ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి’ అనే నిబంధనను తాత్కాలికంగా పక్కనపెడుతున్నామంటూ రెవెన్యూ మంత్రి కె.ఇ.కృష్ణమూర్తి సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ‘‘వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి సబ్ డివిజన్ ధ్రువీకరణ పత్రాలను పొందుపరచాలనే ఆదేశాలను ప్రస్తుతం నిలుపుదల చేస్తున్నాం. ప్రస్తుత పద్ధతిలోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మేరకు అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చాం’’ అని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు. లే అవుట్ల మాటేమిటి? చీకటి జీవో జారీపై రైతులు నుంచి వ్యక్తమయిన ఆగ్రహావేశాలకు జంకిన ప్రభుత్వం.. వ్యవసాయ భూములకే సబ్ డివిజన్ నివేదిక తీసుకురావాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. గృహ నిర్మాణాలకు వేసిన లే అవుట్లకు మాత్రం మినహాయింపు ఇవ్వలేదు. లే అవుట్ వేసిన భూములు.. వ్యవసాయ భూములుగా పరిగణించరు కాబట్టి.. కొన్నవారికి రిజిస్ట్రేషన్లు చేయించాలంటే సబ్ డివిజన్ నివేదిక తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జీవో మొత్తం రద్దు చేయాలని, మినహాయింపులకు పరిమితం కావద్దని ప్రభుత్వానికి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.