AIDMK MPS
-
తమిళ ఎంపీలను బయటికి పంపిన వెంకయ్య
న్యూఢిల్లీ: కావేరి నదీ జలాల పంపణీపై రాజ్యసభలో ఆందోళనకు దిగిన ఏఐఏడీఎంకే, డీఎంకే సభ్యులను చైర్మన్ వెంకయ్యనాయుడు బయటకు పంపించారు. ఇదే అంశంపై గందరగోళం తలెత్తడంతో సభ తొలుత రెండుసార్లు, ఆ తరువాత రోజంతటికీ వాయిదా పడింది. నిబంధన 255ని అనుసరించి..తమిళనాడుకు చెందిన డజనుకుపైగా ఎంపీలు రోజంతా సభ కు దూరంగా ఉండాలని వెంకయ్య ఆదేశించారు. మధ్యాహ్నం సభ ప్రారంభం కాగానే ఏఐఏడీఎంకే సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారికి డీఎంకే సభ్యులు మద్దతు పలికారు. జల వనరుల మంత్రి గడ్కరీ బదులిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి విజయ్ గోయల్ చెప్పినా వారు వినిపించుకోలేదు. -
ఢిల్లీలో ఏఐడీఎంకే ఎంపీల ర్యాలీ
న్యూఢిల్లీ: కావేరీ నదీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసిన ఏఐడీఎంకేఎంపీలు విజ్ఞప్ఞి చేశారు. సౌత్ బ్లాక్ లోని ప్రధాని కార్యాలయం వరకు 50 మంది ఎంపీలు ర్యాలీగా చేరుకున్నారు. వీరికి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదొరై నాయతత్వం వహించారు. ప్రస్తుతం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రిలో ఉన్నారని, వివాద పరిష్కారానికి తమను అమ్మ పంపిందని వారు పేర్కొన్నారు. వెంటనే వివాద పరిష్కారానికి కావేరీ జలాల బోర్డు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. బోర్డు ఏర్పాటుకు బోర్డు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు సైతం చెప్పన విషయాన్ని వారు గుర్తు చేశారు.