భైంసాకు చేరిన ఆడిక్యూ 7
ముథోల్ మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ కుమారుడు అఖిలేశ్ పటేల్ రూ.1.11 కోట్లతో ఆడిక్యూ-7 కారు కొనుగోలు చేశారు. ఈ కారు బుధవారం భైంసాకు చేరింది. కంపెనీ ఆడిక్యూ-7 కొత్త వెర్షన్ వాహనాలను ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో ముంబై, ఢిల్లీలో ఒక్కో వాహనం ఇవ్వగా.. హైదరాబాద్ జంట నగరాల్లో మొదటి వాహనాన్ని అఖిలేశ్ పటేల్ కొనుగోలు చేశారు.
కాగా.. ఈ కారులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని చూసేందుకు స్థానికులు భారీగా గుమికూడారు. వేగానికి అనుగుణంగా కారు గేర్లు వాటంతట అవే మారిపోవడం, జీపీఎస్ ద్వారా కారు చేరుకున్న ప్రదేశం, గమ్యస్థానానికి ఎంత దూరం ఉన్నామనే వివరాలు స్టీరింగ్‌కు పక్కనే ఉన్న డిస్ప్లేపై ఎప్పటికప్పుడు వచ్చే ఆప్షన్ కారులో ఉందని స్టోర్ నిర్వాహకులు తెలిపారు.
కారులో ఉన్న ఇంధనం, టైర్లలో గాలి, రోడ్లపై ఉన్న గుంతలు, మూలమలుపుల విషయూలు సౌండ్ సిస్టం ద్వారా డ్రైవర్ కు సమాచారం ఇచ్చే విధానం ఇందులో ప్రత్యేకత. కారు ఎక్కగానే సీటు బెల్టు ధరిస్తేనే ఇంజన్ ఆన్ అయ్యేలా ఈ కారును డిజైన్ చేశారు. మొత్తానికి అత్యాధునిక కారు భైంసా రావడంతో.. ఆ ప్రాంత మంతాసందడిగా మారింది.