ananda nilayam
-
Ananda Nilayam: ఒకేచోట.. ఈ అష్టాదశ శక్తిపీఠాలు!
పురాణాల ప్రకారం, అమ్మవారిని ఆరాధించే దేవాలయాలలో ప్రశస్తమైనవి అష్టాదశ శక్తిపీఠాలు. శివుడి అర్ధాంగి సతీదేవి శరీరం 18 ముక్కలై, 18 ప్రదేశాల్లో పడ్డాయని, వాటినే అష్టాదశ శక్తిపీఠాలు అంటారని మన పురాణాలు చెబుతున్నాయి. ఈ శక్తిపీఠాలను దర్శించుకుని, అమ్మవార్ల అనుగ్రహం పొందాలని భక్తులు భావిçస్తుంటారు. రకరకాల కారణాల వల్ల కొంతమందికి శక్తిపీఠాల దర్శనభాగ్యం కరవవుతోంది. అలాంటివారికి అన్ని శక్తిపీఠాలను ఒకేచోట దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తూ అష్టాదశ శ«క్తిపీఠాలన్నిటినీ ఒకే దగ్గర నిర్మించారు.అది ఎక్కడో కాదు తెలంగాణ, సిద్దిపేట జిల్లా, కొండపాక గ్రామ శివారులోని ఆనంద నిలయంలో! గత ఏడాది నవంబరులో.. ఇక్కడి అష్టాదశ శక్తిపీఠ సహిత ఉమారామలింగేశ్వర స్వామి దేవాలయంలో 18 శక్తిపీఠాలతో పాటు లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివపార్వతులనూ ప్రతిష్ఠించారు.గట్టు రాంరాజేశం గుప్త సంకల్పంతో..సిద్దిపేటకు చెందిన గట్టు రాంరాజేశం గుప్త అమ్మవారికి అపర భక్తుడు. అష్టాదశ శక్తి పీఠాలన్నిటినీ ఒకే దగ్గర నిర్మించాలని ఆయన చిరకాల కోరిక. ఒకసారి, తన మనసులో మాటను రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆనంద నిలయ వ్యూహకర్త కేవీ రమణాచారి ముందుంచారు. ఆయన ట్రస్ట్ సభ్యులతో చర్చించి, ఆనంద నిలయంలో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా రాంరాజేశం రూ. 1.5 కోట్లను అందజేశారు. ఆనంద నిలయం వృద్ధాశ్రమ ట్రస్ట్ సభ్యులు, ఇతర దాతల సహకారంతో మొత్తం రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాలను నిర్మించారు. అమ్మవార్ల రాతి విగ్రహాలను తమిళనాడులో తయారుచేయించారు. వీటిని పుష్పగిరి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ అభినవోద్దండ విద్యాశంకర భారతి మహాస్వామి, శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ప్రతిష్ఠించారు.22 దేవాలయాలు..పద్దెనిమిది శక్తిపీఠాల్లో పదిహేడు మనదేశంలో ఉండగా, శాంకరీదేవి శ్రీలంకలోని ట్రింకోమలిలో ఉంది. మన దేశంలో ఉన్న కామాక్షీదేవి (కంచి, తమిళనాడు), శృంఖలాదేవి (కోల్‌కతా, పశ్చిమబెంగాల్), చాముండేశ్వరీదేవి (మైసూరు, కర్ణాటక), జోగులాంబ (ఆలంపూర్, తెలంగాణ), భ్రమరాంబికాదేవి (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్), మహాలక్ష్మీదేవి (కొల్హాపూర్, మహారాష్ట్ర), ఏకవీరాదేవి (మాహుర్, మహారాష్ట్ర), మహాకాళీదేవి (ఉజ్జయిని, మధ్యప్రదేశ్), పురుహూతికాదేవి (పిఠాపురం, ఆంధ్రప్రదేశ్), గిరిజాదేవి (జాజ్‌పూర్, ఒడిశా), మాణిక్యాంబాదేవి (ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్), కామాఖ్యాదేవి ( గౌహతి, అస్సాం), మాధవేశ్వరీదేవి (ప్రయాగ, ఉత్తరప్రదేశ్), వైష్ణవీదేవి (జమ్మూ, జమ్మూ– కశ్మీర్ రాష్ట్రం), మంగళగౌరీదేవి (గయ, బిహార్), విశాలాక్షీ (కాశి), సరస్వతీదేవి (శ్రీనగర్) రూపాలను కొండపాక శివారులోని ఆనంద నిలయంలో దర్శించుకోవచ్చు. ఇదే ప్రాంగణంలో లక్ష్మీగణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, మరకత లింగం, శివపార్వతులతో కూడిన 22 దేవాలయాలను నిర్మించడం విశేషం. ఆయా శక్తిపీఠాల్లో జరిగినట్లుగానే ఇక్కడా పూజాకార్యక్రమాలుంటాయి. ప్రతి పౌర్ణమికి హోమం, ప్రతి శుక్రవారం అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేస్తారు. దర్శనానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేస్తున్నారు.సామాజిక సేవ.. ఆధ్యాత్మిక శోభ!ఆనంద నిలయంలో సామాజిక సేవతోపాటు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. సుమారు వంద ఎకరాల్లోని ఈ ట్రస్ట్‌లో ఒకవైపు వృద్ధాశ్రమం, మరోవైపు అనాథాశ్రమం, ఇంకోవైపు సత్యసాయి పిల్లల హృద్రోగ ఆసుపత్రి, జూనియర్ కళాశాల ఉన్నాయి. భక్తులు, సామాజిక సేవకుల సందర్శనతో ఈ ప్రాంగణమంతా సందడిగా ఉంటుంది. ఇది హైదరాబాద్‌కు 73 కిలోమీటర్లు, సిద్దిపేటకు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. – గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేట, ఫొటోలు: కె సతీష్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్శక్తిపీఠాల్లో జరిగినట్టుగానే..ఇక్కడ పూజాకార్యక్రమాలన్నిటినీ శక్తిపీఠాల్లో మాదిరే జరుపుతాం. భక్తులు అమ్మవార్లకు ఒడి బియ్యం పోస్తారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక అలంకరణ ఉంటుంది. ప్రతిరోజు శివుడికి, మరకత లింగానికి రుద్రాభిషేకం చేస్తాం. – పురుషోత్తమ రామానుజ, అర్చకుడుఅందరికీ దర్శనభాగ్యం కలగాలని.. అష్టాదశ శక్తిపీఠాలను దర్శించుకోవటం కొందరికి సాధ్యపడకపోవచ్చు. అలాంటివారికి శక్తిపీఠాల దర్శనభాగ్యం అందాలనేది నాన్నగారి కోరిక. కేవీ రమణాచారి, ఇంకెంతో మంది దాతల సహకారంతో నేడు అది నెరవేరింది. – గట్టు అమర్నాథ్, రవి, శ్రీనివాస్అమ్మవారి అనుగ్రహం..కొండపాకలో అష్టాదశ శక్తిపీఠాల నిర్మాణం అమ్మవారి దయ. అమ్మవారి అనుగ్రహం, అందరి సహకారంతో దేవాలయ నిర్మాణాలు సాధ్యమయ్యాయి. – డాక్టర్ కేవీ రమణాచారి, ఆనంద నిలయ వ్యూహకర్తఇవి చదవండి: అవును..! వారిది గుర్తింపు కోసం ఆరాటమే.. -
తిరుమల శ్రీవారి ఆలయంలో వీడియో చిత్రీకరణపై టీటీడీ విచారణ
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి ఆలయంలో వీడియో రికార్డు చేయడం కలకలం రేపింది. మూడు అంచెల భద్రతను దాటి మరీ ఓ భక్తుడు మొబైల్ ఫోన్‌తో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాడు. మొబైల్ ఫోన్‌తో వెళ్లిన సదరు భక్తుడు శ్రీవారి ఆలయంలో హల్చల్ చేశాడు. ఆలయంలో నలువైపుల నుంచి ఆనంద నిలయాన్ని ఫోన్‌తో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆనంద నిలయం విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీని ద్వారా వర్షం పడుతున్న సమయంలో ఆనంద నిలయాన్ని అతి సమీపంలో నుంచి భక్తుడు వీడియో తీసినట్లు తెలుస్తోంది. అయితే భక్తుడు శ్రీవారి ఆలయంలో ఇంకేమైనా చిత్రికరించాడా అన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనపై టీటీడీ విచారణ చేపట్టింది. ఆలయం లోపలి సీసీ కెమెరా విజువల్స్‌ను పరిశీలిస్తున్నారు. ని కాగా శ్రీవారి ఆలయంలో భద్రత కట్టుదిట్టంగా ఉంటుంది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఆలయానికి వచ్చే భక్తులను క్షుణ్ణంగా పరిశీలించి మరీ లోనికి అనుమతిస్తుంటారు. సెల్‌ఫోన్, కెమెరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. ఇంత పకడ్భందీగా భద్రత ఉన్నప్పటికీ ఓ భక్తుడు ఈ విధంగా శ్రీవారి ఆలయంలోకి సెల్‌ఫోన్‌ను తీసుకెళ్లడమే కాకుండా.. ఆనంద నిలయాన్ని వీడియోలు తీయడంపై భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం భక్తులతో కిటకిటలాడే శ్రీవారి ఆలయంలో మొబైల్ ఫోన్‌తో తిరిగినా.. సీసీ కెమెరాల సిబ్బంది గుర్తించని పరిస్థితి నెలకొనడం గమనార్హం. చదవండి: మణిపూర్ అల్లర్లు.. హైదరాబాద్‌కు తెలుగు విద్యార్థులు -
తిరుమల ఆలయంలోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లిన భక్తుడు
-
Tirumala: ఆనంద నిలయ విమాన విశిష్టత
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు కొలువుండే నెలవు ఆనంద నిలయం. తిరుమల క్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరుడు స్వయంభువుగా వెలసి ఉన్న ప్రదేశమే ఆనంద నిలయం. గర్భాలయమైన ఆనంద నిలయంపై నిర్మించిన బంగారు శిఖరమే ఆనంద నిలయ విమానంగా పేరుపొందింది. ఈ విమాన నిర్మాణానికి ఎంతో విశిష్టత ఉంది. శ్రీవారి బంగారు గోపురం మూడంతస్తులుగా ఉంటుంది. మొదటి రెండు అంతస్తులు దీర్ఘచతురస్రాకారంలోను, మూడోది వర్తులాకారంలోను ఉంటాయి. ఏకశిలపై నిర్మితమైన ఆనంద నిలయ గోపురం ఎత్తు ముప్పయ్యేడు అడుగుల ఎనిమిది అంగుళాలు. గోపురం కింద ఉండే ప్రాకారం ఎత్తు ఇరవయ్యేడు అడుగుల నాలుగు అంగుళాలు. నేలపై నుంచి బంగారు కలశం వరకు ఆనంద నిలయ విమానం ఎత్తు అరవై ఐదు అడుగుల రెండంగుళాలు. మొదటి అంతస్తు పదిన్నర అడుగుల ఎత్తు ఉంటుంది. ఆ భాగంలో ఎలాంటి బొమ్మలూ ఉండవు. ఇందులో లతలు, మకర తోరణాలు, చిన్న శిఖరాలు మాత్రమే ఉంటాయి. రెండో అంతస్తు ఎత్తు పదడుగుల తొమ్మిది అంగుళాలు. ఇందులో నలభై బొమ్మలు ఉంటాయి. మకర తోరణంతో పాటు వరాహస్వామి, నరసింహస్వామి, వైకుంఠనాథుడు తదితర విష్ణు రూపాలు, జయవిజయులు, గరుడ, విష్వక్సేన, అనంత, ఆంజనేయ, మహర్షుల రూపాలు కూడా ఉంటాయి. ఇందులో ఉత్తరంవైపు శ్రీవేంకటేశ్వరుడు విమాన వేంకటేశ్వరుడిగా కొలువుదీరి ఉంటాడు. గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకుంటే కలిగే పుణ్యఫలం విమాన వేంకటేశ్వరుడిని దర్శించుకున్నా లభిస్తుందని భక్తుల విశ్వాసం. (క్లిక్ చేయండి: అప్పట్లో కొండ ఎక్కాలన్నా పన్ను కట్టాల్సిందే!) గోపురం చివర వర్తులాకారంలో ఉండే అంతస్తు పదహారడుగుల మూడంగుళాల ఎత్తులో ఉంటుంది. ఇందులో మహాపద్మంతో పాటు ఇరవై బొమ్మలు ఉంటాయి. నాలుగు దిక్కుల్లోను, నాలుగు మూలల్లోను ఎనిమిది సింహాలు ఉంటాయి. గోపుర కలశానికి ఆనుకుని ఉండే మహాపద్మంలో చిలుకలు, లతలు, హంసలు వంటి చిత్రాలు కనువిందు చేస్తాయి. శ్రీవారి గర్భగుడి నుంచి మలయప్పస్వామి ఊరేగింపుగా వెళ్లేటప్పుడు విమాన ప్రదక్షిణ చేస్తూ బయటకు వెళతారు. అంతేకాదు, స్వామివారికి సమర్పించే ఏ పూజాద్రవ్యమైనా, తోమాలసేవలో సమర్పించే పుష్పాలనైనా, అభిషేకానికి సమర్పించే ఆకాశగంగ తీర్థాన్నైనా విమాన ప్రదక్షిణం పూర్తి చేసిన తర్వాతే గర్భాలయంలోకి తీసుకువెళతారు. (క్లిక్ చేయండి: తిరుమలలో అన్నీ ప్రత్యేకతలే...) -
సీఎం జగన్‌ను కలిసిన శ్రీనివాస్
-
సీఎం జగన్‌ను కలిసిన శ్రీనివాస్
సాక్షి, తిరుపతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీటీడీ మాజీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు కుమారుడు శ్రీనివాస్ కలిశారు. గురువారం ఉదయం శ్రీ పద్మావతి అతిథి గృహంలో ముఖ్యమంత్రితో ఆయన భేటీ అయ్యారు. అనంతరం శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన తండ్రి హయాంలో ప్రారంభించిన ‘ఆనంద నిలయం అనంత స్వర్ణమయం’ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. మధ్యలో ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సీఎం జగన్ హామీ ఇచ్చారు. నాన్నగారు టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు ప్రారంభించారు. అయితే కోర్టు కారణాలు, రాజకీయాల వల్ల ఆగిపోయింది. ఆనంద నిలయం అనంత స్వర్ణమయం ప్రాజెక్ట్‌కు వివిధ ప్రాంతాల నుంచి దాతలు 150 కిలోల బంగారం విరాళంగా ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని నాన్నగారి చివరి కోరికను నెరవేర్చాలని ముఖ్యమంత్రిని కోరారు’ అని తెలిపారు. (సుందరకాండ పారాయణంలో ముఖ్యమంత్రులు) కాగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి టీటీడీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు ఆనంద నిలయం అనంత స్వర్ణ మయం ప్రాజెక్టును ప్రారంభించారు. శ్రీవారి ఆలయం మొత్తం పూర్తిగా బంగారు రేకులతో తాపడం చేయించాలని ఆదికేశవులు నాయుడు నిర్ణయించిన విషయం విదితమే. -
కమనీయం..ఆనంద నిలయం
-
దళిత వృద్ధులకు ఆనంద నిలయాలు
- 14న 700 ఎకరాల భూ పంపిణీ - సబ్సిడీపై వ్యవసాయ పనిముట్లు - డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కర్నూలు(అర్బన్): దళిత వృద్ధుల సంక్షేమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆనంద నిలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తెలిపారు. బాబూ జగ్జీవన్‌రామ్ జయంతి ఉత్సవాలను బుధవారం.. స్థానిక ఐదు రోడ్ల కూడలిలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ రూ.1,56,990 కోట్లు అయితే.. సాంఘిక సంక్షేమానికి రూ.3,692 కోట్లు, ఎస్సీల ఆర్థికాభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించామన్నారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అర్హులైన దళిత విద్యార్థులకు రూ.10 లక్షలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకంలో భాగంగా ఉపకార వేతనాలు అందిస్తున్నామని వివరించారు. ఎస్సీలకు 50 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లులను సాంఘిక సంక్షేమశాఖ చెల్లిస్తున్నదని చెప్పారు. దళిత కౌలు రైతులకు వ్యవసాయ పనిముట్లపై 50 నుంచి 70 శాతం సబ్సిడీ అందిస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని భూమి లేని దళితులకు ఈ నెల 14వ తేదీన అంబేద్కర్ జయంతి సందర్భంగా 700 ఎకరాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్యకు పరిష్కారం : ఎంపీ బుట్టా రేణుక జిల్లాలో పరిశ్రమలు వస్తే నిరుద్యోగ సమస్య కొంత మేర పరిష్కారం అవుతుందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. మహానేతల జయంతి, వర్ధంతి సభల్లో ఒక మంచి కార్యక్రమంపై తీర్మానం చేసి ఏడాది కల్లా పూర్తి చేయగలిగితే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులు కొనసాగుతున్నాయని.. ఇవి పూర్తయితే రెండు వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కర్నూలు అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. జగ్జీవన్‌రామ్‌ను స్ఫూర్తిగా తీసుకుందాం: హఫీజ్‌ఖాన్ జగ్జీవన్‌రామ్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వైఎస్సార్సీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్చార్జ్ హఫీజ్‌ఖాన్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ విద్య, ఉపాధి రంగాలపై దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, వై.ఐజయ్య, గౌరు చరితారెడ్డి, ఎం. మణిగాంధీ, ఎస్పీ ఆకె రవికృష్ణ, డీఆర్ఓ గంగాధర్‌గౌడ్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ప్రకాష్‌రాజు, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ ఎం. సుధాకర్‌బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ మద్దయ్య , వివిధ దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ ... మెప్మా ఆధ్వర్యంలోని మహిళా గ్రూపులకు రూ.5 కోట్లు, డీఆర్డీఏ ఆధ్వర్యంలోని మహిళా గ్రూపులకు రూ.50 కోట్ల చెక్కులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ క్రిష్ణమూర్తి అందజేశారు. -
విరాళంతో మరమ్మతులు చేస్తాం
-
తన మిమిక్రీతో... హాస్యోక్తులతో చిన్నారుల్లో నవ్వుల పువ్వులు...
ఆనంద నిలయం... పేరులో ఆనందమున్న ఆ నిలయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో దీనగాథ. ఎవరిని కదిలించినా కన్నీటి సంద్రాలే. గోరుముద్దలు తినిపించే తల్లిలేదు.. చేయిపట్టి నడిపించే తండ్రిలేడు.. కష్టాలను కన్నీళ్లను లేత హృదయాల్లో దాచుకొని.. ఆనంద నిలయంలో ఆశ్రయం పొందుతున్నారు. ఆ చిన్నారుల్లో సినీనటుడు, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి రాక నిజమైన ఆనందాన్ని నింపింది. ఆయన కరీంనగర్‌లోని ఆనంద నిలయంలో ‘సాక్షి స్టార్ రిపోర్టర్’గా మారి పిల్లలతో పిల్లాడిలా కలిసిపోయి వారితో ఆడిపాడారు. తన మిమిక్రీతో... హాస్యోక్తులతో చిన్నారుల్లో నవ్వుల పువ్వులు పూయించారు. సరదా మాటలతో సంబరాల్లో ముంచారు. కడుపుబ్బా నవ్వించారు. శివారెడ్డి : అన్న మంచిగున్నరానే.. పిల్లలు : బాగున్నాం సార్ శివారెడ్డి : ఎందుకు బాగున్నరు? పిల్లలు : మీరొస్తున్నారని.. శివారెడ్డి : ఏం జరుగుతుందిక్కడ? పిల్లలు : ప్రోగ్రాం శివారెడ్డి : ఏం ప్రోగ్రాం? పిల్లలు : మీరొచ్చారని.. శివారెడ్డి : నేటి వార్తలేంటి? పిల్లలు : ఈ రోజు పేపర్ చదవలేదు శివారెడ్డి : నేను తెలుసా మీకు? పిల్లలు : శివారెడ్డి (టక్కున పిల్లలందరి జవాబు) శివారెడ్డి : ఎట్లా తెలుసు? పిల్లలు : కరెంటుతీగ, దూకుడు సినిమాలో చూశాం శివారెడ్డి : సినిమాలు చూస్తారా.. రఫ్‌లో నటించా. శ్రీహరికి అసిస్టెంట్ పాత్ర చేశా. మంచి పేరొచ్చింది. నన్ను అభినందిస్తూ అందరినుంచి ఫోన్ల వస్తున్నయ్. పానీపూరి సినిమాతోపాటు ఇంకా మరికొన్ని సినిమాలు విడుదల కానున్నాయి. పిల్లలు : మీ సినిమా చూస్తం శివారెడ్డి : హాస్టల్ నచ్చిందా, బాగా చూసుకుంటున్నారా? పిల్లలు : బాగుంది. అందరం బాగా చదువుకుంటున్నం శివారెడ్డి : పొద్దున తినడానికి ఏం పెడతరు? స్వామి : టిఫిన్ పెడతరు శివారెడ్డి : మీకు ఏ హీరోలంటే ఇష్టం పిల్లలు : ప్రభాస్, నాగార్జున, అల్లు అర్జున్, పవన్‌కల్యాణ్, రవితేజ (ఎవరికి నచ్చిన హీరో గురించి వారు చెప్పారు) శివారెడ్డి : కరీంనగర్‌కు మాత్రం నేనే హీరోను. ఆవలిస్తే పేగులు లెక్కబెడతా. పిల్లలు : మీరు కూడా ఇష్టం సార్ శివారెడ్డి : పాటలు ఎవరు పాడుతరు? పిల్లలు : అజయ్ పాడుతడు సార్ అజయ్ : తెలుగుభాష గొప్పతనం, తెలుగుభాష తియ్యదనం అంటూ పాటపాడుతుండగానే శివారెడ్డి కామెడీ చేశారు. (పిల్లలు కడుపుబ్బ నవ్వారు) స్వామి : టింగ్టింగ్ టింగూ అంటూ నోటితో మ్యూజిక్ చేసుకుంటూ పాట పాడారు. (పాట పాడినంత సేపు శివారెడ్డి సరదా మాటలతో నవ్వించారు) శివారెడ్డి : హాస్టల్ ఎలా ఉంది? దోమలున్నాయా.. దోమతెరలేమైనా కావాలా? ముందు మనం ఆరోగ్యంగా ఉంటేనే అన్ని విధాలా ముందుకు సాగవచ్చు. తెలుసా? వంశీ, సంతోష్ : దోమలు కొద్దిగనే ఉన్నయ్ సార్. శివారెడ్డి : ఆలోచించుకొని చెప్పు. పోయేలోపు. మీ పేరేంటి. పిల్లలు : సార్... నాపేరు ఎన్.రాకేశ్, నాపేరు డి.శివశంకర్. శివారెడ్డి : నాపేరు కూడా శివశంకర్‌రెడ్డే. చిరంజీవి పేరులో కూడా నాపేరే ఉంది. సినిమాలకొచ్చినాక ముందు శివ అని పెట్టుకున్న తర్వాత దాన్నే శివారెడ్డిగా మార్చుకున్నా. ఇంతవరకు 100 సినిమాలు చేశా. మన జిల్లాకు చెందిన సానా యాదిరెడ్డి అవకాశమిచ్చారు. అది సరే మీకు ఇంకా ఏం కావాలే. పిల్లలు : సినీ నటుల, రాజకీయ నాయకులు గొంతులతో మిమిక్రీ చేయండి. శివారెడ్డి : సీనియర్ ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు, ఎమ్మెస్సార్, హన్మంతరావు, రోశయ్య, ప్రభాస్, నాగార్జున, వెంకటేశ్, చిరంజీవి, బ్రహ్మానందం, తాగుబోతు రమేశ్ గొంతులను అనుకరించారు (పిల్లలు కేరింతలు కొట్టారు.) పిల్లలు : మీరిక్కడికెందుకు రావాలనుకున్నారు? శివారెడ్డి : నేను సాదాసీదా కుటుంబం నుంచి పైకొచ్చినవాణ్ణే. కష్టాలు, కన్నీళ్లు నాకు తెలుసు. కష్టాల్లో ఉన్నవారన్నా, పేదలన్నా నా మనసు కదులుతుంది. ఇక్కడ మీరున్నరని తెలిసి, మిమ్మల్ని కలుద్దామని వచ్చిన. స్వామి : థాంక్యూ సార్. మీరు మాకోసం రావడం మమ్మల్ని పలకరించడం, మాకోసం మీరొచ్చారన్న ఆనందం ఎక్కువగా ఉంది సార్.. థాంక్యూ.. థాంక్యూ వెరీమచ్ సార్. సహాయం చేసే చేతులే మిన్న : శివారెడ్డి నాకు చాలా ఆనందంగా ఉంది. కొద్ది సేపు ఇలాంటి పిల్లలతో గడిపే అవకాశం కల్పించిన ‘సాక్షి’కి అభినందనలు. స్టార్ రిపోర్టర్‌గా పిల్లల బాధలు, గాధలు తెలుసుకున్నాను. సమాజంలో ఆదరణ తక్కువ ఉన్న పిల్లలకు సహాయం చేసే అవకాశం దొరికింది. అవకాశము న్న ప్రతీ ఒక్కరు వీరికి సహాయం చేయాలి. పైచదువులు చదువుకునేలా ప్రోత్సహించాలి. దాంట్లోనే సంతృప్తి ఉంటుంది. నేను కూడా పిల్లలందరికీ డ్రెస్సులు పంపిస్తాను. త్వరలోనే మళ్లీ కలుస్తాను. (అందరు పిల్లలతో ఫొటోలు దిగి, ఆటోగ్రాఫ్‌లిచ్చి వీడ్కోలు చెప్పారు.) -
నయాసాల్ ఆగయా..
2013 సంవత్సరానికి గుడ్‌బై చెప్పి.. కొత్త ఏడాదికి సరికొత్తగా స్వాగతం పలికారు జిల్లా ప్రజలు. మంగళవారం రాత్రి 11.55 గంటలకు కౌంట్ డౌన్ మొదలు పెట్టారు. 11.59 నిమిషాలు పూర్తయి అర్ధరాత్రి 12 గంటలు కాగానే పట్టరాని ఆనందంతో హ్యాపీ న్యూఇయర్ అంటూ పెద్దపెట్టున నినదించారు. కేక్‌లు కట్ చేసి ఒకరినొకరు పంచుకున్నారు. మహిళలు ఇళ్లముందు రంగు రంగుల ముగ్గులు వేసి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. చిన్నారులు, యువత ఎగిరి గెంతులేశారు. అక్కడక్కడా విద్యార్థులు, యువకులు బైక్‌లపై తిరుగుతూ హ్యాపీ న్యూఇయర్ తెలిపారు. బిల్డింగ్‌లపై డీజేలు ఏర్పాటు చేసుకొని డ్యాన్స్‌లు చేశారు. టపాసులు పేల్చి ఆనందాన్ని పంచుకున్నారు. మద్యంప్రియులు బాటిళ్లు తెరిచి చీర్స్ చెప్పారు. అప్పటికే సిద్ధం చేసుకున్న వంటకాలను విందు సందర్భంగా ఆరగించారు. ఒకరినొకరు ఫోన్లు చేసుకుని విష్ చేసుకున్నారు. అందరు మొబైల్స్ ద్వారా గ్రీటింగ్స్ చెప్పేందుకు ప్రయత్నించగా నెట్వర్క్ బిజీ రావడంతో ఫోన్లు కలవలేదు. దీంతో కొందరు తమ మిత్రులు, బంధువులకు సకాలంలో గ్రీటింగ్స్ చెప్పలేకపోయామంటూ కాస్త నిరుత్సాహపడ్డారు. మొత్తానికి నూతన సంవత్సర సంబరాలు అంబరాన్నంటాయి. ఆనంద నిలయంలో హరీష్.. సిద్దిపేట టౌన్: ఎమ్మెల్యే టి.హరీష్‌రావు నూతన సంవత్సరం వేడుకలను హాస్టల్ విద్యార్థుల మధ్య జరుపుకున్నారు. ఆయన సతీమణి శ్రీనిత, పిల్లలు అర్చిశ్మన్, వైష్ణవిలతో కలిసి మంగళవారం రాత్రి స్థానిక ప్రభుత్వ బాలికల వసతి గృహాల ప్రాంగణంలోని ‘ఆనంద నిలయానికి వచ్చారు. తన కూతురుతోపాటు అక్కడి విద్యార్థినులచే కేట్‌కట్ చేయించారు. సొంతంగా ఖరీదు చేసిన బ్లాంకెట్లు, స్వెట్టర్లను వారికి అందజేశారు. పిల్లలతో మాట్లాడిన ఎమ్మెల్యే దంపతులు వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. నీళ్లు, డైనింగ్ హాల్ కొరత ఉందని చెప్పడంతో వెంటనే స్పందించిన ఆయన నల్లా కనెక్షన్ ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. త్వరలో బోరు వేయిస్తానని వారికి హామీ ఇచ్చారు. రూ.30 లక్షలతో డైనింగ్ హాల్ కట్టిస్తానని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే స్థానిక ఎస్ఎం హాస్టల్‌కు వెళ్లి విద్యార్థులతో సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్వీ నేత శేషుకుమార్, ఏఎస్డబ్ల్యూఓ వసంత, వసతి గృహ సంక్షేమాధికారులు అనూరాధ, అరుణ తదితరులు పాల్గొన్నారు. సందడే సందడి.. సిద్దిపేట పట్టణంలో మంగళవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు సందడిగా మారింది. పట్టణంలో కేకులు, కూల్‌డ్రింక్‌లు, స్వీట్ హాట్ల కోసం బేకరీల్లో, ఇతర దుకాణాల్లోనూ మరోవైపు కిక్కు కోసం మద్యం షాపుల్లోనూ కస్టమర్ల తాకిడి జోరందుకుంది. మాంసం కొనుగోళ్లు కూడా భారీగానే జరిగాయి. పలువురు వ్యాపారులు ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకున్నారు. కొందరైతే ఆటోల్లో మైకులు పెట్టి మరీ ప్రచారం చేశారు. సరంజామాను ముందుగానే సమీకరించుకొని తమ తమ ‘అడ్డా’ల్లో అనేక మంది ‘పార్టీ’ల్లో మునిగితేలారు. శ్రమజీవులు మొదలుకొని సంపన్నుల వరకూ సంబరాల్లో భాగస్వాములయ్యారు. అనుభవాలు, ఆలోచనలు, కొంగొత్త వసంతంలో అధిగమించాల్సిన లక్ష్యాలపై అప్పటిదాకా కబుర్లతోనూ, ఆయా రుచులను ఎంజాయ్ చేస్తూ గడిపిన వారంతా... సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు దాటి తేదీ మారగానే ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ కేరింతలు కొట్టారు. మెదక్ టౌన్: న్యూ ఇయర్ వేడుక లను ఘనంగా జరుపుకున్నారు. సాయంత్రం నుంచే కేక్‌ల కొనుగోలుదారులతో బేకరీలు కిటకిటలాడాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్‌ఐని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి 10 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ప్రత్యేక ప్రార్థనలు కొనసాగాయి. ఈ సందర్భంగా భక్తులనుద్దేశించి గురువులు దైవ సందేశమిచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చర్చి ప్రాంగణంలో భక్తులు ఒకరినొకరు గ్రీటింగ్స్ చెప్పుకున్నారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లలోకి యువత చేరుకొని ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. పలుచోట్ల యువకులు డీజేలు, డీటీఎస్ సౌండ్లు ఏర్పాటు చేసుకొని కేరింతలు కొట్టారు. పలు పాఠశాలల్లో మంగళవారం ముందుగానే నూతన సంవత్సర కేక్‌లు కట్ చేశారు. వేడుకల సందర్భంగా చికెన్, మటన్‌షాపులు, మద్యం దుకాణాలు, స్వీట్ హౌస్‌లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. కష్టపడి చదవాలి: ఆర్డీఓ మెదక్ ఆర్డీఓ వనజాదేవి మంగళవారం రాత్రి పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, బాలసదనం బాలికల వసతి గృహ విద్యార్థుల మధ్య వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె కేక్ కట్ చేసి అందరికి అందజేశారు. అనంతరం విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సమాజంలోని గొప్పవారంతా ప్రభుత్వ హాస్టళ్లు, పాఠశాలల్లో చదువుకున్న వారేనన్నారు.