సూక్ష్మ శివలింగం
మండపేట పట్టణానికి చెందిన కళాకారుడు అండలూరి వీరవెంకటసత్యనారాయణ పెన్సిల్ ముల్లుపై శివలింగాన్ని రూపొందించారు. కార్తికమాసం సందర్భంగా దీనిని తయారు చేసినట్టు ఆయన తెలిపారు. 0.5 ఎంఎం లిడ్పెన్సిల్ ముల్లును శివలింగం ఆకారంలో తయారు చేశారు. మిల్లీగ్రామ్ బంగారాన్ని ఉపయోగించి పానుమట్టాన్ని రూపొందించారు. ఇది తయారుచేయడానికి గంట సమయం పట్టిందని సత్యనారాయణ తెలిపారు. గతంలో ఆయన అనేక సూక్ష్మ రూపాలను తయారుచేసిన విషయం తెలిసిందే.
- మండపేట, తూర్పుగోదావరి జిల్లా.