Araku constituency
-
అరకులో ఎయిర్ బెలూన్
-
నా గెలుపుకు కారణం జగనన్నే
-
ఎంపీ మాధవి కుమార్తెకు సీఎం నామకరణం
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): అరకు ఎంపీ మాధవి శివప్రపాద్ దంపతుల కుమార్తెకు సీఎం వైఎస్ జగన్ శుక్రవారం నామకరణం చేశారు. పార్లమెంట్ సమావేశాలకు ఢిల్లీ వెళ్లిన మాధవి, భర్త శివప్రసాద్ అక్కడకు వచ్చిన సీఎం జగన్‌ను కలిశారు. వారి కోరిక మేరకు చిన్నారికి నామకరణం చేశారు. తాము కోరిన వెంటనే సీఎం నామకరణం చేయడం ఆనందంగా ఉందని, త్వరలో బారసాల నిర్వహించి సీఎం నామకరణం చేసిన పేరును ప్రకటిస్తామని ఎంపీ మాధవి చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది. -
అరకులో సామాజిక సాధికార బస్సు యాత్ర
-
నేడు అనంతపురం, అరకులో సామాజిక బస్సు యాత్ర షెడ్యూల్
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. నేడు అనంతపురం, అరకు నియోజకవర్గాలలో జరగనుంది. అనంతపురంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగునుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు అనంతపురం ఆర్అండ్బీ అతిథి గృహంలో వైఎస్సార్సీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అంబేద్కర్ విగ్రహం నుంచి పాతవూరు గాంధీ విగ్రహం వరకు బస్సు యాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు చెన్నకేశవస్వామి ఆలయం ఎదురుగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ మంత్రి పేర్ని నాని, జూపూడి ప్రభాకర్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరుకానున్నారు. అల్లూరి జిల్లా.. అల్లూరి జిల్లా అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గొన ఆధ్వర్యంలో హుకుంపేటలో బస్సుయాత్ర జరగనుంది. ఉదయం 11 గంటలకు బర్మన్ గూడలో వైఎస్సార్సీపీ నేతల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం బర్మన్ గూడా నుంచి హుకుంపేట వరకు భారీ బైక్ ర్యాలీ సాగనుంది. అనంతరం హుకుంపేట కస్తూరిబా పాఠశాలలో నాడు- నేడు పనులను మంత్రులు పరిశీలించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హుకుంపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు రాజన్న దొర, మేరుగు నాగార్జున, ఇంచార్జ్ మంత్రి గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, సీదిరి అప్పలరాజు తదితరులు హాజరుకానున్నారు. ఇదీ చదవండి: అందుకేనట బాబు రహస్య మంతనాలు! -
ఏపీ కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. దీనికి సంబంధించి రెండు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి లోక్‌సభ నియోజక వర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పుడు అడుగులు వేస్తున్నారు. ఎట్టకేలకు ఈ హామీకి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అవుతోంది. రేపు లేదా ఎల్లుండి.. రెండురోజుల్లో నోటీఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల సమాచారం. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌సభ నియోజకవర్గాలుంటే.. 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసేదిశగా ప్రక్రియ ప్రారంభమైనట్టు స్పష్టమవుతోంది. అరకు పార్లమెంట్ సెగ్మెంట్ భౌగోళిక రిత్యా చాలా విస్తారమైనది కావడంతో.. ఆ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగా చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అక్కడక్కడ భౌగోళిక పరిస్థితులను పరిగణలోకి తీసుకొని చిన్న చిన్న మార్పులు- చేర్పులు ఉంటాయని తెలుస్తోంది. పెరిగిన జనాభాకు అనుగుణంగా పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలంటే..ఇప్పుడున్న జిల్లాలతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమని ఇంతకు ముందు వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది కూడా. అందుకు అనుగుణంగా ఈ ప్రక్రియకు అన్ని విధాలుగా సిద్ధమవుతోంది. -
గిరిజనుడిగా పుట్టాలనుంది: మంత్రి
సాక్షి, అరకు : ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువు చెప్పిస్తే, ఈనాడు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్యోగమిచ్చారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం అరకులో ఏపీ టూరిజం యాత్రి నివాస్ హోటల్లో రెండు కోట్లతో నిర్మించిన డైనింగ్ రెస్టారెంట్‌ను స్థానిక ఎంపీ గొడ్డేటి మాధవితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తేరు గన్నెల , పద్మాపురం గ్రామాలకు చెందిన సర్పంచులు, వైస్ సర్పంచులు, వార్డు మెంబర్లు, టీడీపీకి చెందిన 211 కుటుంబాల కార్యకర్తలు మంత్రి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. అనంతరం అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. బాక్సైట్ మైనింగ్‌ను రద్దు చేసిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ అని అభినందించారు. గిరిజనులకు మెడికల్ కాలేజ్, గిరిజన యూనివర్సిటీ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రిదని ప్రశంసించారు. అన్ని గిరిజన గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, రూ.156 కోట్లతో అరకు టూరిజం కారిడార్‌ను అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఇప్పుడున్నది మాటల ప్రభుత్వం కాదని, చేతల ప్రభుత్వమని చెప్పారు. గిరిజనులు అమాయకులనీ, మళ్లీ జన్మంటూ ఉంటే గిరిజనుడిగా పుట్టాలనుందని అన్నారు. ఎంపీ మాధవి మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి ఆశీస్సుల వల్ల చిన్న వయసులోనే ఎంపీ కాగలిగానని ఆనందం వ్యక్తం చేశారు. భారత టూరిజం శాఖ పార్లమెంటు కమిటీలో తాను మెంబరుగా ఉన్నాననీ, అరకు టూరిజంను దేశంలోనే మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేస్తానని వెల్లడించారు. అరకు ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ.. అరకును దత్తత తీసుకొని చంద్రబాబు అంధకారంలో ఉంచారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అరకు నియోజకవర్గానికి 39 రోడ్లను మంజూరు చేశారని, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిధులు విడుదల చేశారని తెలిపారు. ప్రభుత్వం తనకిచ్చిన క్వార్టర్‌ను గిరిజన మహిళల కోసం ప్రసూతి హాస్టల్‌గా మార్చానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మీ కూడా పాల్గొని మాట్లాడారు. -
అతిపిన్న వయస్కురాలైన ఎంపీగా మాధవి
విశాఖపట్నం, పాడేరు: అరకు లోక్‌సభ స్ధానం నుంచి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన గొడ్డేటి మాధవి పార్లమెంట్లో అడుగుపెడుతున్న అతిపిన్న వయస్కురాలిగా ఘనత సాధించనున్నారు. పాతికేళ్ల ప్రాయంలోనే మాధవి పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నిక కావడం విశేషం. గతంలో హర్యానాకు చెందిన దుష్యంత్ చౌహన్ 28 ఏళ్ల వయస్సులో ఎన్నికై పార్లమెంట్‌కు వెళ్లి అతిపిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. ఇప్పుడు మాధవి 26 ఏళ్ల వయస్సులోనే ఆమె ఎంపీగా ఎన్నికై పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారు. వైరిచర్ల కిశోర్‌చంద్ర సూర్యనారాయణ దేవ్ వంటి ఉద్దండుల్ని ఓడించి మాధవి ఘనత సాధించడమే కాకుండా పిన్న వయస్కురాలిగా పార్లమెంట్‌కు వెళుతుండడం విశేషం. గొడ్డేటి మాధవి అరకు పార్లమెంట్ నుంచి భారీ ఆధిక్యతతో ఎంపీగా విజయం సాధించారు. గత 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధి కొత్తపల్లి గీతకు 4,13,191ఓట్లు రాగా 91,398 పైచిలుకు మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన గొడ్డేటి మాధవికి 2.25 లక్షల మెజార్టీ రావడం విశేషం. 2009 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కిశోర్ చంద్రదేవ్‌కు 3,60, 458 ఓట్లు రాగా 1,92,444 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఇదే స్థాయిలో మాధవి కూడా భారీ ఆధిక్యత సాధించి ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో గెలిచిన వైఎస్సార్సీపీ ఎంపీలందరి కంటే మాధవికి భారీ ఆధిక్యత లభించింది. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఘన విజయం సాధించిన వైఎస్సార్సీపీకి మన్య ప్రాంత ప్రజలంతా బ్రహ్మరథం పట్టడంతో గొడ్డేటి మాధవికి భారీ ఆధిక్యత లభించింది. 2019 ఎన్నికల్లో అరకు లోక్‌సభ అభ్యర్ధులకు వచ్చిన ఓట్లు వివరాలు కిశోర్ చంద్ర సూర్యనారాయణ దేవ్(టీడీపీ)– 3,38,101, కేకేవీవీ సత్యనారాయణ రెడ్డి (బీజేపీ) – 17,867, గొడ్డేటి మాధవి (వైఎస్సార్సీపీ) – 5,62,190, శృతిదేవి వైరిచర్ల (కాంగ్రెస్) – 17,730, వంపూరు గంగుల మయ్య (జనసేన)–42,794, స్వాముల సుబ్రహ్మణ్యం (జనజాగృతి)– 4,710, అనుముల వంశీకృష్ణ(ఇండిపెండెంట్)– 10,240, కంగల బాలుదొర (ఇండిపెండెంట్)– 13,826, నరవ సత్యవతి( ఇండిపెండెంట్) – 11,236, బిడ్డిక రామయ్య( ఇండిపెండెంట్)– 7867 -
గిరిజన ఆణిముత్యాలు
సాక్షి, అమరావతి: కటిక పేదరికం నుంచి వచ్చి కష్టపడి ఉన్నత చదువులు చదివిన వీరందరినీ ఇప్పుడు అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలకు తన ప్రతినిధులుగా పంపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి ఎంపికచేశారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ, విజయనగరం జిల్లా కురుపాం, సాలూరు, విశాఖపట్నం జిల్లా పాడేరు, అరకు, తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం, పశ్చిమగోదావరి జిల్లా పోలవరం అసెంబ్లీ స్థానాలతో పాటు అరకు లోక్‌సభ స్థానం గిరిజనులకు రిజర్వు అయ్యాయి. త్వరలో జరగబోయే ఎన్నికలకోసం ఈ స్థానాలకు వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థులను ఖరారు చేశాయి. ఈ అభ్యర్థుల వ్యక్తిగత సమాచారం చూస్తే టీడీపీ, వైఎస్సార్ సీపీ మధ్య నక్కకు, నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. రాజు.. పేద మధ్య పోటీ అరకు లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా కురుపాం రాజకుటుంబానికి చెందిన కిశోర్‌చంద్రదేవ్‌ను బరిలోకి దించింది. రాజ కుటుంబానికి చెందిన ఆయన కాంగ్రెస్ సీనియర్ నేతగా కేంద్రంలో అనేక హోదాల్లో పనిచేసి ఆర్థికంగా ఎంతో స్థితిమంతుడుగా మారారు. కేంద్రంలో యూపీఏ–2 ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తీరని అన్యాయం చేసినా నోరెత్తి ఒక్కమాట మాట్లాడలేదు. కనీసం లోక్‌సభలో రాష్ట్రానికి న్యాయం చేయాలనీ కోరలేదు. కాంగ్రెస్, టీడీపీ లోపాయికారీ ఒప్పందాల నేపథ్యంలో సరిగ్గా ప్రస్తుత సాధారణ ఎన్నికల ముందు ఆయన కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరారు. అరకు నుంచి తమ పార్టీ నుంచి డబ్బున్న అభ్యర్థులను పోటీకి నిలబెట్టాలన్న ఒకే ఒక్క వ్యూహంతో చంద్రబాబు టీడీపీలోకి కిశోర్‌చంద్రదేవ్‌ను తెచ్చుకుని సీటిచ్చారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ ఇదే లోక్‌సభ స్థానానికి తమ పార్టీ అభ్యర్థినిగా సామాన్య గిరిజన మహిళ గొట్టేటి మాధవిని బరిలోకి దించారు. గిరిజన సంక్షేమ హాస్టల్లో ఉండి కష్టపడి డిగ్రీ వరకు చదివారు. ఈమె తండ్రి గొట్టేటి దేవుడు రెండుసార్లు సీపీఐ ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా ఆ కుటుంబం కటిక పేదరికంతోనే గడిపింది. అనారోగ్యం పాలైన ఆయన కనీసం వైద్యం కూడా చేయించుకోలేక మృతి చెందారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన మాధవిని వైఎస్సార్ సీపీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టడం సంచలనంగా మారింది. ఇప్పుడు ఇదే అరకు లోక్‌సభ నియోజకవర్గంలో, రాష్ట్రంలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. చిత్రమేమంటే కిశోర్‌చంద్రదేవ్ గిరిజనుడు కాదని, ఆయన గిరిజనేతరుడని గిరిజన సంఘాలు ఆయన్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే ఆయనపై న్యాయపోరాటం కూడా చేస్తున్నాయి. అసలు.. నకిలీల మధ్య పోటీ ఇక అరకు లోక్‌సభ స్థానంలోని అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థుల సంగతి కూడా ఇలానే ఉంది. కురుపాం అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే జనార్థన్ థాట్రాజ్‌ను పెట్టారు. ఈయన ఎస్టీ కాదని గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చాయి. కోర్టులు తీర్పులిచ్చినా వాటిని బేఖాతరు చేస్తూ టీడీపీ తమ అభ్యర్థిగా రంగంలోకి దించింది. చివరకు ఆయన నామినేషన్‌ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో ఆయన తల్లి నరసింహ ప్రియ థాట్రాజ్‌ను తమ అభ్యర్థిగా టీడీపీ ప్రచారం చేస్తోంది. ఈమె సోదరుడు శత్రుచర్ల విజయరామరాజు గతంలో ఎస్టీ ఎమ్మెల్యేగా కొనసాగగా ఆయన గిరిజనుడు కాదని కోర్టు తేల్చిచెప్పింది. దీంతో ఆయన జనరల్ స్థానాల్లో పోటీచేస్తున్నారు. కొడుకు, సోదరుడు గిరిజనేతరులుగా ఉండగా నరసింహప్రియను ఎస్టీ అంటూ టీడీపీ నేతలు గిరిజనులను మోసం చేస్తన్నారని గిరిజన సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. కాగా, గిరిజన పాఠశాలలో విద్యనభ్యసించిన సామాన్య కుటుంబానికి చెందిన పాముల పుష్పశ్రీ వాణిని వైఎస్సార్ సీపీ బరిలోకి దించింది. కురుపాం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన ఈమె విలువలకు కట్టుబడి, ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీగా చివరివరకు వైఎస్సార్ సీపీలోనే కొనసాగారు. సాలూరు అభ్యర్థిగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్పీ బాంజ్‌దేవ్‌ను ప్రకటించింది. ఈయన కూడా గిరిజనుడు(ఎస్టీ) కాదని గతంలో హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అర్థంతరంగా ఎమ్మెల్యే పదవిని కూడా కోల్పోయారు. అప్పట్లో రెండోస్థానంలో ఉన్న పీడిక రాజన్న దొరను ఎమ్మెల్యేగా ప్రకటించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన చిన్న వెసులుబాటును ఆసరా చేసుకుని టీడీపీ ప్రభుత్వం ఏకంగా భాంజ్‌దేవ్ గిరిజనుడంటూ జీఓ ఇచ్చి గిరిజనులను మోసగించింది. ఇప్పుడు ఆయన్ను సాలూరు నుంచి తమ అభ్యర్థిగా మళ్లీ పోటీకి దింపింది. దీనిపైనా ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోంది. ఇదే స్థానం నుంచి వైఎస్సార్ సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పీడిక రాజన్న దొరను మరోసారి బరిలోకి దించింది. చంద్రబాబు ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైఎస్సార్సీపీలోనే కొనసాగిన రాజన్నదొర గిరిజనుల హక్కుల కోసం నిరంతరం న్యాయపోరాటం చేసే నాయకుడు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చి, జీసీసీలో ఉద్యోగం వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన రాజన్నదొర నాలుగోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అసలైన గిరిజనులనే ఎమ్మెల్యేలుగా గెలిపించాలని ఏపీ ఎస్టీ ఎంప్లాయీస్ యూనియన్ న్యాయ సలహాదారు రేగు మహేష్ పేర్కొన్నారు. – సి. శ్రీనివాసరావు సాక్షి, అమరావతి రంపలో ప్రభుత్వ టీచర్‌కు వైఎస్సార్సీపీ సీటు తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సామాన్య గిరిజన కుటుంబానికి చెందిన ప్రభుత్వ టీచర్ ధనలక్ష్మికి అవకాశం కల్పించారు. గతంలో వైఎస్సార్ సీపీ తరఫున గెల్చి టీడీపీ ప్రలోభాలకు లొంగి ఆ పార్టీలోకి ఫిరాయించిన వంతల రాజేశ్వరిని చంద్రబాబు తన పార్టీ తరఫున పోటీలో పెట్టారు. పాడేరు నుంచి వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అనంతరం టీడీపీలో ఫిరాయించగా ఆమెకు మళ్లీ టీడీపీ టిక్కెట్ ఇచ్చి బరిలో దించింది. ఇక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఉన్నత విద్యావంతురాలు కొత్తగుల్లి భాగ్యలక్ష్మికి అవకాశం ఇచ్చింది. అరకు నుంచి టీడీపీ అభ్యర్థిగా మంత్రి కిడారి శ్రవణ్‌ను బరిలోకి దించింది. గతంలో వైఎస్సార్సీపీ తరఫున గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు ఈయన. ఇక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా బ్యాంకు మేనేజర్‌గా పనిచేసిన విద్యావంతుడు శెట్టి ఫాల్గుణను బరిలోకి దించింది. పాలకొండ నుంచి టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల తరపున పాత అభ్యర్థులే బరిలో దిగారు. టీడీపీ నుంచి నిమ్మక జయకృష్ణ పోటీ చేస్తుండగా, వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యే కళావతి పోటీ చేస్తున్నారు. సకాలంలో గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయకుండా చంద్రబాబు అన్యాయం చేశారని గిరిజనులు విమర్శిస్తున్నారు. -
ఏజెన్సీ దేశం అథోగతి!
నిలువునా చీలిపోయిన శ్రేణులు పోటాపోటీగా సమావేశాలు సోమ బుజ్జగింపులకు ససేమిరా అధిష్టానం నిర్ణయంపై రగిలిపోతున్న తమ్ముళ్లు హుకుంపేట, న్యూస్‌లైన్: ఏజెన్సీలో తెలుగుదేశంపార్టీ పరిస్థితి బాగోలేదు. అరకు నియోజక వర్గంలో శ్రేణులు నిట్టనిలువునా చీలిపోయాయి. పాడేరును పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడంపై తెలుగు తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఎన్నడూ లేనివిధంగా శివాలెత్తిపోతున్నారు. ఇక్కడ టీడీపీ నేతలు ప్రసాద్,సుబ్బారావుల్లో ఒకరు దారికివచ్చినా సుబ్బారావు తిరుగుబాటుదారుడిగానే మిగిలిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థి లోకులగాంధీకి ముచ్చెమటలు పడుతున్నాయి. అరకులోయలో ఒకే పార్టీలో ఇద్దరికి బి-ఫారాలు ఇవ్వడాన్ని కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీడీపీ రెబల్‌గా నామినేషన్ వేసిన కుంబా రవిబాబును బరిలో కొనసాగించి తాడోపేడో తేల్చుకోవడానికి సి ద్ధపడుతున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని ఆరు మండలాల కార్యకర్తలతో హుకుంపేట మండలం కొంతలిలో మంగళవారం భారీ సమావేశం ఏర్పాటు చేశా రు. అంతకు ముందు ఆయా మండలాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులతో భవిష్యత్ కార్యక్రమంపై రవిబా బు చర్చించారు. పోటీలో నిలిచి అధిష్టానానికి తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సమావేశంలో వివిధ నాయకుల ప్రసంగాలూ దీనినే ప్రస్పుటం చేశాయి. ఆ సమావేశానికి పోటీగా అదే సమయంలో హు కుంపేటలో టీడీపీ అభ్యర్థి సీవేరి సోమ మరో సమావేశం నిర్వహించారు. దీంతో నియోజవర్గంలోని ఆ పార్టీ కార్యకర్తలు చెరిసగంగా చీలిపోయినట్టయింది. ఇంతకాలం అం తర్గతంగా ఉన్న పార్టీలోని విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యాయి. రవిబాబును బుజ్జగించేందుకు అధిష్టానం సోమవారం చేపట్టిన ప్రయత్నమూ విఫలమైంది. ఆయనను కలిసేందుకు వచ్చిన జిల్లా నాయకుడు లాలం భాస్కరరావుకు చేదు అనుభవం ఎదురయింది. రవిబాబు మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇది జరిగి న మరునాడే నియోజకవర్గం టీడీపీ శ్రేణులు రెండుగా చీలిపోయాయి. సగానికిపైగా టీడీపీ నాయకులు రవిబా బు వద్దకు వెళ్లిపోయారు. హుకుంపేట మండలానికి చెంది న బాకూరు వెంకటరమణరాజు, కంబిడి రాంబాబు, మజ్జిరత్నాలమ్మ, సూర్యకాంతం, మామిడి కాంతమ్మ, సుమన్, దొరలతో పాటు పలువురు నాయకులు రవిబాబుకు మద్ద తు పలుకుతూ ఆయన వెంట వెళ్లగా శెట్టి లక్ష్మణుడు, పాడి బాలన్న, పొండోయి లక్ష్మయ్య, సుర్రా వెంకటరావు, బురి డి సాంబ, గాసన్నలు టీడీపీ అభ్యర్థి సీవేరి సోమ వెంట నడిచేందుకు సిద్ధపడ్డారు. కాగా రవిబాబు వర్గం నాయకులను బుజ్జగించేందుకు మంగళవారం అభ్యర్థి సోమ మం డల కేంద్రం డుంబ్రిగుడ వచ్చారు. ఇరు వర్గాల మధ్య సు మారు గంటపాటు ఘర్షణపూరిత వాతావరణం చోటుచేసుకొంది. అధిష్టానం సస్పెండ్ చేసినా పార్టీ అభ్యర్థికి సహకరించేది లేదంటూ పలువురు తెగేసి చెప్పడంతో సోమ నిరాశతో వెనుతిరిగారు. ఈ పరిణామం నియోజకవర్గంలో పార్టీకి తీరని లోటని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నియోజకవర్గంలో కాంగ్రేస్ ఖాళీ అరకు రూరల్ : అరకు అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రేస్ పార్టీ ఖాళీ అయిపోతోంది. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఇక్కడి నుంచే ప్రాతినిథ్యం వహించినప్పటికీ ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులు నామమాత్రం. అలాగే ఆ పార్టీలో ఉంటే భవిష్యత్ లేదనో ఆ నాయకులు, కార్యకర్తలు ప్రత్యర్థి పార్టీల్లో చేరిపోతున్నారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. అరకులోయ మండల కాంగ్రేస్ అధ్యక్షునిగా పనిచేసిన శెట్టి వెంకటరావు, రెండుసార్లు ఎంపీటీసీగా వ్యవహరించిన బూర్జ సుందర్రావు,పెదలబుడు ఒకటో సెగ్మెంట్ మాజీ ఎంపీటీసీ శెట్టి బుట్టి ఇటీవల కిడారి సర్వేశ్వరరావు ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కొత్తూరు సర్పంచ్‌గా గెలిచిన దుడ్డు సోములు, డుంబ్రిగుడ జెడ్పీటీసీగా పోటీ చేసిన చినబాబు కిడారి వర్గంలో చేరారు.