‘ఏడాదిలో మెరుగుపడతాం’
సిడ్నీ: యువకులతో కూ డిన ప్రస్తుత భారత జట్టు రాబోయే ఏడాది కాలంలో మరింత మెరుగుపడుతుందని టీమ్ డెరైక్టర్ రవి శాస్త్రి అన్నారు. ఆసీస్తో సిరీస్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ‘సిరీస్లో 3-0, 4-0 తేడా గురించి ఆలోచించడం లేదు. ప్రత్యర్థులపై అటాకింగ్ గేమ్ ఆడుతున్నంత వరకు దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కేవలం ఎలాంటి ప్రదర్శ న చూపారన్న దానిపైనే ఎక్కువగా దృష్టిసారించాలి. ఐదో బౌలర్ లేని లోటు విదేశాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.గట్టిపోటీ ఇచ్చి గెలవడానికే ఇక్కడికి వచ్చాం. ఇదే జట్టు రాబోయే ఏడాదిలో అద్భుతంగా మెరుగుపడుతుంది’ అని శాస్త్రి తెలిపారు.