Bharath Reddy
-
సలార్ ‘రాధా రమా’కు క్రికెట్‌తో లింకేమిటి?
ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమా సలార్‌లో రాధా రమగా నటి శ్రేయా రెడ్డి దుమ్మురేపింది. ఖాన్సార్‌ను ఆమె ఒకే రేంజ్లో వణికించేసింది. ఆ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్ తర్వాత శ్రేయా రెడ్డినే ఎక్కువ డామినేట్ చేసింది. ఇందులో జగపతిబాబు కూతురిగా పవర్ఫుల్ రోల్లో కనిపించింది. ఆమె గతం గురించి తెలియని వాళ్లు అందరూ ఎవరబ్బా ఈ బ్యూటీ అని తెగ వెతికేస్తున్నారు. ఆమె గురించి తెలిసిన వాళ్లు డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లతో షేర్ చేస్తున్నారు. ఇంతకు ఈ డెవిల్... అదేనండి 'రాధా రమ' కాదు కాదు మన శ్రేయా రెడ్డి ఎవరో తెలుసుకుందాం. 2003లో అప్పుడప్పుడు అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత శర్వానంద్ అమ్మ చెప్పింది సినిమాలో కనిపించి కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. తెలుగులో రెండు సినిమాలే చేసినా 2006లో వచ్చినా విశాల్ 'పొగరు' సినిమాలో ఈశ్వరిగా ఒక రేంజ్ల్ తన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఈ ఒక్క సినిమా ఆమె పేరు ఇప్పటికీ గుర్తుండేలా చేసింది. ఆ తర్వాత హీరో విశాల్ అన్నయ్య విక్రమ్‌ను పెళ్లి చేసుకుని గృహిణిగా ఉంటూ నటనకు దూరం అయ్యారు. కొంత కాలం అమెరికాలో ఉన్న శ్రేయా రెడ్డి ఆ తర్వాత చెన్నైకి తిరిగొచ్చారు. గతేడాది సుడల్ (Suzhal) అనే వెబ్ సిరీస్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ఈ క్రైమ్ వెబ్‌సీరిస్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అలా ఆమె రీ ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం వరుసగా పాన్ ఇండియా సినిమాలు క్యూ కట్టేస్తున్నాయి. సలార్ తర్వాత పవన్ కల్యాణ్ OG చిత్రంలో ఆమెకు ఛాన్స్ దక్కింది. సలార్ దెబ్బతో శ్రేయా పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకుంది. ముందు ముందు శ్రేయాను ఆపడం ఎవరి తరం కాదని చెప్పవచ్చు. శ్రేయా రెడ్డి భర్త ఏం చేస్తారు కోలీవుడ్‌లో వీజేగా విక్రమ్ కెరియర్ స్టార్ట్ చేశాడు. కెరియర్ ప్రారంభంలో శ్రేయా రెడ్డి కూడా వీజేగా పనిచేయంతో వారిద్దరికి అక్కడ పరిచయం ఏర్పడటం ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. విశాల్ కంటే ముందే విక్రమ్ కోలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నటుడిగా తక్కువ సినిమాల్లో కనిపించినా ఆ తర్వాత GK ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ ఏర్పాటు చేసి నిర్మాతగా పలు సినిమాలను నిర్మించాడు. ఇందులో ఎక్కువగా విశాల్‌తోనే నిర్మించడం విశేషం. ప్రస్తుతం ఆయన పలు సినిమాలకు పంపణీ దారుడిగా ఇండస్ట్రీలో ఉన్నారని సమాచారం. శ్రేయా రెడ్డి తండ్రి క్రికెటర్ అని తెలుసా.. శ్రేయా రెడ్డి తండ్రి భరత్ రెడ్డి చెన్నైలో జన్మించారు. అంతర్జాతీయ స్థాయిలో టీమిండియా జట్టు తరుపున పలు మ్యాచ్‌ల్లో రానించారు. అతను 1978, 1981 మధ్య పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై మూడు వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లలో వికెట్-కీపర్‌గా కొనసాగారు. అతను 1982-83 నుంచి 1985-86 వరకు తమిళనాడుకు కెప్టెన్‌గా కూడా ఉన్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, రెడ్డి కెంప్లాస్ట్లో పనిచేశారు. అతను చెన్నైలో క్రికెట్ శిక్షణా శిబిరాలను నిర్వహించడంలో తోడ్పడ్డారు. అక్కడ అతను భారత టెస్ట్ ఆటగాళ్లు దినేష్ కార్తీక్, లక్ష్మీపతి బాలాజీలకు శిక్షణ ఇచ్చారు. Sriya Reddy: ట్రెండింగ్‌లో సలార్ బ్యూటీ.. రాధారమగా రచ్చలేపిందిగా! (ఫోటోలు) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) -
హెలికాప్టర్లో ఒకేసారి ఆరుగురు వెళ్లే అవకాశం: భరత్‌రెడ్డి
-
అన్‌లాక్‌లో అజాగ్రత్త.. కరోనాతో చెలగాటమే!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ ఎత్తేశారు... కరోనాతో ఎలాంటి ప్రమాదం లేదని అనుకోవడం ఏమాత్రం మంచిది కాదని వైద్య నిపుణులు తేల్చిచెబుతున్నారు. అన్‌లాక్‌లో అజాగ్రత్త వహిస్తే కరోనాతో చెలగాటం ఆడినట్లేనని హెచ్చరిస్తున్నారు. అనేకమందిలో ఇక సాధారణంగా బయట స్వేచ్ఛగా తిరగవచ్చన్న దురభిప్రాయం ఉంది. అప్పుడే జనం పెద్ద ఎత్తున గుమిగూడుతున్నారు. బంధువులు, ఇతరుల ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు కొద్దిమందితో జరుపుకున్న శుభకార్యాలను, ఎక్కువ మందితో చేసుకునేందుకు సై అంటున్నారు. అవసరమున్నా లేకున్నా వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. మధ్య, దిగువ ఆదాయ ప్రజలు ఎక్కువగా నివసించే దేశం మనది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం బతుకుదెరువు, ఆర్థిక అంశాలను ఆధారం చేసుకొని లాక్డౌన్ ఎత్తివేసిందనేది అందరికీ తెలిసిందే. అంతేతప్ప కరోనా ప్రమాదం పోయిందన్న భ్రమలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా థర్డ్‌వేవ్‌కు స్వాగతం పలికినట్లేనని గట్టి హెచ్చరికలు ఇప్పటికే వచ్చాయి. ప్రమాదం పొంచే ఉంది... రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గిందేకానీ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. మరణాలూ సంభవిస్తున్నాయి. మే 1న 7,430 కేసులు నమోదు కాగా, 53 మంది చనిపోయారు. హోం ఐసోలేషన్‌లో, ఆసుపత్రుల్లో 80,695 మంది ఉన్నారు. నెలన్నర తర్వాత అంటే జూన్ 20న 1,006 కేసులు నమోదు కాగా, 11 మంది చనిపోయారు. 17,765 మంది హోం ఐసోలేషన్‌లో, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆనాటి ఉధృతి ఇప్పుడు లేదన్నది వాస్తవమే. లాక్‌డౌన్‌తో కరోనా వ్యాప్తి తగ్గింది. అంతేగానీ కరోనా ప్రమాదం తొలగిపోలేదని ఈ లెక్కలే చెబుతున్నాయి. మన చేతుల్లోనే థర్డ్‌వేవ్... అందరికీ వ్యాక్సిన్ వేసేంతవరకు కరోనా ప్రమాదం ముప్పు పొంచే ఉంటుంది. అయితే మనం ఎంతమేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్న దానిపైనే దాని తీవ్రత ఆధారపడి ఉంటుందనేది ఇప్పటివరకు కరోనా చరిత్ర చెబుతున్న పాఠం. మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో కరోనా తీవ్రత, వ్యాప్తి పెరిగింది. అనేక మ్యుటేషన్లు వచ్చాయి. ఏది ఏ స్థాయిలో విరుచుకుపడుతుందో ఊహించలేని పరిస్థితి. థర్డ్‌వేవ్ అంటూ దానికో సీజన్ అంటూ ఉండదు. ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోకుండా, జనం జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే థర్డ్ వేవే కాదు, ఫోర్త్, ఫిప్త్... వేవ్‌లు వస్తూనే ఉంటాయని అంటు న్నారు. అదీగాక ఇప్పుడు వానాకాలంలో డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులు పొంచి ఉంటాయి. దానికితోడు కరోనా జతకలిస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని అంటున్నారు. డెంగీ, మలేరియా, చికున్‌గున్యా వంటివి కూడా జ్వరంతోనే వస్తాయి. కరోనా లక్షణాల్లోనూ జ్వరం ఉంటుంది. కాబట్టి గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంది. డాక్టర్ సూచన మేరకు పరీక్షలు చేయించుకోవాలి. మందులు వాడాలి. పది రెట్లు జాగ్రత్తగా ఉండాలి లాక్డౌన్లో అందరం ఇళ్లకు పరిమితమయ్యాం. కాబట్టి బయటకు వెళ్లకుండా వైరస్ బారినపడకుండా చూసుకోగలిగాం. కానీ ఇప్పుడు అన్‌లాక్‌తో మళ్లీ సాధారణ జనజీవనం ఉంటుంది. కాబట్టి లాక్డౌన్లో కంటే ఇప్పుడే పది రెట్లు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరముంది. మనం బయటకు వెళ్లినప్పుడు ప్రతిఒక్కరినీ అనుమానించాల్సి ఉంటుంది. ఎవరికి వైరస్ ఉందో ఎవరికి లేదో మనం గుర్తించలేం. అలాగే టీకా వేయించుకున్నా కూడా నిర్లక్ష్యంగా లేకుండా కరోనా ప్రొటోకాల్స్ పాటించాలి. లేకుంటే థర్డ్ వేవ్ ముప్పు తప్పదు. ఆరు నెలలపాటు జాగ్రత్తగా ఉండాల్సిందే. – డాక్టర్ ఎ.ఎం.భరత్‌రెడ్డి (సినీ నటుడు), కార్డియాలజిస్ట్, అపోలోఆసుపత్రి కరోనా నుంచి ఇంకా బయటపడలేదు కోవిడ్ సమస్య నుంచి మనం పూర్తిగా బయట పడలేదు. అహ్మదాబాద్ సీరో సర్వే ప్రకారం 70 శాతం మందికి యాంటీబాడీస్ ఉన్నప్పటికీ వీరంతా ఏకకాలంలో ప్రభావితమైనవారు కాదు. ఫిబ్రవరి నాటికి 28 శాతం ఉంటే, రెండో దశలో 42 శాతం మంది ప్రభావితమయ్యారు. వ్యాక్సినేషన్‌తోనే ఏకకాలంలో హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యం. కానీ మన దేశం వ్యాక్సినేషన్‌ను పూర్తిస్థాయిలో వేయాలంటే ఆరు నెలలు పడుతుంది. కాబట్టి అప్పటివరకు జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ మెడికల్ కాలేజీ -
ఏవియేషన్ ఎండీగా భరత్ రెడ్డి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన నియమాకాలు చేపట్టింది. అందులో భాగంగా ఏవియేషన్ కార్పొరేషన్ ఎండీగా భరత్ రెడ్డిని.. రైతు సాధికార సంస్థ సీఈవోగా అరుణ్ కుమార్‌ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
హైదరాబాద్ కుర్రాడి ‘ఆసీ టికెట్’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సామెత పాశం భరత్‌రెడ్డికి చక్కగా సరిపోతుంది. సొంతగడ్డపై రెండు కంపెనీలు ఏర్పాటు చేసి... విజయవంతంగా నడిపిస్తున్న భరత్‌రెడ్డి... టీ–హబ్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఆస్ట్రేలియాలోనూ అడుగుపెట్టాడు. సిడ్నీలోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ క్వీన్స్‌ల్యాండ్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో మాస్టర్స్‌లో చేరి... అక్కడా వ్యాపారావకాశాలు వెదికాడు. ఆస్ట్రేలియాలో వ్యవస్థీకృతంగా స్పోర్ట్, ఈవెంట్స్‌కు ముందుగా టికెట్లు బుక్ చేసుకునే పూర్తి స్థాయి ఆన్లైన్ సౌకర్యం లేదు. ఈ అవకాశాన్ని వ్యాపారంగా మార్చి ‘ఆసీ టికెట్’ పేరిట ఓ కంపెనీని ఏర్పాటు చేశాడు. దీనికి ఆస్ట్రేలియా ప్రభుత్వం ఫండ్ రూపంలో సాయం చేసింది కూడా!!. కంపెనీ విశేషాలు ఆయన మాటల్లోనే.. వారికి పెద్ద ఉపశమనం.. వీకెండ్ వచ్చిందంటే ఆస్ట్రేలియాలో అత్యధికులు సైక్లింగ్, బోటింగ్, స్కై డైవింగ్, స్కూబా డైవింగ్, మోటార్ రేసెస్, క్రికెట్, ఫుట్‌బాల్ వంటి క్రీడల్లో మునిగిపోతారు. ఇక్కడున్న పెద్ద సమస్య ఏంటంటే టికెట్లు ఆన్లైన్లో కొనుక్కునే అవకాశం లేకపోవడం. క్రీడా స్థలంలోనే టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. ఆస్ట్రేలియా ప్రభుత్వ సిడ్నీ స్టార్టప్ హబ్‌లో మా ప్రణాళికను వారి ముందుంచాం. మా బ్లూ ప్రింట్ చూసి వారు మెచ్చుకున్నారు. రూ.10 లక్షల సీడ్ ఫండ్ సమకూర్చారు. భవిష్యత్తులో మరింత ఫండ్ దక్కే అవకాశమూ ఉంది. మా సేవల ద్వారా ఇప్పుడు స్థానికులకు పెద్ద ఉపశమనం లభించనుంది. నవంబరులో పూర్థి స్థాయిలో.. ఇప్పటి వరకు పైలట్ ప్రాజెక్టు నిర్వహించాం. విజయవంతంగా పలు ఈవెంట్ల టికెట్లు విక్రయిం చాం. నవంబరు 26న ఇండియా–ఆస్ట్రేలియా టీ–20 క్రికెట్ మ్యాచ్ ఉంది. దీనికోసం మూడో వారంలోనే యాప్‌ను అందుబాటులోకి తెస్తాం. ఈ యాప్ కూడా హైదరాబాద్‌లోని మా కంపెనీలో రూపుదిద్దుకుంటోంది. డిసెంబరులో పెద్ద ఎత్తున ఫుట్‌బాల్ మ్యాచ్‌లున్నాయి. మంచి సీజన్ కూడా. ఇది మాకు కలిసి వస్తుంది. ఆసీటికెట్.కామ్‌లో ఐదుగురు సభ్యులం పనిచేస్తున్నాం. హైదరాబాద్ టీహబ్‌లో మేం ఏర్పాటు చేసిన సంక్రంక్ గ్రూప్, ఇండియాఈలెర్న్ సంస్థల్లో ప్రస్తుతం 18 మంది పనిచేస్తున్నారు’’ అని భరత్‌రెడ్డి వివరించారు. -
ఎట్టకేలకు భరత్‌రెడ్డి అరెస్టు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా అభంగపట్నం దళిత యువకులపై దౌర్జన్యానికి పాల్పడిన జై భరత్‌రెడ్డిని పోలీసులు ఎట్టకేలకు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ముందుగా జై భరత్‌రెడ్డి తనంతట తాను పోలీసులకు లొంగిపోయాడని మీడియాలో ప్రచారం కాగా, తాము అతన్ని అరెస్టు చేశామని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ ప్రకటించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం భరత్‌రెడ్డిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ భరత్‌రెడ్డి మహారాష్ట్ర వైపు వెళ్తుండగా కామారెడ్డి సమీపంలోని టేకిర్యాల్ ఎక్స్ రోడ్డు వద్ద పట్టుకున్నామని చెప్పారు. మొరం అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారనే నెపంతో అభంగపట్నం గ్రామానికి చెందిన దళిత యువకులు బచ్చుల రాజేశ్వర్, కొండా లక్ష్మణ్‌లను జై భరత్‌రెడ్డి ముక్కు నేలకు రాయించాడు. అతని ఆదేశాలతో వారు మురికి నీటిలో మునిగారు. సెప్టెంబర్‌లో జరిగిన ఈ ఘటన వీడియో నవంబర్ 11న సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సంచలనం సృష్టించింది. ఈ అకృత్యంపై దళిత, విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి.ఈ నేపథ్యంలోనే నవంబర్ 12న అభంగపట్నానికి వచ్చిన భరత్‌రెడ్డి మీతో మాట్లాడాలని చెప్పి బాధిత యువకులు రాజేశ్వర్, లక్ష్మణ్‌లను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్లాడు. దీనిపై బాధితుల కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవీపేట్ పోలీసులు భరత్‌రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్నభరత్రెడ్డి ఈనెల 1న బాధితులిద్దరిని హైదరాబాద్‌లో వదిలేయడంతో వారిని పోలీసులు అభంగపట్నం తరలించారు. ఎట్టకేలకు నెల రోజుల తర్వాత జై భరత్‌రెడ్డిని అరెస్టు చేశామని పోలీసులు ప్రకటించారు. ప్రత్యేక నెట్వర్క్.. జై భరత్‌రెడ్డికి నేర చరిత్ర ఉన్నట్లు కమిషనర్ కార్తికేయ చెప్పారు. ఆయనపై మొత్తం ఐదు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, ఇందులో రెండు హత్య కేసులు ఉన్నట్లు వివరించారు. నిందితుడు జై భరత్‌రెడ్డికి ప్రత్యేక నెట్వర్క్ ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని కార్తికేయ వివరించారు. జై భరత్‌రెడ్డికి కోర్టు 14 రోజులు రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది. -
దొరల రాజ్యం ఒక కట్టుకథ: సీపీ కార్తికేయ
సాక్షి, నిజామాబాద్ : దళితులను అవమానించిన కేసులో బీజేపీ మాజీ నాయకుడు భరత్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. విలేకరులతో నిజామాబాద్ సీపీ కార్తికేయ మాట్లాడుతూ.. దొరల రాజ్యం సినిమా ఒక కట్టుకథ అని తేల్చారు. అక్రమంగా మొరం తరలిస్తున్నందుకే అభంగపట్నం దళితులు లక్ష్మణ్, రాజేశ్వర్లను భరత్ రెడ్డి అవమానించాడని పేర్కొన్నారు. విషయం బయటకు పొక్కేసరికి సినిమా షూటింగ్ అని కొత్త నాటకానికి తెరలేపాడని వెల్లడించారు. పోలీసులకు దొరక్కుండా హైదరాబాద్, జోగులాంబ, హంపి, కడప ప్రాంతాల్లో బాధితులను వెంట వేసుకొని తిప్పాడని వివరించారు. భరత్ రెడ్డిని కోర్టులో ప్రవేశ పెడతామని, మరింత విచారణ కోసం కస్టడీ కోరతామని తెలిపారు. అభంగపట్నంలో పికెటింగ్ కొనసాగిస్తామని, అవసరం అయితే మరింత పెంచుతామని సీపీ వెల్లడించారు. -
24 గంటల్లో భరత్‌రెడ్డిని అరెస్టు చేయాలి
నవీపేట(బోధన్): నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని అభంగపట్నం దళిత యువకులు రాజేశ్వర్, లక్ష్మణ్‌లను కిడ్నాప్ చేసి, చిత్ర హింసలకు గురి చేసిన నిందితుడు భరత్‌రెడ్డిని 24 గంటల్లో అరెస్టు చేయకపోతే జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్లను బదిలీ చేస్తానని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు హెచ్చరించారు. గ్రామంలోని దళిత బాధితులను ఆయన శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. దళితుల పట్ల క్రూరంగా వ్యవహరించిన భరత్‌రెడ్డి తీరును గత నెల 11న వీడియోలో చూడగానే స్థానిక సీపీ, ఏసీపీలను అప్రమత్తం చేసి, భరత్‌రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించానన్నారు. కానీ, పోలీసులు ఇంత వరకు అరెస్టు చేయలేదన్నారు. నిందితుడికి సహకరిస్తున్న వారందరిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని ఆదేశించారు. నిందితుడికి ఎంపీ కవిత ఆశ్రయం కల్పించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, అందుకే పోలీసులు అరెస్టు చేయడం లేదని ఆయన ఆరోపించారు. ఆయన వెంట కలెక్టర్ రవీందర్‌రెడ్డి, సీపీ కార్తికేయ ఉన్నారు. రాములు రాక కోసం దళిత సంఘాలు, కాకతీయ, ఉస్మానియా, శాతవాహన వర్సిటీలకు చెందిన విద్యార్థి సంఘాల నాయకులు గంటల తరబడి నిరీక్షించారు. లక్ష్మణ్, రాజేశ్వర్‌ను పరామర్శించి బయటకు వస్తుండగా పలు సంఘాల నాయకులు కమిషన్ సభ్యుడు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. -
సినిమా ట్విస్ట్‌లను తలపిస్తున్న దళితుల కేసు..
-
ట్విస్ట్‌ల మీద ట్విస్టులు...
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా అభంగపట్నంకు చెందిన దళితుల అదృశ్యం కేసు సినిమా ట్విస్ట్‌లను తలపిస్తోంది. 20 రోజుల తర్వాత అజ్ఞాతం నుంచి వెలుగులోకి వచ్చిన ఇద్దరు దళితులు తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, సినిమా షూటింగ్ కోసమే అలా నటించామని చెప్పిన వారు... తాజాగా మాట మార్చారు. తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసమే సినిమా షూటింగ్లో నటించామని చెప్పామని శనివారం చెప్పడం విశేషం. లాయర్ చెప్పమన్నందుకే అలా చెప్పామని, ఆత్మరక్షణ కోసమే అబద్ధం ఆడాల్సి వచ్చిందని బాధితులు చెప్పారు. నిన్న పోలీసుల అదుపులో ఉన్నప్పుడు అభంగపట్నం బాధితులు... భరత్ రెడ్డికి తమ అదృశ్యానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పగా, ఇవాళ మాత్రం... తమ అదృశ్యానికి పూర్తి కారణం భరత్ రెడ్డే అని చెప్పుకొచ్చారు. తమ సెల్ ఫోన్లు కూడా ఇప్పటికీ భరత్ రెడ్డి దగ్గరే ఉన్నాయని బాధితులు వాపోయారు. ఇరవై రోజులు కుటుంబాలకు దూరంగా నరకం అనుభవించామన్నారు. భరత్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందని, అతడిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు లక్ష్మణ్, రాజేశ్వర్ డిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే..అక్రమ మొరం తవ్వకాలను అడ్డుకున్నారనే నెపంతో బీజేపీ మాజీ నాయకుడు భరత్‌రెడ్డి నిజామాబాద్ జిల్లా అభంగపట్నంలో దళిత యువకులు లక్ష్మణ్, రాజేశ్వర్లను మురికి కుంటలో ముంచి, ముక్కు నేలకు రాయించి, దూషించిన వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన విషయం విదితమే. సెప్టెంబర్ 17న జరిగిన ఈ ఘటన వీడియోలు ఇటీవలే వెలుగు చూశాయి. ఈ క్రమంలో దీనిపై దళిత, విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. ఈ నేపథ్యంలో దళిత యువకులపై దౌర్జన్యం కేసు మలుపు తిరిగింది. ‘దొరల రాజ్యం’సినిమాలో నటించాం బీజేపీ మాజీ నాయకుడు భరత్‌రెడ్డి తమను ఎలాంటి వేధింపులకు గురిచేయలేదని బాధితులు బచ్చల రాజేశ్వర్, కొండ్రా లక్ష్మణ్ నిన్న (శుక్రవారం) మీడియాతో వివరించారు. తమను మురికి నీళ్లలో ముంచడం.., ముక్కు నేలకు రాయించడం వంటి వీడియోలు, చిత్రాలన్నీ కేవలం సినిమా షూటింగ్ మాత్రమే అని మీడియాకు వివరించడం చర్చనీయాంశంగా మారింది. ‘దొరల రాజ్యం’పై వారు షూటింగ్ చేస్తున్నామంటే అందులో తాము నటించామన్నారు. ఇందుకోసం మాకు రూ.20 వేల చొప్పున పారితోషికం ఇస్తామన్నారని వారు చెప్పారు. తమను ఎవరూ అవమాన పరచలేదని, తమపై ఎవరూ దౌర్జన్యం చేయలేదని బాధితులిద్దరూ మీడియాకు వివరించారు. ఈ ఘటనపై పోలీసులకు అందిన ఫిర్యాదులపై స్పందిస్తూ మమ్మల్ని అడగకుండా పోలీసులకు ఎలా ఫిర్యాదు ఇస్తారని వారు ప్రశ్నించారు. ఈ విషయంలో రాజకీయం చేయాలని చూస్తున్నారని అన్నారు. డబ్బులు ఇచ్చి తప్పుడు మాటలు చెప్పిస్తున్నారన్న విషయమై వారు స్పందిస్తూ అలాంటిదేమీ లేదని అన్నారు. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, తామే ఉపాధి కోసం పనులు వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చామని బాధితులు చెప్పారు. దీంతో ఇంతకాలం ఆచూకీ లేకుండా పోయిన బాధితులిద్దరినీ జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వీరిని నిజామాబాద్ జిల్లాకు తరలించారు కాగా గత నెల 12వ తేదీన కిడ్నాప్‌కు గురైన లక్ష్మన్, రాజేశ్వర్లను హైదరాబాద్‌లో పట్టుకున్నామని ఏసీపీ సుదర్శన్ తెలిపారు. బాధితులను భరత్‌రెడ్డి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఫిర్యాదు రావడంతో పోలీసులను రంగంలో దింపి గాలించామన్నారు. బాధితులను శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులకు అప్పగించామని తెలిపారు. భరత్‌రెడ్డిపై ఎస్సీ,ఎస్టీ కేసు నమోదు అయ్యిందని బాధితులు దొరికినప్పటికీ భరత్‌రెడ్డి దొరకలేదన్నారు. బాధితుల నుండి పూర్తి వివరాలు తీసుకున్నాం. దానిని బట్టి భరత్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటామన్నారు. మా విచారణలో బాధితులు కేసుకు సంబంధించి విషయాలు తెలిపారు. ఇది కోర్టు డాక్యుమెంట్ పరిధిలోకి వచ్చే అంశం కాబట్టి చెప్పడానికి వీలు లేదన్నారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాధితులు దొరల రాజ్యం సినిమా షూటింగ్ వెళ్లినట్లు చెప్పుతున్నారని ప్రశ్నించగా ఆ విషయం తనకు తెలియదని దాటవేశారు. -
దళితుల కేసులో ఊహించని ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలో గత 20 రోజుల కిందట అదృశ్యమైన ఇద్దరు దళితుల కేసు ఊహించని మలుపు తిరిగింది. ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాలు వారిని కిడ్నాప్ చెర నుంచి విడుదల చేయాలంటో ఎన్నో ధర్నాలు చేపట్టి, భరత్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు 20 రోజుల తర్వాత కనిపించిన ఆ ఇద్దరు వ్యక్తులు తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, సినిమా షూటింగ్ కోసమే అలా నటించామని చెప్పారని పోలీసులు విచారణలో తేలింది. గత నెలలో నిజామాబాద్ జిల్లాలోని నవీపేటలో బీజేపీ మాజీ నేత భరత్ రెడ్డి చేస్తున్న అక్రమ ఇసుక రవాణాదందాపై దళితులైన లక్ష్మణ్, రాజేశ్వర్ లు ప్రశ్నించారు. దీంతో అభంగపట్నానికి చెందిన దళితులను మురికినీళ్లలో ముంచి భరత్ రెడ్డి వారిని అవమానించాడని, వారిపై దాష్టీకానికి దిగాడని కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో నవంబర్ 12న సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. దాంతో తొలుత భరత్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. అనంతరం లక్ష్మణ్, రాజేశ్వర్ లు అదృశ్యమైపోవడం స్థానికంగా కలకలం రేపింది. కొన్ని రోజుల తర్వాత లక్ష్మణ్ భార్య లత, రాజేశ్వర్ భార్య భావన పోలీసులకు ఫిర్యాదు చేశారు. భరత్‌రెడ్డిపై నవీపేట పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. ఇద్దరు దళితులను భరత్ రెడ్డి కిడ్నాప్ చేశాడని, అతడిని అరెస్టు చేయాలని దళిత సంఘాల రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపట్టాయి. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు అభంగపట్నం దళితులు లక్ష్మణ్, రాజేశ్వర్లను గుర్తించి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూశాయి. తమను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, కేవలం సినిమా షూటింగ్ కోసమే మురికినీళ్లలో మునిగినట్లు నటించామని చెప్పడంతో పోలీసులే షాకవుతున్నట్లు తెలుస్తోంది. వారు చెప్పిన విషయాలు నిజమా కాదా అనే కోణంలోనూ విచారణ కొనసాగిస్తున్నారు. -
ఆ ఇద్దరు దళితులు ఏమయ్యారు?
సాక్షి, హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో ఇద్దరు దళితులను దారుణంగా అవమానించిన కేసు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఈ ఘటన వెలుగుచూసి 12 రోజులు అవుతున్నా.. దళితులను దారుణంగా అవమానించిన బీజేపీ నేత భరత్‌రెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు. అతన్ని పట్టుకునేందుకు తాజాగా మరో పోలీసు బృందం రంగంలోకి దిగింది. దీంతో మొత్తం మూడు ప్రత్యేక బృందాలు భరత్‌రెడ్డి ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఈ కేసులో అదృశ్యమైన ఇద్దరు దళిత బాధితులు ఆచూకీ కూడా తెలియడం లేదు. 11 రోజులైనా వారు కనిపించకపోవడంతో వారి కుటుంబసభ్యుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దళితులు ఇద్దరినీ భరత్ రెడ్డే కిడ్నాప్ చేయించాడని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. భరత్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే, అజ్ఞాతంలో ఉన్న భరత్‌రెడ్డి స్థావరాలు మార్చుతూ పోలీసుల నుంచి తప్పించుకుంటున్నట్లు సమాచారం. అదృశ్యమైన ఇద్దరు దళితులు కూడా భరత్ రెడ్డి వద్దే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నందుకు ఇద్దరు దళితు వ్యక్తులపై భరత్ రెడ్డి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దళితులు ఎంత వేడుకున్నా వినిపించుకోని అతను.. కర్రతో వారిని బెదిరిస్తూ నీటి కుంటలో మునగాలంటూ ఆదేశించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
భరత్‌రెడ్డి కోసం రంగంలోకి మరో టీమ్!
సాక్షి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అభంగపట్నంలో ఇద్దరు దళితులను దారుణంగా అవమానించిన కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భరత్ రెడ్డి ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నాడు. అతడిని పట్టుకునేందుకు మరో పోలీసు బృందం రంగంలోకి దిగింది. దీంతో మొత్తం మూడు ప్రత్యేక బృందాలు అతని ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. అయితే, స్థావరాలు మార్చుతూ భరత్‌రెడ్డి పోలీసుల నుంచి తప్పించుకుంటున్నట్లు సమాచారం. అదృశ్యమైన ఇద్దరు దళితులు కూడా భరత్ రెడ్డి వద్దే ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, అభంగ పట్నంలో భరత్ రెడ్డికి వ్యతిరేకంగా దళిత సంఘాల నిరసనలు కొనసాగుతున్నాయి. మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నందుకు ఇద్దరు దళితు వ్యక్తులపై భరత్ రెడ్డి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. దళితులు ఎంత వేడుకున్నా వినిపించుకోని అతను.. కర్రతో వారిని బెదిరిస్తూ నీటి కుంటలో మునగాలంటూ ఆదేశించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
భరత్ రెడ్డి కోసం రెండు బృందాల పోలీసులు గాలింపు
-
భరత్‌రెడ్డి కోసం పోలీసుల గాలింపు
సాక్షి, నిజామాబాద్ : ఇద్దరు దళితులను అవమానించిన బీజేపీ నేత భరత్ రెడ్డి కోసం రెండు బృందాల పోలీసులు గాలింపు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఎర్రకుంట చెరువు నుంచి అక్రమంగా జరుపుతున్న మొరం తవ్వకాలను అడ్డుకున్నందుకు అభంగపట్నంకు చెందిన ఇద్దరు దళితులు లక్ష్మణ్, రాజేశ్వర్లను మురికి నీళ్ళలో ముంచి భరత్‌రెడ్డి అవమానించాడు. ఈ సంఘటన సంబంధించిన వీడియో ఈ నెల 12 న సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. దాంతో భరత్‌రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లాడు. పది రోజులుగా బాధితులు కూడా కనిపించడం లేదు. బాధితుల కుటుంబీకులు భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే ఆదివారం రాత్రి లక్ష్మణ్ భార్య లత, రాజేశ్వర్ భార్య భావన పోలీసులకు ఫిర్యాదు చేశారు. భరత్‌రెడ్డిపై నవీపేట పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ, కిడ్నాప్ కేసులు నమోదు చేశారు. నిందితుడిని 24 గంటల్లో అరెస్టు చేయాలని దళిత సంఘాల రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాగా, భరత్‌రెడ్డిపై చర్య తీసుకోవాలని పోలీసు కమిషనర్‌కు బీజేపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. కాగా భరత రెడ్డిపై పోలీసులు కిడ్నాప్ కేసు కూడా నమోదు చేశారు. -
వీడియో: దళితులపై బీజేపీ నేత దాష్టీకం..
సాక్షి, నవీపేట : నిజామాబాద్ జిల్లా నవీపేటలో దారుణం చోటుచేసుకుంది. మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నందుకు ఇద్దరు దళితు వ్యక్తులపై ఓ బీజేపీ నేత భరత్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. తాము ఎంత వేడుకున్నా వినిపించుకోని ఆ నేత కర్రతో బాధిత దళితులను బెదిరిస్తూ నీటి కుంటలో మునగాలంటూ ఆదేశించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నవీపేట మండలంలోని ఎర్రగుంట్ల వద్ద గ్రామపంచాయతీ పర్మిషన్ లేకుండా బీజేపీ నేత మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారు. అయితే ఈ అక్రమ రవాణాపై ఇద్దరు దళిత వ్యక్తులు భరత్ రెడ్డిని ప్రశ్నించారు. 'నన్నే ప్రశ్నిస్తారా.. మీకెంత ధైర్యమంటూ' బాధిత దళితులను దుర్భాషలాడాతూ వారిపై తన జులుం ప్రదర్శించినట్లు సమాచారం. దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగుచూసింది. అన్యాయం, అక్రమాలను ప్రశ్నించినందుకు ఇద్దరు దళితులపై దాడి జరగడాన్ని దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దాడికి పాల్పడ్డ నేత భరత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
నటుడిగా బిజీ అయినా... వైద్యవృత్తిని వదులుకోను!
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామంటారు చాలామంది. కానీ డాక్టరూ యాక్టరూ అయ్యే అవకాశం చాలా కొంతమందికే లభిస్తుంది. డాక్టర్ భరత్‌రెడ్డి ఆ జాబితాకు చెందినవారే. హైదరాబాద్‌లో గుండె వైద్య నిపుణుడిగా పనిచేస్తున్న భరత్‌రెడ్డి తనకు నటనే గుండె చప్పుడు అని చెబుతున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ భాషల్లో కూడా రాణిస్తున్న ఈ యువ నటునితో జరిపిన సంభాషణ... ‘అత్తారింటికి దారేది’లో మీ పాత్రకు మంచి పేరొచ్చినట్టుంది? అవునండి. ఇప్పటి వరకూ చేసిన సినిమాలు ఒకెత్తయితే, ఈ సినిమా మరొక ఎత్తు. ఓ బ్లాక్ బస్టర్ సినిమాలో నటిస్తే వస్తే కిక్ ఏమిటో ఇప్పుడు అర్థమవుతోంది. ఈమధ్య తిరుపతిలో ఓ పెళ్లికి వెళ్తే అందరూ నా చుట్టూ గుమిగూడేసరికి, మా బంధువులూ స్నేహితులూ నా ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయారు. డాక్టర్‌గా గుర్తింపు బావుందా? నటునిగా వస్తోన్న క్రేజ్ బావుందా? దేని సంతృప్తి దానిదే. మోటార్ సైకిల్ అంటేనే తెలీని మధ్య తరగతి కుటుంబం మాది. అలాంటిది నేను డాక్టర్ని కాగలిగాను. ఇప్పటివరకూ 350 మందిని ప్రాణాపాయం నుంచి కాపాడగలిగాను. ఇది నాకు దేవుడిచ్చిన అవకాశంగానే భావిస్తున్నాను. ఇక నటుడు కావడమనేది మరో గొప్ప అవకాశం. భవిష్యత్తులో నటుడిగా బాగా బిజీ అయితే, వైద్య వృత్తిని వదిలేస్తారా? లేదు. నటన, వైద్యం నాకు రెండు కళ్లులాంటివి. నటుడిగా ఎంత బిజీ అయినా, వైద్యాన్ని మానుకోను. శని, ఆదివారాలైనా సేవ చేయడానికి ప్రయత్నిస్తాను. అసలు నా దృష్టిలో వైద్యం అంటే సమాజసేవ. వైద్య వృత్తిలోకి ఎలా వచ్చారు? అసలు నేను డాక్టరూ యాక్టరూ అవుతానని ఏనాడూ అనుకోలేదు. మాకంత స్తోమత కూడా లేదు. మా కుటుంబాన్ని చక్కగా చూసుకునే ఉద్యోగం వస్తే చాలు అనుకున్నాను. కడపలో సూపర్‌మార్కెట్ అయినా పెట్టుకుని బతికేద్దామను కున్నాను. మా అమ్మకు మాత్రం నన్ను డాక్టర్ చేయాలని ఉండేది. తన కోరికే నన్ను ఈ రంగంలోకి తెచ్చింది. మరి యాక్టింగ్ వైపు రావాలని ఎందుకనిపించింది? చెన్నైలో చో రామస్వామిగారి స్కూల్లో చదువుకుంటున్నపుడు కొన్ని స్టేజ్ ప్లేల్లో నటించాను. అప్పటి నుంచీ నటనపై అభిలాష మొదలైంది. డాక్టర్‌గా పనిచేస్తూనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించాను. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘ఒక విచిత్రం’ సినిమాలో 37 సెకన్లు కనపడే వేషం దొరికింది. ఆ తర్వాత చిన్నా చితకా పాత్రలు చాలా చేశాను. మరి బ్రేక్ ఎప్పుడొచ్చింది? జేడీ చక్రవర్తి దర్శకత్వంలో వచ్చిన ‘సిద్ధం’ నాకు మంచి పేరు తెచ్చింది. ఆ సినిమా ద్వారానే ‘ఈనాడు’లో కమల్‌హాసన్‌తో నటించే సువర్ణావకాశం కూడా నాకు దక్కింది. ‘ఈనాడు’ తర్వాత నాకు పోలీస్ ఇమేజ్ వచ్చేసి, వరుసగా అలాంటి పాత్రలు చాలా వచ్చాయి. కమల్‌హాసన్‌తో కలిసి నటించడం ఎలా అనిపించింది? యాక్టింగ్‌లో ఆయనొక యూనివర్శిటీలాంటివారు. ఆయనతో రెండుమూడు సినిమాలు చేస్తే చాలు నటన మీద మనకో భరోసా వచ్చేస్తుంది. ‘ఈనాడు’ సమయంలో నాకు మంచి సూచనలు ఇచ్చేవారు. ‘విశ్వరూపం’ తెలుగు వెర్షన్లో ఓ పాత్రకు నన్ను డబ్బింగ్ చెప్పమని ఆయనే అడిగారు. భవిష్యత్తులో ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోను. తమిళ, కన్నడ భాషల్లో కూడా సినిమాలు చేస్తున్నట్టున్నారు? అవునండీ. ప్రస్తుతం తమిళంలో 3, కన్నడంలో 1 సినిమా చేస్తున్నాను. నాకు 8 భాషలు వచ్చు. అందుకే నాకు భాషా సమస్య లేదు. రేపు మలయాళంలో అవకాశం వచ్చినా చేయగలను. ఇక తెలుగు విషయానికొస్తే ‘పైసా’ రిలీజ్‌కి రెడీగా ఉంది. ‘ఆగడు’లో చేయబోతున్నాను. నటునిగా మీ లక్ష్యం? యాంటీ హీరో, నెగిటివ్ షేడ్‌తో పాటు పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలు చేయాలని ఉంది. ‘అత్తారింటికి దారేది’ తర్వాత హీరోగా చేయమని కొంతమంది అడుగుతున్నారు. ప్రస్తుతానికి హీరోగా చేసే ఉద్దేశం లేదు.