big scam
-
శ్రీవారి నిధుల దోపిడీకి చంద్రబాబు సర్కార్ స్కెచ్
-
గొర్రెల పంపిణీలో 700 కోట్ల భారీ స్కాం
-
Land for jobs scam: రూ.600 కోట్ల కుంభకోణం!
న్యూఢిల్లీ: ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ కుటుంబసభ్యుల నివాసాల్లో శుక్రవారం జరిపిన సోదాల్లో దొరికిన నగలు, నగదు, వెల్లడైన పత్రాలను బట్టి నేర విస్తృతి రూ.600 కోట్లకు పైగానే ఉంటుందని ఈడీ తెలిపింది. లాలూ కుటుంబసభ్యుల ఇళ్లలో లెక్కల్లో చూపని రూ.కోటి నగదు, రూ.1.25 కోట్ల విలువైన విదేశీ కరెన్సీ, బంగారం, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. వీటితోపాటు, లాలూ కుటుంబసభ్యుల పేరిట ఉన్న సేల్ డీడ్స్, ఆస్తి పత్రాలు దితరాలను స్వాధీనం చేసుకున్నామని, వీటిని బట్టి నేర విస్తృతి రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు శనివారం వెల్లడించింది. వీటిల్లో రూ.350 కోట్లు స్థిరాస్తులు కాగా, రూ.250 కోట్ల మేర బినామీదార్ల పేరిట లావాదేవీలు ఉన్నాయంది. తేజస్వీ యాదవ్ ఆస్తుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఈడీ.. ఢిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీలోని ఏబీ ఎక్స్‌పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఉన్న డి–1088 నాలుగంతస్తుల భవనం తేజస్వీదేనని తెలిపింది. ఈ కేసులో ఈ కంపెనీని ‘లబ్ధిపొందిన సంస్థ’గా గుర్తించినట్లు వెల్లడించింది. మార్కెట్ విలువ ప్రకారం రూ.150 కోట్లకుపైగా విలువైన ఈ భవనాన్ని తేజస్వీ, ఆయన కుటుంబం కేవలం రూ.4 లక్షలకే పొందినట్లు ఈడీ ఆరోపించింది. ఇలాంటివే మరో నాలుగు ఆస్తులను గుర్తించామని తెలిపింది. రైల్వే జాబ్స్ ఫర్ లాండ్ కుంభకోణంపై తమ దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణల్లో భాగంగా లాలూ కుటుంబీకులు, వారి సంబంధీకులు రియల్ ఎస్టేట్ వంటి వివిధ రంగాల్లో వేర్వేరు ప్రాంతాల్లో పెట్టిన మరిన్ని పెట్టుబడులను కూడా వెలికితీస్తామని తెలిపింది. లాలూ ముగ్గురు కుమార్తెలు, కుమారుడు బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్‌కు చెందిన వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం ఈడీ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. సీబీఐ విచారణకు తేజస్వీ గైర్హాజరు ఇదే కేసులో తేజస్వీ యాదవ్ శనివారం సీబీఐ విచారణకు హాజరుకాలేదు. వ్యక్తిగత కారణాలు చూపుతూ విచారణకు మరో తేదీని నిర్ణయించాలని ఆయన కోరినట్లు అధికారులు తెలిపారు. సీబీఐ సమన్ల ప్రకారం ఈ నెల 4వ తేదీన జరగాల్సిన విచారణకూ తేజస్వీ డుమ్మా కొట్టారు. తేజస్వీ కోరిన విధంగా విచారణకు మరో తేదీని నిర్ణయించే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఆర్జేడీ చీఫ్, మాజీ సీఎం లాలూ యాదవ్, ఆయన భార్య మాజీ సీఎం రబ్రీదేవిని సీబీఐ ప్రశ్నించిన విషయం తెలిసిందే. లాలూ రైల్వే శాఖ మంత్రిగా ఉండగా కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలిచ్చినందుకు ప్రతిఫలంగా ఉచితంగా లేక తక్కువ ధరకు భూములను పొందినట్లు సీబీఐ ఆరోపణలు చేస్తోంది. లాలూ కుటుంబం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. జేడీయూ అగ్రనేత, బిహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా తేజస్వీ వాదనను సమర్థించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నమే సీబీఐ విచారణ అంటూ విమర్శించారు. అయితే, 2017లో నితీశ్..లాలూపై దర్యాప్తు సంస్థలు చేసిన అవినీతి ఆరోపణలను సమర్థిస్తూ మాట్లాడటం విశేషం. -
అదానీ అంశంపై ప్రశ్నిస్తూనే ఉంటాం: ఖర్గే
న్యూఢిల్లీ: అదానీ అంశాన్ని పార్లమెంట్ లోపలా, బయటా లెవనెత్తుతూనే ఉంటామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఇది చాలా పెద్ద కుంభకోణమన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అదానీ అంశంతోపాటు తన, పార్టీ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించడం తదితర 10 ప్రశ్నలను ఆయన ప్రభుత్వానికి సంధించారు. ప్రజల డబ్బునకు సంబంధించిన అదానీ అంశం పెద్ద కుంభకోణమని ఖర్గే పేర్కొన్నారు. ‘దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటుకు ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది? ఆర్బీఐ, సెబీ, ఈడీ, సీబీఐ వంటి సంస్థలు తమ విధులను నిర్వర్తించకుండా ఎందుకు చేశారు? కుంభకోణాలెన్ని జరిగినా మౌనంగా ఉన్నారెందుకు?అని ఆయన అన్నారు. వీటిపై పార్లమెంట్ వెలుపల, లోపల ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. వీటిపై ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకుండా, నియంత మాదిరిగా వ్యవహరిస్తానంటే ప్రజలు ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతారని హెచ్చరించారు. రాజ్యసభలో ప్రశ్నలు మాత్రమే అడిగాను తప్ప ఎలాంటి అన్‌పార్లమెంటరీ మాటలు మాట్లాడలేదన్నారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ, రాజ్యసభ రికార్డుల నుంచి తన మాటలను తొలగించడంపై ఆయన.. ప్రజాస్వామ్యం పేరుతో ఏం జరుగుతోందో మీరే ఊహించుకోండని వ్యాఖ్యానించారు. తన మిత్రుడి కుంభకోణాల మకిలిని పోగొట్టేందుకు ప్రధాని మోదీ పార్లమెంట్‌ను వాషింగ్ మెషీన్‌లాగా వాడుకుంటున్నారని ఖర్గే ట్వీట్ చేశారు. -
అతిపెద్ద కుంభకోణం
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నివేదిక విడుదల చేసిన వేళ ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు దేశచరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని ఆరోపించారు. గురువారం రాహుల్ మీడియాతో మాట్లాడారు. పారిశ్రామికవేత్తలైన స్నేహితులకు డబ్బులు సమకూర్చేందుకే సామాన్యులపై మోదీ నోట్ల రద్దు అస్త్రాన్ని ప్రయోగించారని విమర్శించారు. ‘పెద్ద నోట్ల రద్దు కారణంగా చెల్లకుండాపోయిన నగదంతా బ్యాంకులకు తిరిగివచ్చేసింది. ఇది భారీ కుంభకోణానికి ఏమాత్రం తక్కువకాదు’ అని వ్యాఖ్యానించారు. ‘దాదాపు 20 మంది పారిశ్రామికవేత్తలైన ఆయన మిత్రులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రధాని ఉద్దేశపూర్వకంగా నోట్ల రద్దుతో సామాన్యులపై దాడికి పాల్పడ్డారు.గత ఎన్నికల్లో ప్రచారానికి భారీగా డబ్బులు ఖర్చుపెట్టిన పారిశ్రామికవేత్తలకు సాయం చేయడమే ఆయన లక్ష్యం’ అని రాహుల్ మండిపడ్డారు. బీజేపీ చీఫ్ అమిత్ షా డైరెక్టర్‌గా ఉన్న గుజరాత్‌లోని ఓ సహకార బ్యాంకులో ఏకంగా రూ.700 కోట్ల విలువైన రద్దయిన నోట్లను కొందరు మార్చుకోవడంపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ‘గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా సహకార బ్యాంకులో ఎవరి నగదు మార్పిడి జరిగిందో విచారణ జరిపారా? అని ప్రశ్నించారు. రాఫెల్ ఫైటర్ జెట్ల కొనుగోలుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని ఆర్థికమంత్రి జైట్లీకి తాము పెట్టిన డెడ్‌లైన్ గడువు ముగుస్తోందన్నారు. రాహుల్‌తో కుమారస్వామి భేటీ కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా రాహుల్‌గాంధీని కర్ణాటక సీఎం కుమారస్వామి ఢిల్లీలో కలిశారు. కర్ణాటక మంత్రివర్గ విస్తరణపై ఇద్దరు నేతలు చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీపై త్వరలో∙నిర్ణయం తీసుకుంటామని అనంతరం కుమారస్వామి మీడియాతో అన్నారు. -
‘ఆర్సీ’తో ఏమార్చి కోట్లు కొట్టేశారు!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల : సింగరేణి బొగ్గు రవాణాలో ఇదో కొత్త తరహా కుంభకోణం! బొగ్గు రవాణా చేసే లారీకి రవాణా శాఖ జారీ చేసే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ)ని మార్చేసి కాంట్రాక్టర్లు కోట్లు కొల్లగొట్టారు. ఒరిజినల్ ఆర్సీలో పేర్కొన్న వాహనం బరువు (నెట్ వెయిట్)ను కలర్ జిరాక్స్లో మార్ఫింగ్ చేసి గుట్టుగా దందా సాగించారు. బొగ్గుతో లోడ్ చేసిన తర్వాత వచ్చే లారీ బరువు(టోర్)ను లెక్కలోకి తీసుకొని ప్రతి లోడ్‌లో రెండు నుంచి మూడు టన్నుల వరకు అధికంగా రవాణా చేస్తున్నట్లు సింగరేణి అధికారులను బురిడీ కొట్టించారు. ఇలా ‘కిలోమీటరు, టన్ను, ట్రిప్పుల’ప్రాతిపదికన ప్రతి బొగ్గు లారీకి చెల్లించే మొత్తాన్ని పెంచేసుకొని రోజుకు లక్షల్లో, నెలకు కోట్లల్లో జేబుల్లోకి వేసుకున్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో ఓ క్లర్క్.. ఆర్సీలపై అనుమానంతో తీగ లాగగా ఈ స్కాం డొంక కదిలింది. రవాణా శాఖ యాప్ ద్వారా ఒరిజనల్ ఆర్సీని తనిఖీ చేయగా.. లారీల బరువును ఒకటి నుంచి మూడు టన్నుల వరకు తగ్గించి కలర్ జిరాక్స్ ఆర్సీలను తయారు చేసినట్లు తేలింది. శ్రీరాంపూర్ ఏరియాలోని గనుల నుంచి తీసిన బొగ్గును సమీపంలోని కోల్ హాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ)లకు రవాణా చేసే ప్రక్రియలోనే ఈ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయంటే... సీహెచ్పీల నుంచి వేరే ప్రాంతాలకు రోజూ తరలివెళ్లే బొగ్గు రవాణాలో సింగరేణి ఎంత నష్టపోతుందో తేలాల్సి ఉంది. వాహనం బరువుకు ఆర్సీ ప్రామాణికమా? సాధారణంగా ఒక లారీలో రవాణా అయ్యే సరుకు బరువును కాంటా (వేయింగ్ మిషన్) ద్వారా తెలుసుకుంటారు. ఖాళీ లారీ బరువును ముందుగా తూకం వేసి, సరుకుతో నిండిన తర్వాత మరోసారి తూకం వేస్తే కచ్చితమైన బరువు ఎంతో తెలుస్తుంది. సాధారణంగా ఏ సరకు రవాణాకైనా ఇదే ప్రామాణికం. కానీ సింగరేణిలో బరువు తూచే విషయంలో వాహనం ఆర్సీని కూడా పరిగణలోకి తీసుకోవడం గమనార్హం. ఆర్సీలో పేర్కొన్న వాహన నెట్ బరువు, గని వద్ద తూకం వేసిన వాహన బరువులో ఏది తక్కువగా నమోదైతే దాన్ని పరిగణనలోకి తీసుకోవాలనే నిబంధనను చేర్చారు. బొగ్గు రవాణా అనంతరం సీహెచ్‌పీ వద్ద వాహన బరువు (టేర్)ను లెక్కించి రవాణా అవుతున్న బొగ్గు గ్రాస్ వెయిట్‌ను కొలుస్తారు. దీని ప్రకారం ఎంత బొగ్గు రవాణా అయితే అన్ని టన్నులకు దూరం ఆధారంగా కాంట్రాక్టు సమయంలో పేర్కొన్న మొత్తాన్ని చెల్లించడం జరుగుతోంది. ఇలా ఎక్కడా లేని ఆర్సీ నిబంధనను బొగ్గు రవాణాలో పెట్టడం వల్ల కలర్ జిరాక్స్ ద్వారా మార్ఫింగ్‌కు అవకాశం కల్పించినట్లయింది. ఎలా బయటపడిందంటే? శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి కార్యాలయంలోని ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పనిచేసే ఓ క్లర్క్ ఇటీవల కాంట్రాక్టు సమయం పూర్తయిన బొగ్గు రవాణా లారీల వివరాలను పరిశీలించారు. ఈ క్రమంలో లారీ నెట్ బరువుకు సంబంధించి దాఖలు చేసిన ఆర్సీలలో అక్షరాల్లో తేడా ఉండడం గమనించారు. ఓ ట్రాన్స్‌పోర్టు సమర్పించిన 10 ఆర్సీల్లో ఈ తేడా కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన ఆయన రాష్ట్ర రవాణా శాఖ రూపొందించిన ‘ఆర్టీఏ ఎం–వాలెట్’యాప్ ద్వారా శ్రీరాంపూర్ ఏరియాలోని బొగ్గు రవాణా చేసే ఒరిజనల్ ఆర్సీలను పరిశీలించారు. 60 లారీలకుగాను 39 లారీలకు సంబంధించిన కాంట్రాక్టర్లు ఆర్సీలలో లారీ నెట్‌వెయిట్‌ను టాంపరింగ్ చేసినట్లు తేలింది. సదరు ట్రాన్స్‌పోర్టుకు చెందిన పది లారీలలో మూడు టన్నుల తేడా రాగా, మరో లారీలో ఒక టన్ను తేడా చూపించారు. మరో లారీకి రెండు టన్నుల తేడాతో ఆర్సీ తయారు చేశారు. మిగతా 18 లారీలకు సంబంధించి కూడా ఒకటి నుంచి రెండు టన్నుల తేడాలతో ఆర్సీలలో నెట్‌వెయిట్ మార్చేశారు. దీంతో ఆ క్లర్క్ పై అధికారుల ద్వారా సింగరేణి విజిలెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. రోజుకు లక్షల్లోనే ఎసరు బొగ్గు గని నుంచి సీహెచ్‌పీకి బొగ్గు రవాణా చేసినందుకు సగటున కిలోమీటరుకు రూ.10 చెల్లించేలా ఒప్పందం కుదిరిందనుకుంటే.. ఒక లారీ కనీసం పది కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తుంది. అంటే ఒక టన్నుకు రూ.100 చెల్లించాలి. రోజుకు ఎనిమిది ట్రిప్పుల మేర లారీ తిరిగితే టన్నుకు రూ.800 చొప్పున చెల్లించాలి. అంటే మూడు ట్రిప్పులకు అదనంగా చెల్లించినా ప్రతి లారీకి రూ.2,400 చొప్పున ముట్టజెప్పడమే. శ్రీరాంపూర్‌లో గుర్తించిన 39 లారీలకు ప్రతి ట్రిప్పుకు సుమారు 100 టన్నులకు పైగా ప్రతిరోజు అదనంగా చెల్లిస్తూ వచ్చారు. ఇక్కడే రోజుకు లక్ష నుంచి లక్షన్నర వరకు అదనంగా చెల్లిస్తున్నట్లు సమాచారం. మిగతా ఏరియాల్లో ఇంతేనా? ఏటా 64 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసే సింగరేణి సంస్థలో 13 కోల్ హాండ్లింగ్ ప్లాంట్ (సీహెచ్‌పీ)లతోపాటు పెద్ద సంఖ్యలో బొగ్గు డిస్పాచ్ పాయింట్లు ఉన్నాయి. సింగరేణిలోని 19 ఓపెన్‌కాస్ట్ గనులు, 29 భూగర్భ గనుల నుంచి వెలికితీసిన బొగ్గును డిస్పాచ్ పాయింట్ల వరకు లారీల్లో తీసుకెళ్తారు. అక్కడ్నుంచి రైలు మార్గంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా అవుతుంది. గనుల నుంచి సీహెచ్పీల వరకు బొగ్గు రవాణా చేసేందుకే రాష్ట్రవ్యాప్తంగా వేలాది లారీలను వినియోగిస్తున్నారు. ఈ లారీల నెట్‌వెయిట్‌ను మార్చేసే తంతు ఎప్పట్నుంచి నడుస్తుందో తెలియదు. అందుకే అతి తక్కువ బిడ్‌తో బడా కాంట్రాక్టర్లే సింగరేణిలో రవాణా కాంట్రాక్టులను పొందుతున్నారని అర్థమవుతోంది. సింగరేణి విజిలెన్స్ విభాగం పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు బయటపడే అవకాశం ఉంది. -
హాంకాంగ్ కోర్టు మెట్లెక్కిన పీఎన్బీ
హాంకాంగ్‌లో ఉన్న నీరవ్ మోదీని ఎలాగైనా భారత్‌కు రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్లు ఎగొట్టి విదేశాలకు పారిపోయిన ఈయన్ని ఇటీవలే హాంకాంగ్‌లో ఉన్నట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించిన సంగతి తెలిసిందే. నీరవ్‌ను అరెస్ట్‌చేసి తమకు అప్పగించాలని భారత్ అధికారులు, హాంకాంగ్ అథారిటీలను కోరడంతో వారు కూడా సానుకూలంగా స్పందించారు. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా నీరవ్ మోదీకి వ్యతిరేకంగా హాంకాంగ్ హైకోర్టును ఆశ్రయించింది. హాంకాంగ్ హైకోర్టును మాత్రమే కాక, నీరవ్ మోదీ, మెహుల్ చౌక్సి ఆస్తులు, వ్యాపారాలు ఉన్న ఇతర దేశాల కోర్టులను సైతం పీఎన్బీ ఆశ్రయించింది. హైకోర్టు నోటీసులను హాంకాంగ్ న్యూస్‌పేపర్లు శనివారం ప్రచురించాయి. కాగ, పీఎన్బీకి దాదాపు రూ.13,500 కోట్లు ఎగవేసిన నీరవ్ మోదీపై ఇండియాటుడే సైతం పలు కీలక విషయాలను వెలుగులోకి తెస్తోంది. నీరవ్ సీక్రెట్ అకౌంట్లు, అతనికి విదేశాల్లో ఉన్న వ్యాపారాలు, నీరవ్ కుంభకోణంపై అతని కుటుంబ సభ్యుల స్పందన వంటి పలు విషయాలను ఇండియాటుడే విడుదల చేసింది. మరోవైపు ఉద్దేశ్యపూర్వక రుణ ఎగవేతదారులపై బ్యాంకు సైతం కొరడా ఝళిపించడం ప్రారంభించింది. 1,084 వేల మంది రుణ ఎగవేతదారులను గుర్తించిన పీఎన్బీ, వారిలో 260 మంది ఫోటోలను పేపర్లలో కూడా ప్రచురించింది. -
విరాట్ కోహ్లి కొనసాగుతాడు
భారీ కుంభకోణంతో సతమతమవుతున్న పంజాబ్ నేషనల్ బ్యాంకుపై పలు తప్పుడు వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇన్ని రోజులు బ్యాంకుకు బ్రాండు అంబాసిడర్‌గా ఉన్న విరాట్ కోహ్లి, ఈ కుంభకోణ నేపథ్యంలో తప్పు కుంటున్నాడని, బ్యాంకు తన కస్టమర్ల విత్డ్రాయల్స్పై పరిమితులు విధిస్తుందని వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే ఈ వార్తలపై పీఎన్బీ క్లారిటీ ఇచ్చింది. తమ బ్రాండు అంబాసిడర్‌గా విరాట్ కోహ్లి కొనసాగుతాడని పీఎన్బీ పేర్కొంది. కస్టమర్ల విత్డ్రాయల్స్పై ఎలాంటి పరిమితులు విధించడం లేదని, సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయని బ్యాంకు స్పష్టంచేసింది. అదేవిధంగా ఆడిట్ సంస్థ ప్రైస్‌వాటర్‌హౌజ్‌కూపర్స్(పీడబ్ల్యూసీ) పీఎన్బీలో చోటుచేసుకున్న రూ.11,400 కోట్ల కుంభకోణాన్ని విచారణ జరుపనుందని వస్తున్న వార్తలను కూడా బ్యాంకు కొట్టివేసింది. కుంభకోణ నేపథ్యంలో బ్యాంకుతో ఉన్న ఎండోర్స్‌మెంట్‌ను విరాట్ రద్దు చేసుకుంటున్నాడంటూ మీడియా రిపోర్టులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ రిపోర్టులన్నీ పూర్తిగా తప్పుడవని, నిరాధారమైనవని బ్యాంకు క్లారిటీ ఇచ్చింది. తమ బ్రాండు అంబాసిడర్‌గా విరాట్ కోహ్లి కొనసాగుతాడని బ్యాంకు తెలిపింది. ఈ మోసాన్ని విచారించడానికి పీడబ్ల్యూసీతో కలిసి పనిచేయడం లేదని, అయితే నీరవ్ మోదీకి, ఆయన సంబంధిత కంపెనీలకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలను తామే సేకరిస్తున్నట్టు బ్యాంకు తెలిపింది. ప్రధానంగా అంతర్జాతీయ ఆర్ధిక నేరాలపై పీడబ్ల్యూసీ విచారణ చేస్తుంది. కానీ ప్రస్తుతం పీడబ్ల్యూసీ సహకారాన్ని పీఎన్బీ తీసుకోవడం లేదు. ఈ పరిస్థితిని పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించడానికి, సంస్థ, వినియోగదారుల, వాటాదారుల కాపాడటానికి తగిన సామర్థ్యాన్ని కలిగి ఉందని బ్యాంక్ పునరుద్ఘాటించింది. -
నీరవ్ మోదీ లేఖపై పీఎన్బీ ఆగ్రహం
తనను సర్వనాశనం చేశారంటూ పంజాబ్ నేషనల్ బ్యాంకుకు నీరవ్ మోదీ రాసిన లేఖపై, బ్యాంకు ఆగ్రహం వ్యక్తంచేసింది. తన కంపెనీలకు జారీచేసిన లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్ అక్రమమైనవని, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని, అందుకే ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని గట్టి చురకలే అందించింది. ఈ నేపథ్యంలోనే స్కాంను బయటికి వెల్లడించామని పేర్కొంది. నీరవ్ పొందిన మొత్తం రుణ ప్రక్రియ 'మనీ లాండరింగ్' కిందకి వస్తుందంటూ పీఎన్బీ స్పష్టంచేసింది. ''మీరు ఎల్ఓయూలను అక్రమంగా పొందారు. కొందరు బ్యాంకు అధికారుల ద్వారా అనధికారిక మార్గంలో వీటిని ఉపయోగించుకున్నారు. ఇలాంటి వాటిని బ్యాంకు ఉపేక్షించదు. ఈ అక్రమ కార్యకలాపాలు ఎఫ్ఈఎంఏ, మనీ లాండరింగ్ ఉల్లంఘనల కిందకి వస్తాయి'' అని నీరవ్ మోదీ లేఖకు స్పందిస్తూ పీఎన్బీ జనరల్ మేనేజర్ అశ్విని వాట్స్ తిరిగి లేఖ రాశారు. ఈ కార్యకలాపాలను లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల దృష్టికి తీసుకురావాలని బ్యాంకు నిర్ణయించిందని తెలిపారు. బ్యాంకు యాజమాన్యం అత్యుత్సాహంతో వ్యవహరించి, తన దారులన్నింటినీ మూసివేసిందని ఆరోపిస్తూ బ్యాంకు యాజమాన్యానికి నీరవ్ మోదీ ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. తన బ్రాండును దెబ్బతీసిందని ఆరోపించారు. పీఎన్బీ తనపై అన్నీ తప్పుడు ఆరోపణలు చేసిందనీ, ఇప్పటికైనా ఫైర్‌స్టార్ గ్రూపునకు చెందిన విలువైన ఆస్తులను విక్రయించి, బకాయిలు తీర్చే అవకాశం ఇవ్వాలని కోరాడు. ఈ లేఖపై పీఎన్బీ ఈ విధంగా స్పందించింది. -
పాతాళంలో గీతాంజలి జెమ్స్
పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న కుంభకోణం దెబ్బకు గీతాంజలి జెమ్స్ షేర్లు పాతాళానికి పడిపోయాయి. వరుసగా ఏడు సెషన్ల నుంచి తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గత వారం నుంచి ఇప్పటి వరకు గీతాంజలి జెమ్స్ షేర్లు దాదాపు 58.5 శాతం కుప్పకూలాయి. దీంతో గీతాంజలి జెమ్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఒక్కసారిగా రూ.435.41 కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. నేటి ట్రేడింగ్‌లోనే బీఎస్ఈలో ఈ స్టాక్ 4.92 శాతం కిందకి పడిపోయింది. ఎన్ఎస్ఈలో కూడా 4.92 శాతం కిందకి పడిపోయి రూ.26.05 వద్ద ట్రేడవుతోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగుచూసిన రూ.11,400 కోట్ల కుంభకోణంలో ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన కుటుంబానికి చెందిన ప్రమేయమున్నట్టు తెలిసింది. దీంతో వారికి చెందిన గీతాంజలి జెమ్స్‌పై సీబీఐ, ఈడీ అధికారులు భారీ ఎత్తున్న తనిఖీలు చేస్తున్నారు. కొన్ని షోరూంలను సీజ్ కూడా చేశారు. ఐటీ కూడా గీతాంజలి జెమ్స్‌కు చెందిన కొన్ని ఆస్తులను సీజ్ చేసింది. మరోవైపు గీతాంజలి జెమ్స్ మూతపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగులకు సైతం వార్నింగ్ లేఖలు వెళ్లాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గీతాంజలి జెమ్స్ షేరు విలువ భారీగా పతనమవుతోంది. -
పీఎన్బీ స్కాం : రోడ్డున పడబోతున్న ఉద్యోగులు
పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న భారీ కుంభకోణం గీతాంజలి జెమ్స్ ఉద్యోగులకు ఎసరు తెచ్చి పెట్టింది. నీరవ్ మోదీ అంకుల్ మెహుల్ చౌక్సికి చెందిన ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను రిలీవింగ్ లెటర్లు తీసుకోవాలంటూ గీతాంజలి జెమ్స్ కోరింది. ఈ నేపథ్యంలో గీతాంజలి జెమ్స్‌ను మూసివేసే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో పాల్పడిన రూ.11,400 కోట్ల కుంభకోణంలో నీరవ్ మోదీ, ఆయన అంకుల్ మెహుల్ చౌక్సిలు ప్రధాన పాత్రదారులుగా ఉన్నారు. ఈ స్కాం వెలుగులోకి రాకముందే నీరవ్ మోదీ, చౌక్సి దేశం విడిచి పారిపోయారు. అయితే పీఎన్బీ మోసంలో చౌక్సి ప్రమేయాన్ని గీతాంజలి జెమ్స్ ఖండిస్తోంది. చౌక్సికి వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. మోదీకి వ్యతిరేకంగా వస్తున్న ఆరోపణలు కూడా తప్పుడువేనంటూ నీరవ్ మోదీ న్యాయవాది విజయ్ అగర్వాల్ పేర్కొంటున్నారు. ''ఎవరూ దీన్ని హేతుబద్ధంగా చూడటం లేదు. అన్ని కేసుల్లో ఇదే జరుగుతుంది. బోఫోర్స్ కేసులో, 2జీ కేసులో, బొగ్గు కుంభకోణం కేసులో ఇదే జరిగింది. ఈ కేసులో కూడా ఇదే జరుగుతుంది. ఎవరూ దీన్ని హేతుబద్ధంగా చూడరు'' అని అగర్వాల్ అన్నారు. -
గాంధీ, నెహ్రూల ఖాతాలున్న బ్యాంక్‌కే కన్నం..
సాక్షి, న్యూఢిల్లీ : ఎంతో ఘన చరిత్ర కలిగిన ‘పంజాబ్ నేషనల్ బ్యాంక్’ పరువు ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కారణంగా నేడు నీట మునిగింది. దాదాపు 123 ఏళ్ల క్రితం, అంటే భారత్‌కు స్వాతంత్య్రం రాకముందే 1895లో పాకిస్థాన్‌లోని లాహోర్ కేంద్రంగా ఈ బ్యాంక్ ఆవిర్భవించింది. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు లాలా లజ్‌పతి రాయ్ ఈ బ్యాంకును ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆర్యసమాజ్ సభ్యుడైన ఓ మిత్రుడు ఇచ్చిన సలహా మేరకు ‘ఇండియన్ మనీ, ఇండియన్ మెన్’ అనే నినాదంతో ఈ బ్యాంకు ఏర్పాటుకు రాయ్ కృషి చేశారు. 1894, మే నెలలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యవస్థాపక బాడీ ఏర్పాటయింది. అప్పటికీ పంజాబ్ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన లాలా హరికిషన్ లాల్, ‘ది ట్రిబ్యున్’ ఆంగ్ల దినపత్రిక వ్యవస్థాపక సభ్యుడు దయాల్ సింగ్ మజీతియాలు ఆ బాడీలో ఉన్నారు. రెండు లక్షల రూపాయల పెట్టుబడి, 20 వేల రూపాయల మూలధనం పెట్టుబడితో 1895లో బ్యాంక్ మొదటి బ్రాంచి ప్రారంభమైంది. బ్యాంకులో తొలి ఖాతాను లాలా లజ్‌పతి రాయ్ తెరిచారు. ఆ తర్వాత భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, జాతిపిత మహాత్మా గాంధీలు కూడా ఇందులో ఖాతాదారులయ్యారు. అనతి కాలంలోనే ఈ బ్యాంకు అనేక బ్రాంచీలుగా విస్తరించినప్పటికీ 1929లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల ఈ బ్యాంకు కూడా దిబ్బతిన్నది. ఏకంగా 92 బ్రాంచీలను మూసుకోవాల్సి వచ్చింది. దేశ విభజనకు కొన్ని నెలల ముందు బ్యాంక్ తన ప్రధాన కార్యాలయాన్ని పాకిస్థాన్‌లోని లాహోర్ నుంచి న్యూఢిల్లీకి మార్చుకుంది. దేశ విభజన సందర్భంగా మొత్తం డిపాజిట్లలో 40 శాతం డిపాజిట్లను కోల్పోవాల్సి వచ్చింది. బ్యాంకును ఏర్పాటు చేసిన తొలి 60 ఏళ్ల కాలంలోనే పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా 270 బ్రాంచీలను ఏర్పాటు చేయగలిగింది. 1950, 1960 దశకంలో భారత్ బ్యాంక్, ఇండో కమర్షియల్ బ్యాంకులను కలుపుకొని మరింత బలపడింది. 1969లో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఈ బ్యాంక్‌తోపాటు దేశంలోని మరో 13 బ్యాంకులను జాతీయం చేశారు. అప్పటికే బ్యాంక్ 70 శాతం భారత ఖాతాదారుల డిపాజిట్లతో కళకళలాడుతోంది. ప్రస్తుతం ఈ బ్యాంకుకు దేశవ్యాప్తంగా ఏడువేల బ్రాంచ్‌లున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ప్రభుత్వం కంపెనీల్లో ఒకటిగా ఫోర్బ్స్ జాబితాలో కూడా చోటు సంపాదించుకుంది. 2010 నుంచి 2015 మధ్య పంజాబ్ నేషనల్ బ్యాంక్‌తోపాటు దేశంలోని పలు ప్రభుత్వ బ్యాంకులు తీవ్రంగా నష్టపోయాయి. అవినీతికి అలవాటుపడిన అధికారులు అడ్డగోలుగా వేల కోట్ల రూపాయలు రుణాలు ఇవ్వడంతో వడ్డీలు పడిపోయి నిరర్థక ఆస్తులు పెరిగిపోయాయి. దీన్ని అరికట్టడం కోసమే భారతీయ రిజర్వ్ బ్యాంక్ 2015, డిసెంబర్ నెలలో కఠిన నియమ, నిబంధనలను ప్రకటించింది. 2016 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ బ్యాంక్ నిరర్థక ఆస్తులు 55,800 కోట్ల రూపాయలకు చేరుకుంది. పైగా అదే సంవత్సరానికి 3,974 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. భారతీయ బ్యాంకుల చరిత్రలోనే ఇంతటి నష్టం ఏర్పడడం ఇదే మొదటిసారి. 2017 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్‌కు చెందిన 9వేల కోట్ల మొండి బకాయిలను రద్దు చేశారు. 2018, మార్చి నెల నాటికి 5,473 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో బ్యాంకు కోలుకుంటుందని భావిస్తున్న సమయంలో నీరవ్ మోదీ కుంభకోణం వెలుగుచూసింది. -
పీఎన్బీ స్కాం కీలక వ్యక్తులు అరెస్ట్
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు భారీ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన బ్యాంకు అధికారులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ప్రధాన సూత్రదారుడు, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్‌మోదీకి సహకరించినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అప్పటి పీఎన్బీ డిప్యూటీ మేనేజర్ గోకుల్ నాధ్ శెట్టిని, పీఎన్బీ ఎస్‌డబ్ల్యూఓ మనోజ్ ఖారత్‌ను, నీరవ్ మోదీ గ్రూప్ సంస్థలకు అధికారిక సంతకందారు హేమంత్ భట్‌ను సీబీఐ అరెస్ట్‌చేసింది. ఎటువంటి రుణ పరిమితి లేకుండా లేదా నగదు మార్జిన్ లేకుండానే 'లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్' (ఎల్‌ఒయు) పొందేందుకు గోకుల్ నాథ్ శెట్టి, మనోజ్ ఖారత్, హేమంత్ భట్‌లతో కలిసి నీరవ్‌మోదీ ఈ కుట్రకు పాల్పడ్డారని పీఎన్బీ తన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. వీరిని నేడు ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టు ముందు హాజరుపరచనున్నారు. కాగ, నీరవ్ మోదీకి గోకుల్ నాథ్ శెట్టి అత్యంత సన్నిహితుడిగా ఉండేవాడని తెలుస్తోంది. ఈ క్రమంలో ముంబైలోని ఆయన నివాసంలో కూడా సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ స్కాంలో గోకుల్ శెట్టిని సహ నిందితుడిగా బ్యాంకు పేర్కొంది. దాదాపు రూ.11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ ప్రస్తుతం విదేశాల్లో దాక్కున్నట్టు తెలుస్తోంది. ఈ కుంభకోణం బయటపడుతుందనే సమయంలోనే అంటే జనవరి 1నే నీరవ్ విదేశాలకు చెక్కేశాడు. ఆయన ప్రస్తుతం న్యూయార్క్‌లోని జేడబ్ల్యూ మారియట్స్ ఎస్సెక్స్ హౌజ్‌లో ఉన్నట్టు సమాచారం. నీరవ్ మోదీని పట్టుకోవడం కోసం సీబీఐ, ఈడీ అధికారులు వేట కొనసాగించారు. ఆయన్ను పట్టుకునేందుకు భారత్ ఇంటర్‌పోల్ సహాయం కోరింది. మరోవైపు పీఎన్బీలో స్కాం దెబ్బకు బ్యాంకులు విలవిలలాడుతున్నాయి. వేలకోట్ల రూపాయల్లో బ్యాంకులు భారీగా రుణాలు ఇచ్చాయి. దీంతో ఆ బ్యాంకులు తలలు పట్టుకుంటున్నాయి. -
వేల కోట్ల డబ్బు ఎవరికి చేరింది?
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయల్లో కన్నం వేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆ నగదును విదేశాలకు తరలించినట్టు తెలిసింది. పీఎన్బీ నగదును అక్రమంగా విదేశీ కంపెనీలకు చెల్లించి, డైమాండ్ వ్యాపారాల్లో నీరవ్ మోదీ భారీ మొత్తంలో లబ్ది పొందారు. అయితే ఆ డబ్బు ఎవరికి వెళ్లింది? ఎవరూ ఈ అక్రమ నగదును సొంతం చేసుకున్నారు? అని సర్వత్రా చర్చనీయాంశమైంది. ఔరా జెమ్ కంపెనీ, సినో ట్రేడర్స్ కంపెనీ, యునిటీ ట్రేడింగ్, సన్‌షైన్ జెమ్స్, ట్రై కలర్ జెమ్స్, పసిఫిక్ డైమాండ్ విదేశీ కంపెనీలు ఈ నగదును పొందినట్టు తెలిసింది. గత ఏడేళ్లుగా పీఎన్బీ, ఇచ్చిన ఉత్తర్వులపై భారతీయ బ్యాంకులు ఈ కంపెనీలకు డబ్బులు చెల్లించినట్టు ఉంది. ఈ కంపెనీల పేర్లు పీఎన్బీ, సీబీఐకి దాఖలు చేసిన ఫిర్యాదులో వెల్లడయ్యాయి. అయితే ఈ నగదును ఎలా వాడారన్నది మిస్టరీగానే ఉంది. పసిఫిక్ డైమాండ్స్ ఎఫ్‌జడ్‌ఈ, యూనిటీ ట్రేడింగ్ ఎఫ్‌జడ్‌ఈ, ట్రై కలర్ జెమ్స్ ఎఫ్‌జడ్‌ఈ ఈ మూడు యూనిటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందినవి కాగ, సన్‌షైన్ జెమ్స్, సినో ట్రేడర్స్ హాంకాంగ్ చెందినవిగా తెలుస్తోంది. ఔరా జెమ్ ఏ దేశ కంపెనీనో ఇంకా తెలియలేదు. తమ విదేశీ కార్యాలయాలు, ఈ కంపెనీల క్రెడిబిలీటిని పరీక్షిస్తున్నాయని, 2010 నుంచి ఇప్పటివరకు జరిగిన లావాదేవీలపై ఆరా తీస్తున్నట్టు సీనియర్ కౌంటర్పార్టీ బ్యాంకర్ చెప్పారు. వారం తర్వాత ఈ కంపెనీలపై ఓ నివేదిక వస్తుందని, ఆ సమాచారం మేరకు అంతర్గత విచారణ కూడా చేపడతామని పేర్కొన్నారు. బాహ్యాంగా కన్సల్టెంట్‌ను ఏర్పాటుచేయాలా? లేదా? అన్నది ఇంకా నిర్ణయించాల్సి ఉందన్నారు. నీరవ్ మోదీ, మెహల్ చౌక్సి గీతాంజలి జెమ్స్ కంపెనీలతో సంబంధాలున్న మరికొన్ని కంపెనీలను కూడా ఇన్వెస్టిగేటర్లు, బ్యాంకర్లు అనుమానస్పంద కంపెనీలుగా భావిస్తున్నారు. మొత్తం 150 లెటర్స్ ఆఫ్ అండర్‌టేకింగ్స్ ద్వారా నీరవ్ మోదీ పీఎన్బీకి రూ.11,400 కోట్లు కన్నం వేశారు. పీఎన్బీ ఉద్యోగులు బ్యాంకు ఉన్నతాధికారులకు తెలియకుండా ఈ మోసానికి పాల్పడ్డారు. -
నీరవ్ మోదీతో ముఖేష్ అంబానీకి లింక్?
ఆయన పేరుకి డైమాండ్ కింగ్. పెద్ద పెద్ద షోరూంలతో కోట్లలో వ్యాపారం చేస్తున్నారు. కానీ ప్రజల సొమ్మును మాత్రం పీల్చుకుతిన్నారు. అసలు విషయం బయటికి వచ్చేసరికి దేశం విడిచి పోయారు. ఆయనే ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.11,400 కోట్ల మేర కన్నం వేసి, నాకేం సంబంధం లేదన్నటూ న్యూయార్క్ వెళ్లిపోయారు. స్కాం బయటికి వచ్చేసరికి, ఆయన విదేశాల్లో ఉన్నారు. ఈ అవినీతి తిమింగలాన్ని పట్టుకోవడానికి సీబీఐ, ఈడీలు తీవ్ర కసరత్తు ప్రారంభించేశాయి. అయితే ఈ డైమాండ్ కింగ్‌కు, దేశంలో అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీకి సంబంధాలున్నట్టు తెలిసింది. బిలీనియర్ అంబానీ బ్రదర్ల మేనకోడలు ఇషితా సల్గాంకర్, నీరవ్ మోదీ తమ్ముడు నిషాల్ మోదీని పెళ్లి చేసుకుంది. ఇలా ఈ రెండు కుటుంబాలకు సంబంధం ఏర్పడింది. నిషాల్, ఇషితా పెద్ద సమక్షంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా 2016లో గోవాలో జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్తల నుంచి బాలీవుడు స్టార్ల వరకు అందరూ ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. వీరి ప్రీ-వెడ్డింగ్ పార్టీని ముఖేష్ అంబానీనే స్వయంగా చేశారు. బంకింగ్‌హామ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాపర్టీ ముంబై యాంటిలియా హౌస్‌లో వీరి ప్రీ-వెడ్డింగ్ పార్టీ జరిగింది. ఇషితా ప్రముఖ గోవా పారిశ్రామిక వేత్త దత్రాజ్ సల్గాంకర్ కుమార్తె కావడం విశేషం. అంబానీ కుటుంబానికి, దత్రాజ్ కుటుంబానికి మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. అంబానీ చెల్లెలు దీప్తి సల్గాంకర్‌ను దత్రాజ్ పెళ్లి చేసుకున్నారు. నీరవ్ మోదీ తమ్ముడు నిషాల్ మోదీ కూడా తన మేనమామ మెహల్ చోక్సి నేతృత్వంలో డైమాండ్ వ్యాపారమే నిర్వహిస్తున్నారు. గీతాంజలి జెమ్స్‌కు మెహల్ చోక్సి యజమాని. నిషాల్ ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, పారాగన్ జువెల్లరీ ఎల్ఎల్పీ, పారగన్ మెర్కండైజింగ్ ఎల్ఎల్పీ, పంచజన్య డైమాండ్స్ ఎల్ఎల్పీ ఇవన్నీ నీరవ్ మోదీకి డిజైన్ పార్టనర్లుగా ఉన్నారు. -
స్కాం ఎఫెక్ట్ : రూ. 7వేల కోట్లు ఆవిరి
సాక్షి, ముంబై: మాల్యా తరహాలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ భారీ కుంభకోణం వెలుగు చూడటంతో మార్కెట్లో జ్యువెల్లరీ షేర్లు భారీగా నష్టపోయాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో పలుషేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి. అంతేకాదు పీఎన్బీ ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ. 7వేల కోట్లు ఆహుతైపోయింది. ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ లావాదేవీల్లో భారీగా అక్రమాలు ఆరోపణల నేపథ్యంలో మార్కెట్ లో ఆందోళన నెలకొంది. దీంతో అటు జ్యువెలరీ, బ్యాంక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతోపాటు ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ముంబై బ్రాంచీలో సుమారు రూ. 11,400 కోట్లమేర అక్రమ లావాదేవీలు జరిగిన నేపథ్యంలో జ్యువెలరీ స్టాక్స్‌లో ఇన్వెస్టర్లు అమ్మకాల వెల్లువ సాగింది. ముఖ్యంగా పీసీ జ్యువెలర్స్ షేరు దాదాపు 9 శాతం పతనంకాగా గీతాంజలి జెమ్స్ షేర్ లో అదే ధోరణి. ఇంకా తంగమాయిల్ జ్యువెలరీ , టీబీజెడ్, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, రినైసన్స్ జ్యువెలరీ నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి. మరోవైపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేరు కూడా దాదాపు 13 శాతం కుప్పకూలింది. రెండు రోజుల్లో మొత్తం 18శాతం నష్టపోయింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఇన్వెస్టర్లు మూడు వేలకోట్ల రూపాయలను కోల్పోగా, సీబీఐ ప్రకటన వెలువడిన వెంటనే గురువారం మరో నాలుగు వేల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సందర ఆవిరైపోయింది. దీంతో మొత్తం రూ7వేల కోట్ల సంపద నిమిషాల్లో గాల్లో కలిసిపోయింది. మరోవైపు ఇప్పటికే పీఎన్బీలో జరిగిన కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌తోపాటు సీబీఐ పలు వ్యక్తులపై కేసులు నమోదు చేశాయి. ఫైర్‌స్టార్ డైమండ్ కంపెనీ చీఫ్ నీరవ్ మోదీతోపాటు, అతడి భార్య, సోదరుడు, తదితరులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
మాల్యాను మించిన మరో కేడీ
సాక్షి, ముంబై: వేలకోట్ల రూపాయలు ఎగవేసి లండన్‌కు చెక్కేసిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యాను మించిన భారీ అవినీతి తిమింగలం సీబీఐ వలకు చిక్కింది. ఆ తిమింగలమే ప్రభుత్వ రంగ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీ స్కాంకు పాల్పడిన నిందితుడు ప్రముఖ సెలబ్రిటీ డైమండ్ వ్యాపారి కావడం గమనార్హం. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రూ.11,400 కోట్ల మేర పంజాబ్ నేషనల్ బ్యాంకులో మోసపూరిత లావాదేవీలను గుర్తించినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంకు బీఎస్ఈ ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతో సీబీఐ, ఈడీ అధికారులు రంగంలోకి దిగారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై అండర్‌టేకింగ్ లెటర్లు సంపాదించి వాటిని విదేశాల్లో సొమ్ము చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నీరవ్ మోదీ ఆఫీసులు, షోరూమ్‌లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడి చేశారు. ముంబై, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మాల్యా తరహాలో భారీ కుంభకోణం వెలుగులోకి రాడంతో మార్కెట్ వర్గాల్లో కలవరం మొదలైంది. దీంతో పంజాబ్ నేషనల్ కుంభకోణంపై బ్యాంకు అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ఎలాంటి అక్రమాలను సహించమని, క్లీన్ బ్యాంకింగ్‌కు కట్టుబడి ఉన్నామని పీఎన్బీ ఎండీ , సీఈవో సునీల్ మెహతా ప్రకటించారు. వేలకోట్ల రూపాయలను ఎగవేసి సింగపూర్‌కు చెక్కేసిన నీరవ్ మోదీపై లుక్ అవుట్ జారీ అయిందని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. జనవరి 30న ఎఫ్ఐఆర్ నమోదు అయిందనీ విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు. అలాగే ఈ కేసులో తమ బ్యాంకుకు చెందిన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసినట్టు చెప్పారు. దీనికి సంబంధించి రిజర్వ్ బ్యాంకు నుంచి ఇప్పటివరకు తమకు ఎలాంటి ఆదేశాలు లేవని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అవసరమైతే ఫోరెన్సిక్ ఆడిట్ కూడా చేపడతామన్నారు. 2011 నుంచి అవినీతి లావాదేవీలు చోటు చేసుకున్నట్టు జనవరి మూడవ వారంలోనే గుర్తించామన్నారు. మూడు నాలుగురోజులు అంతర్గత విచారణ అనంతరం దీనిపై సీబీఐకి ఫిర్యాదు చేశామని ఎండీ ప్రకటించారు. అక్రమ, అనధికారిక లావాదేవీలకు పాల్పడిన అధికారులపై చర్యతీసుకుంటున్నామన్నారు. నిందితులను క్షమించేదిలేదనీ, ఖాతాదారుల ఆర్థిక ప్రయోజనాలను కాపాడతామని హామీ ఇచ్చారు. మరోవైపు ఈ పరిణామాల నేపథ్యంలో పీఎన్బీ షేరు 13శాతం కుప్పకూలింది. -
నీరవ్ మోదీ కేసులో కీలక విషయాలు
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడి, విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముంబైలో ఆయన నివాసముంటున్న రిజిస్ట్రర్ ప్లాట్‌కి నీరవ్ మోదీ గత కొంత కాలంగా రాలేదని తెలిసింది. ముంబైలోని పెడరూట్ క్రాస్విన్నర్ హౌజ్‌లోని నాలుగో నెంబర్ ప్లాట్‌లో ఆయన తన కుటుంబసభ్యులతో కలిసి నివాసముండేవారు. కానీ గత రెండు నెలలుగా ఆయన అక్కడికి రాలేదని తెలిసింది. అంతేకాక పీఎన్బీలో ఇంత భారీ మొత్తంలో స్కాం చేసినప్పటికీ, నీరవ్ మోదీ ఇంట్లో మాత్రం ఎలాంటి తనిఖీలు జరుగలేదు. ఇప్పటి వరకు ఆయన ప్లాట్‌కు పోలీసులు కానీ, బ్యాంకు అధికారులు కానీ, సీబీఐ అధికారులు ఎవరూ రాలేదని నీరవ్ మోదీ సర్వెంట్ చెప్పాడు. ప్రస్తుతం మోదీ ఆఫీసులు, దుకాణాలు, వర్క్‌షాపుల్లోనే అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఢిల్లీ, సూరత్, ఢిల్లీలలో 13 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారులు ఇప్పటి వరకు నీరవ్ మోదీ ఇంట్లో తనిఖీలు చేయకపోవడం చర్చనీయాంశమైంది. అంతేకాక బ్యాంకులకు వేలకోట్లు ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా లాగానే, ప్రస్తుతం నీరవ్ మోదీ కూడా వ్యవహరించారు. పీఎన్బీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకముందే నీరవ్ మోదీ విదేశాలకు చెక్కేశారు. పీఎన్బీకి రూ.280 కోట్ల చీటింగ్ కేసులో కొన్ని రోజుల కిందటే ఆయన్ని సీబీఐ అదుపులోకి తీసుకుని వదిలిపెట్టింది. అనంతరం పీఎన్బీ ఈ భారీ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకు వచ్చింది. నీరవ్ మోదీ విదేశాలకు పారిపోవడంపై అధికారులు, ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టుచ్చినట్టు కనిపిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాల్యా కంటే అధికంగా నీరవ్ మోదీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. దాదాపు రూ.11వేల కోట్ల మోసపూరిత లావాదేవీలు చేపట్టినట్టు పీఎన్బీ తేల్చింది. ఈ నగదును విదేశాలకు పంపినట్టు కూడా తెలుస్తోంది. ఈ కేసుపై సీబీఐ, ఈడీ రెండూ దర్యాప్తును ముమ్మరం చేశాయి. పీఎన్బీ మాత్రమే కాక, మొత్తం 30 బ్యాంకులు ఈ కుంభకోణ భారీన పడినట్టు తెలుస్తోంది. మరోవైపు నీరవ్ మోదీ జువెల్లరీస్‌కు బ్రాండు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా, ఆయన కంపెనీకి నోటీసులు పంపింది. తనకు ప్రకటన డబ్బులు చెల్లించలేదని ఆ నోటీసుల్లో పేర్కొంది. -
విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీ
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకులో వెలుగుచూసిన భారీ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ దేశం విడిచి పారిపోయారు. పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్బీ) ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుచేయక ముందే నీరవ్ మోదీ భారత్‌ను విడిచి స్విట్జర్లాండ్‌కు పారిపోయినట్టు తెలిసింది. పీఎన్బీలోని ముంబై బ్రాంచులో రూ.11వేల కోట్ల అక్రమాలు చోటుచేసుకున్నాయని బ్యాంకు బుధవారం రెగ్యులేటరీకి రిపోర్టు చేసింది. ఇన్నివేల కోట్ల నగదును విదేశాలకు తరలించినట్టు తేల్చింది. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి రాగానే, బ్యాంకింగ్ రంగం తీవ్ర షాకింగ్‌కు గురైంది. ఈ అక్రమాల్లో బడా వజ్రాల వ్యాపారి, బిలీనియర్ నీరవ్ మోదీ పాత్ర ఉన్నట్టు పీఎన్బీ ఆరోపించింది. ఈయనపై సీబీఐ వద్ద రెండు ఫిర్యాదులు కూడా దాఖలు చేసింది. ఈ కుంభకోణం వెలుగులోకి రాకముందు నీరవ్‌పై రూ.280 కోట్ల చీటింగ్ కేసు నమోదైంది. ప్రస్తుతం పీఎన్బీ కుంభకోణంలో నీరవ్ పాత్ర ఉన్నట్టు ఆరోపిస్తూ, ఆయనకు వ్యతిరేకంగా సీబీఐతో పాటు ఈడీ కూడా మనీ లాండరింగ్ కేసు నమోదుచేసింది. అయితే రూ.5000 కోట్లను తిరిగి బ్యాంకులకు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు నీరవ్ మోదీ చెబుతున్నారు. మరోవైపు నీరవ్ మోదీ, పీఎన్బీ కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ముంబైలోని నీరవ్ మోదీ దుకాణాల్లో అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అంతేకాక దేశవ్యాప్తంగా 21 ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. పీఎన్బీ మాజీ డీజీఎం గోఖుల్ శెట్టికి ఈడీ సమన్లు జారీచేసింది. అంతేకాక ఈ అక్రమాల్లో పాలుపంచుకున్నారనే ఆరోపణలతో 10 మంది బ్యాంకు ఉద్యోగులను పీఎన్బీ నిన్ననే(బుధవారమే) సస్పెండ్ చేసింది. పీఎన్బీతో పాటు యూనియన్ బ్యాంకు, ఎస్బీఐ ఓవర్సీస్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, అలహాబాద్ బ్యాంకులు కూడా నీరవ్ మోదీకి రుణాలు ఇచ్చినట్టు తెలిసింది. పీఎన్బీ కుంభకోణం వెలుగులోకి రాగానే, పలు బడా జువెల్లరీ సంస్థలపై కూడా ఇన్వెస్టిగేషనల్ ఏజెన్సీలు విచారణ చేపడుతున్నాయి. మార్కెట్ రెగ్యులేటరీ సెబీ కూడా ఈ స్కాంపై విచారణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. బ్యాంకులు, ఇతర లిస్టెడ్ కంపెనీలపై సెబీ దృష్టిసారించింది. భారీ కుంభకోణం నేపథ్యంలో పీఎన్బీ బ్యాంకు షేరు రెండు రోజుల్లో దాదాపు 17 శాతం నష్టపోయింది. ప్రముఖ జువెల్లరీ కంపెనీ షేర్లు కూడా భారీగా పడిపోతున్నాయి. -
అసలెవరీ నీరవ్ మోదీ?
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణం చోటుచేసుకున్నట్టు వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బ్యాంకే బుధవారం తేల్చింది. దాదాపు రూ.11,346 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు బుధవారం బీఎస్ఈ ఫైలింగ్‌లో బ్యాంకు పేర్కొంది. అయితే ఈ భారీ కుంభకోణానికి, ప్రముఖ వజ్రాల వ్యాపారి, బిలీనియర్ నీరవ్ మోదీకి లింక్‌లున్నట్టు కూడా ఆరోపించింది. అయితే 10 రోజుల ముందు వరకు నీరవ్ మోదీ అంతపెద్ద సెలబ్రిటీ ఏమీ కాదు. ఎప్పుడైతే సీబీఐ వద్ద పంజాబ్ నేషనల్ బ్యాంకు తన ఫిర్యాదును దాఖలు చేసిందో ఇక అప్పటి నుంచి ఆయన ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు. నీరవ్ మోదీ ఒక పవర్ ఫుల్ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు, వజ్రాల కొనుగోలుదారి. బ్యాంకుకు దాదాపు రూ.280 కోట్ల మేర మోసం చేశారనే ఆరోపణలతో నీరవ్ మోదీపై ఫిబ్రవరి 5న సీబీఐ కేసు బుక్ చేసింది. తర్వాతి వారంలోనే బ్యాంకులోని ముంబై బ్రాంచులో భారీ మొత్తంలో కుంభకోణం చోటు చేసుకుందని, దాదాపు రూ.11,346 కోట్ల మేర మోసపూరిత లావాదేవీలు జరిగాయంటూ ఫిర్యాదు చేసింది. ఈ కుంభకోణంతో లింక్‌ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోదీ, భారత్‌లో అత్యంత చిన్న వయసులోనే బిలీనియర్‌గా ఫోర్బ్స్ లిస్టులో చోటు దక్కించుకున్న వ్యక్తి.. 2.3 బిలియన్ డాలర్ల ఫైర్ స్టార్ డైమండ్ వ్యవస్థాపకుడు. వజ్రాల వ్యాపారుల కుటుంబంలోనే పుట్టిన నీరవ్ మోదీ, వజ్రాల వృత్తినే తన వ్యాపారంగా ఎంచుకున్నారు. ఆసియాలోని చైనా నుంచి నార్త్ అమెరికాలోని హవాయి దీవుల వరకు మూడు ఖండాలలో ఆయన తన వ్యాపారాలను విస్తరించారు. 2013లో ఫోర్బ్స్ బిలీనియర్స్ జాబితాలో తొలిసారి చోటు దక్కించుకున్నారు. 2016 ఫోర్బ్స్ బిలీనియర్స్ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా నీరవ్‌మోదీకి 1,067 ర్యాంకు ఉండగా... భారత్‌లో ఆయన 46వ బిలీనియర్‌గా నిలిచారు. గతేడాది భారత్ నుంచి ఫోర్బ్స్ జాబితాలో 82వ ర్యాంకును పొందారు. 2014లో ఢిల్లీలో తన తొలి ఫ్లాగ్షిప్ స్టోర్‌ను లాంచ్ చేశారు. అనంతరం 2016లో న్యూయార్క్‌లో కూడా ఒక స్టోర్‌ను ఏర్పాటుచేశారు. ఇలా తన వ్యాపారాలను, స్టోర్లను గ్లోబల్‌గా విస్తరించుకుంటూ వెళ్లారు. ఆయన జువెల్లరీ డిజైన్లకు బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫ్యాషన్‌కు ఐకాన్‌గా నీరవ్ మోదీ జువెల్లరీస్‌ను చెప్పుకోవచ్చు. లగ్జరీ డైమాండ్ జువెల్లరీ డిజైనర్‌గా ఆయనకు పేరుంది. కేవలం వజ్రాలను జువెల్లరీగా ప్రమోట్ చేయడమే కాకుండా.. పెట్టుబడులుగా కూడా ప్రమోట్ చేస్తున్నారు. అయితే పీఎన్బీ నమోదుచేసిన చీటింగ్ కేసులో భాగంగా ఐటీ అధికారులు నీరవ్ మోదీ ఆఫీసులు ఢిల్లీ, సూరత్, జైపూర్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికే పలు రైడ్స్ కూడా జరిగాయి. నీరవ్‌మోదీతో పాటు మరో నాలుగు బడా జ్యుయలరీ సంస్థలపైనా దర్యాప్తు సంస్థలు విచారణను సీబీఐ ముమ్మరం చేసింది. ఈ విచారణలో పీఎన్‌బీఐ స్కాంలో నీరవ్ మోదీ, బడా జ్యుయలరీ సంస్థల పాత్ర ఏ మేర ఉందో బయటపడబోతుంది. -
కాసులు కొట్టే కాలేజీలు
సాక్షి, అమరావతి: నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలు నిబంధనలకు పాతరేస్తూ దశాబ్దాల తరబడి విద్యార్ధులను నిలువునా దోపిడీ చేస్తున్నాయి. ఎడ్యుకేషనల్ ట్రస్టుల మాటున ఈ కార్పొరేట్ విద్యాసంస్థలు చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. చదువును వ్యాపార వస్తువుగా మార్చి ఒక్కో విద్యార్థి నుంచి లక్షల్లో వసూలు చేస్తూ ఏటా కోట్లాది రూపాయల టర్నోవర్‌తో విద్యా వ్యాపారాన్ని సాగిస్తున్నాయి. మరోపక్క ఎడ్యుకేషన్ ట్రస్టు మాటున సేవా కార్యక్రమమంటూ ఆదాయ పన్నుతో సహా ఇతర పన్నులు ఎగవేస్తున్నాయి. ఇదేదో బయటి నుంచి వినిపించే విమర్శలు కాదు. ఈ రెండు సంస్థల వ్యవహారాలపై విచారణ జరిపిన తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్విభాగం తేల్చిన నిజాలు. అక్రమాలకు పాల్పడుతున్న నారాయణ, శ్రీచైతన్య కాలేజీల గుర్తింపును రద్దుచేయాలని కొద్దికాలం క్రితం తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించింది. గత ఏడాదికి సంబంధించి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని కాలేజీలను క్షుణ్నంగా తనిఖీలు చేసి ఈ నివేదిక అందించింది. ఈ రెండు సంస్థల కాలేజీలలో తనిఖీలు జరిపిన తెలంగాణ ఇంటర్ బోర్డు కూడా రీజనల్ ఇన్స్పెక్షన్ నిర్వహించి నివేదిక తయారు చేసింది. విజిలెన్స్ తనిఖీ నివేదికలోని ముఖ్యాంశాలు... అడుగడుగునా అక్రమాలే... లాభాపేక్షలేని విద్యా సంస్థలుగా రిజిస్టరైన నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలు ట్యూషన్ ఫీజు, కోచింగ్ ఫీజు, హాస్టల్ ఫీజు... ఇలా లక్షల్లో దండుకుంటూ విద్యార్ధులను నిలువుదోపిడీ చేస్తున్నాయి. చారిటబుల్ ట్రస్టులుగా పేర్కొంటున్నా ఈ రెండు సొసైటీల్లో ప్రెసిడెంట్లు, సభ్యులంతా ఆ రెండు కుటుంబాలకు చెందిన వారే కావడం గమనార్హం. సొసైటీ బైలాల్లో పేద విద్యార్ధులకు ఫ్రీ కోచింగ్ తరగతులు, కమ్యూనిటీ డెవలప్మెంటు ప్రాజెక్టులు, గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం, పేదలను ఆదుకొనేందుకు చేతి వృత్తుల కేంద్రాలు, బాల్వాడీ కేంద్రాలు, వయోజన విద్యాకేంద్రాల ఏర్పాటు అంటూ వల్లెవేసిన సంస్థలు ఇందులో ఏ ఒక్కటీ ఆచరించకపోగా విద్యను డబ్బులమయం చేశాయి. ⇒ ఈ రెండు సంస్థలు ఏటా ఫీజులు, ఇతరాల పేరిట రూ.వందల కోట్ల మేర వసూలు చేస్తున్నా ఇన్‌కమ్‌టాక్స్ రిటర్నులలో మాత్రం ఎలాంటి ఆదాయమూ లేనట్లుగా చూపుతున్నాయి. ఎడ్యుకేషనల్ సొసైటీ, కమిటీల పేరిట పన్నులు ఎగవేస్తున్నాయి. ⇒ శ్రీచైతన్య విద్యాసంస్థ 2010–11, 2011–12కు సంబంధించిన ఐటీ రిటర్నులు, ఆడిట్ రిపోర్టు కాపీలను విజిలెన్సుకు అందించింది. వాటిని పరిశీలించిన విజిలెన్సు అధికారులు నివ్వెరపోయారు. ఆడిట్ రిపోర్టులో 2010–11లో రూ.200 కోట్ల మేర టర్నోవర్ ఉన్నట్లు చూపి ఆదాయపు పన్ను రిటర్నులలో మాత్రం ఎలాంటి ఆదాయమూ లేదని చెబుతూ పన్నులను చెల్లించలేదు. పన్నుల ఎగవేత వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతోంది. ⇒ విద్యా వ్యాపారంలో లాభాలకోసం కాలేజీలకు శాశ్వత అఫ్లియేషన్ కాకుండా తాత్కాలిక అఫ్లియేషన్లు తీసుకుంటున్నాయి. ప్రైవేట్ కాలేజీల్లో ఫీజులపై ఇంటర్ బోర్డు స్పష్టమైన నిబంధనలు విధించినా ఈ కాలేజీలు ఇష్టానుసారం వసూలు చేస్తున్నాయి. ఒక్కో కాలేజీలో ఒక్కో రకమైన ఫీజులుంటున్నాయి. లైబ్రరీ, లాబొరేటరీ లాంటి ఏర్పాట్లు మచ్చుకైనా లేకుండా ఇరుకైన గదుల్లో ప్రధాన రహదారుల పక్కన అపార్టుమెంట్లలో ఈ కాలేజీలను నెలకొల్పారు. ⇒ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేట్ అన్ ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో ట్యూషన్ ఫీజుల కింద పెంచిన ప్రకారం చూసినా రూ.3 వేల లోపే తీసుకోవాలి. కానీ ఈ కాలేజీలు రూ. 25 వేల నుంచి రూ. లక్ష వరకు పిండుతున్నాయి. హాస్టల్, ఇతర కోచింగ్‌లంటూ అదనంగా మరో 2 లక్షలకు పైగా దండుకొంటున్నాయి. ⇒ ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ఈ రెండు కాలేజీలు విక్రయించిన దరఖాస్తుల సమాచారం, అడ్మిషన్లు పొందిన విద్యార్ధుల వివరాల రికార్డులు సక్రమంగా నిర్వహించడం లేదు. అడ్మిషన్లు పూర్తయ్యాక కంప్యూటర్ ద్వారా తీసిన కాపీలపై ఆర్ఐఓలతో సంతకాలు చేయించుకుంటున్నాయి. ⇒ ప్రైవేట్ కాలేజీల్లో కూడా అడ్మిషన్లను రిజర్వేషన్ల ప్రకారం చేపట్టాలి. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 29 శాతం, వికలాంగులకు 5 శాతం, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు 3 శాతం ఇవ్వాల్సి ఉన్నా ఈ సంస్థలు దీన్ని పాటించడం లేదు. ⇒ లాభదాయకంగా ఉండే ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంటర్ బోర్డు అనుమతులు లేకుండానే తప్పుడు కోడ్ నెంబర్లతో కాలేజీలు నిర్వహిస్తున్నాయి. ⇒ ఒక భవనంలో కాలేజీకి అనుమతి పొంది వేరే చోటుకు మార్చేస్తున్నారు. కొన్ని కాలేజీలను తనిఖీ చేయగా అక్కడ రిజిస్టర్లో పేర్లున్న విద్యార్ధుల్లో కొందరు వేరేచోట చదువుతున్నట్లు గుర్తించారు. ⇒ ఎంపీసీ, బైపీసీ తరగతులు తప్పించి ఆర్ట్స్ తరగతులను ఈ కాలేజీలు నిర్వహించడం లేదు. అవి అంత లాభదాయకం కాకపోవటమే కారణం. కొన్ని చోట్ల ఆర్ట్స్ తరగతులకు అనుమతులు తీసుకొని వాటిని ఎంపీసీ, బైపీసీ సెక్షన్లుగా మార్పు చేస్తున్నాయి. ⇒ విద్యార్ధులకు ఎలాంటి వ్యాయామ విద్యను బోధించడం లేదు. అందుకు సంబంధించిన సిబ్బందిని కూడా నియమించడం లేదు. ఇది బోర్డు నిబంధనలకు విరుద్ధం. ⇒ అద్దె భవనాల్లో కాలేజీలను ఏర్పాటు చేస్తూ తాత్కాలిక అనుమతులు పొందుతున్నాయి. ఇది కేవలం అయిదేళ్ల వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆలోపు అవి సొంత భవనాలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉన్నా అద్దె భవనాల్లోనే దశాబ్దాల తరబడి కొనసాగుతున్నాయి. ఫీజులపై కమిటీ వేయాలి... కార్పొరేట్ కాలేజీలు ఫీజులు అడ్డగోలుగా వసూలు చేయకుండా నియంత్రించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ మండల, పట్టణ, తదితరాల వారీగా అధ్యయనం చేసి ఫీజులను నిర్ణయించాలి. ఆయా సంస్థలకు వస్తున్న ఆదాయం, జీతాల చెల్లింపు, ఖర్చులను బేరీజు వేసి ఫీజులను నిర్ణయించాలి. విద్యాశాఖలో వియ్యంకుల వారి సంస్థ మాటే వేదవాక్కు నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థల మూలాలు ఏపీలోనే ఉన్నాయి. ఈ రెండు సంస్థలు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో పలు బ్రాంచీలు నెలకొల్పి ఫీజుల పేరిట రెట్టింపు డబ్బులు వసూలు చేస్తూ విద్యార్ధులను పీల్చిపిప్పిచేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. విద్యార్ధుల తల్లిదండ్రుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నా ప్రభుత్వం కళ్లప్పగించి చూస్తోంది. నారాయణ విద్యాసంస్థల అధిపతి పి.నారాయణకు సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఏకంగా తన కేబినెట్ సహచరుడిగా చేసుకోవడంతో నారాయణ విద్యాసంస్థ ఆగడాలపై అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. ఇక విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణ స్వయానా వియ్యంకులు కూడా కావడంతో విద్యాశాఖలో నారాయణ సంస్థలు చెప్పిందే వేదంగా మారిపోయింది. -
నోట్లరద్దు అతిపెద్ద కుంభకోణం..ఫ్లాప్‌షో!
కేంద్రంపై తీవ్రంగా విరుచుకుపడ్డ మమతాబెనర్జీ సాక్షి, కోల్‌కతా: పెద్దనోట్ల రద్దు వివరాలతో ఆర్బీఐ వార్షిక నివేదిక విడుదల చేసిన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నోట్లరద్దు అతిపెద్ద కుంభకోణమని, ఫ్లాప్‌షో అని అభివర్ణించారు. నోట్లరద్దు ప్రక్రియపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంలో సుప్రీంకోర్టుపై దేశ ప్రజలకు విశ్వాసముందని పేర్కొన్నారు. ' పెద్దనోట్ల రద్దుపై ఆర్బీఐ వెల్లడించిన వివరాలు పెద్ద కుంభకోణం జరిగిందనే సంకేతాలను ఇస్తున్నాయా? ఇది పూర్తిగా ఫ్లాప్‌షో. 99శాతం రద్దైన నోట్లు ఆర్బీఐకి తిరిగొచ్చాయి. కేవలం ఒక్కశాతం మాత్రమే తిరిగి రాలేదు' అని సీఎం మమత ఫేస్‌బుక్‌లోని తన పేజీలో పేర్కొన్నారు. అవినీతి, నల్లధనంపై పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయమైన నోట్ల రద్దు తదనంతర ఫలితాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) బుధవారం సాయంత్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు నాటికి చలామణిలో ఉన్న రూ. 1000, రూ. 500 నోట్లలో రద్దు అనంతరం 99% బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని ఆర్బీఐ పేర్కొంది. రూ. 15.44 లక్షల కోట్ల విలువైన రద్దయిన నోట్లలో రూ. 15.28 లక్షల కోట్లు తిరిగి బ్యాంకుల్లో జమ అయ్యాయని తెలిపింది. అంటే, కేవలం రూ. 16, 050 కోట్లు మాత్రమే తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ కాలేదని వెల్లడించింది. అలాగే, రద్దు నిర్ణయం అనంతరం రూ. 1000 నోట్లలో కేవలం 1.4% మాత్రమే తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోనికి రాలేదని, 98.6% నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని పేర్కొంది. -
ఏపీ కార్మిక శాఖలో కోట్ల స్కాం
-
సచివాలయ నిర్మాణంలో అడుగు అడుక్కి అవినీతి
-
అమరావతి అతిపెద్ద కుంభకోణం
మచిలీపట్నం : అమరావతి నిర్మాణం దేశంలోని అతి పెద్ద కుంభకోణానికి నాంది అని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. బందరు పోర్టు, పారిశ్రామిక కారిడార్ కోసం భూసమీకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వ భూ దోపిడీని నిరసిస్తూ భూపరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో మచిలీపట్నంలో శనివారం జరిగిన అవగాహన సదస్సులో వడ్డే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతానికి భిన్నంగా పరిపాలన కొనసాగిస్తున్నారని, స్విస్ చాలెంజ్‌పై పరిశీలన జరిగితే సరైన విధానం కాదని కోర్టులో తీర్పు వస్తుందని వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు పొరపాటు చేశామని అనుకుంటున్నట్లు తెలిపారు. గతంలో పోర్టుల నిర్మాణానికి 1200 ఎకరాల భూమి చాలని ఆందోళన చేసిన టీడీపీ నాయకులు నేడు 4,800 ఎకరాలు పోర్టుకు, పారిశ్రామిక కారిడార్ కోసం 28,801 ఎకరాలను ఎలా సమీకరిస్తున్నారని వడ్డే దుయ్యబట్టారు.గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ సంస్థ రూ.1.80 లక్షల కోట్ల వ్యయంతో ఆయిల్ రిఫైనరీని 7,500 ఎకరాల్లో నిర్మించిందని చెప్పారు. మూడు బెర్త్‌లు నిర్మించే బందరు పోర్టుకు 4,800 ఎకరాలు, పారిశ్రామిక కారిడార్ కోసం 33,601 ఎకరాలను ఎలా సమీకరిస్తున్నారని ప్రశ్నించారు. రైతులు భూసమీకరణకు వ్యతిరేకంగా ఫారం-2 ఇచ్చి, అధికారుల నుంచి రశీదు పత్రం పొందాలని సూచించారు. 8వేల ఎకరాలను కాపాడుకున్నాం : ఎమ్మెల్యే ఆర్కే ఇదే సదస్సులో మాట్లాడిన మంగళిగిరి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే).. రాజధాని అమరావతిలో భూసమీకరణకు వ్యతిరేకంగా న్యాయపోరాటం చేసి 8వేల ఎకరాలను కాపాడుకున్నామని చెప్పారు. ప్రభుత్వం రాజధాని కోసం 33వేల ఎకరాలను సేకరించినట్లు చెబుతున్నా అందులో వాస్తవం లేదని, భూములు ఇచ్చిన రైతులకు వైద్యం, పిల్లలకు ఉచిత విద్య అనంతరం ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పినా ఎక్కడా అవి అమలు జరగడం లేదని తెలిపారు. కౌలు రైతులు, వ్యవసాయ కూలీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న ఆయన.. ఈ నెల 4వ తేదీలోగా అభ్యంతర పత్రాలను ప్రతి ఒక్క రైతు అందజేయాలని సూచించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా లేనప్పుడు మచిలీపట్నంలో పరిశ్రమలు ఎలా స్థాపిస్తారని ప్రశ్నించారు. ఫారం-2 ఇవ్వండి :సుధాకరరెడ్డి హైకోర్టు న్యాయవాది సుధాకరరెడ్డి మాట్లాడుతూ రైతుల అంగీకారం తెలపకుండా ప్రభుత్వం సెంటుభూమిని కూడా భూసమీకరణ ద్వారా తీసుకోలేదని స్పష్టంచేశారు. ప్రభుత్వం రైతుల నుంచి భూములు తీసుకోవాలని చూస్తుంటే, హైకోర్టు రైతుల హక్కులను కాపాడేందుకు వెన్నుదన్నుగా ఉందన్నారు. రాజధాని భూసమీకరణలో ఈ అంశం రుజువైందన్నారు. భూసమీకరణను వ్యతిరేకిస్తూ రైతులంతా ఫారం-2ను ఎంఏడీఏ అధికారులకు అందజేస్తే 15 రోజుల తరువాత భూసమీకరణ నుంచి బయటపడొచ్చన్నారు. ప్రలోభాలకు లొంగొద్దు: పేర్నినాని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ భూసేకరణ నోటిఫికేషన్ అమలులో ఉండగానే మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (ఎంఏడీఏ) పేరుతో ప్రభుత్వం భూసమీకరణకు దిగిందన్నారు. భూసమీకరణకు అభ్యంతరాలు, అంగీకరపత్రాలు ఇచ్చేందుకు అక్టోబర్ 4ను ఆఖరు తేదీగా ప్రకటించి మళ్లీ ఈ గడువును నవంబరు 4వ తేదీకి అధికారులు పెంచారని తెలిపారు. అయినప్పటికీ అక్టోబర్4వ తేదీకే రైతులంతా అభ్యంతర పత్రాలు ఇవ్వాలన్నారు. భూపరిరక్షణ పోరాట సమితి కన్వీనరు కొడాలి శర్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు ధనేకుల మురళీమోహన్, సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.రఘు, సీపీఐ కార్యదర్శి అక్కినేని వనజ, ప్రజాసంఘాలు, రైతు సంఘాల నాయకులు ప్రసంగిస్తూ రైతులతో కలిసి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని చెప్పారు. -
అంతా కలిసి రూ.కోటి నొక్కేశారు!
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఏడాదిగా జరుగుతున్న జీతాల కుంభకోణాన్ని అధికారులు గుర్తించారు. జిల్లా ట్రెజరీ అధికారి నందిపాటి నాగేశ్వరరావు ఈ నెల 7న పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జిల్లా ట్రెజరీలో కొందరు సిబ్బంది, పదో జిల్లా కోర్టు గుమస్తా శర్మ కలసి పలువురు ఉద్యోగుల పేర్లతో అదనంగా రూ.కోటి వరకు డ్రా చేసి, స్వాహా చేసినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. గుమస్తా శర్మను అరెస్టు చేసి సోమవారం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అంతా కలసి దోచేశారు: కృష్ణా జిల్లా పదో నంబరు కోర్టు, అవనిగడ్డ కోర్టుల్లో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల పేర్లతో సొమ్మును ట్రెజరీ అధికారులు, గుమస్తా శర్మ కలిసి స్వాహా చేశారు. జీతాల బిల్లులను జిల్లా ట్రెజరీ ఆఫీసుకు సమర్పించే సమయంలో ఒక్కో ఉద్యోగి పేరుతో రెండుసార్లు ఒకే నెల జీతాల బిల్లులను గుమస్తా శర్మ ట్రెజరీ కార్యాలయానికి ఇచ్చేవాడు. ఆయనతో కుమ్మక్కైన కొందరు ట్రెజరీ ఉద్యోగులు ఒకే వ్యక్తి పేరుతో ఒకే నెలలో రెండో జీతం కూడా డ్రా చేసేవారు. ఒక జీతం మాత్రమే ఉద్యోగికి వెళ్లేది. రెండోసారి డ్రా చేసిన జీతాన్ని ట్రెజరీ అధికారుల సహకారంతో శర్మ, ఇతర ట్రెజరీ ఉద్యోగులు కలసి స్వాహా చేశారు. ఇలా దోచేసిన సొమ్ము రూ.కోటికిపైగానే ఉంటుందని అంచనా. బయటపడిందిలా..: జిల్లా ట్రెజరీ కార్యాలయంలో కోర్టు గుమస్తా శర్మ కోర్టు ఉద్యోగుల బిల్లులు ఆన్లైన్లో నమోదు చేసేవాడు. దీనిని పలువురు ట్రె జరీ ఉద్యోగులు వ్యతిరేకించేవారు. దీనికితోడు జిల్లా ట్రెజరీ అధికారి ఒక్కోసారి ఉద్యోగుల వద్దకు వచ్చి శర్మను చూసి నేర్చుకోవాలని, మన డిపార్ట్మెంట్ కాకపోయినా జీతాల బిల్లులను ఆన్లైన్లో ఎలా నమోదు చేశారో చూడండంటూ కొందరిని చులకన చేసి మాట్లాడేవారు. తతంగాన్ని ఉద్యోగులే బయటపెట్టారు.