bio ethanol factory
-
పెట్టుబడులకు విస్తృత అవకాశాలు
సాక్షి, అమరావతి: పర్యావరణహిత క్లీన్ ఎనర్జీకి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. గ్రీన్ హైడ్రోజన్, బయో ఇథనాల్ తయారీ ప్లాంట్లను ప్రోత్సహిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద పెట్రోకెమికల్ కారిడార్ ఏపీలో విస్తరించి ఉందని.. దీన్ని వినియోగించుకుంటూ పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవకాశాలున్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఢిల్లీలో జరుగుతున్న మూడో ‘గ్లోబల్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్స్ ఇన్ ఇండియా’ సదస్సులో గురువారం ప్రవీణ్ పాల్గొన్నారు. దేశంలోనే అతిపెద్ద పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్‌ను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కంపెనీలతో చర్చలు జరుపుతోందని చెప్పారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఇతర ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా దీన్ని అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో పారిశ్రామిక పార్కులు, పోర్టులు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. పారిశ్రామిక పార్కుల ద్వారా తక్షణమే పెట్టుబడులు పెట్టడానికి 13,772 ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు. ఇప్పటికే పెట్రో కెమికల్స్ రంగంలో హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, కెయిర్న్, రిలయన్స్, ఆదిత్య బిర్లా, టాటా కెమికల్స్ తదితర దిగ్గజ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. బయో ఇథనాల్‌కు ఏపీ హబ్‌గా మారిందని ప్రవీణ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటికే 20కి పైగా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయన్నారు. అనంతరం ప్రవీణ్‌కుమార్.. సౌదీ అరేబియా బేసిక్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్, రీజనల్ హెడ్ జనార్దన్ రామాంజనేయులు, సుర్బానా జురాంగ్ డైరెక్టర్ డెన్నీస్ టాన్, దీపక్ నైట్రేట్ సీఎండీ దీపక్ సీ మెహతా, నయారా ఎనర్జీ ప్రెసిడెంట్ దీపక్ అరోరా, బేయర్ కార్పొరేషన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. వీటిలో కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, అనకాపల్లి కలెక్టర్ రవిసుభాష్ తదితరులు పాల్గొన్నారు. -
వెదురు నుంచి జీవ ఇంధనాలు!
ఆధునిక యుగంలో ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వినియోగం నానాటికీ పెరిగిపోతోంది. సరైన ప్రత్యామ్నాయ ఇంధనాలు విరివిగా అందుబాటులో లేకపోవడంతో పెట్రోల్, డీజిల్, బొగ్గు వంటి వాటిపై అనివార్యంగా ఆధారపడాల్సి వస్తోంది. వీటివల్ల వాతావరణ మార్పులు సంభవిస్తున్నాయని, పర్యావరణానికి, భూగోళంపై మానవళి మనుగడకు ముప్పు ఏర్పడుతోందని తెలిసినప్పటికీ మరో దారిలేక ప్రమాదకరమైన ఇంధనాలపైనే అధికంగా ఆధారపడాల్సి వస్తోంది. మరోవైపు పునరుత్పాదక ఇంధనాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి ఆశించిన స్థాయిలో ఊపందుకోవడం లేదు. జల విద్యుత్ ఉత్పత్తికి కొన్ని పరిమితులున్నాయి. ఇలాంటి తరుణంలో హంగేరీలోని ‘హంగేరియన్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్’ పరిశోధకులు తీపి కబురు అందించారు. అడవుల్లో సహజసిద్ధంగా, విస్తృతంగా పెరిగే వెదురు(బ్యాంబూ)తో బయో ఇథనాల్, బయో గ్యాస్ వంటి జీవ ఇంధన ఉత్పత్తులు తయారు చేయవచ్చని తమ అధ్యయనంలో తేల్చారు. సమీప భవిష్యత్తులో పునరుత్పాదక ఇంధన రంగంలో వెదురు ఒక విప్లవమే సృష్టించబోతోందని చెబుతున్నారు. శిలాజ ఇంధనాలకు కాలుష్యానికి తావులేని ఇలాంటి ఇంధనాలే సరైన ప్రత్యామ్నాయం అవుతాయని అంటున్నారు. ఈ అధ్యయనం వివరాలను ‘జీసీబీ బయో ఎనర్జీ’ జర్నల్‌లో ప్రచురించారు. ► ఇతర చెట్లతో పోలిస్తే వెదురు చాలా వేగంగా పెరుగుతుంది. ఇదొక విలువైన సహజ వనరు. కాలుష్యాన్ని కట్టడి చేసే విషయంలో వెదురును ‘సూపర్ స్పాంజ్’గా పరిగణిస్తుంటారు. కార్బన్ డయాక్సైడ్ను పీల్చుకుంటుంది. వాతావరణంలోకి ప్రాణవాయువు(ఆక్సిజన్) ను అధికంగా విడుదల చేస్తుంది. ► ప్రమాదకరమైన గ్రీన్హౌస్ వాయువుల ఉద్గారాన్ని అరికట్టడంలో వెదురు పాత్ర చాలా కీలకం. భూమిపై వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది. ► ప్రకృతిలో వెదురు ప్రాధాన్యతను గుర్తించిన పరిశోధకులు దాని నుంచి పునరుత్పాదక ఇంధనాల తయారీపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ► కిణ్వ ప్రక్రియ(ఫెర్మెంటేషన్), అధిక ఉష్ణోగ్రతల వద్ద కుళ్లిపోయేలా చేయడం(పైరోలిసిస్)తోపాటు హైడ్రోథర్మల్ లిక్విఫాక్షన్, అనెయిరోబిక్ డైజేషన్ వంటి ప్రక్రియల ద్వారా ముడి వెదురు నుంచి బయో ఇథనాల్, బయోగ్యాస్ ఉత్పత్తి చేయవచ్చని కనిపెట్టారు. ► పరిశుద్ధమైన, స్థిరమైన ఇంధన వనరులను అందించగల సామర్థ్యం వెదురుకు ఉందని గుర్తించారు. ► కొన్ని జాతుల వెదురు నుంచి అధికంగా బయో ఇంధనం ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు. వేర్వేరు జాతులు వేర్వేరుగా రసాయన చర్య జరపడమే ఇందుకు కారణమని పేర్కొంటున్నారు. ► వెదురులో సెల్యూలోజ్లు, హెమిసెల్యూలోజ్ లో అధిక మోతాదులో ఉంటాయి. వీటి నుంచి బయో ఇథనాల్, బయోగ్యాస్తోపాటు బయోచర్ అనే ఎరువు కూడా ఉత్పత్తి అవుతుంది. ► వెదురు నుంచి ప్రత్యామ్నాయ ఇంధనాలను తయారు చేసుకుంటే శిలాజ ఇంధనాలపై ఆధారపడాల్సిన అవసరం గణనీయంగా తగ్గిపోతుందని, తద్వారా కాలుష్యాన్ని, వాతావరణ మార్పులను నియంత్రించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. వెదురు నుంచి జీవ ఇంధనాల ఉత్పత్తి ప్లాంట్లకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదని చెబుతున్నారు. ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ అని పేర్కొంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎలాంటి సహకారం కావాలన్నా అండగా ఉంటాం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీలో మరో రూ.1425 కోట్ల పెట్టుబడులు సాకారం అవుతున్నాయి. పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.క్రిబ్కో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, విశ్వసముద్ర బయో ఎనర్జీ, సీసీఎల్ పుడ్ అండ్ బెవరేజెస్ పరిశ్రమలకు సీఎం శంకుస్థాపన చేశారు. అనంతరం గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్ధను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, దాదాపుగా రూ.1425 కోట్ల పెట్టుబడితో 3 జిల్లాల్లో మంచి కార్యక్రమం జరుగుతుందని, దీని వల్ల దాదాపుగా 2500 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ జిల్లాల్లో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. మూడు ప్లాంట్లకు శంకుస్ధాపన చేయడంతో పాటు ఒక ప్లాంట్‌ను ప్రారంభిస్తున్నాను. శంకుస్ధాపన చేసిన ప్లాంట్లన్నీ కూడా త్వరలో నిర్మాణం అవుతాయని ఆయన అన్నారు. ‘‘నెల్లూరులో క్రిబ్కో ఆధ్వర్యంలో దాదాపుగా రూ.610 కోట్ల పెట్టుబడితో ఇథనాల్ తయారీ ప్లాంట్ వస్తుంది. 12 నెలల్లోపే ఈ కర్మాగార నిర్మాణం పూర్తవుతుంది. 500 కిలోలీటర్ల ప్రొడక్షన్ కెపాసిటీతో బయో ఇథనాల్ ప్లాంట్ రెండు దశల్లో ప్లాంట్ పూర్తయితే 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎలాంటి సహకారం కావాలన్నా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది’’ అని సీఎం అన్నారు. ‘‘ఒక్క ఫోన్ కాల్ దూరంలో మీకు అందుబాటులో ఉంటామన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొండి. ఇదే నెల్లూరు జిల్లాలో విశ్వసముద్ర బయో ఎనర్జీ ప్లాంట్ వస్తోంది. రోజుకు 200 కిలోలీటర్ల కెపాసిటీతో నెలకొల్పతున్న బయో ఇథనాల్ ప్లాంట్ ఇది. దీనివల్ల 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు వస్తాయి. రూ.315 కోట్లతో వచ్చే ఈ ప్రాజెక్టు కూడా మరో 18 నెలల్లో అందుబాటులోకి వస్తుంది. చదువుకున్న మన పిల్లలకు ఈ ప్లాంట్ వల్ల ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇది చాలా సంతోషకరమైన విషయం. ప్లాంట్ డైరెక్టర్ జితేంద్రతో పాటు యాజమాన్యానికి మనస్ఫూర్తిగా అభినందనలు’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘అదే విధంగా తిరుపతి జిల్లాలో కాంటినెంటిల్ కాఫీ కూడా ఫ్యాక్టరీ పెడుతోంది. రూ.400 కోట్ల పెట్టుబడితో..ఏటా 16వేల టన్నుల కెపాసిటీతో ఈ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఏలూరు జిల్లాలో గోద్రెజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్ సంస్ధ ఏర్పాటు చేస్తుంది.రూ.100 కోట్ల పెట్టుబడితో 400 టన్నుల సామర్థంతో ఎడిబుల్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు విస్తరణకు వెళ్తున్నారు. ప్లాంట్ ఏర్పాటుకు మన దగ్గరకు వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చిన కేవలం 9 నెలల్లోనే యూనిట్‌ను ప్రారంభోత్సవం చేసుకోవడం అభినందనీయం’’ అని సీఎం పేర్కొన్నారు. చదవండి: అంచనాలు నిజం కాబోతున్నాయి.. వైఎస్సార్సీపీ గెలుపు నల్లేరుపై నడకే.. ‘‘ఇందుకు కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అధికారికి అభినందనలు. ఈ యూనిట్ వల్ల కూడా మరో 500 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు. దాదాపుగా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు.. రూ.1425 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ల ఏర్పాటు ద్వారా.. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో మనం చేసుకున్న ఎంఓయూలు కార్యరూపం దాల్చుతున్న మంచి ఘడియలు ఇవి’’ అని సీఎం జగన్ అన్నారు. సీఎం జగన్ చొరవతో పరిశ్రమలు: మంత్రి కాకాణి బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్స్ శంకుస్థాపన అనంతరం మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. మనం ఎన్నో ఏళ్లుగా ఈ పరిశ్రమల కోసం ఎదురుచూస్తూ ఉన్నాము. ఈరోజు సీఎం వైఎస్ జగన్ గారి చొరవతో ఇక్కడ ఈ పరిశ్రమలకు శంకుస్థాపన చేసుకోగలిగాము. ఈ పరిశ్రమకు కావాల్సిన భూమిని సమకూర్చిన వారికి పరిహారం కూడా ఇచ్చాము. ఆ కుటుంబాలు ఆర్ధికంగా ఎదగడానికి పరిశ్రమ యాజమాన్యాలు సహకరించాలని ఈ సందర్బంగా వారిని కోరుతున్నాను. రూ. 925 కోట్లతో నిర్మించనున్న ఈ రెండు బయో ఇథనాల్ ఎనర్జీ ప్లాంట్స్ పూర్తయితే స్థానికంగా ఉండే సుమారు 75 శాతం మంది యువతకు ఉపాధి కలుగుతుంది. క్రిబ్కో విశ్వ సముద్ర ప్రవేట్ లిమిటెడ్ అధ్వర్యంలో ఈ రెండు ప్లాంట్స్ ను కాలుష్యం లేకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుని నిర్మాణం చేయనున్నట్లు తెలిపారు. -
ఈ పరిశ్రమలే రుజువు.. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?
ఆరు నెలల క్రితం మే నెలలో దావోస్ వెళ్లినప్పుడు నన్ను గుర్నానీ కలిశారు. ఆయన నాతో మాట్లాడుతూ.. ‘టెక్నాలజీ వైపు వేస్తున్న అడుగులకు ఎలాగూ ఊతమందిస్తున్నాం. మరోవైపు నా కుమారుడు ఇథనాల్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారు. ఈ ప్లాంట్ ఎక్కడ పెట్టాలా.. అని ఆలోచిస్తూ దేశంలోని పలు రాష్ట్రాల వైపు చూసి ఆలోచిస్తున్నారు. మన (ఏపీ) రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది’ అని నన్ను అడిగారు. రాష్ట్రంలో ఏ రకంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ అడుగులు ముందుకు వేస్తున్నామో చెప్పాం. మన రాష్ట్రానికి రావాలని ఆహ్వానం పలికాం. అప్పటి నుంచి ఇప్పటికి కేవలం ఆరే ఆరు నెలలు. అంతలోనే పరిశ్రమకు భూములివ్వడం దగ్గర నుంచి.. కావాల్సిన అనుమతులన్నీ మంజూరు చేసి, ఈ రోజు భూమిపూజ చేసుకుంటున్నాం. ఇదీ మన రాష్ట్రంలో జ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు నిదర్శనం. రాష్ట్రంలో ఉన్న సానుకూల వాతావరణంతో దిగ్గజ పారిశ్రామికవేత్తలు పరిశ్రమల ఏర్పాటుకు ఇటు వైపు అడుగులు వేస్తున్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ఉన్న ఎంఎన్‌సీలు కూడా పలు రాష్ట్రాలను పరిశీలించినప్పుడు వాటికి తొలుత మన రాష్ట్రమే కనిపిస్తోంది. అందువల్లే ఏపీపై ఆసక్తి కనబరుస్తున్నాయి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుమ్మళ్లదొడ్డి నుంచి సాక్షి ప్రతినిధి: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పూర్తిగా అనుకూల వాతావరణం ఉందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు మన ప్రభుత్వం సింగిల్ విండోలోనే అనుమతులు ఇస్తున్నందున ఎంతో మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంపై అత్యంత ఆసక్తి కనబరుస్తున్నారని చెప్పారు. ఇందులో భాగంగానే పారిశ్రామిక దిగ్గజం అస్సాగో భారీ పెట్టుబడితో ఇక్కడ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ముందుకు వచ్చిందన్నారు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డిలో రూ.270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రియల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఇథనాల్) పరిశ్రమకు శుక్రవారం ఆయన కంపెనీ సీఎండీ, సీఈఓ ఆశీష్ గుర్నానీ.. తండ్రి, టెక్ మహీంద్ర ఎండీ, సీఈఓ సీపీ గుర్నానీలతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆశీష్గుర్నాని, సీపీ గుర్నానీలను దావోస్‌లో కలిసి మాట్లాడి.. ఆరు నెలలు తిరక్కుండానే గుమ్మళ్లదొడ్డిలో ఇథనాల్ పరిశ్రమకు భూమి పూజ చేసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం ఏముంటుందని అన్నారు. మన పిల్లలకే ఉద్యోగాలు ► ఈ ప్లాంట్‌ను ఇక్కడికి తీసుకొచ్చేందుకు అడుగులు ముందుకు వేసిన అస్సాగో ఇండస్ట్రీస్ ఎండీ, సీఈఓ ఆశీష్ గుర్నాని, ఆయనకు అన్ని విధాలా మార్గదర్శకత్వం వహిస్తున్న తండ్రి, టెక్ మహీంద్రా ఎండీ, సీఈఓ సీపీ గుర్నాని, ఇక్కడికి విచ్చేసిన ప్రతి అక్క, చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు.. అందరికీ హృదయ పూర్వక అభినందనలు. ► టెక్ మహీంద్రా.. పెద్ద సాప్ట్వేర్ కంపెనీ అనే విషయం మనందరికీ తెలుసు. ఈ పారిశ్రామిక దిగ్గజ కంపెనీ సీఈఓ సీపీ గుర్నానీ కుమారుడు అశీష్ గుర్నానీ ఆధ్వర్యంలో ఇక్కడ 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ► ఈ ప్లాంట్‌తో 300 నుంచి 400 మందికి ఉద్యోగాలు రానున్నాయి. వాటిలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని మనం చట్టం తీసుకురావడంతో చదువుకున్న మన పిల్లలకు మంచి జరుగుతుంది. తూర్పు గోదావరి జిల్లా రైతులకు, వ్యవసాయాధారమైన ఈ ప్రాంతానికి చాలా మేలు చేస్తుంది. ► తుపాన్లు, వరదలు వచ్చినప్పుడు ధాన్యం రంగు మారిపోవడమే కాకుండా ముక్కిపోవడం, బియ్యం విరిగిపోయే పరిస్థితులు ప్రతి సంవత్సరం రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. ఇటువంటి సమస్యలకు ఈ ప్లాంట్ పరిష్కారం చూపిస్తుంది. ► బ్రోకెన్ రైస్‌తో పాటు నూకలు, మొక్కజొన్న.. ఈ రెండింటి ఆధారంగా ఈ ఇథనాల్ ప్లాంట్ పని చేస్తుంది. దానివల్ల మన రైతులకు మేలు జరుగుతుంది. రంగు మారిన, విరిగి పోయిన ధాన్యానికి కూడా మంచి రేటు ఇప్పంచగలిగే గొప్ప అవకాశం ఉంటుంది. ఈ ప్లాంట్‌ను జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పద్ధతిలో నిర్మిస్తుండటంతో కాలుష్యానికి అవకాశాలు చాలా తక్కువ. ఈ ప్లాంటుతో పాటు బై ప్రొడక్ట్ కింద హైక్వాలిటీ ప్రోటీ¯న్ పశువుల దాణా, చేపల మేత, కోళ్ల దాణా వంటి ఫీడ్ అందుబాటులోకి వస్తుంది. మరిన్ని పరిశ్రమలకు రాచబాట ► త్వరితగతిన ఇక్కడ ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా పారిశ్రామిక వేత్తల వద్ద, రకరకాల ఫోరమ్‌ల వద్ద మన రాష్ట్రంలో జరుగుతున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ప్రస్తావించే అవకాశం, పరిస్థితులు వస్తాయి. దానివల్ల ఇంకా ఎక్కువ పరిశ్రమలు గుర్నానీ ద్వారా మన రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంటుంది. ► ప్రతి అంశంలో మేం మీకు తోడుగా ఉంటామని గుర్నానీకి మాట ఇస్తున్నాను. మీకు ఏ రకమైన ఇబ్బంది వచ్చినా కేవలం ఒక్క ఫోన్ కాల్ దూరంలోనే ఉంటామనే విషయాన్ని మనసులో పెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్‌కు మరిన్ని పరిశ్రమలు తీసుకురావడం ద్వారా మా పిల్లలకు మరిన్ని ఉద్యోగాలు వచ్చేలా చేయడానికి మీరు అంబాసిడర్లా ఉండండి. ► ఏలేరు కుడి కాలువ నిర్మాణం గురించి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఇందాకే అడిగారు. దానికి దాదాపు రూ.50 కోట్లు అవుతుంది. ఈ పనులకు ఈ వేదికపై నుంచే అనుమతి మంజూరు చేస్తున్నా. ఈ పనుల ద్వారా 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందుతాయి. రైతులు, ప్రజలకు మంచి జరుగుతుంది. ► అస్సాగో ఇండస్డ్రియల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ అశిష్ గుర్నాని ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తానేటి వనిత, దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, చింతా అనురాధ, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని ఆపలేరు రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కళ్లెదుటే కనిపిస్తోంది. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి అడ్డుకట్ట పడే పరిస్థితి లేదు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడం లేదు.. అభివృద్ది జరగడం లేదు.. పరిశ్రమలు తరలిపోతున్నాయని ఒక మాజీ మంత్రి సీఎంకు లేఖ రాశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్‌కు అనుమతి వస్తే, ఇది మా ప్రాంతానికి వద్దు.. మాకు అవసరం లేదని లేఖలు రాశారు. ఇదీ వాళ్ల దుర్బుద్ధి. జరుగుతున్న అభివృద్ధి, తరలి వస్తున్న పారిశ్రామికవేత్తలను చూసి ఓర్వలేక రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా వారు అడుగులు వేస్తున్నారు. లక్షన్నర కోట్ల రూపాయల పెట్టుబడుల కార్యచరణతో రెండు లక్షల మందికి ఉపాధి కల్పించేలా ముఖ్యమంత్రి అడుగులు ముందుకు వేస్తున్నారు. – గుడివాడ అమర్నాథ్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి 30 సెకన్లలో సీఎం అంటే ఏమిటో తెలిసింది.. సీఎం జగన్మోహన్రెడ్డి.. మహానేత రాజశేఖరరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ పీపుల్ ఓరియంటెడ్, సోషల్ ఇంజనీరింగ్ ఓరియంటెడ్ విధానంలో అన్ని అవకాశాలను అందిపుచ్చుకుని రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచారు. పరిశ్రమకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడంతో నా కుమారుడు అశిష్ ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనడంలో సందేహమే లేదు. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి జగన్‌తో కేవలం 30 సెకన్లు మాత్రమే మాట్లాడాము. రాష్ట్రంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ రకంగా అమలు చేస్తారని, యువత ఉపాధికి ఏ రకంగా వినియోగిస్తారని అడిగాను. ఆ సమయంలోనే రాష్ట్ర అభివృద్ధి పట్ల సీఎం అంకితభావం తెలిసింది. ఈ ప్రాంతంలో యువత, పారిశ్రామిక అభివృద్ధిపై ఉన్న లక్ష్యం.. సంకల్పం తెలియజేశారు. దావోస్‌లో చెప్పిన మాట ప్రకారం కేవలం ఆరు నెలలల్లోనే అన్ని అనుమతులు ఇచ్చారు. ఇదీ సీఎం నిబద్ధత, నిజాయితీకి నిదర్శనం. తొలిసారి ఒక పరిశ్రమ స్థాపనకు ఆసక్తి చూపించిన నా కుమారుడు కూడా జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నా. ఇందుకు సరైన వేదిక ఆంధ్రప్రదేశ్ అని భావించి ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాం. – సీపీ గుర్నానీ, టెక్‌మహీంద్రా ఎండీ, సీఈఓ చదవండి: రాళ్లు విసిరించుకోవడం చంద్రబాబుకు సాధారణమే: మంత్రి జోగి రమేష్ -
బయో ఇథనాల్ ప్లాంట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన (ఫొటోలు)
-
రంగుమారిన ధాన్యానికి కూడా మంచి ధర లభిస్తుంది: సీఎం జగన్
-
గుమ్మళ్లదొడ్డిలో బయో ఇథనాల్ ప్లాంట్‌కు సీఎం జగన్ శంకుస్థాపన
-
పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుంది: సీఎం జగన్
సాక్షి, తూర్పుగోదావరి: గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టెక్ మహీంద్ర సీఈఓ సీపీ గుర్నానీ, ఆశీష్.. మంత్రులు గుడివాడ అమర్ నాధ్,తానేటి వనిత, దాడిశెట్టి రాజా, వేణుగోపాలకృష్ణ, ఎంపీలు భరత్ రామ్ , అనురాధ,వంగా గీతా, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. 'దేవుడి దయతో ఈ రోజు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ ప్రాంతానికి మంచి చేసే ప్లాంట్ రాబోతోంది. రూ.270 కోట్లతో టెక్ మహీంద్రా గ్రూప్ ఇథనాల్‌ను ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. పరిశ్రముల నెలకొల్పేందుకు ఏపీ మంచి వాతావరణం ఉంది. కేవలం ఆరు నెలల కాలంలోనే అనుమతులు మంజూరు చేసి.. ఈ రోజు భూమి పూజ కూడా చేశాం. 2లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్లాంట్ రాబోతుంది. ప్లాంట్ ఏర్పాటుతో స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. బ్రోకెన్ రైస్‌తో ప్లాంట్‌లో ఇథనాల్ తయారీ చేస్తారు. ప్లాంట్‌తో పాటు బైప్రోడక్ట్ కింద పశువుల దాణా, చేపల మేతకు ఉపయోగపడే ప్రోటీన్ ఫీడ్ కూడా అందుబాటులోకి వస్తుంది. రంగు మారిన ధాన్యానికి కూడా మంచి ధర లభిస్తుంది' అని సీఎం జగన్ అన్నారు. కాగా, రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్‌లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ యూనిట్ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది. ముడిచమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడంతోపాటు హరిత ఇంధన వినియోగం పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా 2025–26 నాటికి ప్రతి లీటరు పెట్రోల్‌లో 20 శాతం బయో ఇథనాల్ మిశ్రమం కలపడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం లీటరు పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం సగటున 8.41 శాతంగా ఉంది. కోటిలీటర్ల ఇథనాల్‌ను వినియోగించడం ద్వారా 20 వేల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతున్నట్లు అనేక పరిశీలనల్లో వెల్లడైంది. ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించడంతో అనేక సంస్థలు ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. భూ కేటాయింపుల దగ్గర నుంచి అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిందని, ఈ పెట్టుబడుల ద్వారా హరిత పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని అస్సాగో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశీష్ గుర్నానీ తెలిపారు. భవిష్యత్‌లో ప్రత్యామ్నాయ ఇంధన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యూనిట్ ద్వారా 500 మందికి ఉపాధి లభించడమే కాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు ప్రయోజనం లభిస్తుందని చెప్పారు. పాడైపోయిన ఆహారధాన్యాలు, నూకలు, వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు వినియోగించి ఇథనాల్‌ను తయారు చేయడం ద్వారా రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
తూర్పుగోదావరికి సీఎం జగన్.. పర్యటన షెడ్యూల్ ఇదే..
సాక్షి, అమరావతి: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో బయో ఇథనాల్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అస్సాగో ఇండస్ట్రీస్ ఏర్పాటుచేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. రాజమహేంద్రవరానికి సమీపంలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్క్‌లో 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ యూనిట్ ద్వారా రోజుకు 200 కిలోలీటర్ల బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా 100 మందికి, పరోక్షంగా 400 మందికి ఉపాధి లభించనుంది. ముడిచమురు దిగుమతుల బిల్లును తగ్గించుకోవడంతోపాటు హరిత ఇంధన వినియోగం పెంచడం ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించాలన్న లక్ష్యంగా 2025–26 నాటికి ప్రతి లీటరు పెట్రోల్‌లో 20 శాతం బయో ఇథనాల్ మిశ్రమం కలపడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం లీటరు పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం సగటున 8.41 శాతంగా ఉంది. కోటిలీటర్ల ఇథనాల్‌ను వినియోగించడం ద్వారా 20 వేల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతున్నట్లు అనేక పరిశీలనల్లో వెల్లడైంది. ఒక్కసారిగా కేంద్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించడంతో అనేక సంస్థలు ఈ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తున్నాయి. భూ కేటాయింపుల దగ్గర నుంచి అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరు చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధ చూపిందని, ఈ పెట్టుబడుల ద్వారా హరిత పునరుత్పాదక ఇంధన రంగంలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని అస్సాగో ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆశీష్ గుర్నానీ తెలిపారు. భవిష్యత్‌లో ప్రత్యామ్నాయ ఇంధన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ యూనిట్ ద్వారా 500 మందికి ఉపాధి లభించడమే కాకుండా వ్యవసాయ ఆధారిత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రైతులకు అదనపు ప్రయోజనం లభిస్తుందని చెప్పారు. పాడైపోయిన ఆహారధాన్యాలు, నూకలు, వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు వినియోగించి ఇథనాల్‌ను తయారు చేయడం ద్వారా రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందన్నారు. సీఎం జగన్ పర్యటన ఇలా.. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డిలో అస్సాగో ఇండస్ట్రీస్ ఏర్పాటుచేస్తున్న బయో ఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు. 10.30 గంటలకు గుమ్మళ్ళదొడ్డి చేరుకుంటారు. 10.45 గంటల నుంచి 11.40 గంటల వరకు శంకుస్ధాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తిరుగుప్రయాణం అవుతారు. బయో ఇథనాల్‌లో రూ.2,017 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో బయో ఇథనాల్ యూనిట్లు ఏర్పాటు చేయడానికి అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి.అస్సాగోతో పాటు క్రిభ్కో, ఇండియన్ ఆ యిల్ కార్పొరేషన్, ఎకో స్టీల్, సెంటిని, డాల్వకో ట్, ఈఐడీ ప్యారీ వంటి సంస్థలు కలిపి సుమారు రూ.2,017 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. హరిత ఇంధనానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా బయో ఇథనాల్ పాలసీని రూపొందిస్తోంది. ఇప్పటికే ముసాయిదా పాలసీ తయారుచేసిన రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్య కంపెనీల సూచనలు, సలహాలు తీసుకుని త్వరలోనే పాలసీని విడుదల చేయనుంది. దీనిద్వారా బయో ఇథనాల్ తయారీలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలుస్తుందన్న ఆశాభావం ఉంది. -
నెల్లూరులో క్రిబ్కో బయో ఇథనాల్ ప్లాంట్.. ఎస్ఐపీబీ ఆమోదం
అమరావతి: రాష్ట్రంలో బయో ఇథనాల్ ప్లాంట్‌తో పాటు ఎగుమతులు, లాజిస్టిక్ రంగాలను ప్రోత్సహించే విధంగా తీసుకు వస్తున్న కొత్త పాలసీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపింది. గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఎస్ఐపీబీ సమావేశం.. నెల్లూరు జిల్లా సర్వేపల్లి వద్ద కృషక్ భారతి కో–ఆపరేటివ్ లిమిటెడ్ (క్రిబ్కో) రూ.560 కోట్లతో 250 కేఎల్డీ సామర్థ్యంతో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. చదవండి: మనువుల ‘రేవు’: వరుడికి తాళికట్టిన వధువు.. 100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. బయో ఇథనాల్ యూనిట్‌తో పాటు రాష్ట్రంలో మరిన్ని విత్తన శుద్ధి, వివిధప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడానికి క్రిబ్కో ఆసక్తి వ్యక్తం చేసింది. వచ్చే ఐదేళ్ల కాలంలో రాష్ట్ర ఎగుమతులను రెట్టింపు చేసే విధంగా ఏపీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ పాలసీ 2022–27లో భాగంగా మరిన్ని ప్రోత్సాహకాలను అందించడానికి ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం రూ.1.24 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర ఎగుమతులను ఐదేళ్లలో రూ.3.5 లక్షల కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే విధంగా లాజిస్టిక్ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేలా ఏపీ లాజిస్టిక్ పాలసీ 2022–27లో మరిన్ని రాయితీల ప్రతిపాదనలకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపింది. సముద్ర ఎగుమతులపై దృష్టి సారించండి: సీఎం దేశ వ్యాప్తంగా సముద్ర ఉత్పత్తుల్లో 46% మన రాష్ట్రం నుంచే ఉండటంతో ఈ రంగాన్ని మరింత ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎస్ఐపీబీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం నుంచి అధికంగా ఆక్వా ఎగుమతులు జరుగుతున్నాయని, విదేశాలకు వెళ్లి తిరస్కరణకు గురి కాకుండా ఇక్కడి నుంచే నాణ్యత గల ఉత్పత్తులను పంపే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం రైతు భరోసా కేంద్రాల(ఆర్బీకే)ను ఉపయోగించుకుని, ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను పెంచేలా చర్యలు చేపట్టాలన్నారు. పారిశ్రామిక రంగంలో అత్యంత పారదర్శక విధానాలను ప్రవేశ పెట్టామని, సింగిల్ డెస్క్ విధానంలో పరిశ్రమలకు అనుమతులు ఇచ్చే విధానంపై పర్యవేక్షణ ఉండాలని చెప్పారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ త్వరితగతిన ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, ఆర్థిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్, అటవీ పర్యావరణం, గనులు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్ కె రోజా, సీఎస్ సమీర్ శర్మ, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్, రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ జి.సాయిప్రసాద్, ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ ఎస్ రావత్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
వేతనాల కోసం కార్మికుల ఆందోళన
ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వటం లేదంటూ పశ్చిమగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలోని బయో ఇథనాల్ ఫ్యాక్టరీలో కార్మికులు ఆందోళనకు దిగారు. ఎన్నో వినతుల మేరకు మార్చి 5వ తేదీన వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చారని, పది రోజులైనా ఆ ఊసు ఎత్తటం లేదని 150 మంది కార్మికులు విధులు బహిష్కరించారు. ఇద్దరు కార్మికులు అక్కడే ఉన్న నీళ్ల ట్యాంకుపైకి ఎక్కారు. వెంటనే వేతనాలివ్వకుంటే దూకి చస్తామని బెదిరించారు. ఆందోళన కొనసాగుతోంది.