తీరానికి కొట్టుకొస్తే.. సముద్రంలోకి లాక్కెళ్లారు!
మహారాష్ట్రలో తీరానికి కొట్టుకొచ్చి అల్లాడుతున్న ఓ భారీ తిమింగళాన్ని (బ్లూ వేల్) అటవీశాఖ అధికారులు కాపాడారు. 47 అడుగుల పొడవు, 20 టన్నుల బరువు ఉన్న ఈ తిమింగళం రెండురోజుల కిందట రత్నగిరి జిల్లాలోని మద్బన్ గ్రామ సమీపంలోని తీరానికి కొట్టుకువచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్షీరదమైన తిమింగళం తీరంలో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
ఆదివారం ఉదయం అటవీ శాఖ అధికారులు ఆదివారం ఉదయం రెండు బోట్లలో 50మంది సహాయంతో ఈ భారీ జలచరాన్ని తిరిగి మహాసముద్రంలో విడిచిపెట్టారు. తిమింగళాన్ని భారీ తాళ్లతో కట్టి.. కెరటాల పోటు అధికంగా ఉన్నా అతికష్టం మీద దానిని నడి సముద్రంలోకి లాక్కెళ్లి వదిలేశారు. ఈ విషయంలో అటవీశాఖ అధికారులకు స్థానిక మత్స్యకారులు, స్వచ్ఛంద కార్యకర్తల సహాయం అందించారు.
'నలుగురు అటవీశాఖ అధికారులు ఈ ఆపరేషన్‌కు నాయకత్వం వహించారు. స్థానిక మత్స్యకారులు, స్వచ్ఛంద కార్యకర్తలు సహాయంతో ఆదివారం మధ్యాహ్నం కల్లా తిమింగళాన్ని నడిసముద్రంలో విడిచిపెట్టాం' అని మహారాష్ట్ర ప్రధాన అటవీ సంరక్షణ అధికారి ఎన్ వాసుదేవన్ తెలిపారు.
#BlueWhale was rescued by two boats that pulled mammal back to deep waters. 50 ppl involved in rescue ops pic.twitter.com/CjzBisPHnP
— Badri Chatterjee (@ChatterjeeBadri) September 11, 2016