bluechips
-
క్యూ2 ఫలితాలదే పైచేయి
దేశీ స్టాక్ మార్కెట్లను ఈ వారం ప్రధానంగా కార్పొరేట్ ఫలితాలు నిర్దేశించనున్నాయి. గత వారాంతాన పలు దిగ్గజాలు జులై–సెపె్టంబర్(క్యూ2) ఫలితాలు వెల్లడించాయి. బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, కొటక్ మహీంద్రాసహా ఆర్బీఎల్ బ్యాంక్, యుకో బ్యాంక్, ఐటీ దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికం పనితీరు ప్రకటించాయి. దీంతో సోమవారం ప్రధానంగా ఈ కౌంటర్లలో యాక్టివిటీ కనిపించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. కాగా.. ఈ వారం మరిన్ని రంగాలకు చెందిన బ్లూచిప్ కంపెనీలు క్యూ2 ఫలితాలు వెల్లడించనున్నాయి. జాబితాలో ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు ఐటీసీ, హచ్‌యూఎల్, రిఫైనరీ దిగ్గజాలు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, సిమెంట్ దిగ్గజం అల్ట్రాటెక్ తదితరాలున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఇదేవిధంగా ఫైనాన్స్ దిగ్గజాలు బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇటీవలే స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తోపాటు.. అదానీ గ్రీన్ ఎనర్జీ, వన్97 కమ్యూనికేషన్స్(పేటీఎమ్), జొమాటో, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) సైతం ఫలితాలు ప్రకటించనున్నాయి. చమురు ధరలు సైతం ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ముదిరిన వివాదాలతో ఇటీవల ముడిచమురు ధరలకు రెక్కలొస్తున్నాయి. వారాంతాన బ్రెంట్ చమురు బ్యారల్ 75 డాలర్లకు చేరింది. దీనికిజతగా అన్నట్లు విదేశీ మార్కెట్లో పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 2,730 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని దాటింది. చమురు, పసిడి ధరల పెరుగుదల వాణిజ్యలోటును పెంచే వీలుంది. దీనికితోడు ఇటీవల డాలరుతో మారకంలో రూపాయి బలహీనపడుతోంది. చరిత్రత్మాక కనిష్టం 84కు బలహీనపడి కదులుతోంది. ఇవి ప్రతికూల అంశాలుగా మార్కెట్ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఇరాన్– ఇజ్రాయెల్ యుద్ధ భయాలు, చమురు ధరల సెగ మార్కెట్లలో ఆటుపోట్లకు కారణమయ్యే అవకాశమున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ ప్రవేష్ గౌర్ తెలియజేశారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు కార్పొరేట్ ఫలితాలను నిశితంగా గమనిస్తారని మిశ్రా చెబుతున్నారు. గత వారమిలా పలు ఆటుపోట్ల మధ్య గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు స్వల్ప వెనకడుగు వేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నికరంగా 157 పాయింట్లు(0.2 శాతం) క్షీణించి 81,225 వద్ద ముగిసింది. నిఫ్టీ కొంత అధికంగా 110 పాయింట్లు(0.4 శాతం) నీరసించి 24,854 వద్ద నిలిచింది. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.2 శాతమే నష్టపోగా.. స్మాల్ క్యాప్ 1 శాతంపైగా క్షీణించింది. ఎఫ్‌పీఐ అమ్మకాలు భౌగోళిక, రాజకీయ అనిశి్చతులు, చైనా ఆర్థిక వ్యవస్థ మందగమనం కారణంగా సెంటిమెంటు బలహీనపడినట్లు మెహతా ఈక్విటీస్ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్(రీసెర్చ్) ప్రశాంత్ తాప్సే పేర్కొన్నారు. మరోపక్క దేశీ స్టాక్స్‌లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) నిరవధిక అమ్మకాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు తెరతీస్తున్నట్లు వివరించారు. ఈ నెలలో ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు దేశీ స్టాక్స్‌లో నికరంగా రూ. 74,700 కోట్ల విలువైన అమ్మకాలు చేట్టారు. అయితే ఇందుకు ధీటుగా దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(డీఐఐలు) కొనుగోళ్లు చేపడుతుండటం గమనార్హం! ఈ ట్రెండ్ సమీపకాలంలో కొనసాగవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. చైనా స్టాక్స్ చౌకగా లభిస్తుండటం, దేశీ మార్కెట్లు అధిక విలువలకు చేరుకోవడం ఎఫ్‌పీఐలపై ప్రభావం చూపుతున్నట్లు విశ్లేíÙంచారు. కాగా.. క్యూ2లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 6 శాతం వృద్ధితో రూ. 17,286 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కొటక్ బ్యాంక్ 13 శాతం అధికంగా రూ. 5,044 కోట్ల నికర లాభం ఆర్జించింది. టెక్ మహీంద్రా 60.3 కోట్ల డాలర్ల(రూ. కోట్లు) విలువైన కొత్త డీల్స్ కుదుర్చుకుంది. ఈ వివరాలు శనివారం(19న) వెల్లడయ్యాయి. వీటి ప్రభావం నేడు(21న) ఆయా స్టాక్స్‌పై కనిపించనున్నట్లు విశ్లేషకులు అంచనా వేశారు.క్యూ2 ఫలితాలదే పైచేయిఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సొల్యూషన్స్ అందించే బ్లూ క్లౌడ్ సాఫ్టెక్ సంస్థ తమ షేర్లను 2:1 నిష్పత్తిలో విభజించనుంది. ఈ ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపినట్లు వివరించింది. దీని ప్రకారం రూ. 2 ముఖ విలువ ఉండే ఒక్కో షేరును రూ. 1 ముఖ విలువ ఉండే షేరుగా విభజిస్తారు. కంపెనీ ఇటీవలే బ్లూహెల్త్ అప్లికేషన్, బ్లూరా, ఎడ్యుజీనీ, బయోస్టర్ పేరిట నాలుగు ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఉత్పత్తులను ఆవిష్కరించింది.నవంబర్ 1న ముహూరత్ ట్రేడింగ్దీపావళి సందర్భంగా బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెడీ స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ దీపావళి పండుగ సందర్భంగా యథావిధిగా ముహూరత్(మూరత్) ట్రేడింగ్‌ను చేపట్టనున్నాయి. ఇందుకు నవంబర్ 1న(శుక్రవారం) సాయంత్రం 6 నుంచి 7వరకూ గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌కు తెరతీయనున్నాయి. తద్వారా స్టాక్ మార్కెట్‌కు కొత్త ఏడాది సంవత్ 2081 ప్రారంభంకానున్నట్లు ఎక్సే్ఛంజీలు ఒక ప్రకటనలో తెలియజేశాయి. హిందువుల క్యాలండర్ ప్రకారం దీపావళికి ప్రారంభమయ్యే కొత్త ఏడాది తొలి రోజు చేపట్టే ముహూరత్ ట్రేడింగ్ ఆర్థికంగా శుభాన్ని, లాభాన్ని కలగజేస్తుందని స్టాక్ మార్కెట్ వర్గాలు భావిస్తుంటాయి. కాగా.. దీపావళి రోజు మార్కెట్లలో సాధారణ ట్రేడింగ్ ఉండదు. దీనిస్థానే సాయంత్రం గంటపాటు ప్రత్యేక ట్రేడింగ్‌ను నిర్వహిస్తారు. 5.45కల్లా ప్రీఓపెనింగ్ సెషన్ ప్రారంభమవుతుంది. ఈక్విటీ, ఎఫ్‌అండ్‌వో, కమోడిటీ, కరెన్సీ డెరివేటివ్స్ ట్రేడింగ్‌కు వీలుంటుంది.పీఎస్‌యూలలో ట్రేడింగ్‌కు నో ప్రభుత్వ అధికారులకు దీపమ్ ఆదేశాలుప్రభుత్వ రంగ కంపెనీ(పీఎస్‌యూ)ల షేర్లలో ట్రేడింగ్ చేపట్టవద్దంటూ ఆర్థిక శాఖ నిర్వహణలోని దీపమ్ అంతర్గత ఆదేశాలు జారీ చేసింది. ఆయా కంపెనీలకు సంబంధించిన మార్కెట్లపై ప్రభావం చూపగల రహస్య సమాచారం అందుబాటులో ఉంటుందన్న యోచనతో దీపమ్ తాజా నిర్ణయం తీసుకుంది. ఆయా శాఖలలో చేరేందుకు ఎంపికయ్యే వ్యక్తులు పీఎస్‌యూలలో షేర్లను కలిగి ఉంటే ముందుగానే వెల్లడించవలసిందిగా తెలియజేసింది. అధికారిక అనుమతులు పొందాక మాత్రమే వీటిని విక్రయించేందుకు వీలుంటుందని వివరించింది. పీఎస్‌యూలలో ప్రభుత్వ ఈక్విటీని దీపమ్ మేనేజ్ చేస్తుంటుంది. అంతేకాకుండా పీఎస్‌యూలలో ప్రభుత్వానికి చెందిన మైనారిటీ వాటా లేదా వ్యూహాత్మక వాటాల విక్రయం, ఎంపిక చేసిన కంపెనీల ప్రయివేటైజేషన్ తదితరాలను చేపట్టే సంగతి తెలిసిందే. వెరసి షేర్ల ధరలను ప్రభావితం చేయగల సమాచారం అందుబాటులో ఉంటుందన్న కారణంతో పీఎస్‌యూలలో ట్రేడింగ్ చేపట్టవద్దంటూ ప్రభుత్వ అధికారులకు అంతర్గత ఆదేశాల ద్వారా దీపమ్ స్పష్టం చేసింది. డిజిన్వెస్ట్మెంట్లో భాగంగా ప్రభుత్వం గతేడాది(2023–24) రూ. 16,507 కోట్ల విలువైన సీపీఎస్ఈ షేర్లను విక్రయించిన విషయం విదితమే. అంతక్రితం ఏడాది(2022–23)లోనూ రూ. 35,294 కోట్లు సమీకరించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2024–25) జీఐసీ, కొచిన్ షిప్‌యార్డ్‌లలో మైనారిటీ వాటాల విక్రయం ద్వారా రూ. 5,160 కోట్లు అందుకుంది.చిన్నషేర్ల ఫండ్స్‌కు భారీ పెట్టుబడులు 6 నెలల్లో రూ. 30,352 కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) తొలి ఆరు నెలల్లో మధ్య, చిన్నతరహా షేర్ల ఫండ్స్‌కు మరోసారి పెట్టుబడులు భారీగా తరలివచ్చాయి. వెరసి ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు రూ. 30,352 కోట్లు ప్రవహించాయి. మ్యూచువల్ ఫండ్ అసోసియేషన్(యాంఫీ) వివరాల ప్రకారం మిడ్‌క్యాప్ ఫండ్స్ రూ. 14,756 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ. 15,586 కోట్లు చొప్పున పెట్టుబడులను ఆకట్టుకున్నాయి. ఇందుకు మధ్య, చిన్నతరహా షేర్ల విభాగాలు ఆకట్టుకునే స్థాయిలో రిటర్నులు సాధించడం ప్రభావం చూపింది. గతేడాది(2023–24) తొలి ఆరు నెలల్లోనూ మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌కు రూ. 32,924 కోట్ల పెట్టుబడులు లభించాయి. ఓవైపు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఈ అంశంపై ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ ఈ ఏడాది పెట్టుబడులు కొనసాగడం గమనార్హం! అధిక రిటర్నులు మిడ్, స్మాల్ క్యాప్స్ అత్యధిక లాభాలు అందించగలవన్న ఇన్వెస్టర్ల విశ్వాసమే ఇందుకు కారణమని ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్(ఎంఎఫ్) సీఈవో సందీప్ బాగ్లా, ట్రేడ్జినీ సీవోవో ట్రివేష్ పేర్కొన్నారు. ఇకపైన కూడా చిన్న షేర్లు వేగవంతంగా వృద్ధి చెందనున్నట్లు అభిప్రాయపడ్డారు. అధిక వృద్ధిగల రంగాలలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. వెరసి స్మాల్ క్యాప్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో కేటాయింపుల్లో భాగమైపోయినట్లు వివరించారు. ఈ ఏడాది ఇప్పటివరకూ మిడ్ క్యాప్ ఇండెక్స్ 20 శాతం, స్మాల్ క్యాప్ 24 శాతం చొప్పున ర్యాలీ చేశాయి. తద్వారా నిఫ్టీ, లార్జ్‌క్యాప్ ఇండెక్సులను అధిగమించాయి. 2024 మార్చిలో స్ట్రెస్ టెస్ట్ సైతం ఇందుకు కీలకపాత్ర పోషించినట్లు ఆనంద్ రాఠీ వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ తెలియజేశారు. దీంతో ఫండ్ మేనేజర్లు మార్కెట్ ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధపడినట్లు వివరించారు.సాక్షి, బిజినెస్ డెస్క్ -
బ్లూచిప్స్‌కు అమ్మకాల షాక్
ముంబై: అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్(1%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (1.25%) ఐసీఐసీఐ బ్యాంక్(1.50%) షేర్ల పతనంతో స్టాక్ సూచీలు మంగళవారం అరశాతం నష్టపోయాయి. సెన్సెక్స్ 384 పాయింట్లు పతనమై 73,512 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 140 పాయింట్లు క్షీణించి 22,303 పాయింట్ల వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి.అయితే దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలలో తక్కువ ఓటింగ్ శాతం నమోదవుతుండటం, మార్కెట్లలో ప్రీమియం వాల్యుయేషన్ల ఆందోళనలతో ఇన్వెస్టర్లు లాభాల పలు కీలక రంగాల రంగాల్లో లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ఒక దశలో సెన్సెక్స్ 636 పాయింట్లు క్షీణించి 73,259, నిఫ్టీ 211 పాయింట్లు పతనమై 22,232 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2%, 1.65% చొప్పున నష్టపోయాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ షేర్లు రాణించాయి. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ట్రేడవుతున్నాయి. సూచీల వారీగా రియల్టీ 3.50%, యుటిలిటీస్ 3%, కమోడిటీస్, వినిమయ, టెలికం, ప్రభుత్వరంగ బ్యాంకులు 2.50% క్షీణించాయి. ప్రైవేట్ బ్యాంకులు, ఆటో, మెటల్, ఇంధన ఇండెక్సులు రెండుశాతం చొప్పున నష్టపోయాయి. శనివారం (మే18న) ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ ప్రాథమిక సైట్లో ఏమైనా లోపాలు లేదా అంతరాయాలు తలెత్తితే ఎదుర్కొనే సన్నద్ధతను పరీక్షించేందుకు శనివారం(మే 18న) ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్ విభాగాల్లో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తున్నట్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు తెలిపాయి. ఉదయం 9.15 గంటల నుంచి 10 గంటల వరకు తొలి సెషన్ ప్రధాన ప్రాథమిక సైట్లో.., ఉదయం 11.30 నుంచి 12.30 మధ్య మరో సెషన్ డిజార్టర్ రికవరీ సైట్లో ట్రేడింగ్ జరగనుంది. అన్ని సెక్యూరిటీస్, డెరివేటివ్ ఉత్పత్తులను ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి. గరిష్ట పరిమితిని 5 శాతంగా నిర్ణయించాయి. ఎక్సే్చంజీలు ఈ తరహా ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను ఈ మార్చి 2న నిర్వహించాయి. -
స్టాక్స్ బుల్ సవారీ
ముంబై: ప్రధానంగా బ్లూచిప్స్‌లో కొనుగోళ్లతో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి హైజంప్ చేశాయి. వెరసి ప్రామాణిక ఇండెక్సులు సరికొత్త గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 494 పాయింట్లు ఎగసి 74,742 వద్ద ముగిసింది. నిఫ్టీ 153 పాయింట్లు జమ చేసుకుని 22,666 వద్ద స్థిరపడింది. ఒక దశలో సెన్సెక్స్ 621 పాయింట్లు పురోగమించి 74,869ను తాకింది. ఇక నిఫ్టీ 183 పాయింట్లు బలపడి 22,697 వద్ద గరిష్టాన్ని అందుకుంది. ప్రపంచ స్టాక్ మార్కెట్ల ర్యాలీ సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వారాంతాన యూఎస్ మార్కెట్లు లాభపడిన సంగతి తెలిసిందే. . మార్కెట్ విలువ రికార్డ్ ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలి సెషన్లో రూ. 401 లక్షల కోట్లను అధిగమించింది. మార్కెట్ చరిత్రలో ఇది తొలిసారికాగా.. డాలర్లలో 4.81 ట్రిలియన్లను తాకింది. చివరికి బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 4,00,86,722 వద్ద స్థిరపడింది. గతేడాది జులైలో తొలిసారి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 300 లక్షల కోట్లను తాకిన విషయం విదితమే. బ్లూచిప్స్ దన్ను ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఆయిల్, రియల్టీ, మెటల్ రంగాలు 2.2–1.2 శాతం మధ్య పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, ఐటీ 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్, ఎంఅండ్ఎం, మారుతీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ, గ్రాసిమ్, టాటా కన్జూమర్, ఎల్అండ్టీ, ఆర్ఐఎల్, యాక్సిస్, హీరోమోటో, ఎయిర్టెల్ 4–1 శాతం మధ్య ఎగశాయి. అయితే అదానీ పోర్ట్స్, నెస్లే, అపోలో హాస్పిటల్, విప్రో, సన్ ఫార్మా 1.6–0.6 శాతం మధ్య నీరసించాయి. ఆధార్ హౌసింగ్ ఐపీవోకు రెడీ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఐపీవో ద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. మే 20న మార్కెట్లకు సెలవు ముంబైలో సాధారణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మే 20న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 11న ఈద్(రంజాన్), 17న శ్రీరామ నవమి, మే 1న మహారాష్ట్ర డే సందర్భంగా సైతం స్టాక్ మార్కెట్లు పనిచేయవు. -
సంపద సృష్టికి అనుకూలమైన ఫండ్: ఫండ్ రివ్యూ
మిరే అస్సెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ దీర్ఘకాల లక్ష్యాలకు తగినంత నిధిని సమకూర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరు తమ పోర్ట్‌ఫోలియో కోసం పరిశీలించాల్సిన వాటిల్లో మిరే అస్సెట్ ఎమర్జింగ్ బ్లూచిప్ ఫండ్ కూడా ఒకటి. లార్జ్‌క్యాప్‌లో స్థిరత్వం, మిడ్‌క్యాప్‌లో అధిక రాబడులు ఈ పథకంలో భాగంగా ఉంటాయి. ఎందుకంటే మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్ స్టాక్స్ మిశ్రమంగా ఈ పథకం పోర్ట్‌ఫోలియో ఉంటుంది. మల్టీక్యాప్ ఫండ్స్ విభాగంలో ఈ పథకం మంచి ఎంపిక అవుతుంది. రాబడులు ఈ పథకం ఆరంభమైనప్పటి నుంచి అన్ని కాలాల్లోనూ మెరుగైన పనితీరును ప్రదర్శించింది. గడిచిన ఏడాది కాలంలో రాబడులు ఇవ్వలేక పోయింది. ఇందుకు మార్కెట్ పరిస్థితులు ప్రతికూలంగా ఉండడాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఇది తప్పిస్తే దీర్ఘకాలంలో నమ్మకమైన పనితీరును గమనించొచ్చు. మూడేళ్లలో 20 శాతం, ఐదేళ్లలో 14 శాతం చొప్పున వార్షిక ప్రతిఫలాన్నిచ్చింది. ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా పరిగణించే ‘నిఫ్టీ లార్జ్ మిడ్‌క్యాప్ టీఆర్ఐ’ రాబడులు ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లలో వరుసగా 7 శాతం, 18 శాతం, 13 శాతంగానే ఉండడం గమనార్హం. అన్ని కాలాల్లోనూ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగంలో చక్కని రాబడుల చరిత్ర కలిగిన పథకం ఇది. పదేళ్లలో వార్షిక రాబడి 22 శాతంగా ఉంటే, ఈ పథకం ఆరంభమైనప్పటి నుంచి వార్షిక ప్రతిఫలం 20 శాతంగా ఉంది. పెట్టుబడుల విధానం/ పోర్ట్‌ఫోలియో లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌నకు 35-65 శాతం మధ్య కేటాయింపులు చేస్తుంది. నగదు నిల్వలను ఎక్కువగా ఉంచుకోకుండా, పెట్టుబడులను దాదాపుగా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తుంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం నిర్వహణలో రూ.24,643 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 99 శాతం ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసి ఉండగా, మిగిలిన ఒక శాతాన్ని నగదు రూపంలో కలిగి ఉంది. ఇక ఈక్విటీ పెట్టుబడుల్లో 53.5 శాతం లార్జ్‌క్యాప్‌లో ఉంటే, మిడ్‌క్యాప్ కంపెనీల్లో 42 శాతం పెట్టుబడులు కలిగి ఉంది. స్మాల్‌క్యాప్ కంపెనీలకు 4 శాతానికి పైగా కేటాయింపులు చేసింది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో 71 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో టాప్ 10 స్టాక్స్‌లోనే 36 శాతం మేర ఇన్వెస్ట్ చేసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలపై ఎక్కువ వెయిటేజీ కలిగి ఉంది. ఈ రంగ స్టాక్స్‌లో 28 శాతం వరకు ఇన్వెస్ట్ చేయగా, ఆ తర్వాత ఆటోమొబైల్‌లో కంపెనీల్లో 9.46 శాతం, ఇంధన రంగ కంపెనీల్లో 9.36 శాతం, టెక్నాలజీలో 8.22 శాతం, హెల్త్‌కేర్‌లో 7 శాతానికి పైగా పెట్టుబడులు పెట్టింది. ముఖ్యంగా గత ఏడాది కాలంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్ దిద్దుబాటుకు గురికావడాన్ని చూశాం. దీంతో గత ఏడాది కాలంలో ఈ పథకం రాబడులను ఇవ్వలేకపోయింది. 2011, 2018 మార్కెట్ కరెక్షన్లలో ఈ పథకం మొత్తం మీద మార్కెట్‌తో పోలిస్తే నష్టాలను పరిమితం చేసింది. -
ఈ 12 బ్లూచిప్ స్టాక్స్ దారెటు?
దేశీ స్టాక్ మార్కెట్లు ఇటీవల హెచ్చుతగ్గుల మధ్య కదులుతున్నాయి. ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 9200- 8,800 పాయింట్ల మధ్య పరిమిత శ్రేణిలో ఊగిసలాడుతున్నట్లు సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్-19 కారణంగా ప్రపంచ మార్కెట్లన్నిటా అమ్మకాలు ఊపందుకోవడంతో దేశీయంగానూ మార్కెట్లు పతనమయ్యాయి. దీంతో మార్చి నెలలో నిఫ్టీ గరిష్టాల నుంచి 38 శాతం జారింది. తదుపరి ఏప్రిల్‌లో ఒక్కసారిగా బౌన్స్‌బ్యాక్ సాధించింది. ఆపై తిరిగి ఈ నెలలో ఒడిదొడుకుల మధ్య వెనకడుగు వేస్తోంది. వెరసి ఇటీవల నమోదైన రికార్డ్ గరిష్టం నుంచి చూస్తే ప్రస్తుతం నిఫ్టీ 27 శాతం నీరసించినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. నిఫ్టీకి ప్రాతినిధ్యంవహించే దిగ్గజాలలో 12 స్టాక్స్ ఇప్పటికీ 50 శాతం దిగువనే కదులుతుండటం గమనార్హం! ఈ బ్లూచిప్స్ తమ గరిష్టాల నుంచి చూస్తే కనీసం 50 శాతం క్షీణించి కదులుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. వీటిలో అధిక శాతం బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం నుంచే చోటుచేసుకున్నట్లు పేర్కొన్నారు. జాబితా ఇలా ఏస్ ఈక్విటీ గణాంకాల ప్రకారం ఇటీవల నమోదైన 52 వారాల గరిష్టాల నుంచి 12 నిఫ్టీ స్టాక్స్ 50 శాతం దిగజారి ట్రేడవుతున్నాయి. వీటిలో ప్రయివేట్ రంగ దిగ్గజం ఇండస్ఇండ్ బ్యాంక్ రూ. 1673 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకగా.. బుధవారానికల్లా రూ. 348కు చేరింది. ఎన్బీఎఫ్సీ దిగ్గజం బజాజ్ ఫైనాన్స్ ఏడాది గరిష్టం రూ. 4923కాగా.. 60 శాతం పతనమై రూ. 1936ను తాకింది. ఈ బాటలో బజాజ్ ఫిన్సర్వ్ 58 శాతం పడిపోయి రూ. 4258 వద్ద కదులుతోంది. ఈ షేరు 10,297 వద్ద ఏడాది గరిష్టాన్ని సాధించింది. ఇక పీఎస్‌యూ దిగ్గజం ఎస్బీఐ సైతం 52 వారాల గరిష్టం రూ. 374 నుంచి 57 శాతం తిరోగమించి రూ. 159 స్థాయికి చేరింది. ఇతర కౌంటర్లలో జీ ఎంటర్ప్రైజెస్ 59 శాతం వెనకడుగుతో రూ. 406 నుంచి రూ. 165కు చేరగా.. టాటా మోటార్స్ రూ. 202 నుంచి 59 శాతం పతనమై రూ. 86ను తాకింది. ప్రయివేట్ రంగ బ్యాంక్ యాక్సిస్ రూ. 827 స్థాయి నుంచి 50 శాతం నీరసించి రూ. 387కు చేరగా.. ఇంధన రంగ బ్లూచిప్ ఓఎన్జీసీ రూ. 176 నుంచి రూ. 78కు జారింది. ఇదే విధంగా పీఎస్‌యూ దిగ్గజం ఐవోసీ 52 వారాల గరిష్టం రూ. 170 నుంచి 55 శాతం కోల్పోయి రూ. 77కు చేరగా.. కోల్ ఇండియా రూ. 271 నుంచి 53 శాతం నష్టపోయి రూ. 127ను తాకింది. గెయిల్ ఇండియా రూ. 183 స్థాయి నుంచి 52 శాతం క్షీణించి రూ.88కు చేరగా.. వేదాంతా రూ. 180 నుంచి రూ. 88కు పడిపోయింది. 52 వారాల గరిష్టం నుంచి రూ. 51 శాతం పతనమైంది. పలు కారణాలు కరోనా వైరస్ కట్టడికి అమలు చేస్తున్న లాక్‌డవున్ కారణంగా పలు రంగాలలో కార్యకలాపాలు నిలిచిపోవడం, ఉపాధికి దెబ్బతగలడం, దేశీయంగా తొలిసారి ఆర్థిక వ్యవస్థ తీవ్ర మాంద్య పరిస్థితులను ఎదుర్కోవలసి రావడం వంటి అంశాలు ప్రతికూల పరిస్థితులకు కారణమవుతున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అమెరికాసహా ప్రపంచ దేశాలలో నిరంతరంగా విస్తరిస్తున్న కోవిడ్-19 ఆరోగ్య సమస్యలను సృష్టిస్తుండటంతో ఆర్థిక వ్యవస్థలు కోలుకునేందుకు 6-12 నెలల సమయం పట్టవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ ప్యాకేజీలు, కేంద్ర బ్యాంకుల లిక్విడిటీ చర్యలు పలు రంగాలకు దన్నుగా నిలుస్తున్నప్పటికీ రెండు, మూడు త్రైమాసికాలలో కంపెనీల పనితీరు దెబ్బతినే వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. రుణ చెల్లింపుల వాయిదాలపై ఆరు నెలల మారటోరియం, ఉపాధి కల్పనకు విఘాతం వంటి ప్రతికూలతలతో ప్రధానంగా బ్యాంకింగ్, ఎన్బీఎఫ్సీ రంగాలు కుదేలయ్యే అవకాశమున్నట్లు ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. ఏప్రిల్‌లో ఆటో అమ్మకాలు నిలిచిపోవడం, పలు రంగాలలో ఉత్పత్తి పూర్తిస్థాయిలో పుంజుకోకపోవడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు ఫార్మా, ఎఫ్ఎంసీజీ వంటి రంగాలపై ఆసక్తి చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. కోవిడ్-19 కారణంగా ఇన్వెస్టర్లు పెట్టుబడుల ప్రణాళికల్లో మార్పులు చోటుచేసుకుంటున్నట్లు తెలియజేశారు. అయితే పటిష్ట బ్యాలన్స్‌షీట్లు, అధిక మార్కెట్ వాటా కలిగి, బలమైన యాజమాన్య నిర్వహణలో ఉన్న బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు సైతం భవిష్యత్‌లో పుంజుకునే వీలున్నట్లు తెలియజేశారు. -
అమెరికా ఈక్విటీల్లో పెట్టుబడుల కోసం
మన మార్కెట్లతో పోలిస్తే అమెరికా స్టాక్ మార్కెట్లలో పరిపక్వత ఎక్కువ. అలాగే అస్థిరతలు కొంచెం తక్కువ. ప్రపంచంలో ఆర్థికంగా బలీయమైన స్థానంలో ఉన్న అమెరికాలోని స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడం మంచి నిర్ణయమే అవుతుంది. పెట్టుబడులకు వైవిధ్యం ఎంతో అవసరం. ఆ విధంగా చూసినా అమెరికా ఈక్విటీలకు కొంత పెట్టుబడులు కేటాయించుకోవడం మంచిది. ఇలా అమెరికా స్టాక్ ఎక్సేంజ్ల్లోని లిస్టెడ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశం కల్పిస్తున్న ఫండ్స్‌లో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఫండ్ కూడా ఒకటి. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకే చోట ఇన్వెస్ట్ చేయడం సూచనీయం కాదు. ఈక్విటీ, డెట్ రెండు రకాల సాధనాల్లోనూ పెట్టుబడులు వర్గీకరించుకోవడం వైవిధ్యం అవుతుంది. ఇది రిస్క్‌ను తగ్గిస్తుంది. ఇక ఈక్విటీల్లోనూ వైవిధ్యం కోసం ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఫండ్ వీలు కల్పిస్తుంది. పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి మన ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్ చేసుకోవడానికి బదులు, కొంత మేర అమెరికా స్టాక్స్కూ కేటాయించుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే గత రెండేళ్లుగా మన స్టాక్ మార్కెట్లలో అస్థిరతలు బాగా పెరిగాయి. ఈ సమయంలో కేవలం ఎంపిక చేసిన బ్లూచిప్ స్టాక్స్ మాత్రమే ర్యాలీ చేశాయి. కానీ, ఇదే కాలంలో అమెరికా స్టాక్స్ మంచి పనితీరు ప్రదర్శించాయి. కనుక ఇన్వెస్టర్లు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. పెట్టుబడుల విధానం.. ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో మెరుగైన రాబడులను ఇవ్వడమనే విధానంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఫండ్ పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ పథకం తన పెట్టుబడులను అమెరికా స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్టెడ్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే, భారత్, ఇతర విదేశీ కంపెనీలు జారీ చేసే ఏడీఆర్, జీడీఆర్లలోనూ పెట్టుబడులు పెడుతుంది. అందులోనూ లార్జ్ క్యాప్ కంపెనీలకే పెట్టుబడులను పరిమితం చేస్తుంది. ప్రస్తుతం ఈ పథకం తన దగ్గరున్న నిధుల్లో 95.1 శాతం మేర స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయగా, మిగిలిన మొత్తాన్ని నగదు, నగదు సమాన రూపాల్లో కలిగి ఉంది. ఇక ఈక్విటీ మొత్తం పెట్టుబడుల్లో 94 శాతం మెగాక్యాప్, 6 శాతం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసింది. మనదేశంలో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో అధిక శాతం (సెక్టార్ ఫండ్స్ కాకుండా) బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ స్టాక్స్‌కే అగ్ర ప్రాధాన్యం ఇస్తాయి. కానీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ యూఎస్ బ్లూచిప్ ఫండ్ అమెరికా స్టాక్స్‌లో హెల్త్‌కేర్ రంగానికి అగ్ర ప్రాధాన్యం ఇచ్చింది. ఈ రంగానికి చెందిన కంపెనీల్లో 25% ఇన్వెస్ట్ చేసింది. ఆ తర్వాత 18% పెట్టుబడులను టెక్నాలజీ కంపెనీల్లో, 12% ఎఫ్ఎంసీజీలకు కేటాయించగా, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 7 శాతం కేటాయింపులు చేసింది. రాబడులు ఆరంభం నుంచి ఆకర్షణీయంగానే ఉంది. ఏడాది కాలంలో 9.71% రాబడులను ఇచ్చింది. గడిచిన మూడేళ్లలో చూసుకుంటే వార్షిక రాబడులు 12.52 శాతం. ఐదేళ్లలో 11.54%, ఏడేళ్లలో 15.35% చొప్పున వార్షిక రాబడులను ఇచ్చినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కనుక ఇన్వెస్టర్లు కనీసం ఐదేళ్లు, అంతకంటే దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలనుకునే వారు, ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు. అప్పుడే ఆశించిన రాబడులకు అవకాశం ఉంటుంది. లార్జ్‌క్యాప్ ఫండ్ కనుక సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇంకాస్త మెరుగైన రాబడులకు వీలుంటుంది. -
బ్లూచిప్ పీఎస్‌యూల్లో ఆఫర్ ఫర్ సేల్!
న్యూఢిల్లీ: నాల్కో, కోల్ ఇండియా, ఎన్టీపీసీ వంటి బ్లూచిప్ పీఎస్‌యూల్లో ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) మార్గంలో షేర్లను విక్రయించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ వాటాల విక్రయం ద్వారా రూ.1.05 లక్షల కోట్లు సమీకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ లక్ష్య సాధన కష్టతరం కానుండటంతో నాల్కో, కోల్ ఇండియా వంటి మంచి పనితీరు ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్లో ఓఎఫ్ఎస్ను చేపట్టాలని డిజిన్వెస్ట్‌మెంట్ విభాగం భావిస్తోంది. నేషనల్ అల్యూమినియమ్ కంపెనీ(నాల్కో), కోల్ ఇండియా, ఎన్టీపీసీ, ఎన్ఎమ్డీసీ, ఎన్బీసీసీ(ఇండియా), భారత్ ఎలక్ట్రానిక్స్, నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, హిందుస్తాన్ కాపర్.. ఈ కంపెనీలు ఓఎఫ్ఎస్ జాబితాలో ఉన్నాయి. ఈ కంపెనీల్లో ప్రభుత్వానికి 52–82 శాతం రేంజ్లో వాటాలున్నాయి. అయితే ఈ కంపెనీల ఓఎఫ్‌ఎస్‌కు ప్రధాన మంత్రి కార్యాలయం ఆమోదం పొందాల్సి ఉంది. మరోవైపు మార్కెట్ స్థితిగతులు బాగా ఉంటేనే ఈ షేర్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి దండిగా రాబడి రాగలదు. బీపీసీఎల్, ఎయిర్ ఇండియాల వాటా విక్రయం ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తికాకవపోచ్చు. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యసాధనలో రూ.87,000 కోట్ల మేర కోత పడనున్నది. -
రాబడుల్లో మేటి పనితీరు
ఈక్విటీ ఇన్వెస్టర్లకు గడిచిన ఏడాది, రెండేళ్లు పరీక్షా కాలం వంటిది. ఎన్నో అనిశ్చితులు, ఆందోళనలు మార్కెట్లపై ప్రభావం చూపించాయి. సూచీల్లో పెరుగుదల ఉన్నా కానీ, రిటైల్ ఇన్వెస్టర్లు రాబడులు పొందిందీ లేదు. కొందరు నష్టాలు కూడా చవిచూశారు. మార్కెట్ అంతటా పెరుగుదల లేకపోవడమే దీనికి కారణం. కేవలం కొన్ని కంపెనీలే మార్కెట్ పెరుగుదలకు దోహదపడ్డాయి. అందుకే అనిశ్చిత పరిస్థితుల్లో మార్కెట్ లీడర్లుగా ఉన్న కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయడం తెలివైన వ్యూహం అవుతుంది. కనుక భిన్న మార్కెట్ పరిస్థితుల్లో అద్భుత పనితీరు చూపించిన లార్జ్‌క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలనేది మా సూచన. యాక్సిస్ బ్లూచిప్ ఫండ్ దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్‌కు అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల విధానం యాక్సిస్ బ్లూచిప్ అన్నది లార్జ్‌క్యాప్ ఫండ్. మంచి వ్యాపార నాణ్యత కలిగిన లార్జ్‌క్యాప్ కంపెనీల్లో ఈ పథకం ఇన్వెస్ట్ చేస్తుంది. పోర్ట్‌ఫోలియో పరంగా వైవిధ్యాన్ని కూడా గమనించొచ్చు. 2016 నవంబర్ నుంచి ఈ పథకాన్ని శ్రేయాష్ దేవల్కర్ నిర్వహిస్తున్నారు. బోటమ్ అప్ విధానంలో స్టాక్స్‌ను, ఫండమెంటల్స్(వ్యాపార మూలాలు), వృద్ధి అవకాశాలు, ఆయా కంపెనీలకు పోటీ పరంగా ఉన్న అనుకూలతలు వంటి అంశాల ఆధారంగా ఈ పథకం పెట్టుబడుల కోసం ఎంపిక చేసుకుంటుంది. పథకం నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 80–100% వరకు అధిక నాణ్యత కలిగిన పెద్ద కంపెనీల్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. లార్జ్‌క్యాప్ కంపెనీలు ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని స్తాయి. వ్యాపార కార్యకలాపాలు భారీ స్థాయిలో ఉండడం, నిధుల వ్యయాలు తక్కువగా ఉండడం వల్ల ఆర్థిక మందగమన ప్రభావం వీటిపై తక్కువగా ఉంటుంది. ప్రస్తుతానికి ఈ పథకం ఫైనాన్షియల్, టెక్నాలజీ స్టాక్స్‌లో ఎక్కువ వెయిటేజీ కలిగి ఉంది. ఈ రెండు రంగాల స్టాక్స్‌లో వరుసగా 45%, 14% చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. రాబడుల పనితీరు ఈ పథకం నిర్వహణలో సెప్టెంబర్ నాటికి రూ.8,050 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. రాబడులకు సంబంధించి మంచి చరిత్ర ఉంది. గడిచిన మూడేళ్ల కాలంలో వార్షికంగా 15.95 శాతం రాబడులిచ్చింది. ఐదేళ్లలో.. వార్షిక పనితీరు 12.30%. కానీ, ఇదే కాలంలో పోటీ పథకాలు ఇచ్చిన రాబడులు మూడేళ్లలో 10.57%, ఐదేళ్లలో 9.26%గానే ఉన్నాయి. ఈ పథకం ప్రారంభం నాటి నుంచి ప్రతీ నెలా రూ.5,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వచ్చి ఉంటే 2019 సెప్టెంబర్30 నాటికి రూ.11.9 లక్షల సంపద సమకూరేది. ఇందులో అసలు పెట్టుబడి రూ.5.8 లక్షలు. ఈ పథకంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనీసం రూ.5,000 నుంచి..; సిప్ రూపంలో అయితే ప్రతీ నెలా కనీసం రూ.500 మొత్తంతో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిప్ రూపంలో కనీసం ఆరు నెలల పాటు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీర్ఘకాల ఆర్థిక లక్ష్యాల కోసం, దీర్ఘకాలంలో సంపద సమకూర్చుకోవాలనుకునే వారు కనీసం ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలానికి ఈ పథకంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
4 రోజుల్లో 419 పాయింట్లు
ఎఫ్ఐఐలు నికర కొనుగోలుదారులుగా నిలవడం, విదేశీ సానుకూలతలు దేశీ స్టాక్ మార్కెట్లకు మరోసారి జోష్‌నిచ్చాయి. దీంతో తొలి నుంచీ లాభాల్లో కదిలిన సెన్సెక్స్ చివరకు 133 పాయింట్లు జమ చేసుకుని 21,120 వద్ద ముగిసింది. ఈ బాటలో నిఫ్టీ కూడా 38 పాయింట్లు బలపడి 6,277 వద్ద స్థిరపడింది. వెరసి మార్కెట్లు నాలుగు రోజుల్లోనే 419 పాయింట్లు లాభపడ్డాయి. తద్వారా 5 వారా ల గరిష్ట స్థాయికి చేరాయి. అంతేకాకుండా 2013 నవంబర్ తరువాత ఒక వారంలో ఉత్తమ పనితీరును ప్రదర్శించాయి. గడిచిన మూడు ట్రేడింగ్ రోజుల్లో రూ. 1,200 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 592 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. గురువారం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మార్కెట్లు పనిచేయకపోవడంతో ఈ వారం ట్రేడింగ్ 4 రోజులకే పరిమితమైంది. హెల్త్‌కేర్ జోష్... బీఎస్ఈలో ప్రధానంగా హెల్త్‌కేర్, ఐటీ, ఆటో రంగాలు 2-1% మధ్య లాభపడ్డాయి. ఫార్మా దిగ్గజాలలో సన్, సిప్లా, గ్లెన్‌మార్క్, వోకార్డ్ 2.5-4% మధ్య పుంజుకోగా, ఇంట్రాడేలో క్యాడిలా(రూ. 1,053), లుపిన్(రూ. 1,001), డాక్టర్ రెడ్డీస్(రూ. 2,940), అరబిందో(రూ. 540), అజంతా(రూ. 1,065) కొత్త గరిష్టాలను తాకాయి. సెన్సెక్స్ దిగ్గజాలలో 4% చొప్పున ఎగసిన టాటా మోటార్స్(రూ.417), టీసీఎస్(రూ. 2,273) సైతం చరిత్రాత్మక గరిష్టాలను చేరాయి. ఈ బాటలో హిందాల్కో దాదాపు 7% దూసుకెళ్లగా, భెల్, ఓఎన్జీసీ, యాక్సిస్ 3-2.5% మధ్య వృద్ధి చూపాయి. మారుతీ రివర్స్‌గేర్... గుజరాత్ ప్లాంట్‌పై ఇన్వెస్టర్లలో చెలరేగిన ఆందోళనలతో మారుతీ షేరు 4.5% పతనమై రూ. 1,586 వద్ద ముగిసింది. అక్కడ ఏర్పాటు చేయతలపెట్టిన కార్ల ప్లాంట్‌ను మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు బదిలీ చేయడంపై మారుతీ ఇచ్చిన వివరణ ఇన్వెస్టర్లలో ఆందోళనలను తగ్గించలేకపోయిందని, దీంతో మారుతీ షేరులో అమ్మకాలు పెరిగాయని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇక సీఈఆర్సీ నిబంధనల కారణంగా ఎన్టీపీసీ మరో 2.5% నష్టపోగా, మనీలాండరింగ్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణల నేపథ్యంలో 1% తగ్గిన ఆర్ఐఎల్ రూ. 799 వద్ద నిలిచింది. ఇది ఆరు నెలల కనిష్టం. చిన్న షేర్ల జోరు మిడ్ క్యాప్స్‌లో ఇండొకో, టాటా ఎలక్సీ, జేపీ పవర్, మోన్శాంటో, ఆస్ట్రాజెనెకా, హెచ్‌టీ మీడియా, కావేరీ సీడ్, జూబిలెంట్ లైఫ్, పిరమల్ ఎంటర్ప్రైజెస్, పీఎఫ్సీ, గల్ఫ్ ఆయిల్, బీఏఎస్ఎఫ్ 14-6% మధ్య దూసుకెళ్లాయి.