22 గంటల్లో ఆమెను 110 మంది రేప్ చేశారు!
ఏథెన్స్: గ్రీకు దేశానికి ఆమె విహారయాత్ర జీవితంలో మరిచిపోలేని 'పీడకల'గా మారింది. 14 ఏళ్ల మేగన్ స్టీఫెన్స్ (పేరు మార్చారు) తన తల్లితో కలిసి 2009లో గ్రీస్ పర్యటనకు వెళ్లింది. కానీ విహారయాత్ర కాస్తా ఆమె పాలిట విషాదయాత్రగా మారింది. జీవితానికి సరిపడ నరకయాతనను మిగిల్చింది. మేగన్‌ను ఆమె ప్రియుడే 'సెక్స్ బానిస'గా అమ్మేశాడు. దీంతో ఆరేళ్లపాటు వేశ్యగా నరకయాతన అనుభవించిన మేగన్ ఎట్టకేలకు తప్పించుకొని బయటపడింది.
ఇప్పుడు ఆ నరకయాతన, వ్యభిచార కూపపు అనుభవాలను మారుపేరుతో 'బాట్ అండ్ సోల్డ్'గా పుస్తకరూపంలో ప్రచురించింది. ఒక వ్యభిచారిగా తాను అనుభవించిన హృదయవిదారకమైన దుస్థితిని ఈ పుస్తకంలో మేగన్ వివరించింది. రోజుకు 50 మందితో పడుకునేలా ఆమెపై ఒత్తిడి తెచ్చేవారు. ఒక్కోసారి 22 గంటల్లో 110 మంది ఆమెతో బలవంతంగా శృంగారించేవారు. అక్రమ మానవ రవాణా దుండగులు మేగన్‌ను అనేకసార్లు అమ్మివేశారు. కొన్నిసార్లు వీధుల్లో, మరికొన్ని బ్రోతల్ గృహాల్లో ఆమె పడుపు వృత్తిని చేయాల్సి వచ్చింది.
14 ఏళ్ల వయస్సులో గ్రీకు వచ్చినప్పటి అనుభవాలను మేగన్ ఈ పుస్తకంలో వివరించింది. అప్పుడు తల్లితో కలిసి వచ్చిన ఆమె ఓ గ్రీకు బార్లో జాక్ (22)ను తొలిసారి కలిసింది. అప్పటికే ప్రేమ కోసం తహతహలాడుతున్న మేగన్ అతన్ని తొందరగానే వలచింది. తల్లికి జాక్ నచ్చకపోయినా అతనితో కలిసి ఉండేందుకు అంగీకరించింది. ఎందుకంటే ఆమె బార్ ఓనర్ నికోస్‌తో అప్పట్లో సన్నిహితంగా ఉండేది. విహారయాత్ర ముగిసాక జాక్‌తో గ్రీకులోనే ఉండిపోతానని మేగన్ తల్లిని ఒప్పించింది. తన అధీనంలోకి వచ్చిన తర్వాత టాప్‌లెస్ (అర్థనగ్న) బార్లో నర్తించాల్సిందిగా మేగన్‌ను జాక్ ఒత్తిడి తెచ్చాడు. అందువల్లే వచ్చే డబ్బుతో తన తల్లికి చికిత్స చేయిస్తానని బుకాయించాడు.
అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో చితకబాది బ్రోతల్ హౌస్ కి అమ్మేశాడు. క్రమంగా ఆమె పడుపువృత్తిలోకి నెట్టివేయబడింది. ఆమెతో ఐదు నిమిషాలు గడిపితే ఒక విటుడు 20 జీబీపీ (గ్రీకు కరెన్సీ) ఇచ్చేవాడు. కొన్ని సందర్భాల్లో 22 గంటలపాటు ఏకధాటిగా ఈ వృత్తి కొనసాగేది. దాదాపు 110 మందితో ఆమె శంగారంలో పాల్గొనేలా దారుణాతి దారుణంగా అక్కడ పరిస్థితులు ఉండేవని మేగన్ తన పుస్తకంలో ఆ చీకటి అనుభవాలను గుర్తుచేసుకుంది. ఆ తర్వాత ఎలాగోల బయటపడి తిరిగి బ్రిటన్ వచ్చిన మేగన్ తల్లిని కలుసుకుంది. ఇప్పుడు 25 ఏళ్ల ఆమె ఓ వ్యక్తిని పెళ్లాడి గర్భవతి అయింది. అక్రమ రవాణా బారినపడి నరకయాతన అనుభవిస్తున్న అభాగ్యులైన మహిళలకు చేయూత అందించేందుకు ఓ చారిటీని స్థాపించాలని మేగన్ భావిస్తోంది.