break dancer
-
ఆఫ్గాన్ ఫస్ట్ ఫిమేల్ ఒలింపిక్ బ్రేక్ డ్యాన్సర్
సినిమాకు ఎంతమాత్రం తీసిపోని కథ మనిజా తలాష్ది. మహిళలు సంగీతం వినడం తప్పు... అనుకునే పరిస్థితులు ఉన్న దేశంలో బ్రేక్డ్యాన్స్పై ఇష్టాన్ని పెంచుకుంది. ఆ ఇష్టం ఆమెకు ఎన్నో కష్టాలు తెచ్చింది. అయినా మడమ తిప్పలేదు. తలాష్ కష్టం వృథాపోలేదు. అఫ్గాన్ ఫస్ట్ ఫిమేల్ ఒలింపిక్ బ్రేక్ డ్యాన్సర్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది...‘సంకల్ప బలం ఉంటే బందీఖానాలో ఉన్నప్పటికీ కల నిజం చేసుకోవచ్చు’ అంటుంది ఆఫ్గానిస్తాన్ ఫస్ట్ ఫిమేల్ ఒలింపిక్ బ్రేక్డ్యాన్సర్ మనీజా తలాష్. కొన్ని సంవత్సరాల క్రితం యూట్యూబ్‌లో ఆఫ్గాన్ బ్రేక్ డ్యాన్సర్ల వీడియో చూసి ‘ఇది కలా నిజమా! ఇలా చేయడం సాధ్యమా’ అనుకుంది తలాష్.మూడు నెలల తరువాత...‘సుప్రియర్స్ క్రూ’గా సుపరిచితులైన బ్రేక్ డ్యాన్సర్లను ట్రైనింగ్ క్లబ్లో కలుసుకుంది. ‘నాకు డ్యాన్స్ నేర్పించగలరా?’ అని అడిగింది. వారు ఓకే అన్నారు. శిక్షణ తీసుకుంటున్న 55 మందిలో తానొక్కతే అమ్మాయి. మొదట ఇబ్బందిగా ఫీలయ్యేది.‘ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే. ఇబ్బందిగా ఫీల్ కావద్దు’ అని ధైర్యం చెప్పేవారు సుప్రియర్ క్రూ సభ్యులు. అయితే తలాష్ బ్రేక్ డ్యాన్స్ నేర్చుకోవడం తల్లిదండ్రులు, ఉ΄ాధ్యాయులకు ఎవరికీ నచ్చేది కాదు. ఈ ఒత్తిడి ప్రభావంతోనో ఏమో... ‘నేర్చుకోవడం నాకు కష్టంగా ఉంది’ అన్నది.‘కష్టం కావచ్చు. అసాధ్యం మాత్రం కాదు’ అన్నారు ‘సుప్రియర్ క్రూ’ సభ్యులు.ఇక అప్పటినుంచి వెనకడుగు వేయలేదు తలాష్. నాలుగు సంవత్సరాల తరువాత... అఫ్గానిస్తాన్ ఫస్ట్ ‘బీ–గర్ల్’ (బ్రేక్డ్యాన్సర్ గర్ల్)గా పేరు తెచ్చుకుంది. మరోవైపు తలాష్కు బెదిరింపు కాల్స్ రావడం మొదలైంది. తన కల సాకారం అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో పన్నెండేళ్ల సోదరుడిని తీసుకొని ΄ాకిస్థాన్కు ΄ారిపోయింది. అక్కడి నుంచి స్పెయిన్‌కు వెళ్లి హ్యుస్కా అనే చిన్న పట్టణంలోని హెయిర్ సెలూన్లో పనిచేస్తూ బ్రేక్ డ్యాన్స్ ్ర΄ాక్టీస్ చేసేది. తలాష్ కథ ఐవోసీ (ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ) ఎగ్జిక్యూటివ్ బోర్డ్ దృష్టికి రావడంతో రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్‌లో స్థానం కల్పించారు. ఒలింపిక్స్‌లో తలాష్ మెడల్ తేస్తే పెద్ద చరిత్రే. కష్టమే అదృష్టమై...΄ారిస్ ఒలింపిక్స్‌తో మొదటిసారిగా బ్రేకింగ్ స్పోర్ట్ (బి–బోయింగ్, బి–గర్లింగ్ లేదా బ్రేక్ డ్యాన్సింగ్)ను ప్రవేశ పెట్టారు. ప్రపంచ క్రీడా వేదిక చెంతకు చేరడానికి ఇది మనిజా తలాష్కు అదృష్టంగా మారింది. అయితే కష్టాన్ని తప్ప అదృష్ట, దురదృష్టాలను ఎప్పుడూ పెద్దగా నమ్ముకోలేదు తలాష్. ఆమె ఒలింపిక్స్ వరకు రావడమే పెద్ద విజయం. పతకం గెలుచుకుంటే చారిత్రక విజయం అవుతుంది. ‘ఈపోటీ నా కోసం మాత్రమే కాదు. నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న స్నేహితులు, ఆత్మీయుల కోసం’ అంటుంది మనిజా తలాష్. -
ఆసియా క్రీడల్లోనూ బ్రేక్ డ్యాన్స్
న్యూఢిల్లీ: బ్రేక్ డ్యాన్స్ అంటే తెలుగువారికి ఠక్కున గుర్తొచ్చేవి మెగాస్టార్ చిరంజీవి సినిమాలు. చిత్రగీతాల్లో బ్రేక్ డ్యాన్స్‌ను ఎప్పుడో చూశాం. ఈ డ్యాన్స్‌తోనే చిరంజీవి తెలుగు చిత్రసీమను ఏలారు. ఇప్పుడు ఈ డ్యాన్స్ కోసం చిరంజీవి పాత పాటల్ని, సినీ పాటల్ని చూడాల్సిన అవసరం లేదు. ఆసియా క్రీడలను చూసినా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ డ్యాన్స్ ఆటలపోటీ అయింది. చైనాలోని హాంగ్జౌ నగరం ఆతిథ్యమివ్వనున్న 2022 ఆసియా క్రీడల్లోనూ బ్రేక్ డ్యాన్స్‌ను మెడల్ ఈవెంట్‌గా చేర్చారు. 2024 పారిస్ ఒలింపిక్స్‌లోనూ బ్రేక్ డ్యాన్స్‌ను మెడల్ ఈవెంట్‌గా ఖరారు చేస్తూ ఇటీవలే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఈ–స్పోర్ట్స్ (ఎల్రక్టానిక్ క్రీడలు) కూడా మెడల్ ఈవెంట్‌గా మారింది. ఈ–స్పోర్ట్స్ ఆసియా క్రీడలకు కొత్తకాదు. 2007 మకావులో జరిగిన ఆసియా ఇండోర్ క్రీడల్లో తొలిసారిగా మెడల్ ఈవెంట్‌గా ఆడించారు. గత ఆసియా క్రీడల్లో (ఇండోనేసియా) కూడా ఈ–స్పోర్ట్స్ ఉన్నప్పటికీ ఓవరాల్ పతకాల పట్టికలో వాటిని పరిగణించలేదు. తాజా నిర్ణయంతో ఆసియా క్రీడలకు కొత్త ఈవెంట్లు మరింత వన్నె తీసుకొస్తాయని ఆశిస్తున్నట్లు ఓసీఏ డైరెక్టర్ హైదర్ ఫర్మాన్ చెప్పారు. -
ఒలింపిక్స్‌లో ‘బ్రేక్ డ్యాన్స్’
పారిస్: చక్కని చుక్కల సందిట బ్రేక్‌డ్యాన్స్... ఇలాంటి పాట సినిమాల్లోనే కాదు ఏకంగా ఒలింపిక్స్‌లో కూడా పాడుకోవచ్చేమో! మన ప్రభుదేవాను పంపిస్తే స్వర్ణ పతకం గ్యారంటీగా వస్తుందేమో! ఎందుకంటే 2024 పారిస్ ఒలింపిక్స్‌లో ఆతిథ్య దేశం ప్రతిపాదించిన నాలుగు కొత్త క్రీడల్లో ‘బ్రేక్ డ్యాన్స్’ కూడా ఒకటి కావడం విశేషం. దీంతో పాటు సర్ఫింగ్, క్లైంబింగ్, స్కేట్ బోర్డింగ్ పేర్లను కూడా ఫ్రాన్స్ ప్రతిపాదించింది. నిబంధనల ప్రకారం నిర్వాహక దేశం కొత్త క్రీడలను ప్రవేశపెట్టాల్సిందిగా ఐఓసీని కోరవచ్చు. 2024 ఒలింపిక్స్ ఆతిథ్యం దక్కించుకున్న పారిస్ బ్రేక్ డ్యాన్స్‌ను ఎంచుకుంది. ఇందులో భాగమయ్యేందుకు పోటీ పడిన స్క్వాష్, బిలియర్డ్స్, చెస్‌లకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. 2018లో బ్యూనస్ ఎయిర్స్లో జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో ‘బ్రేకింగ్’ పేరుతో బ్రేక్ డ్యాన్స్ పోటీలను నిర్వహించారు కూడా. -
బ్రేక్ డాన్స్ చేస్తే చాలు... బొమ్మ పడిపోద్ది!
కాలేజీ రోజుల్లో... హానిఫాకు గ్రాఫిటీ అంటే ఇష్టం. అయితే ఆమె ఇష్టాల జాబితాలో బ్రేక్ డాన్స్ అగ్రస్థానంలో ఉండేది. చిత్రకళ కంటే నృత్యకళకే ప్రాధాన్యత ఇచ్చిన హానిఫా... ఆ తరువాత తనలోని చిత్రకళకు మెరుగులు దిద్దింది. అలా అని తనకు ఇష్టమైన బ్రేక్ డాన్స్ కు దూరం కాలేదు. నృత్యకళ, చిత్రకళలను సమన్వయం చేస్తూ సరికొత్త చిత్రాలకు ప్రాణం పోస్తోంది. ‘ఆర్ట్ బ్రేకర్’ గా అవతరించింది.