రూల్ బ్రేకర్
సినిమాకు ఎంతమాత్రం తీసిపోని కథ మనిజా తలాష్‌ది. మహిళలు సంగీతం వినడం తప్పు... అనుకునే పరిస్థితులు ఉన్న దేశంలో బ్రేక్‌డ్యాన్స్‌పై ఇష్టాన్ని పెంచుకుంది. ఆ ఇష్టం ఆమెకు ఎన్నో కష్టాలు తెచ్చింది. అయినా మడమ తిప్పలేదు. తలాష్ కష్టం వృథాపోలేదు. అఫ్గాన్ ఫస్ట్ ఫిమేల్ ఒలింపిక్ బ్రేక్ డ్యాన్సర్‌గా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది...
‘సంకల్ప బలం ఉంటే బందీఖానాలో ఉన్నప్పటికీ కల నిజం చేసుకోవచ్చు’ అంటుంది ఆఫ్గానిస్తాన్ ఫస్ట్ ఫిమేల్ ఒలింపిక్ బ్రేక్‌డ్యాన్సర్ మనీజా తలాష్. కొన్ని సంవత్సరాల క్రితం యూట్యూబ్‌లో ఆఫ్గాన్ బ్రేక్ డ్యాన్సర్‌ల వీడియో చూసి ‘ఇది కలా నిజమా! ఇలా చేయడం సాధ్యమా’ అనుకుంది తలాష్.
మూడు నెలల తరువాత...‘సుప్రియర్స్ క్రూ’గా సుపరిచితులైన బ్రేక్ డ్యాన్సర్‌లను ట్రైనింగ్ క్లబ్‌లో కలుసుకుంది.
‘నాకు డ్యాన్స్ నేర్పించగలరా?’ అని అడిగింది. వారు ఓకే అన్నారు. శిక్షణ తీసుకుంటున్న 55 మందిలో తానొక్కతే అమ్మాయి. మొదట ఇబ్బందిగా ఫీలయ్యేది.
‘ఇక్కడ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే. ఇబ్బందిగా ఫీల్ కావద్దు’ అని ధైర్యం చెప్పేవారు సుప్రియర్ క్రూ సభ్యులు. అయితే తలాష్ బ్రేక్ డ్యాన్స్ నేర్చుకోవడం తల్లిదండ్రులు, ఉ΄ాధ్యాయులకు ఎవరికీ నచ్చేది కాదు. ఈ ఒత్తిడి ప్రభావంతోనో ఏమో... ‘నేర్చుకోవడం నాకు కష్టంగా ఉంది’ అన్నది.
‘కష్టం కావచ్చు. అసాధ్యం మాత్రం కాదు’ అన్నారు ‘సుప్రియర్ క్రూ’ సభ్యులు.
ఇక అప్పటినుంచి వెనకడుగు వేయలేదు తలాష్. నాలుగు సంవత్సరాల తరువాత... అఫ్గానిస్తాన్ ఫస్ట్ ‘బీ–గర్ల్’ (బ్రేక్‌డ్యాన్సర్ గర్ల్)గా పేరు తెచ్చుకుంది. మరోవైపు తలాష్‌కు బెదిరింపు కాల్స్ రావడం మొదలైంది. తన కల సాకారం అయ్యే పరిస్థితి కనిపించకపోవడంతో పన్నెండేళ్ల సోదరుడిని తీసుకొని ΄ాకిస్థాన్‌కు ΄ారిపోయింది. అక్కడి నుంచి స్పెయిన్‌కు వెళ్లి హ్యుస్కా అనే చిన్న పట్టణంలోని హెయిర్ సెలూన్‌లో పనిచేస్తూ బ్రేక్ డ్యాన్స్ ్ర΄ాక్టీస్ చేసేది. తలాష్ కథ ఐవోసీ (ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ) ఎగ్జిక్యూటివ్ బోర్డ్ దృష్టికి రావడంతో రెఫ్యూజీ ఒలింపిక్ టీమ్‌లో స్థానం కల్పించారు. ఒలింపిక్స్‌లో తలాష్ మెడల్ తేస్తే పెద్ద చరిత్రే.
కష్టమే అదృష్టమై...
΄ారిస్ ఒలింపిక్స్‌తో మొదటిసారిగా బ్రేకింగ్ స్పోర్ట్ (బి–బోయింగ్, బి–గర్లింగ్ లేదా బ్రేక్ డ్యాన్సింగ్)ను ప్రవేశ పెట్టారు. ప్రపంచ క్రీడా వేదిక చెంతకు చేరడానికి ఇది మనిజా తలాష్‌కు అదృష్టంగా మారింది. అయితే కష్టాన్ని తప్ప అదృష్ట, దురదృష్టాలను ఎప్పుడూ పెద్దగా నమ్ముకోలేదు తలాష్. ఆమె ఒలింపిక్స్ వరకు రావడమే పెద్ద విజయం. పతకం గెలుచుకుంటే చారిత్రక విజయం అవుతుంది. ‘ఈపోటీ నా కోసం మాత్రమే కాదు. నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న స్నేహితులు, ఆత్మీయుల కోసం’ అంటుంది మనిజా తలాష్.
Comments
Please login to add a commentAdd a comment