buddha purnima
-
హుస్సేన్ సాగర్‌లోని బుద్ధ విగ్రహం వద్ద ఘనంగా బుద్ధ పూర్ణిమ ఉత్సవాలు (ఫొటోలు)
-
మహా వైశాఖి అంటే..? ఇది బుద్ధ పూర్ణిమగా ఎందుకు ప్రసిద్ధి..?
మహా వైశాఖి అనే పేరు వ్యవహారంలో కనబడుతున్నది. సంపూర్ణమైనటువంటి వ్రతం ఇది. ఈరోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేసినప్పటికీ అధికఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తున్నది. సంవత్సరంలో ప్రధానమైన కాలములు రెండు ఋతువులు చెప్పారు – వసంత ఋతువు, శరదృతువు. శరదృతువు ఆశ్వయుజ , కార్తికాలలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది. ఈ రెండింటినీ సంవత్సరారంభములుగా చెప్తారు. ఈ రెండు ఋతువులలోనూ భగవదారాధనకు ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ రెండు ఋతువులలో శరన్నవరాత్రులు , వసంత నవరాత్రులు చేయడం జరుగుతుంది. సమ ప్రాధాన్యం ఈ రెండింటికీ మనకు సంవత్సరంలో కనబడుతుంది. వాతావరణంలోనూ రెండింటిలోనూ ఒకవిధమైన సమ లక్షణం కనబడుతుంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న కారణం చేతనే ఈ రెండు ఋతువులలో వచ్చిన పూర్ణిమలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది. ఈ రెండు ఋతువులలో మనకు మొత్తం నాలుగు పూర్ణిమలు వస్తాయి – చైత్ర పూర్ణిమ , వైశాఖ పూర్ణిమ , ఆశ్వయుజ పూర్ణిమ , కార్తిక పూర్ణిమ. ఈ నాలుగు పూర్ణిమలు ప్రత్యేకమైన ఆరాధనలు చేసి సంపూర్ణమైనటువంటి యజ్ఞఫలాన్ని పొందవచ్చు అని శాస్త్రములు చెప్తున్నటువంటి విషయం. పూర్ణిమ విశిష్టత..ఆశ్వయుజ పూర్ణిమకు ‘ప్రతిపన్ముఖ్యరాకాంత తిథిమండల పూజితా” అనే నామంలోనే ‘ముఖ్యరాకా’ అని చెప్పారు. అప్పుడు అమ్మవారి ఆరాధనలు అత్యంత విశిష్టమైన ఫలితాలను ఇస్తాయి అని చెప్తారు. అదేవిధంగా కార్తిక పూర్ణిమ కృష్ణ పూజకి , అమ్మవారి ఆరాధనకి , శివారాధనకు అత్యంత ప్రాధాన్యం కలిగినది. ఇవి కాకుండా సంవత్సర మధ్య కాలంలో ఆషాఢపూర్ణిమ ఒకటి. దానికొక ప్రాధాన్యం ఇచ్చారు. దక్షిణాయన పుణ్యకాలంలో వచ్చేటటువంటి పూర్ణిమ అది. ఇవి ప్రధానమైన పూర్ణిమా వ్రతాలుగా మనకు శాస్త్రం చెప్తున్న అంశం. ఇవి కాకుండా మాఘమాసంలో యజ్ఞసంబంధమైన పూర్ణిమ. ఇలా ఆరు పూర్ణిమలు సంవత్సర కాలంలో ప్రధానం అని చెప్పారు. అందులో అత్యంత ప్రధానమైన వైశాఖ పూర్ణిమలో మనం ఉన్నాం ఇప్పుడు. బుద్ధ పూర్ణిమ అని ఎందుకు పిలుస్తామంటే.. వైశాఖ పూర్ణిమ... దీనిని మహా వైశాఖి.. బుద్ధ పూర్ణమి అనే పేరుతో పిలుస్తారు. గౌతమ బుద్ధుడు భూమండల ప్రభువైన సనత్కుమారులు , పరమ గురువుల పరంపర మధ్య వారధిగా ఉంటాడని, అందువల్లే వైశాఖ పూర్ణిమ బుద్ధ పూర్ణిమగా ప్రసిద్ధి చెందింది. భూమండల ప్రభువు ఆవాసమైన ఉత్తర హిమాలయ పుణ్య శ్రేణులలో ఉన్న శంబళ కేంద్రం నుంచి ప్రేరణ వస్తుంది. దశవతారమైన కల్కి శంబళ గ్రామం నుంచి అవతరిస్తాడని భాగవత పురాణంలో ఉంది. మధ్య హిమాలయ శ్రేణులలో ఉన్న కలాప గుహలలో ఉన్న పరమగురు పరంపర ముఖ్య కేంద్రంలో ఈ ప్రేరణను అందుకుంటారని భాగవత పురాణంలో వివరించబడింది. బోధి వృక్షానికి పూజలు..బుద్దుని జీవితంలో వైశాఖ పూర్ణిమ మూడుసార్లు అత్యంత ప్రాముఖ్యతను వహించింది. కపిలవస్తు రాజు శుద్ధోధనుడు , మహామాయలకు ఓ వైశాఖ పౌర్ణమి నాడు సిద్ధార్ధుడిగా జన్మించాడు. మరో వైశాఖ పూర్ణిమనాడు జ్ఞానోదయం పొంది సిద్ధార్ధుడు బుద్ధుడిగా మారాడు. వేరొక వైశాఖ పూర్ణిమనాడు నిర్యాణం చెందాడు. తల్లి చనిపోవడంతో గౌతమి అనే మహిళ సిద్ధార్ధుని పెంచిందని... అందుకే గౌతముడనే పేరు వచ్చిందని చరిత్రకారులు చెబుతారు. గౌతముని.. బుద్ధుడిగా చేసిన బోధివృక్షానికి పూజచేసే ఆచారం అ మహనీయుని జీవిత కాలంలోనే ప్రారంభమైంది. బేతవన విహారంలో బుద్ధుడు బసచేసి ఉన్న రోజులలో ఒకనాడు భక్తులు పూలు తీసుకురాగా.. ఆ సమయంలో గౌతముడు ఎక్కడికో వెళ్లారు. బుద్ధుని దర్శనం కోసం భక్తులు చాలాసేపు వేచి చూసి ఎంతటికీ రాకపోవడంతో నిరుత్సాహంతో పుష్పాలను అక్కడే వదలి వెళ్లిపోయారు. దీనిని గమనించి బేతవన విహారదాత, అనంద పిండకుడు.. పూజకు వినియోగం కాకుండా పుష్పాలు నిరుపయోగం కావడం అతనికి నచ్చలేదు. అనంతరం బుద్ధుడు వచ్చిన వెంటనే అనంద పిండికుడు ఈ విషయం వివరించాడు. ఆయన లేనప్పడు కూడా పూజ సాగడానికి అక్కడ ఏదైనా వస్తువును ఉంచి వెళ్లవలసిందని కోరాడు. శారీరక పారిభాగాది (అవయవాలు) పూజలకు అంగీకరించని బుద్ధుడు.. బోధివృక్షం పూజకు అనుమతించాడు. తన జీవితకాలంలోనూ , తదనంతరమూ ఈ ఒక్క విధమైన పూజ సాగడమే తనకు సమ్మతమైందని చెప్పాడు. అప్పటినుంచీ బేతవన విహారంలో ఒక బోధివృక్షాన్ని నాటి పెంచడానికి ఆనందుడు నిర్ణయించాడు. గయలోని బోధివృక్షం నుంచి విత్తనం తెప్పించి నాటారు. అప్పడు ఒక గొప్ప ఉత్సవం సాగింది. కోసలదేశపు రాజు తన పరివారంతో వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొన్నాడు. వేలాది బౌద్ధభిక్షకులు తరలివచ్చారు. వైశాఖ పౌర్ణమి - బోధి వృక్షపూజ ఆనాటి నుంచి బోధివృక్ష పూజ బౌద్దులకు ప్రత్యేకమైంది. ఏడాదికి ఒకసారి వైశాఖ పూర్ణిమనాడు సాగించడం ఒక ఆచారంగా మొదలైంది. బౌద్దమతం వ్యాపించిన అన్ని దేశాల్లో వైశాఖ పూర్ణిమనాడు బోధి వృక్షపూజ సాగుతుంది. ఆనాడు బౌద్దులు బోధి వృక్షానికి జెండాలు కట్టి , దీపాలు వెలిగించి పరిమళజలాన్ని పోస్తారు. హీనయాన బౌద్ధమతాన్ని అవలంబించే బర్మాలో ఈ ఉత్సవం నేటికీ సాగుతోంది. రంగూన్ , పెగు , మాండలే మొదలైన ప్రాంతాల్లో బుద్ధ పౌర్ణిమను అత్యంత వైభవంగా , నియమనిష్ఠలతో చేస్తారు. రోజు మొత్తం సాగే ఈ ఉత్సవంలో మహిళలు పరిమళ జలభాండాన్ని తలపై ధరించి బయలుదేరుతారు. మేళతాళాలు , దీపాలు , జెండాలు పట్టుకు వస్తారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి నుంచి బయలుదేరిన సమూహాలు సాయంకాలానికి ఒక చోట కలుసుకుంటాయి. అత్యంత వైభవంగా సాగిన ఆ ఊరేగింపు బౌద్ధాలయానికి వెళుతుంది. దేవాలయంలోకి ప్రవేశించి మూడుసార్లు ప్రదక్షిణం చేస్తారు. అటు పిమ్మట కుండల్లో జలాలను వృక్షం మొదట పోస్తారు. దీపాలు వెలిగించి , చెట్టుకి జెండాలు కడతారు. హిందువులు ఆచరించే ‘వట సావిత్రి’ మొదలైన వ్రతాలు ఈ బౌద్ద పర్వం నుంచే వచ్చాయని పురాణ వచనం.(చదవండి: 'అక్షయ తృతీయ' అనే పేరు ఎలా వచ్చింది? బంగారం కొనాల్సిందేనా..?) -
బుద్ధం శరణం గచ్ఛామి
-
నేపాల్‌తో గట్టి బంధం: మోదీ
న్యూఢిల్లీ : నేపాల్‌తో భారత్ సంబంధాలు అసమానమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. బుద్ధ పూర్ణిమని పురస్కరించుకొని ప్రధాని సోమవారం నేపాల్‌లో లుంబినికి వెళ్లనున్నారు. తన పర్యటన గురించి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేస్తూ నేపాలీ ప్రధాని షేర్ బహదూర్‌తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. గత నెలలో షేర్ బహదూర్ భారత్ వచ్చినప్పుడు ఫలవంతమైన చర్చలు జరిగాయన్నారు. ఇరు దేశాల ప్రజల మధ్య కూడా సుహృద్భావం సంబంధాలున్నాయని మోదీ పేర్కొన్నారు. చదవండి: ఉగ్రవాదాన్ని మోదీ సహించరు : జై శంకర్ -
మార్గమే నాది.. నడవాల్సింది మీరే!
కపిలవస్తు నగరాన్ని రాజధానిగా చేసుకుని శాక్యగణాన్ని పాలించే రాజు శుద్ధోధనుడు. ఇతని అర్ధాంగి మహామాయ లేదా మాయాదేవి. చాలాకాలం పాటు వీళ్ళకు సంతు లేదు. చివరికి మాయాదేవి గర్భం దాల్చింది. ఆమెకు నెలలు నిండాయి. పురిటికి పుట్టింటికి బయలుదేరింది. కానీ దారిలోనే లుంబినీ వనంలో ఆమె ప్రసవించింది. ఆ రోజు వైశాఖ పున్నమి. మిట్ట మధ్యాహ్నం సిద్ధార్థుడు జన్మించాడు. అయితే సిద్ధార్థునిగా భౌతిక జననమే గానీ బుద్ధునిగా జన్మదినం కాదు. సిద్ధార్థుడు ఒక వ్యక్తి. రాకుమారుడు. ఆయనకు నా అనే వాళ్లు ఉంటారు. ‘నావి’ అనేవి ఉంటాయి. నా భార్య నా బిడ్డ, నా తల్లి, నా తండ్రి నా సోదరుడు, నా బంధువులు, నా మిత్రుడు, నా రాజ్యం నా సంపద... ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది ఉన్నంత వరకూ సిద్ధార్థుడు ఒక వ్యక్తే. ఒక రాకుమారుడో, రాజో, ఒక బిడ్డ, ఒక తండ్రి, ఒక భర్త. సంసార బంధాల మధ్యే ఉంటాడు. కాబట్టి అతని పనులన్నీ ఆ బంధాల చుట్టూనే ఉంటాయి. కానీ ఈ బంధనాల నుండి బైటకు వచ్చేశాడు సిద్ధార్థుడు. తన 29వ ఏట అన్నింటినీ త్యజించి బైటకు వచ్చాడు. ఇక ఆ రోజు నుండి ధర్మం కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. బుద్ధత్వం పొందాలనుకున్నాడు. ఆ అన్వేషణ సాధన ఆరేళ్లు సాగింది. ఆరేళ్ళ తర్వాత బుద్ధగయలో నిరంజనా నదీ తీరంలో బోధివృక్షం రావిచెట్టు క్రింద ధ్యాన సాధన చేశాడు. భవచక్రాన్నుండి బైట పడ్డాడు. పరిపూర్ణ ప్రజ్ఞ సాధించాడు. దుఃఖానికి కారణమైన ఈ భవ చక్రాన్నుండి బయటపడే మార్గాన్ని కనుగొన్నాడు. అదే జ్ఞానోదయం బుద్ధత్వం, బుద్ధునిగా జననం ఇది సిద్ధార్ధుడు బుద్ధునిగా మారిన (పుట్టినరోజు) ఆరోజు కూడా విశాఖ పున్నమే! అలా సిద్ధార్థుడు బుద్ధునిగా జన్మించడానికి ఆరేళ్ళు ధర్మగర్భంలో ఉన్నాడు. భౌతికంగా శారీరకంగా .... బుద్ధునిగా తొలి ఏడు. ఇలా... సిద్ధార్థుడు పుట్టిందీ, బుద్ధత్వం పొంది సంబుద్ధుడయ్యిందీ వైశాఖ పున్నమి రోజే. బుద్ధత్వం పొందాక అతనికి ఎలాంటి భవ బంధాలు ఉండవు. తల్లీ, తండ్రీ, భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులు అనేవారు ఉండరు. ‘నా’ అనేది పూర్తిగా నశిస్తుంది. ‘నాది’ ‘నా వారు’ అనే బంధాలు నశిస్తాయి. జనాలందరూ బుద్ధునికి సమానులే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. వ్యక్తి నశించి వ్యక్తిత్వం మాత్రమే మిగిలి ఉంటుంది. కాబట్టి స్వార్థం, ద్వేషం, ఈర్ష్య, మోహం అనేవి బుద్ధత్వంలో అదృశ్యమైపోతాయి. ఆ సంబుద్ధుడు జ్ఞాననేత్రం అవుతాడు. ధర్మనేత్రం అవుతాడు. అందరిలో తనుండడు. తనలోనే అందర్నీ ఇముడ్చుకుంటాడు. తన దుఃఖాన్ని అందరికీ పంచడు. అందరి దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడు. దాన్ని తొలగించడానికే ప్రయత్నిస్తాడు. అదే బుద్ధత్వం అంటే. తన దుఃఖాన్ని తాను తీర్చుకోవడం కాదు. అందరి దుఃఖాన్ని తీర్చడం. అంటే అందరికీ దుఃఖ నివారణ చెప్పడం. ఆ మార్గంలో ఎదుటివారు తమ దుఃఖాన్ని తామే తీర్చుకోవాలి. బుద్ధుడు అలా మార్గదాత మాత్రమే! బుద్ధుని జీవితంలో మరో విశేషం ఏమంటే... బుద్ధుడు తన 80వ ఏట కుసీనగర్లో మహాపరి నిర్వాణం పొందింది కూడా వైశాఖ పున్నమి రోజునే! ఆయన నోటి నుండి వెలువడిన ఆఖరి మాటలు– ‘‘మీకు మీరే దీపం కండి. మార్గమే నాది. ఆ మార్గంలో నడవాల్సింది మీరే’’ అనేది బుద్ధుని అంతిమ సందేశం. ఇలా పుట్టుక, బుద్ధత్వం పొందడం, మహాపరి నిర్వాణం... ఈ మూడూ వైశాఖ పున్నమి రోజే. కాబట్టి బౌద్ధులు ఈ పున్నమి రోజును ‘బుద్ధ జయంతి’ అని అనకుండా ‘బుద్ధ పున్నమి’ గానే పిలుచుకుంటారు. జరుపుకుంటారు. – బొర్రా గోవర్ధన్ -
Narendra Modi: టీకానే ఆయుధం
న్యూఢిల్లీ: కరోనాపై యుద్ధాన్ని గెలవడానికి, కోవిడ్ 19 నుంచి ప్రాణాలను రక్షించుకోవడానికి అత్యంత ముఖ్యమైన ఆయుధం టీకా అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. జీవితకాలంలో ఒకసారి ఎదురయ్యే అసాధారణ విపత్తు ఇదని, ఈ మహమ్మారితో ఎంతో మంది ఆత్మీయులను కోల్పోయామని, ఆర్థికంగా కూడా ఇది భారీగా దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుధవారం ‘వేసక్ గ్లోబల్ సెలబ్రేషన్స్’లో ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం ఇచ్చారు. అన్ని దేశాలపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందన్న ప్రధాని.. పరిస్థితులు గతంలో వలె ఉండబోవని, భవిష్యత్ పరిణామాలను ఇకపై ‘కరోనా పూర్వ – కరోనా అనంతర’ పరిణామాలుగా గుర్తించాల్సి ఉంటుందన్నారు. కరోనాపై పోరులో ముందంజ వేశామని, కరోనాను తుదముట్టించే కీలక ఆయుధంగా టీకా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ఫ్రంట్‌లైన్ వర్కర్లకు సెల్యూట్ ఇతరుల ప్రాణాలను కాపాడడం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టిన వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్ యోధులకు సెల్యూట్ చేస్తున్నానన్నారు. నేపాల్, శ్రీలంక ప్రధానులు, అంతర్జాతీయ బుద్ధిస్ట్ కాన్ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ఈ వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుద్ధుని జీవితం శాంతియుత సహజీవనాన్నే బోధించిందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. వాతావరణ మార్పు అంశాన్ని ప్రస్తావిస్తూ.. ప్రస్తుత తరం నిర్లక్ష్యపూరిత జీవనవిధానం భవిష్యత్ తరాలకు ముప్పుగా పరిణమించే ప్రమాదముందని హెచ్చరించారు. ప్రకృతిని గౌరవించాలని బుద్ధుడు బోధించాడని గుర్తు చేశారు. పారిస్ ఒప్పంద లక్ష్యాల సాధన దిశగా వెళ్తున్న దేశాల్లో భారత్ ఒకటన్నారు. మానవుల వేదనను తొలగించడానికి తన జీవితాన్ని అంకితం చేసిన బుద్ధుని వలె.. కరోనా మహమ్మారితో బాధపడ్తున్నవారికి సాయం అందించేందుకు కొన్ని సంస్థలు, వ్యక్తులు కృషి చేస్తున్నాయని ప్రశంసించారు. -
Buddha Purnima 2021: మొక్కవోని ధైర్యం... సుఖజీవన సోపానం
వైశాలిని ఒక సంవత్సరం కరువు కాటకాలు కాటేశాయి. వర్షాభావం ఏర్పడింది. మంచినీటి తావులన్నీ తరిగిపోయి మురికి గుంటలయ్యాయి. ఆ నీటినే తాగడం వల్ల ప్రజలకు అంటువ్యాధులు సోకాయి. కలరా విజృంభించింది. వేలాది మరణాలు సంభవించాయి. వైశాలి రాజ్యవీధులు శ్మశానాలయ్యాయి. శవాలను తీసేవారే లేరు. శవాలు కుళ్లిపోయి నగరమంతా దుర్గంధం వ్యాపించింది. కొత్త కొత్త రోగాలు వచ్చిపడ్డాయి. ప్రజలు గడపదాటి రావడానికే భయపడ్డారు. వైశాలి రాజకుటుంబీకులు కూడా అంతఃపురాలకే పరిమితం అయ్యారు. ప్రజలని పట్టించుకునే వారే లేరు. దీంతో దొంగల బెడద పెరిగింది. ఆ సమయంలో బుద్ధుడు మగధ రాజధాని రాజగృహ నగరంలో ఉన్నాడు. ఎవరో బాటసారులు బుద్ధునితో వైశాలి ప్రజల బాధలు చెప్పారు. ఆ రోజుల్లో జీవకుని లాంటి బౌద్ధులు పద్ధెనిమిది రకాల వైద్యవిధానాలతో వైద్యం అందించేవారు. బుద్ధుడు వెంటనే ఐదువందల మంది భిక్షువుల్ని వెంట తీసుకుని వైశాలికి వెళ్లాడు. ఆ రోజుల్లో ఆకాశమంతా కారుమబ్బులు కమ్మి, కుంభవృష్ఠి పడింది. ఆ నీటి ప్రవాహంలో కొన్ని కళేబరాలు కొట్టుకుని పోయాయి. బుద్ధుడు తన భిక్షుసంఘంతో కలసి వీధులు శుభ్రం చేశాడు. మిగిలిన కళేబరాల్ని పొలిమేరలకు తరలించాడు. జీవకుడు మరికొందరు వైద్యులు అందించిన ఔషధాల్ని ప్రజలకు అందించారు. ఆ పరిసరాలలో దొరికిన మొక్కల నుండి రకరకాల ఔషధాల్ని తయారు చేస్తూ, నిరంతరం ప్రజలకి అందించారు. ‘బుద్ధుడే తన సంఘంతో వచ్చి తమకు సేవ చేస్తుంటే తామెందుకు ఇళ్లలో కూర్చోవాలి’ అని ఆలోచించి కొందరు ప్రజలు వచ్చి సహకరించారు. బుద్ధుడు నగరంలో రాజు అంతఃపురానికి వెళ్లి–‘‘రాజా! మీరే ఇలా భయపడి దాక్కుంటే ఎలా? మీరు మీ మంత్రులు, ఉద్యోగులు వెంటనే వీధుల్లోకి వెళ్లండి. ప్రజల్ని కలవండి. ధైర్యం చెప్పండి. అంటురోగం కంటె భయం చేసే కీడే ఎక్కువ. ఇలాంటి విపత్కర పరిస్థితులల్లో మనిషికి మనిషే తోడు. ఈ విషయంలో మీరు అడవిలో ఉన్న ఆటవికుల నుండి ఎంతో నేర్చుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో వారు ద్వేషాలన్నీ పక్కనపెట్టి శత్రుత్వాన్ని చెరిపేసుకుని, ఒక్కటిగా కలసి ఎదుర్కొంటారు. అందరూ కలసి ఉంటే అంతకుమించిన బలం ఏముంది? ప్రతి వ్యక్తి ధైర్యంగా... తనకు సంఘం అండగా ఉందనే భావనతో భయరహితుడై బతికేస్తాడు. కాబట్టి రాజా! మీరు కదలండి! ప్రజలకు కావలసిన సపర్యలు చేయండి! ఔషధాలు అందించండి’’అని చెప్పిన వెంటనే రాజు తన ఉద్యోగ పరివారంతో కదలి వచ్చాడు. అటు తరువాత కాలంలోనే వైశాలి అంటురోగాలనుండి బయట పడింది. అప్పటివరకు బుద్ధుడు వైశాలిలోనే ఉండిపోయాడు. జీవకారుణ్యం, పర్యావరణం, సంఘ ఐక్యత, మొక్కవోని ధైర్యం... సుఖజీవనానికి సోపానాలు అని చెప్పిన ఈ బుద్ధవాణి ఈ విపత్కర పరిస్థితుల్లో మనకు హృదయ వాణి కావాలి! – డా. బొర్రా గోవర్ధన్ -
ముంగిళ్లను ముద్దాడిన వైద్యం
‘‘బౌద్ధం ఒక మతం కాదు. అది ఒక సాధారణ జీవన విధానం మాత్రమే కాదు. అది ఒక నాగరికత. సమాజాన్ని మానవ పురోభివృద్ధివైపు నడిపించి, గతాన్ని సమూలంగా మార్చివేసే వ్యవస్థలను సృష్టించడం నాగరికత. అటువంటి చారిత్రక కర్తవ్యాన్ని బౌద్ధం స్వీకరించి, అమలు చేసి విజయం సాధించింది. అందువల్ల బౌద్ధం ఒక మత వ్యవస్థ కాదు. అది ఒక సంపూర్ణ విప్ల వాన్ని సాధించింది. అందువల్ల ఆ బౌద్ధాన్ని ప్రపంచానికి అందించిన గౌతముడు ఒక సామాజిక విప్లవకారుడు’’ బ్రిటిష్ చరిత్రకారుడు ట్రెవర్ లింగ్ బౌద్ధాన్ని నిర్వచించిన విధానమిది. ‘‘ది బుద్ధ’’అనే పుస్తకంలో ఈ విషయాలను వెల్లడించారు. అంతేకాకుండా, ఈ పుస్తకా నికి సబ్ టైటిల్‌గా ‘‘ది సోషల్ రెవల్యూషనరీ పొటెన్షియల్ ఆఫ్ బుద్ధిజం’’ అని చేర్చి తన అధ్యయనాన్ని ఆ దిశలో కొనసాగించారు. ట్రెవర్ లింగ్ రాసిన ఈ పుస్తకం, ఆయన చేసిన అధ్యయనం బౌద్ధం పైన ఒక సమగ్ర అవగాహనను అందిస్తుంది. నిజానికి ట్రెవర్ లింగ్ పేర్కొన్న విధంగానే బౌద్ధం ఆనాటి మానవ జీవితంలోని అన్ని రంగాలను సమూలంగా మార్చివేసింది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, వైద్య, విద్యారంగాల్లో మానవ జాతి గమనాన్ని ఎన్నెన్నో మార్పులకు గురిచేసింది. మరెన్నో మలుపులు తిప్పింది. రాజకీయ రంగంలో ఆనాటి రాజ్యాల పనితీరుని పునర్నిర్వచించింది. రాజు అంటే సేవకుడనీ, ప్రజాక్షేమమే పాలన అర్థమనీ, ప్రజాసంక్షేమమే పరమావధిగా భావించే అధికార యంత్రాంగాన్ని నిర్మించాలని బౌద్ధం ప్రతిపాదించింది. ప్రజల అభి ప్రాయాలకు, మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజలే కేంద్రంగా అభివృద్ధి జరగాలని బౌద్ధం ప్రతిపాదించింది. రాజు యజ్ఞ, యాగా లతో ప్రజల సొమ్మును బూడిదపాలు చేయకూడదనీ, ప్రజల్లో హేతు వాద భావాలను నింపాలని కూడా బౌద్ధం బోధించింది. ఆనాడే అభివృద్ధి చెందుతోన్న వ్యవసాయానికి యజ్ఞ, యాగాల పేరుతో జరు గుతున్న జంతు బలులు తీవ్ర అవరోధంగా ఉన్న విషయాన్ని బౌద్ధం బయటపెట్టింది. తద్వారా పరిపాలన వ్యవస్థలో ప్రగతిశీల మార్పు లకు బౌద్ధం పునాదులు వేసింది. సామ్రాట్ అశోకుడు, కనిష్కుడు, శ్రీహర్షుడు లాంటి వాళ్ళ పాలన బుద్ధుడి బోధనలకు కార్యరూపాన్ని చ్చింది. బుద్ధుడు కలగన్న ప్రజారంజక పాలనకు నిలువుటద్దంలా నిలిచింది. అదేవిధంగా అప్పుడప్పుడే పుంజుకుంటున్న వృత్తులను ప్రోత్సహించి, వ్యాపార వాణిజ్య రంగాలకు అడ్డంకిగా ఉన్న ఛాందస భావాలను తోసిరాజన్నది మొట్టమొదట బౌద్ధమే. సరిగ్గా ఇదే వర్ణ వ్యవస్థను తిరస్కరించి, ప్రజలందరూ సమానమనే ఒక సమతాభావ నను పాదుకొల్పింది. వీటన్నింటితో పాటు, ప్రజల జీవితంలో అనునిత్యం భాగమైన, అత్యంత కీలకమైన వైద్యం కూడా ప్రజల ముంగిళ్ళను ముద్దాడింది బుద్ధుడి కాలంలోనే. అప్పటివరకు విడివిడిగా ప్రజలు తమకు తాముగా అనుసరిస్తున్న వైద్య వి«ధానం సమాజపరమైంది బౌద్ధం ఫలితంగానే. ముఖ్యంగా సాంప్రదాయక వైద్య విధానమైన ఆయుర్వే దానికి ఒక నిర్మాణాత్మక రూపమిచ్చి వైద్యం ప్రజాసేవలో ప్రధాన భాగమని గుర్తించి అమలు చేసిన ఘనత బౌద్ధానిదేననడంలో సందే హం లేదు. వైద్య విధానాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో క్రోడీకరించిన ఘనత ముమ్మాటికీ బౌద్ధానిదే. అప్పటి వరకు ఏదైనా జబ్బులు వస్తే, కొన్ని ఔషధాలు మాత్రమే ఉండేవి. అంతేకాకుండా దేవతలను పూజిస్తే అన్ని రోగాలు మాయమవుతాయనే అశాస్త్రీయ భావనలు రాజ్యమేలుతున్న కాలంలో బౌద్ధం తన శాస్త్రీయ వైద్యవిధానానికి శ్రీకారం చుట్టింది. బౌద్ధం ప్రధానంగా ఆరోగ్యాన్ని కేవలం శారీరక రుగ్మతగా చూడలేదు. మనస్సు, శరీరం, పరిసరాలు అన్ని కూడా స్వచ్ఛంగా ఉన్నప్పుడే ఆరోగ్యం సరిగ్గా ఉంటుందని బుద్ధుడు భావించి దాన్నే బోధించాడు. దానిని ఆయన బౌద్ధ బిక్కులకు బోధిం చిన వినయపిటకంలోని ఆరవ అధ్యాయంలో భైషజ్య స్కందంలో మనం చూడవచ్చు. ప్రజల ఆరోగ్యానికి సూచనలతో పాటు, వైద్యాన్ని చాలా శాస్త్రీయంగా నిర్ధారించి, నిర్వచించారు. నిజానికి ఔషధాలను ప్రత్యేకంగా సూచిస్తూనే, ఆహారాన్ని సైతం ఔష«ధంగా చూడాలని చెబుతూనే వాటిని కొన్ని విధాలుగా విభజించారు. అందులో నెయ్యి, వెన్న, తేనె, నూనె, చక్కెరను బౌద్ధం ఆహారంగా చూడలేదు. వాటిని ఔషధాలుగా సూచించింది. జంతువుల కొవ్వును సైతం మరో ఔషదంగా బౌద్ధం పేర్కొన్నది. ముఖ్యంగా మూలికలను మంచి ఔషధా లుగా తేల్చింది. అందులో పసుపు, అల్లం, వస, తెల్లవస, అతివసలను శరీరంలో ఉన్న దోషాలను తొలగించే మహాద్భుత ఔషధాలని స్పష్టంగా పేర్కొన్నది. అదేవిధంగా కషాయాలు, ఆకులు కూడా ఔషధాలుగా భావించింది. వేపాకులు, కొడిశె ఆకులు, తులసి ఆకులు, పత్తి ఆకులు, పొట్ల ఆకులు కూడా రోగ నిర్మూలనకు పనికి వస్తాయని నిరూపించింది. ఇలా ఆ అ«ధ్యాయం నిండా మనకు వైద్య విధానం, ఔషధ వినియోగం అన్నింటినీ పొందుపరిచారు. బుద్ధుడి కాలంలోనే జీవకుడు అనే వైద్యుడు ఆనాటి ఆధునిక వైద్య విధానాభివృద్ధికి ఎంతో కృషి చేశాడు. జీవకుడు మగధరాజు బింబిసారుడి ఆస్థాన వైద్యుడిగా మాత్రమే కాకుండా, గౌతమ బుద్ధుని అధికారిక వైద్యుడిగా ఉంటూ బౌద్ధం వ్యాప్తికి కృషి చేశాడు. వీటన్నింటితో పాటు ఆయుర్వేద వైద్యానికి అక్షర రూపమిచ్చిన మరో ఇద్దరు వైద్య పితామహులు మన చరిత్రలో ఉన్నారు. వారిలో ఒకరు చరకుడు, రెండోవాడు సుశ్రుతుడు. మనకు ఇప్పటి వరకు అందు బాటులో ఉన్న భారత ప్రాచీన వైద్య గ్రంథం చరక సంహిత. చరక సంహిత వినయ పిటకంలోని ఎన్నో అంశాలను తనలో పొందుపరుచు కున్నది. చరకుడు కూడా బౌద్ధ చక్రవర్తి కనిష్కుడి రాజ వైద్యుడు. అతడుæ నిత్యం సంచారిగా ఉంటూ ఉండేవాడని, ఎక్కడా నిలకడగా ఉండ కుండా నిత్యం ప్రజల్లో సంచరిస్తూ వైద్యాన్ని అందించాడని చరిత్ర కారులు చెబుతున్నారు. ఆ తర్వాత వచ్చే సుశ్రుతుడు, ఆయన తద నంతరం ఆయుర్వేదాన్ని అభివృద్ధి పరిచిన వాగ్బాటులు కూడా బౌద్ధ అనుయాయులేనని చరిత్రకారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కరోనా లాంటి మహావిపత్తులు చరిత్రలో ఎన్నో. వాటిని ఎదుర్కొని ప్రజలను రక్షించిన ఉదాహరణలు బౌద్ధ చరిత్రలో కోకొల్లలు. క్రీస్తు శకం ఒకటవ శతాబ్దంలో తమిళ నాడులో జరిగిన ఒక సంఘటన మనకు బౌద్ధంలో ఇమిడిఉన్న ఉన్నతమైన మానవతా విలువలను పట్టిచూపుతుంది. తమిళనాడు లోని నాగపట్నం ప్రాంతంలో అంబిగామయి అనే బిక్కుని బౌద్ధ ప్రచారం చేస్తుండేది. ఆమె నిత్యం వేపచెట్టుకింద కూర్చుని ధ్యానం చేస్తుండేది. త్రిపిటకాలలో ఆమె పరిపూర్ణ జ్ఞానాన్ని సంపాదించింది. అందువల్ల ఆమె పట్ల ప్రజలకు గౌరవం ఉండేది. ఆ సమయంలో నాగ పట్నంలో వర్షాలు లేక కరువు వచ్చింది. వాటివలన అంటురోగాలు ప్రబలాయి. వందలాది మంది మనుషులు ప్రాణాలు కోల్పోయారు. వేలాది పశువులు చనిపోయాయి. ఆ సమయంలో ఆమె నాగపట్నం వెళ్ళి ‘‘మీరంతా ఆరోగ్యంగా ఉండాలంటే మీ మనస్సును, మీ ఇల్లును, ఊరునీ శుభ్రంగా ఉంచుకోవాలి.’’ అని చెప్పింది. గుగ్గిలం, మైసాచి, సాంభ్రాణి పొగలు వేయాలని, ప్రతి ఇంటికీ వేపాకు తోర ణాలు కట్టాలని వివరించింది. మనసు, దేహం, దేశం శుద్ధి చేసు కోవాలని చెప్పిన విషయమే తిరుమంత్రమైంది. పసుపు, కుంకుమ రాసుకోవాలని, ఇల్లును ఎర్ర మట్టితో అలకాలనీ, వాకిళ్ళలో అలుకు చల్లాలని, సుద్ద ముక్కతో ముగ్గులు పెట్టాలని, పసుపు, కుంకుమలను గడపలకు రాయాలని సూచించింది. ఈ సూచనలే కాకుండా, రోగు లకు చిరుధాన్యాలతో చేసిన అంబలి ఇవ్వాలని కూడా ప్రజలను ఆదేశించింది. దీనితో రోగాలు తగ్గుముఖం పట్టాయి. ఈ విషయాన్ని తమిళ పింగళి నిఘంటువు, జీవగ చింతామణి పుస్తకాలలో ఉన్నట్టు తమిళనాడు దళిత తాత్వికుడు ఆయోతీదాసు తన రచనల్లో పేర్కొన్నారు. అయితే బౌద్ధం సాంప్రదాయాల నుంచి కొన్ని విషయాలను తీసుకొని అభివృద్ధి చేసిన వైద్యం గుప్తుల కాలం వరకు కొనసాగింది. అయితే అక్కడ కూడా మేధోరంగంలో వచ్చిన బ్రాహ్మణాధిపత్యం వైద్యాన్ని కొన్ని కులాలకే పరిమితం చేసింది. అందుకే ఆ తర్వాత ఆయుర్వేదం పుస్తకాలకే పరిమితమై తన ప్రాధాన్యతను కోల్పో యింది. కింది కులాల ప్రజలు తమ సొంత వైద్యాన్ని సృష్టించుకొని జీవించారు. కానీ ఆయుర్వేద ఫలితాలను అందుకోలేకపోయారు. అందుకే ఈ రోజుకీ కూడా ఆయుర్వేదం అభివృద్ధి చెందకపోవడానికి కారణం కొందరి చేతుల్లో బందీ అవడం, వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా పరిశోధనలు జరగని పరిస్థితిలో ఉండడమే. కాగా, ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందిన అల్లోపతి వైద్యం కార్పొరేట్ చేతుల్లో చిక్కి, ప్రజలందరికీ కాకుండా, సంపన్నులకే ఫలితాలను ఇస్తున్నది. నిజానికి వైద్యం పుట్టింది సేవలో.. దానిని బౌద్ధం ఆచరించి చూపింది. అప్పుడు వర్ణ, కుల వ్యవస్థ, ఈ రోజు వర్గ, కుల వ్యవస్థలు వైద్యాన్ని సేవాభావం నుంచి మరల్చి లాభార్జనే లక్ష్యంగా మార్చివేశాయి. ప్రభుత్వాల ప్ర«థమ ప్రాధాన్యంగా ఉండా ల్సిన ఆరోగ్యం గాలిలో దీపంలా మారింది. డబ్బున్నవాడికే వైద్యం అందుతోంది. పేదవాడి కోపమే కాదు, నిరుపేదలకు అనారోగ్యం కూడా శాపంగా మారింది. ఆనాడు మలేరియా అయినా, ఈనాటి కరోనా అయినా మురికి కూపాలుగా మారిన పేదల జీవితాల్లో పెద్దగా మార్పులేదు. క్వారం టైన్, లాక్డౌన్ లాంటి పెద్ద పెద్ద పదాలు వారికర్థం కావు. వారికర్థ మయ్యేదల్లా వారి తాతముత్తాతల కథల్లో, గా«థల్లో మిళితమైన వైద్యం, బౌద్ధం విప్పిచెప్పిన ఔషధ రహస్యం ప్రకృతిజీవనం. ఆ ప్రకృతినుంచి పుట్టిన పసుపు, వేప, తులసి లాంటి సహజ ఔషధతత్వాన్ని తిరిగి మన జీవితాల్లోకి ఆహ్వానిద్దాం. బౌద్ధం చూపిన మార్గాన్ని అను సరిద్దాం. వైద్యానికి అర్థం పరమార్థం సేవాభావమనే బుద్ధుడి నానుడిని ప్రచారం చేద్దాం. (నేడు బుద్ధ పౌర్ణమి) మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ మొబైల్ : 81063 22077 -
అంగుళిమాల పరివర్తన
పురానీతి - మే 21న బుద్ధ పూర్ణిమ అంగుళిమాల పేరు వింటే పిల్లల నుంచి పెద్దల వరకు, పిట్టల నుంచి పులుల వరకు అందరికీ భయమే. సగం ప్రాణం పోవడానికి అతడి నవ్వు వింటే చాలు! అరణ్యమార్గంలో ప్రయాణించే వారిని చంపి చేతివేళ్లను మాలగా ధరించేవాడు. అందుకే అతణ్ని ‘అంగుళిమాల’ అని పిలిచేవాళ్లు. ఈ అంగుళిమాల అసలు పేరు అహింసకుడు. మంచి ప్రతిభావంతుడైన విద్యార్థి. మరి ఇలాంటి అహింసకుడు పేరుకు తగ్గట్లుగా జీవించకుండా, నరహంతకుడిగా ఎలా మారాడు? అసలు ఏం జరిగిందంటే... అహింసకుడి ప్రతిభాపాటవాలు తోటి విద్యార్థులకు అసూయ కలిగించేవి. దీంతో అతడి మీద లేనిపోని అబద్ధాలను ప్రచారం చేసేవారు. ‘‘నేను ఎవరి దగ్గర చదువు నేర్చుకోవాల్సిన పనిలేదు. గురువులే నా దగ్గర చదువు నేర్చుకోవాలి’’ అని అహింసకుడు విర్రవీగుతున్నాడని ప్రచారం చేశారు తోటి విద్యార్థులు. ఒకటి కాదు రెండు కాదు... ఇలాంటి అబద్ధాలను ఎన్నో సృష్టించి గురువుకు చెప్పేవారు. ఈ ప్రచారం పుణ్యమా అని అహింసకుడు అంటే ‘అహంకారి’ అనే ముద్ర గురువు దృష్టిలో పడింది. వందసార్లు చెప్పిన అబద్ధం నిజం అవుతుంది అన్నట్లుగా తోటి విద్యార్థులు అహింసకుడి మీద చేసిన చెడు ప్రచారం నిజమైపోయింది. అహింసకుడి మీద తన కోపాన్ని ఎలాగైనా తీర్చుకోవాలనుకుంటాడు గురువు. పెద్దలు చెప్పిన మాటను అహింసకుడు జవదాటడు అనే విషయం ఆ గురువుకు తెలుసు. ఒకరోజు అహింసకుడిని పిలిచి ‘‘గురుదక్షిణగా నాకు ఏమిస్తున్నావు?’’ అని అడుగుతాడు. ‘‘మీరు కోరుకున్నది ఆరునూరైనా సరే తెచ్చి ఇస్తాను’’ అంటాడు అహింసకుడు. ‘‘మనుషుల వెయ్యివేళ్లు నాకు కావాలి’’ అని కోరతాడు గురువు. అదెంత అసాధ్యమైన పనో గురు, శిష్యుల్లో ఇద్దరికీ తెలుసు. అయినా సరే, గురువు చెప్పిన మాటను కాదనకుండా ‘అలాగే తెస్తాను’ అని బయలుదేరుతాడు అహింసకుడు. గురువుకు ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడం కోసం అడవిలో దారి కాచి బాటసారులను చంపి వేళ్లు తీయడమే పనిగా పెట్టుకున్నాడు అహింసకుడు. ఈ వేళ్లను ఎక్కడ భద్రపరచాలో తెలియక తన మెడలోనే వాటిని మాలగా ధరిస్తాడు. దీంతో అహింసకుడి పేరు కాస్త ‘అంగుళిమాల’గా స్థిరపడింది. ఒకసారి గౌతమ బుద్ధుడు అడవి మార్గం గుండా ప్రయాణించాల్సి వచ్చింది. ‘‘ఈ అడవిలో అంగుళిమాల అనే ప్రమాదకరమైన బందిపోటు ఉన్నాడు. వాడి కంట పడితే చాలా ప్రమాదం’’ అని హెచ్చరిస్తారు శిష్యులు. ‘‘అయితే తప్పనిసరిగా ఈ అడవిలో నుంచే వెళ్లాలి’’ అంటాడు బుద్ధుడు. ‘‘ఎందుకు?’’ అని ఆందోళనగా అడుగుతారు శిష్యులు. ‘‘అతడు కోరుకున్నది జరుగుతుందో, నేను కోరుకున్నది జరుగుతుందో ఎవరు చెప్పగలరు?’’ అంటూ ఆ అడవి దారిలో నడవడం ప్రారంభిస్తాడు బుద్ధుడు. ఇంకొక్క వేలు దొరికితే తన లక్ష్యం పూర్తయిపోతుంది. ఇంకా ఎవరు దొరుకుతారా అని ఆశగా ఎదురుచూస్తున్న అంగుళిమాలకు బుద్ధుడు కనిపిస్తాడు. అంగుళిమాల ఆనందం కట్టలు తెచ్చుకుంటుంది. కత్తి పట్టుకుని పరుగెత్తుకుంటూ బుద్ధుడి దగ్గరికి వస్తాడు. బుద్ధుడి కళ్లలో ఎలాంటి భయమూ లేదు. ఎప్పటిలాగే ఆ కళ్లలో చల్లని వెన్నెల. ఏదో చేయాలనుకొని వచ్చిన అంగుళిమాల ఏమీ చేయలేకపోతాడు. బుద్ధుడి కళ్లు ‘మంచి దృష్టి’ గురించి చెబుతున్నాయి. శిరస్సు ‘మంచి సంకల్పం’ గురించి చెబుతుంది. పెదాలు ‘మంచి మాట’ గురించి చెబుతున్నాయి. ఆ భగవానుడి చుట్టూ ఉన్న దివ్యమైన వెలుగు...మంచి పని, మంచి జీవనవిధానం, మంచి ప్రయత్నం, మంచి మనస్సు, మంచి సమాధి నిష్ఠ గురించి చెబుతున్నాయి. అష్టాంగమార్గాన్ని అవగతం చేస్తున్నాయి. చెడు చేయాలని వచ్చిన వ్యక్తి తనలోని చెడును కూకటివేళ్లతో సహా పెకలించుకున్న సమయం అది. అణువణువూ ప్రమాదకరమైన చీకటిగా మారిన మనస్సులో వెలుగురేఖలు ఉదయించిన సమయం అది. ఏడుస్తూ బుద్ధుడి కాళ్ల మీద పడ్డాడు. ఆనాటి నుంచి బుద్ధభగవానుడి ప్రియశిష్యుడిగా అంగుళిమాల చరితార్థుడయ్యాడు. -
1580 ఏళ్ల కిందటే బుద్ధపూర్ణిమ!
బుద్ధపూర్ణిమ వేడుకలు తెలంగాణ ప్రాంతంలో వందల ఏళ్ల క్రితమే జరిగాయా? దాదాపు 1580 సంవత్సరాల క్రితం ఈ వేడుకలు జరిగినట్టు చూపెడుతున్న ఆధారాలు అవుననే అంటున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో వలిగొండ మండలం తుమ్మలగూడెం గ్రామ శివారులో ఉన్న రెండు పెద్ద గుండ్లపై బుద్ధుడు, ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధాచార్యుడైన ఆచార్య నాగార్జునుడి శిల్పముద్రలు లభించాయి. క్రీ.శ. 435వ సంవత్సరంలో గోవిందరాజు వర్మ అనే రాజు తన 37వ రాజ్యసంవత్సరంలో రూపొందించిన రాగిశాసనాల ఆధారంగా ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ ఈ ఆధారాలను వెలికితీశారు. ఈ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే అప్పుడే ఇక్కడ బుద్ధపూర్ణిమ వేడుకలు నిర్వహించారని తెలుస్తోంది. - సాక్షి ప్రతినిధి, నల్లగొండ చరిత్రలోకి వెళితే.. గోవిందవర్మరాజు తన 37వ రాజ్య సంవత్సరంలో వైశాఖపౌర్ణమి నాడు ఇంద్రపాలనగరం (తుమ్మలగూడెం శివారు)లో 14వ ఆర్యసంఘానికి చెందిన బౌద్ధ మతానుయాయుల సంక్షేమం కోసం అనుయాయుల అధ్యక్షుడు దశబలబలి అనే వ్యక్తికి పేణ్కపల, ఎన్మదల అనే గ్రామాలను దానం చేశాడు. బౌద్ధులుండే అక్కడి పరమమహా విహారాన్ని గోవిందరాజు భార్య పరమ భట్టారికా మహాదేవి నిర్మించారు. ఈ రెండు అంశాలు విష్ణుకుండి రాజుల రాగిశాసనాల్లో పేర్కొనబడి ఉన్నాయి. వలిగొండ మండలం తుమ్మలగూడెం గ్రామ శివార్లలోని రాయిపై బుద్ధుడి శిల్పాలు ఈ రెండు శాసనాలను 40 ఏళ్ల క్రితం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన ఆంజనేయులు ఇంట్లో ప్రముఖ తెలంగాణ చరిత్రకారుడు బి.ఎన్. శాస్త్రి సేకరించారు. ఆ రెండు శాసనాల్లోని మొదటి శాసనంలో పై అంశాలు పేర్కొనబడి ఉన్నాయి. అదే శాసనంలో బౌద్ధవిగ్రహాలకు ధూప, దీప, నైవేద్యాలు సమర్పించినట్టు కూడా ఉంది. తుమ్మలగూడెం సమీపంలోని శివాలయం ఇప్పుడేముంది.. ఈ శాసనాల ఆధారంగా ఇంద్రపాలనగరం, బౌద్ధ విగ్రహాల కోసం డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ పరిశోధన చేశారు. ఆయన పరిశోధనలో అక్కడ బౌద్ధవిగ్రహాలు ఉన్న మాట నిజమేనని, దాదాపు 1580 ఏళ్ల క్రితమే అక్కడ బుద్ధపూర్ణిమ నిర్వహించారని తేలింది. ‘సాక్షి’కి ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం.. హైదరాబాద్ నుంచి భువనగిరి, వలిగొండ మీదుగా 75 కిలోమీటర్లు ప్రయాణిస్తే తుమ్మలపల్లి (అప్పటి ఇంద్రపాలనగరం) వస్తుంది. అక్కడి నుంచి ఇప్పటికీ పూజింపబడుతున్న శివాలయాన్ని దాటి శంకర్‌గుట్ట, మూసీ వైపుగా అర ఫర్లాంగు దూరం నడిచిన తర్వాత 30 అడుగుల ఎత్తయిన మూడు గుండ్ల సముదాయం కనిపిస్తుంది. వాటిలో రెండు గుండ్ల మీద 15 అడుగుల ఎత్తున బుద్ధుడు ధ్యానముద్రలో కూర్చున్న శిల్పాలు, బౌద్ధాచార్యుల శిల్పాలు ఉన్నాయి. కాయోత్సర్గ భంగిమ (నిల్చుని)లో ఉన్న ఓ శిల్పం తలపై నాగపడగ ఉంది. ఈయన ప్రముఖ బౌద్ధాచార్యుడు ఆచార్య నాగార్జునుడని తెలుస్తోంది. ఇలాంటిదే మరో లోహ శిల్పం విష్ణుకుండి రాజుల మరో రాజధాని అయిన కీసరగుట్ట సమీపంలో చరిత్రకారుడు జితేందర్బాబుకి లభించింది. ఈ శిల్పాలు ఉత్తరభారతదేశంలోని సారనాథ్‌లో లభించిన శిల్పాలను పోలి ఉన్నాయి. తుమ్మలపల్లిలో లభించిన శిల్పాల్లో మరో బౌద్ధాచార్యుడు దిగ్నాగుని శిల్పం కూడా ఉందని చరిత్రకారులు భావిస్తున్నారు. ఇక్కడే దశబలబలి శిల్పం కూడా ఉంది. ఈ ధ్యానబౌద్ధులు, ఆచార్యుల శిల్పాలు తుమ్మలపల్లిలోనే ఉన్న పంచేశ్వరాలయం దాటాక గుట్ట ప్రారంభపు పైభాగంలో కూడా చెక్కబడడం గమనార్హం.