ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా రామచంద్రుడు
అనంతపురం లీగల్ : హైకోర్టు ఉత్తర్వుల మేరకు అనంతపురం ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా టి.రామచంద్రుడు, అబ్కారీ కేసుల ప్రత్యేక మేజిస్ట్రేటుగా బుజ్జప్ప భాధ్యతలు చేపట్టారు. కడప జిల్లాకు చెందిన రామచంద్రుడు గతంలో ధర్మవరం మేజిస్ట్రేటుగా,కర్నూలు జూనియర్ సివిల్ జడ్జిగా భాధ్యతలు నిర్వర్తించారు. అనంతపురం జ్యుడిషియల్ ఫస్టుక్లాసు మేజిస్ట్రేటుగా, జువెనైల్ జస్టిస్బోర్డు అధ్యక్షుడిగా బుజ్జప్ప పనిచేశారు.