Bus driver negligence
-
తాగొచ్చా..ఐతే ఏంటి?!
సాక్షి, మంత్రాలయం(కర్నూలు) : ‘ఔను..నేను తాగొచ్చా. ఐతే ఏంటి?! నన్నెవ్వరూ ఏమీ చేయలేరం’టూ ఓ ఆర్టీసీ డ్రైవర్ చిందులు తొక్కాడు. ఈ ఘటన సోమవారం రాత్రి మంత్రాలయంలో చోటుచేసుకుంది. ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోకు చెందిన ఏపీ21జడ్ 0772 నంబర్ గల బస్సు (సర్వీస్ నం 6513) సోమవారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్లేందుకు మంత్రాలయం చేరుకుంది. ఎమ్మిగనూరు డిపోలో బస్సు బయలుదేరే సమయంలో డ్రైవర్ కృష్ణకు బ్రీత్ ఎనలైజింగ్ టెస్టు చేసి పంపించారు. అయితే.. అతను మార్గమధ్యంలో మద్యం సేవించి బస్సును తీసుకుని మంత్రాలయం చేరుకున్నాడు. మంత్రాలయం నుంచి హైదరబాద్‌కు బస్సు బయలుదేరే సమయంలో మద్యం వాసన వస్తుండటంతో ప్రయాణికులు నిలదీశారు. మద్యం సేవించినట్లు అతను ఒప్పుకున్నాడు. ఈ విషయాన్ని ఎమ్మిగనూరు డీఎం దృష్టికి ప్రయాణికులు తీసుకెళ్లడంతో అతని స్థానంలో మరో డ్రైవర్‌ను పంపారు. కాగా..మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ కృష్ణ ప్రయాణికులతో దురుసుగా మాట్లాడాడు. -
తాగి వాహనం నడిపిన బస్సు డ్రైవర్‌కు జైలు శిక్ష
-
మద్యం తాగి బస్సు నడిపాడని..
సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యల వల్ల గత మూడేళ్లలో రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అనేక హెచ్చరికలు చేసినా ప్రమాదాలు మాత్రం జరుగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మద్యం తాగి వాహనం నడిపిన బస్సు డ్రైవర్‌కు జైలు శిక్ష పడింది. ఈ ఘటన కృష్ణాజిల్లా నందిగామలో విధులు నిర్వర్తిస్తున్న బస్సు డ్రైవర్ గా విధులు నిర్వర్తిస్తున్న మేక బుజ్జికి జైలు శిక్షతో పాటు అతడి డ్రైవర్ లైసెన్స్ సైతం రద్దు చేయాలని నందిగామ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆకుల సత్యనారాయణ అదేశాలు జారీ చేశారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : తాగి వాహనం నడిపిన బస్సు డ్రైవర్‌కు జైలు శిక్ష -
విద్యార్థిని బలిగొన్న స్కూల్ బస్సు
మొయినాబాద్ (చేవెళ్ల): ఉదయం ఇంట్లోంచి పాఠశాలకు వెళ్లేటప్పుడు అమ్మా టాటా అంటూ నవ్వుతూ చెప్పి వెళ్లిన బాలుడు మధ్యాహ్నానికి ఇంటి ముందే విగతజీవిగా మారాడు. స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి బలయ్యాడు. బస్సు కింద పడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే గారాబంగా గోరుముద్దలు తినిపించాలనుకున్న ఆ తల్లికి తీరని శోకం మిగిల్చాడు. ఈ హృదయవిదారకమైన సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎనికేపల్లిలో శనివారం మధ్యాహ్నం జరిగింది. హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్ ప్రాంతానికి చెందిన బసవాని సునీల్, భాగ్యలక్ష్మి దంపతులు నాలుగు సంవత్సరాల క్రితం బతుకు దెరువుకోసం మొయినాబాద్ మండలం ఎనికేపల్లి గ్రామానికి వలస వచ్చారు. తమ ముగ్గురు కొడుకులతో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. సునీల్ గ్రామ సమీపంలోని సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. సునీల్ పెద్ద కుమారుడు వరుణ్ (9) చిలుకూరులోని ఓ పాఠశాలలో స్కూల్లో 3వ తరగతి చదువుతున్నాడు. రోజూలాగానే శనివారం ఉదయం స్కూల్ బస్సులో వెళ్లాడు. శనివారం హాఫ్‌డే కావడంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో స్కూల్ బస్సులో ఇంటికి వచ్చాడు. ఇంటి ముందు బస్సు ఆగడంతో బస్సులోంచి దిగి రోడ్డు దాటేందుకు బస్సు ముందుకు వెళ్లాడు. బాలుడిని గమనించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు నడపడంతో బాలుడు సిమెంటు రోడ్డుపై పడిపోయాడు. బస్సు ముందు చక్రం అతని తలపై నుంచి పోవడంతో తలపగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వారు పెద్దగా అరవడంతో బస్సును అక్కడే నిలిపేశాడు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. ఉదయం కొడుకు చెప్పిన మాటలను తలుచుకుంటూ తల్లి రోదించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. పాఠశాల యాజమాన్యం బాలుడి కుటుంబానికి న్యాయం చేసే వరకు బాలుడి మృతదేహాన్ని కదలనిచ్చేది లేదని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు బాలుడి కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చి మృతదేహాన్ని అక్కడి నుంచి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బస్సును మొయినాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి విద్యార్థిని బలి
విజయవాడ : బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో కళాశాల విద్యార్థిని మృతి చెందిన సంఘటన మాచవరం పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగ్గయ్యపేట సమీపంలోని పెంటెలవారిగూడెం ప్రాంతానికి చెందిన రావూరి జ్యోత్స్న (21) నగరంలోని లయోలా కళాశాలలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుతోంది. మొగల్రాజపురం సిద్ధార్థ అకాడమీ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ప్రతిరోజు కళాశాలకు రాకపోకలు సాగిస్తోంది. గురువారం ఉదయం జ్యోత్స్న ఏపీ11జెడ్ 6411 నంబరు గల ఆర్టీసీ బస్సు ఎక్కి కాలేజీ గేటు వద్ద దిగుతుండగా డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు పోనిచ్చాడు. దీంతో బస్సు ముందు టైరు కింద పడి తీవ్రంగా గాయపడింది. తీవ్రంగా గాయపడిన ఆమెను తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. మృత్యువుతో పోరాటం బస్సుకింద పడిన జ్యోత్స్న శరీరంలో సగభాగం పూర్తిగా చిధ్రమైంది. రోజంతా మృత్యువుతో పోరాడి శుక్రవారం ఉదయం మృతి చెందింది. దీంతో విద్యార్థులు, స్నేహితులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. వైద్యం చేస్తున్నంత సేపట్లో దాదాపు 32 బ్లడ్ బాటిల్స్ తెప్పించిన వైద్యులు జ్యోత్స్నను బతికించడంలో విఫలమయ్యారని స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని ఆందోళన పేద కుటుంబానికి చెందిన జ్యోత్స్న తండ్రి రామారావు వ్యవసాయం చేస్తారని బంధువులు తెలిపారు. ఆమె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ విద్యార్థులు పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఆర్టీసీ అధికారులు ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రైవర్ పొన్నపల్లి సతీష్‌కుమార్‌ను అరెస్టు చేశారు. పంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
నేపాల్‌లో ఘోర బస్సు ప్రమాదం
18 మంది భారతీయ యాత్రికుల దుర్మరణం కఠ్మాండు: ఓ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం సుమారు 18 మంది ప్రయాణికుల ప్రాణాలను హరించడమే కాకుండా మరో 53 మంది ప్రయాణికులు తీవ్రగాయాల పాలయ్యేలా చేసింది. బస్సు నడుపుతున్న డ్రైవర్ తన సెల్ ఫోన్ నుంచి ఫోన్ చేసేందుకు యత్నిస్తున్న సమయంలో బస్సు అదుపుతప్పి సమీపంలోని నదిలోకి దూసుకుపోయింది. ఈ ఘోర దుర్ఘటన నేపాల్‌లోని ప్యూథాన్ జిల్లాలో సోమవారం రాత్రి జరిగింది. మృతి చెందిన ప్రయాణికులు అందరూ భారత్‌కు చెందిన వారే. నేపాల్‌లోని పవిత్ర స్వర్గద్వార్‌ను దర్శించుకున్న యాత్రికులు తిరుగు ప్రయాణంలో ఈ బస్సు ఎక్కారు. డ్రైవర్ సెల్ ఫోన్‌ను వినియోగించేందుకు యత్నించిన సమయంలో బస్సు అదుపుతప్పి దాదాపు 100 మీటర్ల మేర దొర్లుకుంటూ మాది ఖోలా నదిలో పడిపోయింది. బస్సులోని 15 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురు ఆస్పత్రిలో మృతి చెందారు. చనిపోయిన భారత పౌరుల్లో ఎక్కువ మంది యూపీ వాసులని అధికారులు తెలిపారు.