calculations
-
పశుపక్ష్యాదులకూ లెక్కలు తెలుసు!
సంగీత జ్ఞానం అని ఒక మాట ఉంది. భక్తి లేకుండా సంగీత జ్ఞానం లేదు అంటాడు త్యాగరాజు. ఆ సంగతి పక్కన పెడితే స్వరజ్ఞానం, తాళజ్ఞానం అని సంగీతంలో రెండు భాగాలు. ఇక అక్షరజ్ఞానం అని మరొక మాట ఉంది. అంటే చదవడం, రాయడం రావడం అన్నమాట. మరి అంకెల మాట ఏమిటి? అందరికీ ఏదో ఒక రకంగా లెక్కపెట్టడం తెలిసే ఉంటుంది. చివరకు పిల్లలకు కూడా పంపకంలో తమకు అన్యాయం జరిగిన సంగతి అర్థం అవుతుంది. ఈ రకంగా మొత్తం మీద అందరికీ అంకెల గురించిన తెలివి ఉంటుంది. అది అనుకోకుండానే వస్తుంది. మనిషి మెదడుకు అంకెలు అర్థమవుతాయి, వాటి మధ్యన లంకె తెలుస్తుంది. అయితే ఈ జ్ఞానం ఉన్నది ఒక్క మనుషులకే కాదు అంటున్నారు. చీమల నుంచి మొదలు తేనెటీగల దాకా ఇంకా పైజాతి జంతువుల వరకు అన్నింటికీ అంకెల గురించి తెలుసు అంటున్నారు. కోతులు, సాలెపురుగులు కూడా కొన్ని అంకెలనైనా తెలుసుకుంటాయి అంటారు పరిశోధకులు. తేనెటీగలు బయలుదేరి తేనె సేకరణ కోసం తిరుగుతూ ఏ ప్రాంతంలో ఎక్కువ పువ్వులు ఉన్నదీ సులభంగా అర్థం చేసుకుంటాయి. కోతులకు ఏ చెట్టు మీద పండ్లు ఎక్కువ ఉన్నాయీ తెలుస్తుంది. ఎదుటి గుంపు గర్జనలను గుర్తించి క్రూర మృగాలు శత్రువుల సంఖ్యను తెలుసుకుంటాయి. జంతువులన్నీ ఆ రకంగా విషయాలు తెలుసుకుంటే గాని వాటి బతుకు సులభంగా సాగదు అంటారు ఆండ్రియాస్ నీడర్. ఆయన జర్మనీలోని ‘ట్యూబింజెన్’ విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నారు. సంఖ్యను గుర్తించే ఈ వెసులుబాటు జంతు జాతుల చరిత్రలో అత్యంత ప్రారంభ కాలంలోనే మొదలైంది అంటున్నారు పరిశోధకులు. అయితే మరి కొత్తగా ఈ సంగతిని గురించి ఎందుకు పట్టించుకోవాలి అన్నది ప్రశ్న. ఒక్కసారి చూచి గుర్తుంచుకోగలిగిన అంకెల విషయంలో మనుషులకు పరిమితులు ఉన్నట్టు పరిశోధకులు గమనించారు. నాలుగు వరకు మాత్రమే సులభంగా గుర్తుంటాయి అంటున్నారు. ఒకచోట నాలుగు పుస్తకాలు ఉంటే సులభంగా గుర్తించగలుగుతాం. అంతకన్నా ఎక్కువగా ఉంటే లెక్కపెట్టవలసి వస్తుంది. ఏ విషయంలో అయినా ఇదే పరిమితి. ఇందులో కూడా రెండు అంచెలు ఉంటాయి. ముందు సంఖ్య నిర్ణయం అవుతుంది. ఆ తరువాత ఆ సంఖ్య సరైనదేనా అని లెక్క తేలుతుంది. క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో పెట్రో పినైరో షాగాస్ ఈ విషయంలో ఆసక్తికరమైన అంశాలను తెలియజేశారు. ఇక ఏ అంకె లేకుండా... అంటే సున్నా అన్న భావన ఉన్నచోట కూడా లెక్కింపు అవసరమే అంటున్నారు. అసలు అంకెలు అన్నింటిలోకి సున్నా అన్నది చాలా గొప్పది అంటారు నీడర్. చిన్న చిన్న అంకెలు నేర్చుకున్న తర్వాత కూడా సున్నా అనే భావన నేర్చుకోవడానికి చిన్నపిల్లలకు కొంతకాలం పడుతుంది అని పరిశోధకులు గమనించారు. ఏదో ఉంది అని చెప్పడం, వాటిని లెక్కించడం వింతగా తోచదు కానీ ఏమీ లేని చోట సున్నా అన్న భావన రావడం గొప్ప విషయం. నీడర్ బృందం వారు తమ పరిశోధన ద్వారా కోతులు, తేనెటీగలు, కాకులకు కూడా ‘0’ అన్న విషయం తెలుసునని కనుగొన్నారు. ఈ అంశం గురించి కొంత కాలం క్రితమే ‘క్వాంటా’ అనే పరిశోధన పత్రికలో వ్యాసాలు వచ్చాయి. చాలావరకు జంతువులు, లేదంటే జంతువులు అన్నింటికీ సంఖ్యాజ్ఞానం ఉంది అని సులభంగానే తెలుస్తుంది కానీ దానికి పరిమితి ఎక్కడ అన్న ప్రశ్న చిత్రమైనది. ఆస్ట్రేలియాలోని డికెన్స్ యూనివర్సిటీలో కృషి చేస్తున్న స్కార్లెట్ హోవర్డ్ ఈ అంశం గురించి పరిశోధిస్తున్నారు. జంతువు అంకెల పరిమితి మనం ఇంతకుముందు అనుకున్న ప్రకారం కాక మరీ ఎక్కువగా ఉందని కనుగొన్నారు. సున్నా అంటే ఒకటి కన్నా తక్కువ అని తెలుసునట. వాటికి కూడికలు, గుణకారాలు కూడా తెలుసునట. నిజానికి మనిషి పరిణామం చాలా కాలం తర్వాత జరిగింది. మనిషికి కూడా ఈ లెక్కలన్నీ తెలిశాయి. ఇది మొత్తం ప్రాణి ప్రపంచంలోనే ఉన్న విషయం అని పరిశోధకులకు తెలిసింది. మనుషులు ఒకసారి చూచినా, విన్నా ఎనిమిది అంకెల వరకు సులభంగా గుర్తించగలుగుతారని కొంత కాలం క్రితమే తెలుసు. ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ నంబర్లు 10 అంకెలు ఉంటాయి. కనుక వాటిని ఒకసారి విని గుర్తుంచుకోవడం కష్టం అవుతున్నదట. కొంతకాలం క్రితం ఫోన్ నంబర్లలో 8 కన్నా తక్కువ అంకెలు ఉండేవి. అప్పట్లో సులభంగా గుర్తుండేవట!ఇటువంటి విషయాలను గురించి మనం సాధారణంగా ఆలోచించం. అది సైంటిస్టుల పని అనుకుంటాం. నిజానికి ఈ విషయాలు అందరికీ సంబంధించినవి మరి!కె.బి.గోపాలం వ్యాసకర్త సైన్స్ అంశాల రచయిత -
ముందే రిటైర్మెంటా.. 20 ప్లస్‌లో ఆరంభిస్తే సాధ్యమే
నేటి తరం యువత 60 ఏళ్లు వచ్చే వరకు కష్టపడాలని అనుకోవడం లేదు. కెరీర్‌ను ముందుగానే ముగించాలని కోరుకుంటోంది. ముందస్తు రిటైర్మెంట్ ఆకాంక్ష క్రమంగా విస్తరిస్తోంది. ముందుగా రిటైర్ అయితే, అప్పటి నుంచి తమ అభిరుచులకు అనుగుణంగా స్వేచ్ఛగా జీవించొచ్చనే కాన్సెప్ట్ ఆదరణకు నోచుకుంటోంది. తోటి వారిని చూసి దీనికి ఆకర్షితులయ్యే వారూ ఉంటున్నారు. కానీ, ఇది ఎలా సాధ్యం? ఇదే ఎక్కువ మందికి ఎదురయ్యే ప్రశ్న. దీనిపై స్పష్టత తెచ్చుకోలేక, తర్వాత చూద్దాంలే.. అని అనుకుని కెరీర్లో సాగిపోయేవారూ ఉన్నారు. ఉద్యోగ, వృత్తి బాధ్యతలకు ముందస్తుగా విరమణ పలికి, నచ్చినట్టు జీవించడం అంటే వినడానికి ఎంతో ఆకర్షణీయంగా అనిపించొచ్చు. కానీ, దీన్ని చేరుకోవాలంటే సరైన లెక్కలు, ప్రణాళికలు కావాలి. వాటిని ఆచరణలో పెట్టినప్పుడు లక్ష్యం సఫలమవుతుంది. ఇందుకు ఏం చేయవచ్చన్నది అవగాహన కల్పించే కథనం ఇది. రిటైర్మెంట్ అన్నది అన్నింటిలోకి చివరి లక్ష్యం అవుతుంది. దీనికంటే ముందు జీవితంలో నెరవేర్చాల్సిన, సాధించాల్సిన లక్ష్యాలు ఎన్నో ఉంటాయి. ఉదాహరణకు పిల్లల విద్య, వివాహాలు, సొంతిల్లు తదితరాలు. వీటిని సాధించేందుకు సరైన దిశలోనే అడుగులు వేస్తున్నారా? రిటైర్మెంట్ కంటే ముందుగా ఎదురయ్యే లక్ష్యాలకు సంబంధించి కచ్చితమైన ప్రణాళిక అవసరం. వీటిని చేరుకునేందుకు కావాల్సినంత, సరైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఒక్కసారి పరిశీలించుకోవాలి. లేకపోతే జీవితంలో అత్యంత ముఖ్యమైన లక్ష్యాల విషయంలో ఏ మాత్రం లెక్కలు తప్పినా, రిటైర్మెంట్ లక్ష్యం విషయంలో రాజీ పడాల్సి రావచ్చు. ఎవరైనా కానీ, ముందుగా ఎదురుపడే అవసరం గురించే ఆలోచిస్తారు. అందుకే ముందే రిటైర్మెంట్ తీసుకోవాలంటే, దానికంటే ముందు ఎదురయ్యే వాటి గురించి కూడా ప్రణాళిక వేసుకోవాలి. జీవితంలో కీలకమైన లక్ష్యాలు సాధించలేకపోతే రిటైర్మెంట్ సాధ్యం కాదన్న సూక్ష్మాన్ని గుర్తించాలి. ‘‘సురక్షితమైన భవిష్యత్తుకు కావాల్సిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత మీ జీవన శైలి పదవీ విరమణ తర్వాత దిగజారిపోకూడదు. వైద్య చికిత్సలకు అవసరమైనంత నిధి ఉండాలి. పిల్లల విద్య, వారి వివాహాలు, కారు కొనుగోలు, సెలవుల్లో పర్యటనలు వీటన్నింటికీ ఏర్పాట్లు ఉండాలి’’అని హమ్ ఫౌజీ సీఈవో సంజీవ్ గోవిలా సూచించారు. ఎంత కావాలి..? విశ్రాంత జీవనం కోసం సమకూర్చుకోవాల్సిన నిధి విషయంలో ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. లేదంటే సమకూర్చుకున్న నిధి ఏ మూలకూ చాలకపోవచ్చు. అదే జరిగితే పేరుకే రిటైర్మెంట్ అవుతుంది. ఆ తర్వాత ఖర్చులకు చాలక మళ్లీ ఏదో ఒక ఉపాధి వెతుక్కోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నట్టు అవుతుంది. అందుకుని రిటైర్మెంట్ కోసం కావాల్సిన నిధిని పక్కా అంచనా వేయాలి. ఈ విషయంలో నిపుణుల సాయం ఎంతో అవసరం పడుతుంది. రిటైర్మెంట్కు సంబంధించి కావాల్సిన నిధిని అంచనా వేయడం అత్యంత ముఖ్యమైనదని రైట్ హారిజాన్స్ ఫండ్ మేనేజర్ అనిల్ రెగో పేర్కొన్నారు. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం నెలవారీ ఖర్చులు రూ.25,000 ఉన్నాయని అనుకుందాం. అతడు ఏ వయసులో రిటైర్ అయితే ఆ తర్వాత జీవనానికి ఎంత మొత్తం కావాలన్నది ఇక్కడి పట్టికలో చూడొచ్చు. ప్రస్తుత నెలవారీ వ్యయాలకు ఏటా సగటున 5 శాతం ద్రవ్యోల్బణం ప్రభావం పరిగణనలోకి తీసుకుని రిటైరయ్యే నాటికి ఎంత కావాలో వేసిన అంచనాలు ఇవి. పట్టికలోని నెలవారీ పెట్టుబడిని ఏడాదికోసారి 8 శాతం పెంచుతూ వెళ్లాలి. పెట్టుబడిపై ఏటా 10 శాతం రాబడి వస్తుందన్న అంచనా. రిటైర్మెంట్ నాటికి సమకూరిన ఫండ్‌పై ఆ తర్వాత ఏటా 7 శాతం రాబడి వస్తుందని అనుకుంటే, ఇంత మొత్తం సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అవసరాలు వేర్వేరు.. రిటైర్మెంట్కు తక్కువ వ్యవధి ఉన్నప్పుడు నెలవారీ పెట్టుబడికి ఎక్కువ మొత్తం అవసరపడుతుంది. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన జీవనశైలి, అవసరాలు, ఖర్చులు ఉంటుంటాయి. కనుక నెలవారీ ఎంత మొత్తం, ఏడాదికి ఎంత చొప్పున కావాలన్నది ఎవరికి వారు అంచనాకు రావాలి. ఏడాదికి తమ ఖర్చులు, తమ ఆరోగ్య అవసరాలు, ఆరోగ్య బీమా, జీవిత బీమా ఉన్నాయా? పిల్లలు ఎంత మంది? వారికి ఏ స్థాయి ఖర్చులో విద్య చెప్పించాలని అనుకుంటున్నారు? సొంతింటి ప్రణాళిక, వాహనం ఇత్యాది అవసరాలన్నింటినీ ఒక జాబితాగా రాసుకోవాలి. ఆ తర్వాత ఆర్థిక సలహాదారు లేదంటే పెట్టుబడి సలహాదారును సంప్రదించాలి. వారు అన్నింటినీ సమగ్రంగా పరిశీలించి, నెలవారీగా దేనికి ఎంత మొత్తం పొదుపు, మదుపు చేయాలి, ఏ సాధనాలను ఎంపిక చేసుకోవాలి? అనేది ఒక ప్రణాళిక రూపొందించి ఇస్తారు. దీనికోసం ద్రవ్యోల్బణం, జీవిత కాలం తదితర అంశాలను వారు విశ్లేషిస్తారు. వారిచ్చిన ప్రణాళిక ప్రకారం సాగిపోవాలి. 30 ఏళ్ల వ్యక్తి నెలవారీ ఖర్చులు రూ.30,000 ఉన్నాయని అనుకుంటే ఏ వయసులో రిటైర్మెంట్ అయితే ఎంత మొత్తం కావాలో ఇక్కడి టేబుల్లో చూడొచ్చు. పైన టేబుల్ మాదిరే జీవిత కాలం 90 ఏళ్లకు అనుకుని, ఏటా పెట్టుబడిపై 10 శాతం రాబడి అంచనా ప్రకారం, ఏటా పెట్టుబడి 8 శాతం పెంచుతూ వెళ్లే విధంగా, రిటైర్మెంట్ తర్వాత 7 శాతం రాబడి కోసం సమకూర్చుకోవాల్సిన నిధి అంచనాలు ఇవి. అప్రమత్తత రిటైర్మెంట్కు మరో ఐదేళ్లు ఉందనగా పెట్టుబడుల విషయంలో అప్రమత్తం కావాలి. ఈక్విటీలకు అధిక కేటాయింపులు చేసుకునే వారు మార్కెట్ సైకిల్‌ను పరిగణనలోకి తీసుకుని, అందుకు అనుగుణమైన వ్యూహాన్ని అమల్లో పెట్టాలి. ఉదాహరణకు 2008 మార్కెట్ పతనం, 2020 మార్కెట్ పతనం గుర్తుండే ఉంటాయి. 2020 మార్కెట్ పతనం తర్వాత స్టాక్స్ రికవరీకి ఏడాది సమయం పట్టింది. కొన్ని స్టాక్స్ పూర్తిగా కోలుకుని కొత్త గరిష్టాలకు చేరుకుంటే, కొన్ని ఆలస్యంగా రికవరీ అయ్యాయి. అందుకుని రిటైర్మెంట్కు మరో మూడు–ఐదేళ్లు ఉందనగా, మార్కెట్ సైకిల్‌ను అర్థం చేసుకోవాలి. భారీ దిద్దుబాటు వచ్చి దిద్దుబాటు వచ్చి చాలా ఏళ్లు అయ్యిందా? మార్కెట్ల వ్యాల్యూషన్లు జీవిత కాల గరిష్ట స్థాయిల్లో చలిస్తున్నాయా? ఇలాంటి అంశాలపై నిపుణుల సాయంతో అంచనాకు రావాలి. మూడు ఐదేళ్ల ముందు నుంచి ఏటా నిర్ణీత శాతం చొప్పున ఈక్విటీ పెట్టుబడులను ఉపసంహరించుకుంటూ డెట్ సాధనాల్లోకి మళ్లించుకోవాలి. రిటైర్మెంట్ తర్వాత కూడా ఈక్విటీల్లో కొంత మేర పెట్టుబడులు అవసరంపడతాయి. ఎందుకంటే ముందుగా రిటైర్మెంట్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత కనీసం 25 ఏళ్ల నుంచి 35–40 ఏళ్ల పాటు జీవించి ఉండే వారికి ఈక్విటీలు తప్పనిసరి. అప్పుడే కార్పస్ కరిగిపోకుండా ఉంటుంది. అందుకుని నిపుణులు సూచించిన మేర ఈక్విటీల్లో పెట్టుబడులు కొనసాగించి, మిగిలిన మొత్తాన్ని క్రమంగా వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ ఊహించని విధంగా రిటైర్మెంట్ నాటికి మార్కెట్లు భారీ దిద్దుబాటుకు గురైతే అప్పుడు రిటైర్మెంట్ లక్ష్యాన్ని ఏడాది నుంచి మూడేళ్ల పాటు వాయిదా వేసుకోవాల్సి రావచ్చు. అందుకుని సాధ్యమైన మేర లక్ష్యం వాయిదా పడకూడదంటే ముందస్తు జాగ్రత్తలు తప్పదు. అవరోధాలు.. ముందుగా పదవీ విమరణ తీసుకునే వారికి సంపాదించే కాలం ఇతరులతో పోలిస్తే తక్కువ ఉంటుంది. ఉదాహరణకు 30 ఏళ్ల కాలంలో సమకూర్చుకోవాల్సినంత 20–25 ఏళ్లకే సాధించాలి. రిటైర్మెంట్ తర్వాత ఇతరులపై ఆధారపడకూడదు. పైగా ముందస్తు రిటైర్మెంట్ అంటే ఉదాహరణకు 55 ఏళ్లకు రిటైర్మెంట్ తీసుకుంటారని అనుకుందాం. అక్కడి నుంచి కనీసం 80 ఏళ్ల వరకు జీవించి ఉంటారని అనుకుంటే, 35 ఏళ్ల కాలానికి అవసరాలు తీర్చేంత ఫండ్ కావాలి. 25–30 ఏళ్లకు కెరీర్ ఆరంభిస్తే.. అక్కడి నుంచి ముందస్తు రిటైర్మెంట్కు 30–25 ఏళ్లే మిగిలి ఉంటుంది. తక్కువ కాలంలో ఎక్కువ కాలానికి ఫండింగ్ ఏర్పాటు చేసుకోవడం అంటే సాధారణ విషయం కాదన్నది గుర్తుంచుకోవాలి. క్రమశిక్షణతో, ఎటువంటి దుబారాకు చోటు ఇవ్వకుండా సంపాదనలో అధిక భాగం భవిష్యత్తుకు పొదుపు చేసుకున్నప్పుడు లక్ష్యం సాకారం అవుతుంది. ఉదాహరణకు పిల్లల విద్య కోసం బడ్జెట్ వేసుకుంటే, ఆ బడ్జెట్ మించకుండా దాన్ని అధిగమించాలి. లేదంటే వేరే లక్ష్యం కోసం ఉద్దేశించిన మొత్తం నుంచి దానికి సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు గొలుసుకట్టు మాదిరి ఒకదాని కోసం మరో లక్ష్యం విషయంలో రాజీపడాల్సి వస్తుంది. లేదంటే రుణం తప్పదు. రాబడి రేటు కీలకం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ రూపంలో (సిప్) ఇన్వెస్ట్ చేసినప్పుడు దీర్ఘకాలంలో మెరుగైన రాబడులు అందుకోవచ్చని చారిత్రక గణాంకాలు తెలియజేస్తున్నాయి. అలాగే, పెట్టుబడుల విధానంలో చిన్న మార్పుతోనూ మెరుగైన నిధిని సమకూర్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మనకు ఏటా ఆదాయం ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది. ఇలా పెరిగే మొత్తానికి అనుగుణంగా సిప్ పెట్టుబడినీ పెంచుకుంటూ వెళ్లాలి. ఏడాదికోసారి ఆర్జన పెరిగినప్పుడు పెట్టుబడిని పెంచుకోవడం ఏమంత పెద్ద కష్టం కాదు. ఖర్చులు కూడా ద్రవ్యోల్బణ ప్రభావంతో ఏటా పెరుగుతూ ఉంటాయి. ఖర్చులు పెరిగాయని పెట్టుబడుల విషయంలో రాజీ పడితే లక్ష్యం సాకారం కాదు. అనవసర ఖర్చులను తగ్గించుకుని అయినా అనుకున్న మేర, ప్రణాళిక మేరకు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లాలి. ఏటా ఆదాయం అనుకున్న మేర పెరగకపోతే ఎలా? దీనికి సంబంధించి కూడా ప్లాన్–బి రెడీ చేసుకుని పెట్టుకోవాలి. భవిష్యత్తు పెట్టుబడుల కోసం ప్రస్తుత జీవనశైలిలో పూర్తి రాజీ పడకూడదన్నది ఆర్థిక సలహాదారుల సూచన. రెండింటినీ సమన్వయం చేసుకునే విధంగా ఆచరణ ఉండాలి. అలాగే, ఏటా పెట్టుబడిని పెంచడం ఒక్కటి కాకుండా, పెట్టుబడి సాధనాల మధ్య సమతూకం కూడా ఉండాలి. అధిక రాబడులను ఇచ్చే ఈక్విటీలకు తప్పకుండా చోటు ఉండాల్సిందే. పెట్టుబడులకు కనీసం 20 ఏళ్లు అంతకుమించి కాలం ఉంటే అగ్రెస్సివ్ ప్రణాళిక వేసుకోవచ్చు. ఈక్విటీలకు 75 శాతం నుంచి 100 శాతం వరకు కేటాయింపులు చేసుకోవచ్చు. ఎన్పీఎస్ ప్లాన్‌లోనూ 75 శాతం ఈక్విటీ పెట్టుబడులకు ఆప్షన్ ఉంది. ఎంత ఎక్కువ కాలం ఉంటే కాంపౌండింగ్ వల్ల అంత పెద్ద మొత్తం సమకూరుతుంది. రిటైర్మెంట్కు సంబంధించి అధిక రిస్క్ తీసుకునే వారికి సాధారణంగా 70–80 శాతం ఈక్విటీలు, మిగిలిన 20 శాతం మేర స్థిరాదాయ (డెట్) పథకాలను నిపుణులు సూచిస్తుంటారు. నిజానికి చాలా మంది విషయంలో గమనిస్తే అన్నింటికంటే ఆలస్యంగా మొదలు పెట్టేది రిటైర్మెంట్ కోసమే అవుతోంది. ఎక్కువ మంది చేసే పెద్ద తప్పిదం ఇదే. ఆర్జన మొదలైన మొదటి నెల నుంచే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్మెంట్ ఆరంభించిన వారు చాలా సులభంగా కావాల్సిన నిధిని సమకూర్చుకోగలరు. అంతేకాదు, కాంపౌండింగ్ పవర్‌తో ముందస్తు రిటైర్మెంట్ వీరికి చాలా సులభం అవుతుంది. ఆలస్యం చేసే కొద్దీ ఈ లక్ష్యం భారంగా మారుతుంది. రిస్క్‌లు–రక్షణ ముందస్తు రిటైర్మెంట్ లక్ష్యం పెట్టుకున్న వారు రుణాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. రుణాలు తీసుకున్నా, రిటైర్మెంట్ పెట్టుబడుల ప్రణాళికకు అవరోధంగా లేకుండా ఉండాలి. రిటైర్మెంట్ నాటికి తీర్చేలా ఉండాలి. మరీ ముఖ్యంగా ముందస్తు రిటైర్మెంట్ తీసుకునే వారు ఉద్యోగం భద్రత అంశాన్ని తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి. కరోనా సంక్షోభ సమయంలో ఎంతో మంది ఉపాధిని కోల్పోయారు. రుణాలపై మారటోరియం ఆప్షన్ తీసుకున్న వారు ఎందరో ఉన్నారు. ఇలాంటి ఊహించని పరిణామాలు ఎదురైతే ప్రణాళిక వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ విధమైన రిస్క్‌లను ఎదుర్కొనే ప్రణాళిక కూడా కావాలి. అలాగే, రోడ్డు ప్రమాదంలో గాయపడి వైకల్యం పాలై ఆర్జన ఆగిపోయే పరిస్థితి వస్తే..? అనుకున్నదంతా తలకిందులైపోతుంది. దీనికి సంబంధించి బీమా కవరేజీ తప్పకుండా తీసుకోవాలి. అలాగే, మనకు ఏదైనా అనుకోనిది జరిగితే కుటుంబాన్ని ఆదుకునే జీవిత బీమా, ఆస్పత్రిలో వైద్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ తప్పకుండా తీసుకోవాలి. వృద్ధాప్యంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకుని చాలా ముందుగానే హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. ----------------------------------------------------------------------------------------------------------------------------- గమనిక: ఇక్కడ పట్టికల్లో ఇచ్చిన అంచనాలు అన్నీ కూడా పెట్టుబడిపై ఏటా 10 శాతం రాబడి ప్రకారం వేసిన అంచనాలు. కానీ, ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాలంలో 12 శాతం వార్షిక రాబడి సాధ్యమే. కనుక ఆ ప్రకారం చూస్తే చేయాల్సిన నెలావారీ పెట్టుబడి 10 శాతం తక్కువైనా అనుకున్న కార్పస్‌ను సమకూర్చుకోవడం సాధ్యపడుతుంది. -
ఫైనల్ చేరాలంటే టీమిండియా లెక్కలేంటి..?
-
శ్రీశైలం–సాగర్ మధ్యలో కృష్ణమ్మ మాయం!
సాక్షి, అమరావతి: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ మధ్య కృష్ణా నదిలో ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆగస్టు 11వతేదీ మధ్య ఏకంగా 55.36 టీఎంసీలు మాయమయ్యాయి! ఆ నీటిని ఏ ఇంద్రజాలికుడూ అదృశ్యం చేయలేదు. మరి అన్ని జలాలు హఠాత్తుగా ఏమయ్యాయి..? ఎగువ నుంచి నాగార్జునసాగర్‌కు చేరిన నీటిని సాగర్ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీల ద్వారా తెలంగాణ సర్కార్ దారి మళ్లించేసింది. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ సర్కారు తప్పుడు నీటి లెక్కలు చెబుతోందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రవాహాలు ఏమయ్యాయి..? శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం కనీస స్థాయికి దిగువన ఉన్నప్పటికీ ప్రాజెక్టు నిర్వహణ ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కుతూ, కృష్ణా బోర్డు ఉత్తర్వులను బేఖాతర్ చేస్తూ గత జూన్ 1వతేదీన తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. ఎగువ నుంచి భారీ ఎత్తున వరద ప్రవాహం రావడం వల్ల శ్రీశైలంలో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరడంతో గత నెల 28న గేట్లు ఎత్తివేసి దిగువకు ప్రవాహాన్ని విడుదల చేస్తున్నారు. జూన్ 1 నుంచి ఆగస్టు 11 వరకు శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా 11,21,506 క్యూసెక్కులను తెలంగాణ సర్కార్ దిగువకు తరలించేసింది. మరోవైపు గత నెల 27 నుంచి బుధవారం వరకూ కుడి గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ ఏపీ ప్రభుత్వం 4,70,117 క్యూసెక్కులను దిగువకు వదిలేసింది. ఇక గత నెల 28 నుంచి బుధవారం వరకూ స్పిల్ వే గేట్ల ద్వారా 25,48,229 క్యూసెక్కులను దిగువకు వదిలేశారు. అంటే కుడి, ఎడమ గట్టు విద్యుత్కేంద్రాలు, స్పిల్ వే గేట్ల ద్వారా దిగువకు 41,39,852 క్యూసెక్కులు (357.70 టీఎంసీలు) శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు విడుదల చేశారు. అయితే ఇందులో 34,99,204 క్యూసెక్కులు (302.34 టీఎంసీలు) మాత్రమే నాగార్జునసాగర్‌కు చేరాయని తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు లెక్కలు చెబుతున్నారు. మరి శ్రీశైలం, సాగర్ మధ్యన కృష్ణా నదిలో 6,40,648 క్యూసెక్కులు (55.36 టీఎంసీలు) ఏమయ్యాయన్న అంశంపై తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు నోరుమెదపడం లేదు. వాటిని లెక్కలోకి తీసుకున్నా... శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జునసాగర్ మధ్య కృష్ణా నది పొడవు సుమారు 73 కి.మీ. ఉంటుంది. ప్రవాహం రూపంలో, నదీ గర్భంలో భూగర్భ జలాల రూపంలో రెండు మూడు టీఎంసీలకు మించి ఉండే అవకాశం లేదని నీటిపారుదల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన దాదాపు 52 టీఎంసీలు మాయమైనట్లు స్పష్టమవుతోంది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు), ఇతర ఎత్తిపోతల ద్వారా కృష్ణా జలాలను మళ్లించేసిన తెలంగాణ సర్కార్ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు శ్రీశైలం నుంచి సాగర్‌కు విడుదల చేసిన నీటిపై తప్పుడు లెక్కలు చెబుతోందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అంశాన్ని కృష్ణా బోర్డు దృష్టికి తెచ్చి ఆ నీటిని తెలంగాణ సర్కార్ కోటా కింద లెక్కించాల్సిందిగా కోరాలని ఏపీ జలవనరుల శాఖ వర్గాలు నిర్ణయించాయి. -
ఇక జలాశయాల గణన
ఖమ్మంఅర్బన్: జనాభా.. జంతు.. పశు.. ఇప్పుడు జలాశయాల గణన. వీటన్నింటి తరహాలోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న జలాశయాల గణనకు శ్రీకారం చుట్టింది. ప్రతి ఐదేళ్లకోసారి చేపట్టే చిన్ననీటి వనరుల గణనతోపాటు ఈసారి జలాశయాల నమోదుకు పూనుకుంది. గతంలో ఐబీ(ఇరిగేషన్) అధికారులు చేపట్టిన తరహాలోనే జియో ట్యాగింగ్ ద్వారా జలాశయాల వివరాలను నమోదు చేయనున్నారు. ప్రత్యేకమైన యాప్ ద్వారా ఉపాధిహామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్ల సహాయంతో గణన చేపట్టబోతున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, జిల్లాస్థాయిలో కలెక్టర్.. గణాంకాధికారుల పర్యవేక్షణలో చేపట్టే గణనలో మత్స్య శాఖ, చిన్ననీటిపారుదల శాఖ అధికారి, మండల వ్యవసాయాధికారి, ఏఎస్ఓలు భాగస్వాములవుతారు. గతంలో నీటిపారుదల శాఖ అధికారులు కేవలం చెరువుల వివరాలను జియో ట్యాగింగ్ ద్వారా నమోదు చేశారు. ఈసారి మాత్రం చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలు తదితర వాటి వివరాలను నమోదు చేస్తారు. చెరువు, కుంట వైశాల్యం.. దాని కింద సాగవుతున్న భూమి.. తాగునీటి అవసరాలు ఏ మేరకు తీరుస్తుంది.. ఎన్ని గ్రామాలు, కాలనీలకు ఉపయోగపడుతుంది.. ఇలాంటి వివరాలన్నీ జియో ట్యాగింగ్ విధానంలో పొందుపరిచిన ప్రత్యేక యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ట్యాంక్‌లు, చెక్‌డ్యాంలు, కుంటలు, జలాశయాల సమగ్ర సమాచారం ఒక్క క్లిక్‌తో ఎక్కడి నుంచైనా పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. స్టాండింగ్ కమిటీ సూచనల మేరకే.. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సూచనల మేరకు దేశంలోనే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం జలాశయాల గణనకు శ్రీకారం చుట్టింది. దీని ద్వారా ఆయా చెరువుల వల్ల ఎన్ని గ్రామాలకు ఉపయోగకరంగా ఉంటుంది.. దానికి అందే నీటివనరులు ఏమిటి.. ఆయకట్టు, తాగునీటి అవసరాలకు ఎంత మేరకు ఉపయోగపడుతుంది.. ప్రస్తుతం జలాశయం పరిస్థితి.. అభివృద్ధి చేస్తే ఎంతమేర ఉపయోగం వంటి సమగ్ర వివరాలు ఈ ప్రక్రియ ద్వారా ఆన్లైన్లో నమోదు కానున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎక్కడి నుంచైనా జలాశయాల సమాచారం ఎవరైనా తెలుసుకునేందుకు సులువుగా ఉంటుంది. గణన విధానం.. జలాశయాల గణన విధానంలో జలాశయం విస్తీర్ణం, ఆయకట్టు, విస్తీర్ణంలో వినియోగపు వివరాలు, ఉపయోగంలో లేని జలాశయాలు తదితర ప్రభుత్వ వనరుల వివరాలు, గ్రామ రికార్డుల్లో పహాణీ, అడంగల్, సెటిల్మెంట్ రిజిస్టర్, ఫైనల్ పట్టీలతో రెవెన్యూ శాఖ నుంచి రికార్డులను సేకరించి.. నమోదు చేయాల్సి ఉంటుంది. జలాశయం ఉనికి వివరాల సర్వే, సబ్ డివిజన్ నంబర్, గ్రామ నక్షా, మ్యాప్ నుంచి సేకరించాల్సి ఉంటుంది. జలాశయం విస్తీర్ణం, అడంగల్ పహాణీ నుంచి పొందాల్సి ఉంటుంది. అవగాహన సదస్సులు జలాశయాల నమోదుపై మండలాలవారీగా ఫీల్డ్ అసిస్టెంట్లకు సంబంధిత అధికారులు అవగాహన కల్పించి.. జియో ట్యాగింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని.. అందులో నమోదు చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. శనివారం రఘునాథపాలెం మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్లకు.. ఇన్చార్జ్ ఏఎస్ఓ సుమన్, నీటిపారుదల శాఖ ఏఈ శివ, మండల వ్యవసాయాధికారి భాస్కర్‌రావు, ఏపీఓ అమ్మాజాన్ తదితరులు అవగాహన కల్పించారు. -
నేటినుంచి పశుగణన
సాక్షి, రంగారెడ్డి : అఖిల భారత పశుగణన ప్రక్రియ సోమవారం నుంచి జిల్లాలో ప్రారంభం కానుంది. తొలిసారిగా ఈసారి ట్యాబ్‌లను వినియోగించనున్నారు. క్షేత్రస్థాయి నుంచే ట్యాబ్‌ల ద్వారా పశువుల వివరాలు సేకరించి అప్పడికప్పుడే డేటా సెంటర్‌కు పంపనున్నారు. పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ గణన మొత్తం మూడు నెలలపాటు జరగనుంది. ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగియనుంది. జిల్లాలోని సుమారు 5.36 లక్షల ఇళ్లకు ఎన్యుమరేటర్లు తిరుగుతూ పశువులు, పెంపుడు జంతువులు, పక్షుల వివరాలు సేకరిస్తారు. ఇందుకోసం సుమారు 190 మంది ఎన్యుమరేటర్లను సిద్ధం చేసింది యంత్రాంగం. గ్రామీణ ప్రాంతంలో ఒక్కో ఎన్యుమరేటర్ నెలకు 1,500, పట్టణ ప్రాంతంలో 2 వేల ఇళ్లకు తిరిగి సమాచారం సేకరించనున్నారు. ప్రతి ఐదేళ్లకోసారి పశు గణన జరుగుతోంది. చివరిసారిగా 2012లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిం చారు. వాస్తవంగా గతేడాది గణన జరగాల్సి ఉండగా.. వివిధ కారణాల వల్ల అది సాధ్యపడలేదు. ప్రస్తుతం జరగబోయే గణనలో అన్ని మూగజీవుల సమాచారాన్ని సంపూర్ణంగా సేకరించాలని పశు సంవర్ధక శాఖ అధికారులు సిబ్బందికి సూచించారు. స్వచ్ఛందంగా వివరాలివ్వండి ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ వద్ద అన్ని రకాల పశువులు, పెంపుడు జంతువులు, పక్షుల వివరాలను ఎన్యుమరేటర్లకు తెలియజేయాలని జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి కేవీఎల్ నర్సింహారావు కోరారు. కచ్చితమైన సమాచారాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దీని ఆధారంగానే వచ్చే ఐదేళ్లపాటు ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాల్లో బడ్జెట్ కేటాయింపులు, అభివృద్ధి కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అలాగే వ్యాక్సినేషన్ ఉంటుందన్నారు. గ్రామాల్లో ఇంటింటికీ వివరాల సేకరణ చేపట్టే తేదీలను ముందుగానే తెలియజేస్తామన్నారు. -
పశువుల గణన
ఆదిలాబాద్‌టౌన్: జనాభా లెక్కల మాదిరిగానే పశుసంవర్ధక శాఖ పశు గణన కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రతీ ఐదేళ్లకోసారి పశువులను లెకిస్తోంది. గతంలో 2012 సంవత్సరంలో గణన చేపట్టగా.. 2017లో నిర్వహించాల్సి ఉంది. కానీ కేంద్రం ఒక సంవత్సరం ఆలస్యంగా నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఈ గణన కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులకు హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పించారు. వారు మండల స్థాయి పశువైద్యాధికారులు, ఎన్యుమరేటర్లకు ఇటీవల రెండు రోజులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్లో పొందుపర్చేందుకు ఎన్యుమరేట్లకు ట్యాబ్‌లను అందించనున్నారు. గతంలో మ్యానువల్(రికార్డు) పద్ధతిలో గణన జరగగా, ఈసారి డిజిటల్ పశుగణన చేపట్టనున్నారు. 20 నుంచి షురూ.. ఈ నెల 20 నుంచి పశు గణన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మూడు నెలలపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అప్పటిలోగా బాధ్యతలు అప్పగించిన అధికారులు పశువుల వివరాలను సేకరించాల్సి ఉంటుంది. జిల్లాలోని 18 మండలాలకు సంబంధించి ఒక్కో మండలానికి ముగ్గురు ఎన్యుమరేటర్ల చొప్పున 54 మందిని నియమించారు. వీరితోపాటు మండల పశువైద్యాధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఇంటింటికి వెళ్లి ఆవులు, గేదెలు, కోళ్లు, మేకలు, గొర్రెలు, కుక్కలు, ఇతర పశువుల వివరాలను రైతులు, పశుపోషకులను అడిగి నమోదు చేసుకుంటారు. రైతుల వద్ద వ్యవసాయ పరికరాలు ఎన్ని, ఏవేవనే వాటినీ నమోదు చేసుకుంటారు. ప్రత్యేక సాఫ్ట్వేర్.. డిజిటల్ పశు గణన కోసం ఈసారి ప్రత్యేక సాఫ్ట్వేర్ ఏర్పాటు చేశారు. ఈ సాఫ్ట్వేర్ ద్వారా ప్రతీ పశువుకు ఒక డిజిటల్ నంబర్‌ను ఇచ్చి అందులో యజమానితోపాటు పశువు వివరాలను పొందుపరుస్తారు. పశువులను అమ్మినా, కొనుగోలు చేసినా వెంటనే వివరాలు తెలిసే విధంగా సాఫ్ట్వేర్ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అడవుల్లో జీవించే వన్యప్రాణుల గణనను అటవీ శాఖాధికారులు చేపట్టారు. 20వ పశుగణన.. ప్రస్తుతం చేపట్టనున్న పశుగణన 20వది కానుంది. దేశంలో తొలిసారిగా 1919 సంవత్సరంలో ఈ గణనను చేపట్టారు. అప్పటినుంచి ఐదేళ్లకోసారి ప్రక్రియ కొనసాగుతూ వస్తోంది. గత సంవత్సరం జరగాల్సి ఉండగా ఒక సంవత్సరం ఆలస్యమైంది. ఇప్పటివరకు 19సార్లు పశుగణన పూర్తయ్యింది. ఈసారి గణన కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత పశుగణనలో జిల్లాలో 9లక్షల 98వేల 609 పశువులు ఉన్నట్లు అధికారులు లెక్కించారు. ఈసారి దాదాపు 14 లక్షల వరకు వాటి సంఖ్య చేరుకోనుందని అంచనా వేస్తున్నారు. పకడ్బందీగా చేపడతాం.. జిల్లాలో పశుగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. ఈ నెల 20 నుంచి నవంబర్ మాసం వరకు కొనసాగనుంది. మండలానికి ముగ్గురు చొప్పున ఎన్యుమరేటర్లను నియమించాం. మూడు నెలల్లో పశువులన్నింటి వివరాలను ఆన్లైన్లో ట్యాబ్‌లా ద్వారా పొందుపర్చాల్సి ఉంటుంది. ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాం. – సురేష్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి -
చుక్కెదురు
వనపర్తి టౌన్: గత మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రచార ఖర్చుల లెక్కలు చూపించని అభ్యర్థులపై వేటు పడింది. ఇకముందు పోటీచేసేందుకు కూడా వారిని అనర్హులుగా ప్రకటించింది. మూడు మున్సిపాలిటీల్లో వేటుపడిన వారిలో మొత్తంగా 62 మంది ఉన్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికలు జరిగిన 40 రోజుల్లోనే ఖర్చు వ్యయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేయాల్సి ఉంటుంది. ఈ విషయంపై అప్పట్లో పెద్దగా ఆసక్తి చూపనివారికి చుక్కెదురైంది. నిబంధనలు కఠినతరం ఎన్నికల నియమావళి ప్రకారం అభ్యర్థి గెలుపోటములతో సంబంధం లేకుండా ఖర్చుల వివరాలు చూపించాలి. గతంతో పోలిస్తే ఈసారి తీవ్రంగా పరిగణించిన ఎన్నికల సంఘం లెక్కలు చెప్పని అభ్యర్థులపై మూడేళ్ల పాటు అనర్హత వేటువేసింది. అప్పటి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నారాయణపేట మున్సిపాలిటీలకు 2014లో ఎన్నికలు జరిగాయి. ప్రధానపార్టీలు, స్వతంత్ర ఎన్నికల అభ్యర్థులను కలుపుకుని మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ 41వార్డుల్లో 367 మంది పోటీచేయగా ప్రచారం వ్యయం చూపని 13మందిపై వేటుపడింది. అలాగే గద్వాల మున్సిపాలిటీలోని 33వార్డులకు 130మంది పోటీచేశారు. అందులో 18మంది లెక్కలు చూపలేదు. వనపర్తి పట్టణంలో 26వార్డులకు గాను 128మంది అభ్యర్థు«లు పోటీచేయగా వారిలో 31మందిపై వేటు పడింది. వీరిలో అధికార, విపక్షపార్టీల నాయకులతో పాటు కొందరు మాజీ కౌన్సిలర్లు కూడా ఉన్నారు. వీరంతా ఎన్నికల అనంతరం నోటీసులు జారీచేసినా పెద్దగా పట్టించుకోలేదు. వనపర్తి నుంచి అత్యధికంగా.. పురపాలక సంఘం ఎన్నికల్లో నామినేషన్ సమయంలో ఉత్సాహం చూపుతున్న నామినేషన్ల ఉపసంహరణ వరకు సగం మంది బరిలో ఉంటున్నారు. ఎన్నికల ఖర్చులు అంతంత మాత్రంగానే ఉంటున్నా ఎన్నికల సంఘానికి వివరాలు ఇవ్వడంలో ఆసక్తి చూపలేదు. వీరిలో అత్యధికంగా వనపర్తిలో 31మంది, గద్వాలో 18 మంది, మహబూబ్‌నగర్‌లో 13మంది చొప్పున ఉన్నారు. నారాయణపేట నుంచి ఎలాంటి అనర్హత వేటు పడలేదని అధికారులు వెల్లడించారు. వ్యయ వివరాలు సమర్పించని వారికి గరిష్టంగా మూడేళ్ల పాటు ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉండదు. ఎన్నికల సంఘం ఉత్తర్వుల ప్రకారం 2020 వరకు పోటీచేసే అవకాశాన్ని అభ్యర్థులు కోల్పోతారని అధికారులు చెబుతున్నారు. అధికార పార్టీ నుంచే అధికంగా.. ఎన్నికల సమయంలో తొలిసారి బరిలోకి దిగిన టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన అభ్యర్థులు సింహభాగం ఉండగా, ప్రతిపక్షాలు, స్వతంత్ర అభ్యర్థులు తక్కువ సంఖ్యలో ఉన్నారు. గతంలో కొద్దిఓట్లతో ఓడిపోయి తమ భవిత్యం వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందామని ఆలోచించే వారికి ఎన్నికల సంఘం నిబంధనల రూపంలో చుక్కెదురైంది. అనర్హతవేటు పడిన వారిలో న్యాయవాదులు, బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, మాజీ కౌన్సిలర్లు ఉన్నారు. నోటీసులు జారీచేశాం.. ఎన్నికల సంఘం గతంలో లెక్కలు చూపాలని జారీచేసిన ఆదేశాలను సంబంధిత అభ్యర్థులకు నోటీసులు రూపంలో అందజేశాం. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. మేం జారీచేసిన ప్రతిని ఎన్నికల సంఘానికి పంపించగా, వారికి మూడేళ్ల అనర్హత వేటు వేసింది. – నరేశ్‌రెడ్డి, మేనేజర్, వనపర్తి మునిసిపాలిటీ -
ఇచ్చిన డబ్బులకు లెక్క చెప్పండి
రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: గత ఆర్థిక సంవత్సరంలో (2014-15) తాము ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. నిధుల వ్యయానికి సంబంధించిన వినియోగ పత్రాలను సమర్పిస్తే గానీ తదుపరి నిధులను విడుదల చేయబోమని స్పష్టం చేసింది. కేంద్రం ఆదేశాలు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి కొన్నిరోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా కేంద్రం గత ఆర్థిక సంవత్సరంలో ఇచ్చిన నిధులను విడుదల చేస్తున్నట్లుగా జీవోలను మాత్రం జారీ చేసింది. వాస్తవంగా డబ్బులు మాత్రం విడుదల చేయలేదు. కేంద్ర ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో నూతన రాజధానిలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి రూ.500 కోట్లను, అలాగే గుంటూరు, విజయవాడల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.1,000 కోట్లను విడుదల చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను ఆ పనుల కోసం కాకుండా ఇతర అవసరాలకు వినియోగించింది. పెపైచ్చు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మళ్లీ నిధులు ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. దీంతో గతంలో ఇచ్చిన నిధులను ఏ ఏ అంశాలకు ఖర్చు చేశారో వివరాలతో కూడిన వినియోగ పత్రాలను పంపాలని, ఆ తరువాతనే తదుపరి నిధులిస్తామని కేంద్రం స్పష్టం చేసిం ది. దీంతో ప్రభుత్వం హడావుడిగా ఆదివారం రోజున 19వ తేదీతో రాజధానిలో రాజభవన్, హైకోర్టు నిర్మాణాలకు గాను రూ.500 కోట్లను సీఆర్డీఏకు విడుదల చేస్తున్నట్లు జీవో జారీ చేసింది. ఈ నిధులను పీడీ ఖాతాలో ఉంచుకోవాలని జీవోలో పేర్కొన్నారు. అలాగే గుంటూరులో భూగర్భ డ్రైనేజీ పనుల కోసం రూ.540 కోట్లు, విజయవాడలో వరద నీటి డ్రైనేజీ పనుల కోసం రూ.480 కోట్లు ఆయా మున్సిపల్ కార్పొరేషన్లకు విడుదల చేస్తున్నట్లుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేవలం జీవోలు జారీ చేసినంత మాత్రాన ఆ నిధులను ఖర్చు చేసినట్లుగా కేంద్రానికి వినియోగ పత్రాలను సమర్పించలేమని, ఒకవేళ సమర్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కేంద్రానికి తెలుస్తుందని, అప్పుడు అసలుకే మోసం వస్తుందని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. -
పాలికె ఎలుక లెక్కలు
ఒక్కో ఎలుకను పట్టుకోడానికి రూ. 10 వేల ఖర్చు చూపిన బీబీఎంపీ లెక్కలు తోడేశారు ఖర్చు మొత్తం రూ. 1.98 లక్షలట ! పాలికె సమావేశంలో నీళ్లు నమిలిన అధికారులు బెంగళూరు : కాకి లెక్కలు విన్నాము కానీ ఈ ఎలుక లెక్కలు ఏమిటీ అని తెలుసుకోవాలనుందా..! అయితే బెంగళూరు బీబీఎంపీ కార్యాలయానికి వెళ్లాల్సిందే. ఒక్కొ ఎలుకను పట్టుకోడానికి రూ. 10 వేలు ఖర్చు చేసినట్లు చూపించి లెక్కలు తోడేశారు. పాలికె సిబ్బంది. 20 ఎలుకలు పట్టడానికి రూ. 1.98 లక్షలు ఖర్చు చూపి ఘనమైన రికార్డు మూటగట్టుకున్నారు. వివరాలు... పాలికె కార్యాలయంలో పలు విభాగాలకు చెందిన రికార్డులను భద్రపరచడానికి ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. ఆ గదిలో ఎలుకలు దూరి రికార్డులను తినేస్తుండటంతో సిబ్బంది ఆరు నెలలుగా 20 ఎలుకలను పట్టుకుని ఖర్చు రూ. 1.98 లక్షలు అయ్యిందని లెక్కలు తవ్వుకున్నారు. మండిపడిన అధికార పార్టీ నాయకుడు .. నీళ్లు నమిలిన అధికారులు బుధవారం బీబీఎంపీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికార పార్టీ కార్పొరేటర్ (బీజేపీ) ఎన్.ఆర్. రమేష్ మాట్లాడుతూ... పాలికె అధికారులు ఏమి తలచుకుంటే అది చేసేస్తారు. తిమ్మినిబొమ్మిని కూడా చేస్తారు. ఒక్క ఎలుకను చంపడానికి రూ. 10 వేలు ఖర్చు పెట్టిన ఘన చరిత్ర, ప్రపంచలో ఎవ్వరికి దక్కని అరుదైన రికార్డు సొంత చేసుకున్నారు అంటూ మండిపడ్డారు. వీరిని గిన్నిస్ రికార్డులో ఎక్కించాలని వ్యంగ్యంగా అన్నారు. రూ. 12 ఇస్తే ఎలుకల మందు ప్యాకెట్ ఇస్తారు. అయితే సిబ్బంది మాత్రం 20 ఎలుకలు పట్టడానికి రూ. 1.98 లక్షలు ఖర్చు చేశామని నిస్సిగ్గుగా లెక్కలు రాయడం బాధ్యతలేనితనానికి నిదర్శనమని ఆయన అసహనం వ్యక్తం చేశారు. అయితే అధికారులు మాత్రం ఏమీ చెప్పలేకుండా మిన్నకుండిపోయారు. ప్రతిపక్షాలు సైతం అధికారుల వైఖరిని నిలదీశాయి. ఏదీ ఏమైనా ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతోందో ఈ సంఘటనే ఒక ఉదాహరణ. -
ఉత్తరాంధ్రలో మారిన లెక్కలు!
ఓటరు నాడి ఓ పట్టాన చిక్కదనడానికి తాజాగా జరిగిన స్థానిక సంస్థల, సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిని బట్టి విశదమవుతోంది. ఓటరు తీర్పు ఎప్పటికప్పుడు విలక్షణంగానే ఉంటుందనేది మరోసారి విస్పష్టమైంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫలితాలను లోతుగా అధ్యయనం చేస్తే పలు ఆసక్తికరమైన అంశాలు చోటుచేసుకున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో పది, విజయనగరం జిల్లాలో 9, విశాఖపట్నం జిల్లాలో 15 మొత్తం 34 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో విశాఖపట్నం జిల్లాలోని విశాఖ పశ్చిమ, ఉత్తరం, దక్షిణం, తూర్పు, గాజువాక అసెంబ్లీ నియోజకవర్గాల మినహా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలను బేరీజు వేచి చూడగా పలు ఆసక్తికరమైన అంశాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా ఉత్తరాంధ్రలోని 29 నియోజకవర్గాల ఫలితాలను ఒకసారి పరిశీలిద్దాం. మున్సిపల్, జెడ్పీ ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే శ్రీకాకుళం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమదాలవలస, నరసన్నపేటల్లోనే ఆధిక్యం కనిపించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుపొందడం గమనార్హం! అయితే, ఈ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్, జెడ్పీ ఎన్నికల ఫలితాల్లో వెనుకబడిన పాతపట్నం, పాలకొండ, రాజాం అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయబావుటా ఎగురవేయడం విశేషం! ఆమదాలవలస పరిధిలో స్థానిక ఎన్నికల్లో 5,229 ఓట్ల ఆధిక్యం కనిపించినా, అసెంబ్లీకి వచ్చేసరికి ఈ నియోజకవర్గం నుంచి కూన రవికుమార్ (టీడీపీ) తన సమీప ప్రత్యర్థి తమ్మినేని సీతారాం (వైఎస్సార్సీపీ)పై ఐదు వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక నరసన్నపేటలో స్థానిక ఎన్నికల్లో 3,260 ఓట్ల ఆధిక్యాన్ని వైఎస్సార్సీపీ కనబరిచినా, అసెంబ్లీ ఫలితాల్లోకి వచ్చేసరికి ఇక్కడ బగ్గు రమణమూర్తి (టీడీపీ) సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ (వైఎస్సార్సీపీ)పై 4,889 ఓట్ల మెజారిటీ సాధించారు. పాతపట్నం పరిధిలో స్థానిక ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే, వైఎస్సార్సీపీకి ప్రత్యర్థి టీడీపీ కన్నా 1317 ఓట్లు తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ అసెంబ్లీ అభ్యర్థి కలమట వెంకటరమణ (వైఎస్సార్సీపీ) తన సమీప ప్రత్యర్థి, మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు (టీడీపీ)పై 3,865 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం. పాలకొండలో స్థానిక ఎన్నికల్లో టీడీపీకి 3,504 ఓట్ల ఆధిక్యం వచ్చినా, అసెంబ్లీ స్థానాన్ని మాత్రం వైఎస్సార్సీపీ గెలుచుకుంది. ఇక్కడ వైఎస్సార్సీపీ అభ్యర్థి విశ్వాసరాయి కళావతి టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై 1620 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రాజాంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ 4289 ఓట్ల ఆధిక్యం కనబరిచినా, అసెంబ్లీ ఫలితం వచ్చేసరికి కంబాల జోగులు (వైఎస్సార్ సీపీ) మాజీ స్పీకర్ ప్రతిభాభారతి (టీడీపీ)పై 512 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఈ జిల్లాలోని ఇచ్చాపురం, పలాస, ఎచ్చెర్ల, టెక్కలి, శ్రీకాకుళం స్థానాలు స్థానిక, సార్వత్రిక ఫలితాల్లో ఆధిక్యత కనబరిచిన టీడీపీ ఖాతాలోకి వెళ్లాయి. విజయనగరం జిల్లా ఫలితాలను విశ్లేషిస్తే.. స్థానిక ఫలితాల్లో వైఎస్సార్ సీపీ ఆధిక్యం కనబరిచిన బొబ్బిలి సెగ్మెంట్లో ఆ పార్టీయే గెలుపొందింది. స్థానిక ఫలితాల్లో వైఎస్సార్సీపీకి 6384 ఓట్ల ఆధిక్యం రాగా.. అసెంబ్లీ అభ్యర్థి సుజయ్ కృష్ణరంగారావు టీడీపీ అభ్యర్థి లక్ష్మునాయుడుపై 7330 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ జిల్లాలో మరోరెండు స్థానాలను వైఎస్సార్సీపీ గెలుపొందింది. కురపాంలో స్థానిక ఎన్నికల ఫలితాల్లో 525 ఓట్లు తగ్గినప్పటికీ అసెంబ్లీకి వచ్చేసరికి పి.పుష్పశ్రీవాణి టీడీపీ అభ్యర్థి జనార్థన్ థాట్రాజ్‌పై 19వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుపొందడం విశేషం! సాలూరులో స్థానిక ఫలితాల్లో టీడీపీ 1654 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచినా, అసెంబ్లీకి వచ్చేసరికి వైఎస్సార్ సీపీ అభ్యర్థి రాజన్నదొర టీడీపీ అభ్యర్థి భాంజ్దేవ్పై సుమారు ఐదు వేల ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించారు. ఈ జిల్లాలో మిగిలిన పార్వతీపురం, చీపురుపల్లి, గజపతినగరం, నెల్లిమర్ల, విజయనగరం, శృంగవరపుకోట సెగ్మెంట్లలో స్థానిక, సార్వత్రిక ఫలితాల్లో టీడీపీదే పైచేయిగా ఉంది. ఇక విశాఖపట్నం జిల్లా ఫలితాల సరళిని చూస్తే.. స్థానిక ఫలితాల్లో వైఎస్సార్సీపీ ఆధిక్యం కనబరిచిన పాడేరు (9282), అరకులోయ (21824), మాడుగుల (45) సెగ్మెంట్లలో ఆ పార్టీనే విజయం సాధించింది. అయితే స్థానిక ఎన్నికల ఫలితాల్లో వచ్చిన ఆధిక్యం కన్నా సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో పాడేరులో జి.ఈశ్వరి పాతికవేలకు పైగా, అరకులోయలో కిడారి సర్వేశ్వరరావు 33వేల పైగా, మాడుగులలో బూడి ముత్యాలనాయుడు ఐదు వేలపైగా ఓట్ల మెజారితో విజయం సాధించారు. ఉత్తరాంధ్రలో స్థానిక ఫలితాల సరళిని బట్టి చూస్తే ఆరు నియోజకవర్గాల్లో ఆధిక్యం కనబరిచిన వైఎస్సార్ సీపీ అసెంబ్లీ ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. -అవ్వారు శ్రీనివాసరావు