The campaign
-
సప్పుడు బంద్
ముగిసిన ఉప ఎన్నిక ప్రచారం రేపు పోలింగ్ బరిలో 23 మంది అభ్యర్థులు హన్మకొండ : ఇరవై రోజులుగా ఊరువాడా హోరెత్తిన ఉప ఎన్నిక ప్రచారం గురువారం సాయంత్రం 5గంటలకు ముగిసింది. వరంగల్ ఉప ఎన్నిక ను అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. వామపక్ష పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా గాలి వినోద్ కుమార్‌ను ప్రకటించి అన్ని పార్టీల కంటే ముందే ప్రచారం ప్రారంభిం చాయి. ఆ తర్వాత టీఆర్ఎస్ తర్జనభర్జనల అనంతరం పసునూరి దయాకర్‌ను బరిలో నిలి పింది. దయాకర్ తరఫున రాష్ర్ట మంత్రులు విస్తృత ప్రచారం చేయగా.. నియోజకర్గానికో మంత్రికి బాధ్యతలు అప్పగించారు. అనూహ్య పరిస్థితుల మధ్య సర్వే సత్యనారాయణ కాంగ్రె స్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచారు. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జాతీయస్థాయి నేతలు దిగ్విజయ్‌సింగ్, మీరాకుమార్, గులాంనబీ ఆజాద్, సుశీల్కుమార్షిం డే వంటి అగ్రనేతలు ప్రచారం నిర్వహించారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత జానారెడ్డి వరంగల్ కేంద్రంగా ఉంటూ ప్రచారానికి నేతృత్వం వహించారు. బీజేపీ, టీడీపీల ఉమ్మడి అభ్యర్థిగా నిలిచిన దేవయ్య తరఫున కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, హన్స్రాజ్గంగారం ఆహిర్‌తో పాటు కిషన్‌రెడ్డి ఊరువాడా ప్రచారం నిర్వహించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాశ్‌రావు తరఫున ఆ పార్టీ అధినేత జగన్‌మెహన్‌రెడ్డి నాలుగు రోజుల పాటు పార్లమెంట్ సెగ్మెంట్ వ్యాప్తంగా నిర్వహించిన ప్రచారానికి మంచి స్పందన లభించిం ది. ఇక ప్రచారంలో ఎల్ఈడీ వాహనాలు, వీడి యో క్లిప్పింగులు ఆకర్షణగా నిలవగా.. బడా నాయకుల రాకతో హోటళ్లన్నీ కిక్కిరిపోయాయి. రేపు అసలు పరీక్ష ఇరవై రోజుల పాటు ఉధృతంగా ఎన్నికల ప్రచా రం నిర్వహించిన అభ్యర్థులకు శనివారం అసలైన పరీక్ష ఎదురు కానుంది. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా ప్రధాన పార్టీలతో పా టు స్వతంత్ర అభ్యర్థులు 23 మంది బరిలో ఉ న్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ పరిధి ఏడు అసెం బ్లీ నియోజకర్గాల్లో ఉన్న పన్నెండు మండలాల్లో 1778 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించారు. పో లింగ్ సందర్భంగా పోలీసులు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. పారామిలిటరీతో పాటు స్పెషల్ పార్టీ, పక్క జిల్లాలకు చెందిన పోలీసు బలగాల ను రప్పించారు. గురువారం సాయంత్రం 5 గం టల నుంచి శనివారం సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలను నిషేధించారు. కాగా, అభ్యర్థులు చేసిన ప్రచారం ఖర్చు వివరాలతో పాటు గడువు ముగిసిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించే వారిపై ఎన్నికల కమిషన్ దృష్టి సారించింది. -
సంస్కృతికి అద్దం
కైలాసగిరిపై సాంస్కృతిక నికేతనం ప్రారంభం మరింత అభివృద్ధికి సీఎం హామీ విశాఖపట్నం: దేశంలోనే తొలిసారిగా తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ, ప్రచారం కోసం విశాఖలోని కైలాసగిరిపై నిర్మించిన తెలుగు సాంస్కృతిక నికేతనం (మ్యూజియం)ను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం ప్రారంభించారు. ప్రపంచ తెలుగు సమాఖ్య, వుడా సంయుక్తంగా, పలువురు దాతల సహకారంతో రూ.12.75 కోట్ల వ్యయంతో నిర్మించినా ఈ మ్యూజియాన్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడుతో కలిసి సీఎం సందర్శించారు. దేశంలో ఎక్కడా లేని దృశ్య, శ్రవణ సాంస్కృతిక నికేతాన్ని విశాఖలో నిర్మించడానికి ముందుకు వచ్చిన ప్రపంచ తెలుగు సమాఖ్యను సీఎం అభినందించారు. రాష్ర్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలను నికేతనం అభివృద్ధికి అందిస్తామని హామీ ఇచ్చారు. కైలాసం ఎలా ఉంటుందో చూడకపోయినా కైలాసగిరి ఆ లోటును తీరుస్తోందని, అలాంటి ప్రదేశంలో మ్యూజియం ఏర్పాటుచేయడం హర్షణీయమన్నారు. మ్యూజి యం పరిరక్షణకు ప్రభుత్వ పరంగా గవర్నింగ్ బాడీని ఏర్పా టు చేస్తామని, మ్యూజియం ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఓపెన్ ఆడిటోరియం నిర్మాణానికి సహకరిస్తామని సీఎం ప్రకటించారు. అమరావతిలో కూడా నిర్మిస్తాం ఈ మ్యూజియంలో కళాకేంద్రాన్ని, వసతిగృహాలను నిర్మించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి సమర్పించామని సమాఖ్య అధ్యక్షురాలు వి.ఎస్.ఇందిరా దత్ తెలిపారు. విశాఖలో ఇచ్చినట్లుగానే ఏపీ రాజధాని అమరావతిలో కూడా ఐదెకరాల స్థలం కేటాయిస్తే అక్కడ కూడా ఇటువంటి మ్యూజియం నిర్మిస్తామని సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరా దత్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. విశాఖలో రవీంద్రభారతిని మించిన ఆడిటోరియం నగరంలోని ఎంవీపీ కాలనీలో రూ.30 కోట్లతో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిని మించిన సాంస్కృతిక కేంద్రాన్ని నిర్మిస్తామని రాష్ట్ర విద్య, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నికేతనం నిర్మాణంలో పాలు పంచుకున్న కళాదర్శకుడు తోట తరణి, వాయిస్ ఓవర్ అందించిన సినీ నటుడు సాయికుమార్, నేపధ్యగానం చేసిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సంగీతం సమకూర్చిన వందేమాతరం శ్రీనివాస్, విరాళాలు ఇచ్చిన ఎన్ఆర్ఐలు, స్థానికులను ఈ సందర్భంగా సీఎం, మంత్రులు అభినందించారు. తెలుగు సాంస్కృతిక నికేతనం ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రపంచ తెలుగు సమాఖ్య ధర్మకర్త, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, పార్లమెంట్ సభ్యులు కంబంపాటి హరిబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు ఎంవివిఎస్ మూర్తి, పప్పల చలపతిరావు, ప్రపంచ తెలుగు సమాఖ్య సెక్రటరీ జనరల్ సాయికుమార్ శ్రీనివాస్, కళాఖండాల రూపశిల్పి తోట తరణి, స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. తెలుగు సాంస్కృతిక వారసత్వం తెలుగు సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగించేదిగా ఈ మ్యూజియం ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కేంద్ర సాంస్కృతిక విభాగం నుంచి కూడా సహకారం అందిస్తామన్నారు. మ్యూజియంలో చారిత్రక, సాంస్కృతిక ఘట్టాలను తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో వివరించే ఏర్పాటు ప్రస్తుతం ఉండగా ఇతర భాషల్లో కూడా వినిపించాలని నిర్వాహకులకు సూచించారు. -
మహా పుష్కరాలపై పిల్ కొట్టివేత..
{పభుత్వాలది ప్రచారం ఎంతమాత్రం కాదు అది కేవలంసమాచారం ఇవ్వడమే అలా చేయడం {పభుత్వాల బాధ్యత అన్ని మతాలను సమానంగా చూడటమే లౌకికవాదం ధర్మాసనం స్పష్టీకరణ హైదరాబాద్: మహాపుష్కరాలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని(పిల్) హైకోర్టు కొట్టేసింది. పుష్కరాలకోసం ప్రభుత్వాలు చేస్తోంది ప్రచారం కాదని, ప్రజలకు సమాచారాన్నే అందిస్తున్నాయని స్పష్టంచేసింది. ప్రజల మతవిశ్వాసాలకు సంబంధించి న కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాల బాధ్యతని తేల్చిచెప్పింది. పుష్కరాలద్వా రా ప్రభుత్వాలు ఓ మతాన్నే ప్రోత్సహిస్తున్నాయన్న వాదనల్లో అర్థంలేదంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. మహాపుష్కరాలకు ప్రచారం చే యడం లౌకికస్ఫూర్తికి విరుద్ధంగా ప్రకటించాలని, రాజమండ్రిలో పుష్కరాల ప్రారంభం రోజున జరిగిన తొక్కిసలాటలో 29 మంది చనిపోవడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబును బాధ్యుడిగా చేయాలంటూ పౌరహక్కుల సంఘం నేత చిల్కా చంద్రశేఖర్ దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫున వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ.. గోదావరిలో స్నానమాచరిస్తే పుణ్యం, మోక్షం కలుగుతుందంటూ ఇరుప్రభుత్వాలు ప్రచారం హోరెత్తిస్తున్నాయని, ప్రజల డబ్బుతో ప్రభుత్వాలిలా ఓ మతపరమైన కార్యక్రమాలకు ప్రచారం చేయడం లౌకికస్ఫూర్తికి విరుద్ధమన్నారు. ధర్మాసనం స్పందిస్తూ.. ‘‘ప్రభుత్వాలు మహాపుష్కరాలకే కాదు.. పలు ఇతర మతకార్యక్రమాలకూ ఇలానే చేస్తున్నాయి. ప్రధాని రంజాన్‌కు ఈద్ ముబారక్ చెబితే తప్పవుతుందా? హ్యాపీ దీపావళి అంటే ఓ మతానికి మద్దతు పలుకుతున్నట్లా? మీ ప్రకారం ఓ పండుగకు సెలవు ప్రకటించడమూ తప్పన్నట్లు ఉంది. లౌకికస్ఫూర్తిని మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అన్నిమతాల్ని సమానంగా చూడటమే లౌకికవాదం. ప్రధాని, సీఎంలూ రంజాన్‌కు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయ డం.. ఎవరైనా ఆహ్వానిస్తే వెళ్లడం సర్వసాధారణం. ఇలా వెళ్లడం ఓ మతాన్ని ప్రోత్సహించినట్లవుతుందని అనగలమా? వినాయకచవితి, దసరాలకు విగ్రహాల నిమజ్జనానికి ప్రభుత్వాలు కోట్ల సొమ్ము ఖర్చుచేస్తూ ప్రజలకిబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇలాచేయడం ప్రభుత్వాల బాధ్యత. దీన్ని ఓ మతాన్ని ప్రోత్సహించడానికి చేస్తున్నారనడానికి వీల్లేదు కదా? పుష్కరాలకు వెళితే మీకు అదిస్తాం.. ఇదిస్తాం.. అని చెబితే తప్పు. అలా ప్రభుత్వాలు చేస్తుంటే చెప్పండి. మేం జోక్యం చేసుకుంటాం. అంతేతప్ప ఇటువంటి వ్యాజ్యాల్లో మాత్రం కాదు’’ అని వ్యాఖ్యానించింది. అత్యంత దురదృష్టకరం రాజమండ్రిలో పుష్కరాల ప్రారంభం రోజున తొక్కిసలాట జరిగి 29 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇవి అసహజ మరణాలు కానేకాదని, ఓ మనిషి చేసిన హత్యలని రఘునాథ్ నివేదించారు. ఏపీ సీఎం చంద్రబాబే దీనికి బాధ్యులని, ఆయన ప్రచారంకోసం ఓ డాక్యుమెంటరీ చిత్రీకరణకు చేసిన ఏర్పాట్లవల్లే అంతమంది మృత్యువాత పడ్డారని తెలిపారు. రాజకీయలబ్ధికోసమే డాక్యుమెంటరీకి శ్రీకారం చుట్టారన్నారు. తెల్లవారుజాము 2 గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు చంద్రబాబుకోసం జనాల్ని క్యూలైన్లలో నిలిపేశారని, దీంతో తొక్కిసలాట జరిగిందని వివరించారు. 29 మంది చనిపోయినా ఏపీ ప్రభుత్వానికి చీమకుట్టినట్టూ లేదని, అసహజ మరణాలని ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకుందని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ.. ఆ ఘటన అత్యంత దురదృష్టకరమంది. కాగా లౌకికవాదానికి ముడిపెట్టి దాఖలు చేసిన ఈ వ్యాజ్యాన్ని విచారించలేమని, దీన్ని కొట్టేస్తున్నామని పేర్కొంది. -
వంటగ్యాస్ రాయితీని వదులుకోవడం దేశభక్తి కాదా?
వంటగ్యాస్ రాయితీని వదులుకుని నిరుపేదలకు ప్రయోజనం కలిగించడంలో మధ్యతరగతి ప్రజలు చొరవ చూపటం లేదు. దీనిపై ప్రధానమంత్రి కేంపెయిన్ మొదలుపెట్టాక వినియోగదారుల్లో 0.35 శాతం మంది మాత్రమే అనుకూలంగా స్పందించారు. దేశంలోని 15 కోట్ల కుటుంబాల్లో 6 లక్షల కుటుంబాలు మాత్రమే వంటగ్యాస్‌ను మార్కెట్ ధరతో కొనేందుకు స్వచ్ఛందంగా సమ్మతించాయి. కొన్ని నెలల క్రితం, బెంగళూరులో ఉన్న మా ఇంటికి గ్యాస్ సిలిండర్ ను బుక్ చేయడానికి ప్రయత్నించాను. ప్రస్తుతం ఇండియాలో ఈ పని చేయడం చాలా సులువని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మీరు ఒక నంబర్‌కు కాల్ చేస్తారు. వెంటనే ఒక సాంకేతిక పరిజ్ఞాన వ్యవస్థ మీ అభ్యర్థనను నమోదు చేసుకుంటుంది. తమ సేవను ఉపయోగించుకున్నందుకు మీకు కృతజ్ఞతలు చేస్తుంది. ఇదంతా కేవలం 15 సెకనుల కంటే తక్కువ సమయంలోనే ముగిసి పోతుంది. మరికొద్ది రోజుల్లో సిలిండర్ మీ ఇంటికి వస్తుంది. అయితే ఈసారి సిలిండర్ అంత సులువుగా మా ఇంటికి రాలేదు. నాకు ఆశ్చర్యమేసింది. భారత్ గ్యాస్ కార్యాలయానికి ఫోన్ చేశాను. నేను సబ్సిడీ గ్యాస్ పొందాలంటే కొన్ని ఆర్థిక దస్తావేజులు సమర్పించాలని వారు చెప్పారు. దాంతో సబ్సిడీకి నేను అర్హుడిని కానని, గ్యాస్ పూర్తి ధరతో పొందాలంటే ఏం చేయాల్సి ఉంటుందని అడిగాను. సబ్సిడీ గ్యాస్ రద్దు ప్రక్రియను పూర్తి చేయడం కోసం తమ ఆఫీసుకు రావాలని వారు చెప్పారు. అక్కడికి వెళ్లాను కూడా. (అలా చేయడం ఇదే తొలిసారి). భారత్ గ్యాస్ కార్యాలయం రద్దీగా ఉంది. ఫారం 5 అనే పేరున్న డీ రిజి స్ట్రేషన్ పత్రం గురించే అక్కడున్న కొంతమంది సిబ్బందికి తెలీదు. పెద్దగా డిమాండ్ లేకపోవడంతో ఆ పత్రాలు ఒకచోట కుప్పలాగా పడి ఉన్నాయి. ఫారం 5ని పూరించడం, మరోసారి గ్యాస్ కంపెనీ కార్యాలయానికి రావడం జరిగాక, ఎట్టకేలకు నా గ్యాస్ సబ్సిడీ సౌకర్యాన్ని డీ రిజిస్టర్ చేయించుకోగలిగాను. పూర్తి ధరతో సిలిండర్ పొందగలిగాను. కొద్ది రోజుల తర్వాత, ఒక వ్యక్తి నుంచి నేను ఫోన్ కాల్ అందుకున్నాను. ఆయన చాలా చక్కగా మాట్లాడారు. అతనెవరో నాకు తెలీదు కానీ నన్ను పేరు పెట్టి మరీ పలకరించారు. తను ఇలా గ్యాస్ రాయితీని డీ రిజిస్టర్ (ఉపసంహరించుకోవడం) చేసుకున్న వ్యక్తులకు కాల్ చేసే అధికారి అట. వినియోగదారులు తాము స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకుంటున్నట్లుగా బహి రంగంగా ఒక పత్రంపై సంతకం చేయడం కోసం (అదీ మంత్రి సమక్షంలో) మరుసటి దినం అంటే ఆదివారం నాడు ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని ఆ అధికారి చెప్పారు. నేను ఇదివరకే అలా సంతకం చేశానని చెప్పాను. ఆ విషయం తనకు తెలుసనీ, అయితే మరోసారి బహిరంగంగా అలా చేయడానికి మీరు తప్పనిసరిగా రావాల్సి ఉందని ఆ అధికారి సౌమ్యంగానే అభ్యర్థించారు. అలా రాలేనని ఆయనకు చెప్పేశాను. నేనీ విషయాన్ని ఇప్పుడెందుకు రాస్తున్నానంటే, స్వచ్ఛందంగా వంట గ్యాస్ సబ్సిడీని వదులుకోవాల్సిందిగా ప్రధానమంత్రి కేంపెయిన్ మొదలుపెట్టి మూడు నెలలు గడిచిన తర్వాత కూడా వినియోగదారుల్లో 0.35 శాతం మంది మాత్రమే వంట గ్యాస్‌పై రాయితీని వదులుకున్నారు. దేశంలోని 15 కోట్ల గృహాల్లో కేవలం 6 లక్షల గృహాలు మాత్రమే మార్కెట్ ధరకు వంట గ్యాస్‌ను కొనేందుకు స్వచ్ఛం దంగా సమ్మతించాయి. మధ్యతరగతి భారతీయులు వంట గ్యాస్ రాయితీని వదులుకోవాలనీ, అప్పుడే రాయితీ ధరతో పేదలకు అందించవచ్చనీ కేంద్ర చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ సంవత్సరం జనవరి నుంచి పదే పదే అభ్యర్థిస్తూ వచ్చారు. రాయితీ వల్ల ప్రభుత్వం ఒక్కో సిలిండర్‌పై రూ. 207లు నష్టపోతోంది. వంట గ్యాస్ రాయితీ వల్ల కేంద్ర ప్రభుత్వానికి మొత్తం మీద రూ.40,000 కోట్లు నష్టం సంభవిస్తోంది. కాబట్టి ప్రభుత్వం నష్టపోకుండా తాము కాస్త దోహద పడటం అనేది మధ్యతరగతికి సులువైన పనే. కానీ ఇంతవరకు వీరు ఈ విషయంలో పెద్దగా చొరవ చూపటం లేదు. చివరకు కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఇంతవరకు తమ వంట గ్యాస్ రాయితీని వదులుకోలేదంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకిలా జరుగుతోంది? నాకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. చిన్న కారణం ఏమిటంటే, వినియోగదారులు తమ రాయితీ సౌకర్యాన్ని డీరిజిస్టర్ చేసుకోవడాన్ని ప్రభుత్వం కష్టసాధ్యంగా చేయడం. నా అనుభవం ద్వారా నాకు ఇదే విషయం బోధపడింది. వంట గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేయడం చాలా సులువు. ఎందుకంటే నమోదైన మొబైల్ నంబర్ ద్వారా సబ్స్క్రయిబర్లను సిస్టమ్ గుర్తించగలదు. (ఇదెంత సులువంటే నా సబ్స్క్రయిబర్ సంఖ్య తెలీకు న్నప్పటికీ ఆటోమేటెడ్ సిస్టమ్ (స్వయం చాలక వ్యవస్థ) ద్వారా నేను గ్యాస్‌ను సులువుగా బుక్ చేసుకోగలను). రాయితీ వంట గ్యాస్ సౌకర్యాన్ని కూడా ఇంతే సులువుగా డీరిజిస్టర్ చేసుకోగలగాలి. కాని అలా సాధ్యం కావటం లేదు. ఇక్కడ కూడా ఆటోమేటెడ్ సిస్టమ్‌ను అమలుచేయడానికి బదులుగా దస్తావేజులు, క్యూలు అవసరం అవుతున్నాయి.. ఇలా రాయితీ గ్యాస్ సౌకర్యాన్ని డీరిజిస్టర్ చేయడానికి ఒక వెబ్సైట్ ఉంది. www.MyLPG.in. నేను అందులోకి వెళ్లి ప్రయ త్నించాను. కాని ఆ వెబ్సైట్ డిజైన్‌ను ఎంత ఘోరంగా రూపొందించారంటే, ఆన్లైన్లో డీరిజిస్టర్ చేసుకోవడానికి ఎలాంటి ఐచ్ఛికాన్ని నేను అక్కడ కనుగొన లేకపోయాను. ఆ సమయంలో నేను నా గ్యాస్ సిలిండర్‌ను పొందటంలో సమ స్యను ఎదుర్కోనట్లయితే, గ్యాస్ కంపెనీ వద్దకు బహుశా వెళ్లి ఉండేవాడిని కాదు. ఎందుకంటే ఈ మొత్తం వ్యవహారం గొప్ప అసౌకర్యంగా తయారై ఉంది. కాబట్టి వంట గ్యాస్ రాయితీ ఉపసంహరణ విషయంలో ప్రధానమంత్రి పథకం విఫలమైందని కేంద్ర మంత్రి ఆరోపిస్తున్నట్లయితే, ఆ వైఫల్యంలో కొంత శాతాన్ని ఆయన సైతం పంచుకోవాల్సి ఉంటుంది. అయితే నేను ఇదివరకే చెప్పినట్లు ఇది ఒక చిన్న కారణం. తమ వంతు భారం మోసే విషయంలో భారతీయ పౌరులు ప్రత్యేకించి మధ్యతరగతి ప్రజల అయిష్టత ప్రధాన కారణంగా కనబడుతోంది. ఇది మరీ సాధారణ ప్రకటనలా కనిపించవచ్చు కానీ ఈ వాదనకు తగిన ఆధారాలను చూపించడం పెద్ద కష్టం కాకపోవచ్చు. భారతీయులలో కేవలం మూడు శాతం మంది మాత్రమే ఏదో ఒక రకంగా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారు. వీరిలో కూడా ఎక్కువమంది ఉద్యోగులు. వీరి వేతనాల్లోంచి పన్నులను స్వయంచాలకంగా తీసివేసుకుంటారు. అందుకే మనది దొంగల జాతి అని నేను చాలా తరచుగా భావిస్తుంటాను. మనం మన ప్రభుత్వం నుంచి దొంగిలిస్తున్నాము. అదే సమయంలో మనం అత్యంత దేశభక్తిపరులమని మనకు మనమే జబ్బలు చరుచుకుంటుంటాము. ‘ఏ మేరే ప్యారే వతన్’ అంటూ దేశభక్తి గేయాన్ని లేదా మన జాతీయ గీతాన్ని ఆలపిస్తున్న సందర్భంగా మనం కన్నీళ్లు కారుస్తుంటాము. కాని అవసరమైన సందర్భాల్లో మాత్రం మన దేశభక్తి స్థాయి ఇలా ఉంటోంది మరి. పేదల నుంచి డబ్బును మనం ఇలా దొంగిలిస్తుండటం, కాస్త సహకరిం చమంటూ ప్రభుత్వం మనల్ని ప్రాధేయపడుతుండటం వంటి సందర్భాలను చూస్తున్నప్పుడు మనం చాలా వెలితి మనుషులుగా కనబడతాం. అంతేకాకుండా మన దేశం పరువు కూడా తీసేస్తున్నాం. (వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com) - ఆకార్ పటేల్ -
ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనండి
హన్మకొండ చౌరస్తా : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ తెలుగు ప్రజలు నివసించే ప్రాంతాల్లో ప్రచారాని కి రావాలని జిల్లా నేతలకు ఏఐసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ కొప్పుల రాజు, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సూ చిం చారు. హైదరాబాద్‌లోని గాంధీ భవన్లో టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య అధ్యక్షతన భూ సేకరణ అంశంపై శనివారం సమీక్ష జరిగింది. ఈ సమీక్షకు కొప్పుల రాజు హాజరుకాగా, కాంగ్రెస్ జిల్లా, నగర అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, తాడిశెట్టి విద్యాసాగర్‌తో పాటు సీజే శ్రీని వాస్, డాక్టర్ హరిరమాదేవి, సాంబారి సమ్మారావు, ఘం టా నరేందర్‌రెడ్డి, ఈవీ.శ్రీనివాసరావు, బట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నేతలతో కొప్పుల రాజు మాట్లాడుతూ ఢిల్లీ ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ అభ్యర్థుల విజయానికి సహకరించాలన్నారు. అలాగే ఫిబ్రవరిలో వరంగల్‌లో జరగనున్న ఎస్సీ సెల్ సమ్మేళ నం విజయవంతానికి కృషి చేయాలన్నారు. -
మైకుల మోత.. నేతల రాక!
మెదక్ మున్సిపాలిటీ: మెదక్ పార్లమెంటు ఉప ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో మళ్లీ ప్రచార పర్వం మొదలైంది. ఇటీవల దాదాపు అన్ని ఎన్నికలు ఒకే సారి రావడంతో సందడిగా కనిపించిన పల్లెలు ఎలక్షన్లు ముగియడంతో ప్రశాంతంగా కనిపించాయి. ఉప ఎన్నిక సందర్భంగా మళ్లీ మైకుల మోతలు.. నేతల రాకలు ఊపందుకున్నాయి. నామినేషన్లు, ఉప సంహరణల ప్రక్రియ ముగియడంతో అన్ని పార్టీల నాయకులు గ్రామాల బాట పట్టారు. సభలు, సమావేశాలు, కళా ప్రదర్శనల కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నారు. -
ఓటెత్తని ఉద్యమగడ్డ
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: ఉద్యమాల పురిటిగడ్డ సిద్దిపేటలో ఎన్నికల వేళ జనచైతన్యం కరువైంది. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలంటూ నెలరోజులుగా అధికారులు ఊరూవాడా ప్రచారం చేసినా అనుకున్న లక్ష్యం మాత్రం నెరవేరలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో ఓటెత్తిన ఓటర్లు సార్వత్రిక సమరంలో విజేతను ఎంపిక చేసేందుకు మాత్రం ఉత్సాహం చూపలేదు. దీంతో సిద్దిపేటలో ఓటింగ్ శాతం పడిపోయింది. కేవలం నెలరోజుల్లోనే 12 శాతం పోలింగ్ శాతం తగ్గడం చూస్తుంటే ఓటుహక్కుపై ప్రజలను మరింత చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 1,01,271 మంది మహిళలు, 1,01,071 మంది పురుషులు మొత్తంగా 2,02,359 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,50,141 మంది సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విస్తృతంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు ఓటరు పండుగ పేరుతో జిల్లా యంత్రాంగం ప్రోత్సాహకాలను ప్రకటించినప్పటికి, సార్వత్రిక పోరుకు 52,218 మంది ఓటర్లు దూరంగా ఉన్నారు. మరోవైపు ఓటు హక్కును వినియోగించుకున్నవారిలో మహిళలే అత్యధికంగా ఉన్నారు. పోలింగ్ సరళిని విశ్లేషిస్తే సిద్దిపేట నియోజకవర్గంలో 74.20 శాతం పోలింగ్ నమోదైంది. స్థానిక సంస్థల్లో ఉత్సాహం... గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో 82 శాతం పోలింగ్ శాతం నమోదు కాగా, అప్పట్లో సుమారు 80 శాతం మంది మహిళలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోనే అత్యధికం సిద్దిపేట మండలం పుల్లూర్ గ్రామ మధిర బండచెర్లపల్లి 20 నంబరు పోలింగ్ కేంద్రంలో 96.34 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా సిద్దిపేట పట్టణంలోని మెరిడియన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 141/ఎ పోలింగ్ కేంద్రంలో 41.90 శాతం పోలింగ్ నమోదైంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో సగటున 83 శాతం పోలింగ్ నమోదైంది. సార్వత్రికంలో నిరుత్సాహం.. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో సిద్దిపేట, నంగునూరు, చిన్నకోడూరుతో పాటు అర్బన్ ప్రాంతంలోని 243 కేంద్రాల్లో బుధవారం పోలింగ్ జరిగింది. ఇప్పటికే అధికారులు ఓటు హక్కుపై విస్తృత ప్రచారం నిర్వహించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ ఒక అడుగు ముందుకు వేసి అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు కోసం అనేక ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఓటువేసిన వారికి పెట్రోల్, డిజిల్, నిత్యవసర కొనుగోళ్లలో రాయితీని ప్రకటించారు. అదే విధంగా 95 శాతం పోలింగ్ నమోదైన ప్రాంతానికి రూ. 2 లక్షల నజరానాను ఇస్తామన్నారు. అయితే సిద్దిపేటలో మాత్రం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదనే చెప్పాలి. సిద్దిపేట పట్టణం ఝలక్.. మెరుగైన పోలింగ్ శాతం నమోదుతో భారీ మెజార్టీ వస్తుందనే నేతల అలోచనలకు, అంచనాలకు సిద్దిపేట పట్టణం ఝలక్ ఇచ్చింది. పోలింగ్ ప్రక్రియ రికార్డుల ప్రకారం నియోజకవర్గంలో అత్యల్పంగా సిద్దిపేట పట్టణంలో పోలింగ్ నమోదు కావడం విశేషం. మిగతా మూడు మండలాల్లో 80శాతంపైగా పోలింగ్ నమోదు కాగా, పట్టణంలో అంచనాలకు భిన్నంగా 63.42 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. సిద్దిపేట అర్బన్‌లో ఏర్పాటు చేసిన 91 పోలింగ్ కేంద్రాల్లో 87,451మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉండగా, బుధవారం జరిగిన పోలింగ్‌లో కేవలం 55,463మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 27,899 మంది కాగా, మహిళలు 27, 564 మంది ఉన్నారు. అదే విధంగా సిద్దిపేట మండల పరిధిలో 44,135 మంది ఓటర్లకు గాను 36, 143 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో ఇక్కడ 81.89 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు చిన్నకోడూరు మండలంలో 40,985 ఓట్లకు గాను 34,073 ఓట్లు పోలయ్యాయి. మండలంలో 83.14 శాతం నమోదైంది. నంగునూరు మండల పరిధిలో 29,788 ఓట్లకు గాను 24,462 ఓట్లు పడ గా, పోలింగ్ శాతం 82.12 శాతంగా నమోదైంది. -
బెట్టింగ్
మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ఒకవైపు ఎన్నికలు.. మరోవైపు ఐపీఎల్. రాజకీయ హోరు.. క్రికెట్ జోరు.. వెరసి ప్రచారంతో అభ్యర్థులు ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, బెట్టింగులతో పందెం రాయుళ్లు మజా చేస్తున్నారు. దీంతో రోజూ జిల్లాలో రూ.లక్షలు బెట్టింగుల రూపంలో చేతులు మారుతున్నాయి. ఈ నెల 30వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తుంది? ఎన్ని ఓట్ల తేడాతో ఓడుతారు? డిపాజిట్ దక్కుతుందా? అని పోటీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులపై బెట్టింగులు సాగుతున్నాయి. మరోవైపు ఇటీవలే మొదలైన ఐపీఎల్లో ఏ టీం గెలుస్తుంది? ఏ బాల్‌కు ఎన్ని పరుగులు చేస్తారు? ఎవరి వికెట్ ఎవరు తీస్తారు? రనౌట్, క్యాచ్‌ఔట్, డక్కౌట్, క్లీన్‌బౌల్డ్, స్టంప్ఔట్ ఇలా రకరకాల అంశాలపై బంతి, బంతికి బెట్టింగులు కాస్తూ, ఆటలో మజాను, అందుకు రెట్టింపు డబ్బులు బెట్టింగుల్లో పెడుతూ యువత జేబులు గుల్ల చేసుకుంటోంది. గతంలో ముఖ్య పట్టణాలకే పరిమితమైన బెట్టింగ్‌ల పర్వం ప్రస్తుతం చిన్న చిన్న పట్టణాలకు, మండలాలకు కూడా విస్తరించింది. పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన జిల్లాలోని తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ వంటి ప్రాంతాల్లో సింగరేణి ఉద్యోగులు అధికంగా ఉండడం, ఉద్యోగుల పిల్లలు అధికంగా బెట్టింగుల వైపు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. దీనికి తోడు పశ్చిమ ప్రాంతంలోని ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల్లో కూడా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ఫోన్లలోనే ఈ తంతు ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-7లపై బెట్టింగులు ఫోన్లలోనే పూర్తిగా జరుగుతున్నాయి. గతంలో పోలీసుశాఖ కఠిన చర్యలు తీసుకోవడంతో, ఈ సారి బెట్టింగులను పకడ్బందీగా నిర్వహించేందుకు సెల్ఫోన్లను వినియోగిస్తున్నారు. 20-20 మ్యాచ్‌కు సంబంధించి, ప్రతి మ్యాచ్‌లోనూ టాస్ గెలవడం మొదలుకుని వికెట్లు, రన్స్, ఒక ఓవర్లో కొట్టే ఫోర్లు, సిక్స్‌లతోపాటు చివరి బాల్‌కు చేసే రన్స్‌పై, సూపర్ ఓవర్‌పై ఫోన్ల ద్వారా బెట్టింగులు జరుగుతున్నాయి. బలమైన టీంలు తలపడినప్పుడు 1కి పది రెట్లు అదనంగా చెల్లిస్తున్నారు. ఇందులో రూ. 100కు-రూ.1000, రూ.1000కి-రూ.10వేలు, రూ.10వేలకు-రూ.లక్ష వరకు చెల్లింపులు జరుపుతుండడంతో పలువురు యువకులు తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించేందుకు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఈ ఊబిలో దిగుతున్నారు. బెట్టింగులకు కావాల్సిన డబ్బులు లేక ఒంటిపై ఉన్న బంగారం, బైక్‌లను తాకట్టు పెట్టడం మొదలుకుని వాటిని అమ్ముకునే స్థాయికి చేరుకుంటున్నారు. బెట్టింగుల్లో నష్టపోయిన వారు తెలిసిన చోటల్లా అప్పులు చేస్తూ, వాటిని తీర్చేందుకు నానా తంటాలు పడుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బెట్టింగులను నిర్వహించేందుకు చిరువ్యాపారస్తులను ఉపయోగిస్తూ, బెట్టింగులో పాల్గొనే వారి నుంచి డబ్బు వసూళ్లను వారితోనే చేయిస్తున్నట్లు సమాచారం. ఎన్నికల విధుల్లో పోలీసులు బిజీ బిజీ.. ప్రతి ఏడాది జరిగే ఐపీఎల్లో రోజుకు రూ.లక్షల్లో బెట్టింగులు గుట్టుచప్పుడు కాకుండా నడుస్తుంటాయి. బెట్టింగులను అరికట్టేందుకు పోలీసులు నిఘా పెంచి గట్టిగా కృషి చేస్తుండడంతో గతంలో బెట్టింగులను చాలా వరకు అరికట్టారు. కాని ఈ ఏడాది ఎన్నికల పుణ్యమాని బెట్టింగులు జోరందుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల విధుల్లో పోలీసుశాఖ బిజీగా మారడం బెట్టింగ్ రాయుళ్లలకు కలిసొచ్చింది. దీంతో వారం రోజులుగా బెట్టింగులో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. బెట్టింగులో వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారు పాల్గొంటున్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు పోలీసులు శాయశక్తులా విధులను నిర్వర్తిస్తుంటే, బెట్టింగులను ఎంతమేరకు పెంచుకుంటూ పోవాలనే ఆలోచనతో బెట్టింగు రాయుళ్లు ముందుకు వెళుతున్నారు. యువతను లక్ష్యంగా చేసుకుంటూ బెట్టింగులతో పలువురు లక్షలు సంపాదిస్తుంటే, బెట్టింగులో పాల్గొన్న వారు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. తండ్రులు ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే విషయాల్లో బెట్టింగులో పాల్గొంటుంటే, వారి పిల్లలు ఐపీఎల్లో ఏ టీం గెలుస్తుందనే అంశాలపై బెట్టింగ్ చేస్తున్నారు.