పిడుగు పాటుకు ముగ్గురి మృతి
తెలంగాణలో మంగళవారం సాయంత్రం కురిసిన అకాల వర్షం మరో ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలంలోని అక్కన్నపేటలో పిడుగుపాటు గురై ఓ రైతు మృతి చెందాడు. అక్కన్నపేట గ్రామానికి చెందిన రైతు సమ్మయ్య పొలంలో పనులు చేస్తుండా ఉరుములు..మెరుపులతో కూడిన వర్షం పడింది. పెద్ద శబ్ధంతో పిడుగు పొలంలో ఉన్న రైతుపై పడింది. ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు.
రంగారెడ్డి జిల్లాలో గంధగూడకు చెందిన తలారి చంద్రయ్య తన పొలంలో పని చేస్తుండగా పిడుగుపడి చనిపోయాడు.అలాగే రాజేంద్రనగర్ మండలంలోని భైరాగిగూడలో పాండు అని వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లాలో పిడుగు పాటుకు గురై మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రగాయాల పాలయ్యారు.