cellphone charging
-
సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతూ ఒకరి మృతి
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): శంషాబాద్ మండలం సుల్తాన్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఒడిశాలోని రాయతూర్కు చెందిన బెను కుమార్(28) అనే వ్యక్తి సుల్తాన్‌పల్లి గ్రామ శివారులోని ఓ ఇటుకబట్టీలో పనిచేస్తున్నాడు. అక్కడే తాత్కాలికంగా నివాసం ఏర్పాటు చేసుకుని భార్యాబిడ్డలతో కలిసి ఉంటున్నాడు. ఆదివారం చేతులు కడుకున్న తర్వాత సెల్‌ఫోన్‌కు చార్జింగ్పెట్టబోతుండగా కరెంటు షాక్తగిలింది. ఈ ఘటనలో బెను కుమార్ అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. -
సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా...
కరీంనగర్: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతిచెందింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం ఘనపురం గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. విమల అనే మహిళ ఈ రోజు మధ్యాహ్నం ఇంట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతోంది. అదే క్రమంలో చేతిలోకి ఫోన్ తీసుకుని తరిచి చూస్తుండగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. -
సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ యువకుడి మృతి
చివ్వెంల: సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ.. ప్రమాదవశాత్తు విద్యుధ్ఘాతానికి గురై యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా చివ్వెంల మండలం కోమటికుంట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకన్న(29) ఈ రోజు ఉదయం ఫోన్ చార్జింగ్ పెట్టడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
కెరిమెర(ఆదిలాబాద్ జిల్లా) ఆదిలాబాద్ జిల్లా కెరిమెర మండలం జోడేఘాట్ గ్రామంలో బంధువుల ఇంటికి చుట్టపు చూపుగా వచ్చిన ఓ వ్యక్తి బుధవారం మధ్యాహ్నం కరెంట్ షాక్‌తో మృతిచెందాడు. మహారాష్ట్ర సరిహద్దులోని వాంక్రీ గ్రామానికి చెందిన పుర్తెంగరావు(40) తన మేనమామ ఇంటికి జోడేఘాట్‌కు వచ్చాడు. బుధవారం మధ్యాహ్నం ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టబోయి యువకుడి బలి
మక్తల్: సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టబోయి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మండలంలోని పంచలింగాల్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన చిన్నహన్మంతు, అంజలమ్మ కొడుకు నాగరాజు(28) ఉదయం సెల్‌ఫోన్ చార్జింగ్ పెట్టబోయి విద్యుత్‌షాక్‌కు గురయ్యాడు. ఈ సంఘటనలో సెల్‌చార్జర్ ముక్కలై నాగరాజు కిందపడిపోయాడు. చికిత్సకోసం ఆస్పత్రికి తరలించేలోగా మృతిచెందాడు. మృతుడు నాగరాజుకు మూడేళ్ల క్రితం వివాహం కాగా, భార్య, కూతురు ఉంది. కేసుదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మురళీగౌడ్ తెలిపారు. -
సెల్‌ఫోన్ చార్జింగ్‌పెడుతూ.. వ్యక్తి మృతి
వరంగల్ (కురివి): సెల్‌ఫోన్ చార్జింగ్‌పెడుతూ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కురివి మండలం సూదరపల్లి గ్రామ పరిధిలోని బోడబూకయతండాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. తండాకు చెందిన బూక్యారాందాస్ (30) ఉదయం సెల్‌ఫోన్ కు చార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్కూటై షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
సెల్ఫొన్ కు ఛార్జింగ్ పెడుతూ వ్యక్తి మృతి
మహబూబ్‌నగర్ : సెల్ఫొన్ కు ఛార్జింగ్ పెడుతూ విద్యుత్ షాక్ కు గురై ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లిలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. పోతిరెడ్డిపల్లికి చెందిన బంగారయ్య అనే వ్యక్తి సెల్ఫొన్ కు ఛార్జింగ్ పెట్టడానికి ప్రయత్నించగా ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దాంతో బంగారయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. -
ప్రాణం తీసిన సెల్ చార్జింగ్
- విద్యుదాఘాతంతో వ్యవసాయ కూలీ మృతి - పరిగి మండలం చిట్యాల్‌లో విషాదం పరిగి: సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా విద్యుదాఘాతమవడంతో ఓ వ్యవసాయ కూలీ మృతిచెందాడు. ఈ సంఘటన పరిగి మండల పరిధిలోని చిట్యాల్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రావులగల్ల చంద్రయ్య(35) తనకున్న అరెకరం పొలంలో వ్యవసాయం చేస్తూ మిగతా సమయంలో భార్య మంజులతో కలిసి స్థానికంగా కూలిపనులు చేస్తున్నాడు. శుక్రవారం ఉదయం ఎప్పటిలాగే పొలం పనులకు వెళ్లిన చంద్రయ్య మధ్యాహ్నం తర్వాత ఇంటికి వచ్చాడు. తన సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టే యత్నం చేశాడు. ఈక్రమంలో విద్యుదాఘాతమవడంతో చంద్రయ్య తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పరిగి ఆస్పత్రికి తరలించారు. అక్కడ మృతుడి కుటుంబీకులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అంత్యక్రియల కోసం రూ. 5 వేల ఆర్థిక సాయం అందజేశారు. చంద్రయ్య కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మృతుడికి భార్య మంజుల, ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కరెంటోళ్ల నిర్లక్ష్యం వల్లే... విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో చంద్రయ్య మృతిచెందాడని చిట్యాల్ గ్రామస్తులు ఆరోపించారు. గ్రామంలో ట్రాన్స్ఫార్మర్ నుంచి సరిగా ఎర్తింగ్ లేకపోవడంతో ఎస్సీ కాలనీలో కొంతకాలంగా ఇళ్లలో సామగ్రికి, గోడలకు షాక్ వస్తుందని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కూడా ఇళ్లకు షాక్ రావడంతో ట్రాన్స్‌కో ఏఈకి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని సర్పంచ్ విజయలక్ష్మిశ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సకాలంలో స్పందిస్తే ఓ నిండు ప్రాణం గాలిలో కలిసిపోయేది కాదని ఆమె చెప్పారు. చంద్రయ్య మృతికి ట్రాన్స్‌కో అధికారులు బాధ్యత వహిస్తూ మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలని సర్పంచ్ డిమాండ్ చేశారు. -
విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి
రంగారెడ్డి: జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా రవి అనే యువకుడు విద్యుత్‌షాక్‌తో మృతిచెందాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలం హుస్సేన్‌పూర్‌లో శనివారం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా షార్ట్ సర్క్యూట్ జరగడంతో ఇళ్లలో టీవీలు, ఫ్యాన్లు కాలిపోయినట్టు స్థానికులు తెలిపారు.